Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Erra Mallelu (1981)


చిత్రం: ఎర్ర మల్లెలు (1981)
సంగీతం: కె. చక్రవర్తి
నటీనటులు: మురళీమోహన్, మాదాల రంగారావు,  గిరిబాబు, చలపతి రావు, సాయి చంద్, 
దర్శకత్వం: ధవళ సత్యం
నిర్మాత: మాదాల కోదండ రామయ్య
విడుదల తేది: 14.04.1981Songs List:అన్యాయం అక్రమాలు పాట సాహిత్యం

 
చిత్రం: ఎర్ర మల్లెలు (1981)
సంగీతం: కె. చక్రవర్తి
సాహిత్యం: అదృష్ట దీపక్
గానం: యస్.పి. బాలు

అన్యాయం అక్రమాలు - దోపిడీలు దురంతాలు
ఎన్నాళ్లని ఎన్నేళ్లని నిలదీసినదీ రోజు
అణగారిన శ్రమశక్తిని ఆవేశం ఊపిరిగా
కదిలించినదీ రోజూ రగిలించినదీ రోజు
మేడే ...........మేడే - నేడే - మేడే ॥ మేడే॥

సమభావం మానవాళి గుండెలలో నిండగా
సకలదేశ కార్మికులకు ఈనాడే పండగా
లోకానికి శ్రమ విలువను చాటిన రోజు
ఇది చీకటిలో చిరుదివ్వెలు వెలిగిన రోజు
మేడే.......... ... మేడే - నేడే - మేడే ॥ మేడే||

వేదనలూ - రోదనలూ - అంతరింప జెయ్యాలని
బాధల కేదారంలో శోధన మొలకెత్తిందీ
చిరకాలపు దోపిడిపై తిరుగుబాటు జరిగినపుడు
చిందిన వెచ్చని నెత్తురు కేతనమై నిలిచిందీ
మేడే .... ......... మేడే - నేడే - మేడే ॥ మేడే ॥

భావనలో నవచేతన - పదునెక్కిన ఆలోచన
రేపటి ఉదయం కోసం రెప్పలు విప్పాయి
బిగిసిన ఈ పిడికిళ్లు - ఎగసిన ఆ కొడవళ్లు
శ్రామిక జన సారధిగా క్రమించమని అడిగాయి
మేడే ......... .... మేడే - నేడే - మేడే ॥ మేడే॥

ఎన్నెన్నో దారులలో - చీలిన మన ఉద్యమాలు
ఎన్నెన్నో తీరులలో చెమటోడ్చే శ్రమ జీవులు
ఐక్యంగా నిలవాలి - కదనానికి కదలాలి
సామ్యవాద సాధనకై సమరం సాగించాలి
మేడే ... .... .... మేడే - నేడే - మేడే ॥ మేడే॥బంగారూ మా తల్లీ పాట సాహిత్యం

 
చిత్రం: ఎర్ర మల్లెలు (1981)
సంగీతం: కె. చక్రవర్తి
సాహిత్యం: ధవళ సత్యం
గానం: యస్.పి. బాలు, యస్.పి. శైలజ, జి. ఆనంద్

బంగారూ మా తల్లీ - బూవీ మా లచ్చిమి
బాగ్గాలూ పండాలా-బూవీ మా లచ్చిమి || బంగారూ||

దేవుడి సొరగం మాకొద్దూ
దేవుడి సొరగం మాకొద్దూ.….నీ నవ్వుల పంటలుమా కివ్వు
రాయీ రప్పా పిండిగ సేసి మెరకా పల్లం సదునుగ సేసి
మా రకతాన్నే నీరుగపోసి—మా పానాల్నే నాటుగ సేసి
వళ్లొంచి వొంగావమ్మ
వళ్లొంచి వొంగామమ్మా _ నీవడిలోన వొదిగామమ్మా
ఒకే పేగునా పుట్టినవాళ్లం- ఒకేమాటగా బతికేవాళ్లం
అన్నకు నేనూ అండగవుంటా-తమ్ముడికీ నేతోడుగవుంటా
కట్టాన్నే నమ్మామమ్మా
కట్టాన్నే నమ్మామమ్మా మాకళ్లకు నీళ్లురానీటోకమ్మా ||బంగారూ॥

కట్టపడేటి రైతుల సూసీ-నేలతల్లికి కన్నుల పండగ
కలతలులేని కొడుకుల సూసీ కన్న తల్లికీ రోజూ పండగా
ఇట్టాగే మము సూడమ్మా
ఇది మించీ కోరము నిన్నమ్మా
దేవుడి సొరగం మా కొదూ 
దేవుడి సొరగం మా కొద్దూ- నీనవ్వుల పంటలు మాకివ్వు ||బంగారూ॥

నడిమికి నిన్ను సీలిక సేసీ-కన్నతల్లి కడుపును కోసి
తన్నులాడినా బిడ్డలతల్లినీ…నన్ను సూసీ నవ్వకమ్మా
ఎన్నటికైనా మేమందరము కలిసుండేలా దీవించమ్మా
బంగారూ మాతల్లీ  భూమి .... మా లచ్చిమీ..
ఓ వసంత భామినీ పాట సాహిత్యం

 
చిత్రం: ఎర్ర మల్లెలు (1981)
సంగీతం: కె. చక్రవర్తి
సాహిత్యం: ధవళ సత్యం
గానం: యస్.పి. బాలు, యస్.పి. శైలజ

ఆ.....ఆ.....
ఓ వసంత భామినీ ....
ఒహో మరాళ గామినీ... నీ వేనా....
నీలి నిశాజీవిత – సౌదామినీ....
గమ మపగారి - దపనుపగారి సరి సరి గమప
పమ రిమపా - గమ మపసా సరిదనిపా

ఆ.....
ధకదిగి గదధా కతధా ధకదిగికతధా కతధా
ధా ధా ధా ధా ధిరికిట ధా
ధా ధా ధా ధా తరకిట ధా
ధా  ధా  తిరికిటధా - ధా  ధా తిరికిట ధా

తిరికిట ధా - తిరికిట ధా - తిరికిట ధా 
తిరికిట ధా - తిరికిట ధా - తిరికిట ధా

ప్రతి పదాస రస వీణలు పలికించే మధు బాలా
ఆ.....ఆ.....ఆ.....ఆ.....

ఆ.... ప్రతి పదాన రస వీణలు పలికించే
మధుబాలా
ప్రతి దృగంచాలాల వలపు ప్రసరించే జవరాల
ఆ ....ఆ ....ఆ ....
జవరాలా -
ఆ ....
మప మప మప మప - సరి సరి సరి సరి
రిమ రిమ రిమ రిమ దస దస దప దస -
పద పద సరి సరి
మప మప మపద మపద మపమరి -
దసరి దప సద - మపద పరిమప
పూల చేల మొకపారిగ - కేలనంటెదను రావే....
ఆ....ఆ ....ఆ ....ఆ ....
ఆ....పూల చేల మొకపారిగ -కేలనంటెదను రావే....
నీలి కనులలోని - రహస్యాలు చూపెదను రావే
ఆ....ఆ ....ఆ ....
జవరాలా......

నాంపల్లి టెషనుకాడి పాట సాహిత్యం

 
చిత్రం: ఎర్ర మల్లెలు (1981)
సంగీతం: కె. చక్రవర్తి
సాహిత్యం: ప్రభు
గానం: యస్.పి. శైలజ

నాంపల్లి టెషనుకాడి రాజాలింగో రాజాలింగ
రామారాజ్యం తీరును సూడు శివా శంభులింగ
లింగా రామారాజ్యం తీరును సూడు శివా శంభులింగ

నాంపల్లి టెషనుకాడి రాజాలింగో రాజాలింగ
రామారాజ్యం తీరును సూడు శివా శంభులింగ
లింగా రామారాజ్యం తీరును సూడు శివా శంభులింగ

తిందామంటే తిండీ లేదు ఉందామంటే ఇల్లే లేదు
తిందామంటే తిండీ లేదు ఉందామంటే ఇల్లే లేదు
చేదామంటే కొలువూ లేదు పోదామంటే నెలవు లేదు

నాంపల్లి టెషనుకాడి రాజాలింగో  రాజాలింగ
రామారాజ్యం తీరును సూడు శివా శంభులింగ
ఓ లింగా రామారాజ్యం తీరును సూడు శంభులింగ

గుక్కెడు గంజి కరువైపాయె బక్కడి ప్రాణం బరువైపాయె
గుక్కెడు గంజి కరువైపాయె బక్కడి ప్రాణం బరువైపాయె
బీదాబిక్కి పొట్టలుకొట్టి మేడలుకట్టే సీకటి శెట్టి 

నాంపల్లి టెషనుకాడి రాజాలింగో రాజాలింగ
రామారాజ్యం తీరును సూడు శివా శంభులింగ
లింగా రామారాజ్యం తీరును సూడు శివా శంభులింగ

లేని అమ్మది అతుకుల బతుకు
ఉన్న బొమ్మకి అందం ఎరువు
కారల్లోన తిరిగే తల్లికి కట్టే బట్ట బరువైపాయె

నాంపల్లి టెషనుకాడి రాజాలింగో రాజాలింగ
రామారాజ్యం తీరును సూడు శివా శంభులింగ
ఓయ్ లింగా రామారాజ్యం తీరును సూడు శివా శంభులింగ

ముందు ఒప్పులు వెనక తప్పులు వున్నవాడికే అన్ని చెల్లును
ముందు ఒప్పులు వెనక తప్పులు వున్నవాడికే అన్ని చెల్లును
ఉలకావేమి పలకావేమి బండారాయిగ మారిన బావి

నాంపల్లి టెషనుకాడి రాజాలింగో రాజాలింగ
రామారాజ్యం తీరును సూడు శివా శంభులింగ
ఓ లగ జిగ్ పాట సాహిత్యం

 
చిత్రం: ఎర్ర మల్లెలు (1981)
సంగీతం: కె. చక్రవర్తి
సాహిత్యం: ధవళ సత్యం
గానం: యస్.పి. బాలు

ఓ లగ జిగ్

నాటకం సాహిత్యం

 
చిత్రం: ఎర్ర మల్లెలు (1981)
సంగీతం: కె. చక్రవర్తి
సాహిత్యం: కొండవీటి వెంకటకవి
గానం: యస్.పి. బాలు, ఆనంద్, రమేష్, శైలజ, చక్రవర్తి

వ్యాఖ్యాత : 
ఈ సువిశాల భారత దేశంలో ఒక చిన్న పల్లెటూరు - ఆ పల్లె టూర్లో బంజరు భూమిలో బంగారం మట్టిలోపలా మాణిక్యం పండించే రైతులూ దండిగ వున్నారు - మహదండిగ వున్నారు

కడుపుకు తిండి – కంటికి నిద్ర - ఒంటికి సుఖమూ
ఏనాడెరుగని కష్టపడేటీ కూలీ - సోదరులున్నారూ ఆహా సోదరులున్నారు

వ్యాఖ్యాత : 
కష్టపడే వాళ్ళే కాక, వాళ్ళను కాపు కాసే
మహనుభావులు కూడా వున్నారు. వాళ్ళెవరయ్యా అంటే

మునసబు : 
నేనే మునసబునీ - మూడూళ్ళకు మునసబునీ
తప్పుడు కేసులు పెడతాను.. మీ తాటలు వొలిపిస్తాను
పన్నుమీద పన్నేయిస్తా - ఉన్నది జప్తు చేయిస్తా
నా మాట కెదురులేదు - నా కర్ర కెదురు లేదు
సాగిపోయెరా హళాహళీ సాగుతుందిరా భళాభళీ
హే సాగిపోయెరా హళాహళీ సాగుతుందిరా -
భళా భళీ

వ్యాఖ్యాత: 
ఆయనకు తోడుగా 

కరణం : 
కలం పోటుగాణ్ణి – ఈ వూరికి కరణాన్నీ
రూపాయిస్తే తల వూపేస్తా… రెండే యిస్తే మొండి సంతకం
వరహా యిస్తే కరుకు సంతకం ఆపై నిస్తే అన్నీ చూప్తా
అడంగులెత్తితే హడలిపోతరూ- చిట్టా తిప్పితే చితికిపోతరూ
ముఫర్జు లెత్తితే మునిగిపోతరు గొలుసు లాగితే తాడే తెగుతాదీ
అహ – కలం పోటుగాణ్ణి
ఆమ్యా - మ్యా - హ్యూ - మ్యహం

పెదకాపు: 
ఏయ్ తళాంగు తధిగిణ - తళాంగ తధిగిణ
తధిగిణ - తధిగిణ - తధిగిణతోం
పెత్తందారుకు పెత్తందారును పెదకావును నేను
రాజులకాలం పోయిందీ — తరాజుల కాలం వచ్చిందీ
స్వరాజ్యమన్నది మాకే సొంతం ఏలుతూ వుంటాం
గ్రామాలన్నీ కాదన్నారా
తళాంగు తకధిమి తిరకటతోం
తిరకటతోం - తిరకటతోం తోం 
చాకలి - మంగలి - కుమ్మరి - కమ్మరి - మాలా- మాదిగ
బీదా — బిక్కీ రైతూ కూలీలంతా మా కాళ్లకు మొక్కాలీ
కాదన్నారా - లేదన్నారా 
తళాంగు తధిగిణతోం - తళాంగు తధిగిణతోం
తళాంగు తధిగిణతోం తళాంగు తధిగిణతోం

పెదకాపు : కరణం – ఈ వూళ్లో గట్టు పడని చేనేదైనా వుందా?
కరణం : లేకే మండీ - రామ లక్ష్మణులని ఇద్దరు సోదరులున్నారు.
పెదకాపు : అయితే, ఇంకా నీ సూపు వాళ్ళ 
మీద పడలేదన్నమాట
కరణం : ఆ... .... లేదు లేదు లిటికేషను పెడతా
జాయింటు పట్టా పాయింటు లేదూ విడగొడతా-చెడగొదతా- నా తడాఖచూపిస్తా ॥కలంపోటు॥

ముగ్గురూ : దేవతలమ్మేమూ గ్రామ దేవతలమ్మేము
గంగానమ్మ గజగజలాడు పోలేరమ్మే పునికిసతాడు
మా పేరు చెప్పితే_మాలచ్చమ్మే మంటలు దూకు
॥దేవతలం॥

వ్యాఖ్యాత : 
ఈ త్రిమూర్తుల్లో ఒకడైన మునసబుకి ఓ ముద్దుల కొడుకున్నాడు.
చంటిబాబు : చవటాయను నేను వట్టి చవటాయను నేను మయ్య కొట్టినా - మరెవరు తిట్టినా
నోటిలో వేలేసుకు తిరిగే చపటాయను నేను
వట్టి చవటాయను నేను-ట్వయ్-ట్వయ్.ట్వయ్..

వచనం :
పెదకాపు : ఏవయ్యా మన వాడికి వయసాచ్చేసినట్టుంది. పెళ్లి చేసెయ్య కూడదూ?
కరణం : మన రామయ్య కూతుర్ని చేసేస్తే సరి
మల్లెపువ్వు లాంటి పిల్లా మాంచి కట్నమూనూ
మునసబు : సరే చేసేద్దాం? -
కరణం : శుభస్య శీఘ్రం
వ్యాఖ్యాత: కానీ అ మొదటి రాత్రే - కన్నె కలలూ కరిగిపోయె-కన్న కలలూ కల్లలాయె నిండుగా నూరేళ్ల బ్రతుకూ అడవి గాచిన వెన్నెలాయే.
మామ : కామదాహం కళ్ళుగప్పి-కోడలైనా తప్పులేదని
వావి వరసలు మరచిపోయీ_కౌగిలింతల కరగమన్నాడు.
కౌగిలింతల కరగమన్నాడు.
కోడలు: తగదూ తగదూ -- తగదు తగదని తల్లడిల్లీ - గోడు గోడును కంట నీరిడీ - కనికరించి వదలమన్నాదీ…మావా కాళ్ళపై బడీ వేడుకున్నాదీ కాళ్ళపైబడి వేడుకున్నాదీ.
మామ : పటపటామని పళ్ళు కొరికీ చెండ్ర నిప్పులు
చెరిగే కళ్ళతో
హుంకరించి_ఘీంకరించి… పైటలాగీ ఒడిసిపట్టీ
కన్నె బతుకును చెరచబోయాడు
కన్నె బతుకును చెరచబోయాడు
కోడలు : కమిలి కుమిలీ గుండె పగిలీ -
దిక్కులేకా మొక్కులేకా పులికి చిక్కిన లేడిలాగా
హోరుహోరున పరుగులెత్తిందీ-
నూతిలో పడి నీట గలిసిందీ... మన.. జాతి పరువే మంటగలిపిందీ..

[ఈ వీధి భాగవతం చూస్తున్న ప్రేక్షక జనంలోంచి]

అసలు పెదకాపు : ఆపండెహె ఎదవ బాగోతం మీరూ
రేయ్ ఇంకా కూకున్నారేరా లెగండెహె-
పాలేరు ఎంకడు: అ గంఢీ.అప్పుడే యాడైపోయిందీ --
ఎవడి భాగోతం ఏందో ఇంకా సూడండి-
కూసోండి - కూసోండి. స్టేజీ పై కి వచ్చి

ఎంకడు: నడుమెత్తనీకుండా నడిజాముదాకాను
నడ్డిరగబొడిసేటి..అసామినే నమ్ము
పెదకాపు పాలేరునూ నేనూ పెదకాపు పాలేరును
నేనూ పెదకాపు పాలేరునూ
ఆరుగాలం గొడ్డుసాకిరీ సేసినా ఏవుందినాకూ
వూరిలో నాకెవరు లేరండీ నాకున్నదంతా లచ్చిమేనండి

[జనంలో కెవ్వున “కేక” - ఆ ఎంకడి పెళ్ళాం మాలచ్చి
వస్తుంది. స్టేజీ ఎక్కేసింది.]

మాలచ్చి : మావమీద ఆశతప్ప ఏవీ ఎరగని సిన్నదాన్ని
సావు బతుకుల్లో - తోడు నీడగా మావతోనే మసులుకుంటా
ముసురోళ్ళ మాలచ్చినీ నేను మా మావ మాలచ్చిని
ఇదరూ : సేయి సేయి కలిసి మెలిసి సెంప సెంఫ సేరదీసి
ఒకరికొకరం వొదిగిపోయామూ మేమూ పెళ్లి గడియకు సేరుకున్నాము
ఎంకడు : ఇయ్యాల్టికి నన్నొదిలెయ్యండి బాబుగారూ
పెదకాపు : పెళ్ళయినంత మాత్రాన కళ్ళంలో కాపలా వదిలేత్తావంటా - గింజలెవరు సూత్తారు ?
ఎంకడు : ఇయ్యాల మొదట రోజండీ 
పెదకాపు : ఏడిశావ్ – ఏం జెప్పక - ఎల్లి కాపలాగాయ్

వ్యాఖ్యాత : కాపలా కాస్తున్న ఎంకడికి ఎటు చూసినా
మాలచ్చే - కనపడుతుంది -
చందురూడా చందురూడా
గుండెల్లో ఏటేటో గుబులుగా వున్నాది --
ఎన్నెల్లూ ఎచ్చగా మండిపోతున్నాదీ
మాలచ్చీ తానొత్తే ఎంత బాగుంటాది
ఎదురెల్లి వాటేసి తెచ్చుకుంటాను.
పొదరిల్లూ గడి వేసి సుట్టుకుంటాను
వులుకు నడకల తోటీ కదిలి వచ్చిందీ -
లచ్చీ కదలి వచ్చింది
వులుకుపలుకూ లేకా ఓర సూసిందీ - లచ్చీ ఓర సూసుంది.
మా లచ్చీ లేకుండా ఎందుకీ జలమా ఇంకెందుకీ జలమా
॥చందురూడా॥

వ్యాఖ్యాత :
కాని - ఎంకడి కోసం ఎదురు చూస్తున్న అచ్బీమిని
కరణం, మునసబు, పెదకాపు రాక్షసుల్లా చెరబట్టారు
రాతి గెండెల రక్కసోళ్లు చుట్టు ముట్టారూ --
రాబందుల మూకలాగా పోడిచి తిన్నారూ -
కామచిలక కలల గూడు కొల్ల గొట్టారూ.
ఎన్నిసార్లో పిచ్చితల్లీ పెనుగులాడిందీ
వన్నె తొలగీ మాలచ్చిమి గొల్లుమన్నాదీ
కన్నెపరువం కంట నీరై కరిగిపోయిందీ -
గిల గిల లాడే లచ్చిని చూసి ఎంకడు నిప్పులు చెరిగాడు
సల సల కాగే నెత్తురు పొంగిన వొళ్ళే మంటలు గక్కింది
ఉరుములాగ గర్జించాడూ - పిడుగులాగ పైబడ్డాడు...
ఏయ్_ఉరుములాగ గర్జించాడు. పిడుగులాగ పై బడ్డాడు
ముగ్గురు కలిసి ఎంకడినీ ముడుసు విరగదన్నీ-
కళ్ళంగింజలు కాజేసాడని కల్లబొల్లులే అల్లారూ....
వూళ్లోవాళ్లు కళ్ళప్పగించి వేడుగ చూశారు.
కాల్చిన కొడవలి పట్టుకోమనీ- గంగమ్మగుడికే జేర్చారు.--
స్టేజీమీద ఉన్న అందరూ — లేవందీ - లేవండీ- అన్నలూ లేవండి
కదలండి - కదలండి అమ్మలూ కదలండీ
మోసాలు దోపిడీలు సాగించిన పెద్దోళ్ళు-
అన్నాయం అక్రమాలు సేసినా నాయాళ్ళు
ఆచారం పేరుచెప్పి నేరాలు చేసినోళ్ళు
గంగమ్మ బొమ్మ సూపి మన బతుకులు మాడ్చినోళ్లు
దగాకోరులున్నారు దగుల్బాజీలున్నారు -
లేవండీ మన మద్దెనెవున్నారు. వోళ్లుతెరుత్తున్నారు.. ఏయ్ || లేవండీ ||

ఇన్నాళ్లూ మూసుకున్న మననోళ్ళు తెరవండి -
ఇన్నాళ్లు చెప్పలేని మన న్యాయం సెప్పండి
లేవండి - కదలండీ - దొంగల్ని పట్టండి
సాగదు అన్నాయం- ఇక సాగదని పాటండీ
నాయం నిలబెట్టండీ — లేవండీ కదలండీ - ఏయ్ || లేవండీ॥

No comments

Most Recent

Default