Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Athagaru Kotha Kodalu (1968)




చిత్రం: అత్తగారు కొత్త కోడలు  (1968)
సంగీతం: జి.కె.వెంకటేష్ 
సాహిత్యం: ఆత్రేయ, ఆరుద్ర, కొసరాజు, దాశరధి,  మల్లాది రామకృష్ణ శాస్త్రి 
గానం: ఘంటసాల, సుశీల, యస్.జానకి, పి.బి. శ్రీనివాస్, ఎ.యం.రాజా, ఎల్.ఆర్.ఈశ్వరి
నటీనటులు: కృష్ణ, విజయ నిర్మల, హరినాథ్, జయంతి
కథ, కధనం, మాటలు: ఆచార్య ఆత్రేయ 
దర్శకత్వం: ఎ.సంజీవి
నిర్మాత: బాబూరావు
విడుదల తేది: 14.06.1968



Songs List:



దేవా...లోకములోని పాట సాహిత్యం

 
చిత్రం: అత్తగారు కొత్త కోడలు  (1968)
సంగీతం: జి.కె.వెంకటేష్ 
సాహిత్యం: దాశరధి
గానం: పి.బి. శ్రీనివాస్

దేవా... దేవా...దేవా....
లోకములోని చీకటులన్నీ
తొలగించే వెలుగువు నీవే....

నీ కనుసైగల ఈ భూగోళం
గిర గిర తిరిగేను
నీ దయతోనే ఈ జగమంతా
కళ కళ లాడేనే - కిలకిల నవ్వేను....

వెన్నెలనైనా చీకటినైనా
నిన్నే తలిచేము - నిన్నే కొలిచేము
మానవులందరి నేక రీతిగా
మన్నింతువు స్వామి

ఈ జగమే నీ సంసారమురా 
ప్రాణికోటి నీ పాపలురా 
చల్లని చూపుల కాపాడుమురా
శాంతి, సుఖమూ ప్రసాదించరా




నువ్వు లేనిదే పాట సాహిత్యం

 
చిత్రం: అత్తగారు కొత్త కోడలు  (1968)
సంగీతం: జి.కె.వెంకటేష్ 
సాహిత్యం: ఆరుద్ర 
గానం: పి.బి. శ్రీనివాస్, యస్.జానకి

నువ్వు లేనిదే పువ్వు పువ్వుకాదు 
నేను లేనిదే నువ్వు నువ్వు కాదు
నువ్వు లేనిదే నవ్వు నవ్వుకాదు
నువ్వు లేనిదే నిండు వలపు లేదు

నువ్వుంటేనే మల్లెలు పరిమళం 
లేకుంటే అవి కావు కోమలం 
నువ్వుంటేనే వెన్నెల చల్లదనం
లేకుంటే తాళని వెచ్చదనం 

వెలుగుంటేసే నీడల జాడలు 
వెల్లు వలోనే నీటికి వేగం
మనసుంటేనే మమతల విరులు
మమతల వలనే జగతిని మధురం

నువ్వుంటేనే ఈ భువి నందనం 
లేకుండే దారి లేని కాననం
నువ్వుంటేనే ఆశకు ప్రాణం 
లేకుంటే ఏది లేదు...




చిటుకు మన్నది చిటెకమ్మా పాట సాహిత్యం

 
చిత్రం: అత్తగారు కొత్త కోడలు (1968)
సంగీతం: జి.కె.వెంకటేష్ 
సాహిత్యం: ఆత్రేయ 
గానం: పి.సుశీల 

చిటుకు మన్నది చిటెకమ్మా
కిర్రుమన్నది తలుపమ్మా
ఉలికి పడినా ఉసురుమన్నా 
మీవారేమీ కాదమ్మా శ్రీవారసలే కాదమ్మా 

పిల్లగాలే తగలగానే తుళ్ళి పడతావెందుకు 
ఆకు గల గల లాడగానే అధిరిపోతావెందుకు 
కళ్ళనే వాకిళ్ళు చేసి కలవరిస్తావెందుకు

దొరగారక్కడ పల్లెటూరిలో దోరవయసీ వంటరి గదిలో  
మల్లెపువ్వులు ముల్లైనాయి మరులు హారతి సెగలైనాయి
ఈ విరహ తాపం తీరని శాపం ఎంతకాలం అయ్యో పాపం 

ఇదిగో వస్తామంటారు అదే పోతగా పోతారు 
మగల్లనిలా నమ్మడమెందుకు పగలు రేయి దిగుల్లెందుకు 
కొంగునకట్టుకు ఉండాలి లేదా వెంటపడే వెళ్ళాలి 





పెళ్లి చేసుకుంటా పాట సాహిత్యం

 
చిత్రం: అత్తగారు కొత్త కోడలు  (1968)
సంగీతం: జి.కె.వెంకటేష్ 
సాహిత్యం: కొసరాజు 
గానం: ఘంటసాల 

పెళ్లి చేసుకుంటా విన్నే పెళ్లి చేసుకుంటా
నే పెళ్ళి చేసుకునే పిల్ల ఎలా వుండాలో తెలుసా ?
మింటినుండి దిగివచ్చిన మెఱుపులాగ వుండాలి 
జిగి జిగి మని  సీతాకోక చిలుకలాగ వుండాలి
అలానువ్వు వున్నావనే చలాకీగా ఔనంటూ

స్కూటరుపై నేనుంటే ఎగిరి వెనుక కూర్చుంటూ
నడుము గట్టిగా పట్టుకు నవ్వులు విసిరేసుకుంటూ
సోషల్ గా మువ్వయి - బల్ కుషీ చేయి జాణవైతే 

అత్త మీద కోపమొస్తే  దుత్త మీద చూపకుండా 
పప్పులాగ జారిపోయి - బావురమని ఏడ్వకుండా 
కొప్పుపట్టి యిడ్చీ ఆపై  తుప్పు రాల్చే రాణివైతే




ఘాటు ఘాటు ప్రేమ పాట సాహిత్యం

 
చిత్రం: అత్తగారు కొత్త కోడలు  (1968)
సంగీతం: జి.కె.వెంకటేష్ 
సాహిత్యం: ఆరుద్ర 
గానం: ఎ.ఎం.రాజా,ఎల్.ఆర్, ఈశ్వరి 

ఘాటు ఘాటు ప్రేమ ఎడబాటులాయెనే 
తేత తేత మనసు కలి కోత లాయెనే
కట కటా కన్నీరే కడవ నిండెనే
ఆ కడవకూడ మనసుతాగ పగిలిపోయెనే

ఆకుచాటు పిందెలాగ అమ్మచాటు పిల్లా 
చీకటాయె పపట్టపగలు జీవితమిక డొల్ల 
కాకి చేతనైన ఒక కబురు పంపవా
మేఘ సందేశమైన నాకు సంసవా

తండ్రిమాట దాటలేని రాముడైనను
ఆలితో అడవులందు హాయి పొందెను
కడగళ్ళ కోసమే కట్టావ తాళి 
పడరాని బాధలతో బతుకే ఎగతాళి
స్వంతయిల్లే అయినది బందిఖానా 
చింతలతో చేదాయె వలపు తేనే 
రేగుతున్న గుండెమంట ఆరిపోవదా
ఏ దేవుడైన కనికరించి దారిచూపడా !




వెన్నెల తెచ్చాడు పాట సాహిత్యం

 
చిత్రం: అత్తగారు కొత్త కోడలు  (1968)
సంగీతం: జి.కె.వెంకటేష్ 
సాహిత్యం: ఆత్రేయ 
గానం: యస్.జానకి 

వెన్నెల తెచ్చాడు మా పాపడు 
నవ్వులు పంచాడు నాకు మీకు
మీకు నాకు అందరికీ 
అందరికీ మనకందరికీ
యింటికీ  నా కంటికీ

మిల మిలలాడే కన్నులతో 
జిలిబిలి మెరుపులు చూపులతో
మనసులు మబ్బులు కరిగించి
మమతల జల్లుల చిలికాడూ

బుడి బుడి నడకలు నడిచాడు
పులకించింది  భూదేవి
ముద్దుల మూటల మాటలతో
మురిసి పోవును మిద్దెల రాణి





రేపల్లె వాడలో పాట సాహిత్యం

 
చిత్రం: అత్తగారు కొత్త కోడలు  (1968)
సంగీతం: జి.కె.వెంకటేష్ 
సాహిత్యం: మల్లాది రామకృష్ణ శాస్త్రి 
గానం: పి.సుశీల 

కృష్ణా... గోపాలా...గానలోలా
రాధాలవాల... రాధాలవాల

రేపల్లె వాడలో వేడుకా
వేడుకైన సన్నె వేదనా 
వేదన తీరగ వెన్నెల తీరుగ
రా...రా...  గానలోలా
రా...రా...రాధాలవాల

యమునా తీర సైకతాల ఎంతో చలని హాయిరా
యదురాయా... నీ నగపూ మత్తు జల్లు మాయరా
మత్తు జల్లే మాయేరా

సరసాల సారము - నీ వొల్లీ వొల్లని చూపురా
కమలనయన - నీ మురళీ గమకమ్ములు నేనేరా
కన్నులజూచి మన్నన సేయగ కాచియున్నారా
పున్నమిలాగ నీవు రాగ పొంగి పోదురా 

కృష్ణా...గానలోలా  రా.. రా..
రాధాలవాల రాధాలవాల




వయసు ఆగదు పాట సాహిత్యం

 
చిత్రం: అత్తగారు కొత్త కోడలు  (1968)
సంగీతం: జి.కె.వెంకటేష్ 
సాహిత్యం: ఆత్రేయ 
గానం: ఘంటసాల, పి.సుశీల 

వయసు ఆగదు మనకోసం మనసు ఉన్నది జతకోసం 
అందమున్నది ఎందు కోసం
అనుభవిద్దాం అందుకోసం

కోటదాటే కోరికుందీ  గుండె రగిలే గుబులు వుందీ 
ఓపలేని వేగముందీ  ఆపలేని తాపముందీ 
వలపు కౌగిట నలిగి, నలిగి - ఒరిగి పొమ్మందీ

వెన్నెలున్నది వేడికోసం - కన్నులున్నవి తోడుకోసం
ఎదురు చూడకు వేళకోసం వదిలి వేయకు ఒకరికోసం
అదను తప్పిన మరలరాదని - తెలుసు కొమ్మందీ

No comments

Most Recent

Default