Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Tejaswi Madivada"
Rojulu Marayi (2016)





చిత్రం: రోజులు మారాయి  (2016)
సంగీతం: JB
నటీనటులు: చేతన్ మద్దినేని, తేజేశ్వి మడివాడ, కృతిక జయకుమార్ , పార్వతీశం
కథ, స్క్రీన్ ప్లే : దాసరి మారుతి
దర్శకత్వం: మురళి కృష్ణ ముదిదని
నిర్మాత: జి.శ్రీనివాస రావు 
విడుదల తేది: 01.07.2016



Songs List:



రోజులు మారాయి పాట సాహిత్యం

 
చిత్రం: రోజులు మారాయి  (2016)
సంగీతం: JB
సాహిత్యం: కిట్టు విస్సప్రాగడ 
గానం: రోహిత్, లిప్సిక

రోజులు మారాయి




నువ్వూ నేను అన్న పాట సాహిత్యం

 
చిత్రం: రోజులు మారాయి  (2016)
సంగీతం: JB
సాహిత్యం: కాసర్ల శ్యామ్ 
గానం: సురేంద్ర, నయనా నాయర్ 

నువ్వూ నేను అన్న 



ఎగిరే ఊహలకే పాట సాహిత్యం

 
చిత్రం: రోజులు మారాయి  (2016)
సంగీతం: JB
సాహిత్యం: కాసర్ల శ్యామ్ 
గానం: అనుదీప్ దేవ్, లిప్సిక 

ఎగిరే ఊహలకే 




రా రమ్మంటున్నా పాట సాహిత్యం

 
చిత్రం: రోజులు మారాయి  (2016)
సంగీతం: JB
సాహిత్యం: కాసర్ల శ్యామ్ 
గానం: హైమత్, రమ్యా బెహ్రా 

రా రమ్మంటున్నా 




వస్తున్నా ఓ నేస్తం (Revenge Song) పాట సాహిత్యం

 
చిత్రం: రోజులు మారాయి  (2016)
సంగీతం: JB
సాహిత్యం: కాసర్ల శ్యామ్ 
గానం: రాహుల్ సిప్లిగంజ్, హైమత్

వస్తున్నా ఓ నేస్తం 

Palli Balakrishna Friday, August 6, 2021
Naanna Nenu Naa Boyfriends (2016)
చిత్రం: నేను నాన్న నా బాయ్ ఫ్రెండ్స్ (2016)
సంగీతం: శేఖర్ చంద్ర
నటీనటులు: రావురమేష్, హెబపటేల్ , అశ్విన్, నోయిల్ సేన్, కేరింత నూకరాజు, తేజస్వి మదివాడ
దర్శకత్వం: భాస్కర్ బండి
నిర్మాతలు: బెక్కం వేణుగోపాల్, మానస, మహలక్ష్మి
విడుదల తేది:  16.12.2016


చిత్రం: నేను నాన్న నా బాయ్ ఫ్రెండ్స్ (2016)
సంగీతం: శేఖర్ చంద్ర
సాహిత్యం: చంద్రబోస్
గానం: ప్రకాశ్ పరిగోష్

మౌనమా ఓ మౌనమా మాటలేదుగా
పాదమా ఓ పాదమా బాటలేదుగా
తొలి ప్రేమలోని ఆటలో గెలిచావు నీవు హాయిగా
ఆ ప్రేమలేని చోటులో నిలిచావు నేడు రాయిగా

గుండె చప్పుడాగిపోతుందే
కంటినీరు పొంగిపోతుందే
కాలమిట్ట మారిపోతుందే
పారి పోతుందే చేయి జారి పోతుందే

ఆశ ఆవిరైపోతుందే
శ్వాస భారమై పోతుందే
ప్రేమ మాయమై పోతుందే
పారి పోతుందే చేయి జారి పోతుందే

వెలుగులలో నువ్వు మునకేసి
చీకటి తీరం చేరావే
చిరునవ్వే నువ్వు ఉరితీసి
బాధకు ఊపిరి పోసావే

సరదా సరదా స్వేచ్ఛను తెంచి
సంకెలలాగా మార్చావే
జతగా బ్రతికే బదులే వెతికి
జవాబు లేనట్టి ప్రశ్నల్లె మిగిలావే

గుండె చప్పుడాగిపోతుందే
కంటినీరు పొంగిపోతుందే
కాలమిట్ట మారిపోతుందే
పారి పోతుందే చేయి జారి పోతుందే

తప్పు ఉప్పెనై పోతుందే
ప్రేమ తప్పుకెళ్లి పోతుందే
తల్లకిందులై పోతుందే
ఆరి పోతుందే తెల్లారి పోతుందే

నేరమనేది నీది కదా
శిక్ష పడేది అందరికా
తప్పు అనేది నీది కదా
నొప్పి అనేది అందరికా

మూడే ముళ్ళు ప్రేమే కోరగ
మూడు ముళ్ళులతో గుచ్చావే
ఏడూ అడుగులుగా ప్రేమను మార్చగ
ప్రేమన్న పదానికి అర్ధాన్ని మార్చావే

గుండె చప్పుడాగిపోతుందే
కంటినీరు పొంగిపోతుందే
కాలమిట్ట మారిపోతుందే
పారి పోతుందే చేయి జారి

చిక్కు పెద్దదై పోతుందే
దిక్కు తోచకుండ పోతుందే
లెక్క నేడు మారిపోతుందే
తీరి పోతుందే చేయి జారి పోతుందే



Palli Balakrishna Monday, March 1, 2021
Anukshanam (2014)


చిత్రం: అనుక్షణం (2014)
సంగీతం:
నటీనటులు: మంచు విష్ణు, నవదీప్, రేవతి, మధుశాలిని, తేజేస్వి మదివాడ
దర్శకత్వం: రామ్ గోపాల్ వర్మ
నిర్మాత: మంచు విష్ణు
విడుదల తేది: 13.09.2014


Palli Balakrishna Tuesday, February 19, 2019
Kerintha (2015)

చిత్రం: కేరింత (2015)
సంగీతం: మిక్కీ జె. మేయర్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: కార్తిక్
నటీనటులు: సుమంత్ అశ్విన్, శ్రీ దివ్య, తేజస్వి మాడివాడ, సూకీర్తి, విస్వంత్ దుద్దుమ్పూడి, పార్వతీశం
కథ: అబ్బూరి రవి
దర్శకత్వం: సాయి కిరణ్ అడవి
నిర్మాత: దిల్ రాజు
సినిమాటోగ్రఫీ: విజయ్ సి. చక్రవర్తి
ఎడిటర్: మధు
బ్యానర్: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
విడుదల తేది: 12.06.2015

మిల మిల మిల మిల  మెరుపులా చెల్లాయిలా
కంటిముందు ముగ్గేసింది నీ ఆనందం
కిల కిల కిల కిల పాలనవ్వు పాపాయిలా
అంబరాన్ని ముద్దాడిన ఆనందం
ఎవరే పంపారిలా ఇటువైపుకు నిన్ను
చూస్తూ నిలబడిపోయా
మల్లెల సుడిగాలిలా నను మత్తున తోసే
ఎత్తుకుపోయే ఎద

మిల మిల మిల మిల  మెరుపులా చెల్లాయిలా
కంటిముందు ముగ్గేసింది నీ ఆనందం
కిల కిల కిల కిల పాలనవ్వు పాపాయిలా
అంబరాన్ని ముద్దాడిన ఆనందం

నల్లని పుట్టు మచ్చ దిస్టే తీసిందా
కొత్తగా అందాన్ని ఇంకొంచం పెంచిందా
పున్నమే నీపై వాలి పుణ్యం చేసిందా
తనవెలుగే మెరుగైపోగా
హృదయం నిండుగా అచ్చయ్యావుగా
తొలి తొలి చూపులో ప్రేమను పండుగ రాగా

మిల మిల మిల మిల  మెరుపులా చెల్లాయిలా
కంటిముందు ముగ్గేసింది నీ ఆనందం
కిల కిల కిల కిల పాలనవ్వు పాపాయిలా
అంబరాన్ని ముద్దాడిన ఆనందం

ఆలలా అలా అలా వచ్చావో
కలలా జోలలు పాడి ఏమైపోయావో
మరలా చెలి నిన్ను చూసేదెలాగో
నిను చేరే దారెటు ఉందో
అది తెలిపేందుకే నను పిలిచేందుకే
వదిలెల్లవుగా నీ చెవి ఝంకి నాతో

మిల మిల మిల మిల  మెరుపులా చెల్లాయిలా
కంటిముందు ముగ్గేసింది నీ ఆనందం
కిల కిల కిల కిల పాలనవ్వు పాపాయిలా
అంబరాన్ని ముద్దాడిన ఆనందం
ఎవరే పంపారిలా ఇటువైపుకు నిన్ను
చూస్తూ నిలబడిపోయా
మల్లెల సుడిగాలిలా నను మత్తున తోసే
ఎత్తుకుపోయే ఎద

మిల మిల మిల మిల  మెరుపులా చెల్లాయిలా
కంటిముందు ముగ్గేసింది నీ ఆనందం
కిల కిల కిల కిల పాలనవ్వు పాపాయిలా
అంబరాన్ని ముద్దాడిన ఆనందం


Palli Balakrishna Sunday, February 11, 2018
Balakrishnudu (2017)

చిత్రం: బాలకృష్ణుడు (2017)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: శ్రీవల్లి
గానం: అనురాగ్ కులకర్ణి, సాహితి చాగంటి
నటీనటులు: నరారోహిత్ , రెజీనా కసండ్ర
దర్శకత్వం: పవన్ మల్లెల
నిర్మాతలు:  బి.మహేంద్ర బాబు, ముసునూరి వంశీ, శ్రీ వినోద్ నందమూరి
విడుదల తేది: 2017

రెండే రెండు కళ్ళు చాలవుగా
సంద్రంలా నా గుండె కన్నీళ్లు
రెండే రెండు కళ్ళు ఆగవుగా
ఊపిరినే నలిపేసే ఎక్కిళ్ళు
ఏమని నిమిషాన్ని అడగను నేను
నువులేని ఈ సున్యాన్ని ఏమనుకోను
మనసెంతో బాగుంది ఎప్పటివరకు
చేజారిపోయింది అశేపడకు
నీ రెక్కలు నాకిచ్చి నా స్వప్నము కదిలించి
సంతోషం తెలిశాక వెలిపోగలమా
నా రెప్పల బరువు నీ ఊసులు నడుగు
నా ప్రేమకు బదులు ఈ ప్రశ్నకు తెలుసు

రెండే రెండు కళ్ళు ఎందుకనో
కన్నీళ్లే వదిలేసే నన్ను
రెండే రెండు కళ్ళు ఎందుకని
నిలదీసి నన్ను అడిగెను
ఈ దూరం నీ దూరం తెలిసేలోపు
నీ ధ్యాసతో నా శ్వాసను కలిపేశావు
బాగుందే బాగుందే ఇప్పటివరకు
ఇకపైన కనపడదు మనసే పడకు
నీ నవ్వుల అద్దంలో నను నేను చూశాక
వెలితేదో తెలిసిందే వెలిపోయాక
నువ్వులేని రేపు ఏం తోచదు నాకు
తొలిసారి నాలో ఎండమావులు

Palli Balakrishna Saturday, November 11, 2017
Subramanyam for Sale (2015)



చిత్రం: సుబ్రహ్మణ్యం ఫర్ సేల్  (2015)
సంగీతం: మిక్కీ జె మేయర్
నటీనటులు: సాయి ధరమ్ తేజ్, రెజీనా కసండ్ర, ఆదా శర్మ
దర్శకత్వం: హరీష్ శంకర్
నిర్మాత: దిల్ రాజు
విడుదల తేది: 24.09.2015



Songs List:



సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ పాట సాహిత్యం

 
చిత్రం: సుబ్రహ్మణ్యం ఫర్ సేల్  (2015)
సంగీతం: మిక్కీ జె మేయర్
సాహిత్యం: వనమాలి
గానం: రాహుల్ నంబియార్

సుబ్రహ్మణ్యం ఫర్ సేల్  




I'm in love పాట సాహిత్యం

 
చిత్రం: సుబ్రహ్మణ్యం ఫర్ సేల్  (2015)
సంగీతం: మిక్కీ జె మేయర్
సాహిత్యం: వనమాలి
గానం: ఐశ్వర్య మజ్ముదార్, ఆదిత్య అయ్యంగార్

తొలి తొలిగా తొలకరిగా తోసెను ముందుకు  తొందరలు 
కలివిడిగా కలిసెనుగా చూపుల దొంతరలు 
మనసును గట్టి మేళమే 
మనువుకు తట్టి లేపగా 
మెలకువలో కలలు కానీ మెలికలతో 
ఈ  సందల్లో సంద్రాలు నిలువెల్లముంచేస్తుంటే

నాలో ఎం జరిగిందో ఏమో ఐఎం ఇన్ లవ్ 
నాలో ఎం జరిగిందో ఏమో ఐఎం ఇన్ లవ్ 

దూరం  మాయం  కానీ ప్రాయం సాయం  రాని
నాలో  పొంగే  ప్రేమే  నీకే  సొంతం  కానీ 
మాటే  పలికే  మంత్రం 
మనసే  మంగళ  సూత్రం 
నీలో  నాలో  వయసుల  వేడే అగ్నిహోత్రం 
నీకు  నాకు  చేరువైన  ఈ  వరసలు  మారి
నీతో  సాగే  మనసు  నిన్ను  కోరి 
మగసిరికి  సొగసరికి మది  కలిసే  సుముహూర్తంలో
 
నాలో ఎం జరిగిందో ఏమో ఐఎం ఇన్ లవ్ 
నాలో ఎం జరిగిందో ఏమో ఐఎం ఇన్ లవ్ 

బిందె  లోతుల్లోన రింగ్ తీసే సీను 
గుండెలోతుల్లోంచి  లాగిందంట  నన్ను 
మనసే  చిటికెన  వేలై  కలిసే  ప్రేమకు  వేలై 
రోజు  చూస్తూ  ఉంది  నీకై  వేయి  కల్లై 
నువ్వు  నేను  ఆగలేని  ఈ  తొందర  తెలిసే 
గుండెల్లోనే  మంటపాలు  వెలిసి 
విరిసిన  ఈ  తలపులిలా 
కురిసేను  లే  అక్షింతలు  గా 

నాలో ఎం జరిగిందో ఏమో ఐఎం ఇన్ లవ్ 
నాలో ఎం జరిగిందో ఏమో ఐఎం ఇన్ లవ్ 



ఆకాశం తస్సాదియ్య పాట సాహిత్యం

 
చిత్రం: సుబ్రహ్మణ్యం ఫర్ సేల్  (2015)
సంగీతం: మిక్కీ జె మేయర్
సాహిత్యం: భాస్కర భట్ల
గానం: కృష్ణ చైతన్య,  రమ్యా బెహ్రా

ఆకాశం తస్సాదియ్య




గువ్వ గోరింకతో పాట సాహిత్యం

 
చిత్రం: సుబ్రహ్మణ్యం ఫర్ సేల్  (2015)
సంగీతం: మిక్కీ జె మేయర్
సాహిత్యం: భువనచంద్ర
గానం: మనో, రమ్యా బెహ్రా

(ఈ పాట ఖైది నెం 786 (1988) సినిమాలో పాట దీన్ని రీమిక్స్ చేశారు, ఒరిజినల్ గా ఈ పాటకు రాజ్-కోటి సంగీతం అందించగా, యస్.పి.బాలు, యస్.జానకి గారు పాడారు)

గువ్వ గోరింకతో ఆడిందిలే బొమ్మలాట 
నిండు నాగుండెలో మ్రోగిందిలే వీణపాట 
ఆడుకోవాలి గువ్వలాగ 
పాడుకుంటాను నీ జంట గోరింకనై 

అరె గువ్వ గోరింకతో ఆడిందిలే బొమ్మలాట 
నిండు నాగుండెలో మ్రోగిందిలే వీణపాట 
 
జోడుకోసం గోడ దూకే వయసిది 
తెలుసుకో అమ్మాయిగారు 
అయ్యొపాపం అంత తాపం 
తగదులే తమరికి అబ్బాయిగారు 
ఆత్రమూ ఆరాటమూ చిందే వ్యామోహం 
ఊర్పులో నిట్టూర్పులో అంతా నీ ధ్యానం 
కోరుకున్నానని ఆట పట్టించకు 
చేరుకున్నానని నన్ను దోచేయకు  
చుట్టుకుంటాను సుడిగాలిలా...

అరె  గువ్వ - హా.., గోరింకతో  - హా.. 
ఆడిందిలే బొమ్మలాట 
హేయ్.. నిండు -  హా.. నా గుండెలో - అహా.. 
మ్రోగిందిలే వీణపాట హా హోయ్ హోయ్.. 

కొండనాగు తోడు చేరి 
నాగిని బుసలలో వచ్చే సంగీతం 
సందెకాడ అందగత్తె 
పొందులో ఉందిలే ఎంతో సంతోషం 
పువ్వులో మకరందము ఉందే నీ కోసం  
తీర్చుకో ఆ దాహము వలపే జలపాతం 
కొంచెమాగాలిలే కోర్కె తీరేందుకు 
దూరముంటానులే దగ్గరయ్యేందుకు 
దాచిపెడతాను నా సర్వమూ... 
 
హేయ్... గువ్వ  - హాయ్.. గోరింకతో  - హాయ్.. 
ఆడిందిలే బొమ్మలాట 
అహ.. నిండు - హా.. నా గుండెలో - అహ
మ్రోగిందిలే వీణపాట 
ఆడుకోవాలి గువ్వలాగ 
పాడుకుంటాను నీ జంట గోరింకనై




తెలుగంటే పాట సాహిత్యం

 
చిత్రం: సుబ్రహ్మణ్యం ఫర్ సేల్  (2015)
సంగీతం: మిక్కీ జె మేయర్
సాహిత్యం: చంద్రబోస్
గానం: శంకర్ మహదేవన్

తెలుగంటే

Palli Balakrishna Thursday, October 12, 2017
Pandaga Chesko (2015)


చిత్రం: పండగ చేస్కో (2015)
సంగీతం: ఎస్.ఎస్.థమన్
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: మేఘ
నటీనటులు: రామ్ పోతినేని,  రకుల్ ప్రీత్ సింగ్, సోనాల్ చౌహన్
దర్శకత్వం: గోపిచంద్ మలినేని
నిర్మాత: రవికిరీటి
విడుదల తేది: 29.05.2015

తొలిసారి కలవరం ఏంటో చలిజ్వరం ఏంటో ఈ కళవేంటొ
ఆ పైన మైమరపేంటో మతిమరుపేంటో ఈ గొడవేంటో
బుగ్గల్లో భూకంపాలే రప్పించేలా చేశాడెంటో
మనసంతా మాగ్నెట్లాంటి చూపులతో లాగేశాడేంటో

దునియాలో నీలాంటోడ్ని కలలోనూ చూడలే
నిను చూసిన దగ్గరనుంచి నా కలలు ఆగలే
పరువాన్నే పడగొట్టే చిఛ్చర పిడుగళ్ళె

దొరికాడే దొరికాడే నా రేంజోడే దొరికాడే
నచ్చాడే నచ్చాడే పిచ్చెక్కేలా నచ్చాడే
ఎవడీడే ఎక్కడోడే నమిలేసేలా తగిలాడే
గెలికాడే గెలికాడే మైండంతా గెలికేశాడే

ఈ గుఱ్ఱం లాంటి వయసుని ఆపే కళ్లెం నువ్వేలే
నీ హై వోల్టేజ్ టెంపర్ చూసి టెంప్టయిపోయాలే
అయ్ సూదంత నువ్ చోటిస్తే
నీ ఒళ్ళంతా టాటూ అయిపోనా
నువ్ చారణ సీన్ అందిస్తే
నే బారాణా బొమ్మయి చూపైనా

దొరికాడే దొరికాడే నా రేంజోడే దొరికాడే
నచ్చాడే నచ్చాడే పిచ్చెక్కేలా నచ్చాడే
ఎవడీడే ఎక్కడోడే నమిలేసేలా తగిలాడే
గెలికాడే గెలికాడే మైండంతా గెలికేశాడే

Palli Balakrishna Monday, September 4, 2017

Most Recent

Default