Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Vijay Sethupathi"
Sir Madam (2025)
Image Source Link


చిత్రం: సార్ మేడమ్ (2025)
సంగీతం: సంతోష్ నారాయణన్ 
నటీనటులు: మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి , నిత్యా మీనన్
దర్శకత్వం: పాండిరాజ్
నిర్మాతలు: సెంథిల్ త్యాగ‌రాజ‌న్, అర్జున్ త్యాగ‌రాజ‌న్
విడుదల తేది:  01.08.2025



Songs List:



మిఠాయి పొట్ల‌మే పాట సాహిత్యం

 
చిత్రం: సార్ మేడమ్ (2025)
సంగీతం: సంతోష్ నారాయణన్ 
సాహిత్యం: రాంబాబు గోసాల
గానం:  శ్రీధర్ రమేష్, పవిత్ర చారి

లేలే లేలే లేలే లేలే
లే లే లే లే లే లే లే
లేలే లేలే లేలే లేలే

రావే నా మిఠాయి పొట్లంవే
సొట్ట బుగ్గల రత్నంవే
నువ్వు కుంకుమ పువ్వై నవ్వుతున్నావే

నువ్వే నా చంద్రుడవయ్యావే
పండు వెన్నెల తెచ్చావే
నన్ను కౌగలించి నిద్దుర పుచ్చావే

ఊరే కనలేదే పిల్ల నీలంటాందాన్నే
తీరే మారిందే పిల్ల దోచేయ్ హృదయాన్నే
జోడి కట్టేసి ఇలా నీతో ఉంటాలే
కోటి చుక్కలు ఇలా కళ్ళముందు కొచ్చి వాలాయే

బుజ్జికన్నా బుంగమూతి బుజ్జికన్నా
నిన్ను బుజ్జగించికోనా, ఇంకా నిన్ను వదిలి పోలేనే
అయ్యో ఎంతటి అందం నీపై ఉందిలే ఇష్టం
ఆశే కొంచెం కొంచెం పుట్టేనే పుట్టేనే

ముద్దుకు ఎందుకు దూరం
దగ్గరగా వస్తే మధురం
దూకేయ్ నువ్విక్షణం
మోమాటం ఇక చాల్లే

అరే ఆడయ్యా

వెలకడితే మాటే కోటి
అట్టా కన్నుకొడితే
నీకెవ్వరు సాటి
తూట దిగిపోయేలా కన్లే గురిపెట్టాలా
వామ్మో ఇక నీవల్ల వలలో పడి ఉండాలా

పచ్చ తమలపాకు, నా పసిడి వన్నెల సూపు
నన్ను కొత్త కొత్తగా కెలుకు
కొంటే కోరికతోటి తాకు హేయ్

ఏమిటే సిత్తరమే గుండెకే దగ్గరవే
చెప్పవే జట్టుగా నీతో జంటవుతానే

నువ్వు నా బంగారమే నేను నీ మందారమే
రెచ్చిపో ముద్దుగా సామీలా పూజించుతాలే
బుజ్జికన్నా నువ్వు నా బుజ్జికన్నా
చుట్టూ నీవే బుజ్జికన్నా
ఇంకో జన్మ నేనున్నా నీతోనే

బుజ్జికన్నా బుంగమూతి బుజ్జికన్నా
నిన్ను బుజ్జగించికోనా, ఇంకా నిన్ను వదిలి పోలేనే

లే లే లే లే లే లే లే
లేలే లేలే లేలే లేలే
లే లే లే లే లే లే లే
లేలే లేలే లేలే లేలే

గుండెలోన నిన్నే దాచిందమ్మో ప్రాణం
వందేళ్లు నీతో విడిపోనంది బంధం
గుండెలోన నిన్నే దాచిందమ్మో ప్రాణం
వందేళ్లు నీతో విడిపోనంది బంధం

బుజ్జికన్నా బుంగమూతి బుజ్జికన్నా
నిన్ను బుజ్జగించికోనా, ఇంకా నిన్ను వదిలి పోలేనే

లే లే లే లే లే లే లే
లేలే లేలే లేలే లేలే

Palli Balakrishna Tuesday, April 7, 2026
Kanulu Kanulanu Dochayante (2020)
చిత్రం: కనులు కనులను దొచాయటే (2020)
సంగీతం: మసాలా కాఫీ బ్యాండ్
నటీనటులు: దుల్కర్ సల్మాన్, రీతు వర్మ, రక్షన్, నిరంజని అగతియాన్, గౌతమ్ మీనన్, విజయ్ సేతపతి
దర్శకత్వం: దేసింఘ్ పెరియా స్వామి
నిర్మాణ సంస్థలు: Viacom18
విడుదల తేది: 28.02.2020







చిత్రం: కనులు కనులను దొచాయటే (2020)
సంగీతం: మసాలా కాఫీ బ్యాండ్
సాహిత్యం: సామ్రాట్ నాయుడు
గానం: రోహిత్ పరిటాల

తొలి చూపులోనే పడిపోయానే
నా బాధను ఎవరకి చెప్పనే
నా మనసు కూడా నా మాటను
ఇప్పుడు వినడం లేదు లే
నీ కళ్ళతోనే నను ఖైదీలాగ మార్చేశావే
మనసే ఎగిరే… నింగే తగిలే
చెలివే వినవే.. నవ్వుతు ప్రాణం తీయొద్దే

గుండెగిల్లి ప్రాణం తీయొద్దే (8)

ఓ ఓ ఓ ఓ

నీవే తొలి వలపే పదవే నువ్వే వినరాదటే
తలపే నీదసలే వీడనులే నీ జతే

గుండెగిల్లి ప్రాణం తియ్యొద్దే (8)

ఒకసారి మనసు కలిశాక
నా పరుగు ఆపె వీలేది నా తరమా
ప్రతిసారి నిను కలిసినట్టు ఊహల్లొ మునకేసి
ధ్యాసే మరిసా ప్రాణం అంతా నీ వశమా
పూలలో వనమాలిగా నీ చుట్టూ తోటల్ని కట్టి
అంతగా కవ్వింతగా నే చూసెననీ

ఓ ఓ ఓ ఓ

నీదే తొలి వలపే మనవే నువ్వే 
వినరాదటే తలపే వీడెనులే
కోరగా మది కోరగా నీ చెంతనే వాలి పోయి
తోడుగా అడుగేయనా నీ వాడననీ

గుండెగిల్లి ప్రాణం తియ్యొద్దే (8)

Palli Balakrishna Friday, February 19, 2021
Master (2021)


 చిత్రం: మాస్టర్ (2021)

సంగీతం: అనిరుద్ రవిచందర్
సాహిత్యం: అనంత్ శ్రీరామ్
గానం: సామ్ విశాల్, అనిరుద్ రవిచందర్
నటీనటులు: విజయ్, విజయ్ సేతపతి
దర్శకత్వం: లోకేష్ కనగరాజ్
నిర్మాత: గ్జావియర్ బ్రిట్టో
విడుదల తేది: 13.01.2021







లెట్ మిసింగ్ ఏ చిట్టి స్టోరీ
పే అటెన్షన్ లిసెన్ టు మి
ఎందన్న ఇంగ్లీషు
జస్ట్ లిసెన్ బ్రో

లెట్ మిసింగ్ ఏ చిట్టి స్టోరీ
పే అటెన్షన్ లిసెన్ టు మి
ఇఫ్ యూ వాంట్ టేక్ ఇట్ ఆర్ ఎల్స్
వొద్దాయ్ టెన్షన్ లీవ్ ఇట్ బేబీ

లైఫ్ ఇస్ వెరీ షార్ట్ అబ్బా
ఆల్వేస్ బీ హ్యాపీ
పరి పరి ప్రాబ్లమ్స్ విల్ కం అండ్ గో
కొంచెం చిల్ మరో బాపి

టుగెదర్ మాన్

లెట్ మి సింగ్ ఏ చిట్టి స్టోరీ
పే అటెన్షన్ లిసెన్ టు మి
ఇఫ్ యూ వాంట్ టేక్ ఇట్ ఆర్ఎల్స్
వొద్దాయ్ టెన్షన్ లీవ్ ఇట్ బేబీ
లైఫ్ ఇస్ వెరీ షార్ట్ అబ్బా
ఆల్వేస్ బీ హ్యాపీ
డిజైన్ డిసైను ప్రాబ్లమ్స్ విల్ కం అండ్ గో
కొంచెం చిల్ మరో బాపి

నో టెన్షన్ బేబీ

స్పీడుగా పోతే గమనిక మష్టు
స్లోగా పోతే స్టెడీ ఏ బెస్టు
ఓ అంగెర్ ఆల్వేస్ మిసరే బేబీ
ఫ్రెండ్స్ హే చాలా పవర్ ఫుల్ మాపి
హేటర్స్ ఆర్ గొన్నాహేట్ బట్ ఇగ్నోర్ కామ్ లీ
నెగటివిటీ నంతా తన్నివేయ్ బేబీ
ఫోకస్ ఆన్ వాట్ యూ డ్రీం డోంట్ వర్రీ బాపి
పాసిటివిటీ ఉంటె లిఫ్ట్ మరి బేబీ

లైఫ్ ఇస్ వెరీ షార్ట్ అబ్బా
ఆల్వేస్ బీ హ్యాపీ
వెరీ మెనీ ప్రాబ్లమ్స్ విల్ కం అండ్ గో
కొంచెం చిల్ మరో బాపి

స్టూడెంట్స్ లెట్ మి సింగ్ ఏ చిట్టి స్టోరీ
పే అటెన్షన్ లిసెన్ టుమి
ఇఫ్ యూ వాంట్ టేక్ ఇట్ ఆర్ ఎల్స్
వొదాయ్ టెన్షన్ లీవ్ ఇట్ బేబీ

లైఫ్ ఇస్ వెరీ షార్ట్ అబ్బా
ఆల్వేస్ బీ హ్యాపీ
డిజైన్ డిసైను ప్రాబ్లమ్స్ విల్ కం అండ్ గో
కొంచెం చిల్ మరో బాపి

నో టెన్షన్ బేబీ

హార్డ్ వర్క్ ముఖ్యం స్మార్ట్ వర్కు ముఖ్యం
సెల్ఫ్ మోటివేషన్ అది నీతోనే
ఎడ్యుకేషన్ ముఖ్యం డెడికేషన్ ముఖ్యం
సెల్ఫ్ వాల్యుయేషన్ అది పక్క పోరే
డోంట్ బీ ద పర్సన్ సైడింగ్ హట్రేడ్ బాపి
వెనకాల మాట్లాడొద్దాయ్ రబ్బా కాపీ
ఆల్వేస్ బీ పోలైట్ అండ్ జస్ట్ డోంట్ బీ న్యాస్టీ
యూ విల్ బీది రీసన్ టు మేక్ సంవన్ హ్యాపీ

లైఫ్ ఇస్ వెరీ షార్ట్ అబ్బా
ఆల్వేస్ బీ హ్యాపీ
పరి పరి ప్రాబ్లమ్స్ విల్ కం అండ్ గో
కొంచెం చిల్ మరో బాపి

వన్ లాస్ట్ టైం

లెట్ మిసింగ్ ఏ చిట్టి స్టోరీ
పే అటెన్షన్ లిసెన్ టు మి
ఇఫ్ యూ వాంట్ టేక్ ఇట్ ఆర్ ఎల్స్
వొద్దాయ్ టెన్షన్ లీవ్ ఇట్ బేబీ

లైఫ్ ఇస్ వెరీ షార్ట్ అబ్బా
ఆల్వేస్ బీ హ్యాపీ
డిజైన్ డిసైను ప్రాబ్లమ్స్ విల్ కం అండ్ గో
కొంచెం చిల్ మరో బాపి
హే దట్ వస్ మై చిట్టి స్టోరీ
హౌ వస్ మై చిట్టి స్టోరీ
దట్ వస్ మై చిట్టి స్టోరీ
హౌ వస్ మై చిట్టి స్టోరీ
జస్ట్ అసోమ్ నా
నో టెన్షన్ బేబీ







చిత్రం: మాస్టర్ (2021)
సంగీతం: అనిరుద్ రవిచందర్
సాహిత్యం: కృష్ణ కాంత్
గానం: మయూక్

మనసులే కరగని లోకమే లోకమా
మనసులే కరగని లోకమే లోకమా
ఇరుకు గదులలో అరె మక్కే బతుకులే
నే తిరిగి ఎగరగా కొంచెం ఆశ కలిగేలే

వెలుగు విరిసెలే నింగి ఒళ్ళు విరిచేలే
మరి రెక్కలెగరలే గాడి తలుపు విరగలే
లేత లేత ఆ గుండెలేమో ఊపిరాగిపోయేనా
ఇక్కడున్న కాటినున్న రెండు ఒకటే ఆయేనా

కన్నీటి అంటూ పొంగితే నువ్వే తుడుచోకో ఇడా
అమ్మ నాన్న ఎవరు లేరు బాధే అనుచుకో

పోతే పోనిరా చచ్చే బతుకు మాదే
చెవినే పడవులే అరుపులీకమావే
పోతే పోనిరా చచ్చే బతుకు మాదే
కుదుటే పడవులే బతుకులిక మావే

మనసులే కరగని లోకమే లోకమా
మనసులే కరగని లోకమే లోకమా







చిత్రం: మాస్టర్ (2021)
సంగీతం: అనిరుద్ రవిచందర్
సాహిత్యం: కృష్ణ కాంత్
గానం: ఇన్నో జంగా, అనిరుద్ రవిచందర్

అందం వాడి చుపేరా లవ్వు ట్యూనే మీటేరా
తానే చెంత చేరాడా మనసంత మారేరా

తనువెలా అతడే అతడే
నిలిచే నడిచే తన కలలలోనే
మరు ముఖమురాదే
అణకువే అతడే అతడే అలలా కదిలే
తన నవ్వులోనే అరే చిందే అందాలే

పువ్వోలె మనసు ఆగున్నా వయసు 
పాపంగా చూడు గర్లే
పద్దాపు మెరుపు మారాజు నడక
క్లాస్ అయిన మాస్టర్ మాస్
పట్టాసు చూపు పడ్డదో చాలు
ఫెయిల్ అయినా ఆటు పాసు
సింగిల్ న్యూస్ ఇది మంచి చాన్సు

అందం వాడి చుపేరా లవ్వు ట్యూనే మీటేరా
తానే చెంత చేరాడా మనసంత మారేరా
అందం వాడి చుపేరా లవ్వు ట్యూనే మీటేరా
తానే చెంత చేరాడా మనసంత మారేరా

లవ్వు ట్యూనే మీటేరా

తనువెలా అతడే అతడే నిలిచే నడిచే
తన కలలలోనే మరు ముఖమురాదే
అణకువే అతడే అతడే అలలా కదిలే 
తన నవ్వులోనే అరే చిందే అందాలే

స్నేహాన్ని మేటి మాటల్ని సూటి
లెరస్సలెవ్వరు పోటీ
మాగ్నేటు చూపు వాడేంత షార్పు
ఏనాడూ మాస్టర్ టాపు
ఎదో పవరు ఎదో పొగరు
ఎప్పుడు ఉంటది చూడు
సోలోగా వస్తే ఏమౌను గర్లే

అందం వాడి చుపేరా లవ్వు ట్యూనే మీటేరా
తానే చెంత చేరాడా మనసంతమారేరా
అందం వాడి చుపేరా లవ్వు ట్యూనే మీటేరా
తానే చెంత చేరారా లవ్వు ట్యూనే మీటేరా







చిత్రం: మాస్టర్ (2021)
సంగీతం: అనిరుద్ రవిచందర్
సాహిత్యం: శ్రీ సాయి కిరణ్
గానం: గాన బాలచందర్, అనిరుద్ రవిచందర్

రేయ్ ఏంట్రా ఇది డబ్బా బీటు ఉతకరా
ఆ మజపా మజప ఇట్రా ఇట్రా ఇట్రా
రేయ్ రెడీ రండ్రా ఆ 
మాస్టర్ కమింగ్ చూడు...చూడు
మాస్టర్ కమింగ్ చూడు.. చూడు

హే అన్నే వస్తే అటంబాబు కమ్ము
పిలుపిలుపిలుపిలామి
పిలిపిలి పిలి...
పిలిపిలిపిలమి

మాస్టర్ కమింగ్ చూడు

ఏ తర్కుల ట్రిప్లు ఉట్టసల్పిలా సిల్పి పుట్ట
తోగురుల తగర ఉట్ట పగరు అగురుతాన్
శిల్పిలా సిల్పి పుట్ట శిల్పిలా ఫల్క్ పుట్ట
బిజిలీల బిల్పి ఉట్ట చటక్ చల్కుతా

ఆయో లైన్ కట్టు లైన్ కట్టు
అన్నా మొదలుపెట్టు మొదలుపెట్టు...చూడు

అన్నే వస్తే అట్ట బాబూ కమ్ము
అన్నా మొదలుపెట్టు మొదలుపెట్టు... చూడు
మాస్టర్ కమింగ్ చూడు







చిత్రం: మాస్టర్ (2021)
సంగీతం: అనిరుద్ రవిచందర్
సాహిత్యం: శ్రీ సాయి కిరణ్, మాలి
గానం: అరివు, అనిరుద్ రవిచందర్

అ ఆ ఇ ఈ రా అప్నా టైం రా
నిప్పు నవ్వుతో రైడు స్టార్టురా
అ ఆ ఇ ఈ రా అప్నా టైం రా
నిప్పు నవ్వుతో రైడు స్టార్టురా

వరల్డ్ స్టాండర్డ్ ఈ లోకల్ మాస్టరు
లైను దాటి ముట్టుకుంటే ఒక్కటిచ్చి పంపుతాడు
చట్టమున్న చోటు ఇది లైఫు మార్చే హోము
లోనకొచ్చి తప్పు చేస్తే మాస్టర్ రైడు కం

మాస్టర్ రైడు మాస్టర్ రైడు మాస్టర్ రైడు
మాస్టర్ మంచి దారి కోరుకుంటే చూపుతాడు
వచ్చి వాంటెడుగా రాంగ్ చేయకు ఒప్పుకోడు
ఇది మాస్టర్ రైడు మాస్టర్ రైడు మాస్టర్ రైడు

మాస్టర్ రైడు మాస్టర్ రైడు మాస్టర్ రైడు
వాడ్ని ముట్టుకోకు మండుతున్న హాటు రాడు
తప్పు చేయామకు వీడు చాలా చెడ్డవాడు
ఇది మాస్టర్ రైడు మాస్టర్ రైడు మాస్టర్ రైడు

ఎర్ర మిరపకాయరో కత్తిలాంటి మాటరో
టెంపర్ అయితే డేంజరో మాస్టర్ ఎవరు తలపతి
రఫు డైమండు లుక్ వైలెంటు
ఎవరది వాకింగ్ లైక్ ఏ తుఫాన్
నువ్వు గేట్లు మూయి

దే కాల్ మీ మాస్టర్ డెసిషన్స్ ఆర్ ఫాస్టర్
కలిసి కట్టుగా ఒక్కటవ్వరా పదపద
గెలుపుకెప్పుడు
ఓటమన్నదే వణకదా
తగదు మనకు భయం బెదురు పడిన క్షణం
మనకు ఉన్న బలం
మాస్టర్ రైడు కం చక్కగా మసులుకుంటూ మాట
విను కొంచెం
తిక్క గాని తన్నుకొస్తే బెత్తం అయ్యో
నో నో ఎదవ పని వార్నింగ్ స్మైలూ

అది బెటర్ సరెండర్ అవ్వు పోరా
చూచులు కొట్టి ఏరా ఎంత శబ్దం అయ్యో
ముక్కు నుండి రక్తం దెబ్బ గట్టిగానే
ఇచ్చికుంటాడు వెళ్లి చుస్కో అద్దం
గురువు గారి మాట వింటే మంచి లైఫు సెట్టు
యూస్ లెస్ పనులు చేస్తే ఉన్న పళ్ళు పట్టు

ముట్టొద్దు ముట్టొద్దు తెగబడి హద్దేది పెట్టొద్దు
కలబడి కాదంటూ వెళ్ళావో
బదులిక పక్కాగా ఇస్తాడే

నను విననంకురా గొడవలు పడకురా
తగదని చెడునిక వెతుకుతూ
పదుగురి బతుకున వెలుగును చెరిపితే వదలను
నాతోటె ఉండేటి వాళ్ళు సత్యాన్నే చెప్తూ
ఉంటారు

ఐక్యంగా జీవిస్తూ ఉంటారు
బేధాలెం లేవంటుంటారు
దేశాన్ని ప్రేమిస్తుంటారు
ఇదివరకటిలా చుమ్మా
మరి కుదరదురా చుమ్మా
ఇదివరకటిలా చుమ్మా
మరి కుదరదురా గుమ్మా

అన్న అడుగు వినబడి
చుట్టూ చూడు అలజడి
లెక్కే లేని పవర్ అది 
మాస్టర్ ఎవరు తలపతి
రఫు డైమండు లుక్ వైలెంటు
జరుగు ఇది బీస్ట్ మోడ్




Palli Balakrishna Thursday, February 18, 2021
Uppena (2021)




చిత్రం: ఉప్పెన (2021)
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
సాహిత్యం: శ్రీమణి , రకీబ్ అలమ్
గానం: జేవేద్ అలీ
నటీనటులు: వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి, విజయ్ సేతుపతి
దర్శకత్వం: బుచ్చిబాబు సాన
నిర్మాతలు: సుకుమార్, వై. రవిశంకర్, వై. నవీన్
విడుదల తేది: 12.02.2021




Songs List:





నీ కన్ను నీలి సముద్రం పాట సాహిత్యం

చిత్రం: ఉప్పెన (2021)
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
సాహిత్యం: శ్రీమణి , రకీబ్ అలమ్
గానం: జేవేద్ అలీ





ఇష్క్ షిఫాయా ఇష్క్ షిఫాయా
ఇష్క్ పర్దే మే కిసి కీ ఆంఖో మే లబ్రేజ్ హై
ఇష్క్ షిఫాయా మెహబూబ్ క సాయా
ఇష్క్ మల్ మల్ మే యః లిప్త హువా తెబ్రేజ్ హై

ఇష్క్ హై పీర్ పాయంబార్
అర్రే ఇష్క్, అలీ దమ్ మస్త్ కలందర్
ఇష్క్, హై పీర్ పాయంబార్
అర్రే ఇష్క్, అలీ దమ్ మస్త్ కలందర్
ఇష్క్, కబీ ఖత్రా హై
అర్రే ఇష్క్, కబీ హై ఏక్ సమందర్
ఇష్క్ కబీ ఖత్రా హై
అర్రే ఇష్క్, కబీ హై ఏక్ సమందర్

నీ కన్ను నీలి సముద్రం
నా మనసేమో అందుల్లో పడవ ప్రయాణం 

నీ కన్ను నీలి సముద్రం
నా మనసేమో అందుల్లో పడవ ప్రయాణం 

నీ నవ్వు ముత్యాలహారం
నన్ను తీరానికి లాగేటి దారం దారం 

నీ నవ్వు ముత్యాలహారం
నన్ను తీరానికి లాగేటి దారం దారం

నల్లనైన ముంగురులే - ముంగురులే
అల్లరేదో రేపాయిలే - రేపాయిలే
నువ్వుతప్ప నాకింకొ లోకాన్ని లేకుండా కప్పాయిలే
ఘల్లుమంటే నీ గాజులే - నీ గాజులే
ఝల్లుమంది నా ప్రాణమే - నా ప్రాణమే
అల్లుకుంది వానజల్లులా ప్రేమే...

నీ కన్ను నీలి సముద్రం
నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం

కోరస్: నీ కన్ను నీలి సముద్రం
నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం

నీ నవ్వు ముత్యాలహారం 
నన్ను తీరానికి లాగేటి దారం దారం

కోరస్: నీ నవ్వు ముత్యాలహారం 
నన్ను తీరానికి లాగేటి దారం దారం

చరణం: 1
చిన్ని ఇసుకగూడు కట్టినా... నీ పేరు రాసి పెట్టినా
దాన్ని చెరిపేటి కెరటాలు పుట్టలేదు తెలుసా...
ఆ గోరువంక పక్కన...రామ చిలుక ఎంత చక్కన
అంతకంటే చక్కనంట నువ్వుంటే నాపక్కనా.....
అప్పు అడిగానే... కొత్త కొత్త మాటలనీ
తప్పుకున్నాయే...భూమి పైన భాషలన్నీ...
చెప్ప..లే..మ..న్నా..యే అక్షరాల్లో ప్రేమనీ...

నీ కన్ను నీలి సముద్రం
నా మనసేమో అందుల్లో పడవ ప్రయాణం

కోరస్: నీ కన్ను నీలిసముద్రం
నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం

నీ నవ్వు ముత్యాలహారం
నన్ను తీరానికి లాగేటి దారం దారం

కోరస్: నీ నవ్వు ముత్యాలహారం
నన్ను తీరానికి లాగేటి దారం దారం

చరణం: 2
నీ అందమంత ఉప్పెన... నన్ను ముంచినాది చప్పున
ఎంత ముంచేసినా తేలే బంతిని నేనేననా..
చుట్టూ ఎంత చప్పుడొచ్చినా....నీ సవ్వడేదో చెప్పనా
ఎంతదాచేసినా నిన్ను జల్లడేసి పట్టనా...
నీ ఊహలే ఊపిరైన పిచ్చోడిని...
నీ ఊపిరే ప్రాణమైన పిల్లాడిని...
నీ ప్రే..మా వలలో చిక్కుకున్న చేపనీ....

ఇష్క్ హై పీర్ పాయంబార్
అర్రే ఇష్క్, అలీ దమ్ మస్త్ కలందర్
ఇష్క్ హై పీర్ పాయంబార్
అర్రే ఇష్క్, అలీ దమ్ మస్త్ కలందర్
ఇష్క్, కబీ ఖత్రా హై
అర్రే ఇష్క్, కబీ హై ఏక్ సమందర్
ఇష్క్ కబీ ఖత్రా హై
అర్రే ఇష్క్, కబీ హై ఏక్ సమందర్

ఇష్క్ షిఫాయా ఇష్క్ షిఫాయా
ఇష్క్ పర్దే మే కిసి కీ ఆంఖో మే లబ్రేజ్ హై
ఇష్క్ షిఫాయా మెహబూబ్ క సాయా
ఇష్క్ మల్ మల్ మే యః లిప్త హువా తెబ్రేజ్ హై





ధక్.. ధక్.. ధక్.. పాట సాహిత్యం

చిత్రం: ఉప్పెన (2021)
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
సాహిత్యం: చంద్రబోస్
గానం: శరత్ సంతోష్, హరిప్రియ





నువ్వు నేను ఎదురైతే ధక్.. ధక్.. ధక్..
మనసు మనసు దగ్గరయితే ధక్.. ధక్.. ధక్
ఆశలు అలలై పొంగుతుంటే ధక్.. ధక్.. ధక్
ఆకలి నిద్దుర మింగుతుంటే ధక్.. ధక్.. ధక్
ఊపిరి మొత్తం ఉప్పెనైతే ధక్..ధక్..ధక్..ధక్..ధక్

చూపుల పిలుపులు మోగుతుంటే ధక్.. ధక్.. ధక్
మాటలు గొంతులో ఆగుతుంటే ధక్.. ధక్.. ధక్
గుండెకు చెమటలు పడుతుంటే ధక్.. ధక్.. ధక్
ముందుకు వెనుకకు నెడుతుంటే ధక్.. ధక్.. ధక్
ఊపిరి మొత్తం ఉప్పెనైతే ధక్..ధక్..ధక్..ధక్..ధక్

చీటికి మాటికి గురుతోస్తే...
మిగతావన్నీ మరుపోస్తే...
కాలానికి ఇక పరుగోస్తే....
ఆలోచనలకు బరువస్తే...
ఊపిరి మొత్తం ఉప్పెనైతే ధక్..ధక్..ధక్..ధక్..ధక్




రంగులద్దుకున్నా తెల్ల రంగులౌదాం పాట సాహిత్యం

చిత్రం: ఉప్పెన (2021)
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
సాహిత్యం: శ్రీమణి
గానం: యాసిన్ నిజార్, హరిప్రియ




రంగులద్దుకున్నా తెల్ల రంగులౌదాం
పూలు కప్పుకున్నా కొమ్మలల్లే ఉందాం
ఆకు చాటుకున్నా పచ్చి పిందెలౌదాం
మట్టి లోపలున్నా జంట వేరులౌదాం

ఎవ్వరీ కంటి చూపు చేరలేని
ఎక్కడా మన జంట ఊసురాని
చోటున పద నువ్వు నేనుందాం

రంగులద్దుకున్నా తెల్ల రంగులౌదాం
పూలు కప్పుకున్నా కొమ్మలల్లే ఉందాం

తేనె పట్టులోన తీపి గుట్టు ఉందిలే
మన జట్టులోన ప్రేమ గుట్టుగుందిలే
వలలు తప్పించుకెళ్ళు మీనాల వైనాల
కొంటె కోణాలు తెలుసుకుందాం 
లోకాల చూపుల్ని ఎట్టా తప్పించుకెళ్ళాలో
కొత్త పాఠాలు నేర్చుకుందాం
అందరూ ఉన్న చోట ఇద్దరౌదాం
ఎవ్వరూ లేని చోట ఒక్క రౌదాం
ఏక్షణం విడివిడిగా లేమందాం

రంగులద్దుకున్నా తెల్ల రంగులౌదాం
పూలు కప్పుకున్నా కొమ్మలల్లే ఉందాం

మన ఊసుమోసే గాలిని మూట కడదాం
మన జాడ తెలిపే నేలనుపాతి పెడదాం
చూస్తున్న సూర్యుని తెచ్చి 
లాంతర్లో దీపాన్ని చేసి చూరుకేలాడదీద్దాం
సాక్ష్యంగా సంద్రాలు ఉంటే
దిగుడు బావిలో దాచి మూత పెడదాం
నేనిలా నీతో ఉండడం కోసం
చేయని ఈ చిన్నపాటి మోసం
నేరమేంకాదే ఇది మన కోసం

రాయిలోన శిల్పం దాగి ఉండునంటా
శిల్పి ఎదురైతే బయటపడునంటా
అద్దమెక్కడున్నా ఆవైపు వెళ్ళకంటా
నీలో ఉన్న నేనే బయటపడిపోతా
పాలలో ఉన్న నీటి బొట్టులాగా
నీళ్లలో దాగి ఉన్న మెట్టులాగా
నీనిలా నీ లోపల దాక్కుంటా

హైలెస్సా హైలెస్సా హాయ్ 
హైలెస్సా హైలెస్సా హాయ్
హైలెస్సా హైలెస్సా హాయ్
హైలెస్సా హైలెస్సా హాయ్



జల జల జలపాతం నువ్వు పాట సాహిత్యం


చిత్రం: ఉప్పెన (2021)
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
సాహిత్యం: శ్రీమణి
గానం: జస్ప్రీత్ జస్, శ్రేయా ఘోషల్



జల జల జలపాతం నువ్వు
సెల సెల సెలయేరుని నేను
సలసల నువు తాకితే నన్ను
పొంగే వరదై పోతాను

చలి చలి చలిగాలివి నువ్వు
చిరు చిరు చిరు అలనే నేను
చర చర నువ్వళ్ళితే నన్ను
ఎగసే కెరటాన్నౌతాను

హే మన జంట వైపు 
జాబిలమ్మ తొంగి చూసెనే
హే ఇటు చూడకంటు 
మబ్బు రెమ్మ దాన్ని మూసెనే

ఏ నీటి చెమ్మ తీర్చలేని దాహమేసెనే హా...

జల జల జలపాతం నువ్వు
సెల సెల సెలయేరుని నేను
సలసల నువు తాకితే నన్ను
పొంగే వరదై పోతాను

చలి చలి చలిగాలివి నువ్వు
చిరు చిరు చిరు అలనే నేను
చర చర నువ్వళ్ళితే నన్ను
ఎగసే కెరటాన్నౌతాను

సముద్రమంత ప్రేమ ముత్యమంత మనసు
ఎలాగ దాగి ఉంటుంది లోపలా
ఆకాశమంత ప్రణయం
చుక్కలాంటి హృదయం
ఇలాగ బయట పడుతోంది ఈ వేళ హా
నడి ఎడారిలాంటి ప్రాణం
తడి మేఘానితో ప్రయాణం
ఇక నా నుంచి నిన్ను
నీ నుంచి నన్ను, తెంచలేదు లోకం

జల జల జలపాతం నువ్వు
సెల సెల సెలయేరుని నేను
సలసల నువు తాకితే నన్ను
పొంగే వరదై పోతాను

ఇలాంటి తీపి రోజు రాదు రాదు రోజు
ఎలాగ వెళ్లిపోకుండా ఆపడం
ఇలాంటి వాన జల్లు తడపదంట ఒళ్ళు
ఎలాగ దీన్ని గుండెల్లో దాచడం
ఎప్పుడూ లేనిదీ ఏకాంతం
ఎక్కడా లేని ఏదో ప్రశాంతం
మరి నాలోన నువ్వు నీలోన నేను
మనకు మనమే సొంతం

జల జల జలపాతం నువ్వు
సెల సెల సెలయేరుని నేను
సలసల నువు తాకితే నన్ను
పొంగే వరదై పోతాను

చలి చలి చలిగాలివి నువ్వు
చిరు చిరు చిరు అలనే నేను
చర చర నువ్వళ్ళితే నన్ను
ఎగసే కెరటాన్నౌతాను




ఈశ్వరా పరమేశ్వరా పాట సాహిత్యం

చిత్రం: ఉప్పెన (2021)
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
సాహిత్యం: చంద్రబోస్
గానం: దేవిశ్రీ ప్రసాద్




ఈశ్వరా పరమేశ్వరా
చూడరా ఇటు చూడరా
రెండు కన్నుల మనిషి బ్రతుకును
గుండె కన్నుతో చూడరా
ఎదుట పడనీ వేదనలను
నుదుటి కన్నుతో చూడరా
ఈశ్వరా పరమేశ్వరా
చూడరా ఇటు చూడరా

దారి ఏదో, తీరమేదో
గమనమేదో, గమ్యమేదో
లేత ప్రేమల లోతు ఎంతో
లేని కన్నుతో చూడరా

చీకటేదో, వెలుతురేదో
మంచు ఏదో, మంట ఏదో
లోకమెరుగని ప్రేమకథని
లోని కన్నుతో చూడరా

ఈశ్వరా పరమేశ్వరా
చూడరా ఇటు చూడరా
ఈశ్వరా పరమేశ్వరా
చూడరా ఇటు చూడరా

నువ్వు రాసిన రాతలిచ్చట
మార్చుతూ ఏమార్చుతుంటే
నేల పైన వింతలన్నీ
నింగి కన్నుతో చూడరా

ఈశ్వరా పరమేశ్వరా
చూడరా ఇటు చూడరా
మసకబారిన కంటిపాపకి
ముసుగు తీసే వెలుగులాగ
కాలమడిగిన కఠిన ప్రశ్నకి
బదులువై ఎదురవ్వరా

ఈశ్వరా పరమేశ్వరా
చూడరా ఇటు చూడరా
ఈశ్వరా పరమేశ్వరా
చూడరా ఇటు చూడరా




సంద్రంలోన నీరంతా పాట సాహిత్యం

చిత్రం: ఉప్పెన (2021)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: దేవి శ్రీ ప్రసాద్
గానం: సీన్ రోల్డెన్




సంద్రంలోన నీరంతా కన్నీరాయేనే
గుండెల్లోనా ప్రతిమూల నీ గొంతే మోగేనే
ఉప్పు గాలి నిప్పై మారి నన్నే కాల్చేనే
ఈ సుడిగాలి నిన్నెత్తుకెళ్లి నన్నే కూల్చేనే

హే... ఏలే ఏలే ఏలే లే లే... ఏలే ఏలే లే

సంద్రంలోన నీరంతా కన్నీరాయేనే
గుండెల్లోనా ప్రతిమూల నీ గొంతే మోగేనే
ఉప్పు గాలి నిప్పై మారి నన్నే కాల్చేనే
ఈ సుడిగాలి నిన్నెత్తుకెళ్లి నన్నే కూల్చేనే

హే... ఏలే ఏలే ఏలే లే లే... ఏలే ఏలే లే

గాలిలో నీ మాటే అలలపై నీ పాటే
ఎంత గాలిస్తున్న నువ్వు లేవే
అమ్మవై ప్రతి ముద్ద తినిపించి పెంచావే
ప్రేమ కోరే ఆకలున్న నువ్వు రావే
ఎన్నో మాటలు ఇంకా నీతో చెప్పాలని
దాచుంచానే వాటికేమీ చెప్పేది
ఎన్నో రంగులు పూసేటి నీ చిరునవ్వుని
మళ్ళి నేనే ఎపుడు చూసేది
నిజమే చెప్పాలి అని నాకు చెప్పే నువ్వే
ఎన్నడు నాతో ఉంటానని అబద్దం చెప్పావే

సంద్రంలోన నీరంతా కన్నీరాయేనే
గుండెల్లోనా ప్రతిమూల నీ గొంతే మోగేనే
ఉప్పు గాలి నిప్పై మారి నన్నే కాల్చేనే
ఈ సుడిగాలి నిన్నెత్తుకెళ్లి నన్నే కూల్చేనే

హే... ఏలే ఏలే ఏలే లే లే... ఏలే ఏలే లే
హే... ఏలే ఏలే ఏలే లే లే... ఏలే ఏలే లే



నిన్నే నా నిన్నే పాట సాహిత్యం


చిత్రం: ఉప్పెన (2021)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: శ్రీమణి
గానం: సమీరా భరద్వాజ్




నిన్నే నా నిన్నే
వెతికినే నా కన్నే
నన్నే నీ నన్నే
మరిచావే నాతోనే

వస్తూ పొతున్నాడు
ప్రతిరోజు సూరీడు
నిన్నే తెస్తాడని చూస్తున్నా
వినిపించే ప్రతి మాటా
సడి చేసే ప్రతి పాటా
నీ ఊసేమోనని వింటున్నా

నిన్నే నా నిన్నే
వెతికిందే నా కన్నే
నన్నే నీ నన్నే
మరిచావే నాతోనే




యే సిలక సిలక గోరింకా పాట సాహిత్యం

చిత్రం: ఉప్పెన (2021)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: శ్రీమణి
గానం: కైలాష్ ఖేర్




యే సిలక సిలక గోరింకా
ఎగిరే ఎగిరే ఎందాక
దారి లేని నీ ఉరక
ఈ దరికా మరి ఆ దరికా

హే సినుకా సినుకా జారింక
మేఘం నీదే కాదింకా
సొంత రెక్కలు కట్టాకా
నీదారో ఎదో నీదింకా

సెలయేరుందో సుడిగాలుందో వెళ్ళే దారిలో
చిరు జల్లుందో జడివానుందో ఈ మలుపులో
ఇచ్చే పూలో గుచ్చే ముల్లో వాలే వాకిట్లో
ఎం దాగుందో ఏమో ప్రేమ నీ గుప్పిట్లో

హే సిలక సిలక గోరింకా
నీలాకాశం నీదింకా
రెక్క విప్పి ఎగురింకా
నిన్నే ఆపేదేవరింకా

యే సినుకా సినుకా జారింక
వాగు వంక నీదింకా
అలుపు సొలుపు లేదింకా
దొరికిందిగా దారింకా

సెలయేరల్లె పొంగి పొర్లే ప్రేమే సంతోషం
దాని అట్టే పెట్టు నీ గుండెల్లోనే కలకాలం
పొలిమేరలే లేనేలేని ప్రేమే నీ సొంతం
ఇక నిన్నే వీడి పోనే పోదు ఈ వసంతం

యే సిలక సిలక గోరింకా
నీలాకాశం నీదింకా
రెక్కే విప్పి ఎగురింకా
నిన్నే ఆపేదేవరింకా

హే సినుకా సినుకా జారింక
వాగు వంక నీదింకా
అలుపు సొలుపు లేదింకా
దొరికిందిగా దారింకా

యేలే లమ్మయే హా

Palli Balakrishna Sunday, November 1, 2020

Most Recent

Default