Yaalalo Yaalalo Song Lyrics in Telugu and English – Irumudi (2026)
'Yaalalo Yaalalo' song from Irumudi (2026) movie is composed by G. V. Prakash Kumar and sung by Hesham Abdul Wahab and Sadhika K.R. Lyrics are written by Ananth Sriram. Starring Mass Maharaja Ravi Teja and Priya Bhavani Shankar.
Mallepoola Pallaki Song Lyrics in Telugu and English – Irumudi (2026)
'Mallepoola Pallaki' song from Irumudi (2026) movie is recreated by G. V. Prakash Kumar and sung by Dappu Srinu. Originally composed by Sunkara Anjaneyulu with lyrics written by Chowdam Srinivasa Rao. Starring Mass Maharaja Ravi Teja.
Irumudi Kattu Song Lyrics in Telugu and English – Irumudi (2026)
'Irumudi Kattu' song from Irumudi (2026) movie is composed by G. V. Prakash Kumar and sung by Ananthu. Lyrics are written by Shiva Nirvana and Kalyan Chakravarthy.
చిత్రం: ఖుషి (2023)
సంగీతం: హేషం అబ్దుల్ వాహెబ్
నటీనటులు: విజయడేవర కొండ , సమంతా రుతుప్రభు
దర్శకత్వం: శివ నిర్వాణ
నిర్మాతలు: మైత్రీ మూవీ మేకర్స్
విడుదల తేది: 01.09.2023
Songs List:
నా రోజా నువ్వే పాట సాహిత్యం
చిత్రం: ఖుషి (2023)
సంగీతం: హేషం అబ్దుల్ వాహెబ్
సాహిత్యం: శివ నిర్వాణ
గానం: హేషం అబ్దుల్ వాహెబ్
ఆరా ఆరా ఆరా
తననానా తననానా తననానా
ఆరా సే ప్యారు
అందం తన ఊరు
సారె హుషారు
బేగం బెజారు
ఆరా సే ప్యారు
అందం తన ఊరు
దిల్ మాంగే మొరు
ఈ ప్రేమే వేరు
నా రోజా నువ్వే
నా దిల్ సే నువ్వే
నా అంజలి నువ్వే
గీతాంజలి నువ్వే
నా రోజా నువ్వే
నా దిల్ సే నువ్వే
నా అంజలి నువ్వే
గీతాంజలి నువ్వే
నా కడలి కెరటంలో
ఓ మౌన రాగం నువ్వేలే
నీ అమృతపు జడీలో
ఓ ఘర్షణే మొదలయ్యిందే
నా సఖివి నువ్వేలే
నీ దళపతిని నేనేలే
నా చెలియా నువ్వేలే
నీ నాయకుడు నేనే
నువ్వు ఎస్ అంటే ఎస్ అంటా
నో అంటే నో అంటా
ఓకే బంగారం
నా రోజా నువ్వే
నా దిల్ సే నువ్వే
నా అంజలి నువ్వే
గీతాంజలి నువ్వే
నా రోజా నువ్వే
నా దిల్ సే నువ్వే
నా అంజలి నువ్వే
గీతాంజలి నువ్వే
నా ప్రేమ పల్లవిలో
నువ్వు చేరావే అనుపల్లవిగా
నీ గుండె సడి లయలో
నే మారన నీ ప్రతిధ్వనిలా
నీ కనుల కలయికలో
కన్నాను ఎన్నో కలలెన్నో
నీ అడుగులకు అడుగై ఉంటాను నీ నీడై
నువ్వు ఊ అంటే నేనుంటా కడదాకా తోడుంటా
ఓకే నా బేగం
ఆరా సే ప్యారు
అందం తన ఊరు
సారె హుషారు
బేగం బెజారు
ఆరాధ్యా పాట సాహిత్యం
చిత్రం: ఖుషి (2023)
సంగీతం: హేషం అబ్దుల్ వాహెబ్
సాహిత్యం: శివ నిర్వాణ
గానం: సిద్ శ్రీరాం , చిన్మయి శ్రీపాద
యు ఆర్ మై సన్ షైన్
యు ఆర్ మై మూన్ లైట్
యు ఆర్ స్టార్ ఇన్ ది స్కై
కం విత్ మీ నౌ, యు హావ్ మై డిసైర్
నాతో రా… నీలా రా ఆరాధ్యా
పదము నీవైపిలా
పరుగు నీదే కదా
తనువు తెర మీదుగా
చేరుకో త్వరగా
మనసారా చెలి తార
నా గుండెని మొత్తం తవ్వి తవ్వి
చందనమంతా చల్లగ దోచావే, ఏ
ఏ వందల కొద్ది పండగలున్న
వెన్నెల మొత్తం నిండుగ ఉన్న
ఆరాధ్య నా ఆరాధ్య
నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్యా
ఆరాధ్య నా ఆరాధ్య
నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్యా
ఈ పూట నా పాట
చేరాలి నీ దాకా
నీ చిన్ని మెడ వంపులో
సాగాలి ఈ ఆట
తేడాలు తేలాకా గెలిచేది ఎవరేమిటో
ఇలాగే, ఏ ఏ… ఉంటాలే, ఏ ఏ
నీతోనే, ఏ ఏ
దూరాలు తీరాలు లేవే
ఆరాధ్య నా ఆరాధ్య
నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్యా
ఆరాధ్య నా ఆరాధ్య
నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్యా
ఏదో అనాలంది, ఇంకా వినాలంది
నీ ఊహ మళ్లింపులో
నాదాకా చేరింది నాక్కూడ బాగుంది
నీ ప్రేమ కవ్వింపులో
నీలానే, ఏ ఏ ఏ
మారానే, ఏ ఏ ఏ
అంటానే… ఏ ఏ ఏ
నువ్వంటు నేనంటూ లేనే
మనసారా చెలి తార
నా గుండెని మొత్తం తవ్వి తవ్వి
చందనమంతా చల్లగ దోచావే
ఏ వందల కొద్ది పండగలున్న
వెన్నెల మొత్తం నిండుగ ఉన్న
ఆరాధ్య నా ఆరాధ్య
నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్యా
ఆరాధ్య నా ఆరాధ్య
నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్యా
పదము నీవైపిలా
పరుగు నీదే కదా
తనువు తెర మీదుగా
చేరుకో త్వరగా
మనసా..! పాట సాహిత్యం
చిత్రం: ఖుషి (2023)
సంగీతం: హేషం అబ్దుల్ వాహెబ్
సాహిత్యం: శివ నిర్వాణ
గానం: హేషం అబ్దుల్ వాహెబ్ , దివ్య యస్.మీనన్
మనసా..!
మనకూ సెలవే సెలవు
ముసిరే ఊసులు కనవా..?
ఎదకి ఒక గాయం
వదలమంది ప్రాణం
చెలిమి విడి బంధం
ఎవరు ఇక సొంతం
కలత పడి హృదయం
కరగనంది మౌనం
గతము విడి పాశం
ఏది ఇక బంధం
హే, ఇన్నాళ్లు నన్ను
వెన్నంటి ఉన్న నీడ నీవుగా
కొన్నాళ్ళే అంటూ
కోరింది నన్నే వీడమందిగా
నిను తలచే ప్రతి తలపే
ప్రణయాన శోధనా
నను మరిచే మరుక్షణమే
విరహాల వేధనా
ఎదకి ఒక గాయం
వదలమంది ప్రాణం
చెలిమి విడి బంధం
ఎవరు ఇక సొంతం
హే, మందార పూలే
మంటల్లే మారే… మౌన వేళలో
నిండారా నాతో ఉంటావులే
నా కంట నీరులో
ఇది శరమో, కలవరమో
ఎనలేని శూన్యమో
చెలి వరమో, తుది క్షణమో
ఎడబాటు సoద్రమో
మనసా..!!
మనకూ సెలవే సెలవు
ముసిరే ఊసులు కనవా..?
ఓసి పెళ్ళమా..!పాట సాహిత్యం
చిత్రం: ఖుషి (2023)
సంగీతం: హేషం అబ్దుల్ వాహెబ్
సాహిత్యం: శివ నిర్వాణ
గానం: రాహుల్ సిప్లిగంజ్ , సాకేత్ కొమందూరి
హేయ్, హ్హ హ్హ హా
కాశ్మీరులో ఫస్ట్ టైం తనని చూసినా, హే
ముందెనక చూడకుండా మనసిచ్చినా, హే
బాబు మాట పక్కనెట్టి బైటికొచ్చినా, హే
లగ్గమెట్టి కాపురాన్ని స్టార్ట్ చేసినా
ఓ హో… స్ట్రగుల్ స్టార్టాయెనే
ఓ హో… పాప చేంజయ్యనే
ఓసి పెళ్ళమా..!
నన్ను మిర్చిలాగ నంజుకుంటవే
వద్దు ఆపమ్మా..!
నేను కోడిలాగ గింజుకుంటనే
ఉన్న మాట సెప్పుతాను ఇనుకోండ్రి
పెళ్లి ఊసు పాడుగాను మానుకోండ్రి
గన్ను కంటే పవరుఫుల్లు ఆలండీ
దూల తీర్చేస్తదండీ
ఉన్న మాట సెప్పుతాను ఇనుకోండ్రి
పెళ్లి ఊసు పాడుగాను మానుకోండ్రి
గన్ను కంటే పవరుఫుల్లు ఆలండీ
దూల తీర్చేస్తదండీ
లేట్ నైట్ ఇంటికొస్తే తలుపు తియ్యరు
ఫ్రెండ్ తోన మందు కొడితే తాట తీస్తరు
పాత గర్ల్ ఫ్రెండ్ మీద నిఘా ఏస్తరు
గ్లోబులోన ఎక్కడున్న ట్రాక్ చేస్తరు
బుజ్జికన్న అంటు నిన్ను ముద్దు సేస్తరు, హే
కన్నవాళ్ళ కంటే నువ్వు ఎక్కువంటరు, హే
చిన్న మాట అన్న కూడా బుస కొడతారు, హే
కన్నీళ్లతో నిన్ను కాటేస్తారు
ఓ హో… వైఫ్ నైఫాయనే
ఓ హో… మైండు బ్లాకాయనే
ఓ హో… లైఫ్ చేంజాయనే
ఓ హో… కర్మ కాలిపోయెనే
పెళ్లాలే గయ్యాలా, గయ్యాలే పెళ్ళాలా
పెళ్ళాలు పెళ్ళాలు… పెళ్ళాలు కాదే
దయ్యాలు దయ్యాలు… దయ్యాలు మీరే
ఓసి పెళ్ళమా..!
నన్ను మిర్చిలాగ నంజుకుంటవే
వద్దు ఆపమ్మా..!
నేను కోడిలాగ గింజుకుంటనే
ఉన్న మాట సెప్పుతాను ఇనుకోండ్రి
పెళ్లి ఊసు పాడుగాను మానుకోండ్రి
గన్ను కంటే పవరుఫుల్లు ఆలండీ
దూల తీర్చేస్తదండీ
ఉన్న మాట సెప్పుతాను ఇనుకోండ్రి
పెళ్లి ఊసు పాడుగాను మానుకోండ్రి
గన్ను కంటే పవరుఫుల్లు ఆలండీ
దూల తీర్చేస్తదండీ
చిత్రం: మజిలీ (2019)
సంగీతం: గోపిసుందర్
నటీనటులు: నాగచైతన్య, సమంత
దర్శకత్వం: శివ నిర్వాణ
నిర్మాతలు: సాహు గారపాటి, హరీష్ పెద్ది
విడుదల తేది: 04.04.2019
Songs List:
వన్ బోయ్ వన్ గర్ల్ లుకింగూ పాట సాహిత్యం
చిత్రం: మజిలీ (2019)
సంగీతం: గోపిసుందర్
సాహిత్యం: భాస్కర్ భట్ల
గానం: రేవంత్
వన్ బోయ్ వన్ గర్ల్ లుకింగూ
హైట్ వెట్ చెకింగూ
పేరెంట్స్ ఫిక్సింగ్ మాచింగూ
డౌరీ గివింగూ (2)
మ్యారేజ్ బెల్ల్సు రింగింగూ
సింగల్ బెడ్ షేరింగూ
ఇన్‌సైడ్ ఫర్స్ట్ లవ్ కిల్లింగూ
యూ ఆర్ డైయింగూ
వేర్ ఈస్ ద వేర్ ఈస్ ద
వేర్ ఈస్ ద వేర్ ఈస్ ద
వేర్ ఈస్ ద వేర్ ఈస్ ద లవింగూ
వేర్ ఈస్ ద వేర్ ఈస్ ద ఫీలింగు
యూ ఆర్ ఫీలింగు క్రయింగు డైయింగూ
వేర్ ఈస్ ద వేర్ ఈస్ ద లవింగూ
వేర్ ఈస్ ద వేర్ ఈస్ ద ఫీలింగు
యూ ఆర్ ఫీలింగు క్రయింగు డైయింగూ
వన్ బోయ్ వన్ గర్ల్ లుకింగూ
హైట్ వెట్ చెకింగూ
పేరెంట్స్ ఫిక్సింగ్ మాచింగూ
డౌరీ గివింగూ
నాన్నకే మాటిచ్చావని
ఆఆహ్.. నాన్నకే మాటిచ్చావని
అమ్మ అలిగిందని
మనసుకే ఉరి తాడెసి
ముడి వేస్తావా తాళిని
జంటకాని పిల్లతో
ఏడు అడుగులు వెయ్యడం
ఆరు అడుగుల గొయ్యిని
నీకు నువ్వే తవ్వడం
నీకు తోడు మర్రిచెట్టు
స్కూల్ గ్రౌండు, గాంధీ బొమ్మ
గుండెలోన చెరిగిపోనీ
నీ ప్రేమ బొమ్మా
వేర్ ఈస్ ద వేర్ ఈస్ ద
వేర్ ఈస్ ద వేర్ ఈస్ ద
వేర్ ఈస్ ద వేర్ ఈస్ ద లవింగూ
వేర్ ఈస్ ద వేర్ ఈస్ ద ఫీలింగు
యూ ఆర్ ఫీలింగు క్రయింగు డైయింగూ
కళ్ళ ముందుండే రూపం
ఆఆహ్.. కళ్ళ ముందుండే రూపం
మనసునే తాకదే
మనసులో నిండిన ప్రాణం
ఎదురుగా వచ్చి వాలదె
రైలు జర్నీ కాదురా
లైఫ్ జర్నీ పెళ్లి రా
ఎవ్వరైతే ఏంటనీ
సర్దుకోలేం సోదరా
కళ్ళలోకి చూడలేక
మాట కూడా కలపలేక
జీవితాంతం జంట మధ్య
భూ మధ్య రేఖా...
వేర్ ఈస్ ద వేర్ ఈస్ ద
వేర్ ఈస్ ద వేర్ ఈస్ ద
వేర్ ఈస్ ద వేర్ ఈస్ ద లవింగూ
వేర్ ఈస్ ద వేర్ ఈస్ ద ఫీలింగు
ఐ యాం ఫీలింగు క్రయింగు డైయింగూ
వేర్ ఈస్ ద వేర్ ఈస్ ద లవింగూ
వేర్ ఈస్ ద వేర్ ఈస్ ద ఫీలింగు
ఐ యాం ఫీలింగు క్రయింగు డైయింగూ
చిత్రం: మజిలీ (2019)
సంగీతం: గోపిసుందర్
సాహిత్యం: రాంబాబు గోసాల
గానం: యాజిన్ నజీర్, నికితా గాంధీ
నా గుండెల్లో ఉండుండి మెల్లంగా
ఝల్లుమందే ఏమయ్యిందో
నా ఊహల్లో నువ్వొచ్చి వాలంగా
ఇష్టంగుందే ఏమౌతుందో
మదిలో మెదిలే మాటలనే
పెదవే దాచనందే
యెదలో ఎగసే అలజడినే
అడగాలీ మన కథే
ఓ ఓ...
నా గుండెల్లో ఉండుండి మెల్లంగా
ఝల్లుమందే ఏమయ్యిందో
ఏల అందిందే ఆకాశం అందేసిందే
ఏల ఆనందం పొంగిందే
ఏల అల్లిందే ఉల్లాసం అల్లేసిందే
ఏల ఒళ్ళంతా తుళ్ళిందే
ఇంచుమించుగా ఊపిరాగేట్టుందిలే
నువ్వే చూసి చూడనట్టు వెళ్లకే
కొంచెం కొంచెంగా మౌనం కరిగేట్టుందిలే
నువ్వే మంత్రం వేసి మనసే లాగితే
మన మాటే - పాటగా మారనీ
మన పాటే - ప్రేమగా సాగనీ
ఆ ప్రేమే స్వప్నమై సత్యమై స్వర్గమైపోనీ
మన కలయికలో
నా గుండెల్లో ఉండుండి
మెల్లంగా ఝల్లుమందే
ఏమయ్యిందో
మంచు పువ్వంటి చిన్ని నవ్వు నవ్వేస్తే
పంచ ప్రాణాలన్ని మళ్లీ పుట్టేలే
పంచదారంటి తీపి ఊసులాడేస్తే
లక్ష నిమిషాలైనా ఇట్టే గడిచేలే
సంద్రమైనా చిటికెలో దాటనా
సందెపొద్దు జిలుగులో చేరనా
మధురం మధురం మధురం
మన ఈ ప్రేమమ్ - సుమధుర కావ్యం
నా గుండెల్లో ఉండుండి మెల్లంగా
ఝల్లుమందే ఏమయ్యిందో
నా ఊహల్లో నువ్వొచ్చి వాలంగా
ఇష్టంగుందే ఏమవుతుందో
మదిలో మెదిలే మాటలనే
పెదవే దాచనందే
యెదలో ఎగసే అలజడినే
అడగాలీ మన కథే
ఏడెత్తు మల్లెలే పాట సాహిత్యం
చిత్రం: మజిలీ (2019)
సంగీతం: గోపిసుందర్
సాహిత్యం: శివ నిర్వాణ
గానం: కాల భైరవ, నిఖిత గాంధీ
ఏడెత్తు మల్లెలే
కొప్పులోన చేరే దారే లేదే
నీ తోడు కోయిలే
పొద్దుగూకే వేళ కూయలేదే
రాయెత్తు అల తెరదాటి
చేరరావే చెలియా
ఈపొద్దు పీడకల దాటి
నిద్దరోవే సఖియా
నీ కంటిరెప్ప కలనే
కన్నీటిలోన కథనే
నీ గుండెలోన సడినే
నీ ఊపిరైనా ఊసుని
నా ఊపిరాగినా
ఉసురుపోయినా
వదిలిపోననీ
ఏ మనిషికే మజిలీయో పాట సాహిత్యం
చిత్రం: మజిలీ (2019)
సంగీతం: గోపిసుందర్
సాహిత్యం: వనమాలి
గానం: బేబీ అనూష , అరుణ్ గోపన్, చిన్మయి శ్రీపద
ఏ మనిషికే మజిలీయో
పైవాడు చూపిస్తాడు
నువు కోరుకుంటే మాత్రం
దొరికేది కాదంటాడు
నువ్వు..నిజంలాగ
నను ముడేస్తుంటె
ఈ నిమిషానా
నేను..గతంలోని
ఆ కలల్లోనె వున్నా..
నువ్వు..ప్రతీసారి
నీ ప్రపంచంలొ
నను చూస్తూన్నా..
నేను..అదే పనిగ
నిను వెలేస్తూనె వున్నా
నువ్వు..నను కడలిలోని
ఆ కెరటమల్లె విడిపోకున్నా
నేను..ఒక మనసులేని
శిలలాగ మారినానా..
ఏ మనిషికే మజిలీయో
పైవాడు చూపిస్తాడు
నువు కోరుకుంటే మాత్రం
దొరికేది కాదంటాడు
ఓ మదిని దూరం చేస్తే
ఇంకోటి ముడి వేస్తాడు
ఎదలోని ప్రేమను వేరే
మజిలీకి చేరుస్తాడు
నా నిన్నలోని
ఆ గురుతులన్నీ
ఈ మనసులోంచి
చెరిపేదెలాగా..?
ఇన్నాళ్ళు నాలో
కలిసున్న ప్రాణం
నే వేరు చేసి
బ్రతికేదెలాగ..?
ఈ వేషమే ఎన్నాళ్ళని
విధి ఆడుతోందా
ఈ నాటకాన్ని
నువ్వు నిజంలాగ
నను ముడేస్తుంటె
ఈ నిమిషానా
నేను గతంలోని
ఆ కలల్లోనె వున్నా
నీ పిలుపు కోసం
వెతికింది మౌనం
ఆ వరము కోరి
మిగిలుంది ప్రాణం
నా గుండెనడుగు
చెబుతుంది నీకె
ఈ ఊపిరుందీ
నీ చెలిమి కొరకే
నీ కోసమె వేచిందిలే
నువు సేద తీరె
ఈ ప్రేమ మజిలీ
నేను నిజంలాగ
నిను ముడేస్తుంటె
ఈ నిమిషానా
నువ్వు గతంలోని
ఆ కలల్లోనె వున్నా
నేను ప్రతీసారి
నా ప్రపంచంలా
నిను చూస్తున్నా
నువ్వు అదేపనిగ
నను వెలేస్తూనె వున్నా
నేను నిను కడలిలోని
ఆ కెరటమల్లె విడిపోకున్నా
నువ్వు ఒక మనసు లేని
శిలలాగ మారినావా
ఏ మనిషికే మజిలీయో
పైవాడు చూపిస్తాడు
నువు కోరుకుంటే మాత్రం
దొరికేది కాదంటాడు
ఓ మదిని దూరం చేస్తే
ఇంకోటి ముడి వేస్తాడు
ఎదలోని ప్రేమను వేరే
మజిలీకి చేరుస్తాడు
చిత్రం: నిన్ను కోరి (2017)
సంగీతం: గోపి సుందర్
నటీనటులు: నాని, ఆది పినిశెట్టి, నివేద థామస్
దర్శకత్వం: శివ నిర్వాణ
నిర్మాత: డి.వి.వి.దానయ్య
విడుదల తేది: 07.07.2017
Songs List:
అడిగా అడిగా పాట సాహిత్యం
చిత్రం: నిన్ను కోరి (2017)
సంగీతం: గోపి సుందర్
సాహిత్యం: శ్రీజో
గానం: సిద్ శ్రీరామ్
ఊహుఁ... ఊహుఁ...
ఊహుఁ... ఊహుఁ...
ఊహుఁ హు ... ఊహుఁ...
ఊహుఁ... ఊహుఁ...
అడిగా అడిగా ఎదలో లయనడిగా
కదిలే క్షణమా చెలి ఏదనీ
నన్నె మరిచా తన పేరునె తలిచా
మదినే అడిగా తన ఊసేదనీ
నువ్వే లేని నన్ను ఊహించలేను
నా ప్రతి ఊహలోను వెతికితే మనకదే
నీలోనె ఉన్నా నిను కోరి ఉన్న
నిజమై నడిచా జతగా...
ఊహుఁ... ఊహుఁ...
ఊహుఁ... ఊహుఁ...
ఊహుఁ... ఊహుఁ...
ఊహుఁ... ఊహుఁ...
గుండెలోతుల్లో ఉంది నువ్వేగా
నా సగమే నా జగమే నువ్వేగా
నీ స్నేహమే నను నడిపే స్వరం
నిను చేరగ ఆగిపోనీ పయణం
అలుపే లేని గమనం
అడిగా అడిగా ఎదలో లయనడిగా
కదిలే క్షణమా చెలి ఏదని
నన్నె మరిచా తన పేరునె తలిచా
మదినే అడిగా తన ఊసేదని
నువ్వే లేని నన్ను ఊహించలేను
నా ప్రతి ఊహలోను వెతికితే మనకదే
నీలోనె ఉన్న నిను కోరి ఉన్నా
నిజమై నడిచా జతగా....
ఊహుఁ... ఊహుఁ...
ఊహుఁ... ఊహుఁ...
ఊహుఁ... ఊహుఁ...
ఊహుఁ... ఊహుఁ...
ఉన్నటుండి గుండె పాట సాహిత్యం
చిత్రం: నిన్ను కోరి (2017)
సంగీతం: గోపి సుందర్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: కార్తిక్, చిన్మయి శ్రీపద
ఉన్నటుండి గుండె వంద కొట్టుకుందె
ఎవ్వరంట ఎదురైనదీ..
సంతోషాలె నిండే బంధం అల్లుకుందే
ఎప్పుడంట ముడిపడినది
నేనా నేనా... ఇలా నీతో ఉన్నా
ఔనా ఔనా... అంటూ ఆహా అన్నా
హెయ్ మెచ్చిన చిన్నది మెచ్చిన తీరు
ముచ్చటగా నను హత్తుకుపొయె
ఓయె.. ఒయె.. యె యె యె యె హత్తుకుపోయె
చుక్కలు చూడని లోకం లోకి
చప్పున నన్ను తీసుకుపోయె
ఓయె.. ఒయె.. యె యె యె యె తీసుకుపోయె
ఉన్నటుండి గుండె వంద కొట్టుకుందె
ఎవ్వరంట ఎదురైనది
సంతోషాలె నిండి బంధం అల్లుకుంది
ఎప్పుడంట ముడిపడినది
ఏ దారం ఇలా లాగిందో మరి
నీ తోడై చెలీ పొంగిందె మది
అడిగి పొందినది కాదులె
తనుగ దొరికినది కానుక
ఇకపై సెకనుకొక వేడుక
కోరె కలా నీలా నా చెంత చేరుకుందిగ
హెయ్ మెచ్చిన చిన్నది మెచ్చిన తీరు
ముచ్చటగా నను హత్తుకుపొయె
ఓయె.. ఒయె.. యె యె యె యె హత్తుకుపోయె
చుక్కలు చూడని లోకం లోకి
చప్పున నన్ను తీసుకుపోయె
ఓయె.. ఒయె.. యె యె యె యె తీసుకుపోయె
ఆనందం సగం అచ్చర్యం సగం
ఏమైనా నిజం బాగుంది నిజం
కాలం కదలికల సాక్షిగ
ప్రేమై కదిలినది జీవితం
ఇకపై పదిలమె నా పధం
నీతో అటో ఇటో ఏవైపు దారి చూసిన
ఉన్నటుండి గుండె వంద కొట్టుకుందె
ఎవ్వరంట ఎదురైనది
సంతోషాలె నిండే బంధం అల్లుకుందే
ఎప్పుడంట ముడిపడినది
నేనా నేనా... ఇలా నీతో ఉన్నా
ఔనా ఔనా... అంటూ ఆహా అన్నా
హెయ్ మెచ్చిన చిన్నది మెచ్చిన తీరు
ముచ్చటగా నను హత్తుకుపొయె
ఓయె.. ఒయె.. యె యె యె యె హత్తుకుపోయె
చుక్కలు చూడని లోకం లోకి
చప్పున నన్ను తీసుకుపోయె
ఓయె.. ఒయె.. యె యె యె యె తీసుకుపోయె
వన్స్ అప్ ఆన్ ఎ టైములో పాట సాహిత్యం
చిత్రం: నిన్ను కోరి (2017)
సంగీతం: గోపి సుందర్
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: అరుణ్ గోపాన్
వన్స్ అప్ ఆన్ ఎ టైములో
వైజాగ్ బీచ్ రోడ్డులో
ఏవండోయ్ మాస్టారంటు
విష్ చేసింది నన్నూ...
వన్స్ అప్ ఆన్ ఎ టైములో
వైజాగ్ బీచ్ రోడ్డులో
ఏవండోయ్ మాస్టారంటు
విష్ చేసింది నన్నూ...
అల్లి బిల్లి నడుముని తిప్పి
ఐ లవ్ యు చెవిలోన చెప్పి హో
తప్పుకుంది కల్లు రెండు కప్పి
అందుకేగ గుండెకింత నొప్పి
బ్రేకప్పు.. బ్రేకప్పు.. బ్రేకప్పు..
కింగు లాంటి.. ఉమా గాడి లైఫె పాకప్పు... (2)
బైకెనక.. తను ఎక్కేసి కూర్చుంది చేతుల్ని వేసింది
లైఫంత.. నన్ను వదలనంటు ఒట్టేసి చెప్పింది
సోల్ మేటె దొరికిందనుకుంటె అంతలో...
సోలోగ వదిలేసెలిపోయెను సంతలో
తోక చుక్కల్లె నా వెంట వచ్చి
తేనె చుక్కల్లె తీయగ నచ్చి
బుగ్గ చుక్కని పెట్టుకు వస్తానని
చుక్కలు చూపిందె
మందు చుక్కె మిగిలిందే...
బ్రేకప్పు.. బ్రేకప్పు.. బ్రేకప్పు..
కింగు లాంటి.. ఉమా గాడి లైఫె పాకప్పు... (2)
నీ సుఖమె.. కోరుకున్నాను అన్నది వన్నెల చిన్నది
కాబట్టె.. నీ కంటికి దూరంగ ఉన్నాను అన్నది
తను లేక మనుసుకి సుఖమెట్టా ఉంటది
నా బాధ పిల్లకి ఎపుడర్దం అవుతది
ఈ లేడీసు ఇంతె తమ్మి
వాల్లు చెప్పినవన్ని నమ్మి
మనసిచ్చామంటె తిరిగి ఇవ్వరు
పట్టుకు పోతారె..
వేరె వాన్ని కట్టుకు పోతారె..
బ్రేకప్పు.. బ్రేకప్పు.. బ్రేకప్పు..
కింగు లాంటి.. ఉమా గాడి లైఫె పాకప్పు... (3)
పాకప్...
హే బదులు చెప్పవె పాట సాహిత్యం
చిత్రం: నిన్ను కోరి (2017)
సంగీతం: గోపి సుందర్
సాహిత్యం: అనంత శ్రీరామ్
గానం: హరిచరన్
హే బదులు చెప్పవె
రుజువు చూపవె సమయమా
నీ పనిగ నువ్విల గడిచిపోవడం న్యాయమా
ఏ పరిచయానికేం ఫలితమున్నదో తెలుపుమా
అది ఆ తొలి క్షణాలలో
తెలుసుకోవడం సాధ్యమా...
నిన్నేనే అడిగేది... ఎన్నాల్లే నలిగేది...
హే బదులు చెప్పవె
రుజువు చూపవె సమయమా
నీ పనిగ నువ్విల గడిచిపోవడం న్యాయమా
వేలి తోటి వేలు కలిపేయగానె చాలు
వేల యేల్లు వాళ్ళు కలిసుందురందురే
ప్రానమైన వారు జంట లాగ చేరితే
ఎన్నడైన వీడరన్న మాట నమ్మరే
నిన్నేనే అడిగేదీ... ఎన్నాల్లే నలిగేదీ...
దారులేమొ రెండె అవి ముళ్ళతోటి నిండె
ఎంచుకోమనంటు వదిలేసి వెళ్లకే
నిన్న లోని లోపమేదొ నిండి ఉందని
రేపు దాన్ని లోటులా మిగల్చలేం కదా
హే బదులు చెప్పవె
రుజువు చూపవె సమయమా
నీ పనిగ నువ్విల గడిచిపోవడం న్యాయమా
ఏ పరిచయానికేం ఫలితమున్నదో తెలుపుమా
అది ఆ తొలి క్షణాలలో
తెలుసుకోవడం సాధ్యమా...
నిన్నేనే అడిగేది... ఎన్నాల్లే నలిగేది...
నిన్నేనే అడిగేది... ఎన్నాల్లే నలిగేది...
నిన్ను కోరీ పాట సాహిత్యం
చిత్రం: నిన్ను కోరి (2017)
సంగీతం: గోపి సుందర్
సాహిత్యం: శివ నిర్వాణ
గానం: అరుణ్ గోపన్
నిన్ను కోరీ
నిన్ను కోరీ
నిన్ను కోరీ
నిన్ను కోరీ….
కదిలే నదిలా
కరిగా కనులా
నిన్ను కోరీ
నడిచే ప్రతి దారీ
నిన్ను కోరీ
ఎగసే నా ఊపిరీ..
చెలియా ఓ సఖియా..
నిన్ను కోరీ..
ఓ చెలియా ఓ సఖియా..
నిన్ను కోరీ..