చిత్రం: శ్రీ సీతారాముల కళ్యాణం చూతము రారండీ (1998)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి (All)
నటీనటులు: అక్కినేని నాగేశ్వరరావు, వెంకట్, చాందిని
దర్శకత్వం: వై. వి.యస్. చౌదరి
నిర్మాత: అక్కినేని నాగార్జున
విడుదల తేది: 05.02.1998
Songs List:
ఏవమ్మా వైన వమ్మా పాట సాహిత్యం
చిత్రం: శ్రీ సీతారాముల కళ్యాణం చూతము రారండీ (1998)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్.పి.బాలు, చిత్ర, సునీత, విజయలక్ష్మి
పల్లవి:
ఏవమ్మా వైన వమ్మా !
ఏం వున్నా నాకు చెప్పమ్మా
అసలే ఈ గదిలో ఒంటరిగా ఉన్నావు
అయినా ఎవ్వరితో ఊసులాడుతున్నావు
వామ్మో ! ఏవైనా గాలిగాని సోకిందా !
పల్లవి:
పోవమ్మా చాలు లేవమ్మా
ఊరికినే వెంట పడకమ్మా
ఎప్పుడూ నావెంటే తోక లాగ వుంటావు
నేనేమి చేస్తున్నా తొంగి తొంగి చూస్తావు
పైగా ఇప్పుడేమో లేని పోని వంటావా
చరణం: 1
పరాకు పెరిగిందా పలకవేమె చిలకమ్మా
వివేటు పిలవొచ్చా నవగతే ఎలాగమ్మా
అద్దం ముందు వున్నది నువ్వే అంత సిగ్గు ఎందుకో కోయమ్మా
పక్కకొచ్చి చక్కిలిగింత లెన్నో పెట్ట లేదా నువు చెప్పమ్మా
ఉలుకు ఏంటమ్మా! పులకరింతమ్మా !
కులుకులేంటమ్మా ! ఉన్నవేనమ్మా !
అయిన వాళ్ళు ఇందరు వుండగ ఇంక తమరి బెంగ ఎందుకు
తలుపు వైపు దొంగ చూపు లెవరి కోసమేంటి సంగతి చెప్పమ్మా
చరణం: 2
చలేసి చేస్తున్నాం నీకు చెమటలేంటమ్మా
నీకేమి జ్వరమో అది నాకు లేదులేవమ్మా
పక్కనున్న మమ్మల్ని ఒదిలి మనసు ఎక్కడ సందమ్మా
కళ్ళజోడు పెట్టుకుని చూడు మెల్లకన్ను గల వదినమ్మా
తప్పుకోకమ్మా ! తగులుకోకమ్మా !
ఒప్పుకోవమ్మా ! ఒదిలి పెట్టమ్మా !
ఒక్కపూట గడవలేదు కట్నాల సంగతి తేల లేదు
పెళ్ళి చూపులైన వెంటనే అంత తొందర పనికి రాదు లేవమ్మా
పల్లవి:
ఓ హో హో ! ఊరుకోవమ్మా
ఉడికించే గోల చాలమ్మా
చెబుదామనుకున్నా ఒప్పుకోని సిగ్గమ్మా
ఎప్పుడో మీక్కూడా జరిగివున్న దేనమ్మా
వివరాలెందుకులే గుచ్చి అడగరాదమ్మా
ఓ ప్రేమా... ఓ ప్రేమా... పాట సాహిత్యం
చిత్రం: శ్రీ సీతారాముల కళ్యాణం చూతము రారండీ (1998)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్.పి.బాలు, సునీత, విజయలక్ష్మి
హరికథ:
రామనామమే ప్రాణముగా
ఆరావణ వనమున సీతమ్మా
సీతాస్మరణమే శ్వాసగా
సంద్రానికి ఈ వల రామయ్యా
ఇరువురి దూరము కరిగించగ
ఆ విరహమే వారధిగా మారెనుగా
పల్లవి:
ఓ ప్రేమా... ఓ ప్రేమా...
ఏనాడూ వాడని వనమా
ఏనాడూ తీరని ఋణమా
ఏనాడూ వీడని నీడ నీవే ప్రేమా
కాలానికి ఓడని బలమా
కలహానికి లొంగని గుణమా
నాపోరాటానికి తోడు నీవే ప్రేమా !
చరణం: 1
నీవు కలవని నమ్మినిలిచిన నన్నే చూడమ్మా
వీవిలువే చాటించుమా
నీవు గెలవని పోరులేదని సాక్ష్యం చెప్పమ్మా
రావమ్మా ఓ ప్రణయమా
మాయని మమతల కావ్యము నీవని చాటిన ఆలయమా
దీవెనలీయవ జానకి రాముల కళ్యాణమా
పల్లవి 2:
ఓ ప్రేమా ఓ ప్రేమా
నా ఆలాపనలో స్వరమా
నా ఆరాధనలో వరమా
నా ఆవేదన విని జాలి పడిరావమ్మా
నా ఆలోచనలో భయమా
నా ఆల అయిదో తనమా
నా ఆయువు నిలిపే అమృతం నీవమ్మా
చరణం 2:
నిన్ను కలవగ కన్నె కలువకి దారే లేదమ్మా
విన్నావా నా చంద్రమా
జాలి తలవని జ్వాలలో పడి కాలిన కలనమ్మా
చూశావా నా ప్రాణమా
తీయని పాటకి పల్లవి పాడిన చల్లని స్నేహితమా
కోయిల గొంతును కోసిన మంచును కరిగించుమా
ఏ దేశమేగినా ఎందుకాలిడినా పాట సాహిత్యం
చిత్రం: శ్రీ సీతారాముల కళ్యాణం చూతము రారండీ (1998)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: సురేష్ పీటర్
పల్లవి :
ఏ దేశమేగినా ఎందుకాలిడినా
ఏపీఠమెక్కినా ఎవ్వరేమనినా
పొగడరా నీ మాతృభూమి భారతిని
We Love India
where ever we are
We ove India
She is the Mother
We ove India
చరణం: 1
అలజడులెదురొస్తే కదలని ఎవరెస్టె
నిలిచిన దేశంలో మా పుణ్యం పుట్టింది.
అలల గ తలలెత్తే కలతలు కవ్విస్తే
చెదరు సంద్రంలా మా ధర్మం మిగిలింది
ప్రతి ||తికాలం ముందర తల వంచి,
శిధిల లైనిన్నటి కథగా మారింది.
మన శం కాలాలన్ని ఎదిరించి
కలకాలం నిలిచే వుంటుంది
Tell he brother where is that great nation
మేరే తన్ హిందూస్తాన్
చరణం: 2
బ్రత కును అందించే అమ్మా నాన్నల్ని
కనబకు దైవాలే అనుకుంటూ పూజిస్తాం
మన ని బంధించే మమతల మంత్రంతో
మనముల గుండెల్లో రాజ్యాలే పాలిస్తాం
సహవన్నే బ్రహ్మాస్త్రంగా భావిస్తాం
శరణ, టి శత్రువునైనా ప్రేమిస్తాం
మతముంటే మంచిని పెంచే సిద్ధాంతం
అట్ను అంతా పయనిద్దాం
Telline brother who gave us this notion
Than is again Hindustan
రామాయణ సారం పాట సాహిత్యం
చిత్రం: శ్రీ సీతారాముల కళ్యాణం చూతము రారండీ (1998)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: సునీత
కొడుకుగ, అన్నగ, భర్తగ, రాజుగ
బాధ్యతలెరిగిన పురుషుని చరితం
అగ్ని సైతమూ శిరసొంచే సదుణ తేజానికి సాక్ష్యం
చూపిన సాధ్వీ కథనం
భక్తి శ్రద్ధలతో ధర్మానికి అంకితమయ్యే సేవా భావం
బంటుని సైతం భగవంతునిగా పెంచిన సుందర కావ్యం
జగమును శాసించే ఘనులైనా అహమును గెలువని వారైతే పతనం
తప్పదనే గుణపాఠం
ఇదే ఇదే రామాయణ సారం
భారత సంస్కృతికిది ఆధారం
నీ ఊహల్లో ఏకాంతం పాట సాహిత్యం
చిత్రం: శ్రీ సీతారాముల కళ్యాణం చూతము రారండీ (1998)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యమ్.యమ్.కీరవాణి, సురేష్ పీటర్, సునీత
పల్లవి:
నీ ఊహల్లో ఏకాంతం నేనంటూ లేనందీ ఏది ఎటు,
నా ప్రాణం ఏమైంది అనే ఈ దేహన్ని ఎట్టా మోసేద
మైలవ్ ... నీతోనే వుండాలి లేకుంటే పోవాలి
నా ప్రాణం ఏమైంది అనే ఈ దేహాన్ని ఎట్టా మోసేది
మైలవ్ ... నీతోనే వుండాలి లేకుంటే పోవాలి
ఓ మైలవ్....నీ ఊసును తెచ్చేగాలి నా ఊపిరిగా సూరాలి
లేదా అర్థం లేని వాక్యం లాంటి నన్నే చెరిపెయ్యాలి
పల్లవి: 2
నీ ఊహల్లో ఏకాంతం నేనంటి నువ్వంది నాలో ప్రాణం
నీరూపం పొందింది శరీరం మాత్రమే ఇలా మిగిలింది
మైలవ్ .... ఆ ప్రాణం ఈ దేహం ఒకటయ్యే తీరాలి
ఓ మైలవ్ ...ఈ విరహంలో వడగాలి మన దూరం కరిగించాలి
లేదా కరగని కలగా నాకన్నుల్లో నువ్వే కొలువుండాలి
పల్లవి: 3
నీ ఊహల్లో ఏకాంతం నువ్వున్నట్టే వుంది కాలం దూరం
ఏనాడు రాలేని ఓ లోకం సృష్టించి మనకే ఇచ్చింది.
మైలవ్ .... ప్రేమంటూ ఓ మాట ఏ భాషలో ఉన్నా
ఓ మైలవ్ ... ఆ మాటకి నువ్వూ నేను రెండక్షరము గా ఉన్నాం
కనుకే నిన్ను నన్ను కలిపే లోకం ప్రేమ అని చదవాలి
బంటు రీతి కొలువు పాట సాహిత్యం
చిత్రం: శ్రీ సీతారాముల కళ్యాణం చూతము రారండీ (1998)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్.పి. బాలు
పల్లవి :
బంటు రీతి కొలువు ఈయవయ్యా రామా
చరణం: 1
మేనమామవని సిరులొలుకు మేని ఛాయల
కన్నె పిల్లకు తండ్రివని దైవమని
ముచ్చట పడి నేనొచ్చా కాబట్టి
చిన్న తనమున ఈ ముంగిటను నేను నేర్చిన
పాటలన్నీ గత స్మృతులై లయజతులై
అనుబంధాలకి అద్దం పడుతుంటే
చరణం: 2
చూపుకు లేనిది చుట్టరికం ప్రేమకు లేనిది దాపరికం
రమ్మనుటో, పొమ్మనుటో కాయో, పండో
తేలే తరుణంలో
అమ్మపుట్టిల్లు మీకెరుక, ప్రేమ పుట్టిల్లు నాకెరుక
ఎవరేమీ అనుకున్నా ఎన్నటికైనా
సత్యం గెలిచేలా బంటు రీతి కొలువుతీయవయ్యా మామా
ఓం... అని పాట సాహిత్యం
చిత్రం: శ్రీ సీతారాముల కళ్యాణం చూతము రారండీ (1998)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్.పి. బాలు, సునీత
పల్లవి :
ఓం... అని ఓం... అని
మొదలవుతూ వుంది. అనురాగపు తొలి గమకం
మదినే మీటిండి కాలి తాకిడిలో తమకం
ప్రణయ మంత్రికి ఇది ప్రణవం
మౌనమే గానమును సమయం
చరణం: 1
వరదై ఉరికే వరుసు పరుగులో
అలలై ఎగసే మనసు మడుగులో
కలలకు అందని కలవరముందని తెలిసిన నిముషములో
చరణం: 2
చినుకై తడిమే కొనలతో
మెరుపై తరిమే డికనులతో
తొలకరి ఆశల ఆదీసిన ఊసులు చేసిన అల్లరిలో
హాయ్ రబ్బా పాట సాహిత్యం
చిత్రం: శ్రీ సీతారాముల కళ్యాణం చూతము రారండీ (1998)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: సిరివెన్నెల, పి.కె. మిశ్రా
గానం: చిత్ర, రాధిక
సాకీ:
ఝుంకా మేరి లోకో చూమె కాజల్ అగ్గాయె
చమ్ చమ్ చమ్ పాయల్బలే నిందియా ఉడ్ ఉడ్
జాయే
మెహింది కా రం వీకాలాగే చూడియా చుటే చుజాయే
బిందియా క్యోం మ హోష్ కరే ఏ కొయీ ముజే బతాయే
పల్లవి:
హాయ్ రబ్బా ఈ చెందటే వయసిట్టా పొంగిపోయి
ఆయీ జవానీ ఆట జవానీ హోయ్ హోయ్ హోయ్
హయ్ రబ్బా వుందిలే షాదీ మడియెదురాయి
ఆయీ జవానీ అయి జవానీ హోయ్ హోయ్ హోయ్
చరణం: 1
చెప్పమ్మా డాక్టర్ జోడి కడతావా
నాబాబాన నారే వాన
క్యోం బాబా క్యోం క్యోంరే బాబా క్యోం
పేషంట్ల పిలుపొస్తే అతగాడు
పెళ్ళాన్ని విదిలించి పోతాడు.
పోనీలే డ్రైవర్ తో సర్దుకు పోతావా
తోబా తోబా తోబా తోబా
క్యోంరె తోబా బోలో బాబా
ఆలి అంటే లారీ అనుకుంటాడు ప్రతిసారి బ్రేకేస్తు వుంటాడు
సినిమా డైరక్టర్ ని పతిగా తెమ్మంటావా
ఆమ్మో ! ఇది అన్నింటి కన్నా పెద్ద గొడవ
జసా క్యోం బేటి బోలోనా బేబీ బోల్ బోల్ బోల్
హీరోయిన్స్ సరాగాలు యింటికొచ్చి బీబీతో కలహాలు
పల్లవి :
హాయ్ రబ్బా మైక్యా కరూం ఇంకెవర్నీ తీసుకు రాను
ఆయీ జవానీ ఆయి జవానీ హోయ్ హోయ్ హోయ్
చరణం: 2
ఇంచక్కా ఏ కర్కైనా ఓకేనా నీకు
నా బాబాన నారే బాబాన
క్యోం బావా క్యోం క్యోంరే బాబా క్యోం
ఆ గొర్రె తోకంతా జీతంతో సంసారం సాఫీగా సాగొద్దాం
బిజినెస్ మేన్ సంబంధం తీసుకు వచ్చేదా
దయ్యా దయ్యా నారె దయ్యా
క్యోంరే దయ్యా క్యోం, దయ్యా
రాత్రంతా బెడ్రూంలో శ్రీవారు
అకౌంట్లు తిరిగేస్తూ వుంటారు..
పరదేశమున ఉన్నాడు వరుడై ఓకేనా
ఫారిన్లో పనా
ఇక్కడా ఫీసర్నని కోస్తాడు. అక్కడ వీధులూడూస్తాడు. చీ
ఛీ ఛీ అలా అనొద్దు బేటీ
పనేదైనా మనీ తెచ్చి పోషించే ఆ పరదేశి సుఖదాయి
పరదేశి సుఖదాయి
పరదేశి సుఖచాయి
ఏవమ్మా కంప్యూటరమ్మా పాట సాహిత్యం
చిత్రం: శ్రీ సీతారాముల కళ్యాణం చూతము రారండీ (1998)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: మనో, యమ్.యమ్.కీరవాణి, సునీత, సుజాత
పల్లవి:
ఏవమ్మా కంప్యూటరమ్మా
తేల్చి నువ్వు చెప్పాలమ్మా
శివరంజని తెలివిని కొలిచి
జనరంజని చురుడుతో పోల్చి
చివరికెవరు గెలిచనవారో చక్కగా లెక్కలు వెయ్యాలమ్మా
చరణం: 1
పుట్టుక యిచ్చిన చుట్టరికాలను మించిన బంధం స్నేహం
తన కన్నా నిను అధికంగా అభిమానించడమే స్నేహం
అమృతమైనా విషముగ మార్చే చెప్పుడు మాటలే ద్రోహం
సమ్మాకాన్ని నట్టేట ముంచేటి వంచన పేరే ద్రోహం
పల్లవి: ఏవమ్మా కంప్యూటరమ్మా
ఎంత వరకు తేల్చావమ్మా
చరణం: 2
ఎంత చదివినా అంతే వుండని వింత కధే ఈ జీవితం
ఎవ్వరి నిర్వచనాలకు లొంగని విచిత్రమైనది జీవితం
ఆమె అతడు ఇద్దరికే చోటుండే లోకం ప్రేమ
కాలం దూరం ఎన్నడు చేరని మరో ప్రపంచం ప్రేమ
ఒకరి శ్వాస ఇంకొకరి బ్రతుకుగ నడిపించేదే ప్రేమ
అనుభవమైతే గాని తెలియని అద్భుత భావం ప్రేమ
శుక్లాం భరధరం విష్ణుం పాట సాహిత్యం
చిత్రం: శ్రీ సీతారాముల కళ్యాణం చూతము రారండీ (1998)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: Treditional
గానం: సునీత
శుక్లాం భరధరం విష్ణుం
శశివర్ణం చతుర్భుజం
ప్రసన్న వదనం ధ్యాయేత్
సర్వవిఘ్నోపశాంతయే
ఎవరూ చూడని ఏకాంతంలో పాట సాహిత్యం
చిత్రం: శ్రీ సీతారాముల కళ్యాణం చూతము రారండీ (1998)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యమ్.యమ్.కీరవాణి, చిత్ర
పల్లవి:
ఎవరూ చూడని ఏకాంతంలో
ఎవరూ చేరని ఈ సమయంలో
రసవేదమై రవళించనీ ఎదలో లయ
జతలీలలో శృతి మించనీ కరిగే క్రియా
ప్రియా ప్రియా ప్రియా ప్రియా
చరణం: 1
విడువకు విడిగా అనే కదా నిను వేడుతోంది. ప్రాయం
నీ ఎదనడిగా ఆయా కదా అని పాడుతోంది ప్రాణం
ఒట్టేసి మళ్ళీ .. ఆ మాటే చెప్పవా
నువ్వే లేక నేనన్నాళ్ళు ఉన్నానన్న మాటే నాకు
నమ్మాలంటే కష్టంగా వుంది.
నువ్వంటూ నాక్కనిపించాక నాలోనేనే లేనే అన్న
సత్యం ఎంతో ఇష్టంగా వుంది
చరణం: 2
కదలని శిలగా అవాలిగా మన వైపు చూస్తే లోకం
కరగని కలగా అయిందిగా మనమేలుతున్న కాలం
ఇలా ఇద్దరం ,
అయి పోదాం ఒక్కరం
ఎండా కాలం, వానాకాలం, శీతాకాలం ఏవీతాని
కారాగారం కానీ కౌగిలి
నవ్వేవాళ్ళు ఏడ్చేవాళ్ళు వాళ్ళూ వీళ్ళూ అంతా చేరి
నువ్వూ నేనే అవుదాం నెచ్చెలి
Story Theme (Instrumental)
Story Theme