-->
Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Sweekar Agasthi"



చిత్రం: గామి (2024)
సంగీతం: స్వీకర్ అగస్తి, నరేష్ కుమారన్
బ్యాక్ గ్రౌండ్ స్కోర్: నరేష్ కుమారన్
నటీనటులు: విశ్వక్‌సేన్‌, చాందిని చౌదరి,
అభినయ, మహ్మద్ సమద్, హారిక పెడద
దర్శకత్వం:విద్యాధర్‌ కాగిత
నిర్మాత: కార్తీక్‌ శబరీష్‌
సహ నిర్మాత: శ్వేతా మొరవనేని
విడుదల తేది: 08.03.2024



Songs List:



గమ్యాన్నే చేధించే పాట సాహిత్యం

 
చిత్రం: గామి (2024)
సంగీతం: స్వీకర్ అగస్తి, నరేష్ కుమారన్
సాహిత్యం: సేనాపతి భరద్వాజ్ పాత్రుడు 
గానం: అనురాగ్ కులకర్ణి,  స్వీకర్ అగస్తి, సుగుణమ్మ 

సొమ్మసిల్లిపోయి కూలింది కాలం
సత్తువంటూ లేక ఇంకెంత కాలం
సన్నగిల్లకుంది ఈ వింత దూరం
దిక్కుతోసకుండ ఇంకెంత దూరం

సొమ్మసిల్లిపోయి కూలింది కాలం
సత్తువంటూ లేక ఇంకెంత కాలం
సన్నగిల్లకుంది ఈ వింత దూరం
దిక్కుతోసకుండ ఇంకెంత దూరం

గమ్యాన్నే చేధించే
స్థైర్యంతో పదా
ధైర్యాన్నే సంధించెయ్
వచ్చిందో ఆపద

కాలకూటమైన ఈ తీపి స్పర్శ
అమృతంగా మారే దారుందా ఈషా
తనువు నీలమౌతూ పెడుతుంటే ఘోషా
జీవమున్న చావు పొందిందా శ్వాస

బేతాళ ప్రశ్నేదో వాలిందంటే
బదులిచ్చి తీరాలి కాదా
లోనున్న భయమంటూ పోవాలంటే
దాగున్న సత్యాన్ని వెతకాలంటా

చేయూతనిచ్చే ఆశే ఉంటే
ఆ గామి రాదా నీకై
గాయాన్ని దాటి చేరాలంటే
నిన్నే నువ్వు గామివై

గమ్యాన్నే ఛేదించే
స్థైర్యంతో పదా
ధైర్యాన్నే సంధించెయ్
వచ్చిందో ఆపదా

నేలలోకి నిన్ను నెడుతుంటే శోకం
చూసి చూడనట్టే ఉంటుంది లోకం
జరుగుతోంది నిత్య ఏకాకి యుద్ధం
నువ్వు తప్ప నీకు ఏముంది సైన్యం

కన్నీళ్ళు నిలువెల్లా ముంచేస్తున్నా
ఎదురీది చేరాలి ఒడ్డు
దుఃఖాలు నీ చుట్టూ కంచేస్తున్నా
ఎదిరించే తెగువుంటే కాదోయ్ అడ్డు

చేయూతనిచ్చే ఆశే ఉంటే
ఆ గామి రాదా నీకై
గాయాన్ని దాటి చేరాలంటే
నిన్నే నువ్వు గామివై

గమ్యాన్నే చేధించే
స్థైర్యంతో పదా
ధైర్యాన్నే సంధించెయ్
వచ్చిందో ఆపదా

గమ్యాన్నే చేధించే
స్థైర్యంతో పదా
ధైర్యాన్నే సంధించెయ్
వచ్చిందో ఆపదా



శివం పాట సాహిత్యం

 
చిత్రం: గామి (2024)
సంగీతం: స్వీకర్ అగస్తి, నరేష్ కుమారన్
సాహిత్యం: శ్రీమణి
గానం: శంకర్ మహదేవన్ 

నీ పయనం నీది కదా
ఈ గమనం మారదుగా
నీ గమ్యం చేరనిదే
వెనకడుగే లేదు కదా

హే మీలోని యుద్ధం శివం
నీతోని యుద్ధం శివం
నీకై నీ యుద్ధం శివమ్
శివమ్ శివమ్ శివం

నీ గతమే నీ భవిత
ఈ కధమే నీ కథగా
నిదురించే నీ కలనే
మెలకువలో నిలుపు పదా

హరహర హరహర హర
హరహర హరహర హర
హర హర హర హర హర
హర హర హర హర హర

నీతో నిను వెతికేది
నీలో నిను కలిపేది
అన్వేషణ నీ కొరకను
సంఘర్షణ ఆది ఇది

హరహర హరహర హర
హరహర హరహర హర
హర హర హర హర హర

ఈ లోకానికే నిను తాకే
హక్కేదో లేకుందిరా
నీ సహనానికే అది తీర్చే
చుక్కాని దొరికిందిరా

నీ నిన్నల్లోని గాయాలే
నడిపించే దిక్సూచిరా
ఈ స్పర్శల్లోని దాగున్న
మరణాన్ని చెరిపెయ్యరా

జీవం నీలోనే ప్రవహించగా నదిలా
విశ్వం అడ్డున్నా దాటెళ్ళి
మోక్షాగామివవ్వరా

చావైనా సిద్ధం శివమ్
ప్రాణంకై యుద్ధం శివమ్
నీలానికి సంకెల శివమ్
శివమ్ శివమ్ శివం

బడబాగ్నుల కాగనిది
జఠరాగ్నుల కారనిది
హిమగాలుల జ్వాల ఇది
నీలోపల రేగినది

హరహర హరహర హర
హరహర హరహర హర
హర హర హర హర హర

వేధించే వేదననే
సాధించే సాధనగా
సాగినదో నీ గాధ
తిరుగన్నది లేదు పదా

హరహర హరహర హర
హరహర హరహర హర
హర హర హర హర హర
హర హర హర హర హర

ఏ సంచారివో ఏ శూన్యలోకాల సన్యాసివో
ఏ కాంతి నువ్వో ఏకాంత లోకాల ఏకాకివో
ఏ అంతానివో నీ ఆయువే పెంచు పంతానివో
ఏ ప్రళయం ఇదో ఉపమానమే లేని తపమే ఇదో

లక్ష్యం ఏ నింగి నక్షత్రమో
అయినా దీక్షే మొదలెట్టి సాధించి
మోక్షగామివవ్వరా

హే మృత్యువుకే మోక్షం శివం శివం
ఊపిరికే సాక్ష్యం శివం శివం
ఆయువుకే రక్షే శివం శివం
శివమ్ శివమ్ శివం

హరహర హరహరా
హరహర హరహరా




అరిరారో పాట సాహిత్యం

 
చిత్రం: గామి (2024)
సంగీతం: స్వీకర్ అగస్తి, నరేష్ కుమారన్
సాహిత్యం: లక్ష్మీ ప్రియాంక 
గానం: హరిణి ఇవటూరి 

అరిరారో 


Palli Balakrishna Sunday, August 11, 2024



చిత్రం: మిడిల్ క్లాస్ మేలోడీస్ (2020)
సంగీతం: స్వీకర్ అగస్తి
నటీనటులు: ఆనంద్ దేవరకొండ, వర్ష బొల్లమ్మ
దర్శకత్వం: వినోద్ అనంతోజు
నిర్మాత: వెనిగళ్ళ ఆనందప్రసాద్
విడుదల తేది: 20.11.2020



Songs List:



ది గుంటూరు పాట సాహిత్యం

 
చిత్రం: మిడిల్ క్లాస్ మేలోడీస్ (2020)
సంగీతం: స్వీకర్ అగస్తి
సాహిత్యం: కిట్టూ విస్సాప్రగడ
గానం: అనురాగ్ కులకర్ణి

తెల్లారే ఊరంతా తయ్యారే
ముస్తాబై పిలిచింది గుంటూరే
రద్దీలో యుద్ధాలే మొదలాయే
తగ్గేదే లేదంటే ప్రతివాడే

మరుపే రాని ఊరేగుంటూరే
అలుపంటూ లేదంటే సూరీడే
పగలంతా తడిసేలే సొక్కాలే
ఎన్నెన్నో సరదాలే కొలువుంటే
కారాలే నూరేది అంటారే

బేరం సారం సాగే దారుల్లోన
నోరూరించే మిర్చి బజ్జి తగిలే
దారం నుంచి సారె సీరల దాక
గాలం ఏసి పట్నం బజారు పిలిసే

యే పులిహోర దోశ - బ్రాడీపేట
బిర్యానికైతే - సుభాని మామ
వంకాయ బజ్జి - ఆరో లైను
గోంగూర చికెన్-బృందావనం
మసాల ముంత-సంగడిగుంట
మాలు పూరి - కొత్తపేట
చిట్టి ఇడ్లీ - లక్ష్మి పురం
అరె... చెక్క పకోడీ - మూడొంతెనలూ

గుటకే పడక కడుపే తిడితే
సజ్జా గింజల సోడా బుస్సందే
పొడి కారం నెయ్యేసి పెడుతుంటే
పొగ చూరే దారుల్లో నోరూరే
అడిగిందే తడువంటా ఏదైనా
లేదన్నా మాటంటూ రాదంటా
సరదాపడితే పోదాం గుంటూరే




సంధ్యా పదపద పదమని పాట సాహిత్యం

 
చిత్రం: మిడిల్ క్లాస్ మేలోడీస్ (2020)
సంగీతం: స్వీకర్ అగస్తి
సాహిత్యం: సనపతి భరద్వాజ్ పాత్రుడు
గానం: స్వీకర్ అగస్తి

సంధ్యా పదపద పదమని 
అంటే సిగ్గే ఆపిందా
బావా అని పిలిచేందుకు
మొహమాటంతో ఇబ్బంద
నువు వణక్క, తొనక్క, బెరక్క
సరిగ్గ ఉంటే చాలే కథ వెనక్కి జరక్క
చురుగ్గ కొలిక్కి త్వరగా వస్తాదే
ఇది వయస్సు విపత్తు
ఒకింత తెగించి ఉంటే మేలే
విధి తరించి తలొంచి
కరెక్టు ముగింపు ఇపుడే ఇస్తాదే

మధ్యలో ఉన్నది దగ్గరో దూరమో
కాస్తయినా తెలిసిందా
ఎంతకీ తేలనీ ప్రేమలో తేలడం
ఏమైనా బాగుందా
మాటలని కుక్కేశావే మనసు నిండా
వాటినిక పంపేదుందా పెదవిగుండా
బిడియంతో సహవాసం ఇక చాలు బాలిక
అది ఎంతో అపచారం అని అనుకోవే చిలకా

సంధ్యా పదపద పదమని
అంటే సిగ్గే ఆపిందా
బావా అని పిలిచేందుకు
మొహమాటంతో ఇబ్బందా

ఏం సరిపొద్దే నువు చూపే ప్రేమా
ఓ తెగ చూస్తే పనులేవీ కావమ్మా
పైకలా అవుపిస్తాడే ఎవరికైనా
వాడికీ ఇష్టం ఉందే తమరిపైనా

విసిరావో గురిచూసి 
వలపన్న బాణమే
పడిపోదా వలలోన
పిలగాడి ప్రాణమే

సంధ్యా  పదపద పదమని 
అంటే సిగ్గే ఆపిందా
బావా అని పిలిచేందుకు
మొహమాటంతో ఇబ్బంద
నువు వణక్క, తొనక్క, బెరక్క
సరిగ్గ ఉంటే చాలే కథ వెనక్కి జరక్క
చురుగ్గ కొలిక్కి త్వరగా వస్తాదే
ఇది వయస్సు విపత్తు
ఒకింత తెగించి ఉంటే మేలే
విధి తరించి తలొంచి
కరెక్టు ముగింపు ఇపుడే ఇస్తాదే



కీలుగుర్రం పాట సాహిత్యం

 
చిత్రం: మిడిల్ క్లాస్ మేలోడీస్ (2020)
సంగీతం: స్వీకర్ అగస్తి
సాహిత్యం: సనపతి భరద్వాజ్ పాత్రుడు
గానం: అనురాగ్ కులకర్ణి, స్వీకార్ అగస్తి , రమ్య బెహరా

కీలుగుర్రం




సాంబ శివ పాట సాహిత్యం

 
చిత్రం: మిడిల్ క్లాస్ మేలోడీస్ (2020)
సంగీతం: స్వీకర్ అగస్తి
సాహిత్యం: పలనాడు జానపదం
గానం: రామ్ మిరియాల

సాంబ శివ 



మంచిదో చెడ్డదో పాట సాహిత్యం

 
చిత్రం: మిడిల్ క్లాస్ మేలోడీస్ (2020)
సంగీతం: స్వీకర్ అగస్తి
సాహిత్యం: సనపతి భరద్వాజ్ పాత్రుడు
గానం: విజయ్ ఏసుదాస్

మంచిదో చెడ్డదో రెంటికి మద్యేదో 
అంతుచిక్కలేదా కాలం ఎటువంటిదో
కయ్యామో నెయ్యమో ఎప్పుడేం చెయ్యునో
లెక్కతేలలేదా దాని తీరు ఏమిటో

ముళ్ళు ఉన్న మార్గాన నడిపేటి కాలం
వేచి ఉంటె రాదారి చూపించదా
చిక్కు ప్రశ్న వేసేటి తెలివైన కాలం
తప్పకుండ బదులైరాదా

మదిలోని చిరునవ్వు జన్మించగా
కలతే పోదా కనుమూయదా
నడిరేయి దరిచేరి మసి పూయగా
వెలుగేరాదా చెరిపేయదా
అరచేతి రేఖల్లో లేదంట రేపు
నిన్నల్ని వదిలేసి రావాలి చూపు
చూడొద్దు ఎదంటూ ఓదార్పు

వచ్చిపోయే మేఘాలే ఈ బాధలన్నీ
ఉండిపోవు కడదాకా ఆనింగిలా
అంతమైతే కారాదు లోలోని దైర్యం
అంతులేని వ్యధలే ఉన్నా

సంద్రాన్ని పోలింది ఈ జీవితం
తెలిసి తీరాలి ఎదురీదడం
పొరపాటు కాదంటపడిపోవడం
ఉండాలో లేచే గుణం

ఎటువంటి ఆటంకమెదురైన గాని
మునుముందు కెల్లేటి అలవాటు మాని
కెరటాలు ఆగేటి రోజేదని
గంథాలన్నీ ఓనాడూ తీసేటి కాలం
వాస్తవాన్ని కళ్లారా చుపించదా
కమ్ముకున్న భ్రమలన్నీ కావలి మాయం
కిందపడ్డ తరువాతైనా

తన్నెనా తన్నెనా తన్నెనా తన్నెనా
తానే నానా నానా తానే నానా నానేనా (2)




వెచ్చని మట్టిలో పాట సాహిత్యం

 
చిత్రం: మిడిల్ క్లాస్ మేలోడీస్ (2020)
సంగీతం: స్వీకర్ అగస్తి
సాహిత్యం: సాయికిరణ్
గానం: స్వీకర్ అగస్తి

వెచ్చని మట్టిలో నాటిన విత్తనం
ఊపిరందుకోదా చుక్క నీరు పట్టిన
రాతిరే కప్పిన దారులే తప్పిన
తెల్లవారనంద చీకటెంత కమ్మిన

తురుపింట మొదలైన కిరణాల వేడి
లోకమంత అందాలు అందించదా
దారిలోన ఎదురైన గ్రహణాలు వీడి
రంగులద్దుకుంటూ రాదా

చిగురాకు పిలిచింది రారమ్మని
నీలాకాశాన మేఘలని
అటు నుండి బదులేది రాలేదని
అలిగిందా ఆ ఆమని

జరిగింది గమనించి ఆ చల్లగాలి
జోలాలి పాడింది తన చెంత చేరి
చినబోయిన ఆ చిన్న ప్రాణానికి

వేకువింట మొదలైన కిరణాల వేడి
లోకమంత అందాలు అందించదా
దారిలోన ఎదురైన గ్రహణాలు వీడి
రంగులద్దుకుంటూ రాదా

Palli Balakrishna Tuesday, February 9, 2021



చిత్రం: కేరాఫ్ కంచరపాలెం (2018)
సంగీతం:  స్వీకర్ అగస్తి
నటీనటులు: సుబ్బారావు, రాధా బెస్సీ, కేశవ కర్రి, నిత్య శ్రీ గోరు, కార్తిక్ రత్నం, ప్రవీణ పరుచూరి, ప్రణీత పట్నాయక్, మోహన్ భగత్, విజయ ప్రవీణ, పరుచూరి కిషోర్ కుమార్
దర్శకత్వం: వెంకటేష్ మహా
ప్రెజెంట్స్: రాణా దగ్గబాటి
నిర్మాత: ప్రవీణ పరుచూరి
విడుదల తేది: 07.09.2018



Songs List:



పట్టి పట్టి నన్నే సూత్తాంటే పాట సాహిత్యం

 
చిత్రం: కేరాఫ్ కంచరపాలెం (2018)
సంగీతం: స్వీకార్ అగస్తి
సాహిత్యం: రఘుకుల్
గానం: స్వీకార్ అగస్తి

పట్టి పట్టి నన్నే సూత్తాంటే
పట్టలేక ఏటో అవుతాందే
పట్టుపట్టి జోడి కట్టానే
పట్టలేని హాయే పొందానే

కొంటె పిల్ల నువ్వూ
తుంటరోణ్ణి నేనూ
రాధ ఎంట కిష్టుడ్నే

కోట రాణి నువ్వూ
తోటమాలి నేనూ
నీకు తగ్గ ఈరుణ్ణే

జట్టుకట్టు సేపట్టూ
ఒగ్గేయ్ నే నీ మీదే ఒట్టూ
ఏఏ..ఏఏ..ఓఓఓ..ఓఓఓ..

తందన్నారె తారే తన్నాన్నే
తన్నన్నారె తారె తారారే

టిట్టీరిటి టీటీ ప్యాంప్యాంప్యాంప్యాం
టిట్టీరిట్టి టీటీ ట్యాండ్యాంట్యాం..టం..
టిట్టీరిట్టి టీటీ ట్యాండ్యాండ్యాం..ట్యాం.డ్యాం..
తరిదీ తరిదా తరిది..

రాములోరైనా సీతతోటే ఉన్నా
సూడలేదు లోకం అదేటో
తుళ్ళి ఆడుతుంటే తట్టుకోదురయ్యో
కుళ్ళుబోతు లోకం కథేటో

యే కులము గిలము బలమూ జూసి
వయసు వరస సొగసు సూసి
పుట్టుకొస్తదా రా ప్రేమ

మనసు మనసు కొంతెనేసి
తనువు తనువు మెలికలేసే
తీరేరా ప్రేమా...

సిన్నపిల్లలైనా యేళ్ళు మళ్ళుతున్నా
ప్రేమలోన అంతా ఓటేగా
లచ్చలెన్ని ఉన్నా డొక్కలాడకున్నా
ప్రేమ లక్షణాలు అవేగా

ఏ ఎతికి ఎతికి సూత్తాది కన్ను
కుదురు సెదిరి పోతది తెన్ను
జివ్వుమంటదంటా వెన్ను

సిలకపలుకే తానేమన్న
పులకరింతె నేనేం విన్నా
వలపొక వింతేనా

జట్టుకట్టు సేపట్టు
ఒగ్గేయ్ నే నీ మీదే ఒట్టూ

కస్సుబుస్సులైనా కొంటె సూపులైనా
కంటికింపులేగా ఏదైనా
సందడెంత ఉన్నా ముందరెవ్వరున్నా
నింగి అంచులోనే నేనున్నా

ఏ అడుగులడుగులేత్తా ఉన్నా
కదల మెదలకుంట ఉన్నా
అంతులేని ప్రేమేనన్నా

మాటలొరద లైతావున్నా
మౌనమంతా నిండి ఉన్నా
నీతో నేనున్నా

హేయ్ జట్టుకట్టూ సేపట్టూ
ఒగ్గేయ్ నే నీమీదే ఒట్టూ

ఏయ్..ఏ...ఏయ్..ఓఓఓఓ...

టిట్టీరిటి టీటీ ప్యాంప్యాంప్యాంప్యాం
టిట్టీరిట్టి టీటీ ట్యాండ్యాంట్యాం..టం..
టిట్టీరిట్టి టీటీ ట్యాండ్యాండ్యాండ్యాండ్యాం..
ప్రేమకు ఉందా పరిధి





సొట్టబుగ్గల ఓ చిన్నది పాట సాహిత్యం

 
చిత్రం: కేరాఫ్ కంచరపాలెం (2018)
సంగీతం:  స్వీకర్ అగస్తి
సాహిత్యం: వెంకటేష్ మహా
గానం: కిషోర్ పొలిమేర

సొట్టబుగ్గల ఓ చిన్నది




ఆశాపాశం బంది చేసేలే పాట సాహిత్యం

 
చిత్రం: కేరాఫ్ కంచరపాలెం (2018)
సంగీతం:  స్వీకర్ అగస్తి
సాహిత్యం: విశ్వా
గానం: అనురాగ్ కులకర్ణి

ఆశాపాశం బంది చేసేలే
సాగే కాలం ఆడే ఆటేలే
తీరా తీరం చేరే లోగానే ఎతీరౌనో...

చేరువైన సేదు దూరాలే
తోడౌతూనే ఈడే వైనాలే
నీదో కాదో తేలేలోగానే ఎదేటౌనో
ఆటు పోటు గుండె మాటుల్లోన
సాగేనా...

ఏలేలే లేలో...
కల్లోలం ఈ లోకంలో
లో లో లోలోతుల్లో
ఏలేలో ఎద కొలనుల్లో

నిండు పున్నమేల మబ్బు కమ్ముకొచ్చి
సిమ్మ సీకటల్లి పోతుంటే
నీ గమ్యం గంధరగోళం
దిక్కు తోచకుండ తల్లడిల్లిపోతు
పల్లటిల్లిపోయి నీవుంటే
తీరేనా నీ ఆరాటం

ఏ హేతువు నుదుటి రాతల్ని మార్చిందో
నిశితంగా తెలిసేదెలా
రేపేటౌనో తేలాలంటే
నీ ఉనికి ఉండాలిగా

ఓ..ఓ.. ఆటు పోటు
గుండె మాటుల్లోన
సాగేనా.....

ఆశాపాశం బంది చేసేలే
సాగే కాలం ఆడే ఆటేలే
తీరా తీరం చేరేలోగానే ఏతీరౌనో

ఏ జాడలో ఏమున్నదో
క్రీనీడల విధి వేచున్నదో
ఏ మలుపులో ఏం దాగున్నదో
నీవుగా తేల్చుకో నీ శైలిలో

చిక్కు ముళ్ళు గప్పి, రంగు లీనుతున్న లోకమంటే పెద్ద నాటకమే
తెలియకనే సాగే కథనం

నీవు పెట్టుకున్న నమ్మకాలు అన్ని 
పక్క దారిబట్టి పోతుంటే
కంచికి నీ కథలే దూరం
నీ చేతుల్లో ఉంది చేతల్లో చూపించి 
ఎదురేగి సాగాలిగా
రేపేటౌనో తేలాలంటే
నువ్వెదురు సూడాలిగా

ఓ..ఓ.. ఆటు పోటు
గుండె మాటుల్లోన... ఉంటున్నా...





ఏమి జన్మము పాట సాహిత్యం

 
చిత్రం: కేరాఫ్ కంచరపాలెం (2018)
సంగీతం:  స్వీకర్ అగస్తి
సాహిత్యం: యడ్ల రామదాసు
గానం: వెంకట రావు

ఏమి జన్మము



కలకత్తా కాళి పాట సాహిత్యం

 
చిత్రం: కేరాఫ్ కంచరపాలెం (2018)
సంగీతం:  స్వీకర్ అగస్తి
సాహిత్యం: వెంకటేష్ మహా
గానం: కిషోర్ పొలిమేర

కలకత్తా కాళి

Palli Balakrishna Sunday, January 17, 2021

Most Recent

Default