Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Mr. Bachchan (2024)




చిత్రం: మిస్టర్ బచ్చన్ (2024)
సంగీతం: మిక్కీ జే మేయర్ 
నటీనటులు: రవితేజా, భాగ్యశ్రీ బోర్సే, జగపతిబాబు 
దర్శకత్వం: హరీష్ శంకర్
నిర్మాత: టి. జి. విశ్వప్రసాద్ 
విడుదల తేది: 15.08.2024



Songs List:



సితార్ పాట సాహిత్యం

 
చిత్రం: మిస్టర్ బచ్చన్ (2024)
సంగీతం: మిక్కీ జే మేయర్ 
సాహిత్యం: సాహితి 
గానం: కొమండూరి సమీరా, శ్రీరామ్ భరద్వాజ్ 

చిట్టిగువ్వ పిట్టలాంటి చక్కనమ్మ
బొట్టు పెట్టి పట్టుచీర కట్టుకోమ్మా
జట్టుకట్టి చుట్టమల్లే చుట్టుకోమ్మా
గుట్టుగున్న పుట్టుమచ్చ ఎక్కడమ్మా

చిట్టిగువ్వ పిట్టలాంటి చక్కనమ్మ
బొట్టు పెట్టి పట్టుచీర కట్టుకోమ్మా
జట్టుకట్టి చుట్టమల్లే చుట్టుకోమ్మా
గుట్టుగున్న పుట్టుమచ్చ ఎక్కడమ్మా

నువ్వు చేసే ఆగాలన్నీ నచ్చేసా
కానీ కొంచెం ఆగాలంటూ చెప్పేసా

నువు చెప్పేలోగా రానే వచ్చేసా
హే హే

నిగనిగ పెదవుల్లో
మోహాలన్నీ తడిపెయ్‍నా
కసికసి ఒంపుల్లో
కాలాలన్నీ గడియ్‍నా

పరువపు సంద్రాల
లోతుల్లోనా మునకెయ్‍నా
పదనిస రాగాల
మేఘాలన్నీ తాకెయ్‍నా

ఆకుపోక చూపనా
ఆశ నీలో రేపనా

గాలే గోలే చేసే తీరానా
నీ కుచ్చిలి మార్చి
ముచ్చట తీర్చెయ్‍నా హే హే

సొగసరి దొంగల్లె
సాయంకాలం వచ్చెయ్‍నా
బిగుసరి పరువంతో
పిల్లో యుద్ధం చేసెయ్‍నా

వలపుల వేగంతో
వయ్యారాలే వాటెయ్‍నా
తలపుల తాపంతో
దాహాలన్నీ దాటెయ్‍నా

నీలాకాశం నీడన
విడిగా నన్నీ వేదన

నీలో నాలో రాగం పాడేనా
తొలి పులకింతిచ్చే పూచి నాదేగా హే హే




రెప్పల్ డప్పుల్ పాట సాహిత్యం

 
చిత్రం: మిస్టర్ బచ్చన్ (2024)
సంగీతం: మిక్కీ జే మేయర్ 
సాహిత్యం: కాసర్ల శ్యామ్ 
గానం: అనురాగ్ కులకర్ణి, మంగ్లీ 

ఓ బొమ్మ సోకులో
బొంబాయి జాతరే
బచ్చన్ గొంతులోన బప్పీలహరే

ఉస్కో అని అంటే చాలు
డిస్కోల మోతరే
తెల్లార్లు చల్లారని గాన కచేరే

తెలుగు తమిళ హిందీ
వలపు జుగల్‌ బందీ
తకిట తకిట తకిట తకిట
చెమట బొట్టు తాళమేస్తదే ఏ ఏ ఏ

రెప్పల్ డప్పుల్ల సప్పుల్లు కొట్టాలిలే
నా గాజు ఓ గజలే పాడాలిలే
కిర్రంటూ మంచాల కోరస్సులే
ప్రేక్షకులు మల్లెపూలే

వన్సు మోరు మోరు మోరు
మోరు మోరు మోరు
మూసెయ్ డోరు డోరు డోరు
డోరు డోరు డోరు

ముద్దుల్ పెడుతుంటే
మైకెట్టి మూడు ఊళ్లే
తొలి కోడి కూయాలిలే

ఏ బొమ్మ సోకులో
బొంబాయి జాతరే
బచ్చన్ గొంతులోన బప్పీలహరే

ఆ ఎర్రా ఎర్రా సెంపళ్ళల్లా
ఆ సిగ్గుమొగ్గలేసెనేందే శిలకా

నల్లా నల్లా సూపులల్లా
దాసిపెట్టినావు గనక సురక

ఆ నడుమొంపుల్లోన గిచ్చుతుంటే
వేళ్ళకొచ్చే సరిగమలేనా
సందమామ కింద
చాప దిండు దందా
ఝనక్ ఝనక్ ఝనక్ ఝనక్
పట్ట గొలుసు నట్టువాంగమే ఏ ఏ ఏ

రెప్పల్ డప్పుల్ల సప్పుల్లు కొట్టాలిలే
నా గాజు ఓ గజలే పాడాలిలే
కిర్రంటూ మంచాల కోరస్సులే
ప్రేక్షకులు మల్లెపూలే

వన్సు మోరు మోరు మోరు
మోరు మోరు మోరు
మూసెయ్ డోరు డోరు డోరు
డోరు డోరు డోరు

ముద్దుల్ పెడుతుంటే
మైకెట్టి మూడు ఊళ్లే
తొలి కోడి కూయాలిలే

ఏ బొమ్మ సోకులో
బొంబాయి జాతరే
బచ్చన్ గొంతులోన బప్పీలహరే

ఆ ఆ సీరాకొంగు అంచు సివర
నా పాణమట్ట మోసుకెల్తే ఎట్టా

సేతుల్లోనా సుట్టుకున్నా
ఈ లోకమంటే నాకు నువ్వేనంటా

ఆ నడి ఎండల్లోనా
వయసులున్న ఐస్ పుల్లై కరిగిపోనా

వేడి సల్లగుండా
మోయగా వరంగా
హత్తుకోని ఎత్తుకోవే
ఆశాభోస్లే మత్తు రాగమే ఏ ఏ ఏ

రెప్పల్ డప్పుల్ల సప్పుల్లు కొట్టాలిలే
నా గాజు ఓ గజలే పాడాలిలే
కిర్రంటూ మంచాల కోరస్సులే
ప్రేక్షకులు మల్లెపూలే

వన్సు మోరు మోరు మోరు
మోరు మోరు మోరు
మూసెయ్ డోరు డోరు డోరు
డోరు డోరు డోరు

ముద్దుల్ పెడుతుంటే
మైకెట్టి మూడు ఊళ్లే
తొలి కోడి కూయాలిలే

ఏ బొమ్మ సోకులో
బొంబాయి జాతరే
బచ్చన్ గొంతులోన బప్పీలహరే ఏ ఏ ఏ



జిక్కి పాట సాహిత్యం

 
చిత్రం: మిస్టర్ బచ్చన్ (2024)
సంగీతం: మిక్కీ జే మేయర్ 
సాహిత్యం: వనమాలి 
గానం: కార్తీక్, రమ్యా బెహ్రా 

అల్లరిగా అల్లికగా
అల్లేసిందే నన్నే అలవోగ్గా
ఓ లలనా నీ వలనా
మోగిందమ్మో నాలో థిల్లానా

నిన్ను చూసి గుండె ఒట్టుపెట్టుకున్నదే
గట్టు దాటి గట్టిగానే కొట్టుకున్నదే
పట్టుబట్టి పిల్ల చెయ్యి పట్టుకున్నదే
అగ్గి రాజేశాక ఆగేదెట్టాగే

ఆ నా మనసే నీకే చిక్కి
దిగనందే మబ్బుల్నెక్కి
నీ బొమ్మే చెక్కి
రోజు నిన్నే పూజించానే జిక్కి ఆ ఆ

చెబుతున్న నేనే నొక్కి
పరిచయమే పట్టాలెక్కి
నీ ప్రేమే దక్కి జంటై పోతే
ఎవరున్నారే నీకన్నా లక్కీ

నిన్ను చూసి గుండె ఒట్టుపెట్టుకున్నదే
అగ్గి రాజేశాక ఆగేదెట్టాగే

నా దడవును తెంపే నడుమొంపే
నిలువెల్లా చంపే
మధువులు నింపే
పెదవంపే ముంచిందే కొంపే

తలగడలెరుగని తలపుల సొదలకు
తలపడుతున్నా నిద్దురతో
తహ తహలెరిగిన తమకపు
తనువును తడిపెయ్ నువ్వే ముద్దులతో

వింటున్నా నీ గాత్రం
ఏంటంటా నీ ఆత్రం
చూస్తున ఈ చిత్రం
గోలేనా నీ గోత్రం

సాగేనా నీ తంత్రం
పారెనా నీ మంత్రం
కాదనకే నన్నింకేమాత్రం

నిన్ను చూసి గుండె ఒట్టుపెట్టుకున్నదే
గట్టు దాటి గట్టిగానే కొట్టుకున్నదే
పట్టుబట్టి పిల్ల చెయ్యి పట్టుకున్నదే
అగ్గి రాజేశాక ఆగేదెట్టాగే

నా వలపుల కుప్పా నువ్విప్ప
ముద్దిస్తే ముప్పా
అలకలు తప్పా ఎంగొప్ప
చనువిస్తే తప్పా

సరసకు చేరిన సరసపు సెగలకు
సతమతమవుతూ ఉన్నానే
గురుతులు చెరగని గడసరి మనసున
గుస గుసలెన్నో విన్నానే

నీ మనసే కావ్యంగా
నీ మాటే శ్రావ్యంగా
నీ తీరే నవ్యంగా
బాగుందోయ్ భవ్యంగా

నువ్వుంటే సవ్యంగా
అవునంటా దివ్యంగా
పెట్టొద్దే నన్నే దూరంగా దూరంగా

నిన్ను చూసి గుండె ఒట్టుపెట్టుకున్నదే
గట్టు దాటి గట్టిగానే కొట్టుకున్నదే
పట్టుబట్టి పిల్ల చెయ్యి పట్టుకున్నదే
అగ్గి రాజేశాక ఆగేదెట్టాగే 

No comments

Most Recent

Default