Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Srinivasa Reddy (Actor)"
Wanted Pandugod (2022)



చిత్రం : వాంటెడ్ పండుగాడ్ (2022)
సంగీతం: పెద్దపల్లి రోహిత్ 
నటినటులు: సునీల్, అనసూయ, సుడిగాలి సుదీర్, దీపికా పిల్లి, సప్తగిరి , నిత్యా శెట్టి, విష్ణు ప్రియా, శ్రీనివాస రెడ్డి, వెన్నెల కిషోర్ 
దర్శకత్వం: శ్రీధర్ సేపాన
నిర్మాత: వెంకట్ 
విడుదల తేది: 2022



Songs List:



పరుగు పరుగు పాట సాహిత్యం

 
చిత్రం : వాంటెడ్ పండుగాడ్ (2022)
సంగీతం: పెద్దపల్లి రోహిత్ 
సాహిత్యం: పెద్దపల్లి రోహిత్ 
గానం: పృద్వీ చంద్రా, అపర్ణా నందన్ 

పరుగు పరుగు పరుగు పెట్టి చూద్దాం
ఒంటిలోన కొవ్వునంతా కరిగిద్దాం
పరుగు పరుగు… పరుగు పెట్టి చూద్దాం
ఒంటిలోన కొవ్వునంతా కరిగిద్దాం

వార్మప్ పెంచే బాడీ హీటునే
జాగింగ్ కోసే కొలెస్ట్రాలునే
ఫ్యాట్ తగ్గి ఫిట్టుగుందాం

హెయ్, ఉరుకు ఉరుకు ఉరికి సూడు పోరీ
ఉక్కు లెక్క సేద్దాం మన పూర బాడీ
ఉరుకు ఉరుకు ఉరికి సూడు మామ
ఉత్త ముచ్చటంత ఆపి ఉరుకుదామ

నడక పెంచనీ నడుము వంచనీ
చెమట చినుకులెన్నో చిలకని
హార్ట్ రేట్ ని రైజ్ చేయని
బ్లడ్ ఫుల్ బాడీనంతా పంపని



అబ్బా అబ్బా అబ్బాబబబ్బా పాట సాహిత్యం

 
చిత్రం : వాంటెడ్ పండుగాడ్ (2022)
సంగీతం: పెద్దపల్లి రోహిత్ 
సాహిత్యం: పెద్దపల్లి రోహిత్ 
గానం: హారికా నారాయణ్, శ్రీకృష్ణ 

బుగ్గ మీద చినుకు పడితే
కొరకమంటుంది
పెదవి మీద చినుకు పడితే
ముద్దు కోరింది

ఇలా ఒళ్లు తడిసి ముద్ద అయితే
కౌగిలి ఇమ్మంది
అలా గుండె తాకి జారు నీరు
జివ్వు మంటుంది

చినుకులన్ని కలిసి కొడితే
తగిలేను దెబ్బ
అబ్బా అబ్బా అబ్బాబబబ్బా
అబ్బా అబ్బాబబబ్బా
అబ్బా అబ్బా అబ్బాబబబ్బా
అబ్బా అబ్బాబబబ్బా
అబ్బా అబ్బా అబ్బాబబబ్బా
అబ్బా అబ్బాబబబబబ్బా

జింప చికుం జింప చికుం
జింప చికుం జిమ్
జింప చికుం జింప చికుం
జింప చికుం జిమ్
జింప చికుం జింప చికుం
జింప చికుం జిమ్

చినుకు చమకు చినుకు చమకు
చినుకు చమకు చ
చినుకు చమకు చినుకు చమకు
చినుకు చమకు చ
చినుకు చమకు చినుకు చమకు
చినుకు చమకు చ

ఎద పొంగులు తాకిన చినుకు
జజ్జనకర జనారే
నడుము ఒంపులు చిక్కిన చినుకు
డండనకా నకారే

వణుకుతున్న వలపు
కోరు ఊయల చినుకు
ఊపేసి ఆపేద్దాం అన్నది చూడు
మళ్లీ మళ్లీ రమ్మంటూ రేగిన చినుకు
వేడి పుట్టెల పట్టేసి కరిగెను నేడు
చినుకులన్ని కలిసి కొడితే తగిలెను దెబ్బ

అబ్బా, అబ్బా..! అబ్బాబబ్బా..!! అబ్బాబబబ్బా
అబ్బా అబ్బా అబ్బాబబబ్బా
అబ్బా అబ్బాబబబ్బా
అబ్బా అబ్బా అబ్బాబబబ్బా
అబ్బా అబ్బాబబబ్బా
అబ్బా అబ్బా అబ్బాబబబ్బా
అబ్బా అబ్బాబబబబబ్బా




కేక పెట్టి గోలచేసి కోక పాట సాహిత్యం

 
చిత్రం : వాంటెడ్ పండుగాడ్ (2022)
సంగీతం: పెద్దపల్లి రోహిత్ 
సాహిత్యం: పెద్దపల్లి రోహిత్ 
గానం: ఉమానేహ

కేక పెట్టి గోలచేసి  కోక 




వాంటెడ్ పండుగాడ్ (థీమ్ సాంగ్ ) పాట సాహిత్యం

 
చిత్రం : వాంటెడ్ పండుగాడ్ (2022)
సంగీతం: పెద్దపల్లి రోహిత్ 
సాహిత్యం: పెద్దపల్లి రోహిత్ , శ్రీధర్ సేపాన
గానం: అపర్ణా నందన్, మనోజ్ 

వాంటెడ్ పండుగాడ్ (థీమ్ సాంగ్ )

Palli Balakrishna Thursday, August 18, 2022
Anando Brahma (2017)


 
చిత్రం: ఆనందో బ్రహ్మ (2013)
సంగీతం: K (కృష్ణ కుమార్)
నటీనటులు: తాప్సీపన్ను, శ్రీనివాస రెడ్డి, వెన్నెల కిషోర్, షకలక శంకర్, సుధీర్ బాబు
దర్శకత్వం: మహి వి. రాఘవ్
నిర్మాతలు: విజయ్ చల్లా, శశి దేవిరెడ్డి
విడుదల తేది: 18.08.2017

Palli Balakrishna Saturday, March 6, 2021
Jayammu Nischayammu Raa (2016)


చిత్రం: జయమ్ము నిశ్చయమ్మురా (2016)
సంగీతం: రవిచంద్ర
సాహిత్యం: వి. వి. రామాంజనేయులు
గానం: స్పందన
నటీనటులు: శ్రీనివాస రెడ్డి, పూర్ణ
దర్శకత్వం: శివ రాజ్ కనుమూరిచా
నిర్మాతలు: రాజ్ కనుమూరి మరియు సతీష్ కనుమూరి
విడుదల తేది: 25.11.2016

ఓ రంగుల చిలక చూడే నీ ఎనక
అలుపంటూ లేనీ పిల్లడి నడక
ఓ బంగారు తళుక చుట్టూ ఈ కలకా
ఎక్కడికే ఆ అడుగుల చప్పుడు వినక

ఓ సారి ఇటు చూడే పాపం పసివాడే
నీ చూపుల కోసం వేచి ఉన్నాడే
అన్నీ వదిలేసి నిన్నే వలచాడే
నీ తలుపుల్లోనే నిదురే మరిచాడే

చరణం: 1
మోమాటలు అన్ని పక్కన వదిలాడే
మొండిగ ఆనిను వీడక ముందుకు కదిలాడే
ఎవరేమనుకున్న తానేమనుకోడే
అండగ నీ ప్రేమలో మైమరుపయ్యడే

ఓ సారి ఇటు చూడే పాపం పసివాడే
నువ్వు అంటూ లేని ధ్యాసే లేనోడే
బిడియం కలవాడే తదయము అనలేదే
అయినా నిను గెలిసె మనసే ఉన్నోడే

చరణం: 2
నిన్ను అందరికి కంటే మిన్నగా చూస్తాడే
నిన్ను ఎవరేమన్నా యుద్ధం చేస్తాడే
నీతో నడిచే ఆ ఏడడుగుల కోసం
 వే వేెలడుగులనైన నడిచే ఘనుడే

ఓ సారి ఇటు చూడే  పాపం పసివాడే
నువు నడిచేదారిని వదలని ప్రేమికుడే
గుండె తలుపుల్ని తెరిచి ఉంచాడే
దేవత నువ్వంటూ భక్తుడు అయ్యాడే



**********   *********   **********



చిత్రం: జయమ్ము నిశ్చయమ్మురా (2016)
సంగీతం: రవిచంద్ర
సాహిత్యం: చందు
గానం: రవిచంద్ర

నీ నవ్వుల్లో వెలిగే వెన్నెలలో
నా కనులే మెరిసే ఆ వెలుగులలో
నీ చూపుల్లో విరిసే హరివిల్లే
నన్నే రంగుల్లో ముంచేసిందే
నీ పెదవే పలికే పలుకుల్లో
నా తనువే తడిసే తేనెల్లో
నీ ఊహాలే నిండిన నా మనసే
పాడే పులకింతల సంగీతాలే
నువ్వే చిరుగాలుల్లో నువ్వే జడి వానల్లో
నువ్వే ఆ మెరుపుల్లో నువ్వే నువ్వే నువ్వే
నువ్వే నా కన్నుల్లో నువ్వే నా నవ్వుల్లో
నువ్వే నా శ్వాసల్లో నువ్వే నువ్వే నువ్వే

నిన్నా ఓ కలనే కన్నా నేడే నిజమై చూస్తున్నా
నాలో ఈ సందడి రేపిన సంక్రాంతివి నువ్వేనా
లోలో ఎన్నో అనుకున్నా ఏవో చెప్పాలనుకున్నా
నాలో ఈ అల్లరి రేపిన చిరుగాలివి నువ్వేనా
ఏదోలా ఈ లోకంలో తికమక పడుతూ బతికేస్తున్నా
నా ఎదలో సంతోషాల సంద్రామే నింపావే
ఏ గుడ్లో గోదారుల్లో కొత్తందాలే చూస్తూ ఉన్నా
నే బతికే చందాన్నే నువు కలలా మార్చేశావే
నువ్వే ఆ పొద్దుల్లో నువ్వే ఈ వెన్నెల్లో
నువ్వే చీకట్లో కూడా నువ్వే నువ్వే నువ్వే

నువ్వే నా కన్నుల్లో నువ్వే నా నవ్వుల్లో
నువ్వే నా శ్వాసల్లో నువ్వే నువ్వే నువ్వే


ఎదో తడబాటున బాటల్లోన
పొరపాటున పడుతూ ఉన్నా
నా దశనే తిప్పిన నవమి దశమి నువ్వేనా
నీలో ఏముందో ఏమో కానీ
అది నన్నే నిద్దురలేపి
ఏమెరుగని ఏదో లోకాలే చూపేనా
ఏవేవో అదృష్టాలే ఆకాశంలో వెతికిన వేళా
నాకోసం దిగివచ్చావే చుక్కల్లో ఒక దానా
నిను వెతికే దారుల్లోనే నాకే కొత్తగ ఎదురవుతున్నా
నా బులుపుని నీ నవ్వుల్లో నేడే చూస్తూ ఉన్నా
నువ్వే ఆ పొద్దుల్లో నువ్వే ఈ వెన్నెల్లో
నువ్వే చీకట్లో కూడా నువ్వే నువ్వే నువ్వే

నువ్వే నా కన్నుల్లో నువ్వే నా నవ్వుల్లో
నువ్వే నా శ్వాసల్లో నువ్వే నువ్వే నువ్వే

నీ నవ్వుల్లో వెలిగే వెన్నెలలో
నా కనులే మెరిసే ఆ వెలుగులలో
నీ చూపుల్లో విరిసే హరివిల్లే
నన్నే రంగుల్లో ముంచేసిందే



**********   **********   ***********


చిత్రం: జయమ్ము నిశ్చయమ్మురా (2016)
సంగీతం: రవిచంద్ర
సాహిత్యం: శ్రీని ఇందుకూరి
గానం: హరిచరన్

తక దింతక దింతక తానా
ఎదలో ఏదో థిల్లానా
మునుపెరుగని మైకం లోనా
పడుతున్నది నీ వళ్లేనా
నిజామా కలగంటున్నానా
ఇది నమ్మలేకున్నా - ఓకే
ఇది కన్నుల చూడని వెన్నెల రాత్రుల
వెలుగుల జిలుగులని
ఇది రెక్కలు కట్టుకు ఎగిరిన
మనసున తొలి తొలి ఊసులని
ఇది ఆశల అలజడి రేపిన
నవ్వుకు పలికిన స్వరములని
ఇది ఊహల ఊయల లూగిన
ప్రేమకు దొరికిన క్షణములని

ముద్దు మాటలే విన్న చెవులు
నిద్దరోవులే చూసి కనులు
పొద్దు పోదులే రోజు అసలు
నాలో ఏవో సరిగమలు
చంత చేరినా చిన్ని ఆశలు
చప్పగలనా అన్ని ఊసులు
కౌగిలింతకై కన్న కలలు
ఏవో ఏవో పదనిసలు

నే నడిచిన నడకకు అడుగులు
కలుపుతు తోడుగ తానొస్తే
తన అడుగులు చేసిన సవ్వడికే
నా అడుగులు తడబడెలే
తన రాకకు ఆశగ చుసిన
కనులకు తానే ఎదురైతే
ఆ చూపులు చేసిన గారడితో
మైకంలో మునిగాలే

చీర కట్టిన సన్నజాజిలా
బొట్టుపెట్టిన చంద్రవంకలా
కట్టుబొట్టులో కోన సీమలా
నా తోడుంటే అది వరమే
రాణి గారిలా నన్ను చేరగా
రాజయోగమే నాకు పట్టదా
రాసి ఉందిలే సర్వమంగళం
గీతే మారే దశ తిరిగే

లక్ ను తెచ్చిన లవ్వే
ఇపుడే కన్నుల ముందుంది
ఒంటరి పరుగులు తీసిన
మనసుకు తోడుగ వచ్చింది
ఇద్దరిమద్యన దూరము
కరిగే ముచ్చట రానుంది
ఇద్దరమొకటై కలిసే క్షణమే
పండుగ కానుంది

తక దింతక దింతక తానా
ఎదలో ఏదో థిల్లానా
మునుపెరుగని మైకం లోనా
పడుతున్నది నీ వళ్లేనా
నిజామా కల గంటున్నానా
ఇది నమ్మలేకున్నా - ఓకే ఓకే



********   **********    *********



చిత్రం: జయమ్ము నిశ్చయమ్మురా (2016)
సంగీతం: రవిచంద్ర
సాహిత్యం: ఆర్. రాము
గానం: హరిచరన్

కలలు నావేన కధలు నావేన
నీకు చేరింది శూన్యమా
తపన నాదేన తలపు నాదేన
నీకు నా ఊహే దూరమా
కనులతో నే తెలిపిన
నా ప్రేమ నిను తాకలేద
మనసుతో నే పలికిన
రాగాలు వినిపించనే లేదా

మనసు నాదేన మమత నాదేన
నీకు నేనింత దూరమా
పిలుపు నాదేన బదులు నాదేన
చలనమేలేని శిల్పమా

నీవు పలికిన వేల పదములు
ప్రేమ పిలుపులు కావని
నాతో నడిచిన వేల అడుగులు
సాగు గమనము వేరని
నవ్వుతు నను చూసిన
చూపుల కధ వేరు అని
నేడు నీ చిరునవ్వుతో
చేసింది అంతా శూన్యమేనని

నిన్ను చూసిన నాటి క్షణమున
నా ఎదే నను వీడెలే
నేడు నువు లేవన్నా మది
నిను వీడి రాలేనందిలే
నీవు నా కల చేరితే
జగమే మరిచానే
నేను నీ కలలోకి చేరే
దారి ఏదో తెలియలేదే

కలలు నావేన కధలు నావేన
నీకు చేరింది శూన్యమా
తపన నాదేన తలపు నాదేన
నీకు నా ఊహే దూరమా
కడలిలా ఉప్పొంగిన
గుండెల్లో నీ పైన ప్రేమ
కడకిలా నీ మనసులో
చినుకంత కలిగించనే లేదా


*********  *********  *********


చిత్రం: జయమ్ము నిశ్చయమ్మురా (2016)
సంగీతం: రవిచంద్ర
సాహిత్యం: వి. వి. రామాంజనేయులు
గానం: భార్గవి పిళ్ళై, రవిచంద్ర, కార్తీక్

వీడి పేరే సర్వమంగళం
ఈ లోకం వీడికి ఒక వలయం
శకుణం గ్రహణం బలగ్రహా సకలం
లెక్క తప్పినా ఇక చిందర వందర గందరగోళం

హెల్లో ఎవ్రిబడి హి ఈజ్ ద మంగళం
సున్లో స్టోరీ ఆఫ్ దిస్ సర్వమంగళం
హెల్లో ఎవ్రిబడి హి ఈజ్ ద మంగళం
సున్లో స్టోరీ ఆఫ్ దిస్ సర్వమంగళం

మీనం మేషం మిథునం మకరం
వృషభం కుంభం రాసుల మధనం
శూలం శుక్లం శివ శుభ భద్రం
బ్రహ్మం సిద్ధం యోగం భోగం
నిత్యం రత్నం నీలం పగడం
కనకం వజ్రం రాళ్లతో రగడం
కార్యం కర్మం క్షేమం క్షామం
లాభం నష్టం ఘడియల జగడం
మెడలో కాశీతాడు తాయత్తులతో మొలతాడు

హెల్లో ఎవ్రిబడి చూడండి విడ్డూరం
చేతిలో గణన యంత్రం
జ్వరమొస్తే దిష్టి మంత్రం
సున్లో స్టోరీ ఆఫ్ దిస్ కుర్ర కంగారం

ట్వింకిల్  ట్వింకిల్ స్టారు
ఏ స్టారో వీడిది సారూ
అదృష్టాన్నేదో అందుకునేందుకు
చేస్తున్నాడోయ్ వారు
మాస్ కి వీడు ఫర్రు
శాటర్నంటేనే ఢర్రు

ఆ చుక్కలు లెక్కల పంచాంగంతో
మొత్తం అంతా బ్లర్రు
బ్లర్  బ్లర్ బ్లర్ బ్లర్ బ్లర్

అపశకునాల ప్రిస్క్రిప్షన్
వీడి డైలీ లైఫ్ కి డిస్క్రిప్షన్
మొదలెట్టడుగా ఏ మిషన్
లేకుండా గ్రహముల పర్మిషన్
ఆస్ట్రాలజితో వేట
లోకాలతో ఆడే ఆట
వీడి భాగోతాలే చూస్తే
శివకైనా మతి చెడునంట
అరే హోరోస్కోపులు వాడి
ఆ రాహువునే తును వాడి
అరె చేతులు గీతలనే కూడి
మరి అయిపోతాడేమో ఏమో మోడీ

మీనం మేషం మిథునం మకరం
వృషభం కుంభం రాసుల మధనం
శూలం శుక్లం శివ శుభ భద్రం
బ్రహ్మం సిద్ధం యోగం భోగం
నిత్యం రత్నం నీలం పగడం
కనకం వజ్రం రాళ్లతో రగడం
కార్యం కర్మం క్షేమం క్షామం
లాభం నష్టం ఘడియల జగడం

ఓ మై గాడ్ హి ఈజ్ ద మాన్
హూ లీవ్స్ హిస్ లైఫ్ ఇన్ ద చైన్స్
ఫాలోస్ ఎవ్రిథింగ్ వాట్ ఎవ్రిథింగ్ ఇట్ డజ్
డజంట్ కేర్ అబౌట్ ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్
స్పీరిట్యువల్ దట్స్ వాట్ హి ఈజ్
సూయర్ స్టేషస్ ఈజ్ దట్ హి
ఎస్ ఎస్ ఎస్ ఎస్ ఎస్
గాడ్ సేవ్ హిమ్ ఆల్మైటీ

సర్వ మంగళ మాంగళ్యం
సర్వ పాప ప్రణాశనం
చింత శోక ప్రశామానం
ఆయువర్ధనముత్తమం ఉత్తమం

నవ్వులే పాలే అవుతాడు
తన దారిన తానే వెళతాడే
తిడుతూ ఉన్నా పడతాడే
తను నమ్మినదే నిజమంటాడే
గొంతే నొప్పి తప్ప
వినుకోడీ నూతిలో కప్ప
తను పట్టిన రాబిట్ లెగ్సే
మూడని నమ్మించే టైపే
చాదస్తాలెన్నున్నా
అరె మాయ మర్మం సున్నా
తన మంచే తనకు కంచై ఉంది
అదే కదా సదా రక్షా

మీనం మేషం మిథునం మకరం
వృషభం కుంభం రాసుల మధనం
శూలం శుక్లం శివ శుభ భద్రం
బ్రహ్మం సిద్ధం యోగం భోగం
నిత్యం రత్నం నీలం పగడం
కనకం వజ్రం రాళ్లతో రగడం
కార్యం కర్మం క్షేమం క్షామం
లాభం నష్టం ఘడియల జగడం

హెల్లో ఎవ్రిబడి హి ఈజ్ ద మంగళం
సున్లో స్టోరీ ఆఫ్ దిస్ సర్వమంగళం
హెల్లో ఎవ్రిబడి హి ఈజ్ ద మంగళం
సున్లో స్టోరీ ఆఫ్ దిస్ సర్వమంగళం

Palli Balakrishna Thursday, July 27, 2017

Most Recent

Default