Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box




చిత్రం: రాజావిక్రమార్క (2021)
సంగీతం: ప్రశాంత్ ఆర్.విహారి
నటీనటులు: కార్తికేయ , తాన్య రవిచంద్రన్
దర్శకత్వం: శ్రీ సరిపెల్లి 
నిర్మాత: రామ రెడ్డి 
విడుదల తేది: 2021



Songs List:



రాజాగారు బయటికొస్తే పాట సాహిత్యం

 
చిత్రం: రాజావిక్రమార్క (2021)
సంగీతం: ప్రశాంత్ ఆర్.విహారి
సాహిత్యం: కృష్ణ కాంత్ 
గానం: డేవిడ్ సైమన్

రాజాగారు బయటికొస్తే ప్రమాదమే
ప్రయాసతో పరారు అంతే
రాజాగారు వేటకొస్తే భుజాలపై
షికారులే ఖరారు అంతే

అదిరెలే ఇంచైనా తగ్గదింకా ఠీవి నీదే
అదిరెలే కంగారు మచ్చుకైనా లేనే లేదే
అదిరేలే పొంచున్న గూఢచారి ఆనవాలే
ఏ అలుపు దిగులు పడనే పడని నరుడు వీడే
మెరుపులా మలుపులా దారే పట్టాడే

రాజాగారు బయటికొస్తే ప్రమాదమే
ప్రయాసతో పరారు అంతే
రాజాగారు వేటకొస్తే భుజాలపై
షికారులే ఖరారు అంతే

బుల్లెటైనా అదిరి జరిగి జరిగి పోదా
మృత్యువైన బెదిరి హడలి హడలి పోదా
శత్రువైతే తనని వదలదసలు బ్యాంగ్ బ్యాంగ్
వదలదసలు బ్యాంగ్ బ్యాంగ్… వదలదసలు బ్యాంగ్ బ్యాంగ్

వేటాడే కన్నుల్లో ఎన్నెన్నో తంత్రాలో
బేతాళున్నే వీడు ప్రశ్నిస్తాడు
రాబోయే విధ్వంసం ఏ కంటా చూస్తాడో
ఈలోపే పన్నాగం పన్నేస్తాడే
మెరుపులా మలుపులా దారే పట్టాడే



సమ్మతమే పాట సాహిత్యం

 
చిత్రం: రాజావిక్రమార్క (2021)
సంగీతం: ప్రశాంత్ ఆర్.విహారి
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి 
గానం: కార్తీక్, షాష తిరుపతి , చైత్ర అంబడిపూడి

ఈ తొలిప్రేమానందం వర్ణించలేనులే
నా జతలో నీ అందం
వందేళ్ళపాటు వెండి వెన్నెలే

నా హార్టు బీటులో ధ్వని
ఇవ్వాలిలాగ ఉందని
మొజార్ట్ చేతి వేళ్ళు కూడా
చూపించనే లేవులే
ఈ క్షణాన నాలో కాంతిని
ఏ మీటరయినా ఇంతని
లెక్కించి చెప్పలేను అసలే

సమ్మతమే (చెలియా యు ఆర్ మై లవ్)
సంబరమే (చెలియా యు ఆర్ మై లవ్)
సమ్మతమే (చెలియా యు ఆర్ మై లవ్)

ఓ వరమై వరమై నన్ను కలిసావే
సమ్మతమే, సంబరమే… సమ్మతమే
ఓ వరమై వరమై నన్ను కలిసావే నీవే
చెలియా యు ఆర్ మై లవ్

నా చిరునవ్వులేవి తారాజువ్వలై
రివ్వంటున్నవి కన్నా ఆ ఆ
నా సిరిమువ్వలేవి గాల్లో గువ్వలై
ఆడే సవ్వడి వింటున్నా
చెలియా యు ఆర్ మై లవ్

తీరని స్వప్నాలు… తీర్చిన వెలుగు నువ్వు
మెరిసెనురా కన్నూ
ఆమని రంగులను మనసున నింపావు
వదలకురా నన్నూ
చెలియా యు ఆర్ మై లవ్
చెలియా యు ఆర్ మై లవ్

ఓఓఓఓ ఓఓఓఓ
పరిచయం జరిగెనో లేదో
మరుక్షణం ప్రేమలో తేలేనే ప్రాణం
కనీవినీ ఎరుగని పరవశం నన్ను కమ్మగా
కమ్మెనే ఈ తరుణం

ముందే ముందే నువ్వున్నావా నాలో
ఏమో ఉన్నావేమో ఊపిరిలో
నేడే నిన్ను చూస్తున్నానా నాలో
కలనయా వాస్తవంలో

సమ్మతమే, సంబరమే… సమ్మతమే
ఓ వరమై వరమై నన్ను కలిసావే నీవే
చెలియా యు ఆర్ మై లవ్




రామా కనవేమి రా పాట సాహిత్యం

 
చిత్రం: రాజావిక్రమార్క (2021)
సంగీతం: ప్రశాంత్ ఆర్.విహారి
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి 
గానం: కార్తీక్, షాష తిరుపతి , చైత్ర అంబడిపూడి

రామా కనవేమిరా 



కాలం కధలై పాట సాహిత్యం

 
చిత్రం: రాజావిక్రమార్క (2021)
సంగీతం: ప్రశాంత్ ఆర్.విహారి
సాహిత్యం: సనరె 
గానం: యాజిన్ నిజార్, రితేష్ జి. రావు 

కాలం కదలై 


No comments

Most Recent

Default