పాట: ఓ పిల్లగ యంకటేషు
సంగీతం: వెంకట్ అజ్మీర
రచన, గానం: ప్రభ
ఆర్టిస్ట్స్: పూజా నాగేశ్వర్, రౌడీ హరీష్
కొరియోగ్రాఫర్: శేఖర్ వైరస్
ప్రొడ్యూసర్: బాలు పాలోజి
రికార్డింగ్ లేబుల్: భవ్య ట్యూన్స్
విడుదల: 08.07.2024
ఓ పిల్లగ యంకటేషు పాట సాహిత్యం
పాట: ఓ పిల్లగ యంకటేషు
సంగీతం: వెంకట్ అజ్మీర
రచన, గానం: ప్రభ
ఆర్టిస్ట్స్: పూజా నాగేశ్వర్, రౌడీ హరీష్
ఓ పిల్లగ యంకటేషు - ఓ పిల్లగ యంకటేషు
సితరాల మనసునాది చిన్నగ బోతుంటవో సూడక బోతుంటవో
ఇంట్ల సిన్నదాన్ని నేను సితరాల దాన్నిరో సిన్నెలచూపిస్తవో
సితరాల మనసునాది చిన్నగ బోతుంటవో సూడక బోతుంటవో
ఇంట్ల సిన్నదాన్ని నేను సితరాల దాన్నిరో సిన్నెలచూపిస్తవో
ఓ పిల్లగ యంకటేషు సూడక బోతుంటవో కానక బోతుంటవో
నా పిల్లగ యంకటేషు సూడక బోతుంటవో కానక బోతుంటవో
ఆ.. అందాల గుమ్మ నేను ఆగక పొతున్నవో అలుసుగ చుస్తున్నవో
నీ సొమ్మేమన్న అడిగిన్న నా సోకులవడుతున్నవో సొమ్మసిల్లి పోతవో
నీయంట తిరుగుతున్ననని అలుసైపోతున్నన నువ్వేగావాలనొస్తే నన్నేగాదంటావా
ఓ పిల్లగ.. ఓ పిల్లగ
యహ ఓ పిల్లగ యంకటేషు సూడక బోతుంటవో కానక బోతుంటవో
నా పిల్లగ యంకటేషు సూడక బోతుంటవో కానక బోతుంటవో
ఏ కండ్లకు కాటుక వెడితే కన్యాకుమారిని నా కండ్లు సూడబోతివి
బొమ్మల నడుమ బొట్టువెడితే పల్లెతనంగుంటను నిన్నే ఇడిసిపెట్టను
అవ్వఅయ్యకు సిన్నదాన్ని సివంగీ పిల్లను సిన్నచూపు చూస్తే నిన్ను నేను ఇడిసిపెట్టను
ఓ పిల్లగ.. ఓ పిల్లగ
అమ్మో ఓ పిల్లగ యంకటేషు సూడక బోతుంటవో కానక బోతుంటవో
నా పిల్లగ యంకటేషు సూడక బోతుంటవో కానక బోతుంటవో
యహె మనవూరిలో నన్ను మించే అందమెవరికున్నదో అందగత్తె నేనురో
ఆస్తి పాస్తులెన్ని ఉన్న నిన్నే గోరుకుంటిరో నీతోన వస్తనంటిరో
నువ్వే నాపానమంటి నీతోన బతుకంటి నిన్నిడిసి ఉండలేను నీ యంటే వస్తారో.. అబ్బా నీ యంటే వస్తరో
ఓ పిల్లగ యంకటేషు
ఓ పిల్లగ యంకటేషు
ఓ పిల్లగ యంకటేషు
తా నా నే న న్న నే, తా నే న న్న నే
తా నా నే న న్న నే..
తా నా నే న న్న నే, తా నే న న్న నే
తా నా నే న న్న నే..
పాట: శెనిగచెన్ల నిలబడి చేతులీయవే
సంగీతం: వెంకట్ అజ్మీర
రచన: అవర్దుతి లక్ష్మన్ అన్న
గానం: అశ్విని, జోగుల వెంకటేష్
ఆర్టిస్ట్స్: జానులిరి, రాజేష్
కొరియోగ్రాఫర్: శేఖర్ వైరస్
ప్రొడ్యూసర్: సంతోష్ యాదవ్
రికార్డింగ్ లేబుల్:: E96TV FOLK
విడుదల: 14.05.2024
శెనిగచెన్ల నిలబడి చేతులీయవే పాట సాహిత్యం
పాట: శెనిగచెన్ల నిలబడి చేతులీయవే
సంగీతం: వెంకట్ అజ్మీర
రచన: అవర్దుతి లక్ష్మన్ అన్న
గానం: అశ్విని, జోగుల వెంకటేష్
ఆర్టిస్ట్స్: జానులిరి, రాజేష్
కొరియోగ్రాఫర్: శేఖర్ వైరస్
ప్రొడ్యూసర్: సంతోష్ యాదవ్
రికార్డింగ్ లేబుల్:: E96TV FOLK
విడుదల: 14.05.2024
అరె శెనిగచెన్ల నిలబడి చేతులీయవే సెందురాల తు బాల
చేతులీయవే సెందురాల తు బాల
సేతులియ్య నీతో నాకు సెల్లెళ్ళున్నర్రో మాయ దారి మల్లేష
సెల్లెళ్ళున్నర్రో మాయ దారి మల్లేష
అరె బంతితోట్లో నిలవడి బాసలాడవే సెందురాల తు బాల
బాసలాడవే సెందురాల తు బాల
బాసలాడ నీతో నాకు బావళ్ళున్నర్రో మాయ దారి మల్లేష
బావళ్ళున్నర్రో మాయ దారి మల్లేష
నా అరటితోట్లో కలుసుకొని ఆటలాడవే సెందురాల తు బాల
ఆటలాడవే సెందురాల తు బాల
ఆటలాడ నీతో నాకు అక్కలున్నర్రో మాయ దారి మల్లేష
అక్కలున్నర్రో మాయ దారి మల్లేష
ఎయ్ పత్తిచెన్ల పక్కకొచ్చి పలకరియ్యావే సెందురాల తు బాల
పలకరియ్యావే సెందురాల తు బాల
పలకరియ్య నీతో నాకు పాలేళ్ళున్నార్రో మాయ దారి మల్లేష
పాలేళ్ళున్నార్రో మాయ దారి మల్లేష
అరె కందిచెన్ల నిలవడి కన్నుకొట్టవే సెందురాల తు బాల
చేయ్యివట్టవే సెందురాల తు బాల
కన్నుకొట్ట నీకు నాకు వరస కాదురో మాయ దారి మల్లేష
వరస కాదురో మాయ దారి మల్లేష
మిరపతోట్లో నిలవడి మాటలియ్యవే సెందురాల తు బాల
మాటలియ్యవే సెందురాల తు బాల
మాటలియ్య నీతో నాకు మామలున్నర్రో మాయ దారి మల్లేష
మామలున్నర్రో మాయ దారి మల్లేష
అబ్బబ్బ మక్కచెన్ల మంచ మీద సరసమాడవే సెందురాల తు బాల
సరసమాడవే సెందురాల తు బాల
సరసమాడ నువ్వు నాకు బావ కాదురో మాయ దారి మల్లేష
బావ కాదురో మాయ దారి మల్లేష
నువ్వు నిమ్మతొట్లో నిలవడి నిజం చెప్తనే సెందురాల తు బాల
నిజం చెప్తనే సెందురాల తు బాల
నిజం చెప్తే నిన్ను నేను నమ్మలేనురో మాయ దారి మల్లేష
నమ్మలేనురో మాయ దారి మల్లేష
వట్టి మాటలు కాదె పిల్ల మనువాడుతనే సెందురాల తు బాల
మనువాడుతునే సెందురాల తు బాల
మనువాడుతనంటే నేను నీతో వస్తారో మాయ దారి మల్లేష
నీతో వస్తారో నా బావ మల్లేష
చలో ఏడడుగులు యేసి మనం కలిసి ఉందమే సెందురాల తు బాల
కలిసి ఉందమే సెందురాల తు బాల
నీ మాట నేను వింటా నీతో ఉంటానోయ్ మాయ దారి మల్లేష
నీతో ఉంటానోయ్ నా బావ మల్లేష
అరె నిన్నేలువట్టుకుంటా ఇడిసివుండెనే సెందురాల తు బాల
ఇడిసివుండెనే సెందురాల తు బాల..
చిత్రం: యాత్ర 2 (2024)
సంగీతం: సంతోష్ నారాయణ్
నటీనటులు: ముమ్మట్టి, జీవ, కేతకీ నారాయణ్, Suzanne Bernert
దర్శకత్వం: మహి. వి. రాఘవ్
నిర్మాత: శివ మేక
విడుదల తేది: 08.02.2024
Songs List:
ప్రజా సంకల్ప యాత్ర పాట సాహిత్యం
చిత్రం: యాత్ర 2 (2024)
సంగీతం: సంతోష్ నారాయణ్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: కపిల్ కపిలన్
ప్రజా సంకల్ప యాత్ర
భగ భగ మండే పాట సాహిత్యం
చిత్రం: యాత్ర 2 (2024)
సంగీతం: సంతోష్ నారాయణ్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: దీపక్ బ్లూ
భగ భగ మండే
తొలి సమరం పాట సాహిత్యం
చిత్రం: యాత్ర 2 (2024)
సంగీతం: సంతోష్ నారాయణ్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: గౌతం భరద్వాజ్
ధమ్మే ధం ధం సన్నద్ధం
రంగం సర్వం సిద్ధం
ధమ్మే… ధర్మంగా అడుగేద్దాం
ధమ్మెంతో చూపేద్దాం… తలపడదాం
ధమ్మే… ధం ధం సన్నద్ధం
రంగం సర్వం సిద్ధం భయపడం
ఎలుగెత్తిన భాస్వర స్వరమే మనం
(ధమ్మే… ధర్మంగా అడుగేద్దాం
ధమ్మెంతో చూపేద్దాం)
ఇది భళ్ళున పెళ్లున పేలిన మౌనం
ఓ ఓ, ఎదురన్నది ఎవరైనా
ఎదిరిద్దాం తలవంచేదే
లేదని చెబుదాం
సయ్యంటు బరిలో దిగుదాం
తొలి గెలుపు జెండా ఎగురేద్దాం
జంకేదే లేదు
మహానేత వారసులు మనం
పౌరుషాల సీమ బిడ్డలం
గాయమైంది ఆత్మ గౌరవం
పెచ్చు మీరుతోంది పెత్తనం
కొంత వరకే ఓర్చుకోగలం
తెగించామో తేల్చుకోగలం
చాలు చాలు చాలు ఊడిగం
అణిచే హస్తం విరిచే వీరులమౌవుదాం
హే, అనివార్యం ధిక్కారం
అవసరమే ఈ సమరం
ఇది సూన్యం పెను సూన్యం
పరీక్షించెనే సమయం
తడబడకన్నది మనోనిశ్చయం
కొనసాగాలి సేవాకార్యం
ఆగిపోరాదుగా ఆశయం
జనమే ధైర్యం, జనమే సైన్యం
ఇక అంతరాయమే లేని
గమనమే గమ్యం
అనుమతులు పరిమితులు ఇక చెల్లే
ఏదైతే కాని పయనం కదిలే
సందేహమే లేదు అసలే
మన విజయం ఇక్కడి నుండి మొదలే
జంకేది లేదు
మహానేత వారసులు మనం
పౌరుషాల సీమ బిడ్డలం
గాయమైంది ఆత్మ గౌరవం
పెచ్చుమీరుతోంది పెత్తనం
కొంత వరకే ఓర్చుకోగలం
తెగించామో తేల్చుకోగలం
చాలు చాలు చాలు ఊడిగం
అణిచే హస్తం విరిచే వీరులమౌవుదాం
చూడు నాన్న పాట సాహిత్యం
చిత్రం: యాత్ర 2 (2024)
సంగీతం: సంతోష్ నారాయణ్
సాహిత్యం: భాస్కర భట్ల
గానం: విజయ్ నారాయణ్
చూడు నాన్న
చూస్తున్నావా నాన్నా
నీడ లేని నేనా వీళ్ళ ధీమా
ఏమిటీ ఇంతటి ప్రేమా
నా దారెటో తోచకుంటే
నీ వెంబడే మేము అంటూ
కదిలారు ఏంటో ఆ నమ్మకం
నేనెలా ఒడ్డుకి చేరడం
వీళ్ళనెలా ఒడ్డుకి చేర్చడం
ఇంటి పెద్దా కన్నుమూస్తే
అయినవాళ్ళు అనాధలే కదా
నువ్వే లేకా ప్రతి ఊరు ఊరు
అనాధ అవ్వడం ఏందయ్యా
ఇది ఏనాడు జరిగుండదయ్యా
ఓ పెద్దయ్యా
ఇందరి కన్నులు
చిమ్మే కన్నీటినంతా
తుడవాలనుంది కొడుకుగా
అందుకు అవసరమయ్యే
కొండంత ధైర్యం నాకు ఇవ్వవా
నేనెలా బాధని మింగడం
వీళ్ళనెలా నే ఓదార్చడం
ఎంతలా అభిమానమే
కురిపిస్తున్నారో ఈ జనం
అందుకే ఈ జన్మలో
తీర్చేసుకుంటా ఈ రుణం
గడపకి ప్రతి గడపకి
నేనవుతా రక్షా తోరణం
మాటపై ఉంటానని
చేస్తున్నా తొలి సంతకం
చూడు నాన్న (x8)
చిత్రం: గామి (2024)
సంగీతం: స్వీకర్ అగస్తి, నరేష్ కుమారన్
సాహిత్యం: సేనాపతి భరద్వాజ్ పాత్రుడు
గానం: అనురాగ్ కులకర్ణి, స్వీకర్ అగస్తి, సుగుణమ్మ
సొమ్మసిల్లిపోయి కూలింది కాలం
సత్తువంటూ లేక ఇంకెంత కాలం
సన్నగిల్లకుంది ఈ వింత దూరం
దిక్కుతోసకుండ ఇంకెంత దూరం
సొమ్మసిల్లిపోయి కూలింది కాలం
సత్తువంటూ లేక ఇంకెంత కాలం
సన్నగిల్లకుంది ఈ వింత దూరం
దిక్కుతోసకుండ ఇంకెంత దూరం
గమ్యాన్నే చేధించే
స్థైర్యంతో పదా
ధైర్యాన్నే సంధించెయ్
వచ్చిందో ఆపద
కాలకూటమైన ఈ తీపి స్పర్శ
అమృతంగా మారే దారుందా ఈషా
తనువు నీలమౌతూ పెడుతుంటే ఘోషా
జీవమున్న చావు పొందిందా శ్వాస
బేతాళ ప్రశ్నేదో వాలిందంటే
బదులిచ్చి తీరాలి కాదా
లోనున్న భయమంటూ పోవాలంటే
దాగున్న సత్యాన్ని వెతకాలంటా
చేయూతనిచ్చే ఆశే ఉంటే
ఆ గామి రాదా నీకై
గాయాన్ని దాటి చేరాలంటే
నిన్నే నువ్వు గామివై
గమ్యాన్నే ఛేదించే
స్థైర్యంతో పదా
ధైర్యాన్నే సంధించెయ్
వచ్చిందో ఆపదా
నేలలోకి నిన్ను నెడుతుంటే శోకం
చూసి చూడనట్టే ఉంటుంది లోకం
జరుగుతోంది నిత్య ఏకాకి యుద్ధం
నువ్వు తప్ప నీకు ఏముంది సైన్యం
కన్నీళ్ళు నిలువెల్లా ముంచేస్తున్నా
ఎదురీది చేరాలి ఒడ్డు
దుఃఖాలు నీ చుట్టూ కంచేస్తున్నా
ఎదిరించే తెగువుంటే కాదోయ్ అడ్డు
చేయూతనిచ్చే ఆశే ఉంటే
ఆ గామి రాదా నీకై
గాయాన్ని దాటి చేరాలంటే
నిన్నే నువ్వు గామివై
గమ్యాన్నే చేధించే
స్థైర్యంతో పదా
ధైర్యాన్నే సంధించెయ్
వచ్చిందో ఆపదా
గమ్యాన్నే చేధించే
స్థైర్యంతో పదా
ధైర్యాన్నే సంధించెయ్
వచ్చిందో ఆపదా
శివం పాట సాహిత్యం
చిత్రం: గామి (2024)
సంగీతం: స్వీకర్ అగస్తి, నరేష్ కుమారన్
సాహిత్యం: శ్రీమణి
గానం: శంకర్ మహదేవన్
నీ పయనం నీది కదా
ఈ గమనం మారదుగా
నీ గమ్యం చేరనిదే
వెనకడుగే లేదు కదా
హే మీలోని యుద్ధం శివం
నీతోని యుద్ధం శివం
నీకై నీ యుద్ధం శివమ్
శివమ్ శివమ్ శివం
నీ గతమే నీ భవిత
ఈ కధమే నీ కథగా
నిదురించే నీ కలనే
మెలకువలో నిలుపు పదా
హరహర హరహర హర
హరహర హరహర హర
హర హర హర హర హర
హర హర హర హర హర
నీతో నిను వెతికేది
నీలో నిను కలిపేది
అన్వేషణ నీ కొరకను
సంఘర్షణ ఆది ఇది
హరహర హరహర హర
హరహర హరహర హర
హర హర హర హర హర
ఈ లోకానికే నిను తాకే
హక్కేదో లేకుందిరా
నీ సహనానికే అది తీర్చే
చుక్కాని దొరికిందిరా
నీ నిన్నల్లోని గాయాలే
నడిపించే దిక్సూచిరా
ఈ స్పర్శల్లోని దాగున్న
మరణాన్ని చెరిపెయ్యరా
జీవం నీలోనే ప్రవహించగా నదిలా
విశ్వం అడ్డున్నా దాటెళ్ళి
మోక్షాగామివవ్వరా
చావైనా సిద్ధం శివమ్
ప్రాణంకై యుద్ధం శివమ్
నీలానికి సంకెల శివమ్
శివమ్ శివమ్ శివం
బడబాగ్నుల కాగనిది
జఠరాగ్నుల కారనిది
హిమగాలుల జ్వాల ఇది
నీలోపల రేగినది
హరహర హరహర హర
హరహర హరహర హర
హర హర హర హర హర
వేధించే వేదననే
సాధించే సాధనగా
సాగినదో నీ గాధ
తిరుగన్నది లేదు పదా
హరహర హరహర హర
హరహర హరహర హర
హర హర హర హర హర
హర హర హర హర హర
ఏ సంచారివో ఏ శూన్యలోకాల సన్యాసివో
ఏ కాంతి నువ్వో ఏకాంత లోకాల ఏకాకివో
ఏ అంతానివో నీ ఆయువే పెంచు పంతానివో
ఏ ప్రళయం ఇదో ఉపమానమే లేని తపమే ఇదో
లక్ష్యం ఏ నింగి నక్షత్రమో
అయినా దీక్షే మొదలెట్టి సాధించి
మోక్షగామివవ్వరా
హే మృత్యువుకే మోక్షం శివం శివం
ఊపిరికే సాక్ష్యం శివం శివం
ఆయువుకే రక్షే శివం శివం
శివమ్ శివమ్ శివం
హరహర హరహరా
హరహర హరహరా
చిత్రం: భీమా (2024)
సంగీతం: రవి బస్రుర్
నటీనటులు: గోపీచంద్, ప్రియ భవాని శంకర్, మాళవిక శర్మ
దర్శకత్వం: ఏ. హర్ష
నిర్మాత: కేకే రాధామోహన్
విడుదల తేది: 08.03.2024
Songs List:
హర హర శంబో పాట సాహిత్యం
చిత్రం: భీమా (2024)
సంగీతం: రవి బస్రుర్
సాహిత్యం: కళ్యాణ్ చక్రవర్తి
గానం: కళ్యాణ్ చక్రవర్తి, రవి బస్రుర్, విజయ్ ప్రకాష్
హర హర శంబో
The Rage of Bhimaa పాట సాహిత్యం
చిత్రం: భీమా (2024)
సంగీతం: రవి బస్రుర్
సాహిత్యం: కళ్యాణ్ చక్రవర్తి
గానం: రవి బస్రుర్, సంతోష్ వెంకీ
The Rage of Bhimaa
గల్లీ సౌండుల్లో పాట సాహిత్యం
చిత్రం: భీమా (2024)
సంగీతం: Ravi Basrur
సాహిత్యం: సంతోష్ వెంకీ, రవి బస్రుర్
గానం: సంతోష్ వెంకీ
గల్లీ సౌండుల్లో
నువ్వు బ్యాండు కొట్టు మామ
బాసు బిందాసు
వచ్చాడు చూడు భీమా
ఏయ్ మాసు తెంపర్రు
నువ్వు సైడ్ అయిపోరా మామా
టెక్కు తెంపర్రు
ఒక్కటైతేనే ఈ భీమా
సైలెంట్ గా నువుండమ్మా
వొయిలాన్స్ కి బ్రాండ్ ఈడమ్మ
కదిలిస్తే ఖతమేనమ్మా
రగిలే రాంపేజు
బాక్గ్రౌండే అడగొద్దమ్మ
ఫోర్గ్రౌండ్ లో ఉన్నడమ్మా
ఆ బ్రహ్మ ని కాంఫుసే చేసి
వచ్చాడ్రా భీమా
మాన్స్టర్ వీడు
ఫుల్ లోడెడ్ మిషన్ గన్ ఈడు
సైలెంట్గా ఉన్న
యమరాక్షషుడు
రేయిర్ ఈ బ్రీడు
హై వోల్టాగేజు
షార్ట్ టెంపెర్రు
ట్రెండ్ ఇక వీడు
వ వ వ సూపర్
ఎదురంతా డేంజర్ గా వున్నా
అది ఢీకొడతాడు ఈ చిన్న
ఆ దేవుడి గుణమే వున్నా
ఎంతో కరుణామయుడు డు డు డు
సిద్ధాంతాలెన్నో ఉన్న
వేదాంతలెన్నో విన్నా
ఏ పంథాలొద్దని అన్న
మాటవినాడు ఈ మొండోడు
గల్లీ సౌండుల్లో
నువ్వు బ్యాండు కొట్టు మామ
బాసు బిందాసు
వచ్చాడు చూడు భీమా
ఏయ్ మాసు తెంపర్రు
నువ్వు సైడ్ అయిపోరా మామా
టెక్కు తెంపర్రు
ఒక్కటైతేనే ఈ భీమా
సైలెంట్ గా నువుండమ్మా
వొయిలాన్స్ కి బ్రాండ్ ఈడమ్మ
కదిలిస్తే ఖతమేనమ్మా
రగిలే రాంపేజు
బాక్గ్రౌండే అడగొద్దమ్మ
ఫోర్గ్రౌండ్ లో ఉన్నడమ్మా
ఆ బ్రహ్మ ని కాంఫుసే చేసి
వచ్చాడ్రా భీమా
ఏదో ఏదో మాయా పాట సాహిత్యం
చిత్రం: భీమా (2024)
సంగీతం: రవి బస్రుర్
సాహిత్యం: కళ్యాణ్ చక్రవర్తి
గానం: అనురాగ్ కులకర్ణి
ఏదో ఏదో మాయా
అనుకుంటూనే పడిపోయా
నిను చేసేనాడు ఆ పైవాడు
పొందిండే హాయా
అందం కావాలంటే
అడగాలేమో నీ ఛాయా
నిను చెప్పాలంటే
భాషల్లోనా పోలికలున్నాయా
ఆ ఆ ఆ ఆఆ ఆ
ఆ ఆ ఆ ఆఆ ఆ
ఏదో ఏదో మాయా
అనుకుంటూనే పడిపోయా
నిను చేసేనాడు ఆ పైవాడు
పొందిండే హాయా ఆ ఆ
నిజమా నీతో ఇలా ఉన్నాను
నమ్మలేని ఇది వరమా
అహమా రాకే ఇలా
కాసేపు ఇంకా చాలు అనగలమా
క్షణాలపై ఈ జ్ఞాపకం
నూరెళ్లపై నీ సంతకం
మోమాటమే ఓ పాటగా
మార్చేసిన నీదే దయా
ఆ ఆ ఆ ఆఆ ఆ
ఆ ఆ ఆ ఆఆ ఆ
ఏదో ఏదో మాయా
అనుకుంటూనే పడిపోయా
నిను చేసేనాడు ఆ పైవాడు
పొందిండే హాయా
ఆ ఆ ఆ ఆఆ ఆ
ఆ ఆ ఆ ఆఆ ఆ
చిత్రం: మిస్టర్ బచ్చన్ (2024)
సంగీతం: మిక్కీ జే మేయర్
సాహిత్యం: సాహితి
గానం: కొమండూరి సమీరా, శ్రీరామ్ భరద్వాజ్
చిట్టిగువ్వ పిట్టలాంటి చక్కనమ్మ
బొట్టు పెట్టి పట్టుచీర కట్టుకోమ్మా
జట్టుకట్టి చుట్టమల్లే చుట్టుకోమ్మా
గుట్టుగున్న పుట్టుమచ్చ ఎక్కడమ్మా
చిట్టిగువ్వ పిట్టలాంటి చక్కనమ్మ
బొట్టు పెట్టి పట్టుచీర కట్టుకోమ్మా
జట్టుకట్టి చుట్టమల్లే చుట్టుకోమ్మా
గుట్టుగున్న పుట్టుమచ్చ ఎక్కడమ్మా
నువ్వు చేసే ఆగాలన్నీ నచ్చేసా
కానీ కొంచెం ఆగాలంటూ చెప్పేసా
నువు చెప్పేలోగా రానే వచ్చేసా
హే హే
నిగనిగ పెదవుల్లో
మోహాలన్నీ తడిపెయ్నా
కసికసి ఒంపుల్లో
కాలాలన్నీ గడియ్నా
పరువపు సంద్రాల
లోతుల్లోనా మునకెయ్నా
పదనిస రాగాల
మేఘాలన్నీ తాకెయ్నా
ఆకుపోక చూపనా
ఆశ నీలో రేపనా
గాలే గోలే చేసే తీరానా
నీ కుచ్చిలి మార్చి
ముచ్చట తీర్చెయ్నా హే హే
సొగసరి దొంగల్లె
సాయంకాలం వచ్చెయ్నా
బిగుసరి పరువంతో
పిల్లో యుద్ధం చేసెయ్నా
వలపుల వేగంతో
వయ్యారాలే వాటెయ్నా
తలపుల తాపంతో
దాహాలన్నీ దాటెయ్నా
నీలాకాశం నీడన
విడిగా నన్నీ వేదన
నీలో నాలో రాగం పాడేనా
తొలి పులకింతిచ్చే పూచి నాదేగా హే హే
రెప్పల్ డప్పుల్ పాట సాహిత్యం
చిత్రం: మిస్టర్ బచ్చన్ (2024)
సంగీతం: మిక్కీ జే మేయర్
సాహిత్యం: కాసర్ల శ్యామ్
గానం: అనురాగ్ కులకర్ణి, మంగ్లీ
ఓ బొమ్మ సోకులో
బొంబాయి జాతరే
బచ్చన్ గొంతులోన బప్పీలహరే
ఉస్కో అని అంటే చాలు
డిస్కోల మోతరే
తెల్లార్లు చల్లారని గాన కచేరే
తెలుగు తమిళ హిందీ
వలపు జుగల్ బందీ
తకిట తకిట తకిట తకిట
చెమట బొట్టు తాళమేస్తదే ఏ ఏ ఏ
రెప్పల్ డప్పుల్ల సప్పుల్లు కొట్టాలిలే
నా గాజు ఓ గజలే పాడాలిలే
కిర్రంటూ మంచాల కోరస్సులే
ప్రేక్షకులు మల్లెపూలే
వన్సు మోరు మోరు మోరు
మోరు మోరు మోరు
మూసెయ్ డోరు డోరు డోరు
డోరు డోరు డోరు
ముద్దుల్ పెడుతుంటే
మైకెట్టి మూడు ఊళ్లే
తొలి కోడి కూయాలిలే
ఏ బొమ్మ సోకులో
బొంబాయి జాతరే
బచ్చన్ గొంతులోన బప్పీలహరే
ఆ ఎర్రా ఎర్రా సెంపళ్ళల్లా
ఆ సిగ్గుమొగ్గలేసెనేందే శిలకా
నల్లా నల్లా సూపులల్లా
దాసిపెట్టినావు గనక సురక
ఆ నడుమొంపుల్లోన గిచ్చుతుంటే
వేళ్ళకొచ్చే సరిగమలేనా
సందమామ కింద
చాప దిండు దందా
ఝనక్ ఝనక్ ఝనక్ ఝనక్
పట్ట గొలుసు నట్టువాంగమే ఏ ఏ ఏ
రెప్పల్ డప్పుల్ల సప్పుల్లు కొట్టాలిలే
నా గాజు ఓ గజలే పాడాలిలే
కిర్రంటూ మంచాల కోరస్సులే
ప్రేక్షకులు మల్లెపూలే
వన్సు మోరు మోరు మోరు
మోరు మోరు మోరు
మూసెయ్ డోరు డోరు డోరు
డోరు డోరు డోరు
ముద్దుల్ పెడుతుంటే
మైకెట్టి మూడు ఊళ్లే
తొలి కోడి కూయాలిలే
ఏ బొమ్మ సోకులో
బొంబాయి జాతరే
బచ్చన్ గొంతులోన బప్పీలహరే
ఆ ఆ సీరాకొంగు అంచు సివర
నా పాణమట్ట మోసుకెల్తే ఎట్టా
సేతుల్లోనా సుట్టుకున్నా
ఈ లోకమంటే నాకు నువ్వేనంటా
ఆ నడి ఎండల్లోనా
వయసులున్న ఐస్ పుల్లై కరిగిపోనా
వేడి సల్లగుండా
మోయగా వరంగా
హత్తుకోని ఎత్తుకోవే
ఆశాభోస్లే మత్తు రాగమే ఏ ఏ ఏ
రెప్పల్ డప్పుల్ల సప్పుల్లు కొట్టాలిలే
నా గాజు ఓ గజలే పాడాలిలే
కిర్రంటూ మంచాల కోరస్సులే
ప్రేక్షకులు మల్లెపూలే
వన్సు మోరు మోరు మోరు
మోరు మోరు మోరు
మూసెయ్ డోరు డోరు డోరు
డోరు డోరు డోరు
ముద్దుల్ పెడుతుంటే
మైకెట్టి మూడు ఊళ్లే
తొలి కోడి కూయాలిలే
ఏ బొమ్మ సోకులో
బొంబాయి జాతరే
బచ్చన్ గొంతులోన బప్పీలహరే ఏ ఏ ఏ
జిక్కి పాట సాహిత్యం
చిత్రం: మిస్టర్ బచ్చన్ (2024)
సంగీతం: మిక్కీ జే మేయర్
సాహిత్యం: వనమాలి
గానం: కార్తీక్, రమ్యా బెహ్రా
అల్లరిగా అల్లికగా
అల్లేసిందే నన్నే అలవోగ్గా
ఓ లలనా నీ వలనా
మోగిందమ్మో నాలో థిల్లానా
నిన్ను చూసి గుండె ఒట్టుపెట్టుకున్నదే
గట్టు దాటి గట్టిగానే కొట్టుకున్నదే
పట్టుబట్టి పిల్ల చెయ్యి పట్టుకున్నదే
అగ్గి రాజేశాక ఆగేదెట్టాగే
ఆ నా మనసే నీకే చిక్కి
దిగనందే మబ్బుల్నెక్కి
నీ బొమ్మే చెక్కి
రోజు నిన్నే పూజించానే జిక్కి ఆ ఆ
చెబుతున్న నేనే నొక్కి
పరిచయమే పట్టాలెక్కి
నీ ప్రేమే దక్కి జంటై పోతే
ఎవరున్నారే నీకన్నా లక్కీ
నిన్ను చూసి గుండె ఒట్టుపెట్టుకున్నదే
అగ్గి రాజేశాక ఆగేదెట్టాగే
నా దడవును తెంపే నడుమొంపే
నిలువెల్లా చంపే
మధువులు నింపే
పెదవంపే ముంచిందే కొంపే
తలగడలెరుగని తలపుల సొదలకు
తలపడుతున్నా నిద్దురతో
తహ తహలెరిగిన తమకపు
తనువును తడిపెయ్ నువ్వే ముద్దులతో
వింటున్నా నీ గాత్రం
ఏంటంటా నీ ఆత్రం
చూస్తున ఈ చిత్రం
గోలేనా నీ గోత్రం
సాగేనా నీ తంత్రం
పారెనా నీ మంత్రం
కాదనకే నన్నింకేమాత్రం
నిన్ను చూసి గుండె ఒట్టుపెట్టుకున్నదే
గట్టు దాటి గట్టిగానే కొట్టుకున్నదే
పట్టుబట్టి పిల్ల చెయ్యి పట్టుకున్నదే
అగ్గి రాజేశాక ఆగేదెట్టాగే
నా వలపుల కుప్పా నువ్విప్ప
ముద్దిస్తే ముప్పా
అలకలు తప్పా ఎంగొప్ప
చనువిస్తే తప్పా
సరసకు చేరిన సరసపు సెగలకు
సతమతమవుతూ ఉన్నానే
గురుతులు చెరగని గడసరి మనసున
గుస గుసలెన్నో విన్నానే
నీ మనసే కావ్యంగా
నీ మాటే శ్రావ్యంగా
నీ తీరే నవ్యంగా
బాగుందోయ్ భవ్యంగా
నువ్వుంటే సవ్యంగా
అవునంటా దివ్యంగా
పెట్టొద్దే నన్నే దూరంగా దూరంగా
నిన్ను చూసి గుండె ఒట్టుపెట్టుకున్నదే
గట్టు దాటి గట్టిగానే కొట్టుకున్నదే
పట్టుబట్టి పిల్ల చెయ్యి పట్టుకున్నదే
అగ్గి రాజేశాక ఆగేదెట్టాగే
చిత్రం: మనమే (2024)
సంగీతం: హేశం అబ్దుల్ వహాబ్
సాహిత్యం: కృష్ణ చైతన్య
గానం: హేశం అబ్దుల్ వహాబ్
ఇక నా మాటే
ఓ మనమే పాట సాహిత్యం
చిత్రం: మనమే (2024)
సంగీతం: హేశం అబ్దుల్ వహాబ్
సాహిత్యం: కృష్ణకాంత్
గానం: కార్తీక్, గీతామాధురి
ఓ మనమే
ఓహ్ మనమే మనమే
పడదో క్షణమే
రోజూ రోజూ పేచీ పడ్డా మనమే
హే మనమే మనమే
కలిశాం మనమే
కొంచెం కొంచెం
రాజీ పడ్డ వైనమే
పంతాలలో ఓ పాపాయిలా
మంచోడిపై నీ కోపాలేలా
ఏమైనా సరే నీలో అల్లరే
ముద్దొచ్చే ముప్పూటలా
ఎంతో అద్భుతం కాదా
మారిందేంటో మా కథ
కసిరే చూపు కాసేపాపు
పుట్టిందోయమ్మా
ఊహల్లోన చిన్ని ఉప్పెన
తెలిసేలోపు నా దరిదాపు
మార్చేసావమ్మా
మంత్రం ఉందా మాట మాటునా
మబ్బులో పైరులా
మన్నులో తారలా
దిక్కులే ఒక్కటై చేరగా
ఇలా కొత్తగా ఇదో వింతగా
మొదలైందిగా మన కథా
ఎంతో అద్భుతం కాదా
మారిందేంటో మా కథ
Oh Youre My Rise
In The Sunshine
Youre The Moon
In The Moonlight
Youre My Rise
Youre My Shining Heart
In The Dream
అంతా నాదే అన్నీ నేనే
అంటావేంటమ్మా
మీదడిపోయే మిర్చీ మిస్సమ్మా
అంతల్లోనే ఉన్నట్టుండి
గమనించేశాలే
గోలేంటమ్మ గుండె చాటున
చేతిలో గీతలా
కాగితం కవితలా
రాతలే నేడిలా కలిసేగా
ఇలా కొత్తగా ఇదో వింతగా
సమ్మేళనం అవ్వగా
టప్పా టప్పా పాట సాహిత్యం
చిత్రం: మనమే (2024)
సంగీతం: హేశం అబ్దుల్ వహాబ్
సాహిత్యం: కాసర్ల శ్యామ్
గానం: రామ్ మిరియాల, హేశం అబ్దుల్ వహాబ్
టప్పా టప్పా
భూం భూం పాట సాహిత్యం
చిత్రం: మనమే (2024)
సంగీతం: హేశం అబ్దుల్ వహాబ్
సాహిత్యం: భాస్కర భట్ల
గానం: హేమచంద్ర, శీరత్ కపూర్
భూం భూం
నీ స్నేహం పాట సాహిత్యం
చిత్రం: మనమే (2024)
సంగీతం: హేశం అబ్దుల్ వహాబ్
సాహిత్యం: భాస్కర భట్ల
గానం: హేశం అబ్దుల్ వహాబ్
నీ స్నేహం
Pushpa Pushpa Song Lyrics in Telugu – Pushpa 2: The Rule (2024)
'Pushpa Pushpa' song from Pushpa 2: The Rule (2024) movie is composed by Devi Sri Prasad and sung by Nakash Aziz and Deepak Blue. Lyrics are written by Chandrabose.
చిత్రం: పుష్ప 2 (2024)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: చంద్రబోస్
గానం: శ్రేయా ఘోషాల్
వీడు మొరటోడు అని
వాళ్ళు వీళ్ళు ఎన్నెన్ని అన్నా
పసిపిల్లవాడు నా వాడు
వీడు మొండోడు
అని ఊరు వాడ అనుకున్న గాని
మహారాజు నాకు నా వాడు
ఓ ఓ మాట పెళుసైనా
మనసులో వెన్న
రాయిలా ఉన్న వాడిలోన
దేవుడెవరికి తెలుసును నా కన్నా
సూసేకి అగ్గిరవ్వ మాదిరే
ఉంటాడే నా సామి
మెత్తాని పత్తి పువ్వులా మరి
సంటోడే నా సామి
హో ఎర్రబడ్డ కళ్ళలోన
కోపమే మీకు తెలుసు
కళ్ళలోన దాచుకున్న
చెమ్మ నాకే తెలుసు
కోరమీసం రువ్వుతున్న
రోషమే మీకు తెలుసు
మీసమెనక ముసురుకున్న
ముసినవ్వు నాకు తెలుసు
అడవిలో పులిలా సరసర సరసర
చెలరేగడమే నీకు తెలుసు
అలసిన రాతిరి ఒడిలో చేరి
తల వాల్చడమే శ్రీవల్లికి తెలుసు
సూసేకి అగ్గిరవ్వ మాదిరే
ఉంటాడే నా సామి
మెత్తాని పత్తి పువ్వులా మరి
సంటోడే నా సామి
హో ఓ ఓ గొప్ప గొప్ప ఇనాములనే
ఇచ్చివేసే నవాబు
నన్ను మాత్రం చిన్ని చిన్ని
ముద్దులడిగే గరీబు
పెద్ద పెద్ద పనులు ఇట్టే
చక్కబెట్టే మగాడు
వాడి చొక్కా ఎక్కడుందో
వెతకమంటాడు సూడు
బయటికి వెళ్లి ఎందరెందరినో
ఎదిరించేటి దొరగారు
నేనే తనకి ఎదురెళ్ళకుండా
బయటికి వెళ్ళరు శ్రీవారు
సూసేకి అగ్గిరవ్వ మాదిరే
ఉంటాడే నా సామే
ఇట్టాంటి మంచి మొగుడుంటే
ఏ పిళ్ళైనా మహారాణీ
Peelings Song Lyrics in Telugu – Pushpa 2: The Rule (2024)
'Peelings' song from Pushpa 2: The Rule (2024) movie is composed by Devi Sri Prasad and sung by Shankar Babu Kandukoori and Laxmi Dasa. Lyrics are written by Chandrabose.
చిత్రం: పుష్ప 2 (2024)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: చంద్రబోస్
గానం: సుబ్లాషిని
అరేయ్ అందరు వచ్చిండరు గాని పార్టీకి, ఇప్పుడు దించరా ఫోటో… కిస్సిక్ అని…..
కిస్ కిస్ కిస్ కిస్సిక్
కిస్సా కిస్సా కిస్ కిస్సిక్
కిస్ కిస్ కిస్ కిస్సిక్
కిస్సా కిస్సా కిస్ కిస్సిక్…..
కిస్ కిస్ కిస్ కిస్సిక్
కిస్సా కిస్సా కిస్ కిస్సిక్
కిస్ కిస్ కిస్ కిస్సిక్
కిస్సా కిస్సా కిస్ కిస్సిక్…..
దించర దించర దించు
మావయ్యోచ్చాడు దించు…
కిస్ కిస్ కిస్ కిస్సిక్
కిస్సా కిస్సా కిస్ కిస్సిక్…
దించర దించర దించు
బావయ్యోచ్చాడు దించు…
కిస్ కిస్ కిస్ కిస్సిక్
కిస్సా కిస్సా కిస్ కిస్సిక్…
చిచ్చా వచ్చాడు దించు… కిస్సిక్
మచ్చా వచ్చాడు దించు… కిస్సిక్
పిలిసినోడొచ్చాడు దించు… కిస్సిక్
పిలవనోడొచ్చాడు దించు… కిస్సిక్
మావోడొచ్చాడు… మీవోడొచ్చాడు
మనవోడొచ్చాడు దించు… కిస్సిక్
ఆళ్లతో ఫోటో ఈళ్లతో ఫోటో
ఆల్బంలో అంటించు
మరి నాతో దిగిన బొమ్మని బాబు లాకర్లో దాచుంచు…
హే పుసుక్కున ఈ కిస్సిక్కులు బైటికి వచ్చాయో…
దెబ్బలు పడతయ్ రాజా
దెబ్బలు పడతయ్ రో
దెబ దెబ దెబ్బలు పడతయ్ రో
కిస్ కిస్ కిస్ కిస్సిక్
కిస్సా కిస్సా కిస్ కిస్సిక్
దెబ్బలు పడతయ్ రాజా
దెబ్బలు పడతయ్ రో
దెబ దెబ దెబ్బలు పడతయ్ రో
కిస్ కిస్ కిస్ కిస్సిక్
కిస్సా కిస్సా కిస్ కిస్సిక్
పక్కన నిలబడి ఫోటో తీసుకో
భుజాలు గాని రాసుకుంటే…
దెబ్బలు పడతయ్ రో… కిస్సిక్
దెబ్బలు పడతయ్ రో…
సర్లే భుజంపైన సెయ్యేసి తీసుకో
సేతులు తిన్నగా వుండకపోతే
దెబ్బలు పడతయ్ రో… కిస్సిక్
దెబ్బలు పడతయ్ రో… కిస్సిక్
సింగల్ ఫోటో పర్లేదు
రంగుల ఫోటో పర్లేదు
గ్రూప్ ఫోటో తీసుకుందాం
తప్పేమి లేదు
కానీ పబ్లిక్ లో నా ఫోటో పెట్టి
దెబ్బలు పడతయ్ రాజా
దెబ్బలు పడతయ్ రో
దెబ దెబ దెబ్బలు పడతయ్ రో
కిస్ కిస్ కిస్ కిస్సిక్
కిస్సా కిస్సా కిస్ కిస్సిక్
దెబ్బలు పడతయ్ రా రా
దెబ్బలు పడతయ్ రో
దెబ దెబ దెబ్బలు పడతయ్ రో
కిస్ కిస్ కిస్ కిస్సిక్
కిస్సా కిస్సా కిస్ కిస్సిక్
ఏ ఏ ఏ… ఏ ఫోసైన ఫోటో తీస్కో
ఎక్స్ పోసింగ్ లా ఉన్నాదంటే
దెబ్బలు పడతయ్ రో… కిస్సిక్
దెబ్బలు పడతయ్ రో… కిస్సిక్
యాంగిల్ ఏదైనా ఫోటో తీస్కో
బాడ్ యాంగిల్లో చూసావంటే
దెబ్బలు పడతయ్ రో… కిస్సిక్
దెబ్బలు పడతయ్ రో… కిస్సిక్
తీసిన ఫోటో దాసుకో
తీరుబడిగా సూసుకో
కళ్ళకు పండగ సేసుకో
కాదనేది లేదు
కానీ ఫేసులు గీసులు మార్ఫింగ్ సేసి
పిచ్చి పిచ్చి వేషాలు ఏసారో
దెబ్బలు పడతయ్ రాజా
దెబ్బలు పడతయ్ రో
దెబ దెబ దెబ్బలు పడతయ్ రో, ఒయ్
కిస్ కిస్ కిస్ కిస్సిక్
కిస్సా కిస్సా కిస్ కిస్సిక్
దెబ్బలు పడతయ్ రాజా
దెబ్బలు పడతయ్ రో
దెబ దెబ దెబ్బలు పడతయ్ రో
కిస్ కిస్ కిస్ కిస్సిక్
కిస్సా కిస్సా కిస్ కిస్సిక్..
కిస్ కిస్ కిస్ కిస్సిక్…..
Gango Renuka Thalli Song Lyrics in Telugu – Pushpa 2: The Rule (2024)
'Gango Renuka Thalli' song from Pushpa 2: The Rule (2024) movie is composed by Devi Sri Prasad and sung by V. M. Mahalingam. Lyrics are written by Chandrabose.
చిత్రం: పుష్ప 2 (2024)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: చంద్రబోస్
గానం: వి. ఎమ్. మహాలింగం
ఎర్ర ఎర్ర పారాణి పెట్టి
మమ్ము పాలించగ వచ్చే
గంగో రేణుక తల్లి
నల్ల నల్ల కాటుక పెట్టి
మమ్ము దయ సూడగ వచ్చే
గంగో రేణుక తల్లి
ఘల్లు ఘల్లు గజ్జలు కట్టి
మమ్ము నడిపించగా వచ్చే
గంగో రేణుక తల్లి
గంగో రేణుక తల్లి (4)
ఉల్లాకు చీర కట్టి - గంగో రేణుక తల్లి
ఊళ్లోకి వచ్చేనమ్మా - గంగో రేణుక తల్లి
జలారి పూలు పెట్టి - గంగో రేణుక తల్లి
జాతర్లు తెచ్చేనమ్మా - గంగో రేణుక తల్లి
హే తంగేడు పూలు పెట్టి - గంగో రేణుక తల్లి
రంగాన దూకేనమ్మ - గంగో రేణుక తల్లి
ముక్కు ముక్కెర పెట్టి - గంగో రేణుక తల్లి
ముల్లోకాలే ఎలేనమ్మా - గంగో రేణుక తల్లి
ముందార సూడంగా - గంగో రేణుక తల్లి
మున్నూరు కన్నులమ్మ - గంగో రేణుక తల్లి
ఎనుకాల సూడంగా - గంగో రేణుక తల్లి
ఏనూరు కన్నులమ్మ - గంగో రేణుక తల్లి
నీకన్న పెద్ద దిక్కు లోకాన ఎక్కడుంది
నైవేద్యం ఎట్టంగా మాకాడ ఏమిటుంది
మోరలన్ని ఆలకించి వరమియ్యవే తల్లి
కన్నా బిడ్డలను కాపాడవే తల్లి
గంగో రేణుక తల్లి (6)
Dammunte Pattukora Song Lyrics in Telugu – Pushpa 2: The Rule (2024)
'Dammunte Pattukora' song from Pushpa 2: The Rule (2024) movie is composed by Devi Sri Prasad and sung by Allu Arjun. Lyrics are written by Sukumar.
చిత్రం: కూలన్న (1999)
సంగీతం: షైక్ ఇమామ్
సాహిత్యం: మురళీ మధు
గానం: యస్.పి.బాలు
నటీనటులు: ఆర్. నారాయణమూర్తి
నిర్మాత & దర్శకత్వం: ఆర్. నారాయణమూర్తి
విడుదల తేది: 09.04.1999
పల్లవి:
తెగిపడ్డ నింగి చుక్కనా
చెత్తకుండీ కాడి కుక్కనా (2)
ఏ తల్లి కన్న బిడ్డనో
నేను యే అయ్య కన్న కొడుకునో
చరణం: 1
కన్నె తల్లులుగన్న కర్ణులీలోకాన
కుప్ప తొట్టేలకాడ కుక్కలపాలైరి
నమ్మించి నా అయ్య గొంతెట్ట కోసిండో
పదినెలలు నా తల్లి నన్నెట్టా మోసిందో
ఆ నాటి ఆ కుంతీ కర్ణున్ని కనలేదా...
ఏడుస్తావెందుకు ఆ కథ వినలేదా
చరణం: 2
సొంతకొడుకంటూనే సవతి ప్రేమేలమ్మ
చంపినా బాగున్ను కళ్ళు తెరవకముందే
ఓ తల్లి నన్నడుగ నోరెట్ట వచ్చిందే
నా చావు కోరుటకు మనసెట్ట వొప్పిందే
మూడుతలల బ్రహ్మ రాతెట్టా రాసిండో
నీతిలేని మనిషి గీతెట్టా గీసిండో
చరణం: 3
కాలుజారిన తల్లి ఎవ్వర్తో
కండ కావరమెక్కిన తండ్రి ఎవ్వడో
తప్పు చేసినవారు తప్పించుకున్నారు
తలవంపుతో నేను తలదించు కున్నాను
కరుణలేని ఓ తల్లి దండ్రులారా...
నాలాగ ఎవ్వర్ని పారేయకండి
మల్లోచ్చిండురో పాట సాహిత్యం
చిత్రం: కూలన్న (1999)
సంగీతం: షైక్ ఇమామ్
సాహిత్యం: శక్తి
గానం: వరంగల్ శంకర్ & కోరస్
మల్లోచ్చిండురో