Lakshmi (2006) Telugu Songs Lyrics
Music : Ramana Gogula
Director : V. V. Vinayak
Producer : Nallamalupu Bujji
Actor : Venkatesh
Actresses : Nayanthara , Charmy Kaur
Supporting Cast : Sharwanand
Release Date : 14 January 2006
Dhaga Dhaga Song Lyrics in Telugu – Lakshmi (2006)
'Dhaga Dhaga' song from Lakshmi (2006) movie. Music composed by Ramana Gogula and sung by Ramana Gogula and Ganga.
Taara Taluku Taara Song Lyrics in Telugu – Lakshmi (2006)
'Taara Taluku Taara' song from Lakshmi (2006) movie. Music composed by Ramana Gogula and sung by Raju and Sunitha Upadrashta.
Music : Ramana Gogula
Lyricist : Chandrabose
Singers : Raju, Sunitha Upadrashta
Hey Satyabhama Song Lyrics in Telugu – Lakshmi (2006)
'Hey Satyabhama' song from Lakshmi (2006) movie. Music composed by Ramana Gogula and sung by Shankar Mahadevan and Sudha Krishna.
Ammayi Andhra Mirchi Song Lyrics in Telugu – Lakshmi (2006)
'Ammayi Andhra Mirchi' song from Lakshmi (2006) movie. Music composed by Ramana Gogula and sung by Tippu and Shreya Ghoshal.
Ne Puttindi Neekosame Song Lyrics in Telugu – Lakshmi (2006)
'Ne Puttindi Neekosame' song from Lakshmi (2006) movie. Music composed by Ramana Gogula and sung by Rajesh Krishnan and Ganga.
Lakshmi (2006)
చిత్రం: బైకర్ (2026) సంగీతం: గిబ్రాన్ వైబోధ నటీనటులు: శర్వానంద్, రాజశేఖర్ , మాళవిక నాయర్ దర్శకత్వం: అభిలాష్ రెడ్డి కంకర నిర్మాతలు: వి. వంశీ కృష్ణా రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి విడుదల తేది: 03.04.2026
Songs List:
ప్రెట్టీ బేబీ పాట సాహిత్యం
చిత్రం: బైకర్ (2026) సంగీతం: గిబ్రాన్ వైబోధ సాహిత్యం: కృష్ణకాంత్ గానం: యాజిన్ నిజార్, సుబ్లాషిని Pretty baby hey pretty baby My baby my my my she is mine always mine బ్యాక్ సీట్ ఖాళీగుంది Weather చూస్తే కూల్ గుంది Baby my baby నెక్స్ట్ లెవెల్ స్టైల్ నీది పల్స్ రేట్ పెంచుతుంది Baby my baby షేక్ డ్రెస్ హాటు లుక్స్ రెడ్ లిప్స్ స్లిమ్ హిప్స్ ఓసి మిస్సు చెప్పు ఎస్సు ఇవ్వు నాకు ఒక్క కిస్సు బ్యూటీ మై బ్యూటీ నెక్స్ట్ లెవెల్ స్టైల్ నీది పల్స్ రేట్ పెంచుతుంది Baby my baby కలవి నువ్వేలే కలర్ నువ్వేలే, నువ్వేలే అన్ని నువ్వేలే నేనే నువ్వేలే, నువ్వేలే మనసు నువ్వేలే మహిమ నువ్వేలే, నువ్వేలే గుండె నిండా ఉన్నదంటే ఒక్క నువ్వే, ఒక్క నువ్వే ఒక్క నువ్వే ఒక్క నువ్వే, నువ్వేలే బ్యాక్ సీట్ ఖాళీగుంది Weather చూస్తే కూల్ గుంది Baby my baby నెక్స్ట్ లెవెల్ స్టైల్ నీది పల్స్ రేట్ పెంచుతుంది Baby my baby క్రష్ నువ్వేలే బ్లషు నువ్వేలే, నువ్వేలే Bless నువ్వేలే ప్లస్ నువ్వేలే, నువ్వేలే కిస్ నువ్వేలే stress నువ్వేలే, ఒక్క నువ్వే, ఒక్క నువ్వే ఒక్క నువ్వే ఒక్క నువ్వే, నువ్వేలే బ్యాక్ సీట్ ఖాళీగుంది Weather చూస్తే కూల్ గుంది Baby my baby నెక్స్ట్ లెవెల్ స్టైల్ నీది పల్స్ రేట్ పెంచుతుంది Baby my baby
జిద్ది జిద్ది పాట సాహిత్యం
చిత్రం: బైకర్ (2026) సంగీతం: గిబ్రాన్ వైబోధ సాహిత్యం: కృష్ణకాంత్ గానం: గిబ్రాన్ వైబోధ నువ్వు మెరుపులాగా కదిలిదే ఓసారి ఆగి చూడదా పరుగు కూడా నిలపదా ప్రకాశ వేగమే ఏ బెదురు లేక సాగిదే నిరాశ నీడ ఓడదా గెలుపు కూడా అడగదా ఆ మాటకి అర్థమే హీస్ జస్ట్ నాట్ చేజింగ్ ఎ డ్రీమ్ చేజింగ్ ఎ డ్రీమ్ హీస్ గోన్నా ఎర్న్ హిమ్ ఎ నేమ్ ఎర్న్ హిమ్ ఎ నేమ్ జిద్ది జిద్ది పదం లోన నీతో నీవే సాగరా జిద్ది జిద్ది పదం లోన నింగే నువ్వై సాగరా భారత్ల్య్రిక్స్.కోమ్ ఎంజిన్స్ రోర్ బిఫోర్ ద డాన్ ది ఫైర్ ఇన్ హిస్ చెస్ట్ అవేక్స్ ఎవరీ మైల్ ప్రామిస్ మేడ్ ఎవరీ బ్రూస్ ఎ డ్రీమ్ దట్ టేక్స్ స్వెట్ అండ్ థండర్ ఫ్యూయల్ హిస్ విల్ నో ...
Biker (2026)
చిత్రం: ఆడవాళ్ళు మీకు జోహార్లు (2022) సంగీతం: దేవీశ్రీప్రసాద్ నటీనటులు: శర్వానంద్, రస్మిక మందన్న దర్శకత్వం: తిరుమల కిషోర్ నిర్మాత: సుధాకర్ చెరుకూరి విడుదల తేది: 25.02.2022
Songs List:
ఆడాళ్ళు మీకు జోహార్లు పాట సాహిత్యం
చిత్రం: ఆడవాళ్ళు మీకు జోహార్లు (2022) సంగీతం: దేవీశ్రీప్రసాద్ సాహిత్యం: శ్రీమణి గానం: దేవీశ్రీప్రసాద్ హే లక్ష్మమ్మో పద్మమ్మో శాంతమ్మో శారదమ్మో గౌరమ్మో కృష్ణమ్మో నా బాధే వినవమ్మో ఈ గోలే ఏందమ్మో ఈగోలే చాలమ్మో ఓలమ్మో ప్లీజమ్మో నా బతుకే బుగ్గయ్యేనమ్మో నీ మొగుడేమన్నా మహేష్ బాబా పోనీ అందానికేమైనా బాబా చైలా..! కాపురం చైలా కన్లా..! ఇద్దర్ని కన్లా పోనీ నువ్వేమన్నా కత్రీనా కైఫా నీ చూపేమన్నా గుచ్చే నైఫా కానీ, చైలా..! కాపురం చైలా మీరు కన్లా..! ముగ్గుర్ని కన్లా మీరేమో మొగుళ్ళు సాయంత్రం తెచ్చేటి పూలన్నీ జళ్ళోన ముడిసేత్తారా నాకేమో ఏ పూలు లేకుండా సేసేసి ఫూల్లాగ మడిసెత్తారా..? ప్రతి మొగాడి విజయం వెనక ఆడది ఉంటది అంటారు కానీ నా విజయాన్ని చెడగొట్టడానికి ఎందరు ఆడాల్లో ఆడాళ్ళు మీకు జోహార్లు ఆడాళ్ళు మీకు జోహార్లు సినిమాకెళ్తే నా ఏజ్ ఫ్రెండు పెళ్ళాన్ని తీసుకురాడా వాడు నన్నే చూసి సెల్లమ్మేదని అనడా, మరి అనడా సాయంత్రమైతే సందు శివర పువ్వుల కొట్టు సుబ్బన్న మల్లెలు తీసుకెళ్ళి సెల్లెలుకిమ్మని వెయ్ డా, జోకులు వెయ్ డా మీరేమో మీ మొగుడు ఏ పనికి వెళ్తున్నా సిరునవ్వులొలికించి ఎదురొత్తారా నాకేమో ఎదురొచ్చే అవకాశం ఏ పిల్లకి ఇవ్వనియ్యకుండా ఆపెత్తారా ఎదురింట్లోన ఎంకయ్య తాతకి ఇద్దరు పెళ్ళాలు అరె, లేనే లేదు నా తలరాతకి సింగిలు ఇల్లాలు ఆడాళ్ళు మీకు జోహార్లు ఆడాళ్ళు మీకు జోహార్లు ముద్దులతోటి నిద్దుర లేపే పెళ్ళాం కావాలని ఉండదా డిన్నరు పెట్టి డ్రీమ్స్ లోకి నెట్టే డ్రీమ్ గర్ల్ నాకు కావాలని పించదా తన ఒళ్ళో వాలి ఓటీటి చూడాలి అని నాక్కుడా ఉండదా ఆకలి వేస్తే తనకో ఆమ్లెట్ వేయాలనిపించదా, నాకనిపించదా మీరేమో మీ మొగుడు పండక్కి కొని తెచ్చే చీరల్ని చుట్టేసి తిరిగేత్తారా నేనేమో ఓ పట్టు సీరైనా కొనకుండా నా పెళ్లి హాంఫట్టు సేసేత్తారా అరె గంతకి తగ్గ బొంతని సామెత మీరే సెబుతారే..!! నా రేంజికి తగ్గా పిల్లని తెస్తే ఓకే చెప్పరే..!! ఆడాళ్ళు మీకు జోహార్లు ఆడాళ్ళు మీకు జోహార్లు, హ
ఓ మై ఆద్యా పాట సాహిత్యం
చిత్రం: ఆడవాళ్ళు మీకు జోహార్లు (2022) సంగీతం: దేవీశ్రీప్రసాద్ సాహిత్యం: శ్రీమణి గానం: యాజిన్ నిజార్ ఓ మై ఆద్యా నువ్ పక్కన ఉంటే కారైనా గిటారై మోగెనే ఓ మన మధ్య డిస్టెన్సే తగ్గి గేరైనా ప్యారంటూ పలికేనే ఓ ఓ ఓ - తేరే జైస కోయి నహీ ఓ ఓ ఓ - మేరే జైసా దివానా నహీ ఓ ఓ ఓ - రూటే గీసా ప్రయాణానికి నువ్వు నేను మాత్రం ఉండే చోటుకీ ఓ మై ఆద్యా నువ్ పక్కన ఉంటే కారైనా గిటారై మోగెనే ఓ మన మధ్య డిస్టెన్సే తగ్గి గేరైనా ప్యారంటూ పలికేనే గూగుల్ మ్యాపుకే దొరకని చోటుకే నడవని బండినే మనతో వీక్ డే సాటర్డే బేధమే తెలియని ప్లేసునే వెతకని నీతో సరదాగా షికారు అంటూ కొలంబసే కదిలాడే ఈ దేశం ఆ దేశం అంటూ ఎన్నో కనిపెట్టాడే కనుగొందాం మనమీ జర్నీలో ఓ లవ్ దేశం..!! ఓ మై ఆద్యా నువ్ పక్కన ఉంటే కారైనా గిటారై మోగెనే ఓ మన మధ్య డిస్టెన్సే తగ్గి గేరైనా ప్యారంటూ పలికేనే వేమన పద్యమే, షేక్స్పియర్ కావ్యమే నువ్వు ఏం చెప్పిన కవితే లాస్ట్ బాల్ సిక్సరే, షూర్ షాట్ హిట్టురే నువ్వు ఏం చేసిన గెలుపే అందగా ఉంటావంటూ ఎవరెవరో అంటారే అందంపై రాసిన హైకూ లెన్నెన్నో చదివాలె అసలందం ఇవాళ చూసానే అది నీ నవ్వే ఓ మై ఆద్యా నువ్ పక్కన ఉంటే కారైనా గిటారై మోగెనే ఓ మన మధ్య డిస్టెన్సే తగ్గి గేరైనా ప్యారంటూ పలికేనే
ఆసమ్ పాట సాహిత్యం
చిత్రం: ఆడవాళ్ళు మీకు జోహార్లు (2022) సంగీతం: దేవీశ్రీప్రసాద్ సాహిత్యం: శ్రీమణి గానం: సాగర్ ఎన్ని ఎన్ని ఎన్ని ఎన్ని మాటలాడుకున్నా ఇంక కొన్ని మిగిలిపోవడం, ఆసమ్ ఎంత ఎంత ఎంత… ఎంత దూరమున్న నువ్వు పక్కనున్న ఫీలింగ్ కలగడం, ఆసమ్ బాగున్నావా అని నువ్వడిగావా నా బాధలన్నీ పారిపోవడం, ఆసమ్ భోంచేశావా అని ఓ మాటన్నావా నా ఆకలే మాయమవ్వడం, ఆసమ్ ఎన్ని ఎన్ని ఎన్ని ఎన్ని మాటలాడుకున్నా ఇంక కొన్ని మిగిలిపోవడం, ఆసమ్ ఎంత ఎంత ఎంత… ఎంత దూరమున్న నువ్వు పక్కనున్న ఫీలింగ్ కలగడం, ఆసమ్ ఇంత కాలము… ఇన్ని రాత్రులు ఎలాగ నువ్వల్లే కబుర్లే లేక కాలం వ్యర్థమాయనే ఇన్ని రోజులు… రెండు కళ్ళలో ఇలాగ కలల్నే కథల్నే చూసే వీలే లేకపోయెనే నువ్వు నన్ను కలవమన్న చోటు ఎక్కడున్నా ఓ గంట ముందే నేను రావడం, ఆసమ్ ఇంటి వరకు సాగనంపి వీడుకోలు అన్న వెంటనే ఫోన్లో కలవడం, ఆసమ్ నాకెంత నచ్చినా… నీ ఇంత నచ్చని దేన్నైనా ఛీ అంటూ… ఛా అంటూ నీతోటి ఏవోటి తిట్లు కల్పనా ఏ పనొచ్చినా… మా అమ్మే చెప్పినా నాతోటి నీకేదో పనుంది అన్నానో నీవైపే పరుగు తియ్యనా నీకు ఇష్టమైంది ఏదో నువ్వు చెప్పగానే నా ఇష్టమే మారిపోవడం, ఆసమ్ తాజ్ మహల్ అందం అంటూ నువ్వు పొగుడుతుంటే షాజహాన్ ని నేనే అవ్వడం, ఆసమ్ మేల్కొన్నావా అని నువ్వు అడిగావా నా నిద్ధరే సారీ చెప్పడం, ఆసమ్ తెల్లారిపోయిందా అని ఫోనే పెట్టావా ఆ సూర్యుడంటే ఒళ్ళు మండడం, ఆసమ్
మాంగల్యం పాట సాహిత్యం
చిత్రం: ఆడవాళ్ళు మీకు జోహార్లు (2022) సంగీతం: దేవీశ్రీప్రసాద్ సాహిత్యం: దేవీశ్రీప్రసాద్ గానం: జేస్ప్రీత్ జస్జ్ ఓం శత ఓం శత శత ఓం ఓం శత ఓం శత శత ఓం మాంగల్యం తంతునానేనా మన లైఫులో ఇది జరుగునా మమజీవన హేతునా అంటూ మన జీవితమే సాగునా కంఠే భద్నామి సుభగే ఈ సౌండే పడునా మనకే త్వం జీవ శరదాం శతం ఇట్ట పోతూ ఉంటే మన కదే ఖతం మాంగల్యం తంతునానేనా మన లైఫులో ఇది జరుగునా మమజీవన హేతునా అంటూ మన జీవితమే సాగునా కంఠే భద్నామి సుభగే ఈ సౌండే పడునా మనకే త్వం జీవ శరదాం శతం ఇట్ట పోతూ ఉంటే మన కదే ఖతం మూడు ముళ్ళు వెయ్యనివ్వకుండా నా గూడు మొత్తం కూల్చేసినారు ఏడడుగులు నడవనివ్వకుండా ఏడు చెరువుల నీళ్ళు తాగిస్తున్నారు రింగులో ఫింగర్ పెట్టనివ్వకుండా నా లైఫులో ఫింగర్స్ పెట్టేస్తున్నారు అరుంధతి నక్షత్రం బదులు చుక్కలు చూపిస్తున్నారు మాంగల్యం తంతునానేనా మన లైఫులో ఇది జరుగునా మమజీవన హేతునా అంటూ మన జీవితమే సాగునా ఓం శత ఓం శత శత ఓం ఓం శత ఓం శత శత ఓం ఓం ఓం శత ఓం శత శత ఓం ఓం శత ఓం శత శత ఓం జీలకర్ర బెల్లం బదులు నా నెత్తి మీద టోపీ పెట్టారు దిష్టి చుక్కే బుగ్గనెట్టకుండా నన్ను దిష్టిబొమ్మల్లె మార్చేసినారు ఫస్ట్ నైటే నాకు లేకుండా ఫ్రస్ట్రేషన్ నైట్సు గిఫ్టుగిచ్చారు హనీమూన్ కెళ్ళి డ్యూయెట్ పాడకుండా ఫుల్ మూన్లో సోలోగా పడుకోబెట్టారు మాంగల్యం తంతునానేనా మన లైఫులో ఇది జరుగునా మమజీవన హేతునా అంటూ మన జీవితమే సాగునా కంఠే భద్నామి సుభగే ఈ సౌండే పడునా మనకే త్వం జీవ శరదాం శతం ఇట్ట పోతూ ఉంటే మన కదే ఖతం
కలగా కలగా పాట సాహిత్యం
చిత్రం: ఆడవాళ్ళు మీకు జోహార్లు (2022) సంగీతం: దేవీశ్రీప్రసాద్ సాహిత్యం: శ్రీమణి గానం: మహాలింగం కలగా కలగా కలగా మిగిలే కధలెన్నో అటువైపే అడుగేస్తుందా ఈ కథ కూడా అనగా అనగా అనగనగ పయనాలెన్నో వాటన్నిటి మధ్య నలగని ప్రేముంటుందా ఏ దరో చేరాలని మొదలైన ఈ ప్రయాణమే ఏ ధరి దరిచేరక ఏ వైపు సాగునో కలగా కలగా కలగా మిగిలే కధలెన్నో అటువైపే అడుగేస్తుందా ఈ కథ కూడా అనగా అనగా అనగనగ పయనాలెన్నో వాటన్నిటి మధ్య నలగని ప్రేముంటుందా ఏ గుండెది ఏ భారమో ఈ మనసుకే తెలిసేదెలా ఏ కన్నుది ఏ శోఖమో ఈ చూపుతో చూసేదెలా తెలియదు ఏ పదాలు రెండు ముడిపడునో ఏ క్షణాన విడిపోవునో తెలుపవు ఏ స్వరాలూ తీపి పాటౌనో టెన్ టు ఫైవ్ వేధనల్లే వేధించునో కలగా కలగా కలగా మిగిలే కధలెన్నో అటువైపే అడుగేస్తుందా ఈ కథ కూడా అనగా అనగా అనగనగ పయనాలెన్నో వాటన్నిటి మధ్య నలగని ప్రేముంటుందా
Aadavallu Meeku Johaarlu (2022)
చిత్రం: ఒకే ఒక జీవతం (2022) సంగీతం: జోక్స్ బిజోయ్ నటీనటులు: శర్వానంద్, రీతువర్మ , అమల దర్శకత్వం: శ్రీ కార్తీక్ నిర్మాత: S.R.ప్రభు, S. R. ప్రకాష్ బాబు విడుదల తేది: 2022
Songs List:
అమ్మా పాట సాహిత్యం
చిత్రం: ఒకే ఒక జీవతం (2022) సంగీతం: జోక్స్ బిజోయ్ సాహిత్యం: సిరివెన్నెల గానం: సిద్ శ్రీరాం అమ్మా..! వినమ్మా.. నేనాటి నీ లాలి పదన్నే ఓ ఔనమ్మా.. నేనేమ్మా.. నువ్ ఏనాడో కనిపెంచిన స్వరాన్నే మౌనమై ఇన్నాళ్లూ నిదరలోనే ఉన్నా.. గానమై ఈనాడే మేలుకున్నా.. నీ పాదాలకు మువ్వల్లా నా అడుగులు సాగాలమ్మా నీ పెదవుల చిరునవ్వుల్లా నా ఊపిరి వెలగాలమ్మా నిరంతరం నీ చంటిపాపల్లే ఉండాలినే నెన్నాళ్లకీ.. నిన్నొదిలేంతగ ఎదగాలనుకోనే అమ్మా.... అణువణువు నీ కొలువే అమ్మా.. ఎదసడిలో శ్రుతిలయలు నువే అమ్మా.. అమ్మా.. నే కొలిచే శారదవే నను నిత్యం నడిపే సారధివే బెదురుపోవాలంటే నువ్వు కనిపించాలి నిదర రావాలంటే కథలు వినిపించాలి ఆకలయ్యిందంటే నువ్వెతినిపించాలి ప్రతి మెతుకు నా బతుకు అనిపించేలా.. నువ్వుంటేనే నేనూ నువ్వంటేనే నేనూ అనుకోలేకపోతే ఏమైపోతాను నీ కడ చూపే నన్ను కాస్తూ ఉండక తడబడి పడిపోనా చెప్పమ్మా మరి మరి నునునువు మురిపెంగా చూస్తూ ఉంటే చాలమ్మా పరిపరి విధముల గెలుపులుగా పైకెదుగుతు ఉంటానమ్మా.. అయినా సరే ఏనాటికీ ఉంటాను నీ పాపాయినై నిన్నొదిలేంతగా ఎదగాలనుకోనే నిరంతరం నీ చంటిపాపల్లే ఉండాలినే నెన్నాళ్లకీ.. (3) నిన్నొదిలేంతగ ఎదగాలనుకోనే అమ్మా.... అణువణువు నీ కొలువే అమ్మా.. ఎదసడిలో శ్రుతిలయలు నువే అమ్మా.. అమ్మా.. నే కొలిచే శారదవే నను నిత్యం నడిపే సారధివే
Oke Oka Jeevitham (2022)
చిత్రం: మహా సముద్రం (2021) సంగీతం: చైతన్ భరద్వాజ్ నటీనటులు: శర్వానంద్, సిద్ధార్ద్, అదితి హైదరి, అనుఇమాన్యుయేల్ దర్శకత్వం: అజయ్ భూపతి నిర్మాత: అనీల్ సుంకర విడుదల తేది: 14.10.2021
Songs List:
హే రంభ..రంభ పాట సాహిత్యం
చిత్రం: మహా సముద్రం (2021) సంగీతం: చైతన్ భరద్వాజ్ సాహిత్యం: భాస్కరభట్ల గానం: చైతన్ భరద్వాజ్ హే మందే ఇక మందే… ఇసాఖపట్నం బీచు తాగొచ్చు ఊగొచ్చు… ఏదైనా చెయ్యొచ్చు కొట్టెయ్ జై కొట్టేయ్… మనమంతా రంభ ఫ్యాన్సు కట్టేద్దాం బ్యానర్సు… పెట్టేద్దాం కటౌట్సు కొర్రామీను మాదిరి వర్రా వర్రగుంటది కుర్రాగాళ్ళ గుండెకి గాలం వేస్తదిరా ఎర్ర పెదవి కొరికితే… సర్రాసరి నవ్వితే బుర్ర తిరిగిపోతది… గిర్రా గిర్రా గిర్రా గిర్రా ఓ రంభ రంభ… హే రంభ హే రంభ రంభ రంభ రంభ రంభ హే రంభ హే రంభ… పండగే ప్రారంభ హే రంభ హే రంభ… రంభ రంభ రంభ రంభ హే రంభ హే రంభ… ఎక్కడే గుడుంబా సోడా ఐస్ లేకుండా రెండు నైంటీలు గనక పీకామనుకో బాడీలో రంభ డాన్సు ఆడెద్దిరా మావా ఈల కొట్టెయ్ కొట్టెయ్… సౌండ్ పెట్టెయ్ పెట్టెయ్ డాన్సు కట్టెయ్ కట్టెయ్… దుమ్మే రేగాలా పూలు ఏసెయ్ ఏసెయ్… బీరు పోసెయ్ పోసెయ్ కోడి కోసెయ్ కోసెయ్, హే హే హే దీని అందం… మత్తు మందు సమానమే మునిగిపోదా దూకెయ్ దీని నడుం బాణాసంచా దుకాణమే ముట్టుకుంటే అది చాలా చాలా ప్రమాదం ఓ రంభ రంభ… హే రంభ హే రంభ రంభ రంభ రంభ రంభ హే రంభ హే రంభ… పండగే ప్రారంభ హే రంభ హే రంభ… రంభ రంభ రంభ రంభ హే రంభ హే రంభ… ఎక్కడే గుడుంబా సాక్షాత్ శ్రీకృష్ణుడే… ఓ వేలితోటి కొండనెత్తాడే అరె ఒంటి చేత్తో ఆంజనేయుడే మరి సంజీవని ఎత్తుకొచ్చాడే అయ్య బాబోయ్ మనవల్ల కాదు మనమంతటి గొప్పోళ్ళం కాదు ఓ సీసానైనా ఎత్తకపోతే ఎట్టా మావా..? ఓ రంభ రంభ… హే రంభ హే రంభ రంభ రంభ రంభ రంభ హే రంభ హే రంభ… పండగే ప్రారంభ హే రంభ హే రంభ… రంభ రంభ రంభ రంభ హే రంభ హే రంభ… ఎక్కడే గుడుంబా
చెప్పకే చెప్పకే పాట సాహిత్యం
చిత్రం: మహా సముద్రం (2021) సంగీతం: చైతన్ భరద్వాజ్ సాహిత్యం: చైతన్య ప్రసాద్ గానం: దీప్తి పార్థసారథి, చైతన్ భరద్వాజ్, చైతన్య ప్రసాద్ చెప్పకే చెప్పకే ఊసుపోని మాటలు చాలులే వేలాకోలం ఊరుకో నేర్పకే నేర్పకే లేనిపోని ఆశలు మనసా మళ్ళీ రాకు వెళ్ళిపో ఎగసే కలలే అలలై… యెదనే ముంచేసేలే కదిలే కథలే కడలై… ఉప్పెనల్లే ఊపేసేలే ఎందుకీ బంధాలన్నీ కలపకులే, నిలపకులే గెంటేస్తాను గెంటేస్తాను… నిన్నిక ఇపుడే మనసా కనబడితే ఎదురుగ నిలబడితే చంపేస్తాను చంపేస్తాను తొందరపడితే చల్లనైన చూపు నువ్వే… మంచి గంధపు మాట నువ్వే ముళ్లకంచెలన్నీ తెంచి… పూల బాటవయ్యావే మోయలేని హాయి నువ్వే… నన్నే మార్చిన మాయ నువ్వే ముందు నువ్వు వెళ్తావుంటే… వెంట నీడనయ్యానే వేసవి వేడిలో లేతగాలై వచ్చావే మమతే కురిసి మనసే తడిసెలే నువు నా జతగా ఉంటె… బతికా నే ధైర్యమై తెలిసేనిపుడే ఇపుడే… జీవితాన మాధుర్యమే వింతగా నన్నే నేను మరచితినే, మురిసితినే నిన్నా లేని మొన్నా లేని… వెన్నెల విరిసే, మ్ మ్ మదికొక మది దొరికే… కలతల కథ ముగిసే అంతే లేని సంతోషాల కాంతులు కురిసే నువ్వు నేను వేరు అన్నా… నీవైపస్సలు చూడకన్నా దొంగలాగ కళ్ళే నిన్నే… తొంగి తొంగి చూసాయే పగ్గమేసి ఆపుతున్నా… ప్రేమే కాదిది స్వార్ధమన్నా సిగ్గులేని కళ్ళే ముగ్గులోకి తోసాయే నా మదే ఈ విధి ప్రేమ మదే అయిందే కుదురే మరచి వరదై ఉరికెలే తపమే తపమై జపమై… నిలిచా నీకోసమే జడిలా ముసిరే కసిరే… జ్ఞాపకాల్ని తోసేసాలే ప్రేమకే రూపం నువ్వు అని తెలిసే, మది మురిసే గుండె తీసి దండే చేసి రమ్మని పిలిచే ఎద ఇది నిలవదులే… నిను ఇక వదలదులే ఆనందాల మహాసంద్రామాయను మనసే
హే తికమక పాట సాహిత్యం
చిత్రం: మహా సముద్రం (2021) సంగీతం: చైతన్ భరద్వాజ్ సాహిత్యం: కిట్టు విస్సా ప్రగడ గానం: హరిచరణ్, నూతన్ మోహన్, చైతన్ భరద్వాజ్ హే తికమక మొదలే… ఎద సొద వినదే అనుకుందే తడువా… తెగ నచ్చి నచ్చి పిచ్చే పట్టే హే తెలియక తగిలే… తొలకరి చినుకే మొహమాటం ఒడిలో… సరదాగా జారి వానై మారే హే ఎటుపోనుందో దగ్గరగా ఉన్నా దూరాలే చెలి గాలుల్లో పంతంగుల్లాగా తూలే అడగాలన్నా చిత్తడి చూపుల్లో ఏముందో పెదవంచుల్లో రహస్యంలోన తలమునకలివే ఆ, తెగ తడబడుతూ పొరబడుతూ నిలబడితే ఎలా అరకొర చనువే వద్దొద్దని అడక్క నిలిచే ఆ, పదుగురి ఎదురే… కొరకొరగా ఎగబడితే ఎలా తనువును తడిపే కలబడితే గప్ చుప్ అని మనస్సునడిగే నక్కీ నక్కీ దాక్కుంటుంటే లోలో అందాలే వెతికినది విసిరినది చూపు కౌగిలే తట్టి తట్టి తాకిందేమో ప్రేమే వానల్లే మిన్నే మన్నే మన ఇద్దర్లా మారాయే ఏ క్షణమైనా తనలోని ప్రేమంతా ఒక్కింతైనా టెన్ టూ ఫైవ్ తిరిగొస్తుందేమో ఏ వివరం నచ్చి మెచ్చి ఉబ్బి తబ్బిబ్బయ్యిందో ఎద కడలిలో అలలుగా ఎగసేనా ఆ, పదుగురి ఎదురే… కొరకొరగా ఎగబడితే ఎలా తనువును తడిపే కలబడితే గప్ చుప్ అని మనస్సునడిగే నచ్చి నచ్చి పైపై వాలే ప్రేమే చూపించే మగువనలా చులకనగా చూడరాదుగా వచ్చి వచ్చి వాలిందేమో సీతాకోకల్లే కన్నె కళ్ళే నా యద గుట్టే లాగాయే హే ఎగసిందా లోలోన ఆరాటం కాసేపైనా దాచే పని లేదా నా కలలో కూడా నువ్వే వచ్చి పిచ్చే పట్టించి ఏమెరుగక ఎదురుగా నిలవాలా ఆ, పదుగురి ఎదురే… కొరకొరగా ఎగబడితే ఎలా తనువును తడిపే కలబడితే గప్ చుప్ అని మనస్సునడిగే
జగడాలే రాని పాట సాహిత్యం
చిత్రం: మహా సముద్రం (2021) సంగీతం: చైతన్ భరద్వాజ్ సాహిత్యం: భాస్కరభట్ల గానం: హేమచంద్ర, చైతన్ భరద్వాజ్ ఎపుడు నువు తలెత్తుకో నిను మించిన తోపెవడిక్కడ వడిగా కలబడిపో భయపడితే బతకవు ఎక్కడ తిడితే నువు పడొద్దురోయ్ తేల్చేసెయ్ ఎక్కడికక్కడ కొడితే ఎదురెలిపో దీని తస్సాదియ్యా నే చెప్పిన లక్షణాలు చూపించవు పుస్తకాలు నా వెంబడి నేరుగా… వస్తే చూపిస్తా నేనొకడికి లొంగడాలు ఓ పడిపడి మొక్కడాలు నా ఒంటికి పడదుగా తమాషాలొద్దు నాతో జగడాలే రాని రాని చూసుకుందాం చావోరేవో తేలిపోద్దిలే కెరటాల తోటి పోటి దేనికంట లెక్క పత్రం రాసుకోదులే ఎపుడు నువు తలెత్తుకో నిను మించిన తోపెవడిక్కడ వడిగా కలబడిపో భయపడితే బతకవు ఎక్కడ తిడితే నువు పడొద్దురోయ్ తేల్చేసెయ్ ఎక్కడికక్కడ కొడితే ఎదురెలిపో ఎవడైతే ఏంటి కాతర లోకమెపుడు అరె బ్రదరు డేగ కళ్ళతో చూస్తు ఉంటది, వదులదురా నువు అవ్వకు కోడి… మిగలదు బాడీ అన్ని వేళల శాంతి మంత్రము వల్లెవేయకు కట్టేస్తారు పాడి ఆ సంగతి తెలుసు నాకు కాబట్టే పొగరు నాకు ఆ మాత్రం ఉండడం తప్పేం కాదంటా మైండ్ ఉన్నోడెవ్వడైన నాలాగే బతుకుతాడు నే చెప్పే మాటకే చెయ్యెత్తి మొక్కుతాడు ఎపుడు నువు తలెత్తుకో నిను మించిన తోపెవడిక్కడ వడిగా కలబడిపో భయపడితే బతకవు ఎక్కడ తిడితే నువు పడొద్దురోయ్ తేల్చేసెయ్ ఎక్కడికక్కడ కొడితే ఎదురెలిపో దీని తస్సాదియ్యా జగడాలే రాని రాని చూసుకుందాం చావోరేవో తేలిపోద్దిలే కెరటాల తోటి పోటి దేనికంట లెక్క పత్రం రాసుకోదులే (2)
మనసు మరిగే మౌనమే పాట సాహిత్యం
మనసు మరిగే మౌనమే
Maha Samudram (2021)
చిత్రం: శ్రీకారం (2021) సంగీతం: మిక్కీ జే మేయర్ నటీనటులు: శర్వానంద్, ప్రియాంక అరుళ్ మోహన్ దర్శకత్వం: బి. కిశోర్ నిర్మాతలు: రామ్ ఆచంట, గోపీ ఆచంట విడుదల తేది:11.03. 2021
Songs List:
భలేగుంది బాలా పాట సాహిత్యం
చిత్రం: శ్రీకారం (2020) సంగీతం: మిక్కీ జే మేయర్ సాహిత్యం: పెంచల్ దాస్ గానం: పెంచల్ దాస్, నూతన మోహన్, ధనుంజయ్, అనురాగ్ కులకర్ణి వచ్చానంటివో పోతానంటివో వగలు పలుకుతావే కట్టమింద పొయ్యే అలకల సిలకా భలేగుంది బాలా దాని ఎధాన దాని ఎధాన దాని ఎధాన ఉండే పూల పూల రైక భలేగుంది బాలా వచ్చానంటివో పోతానంటివో వగలు పలుకుతావే వచ్చానంటివో పోతానంటివో వగలు పలుకుతావే కట్టమింద హ కట్టమింద భలే కట్టమింద పొయ్యే అలకల సిలకా భలేగుంది బాలా దాని ఎధాన దాని ఎధాన దాని ఎధాన ఉండే పూల పూల రైక భలేగుందే బాలా అరెరెరెరే నారి నారి వయ్యారి సుందరి నవ్వు మొఖముదాన నారీ నారీ వయ్యారి సుందరి నవ్వు మొఖముదాన నీ నవ్వు మొఖం నీ నవ్వు మొఖం నీ నవ్వు మొఖంమింద నంగనాచి అలక భలేగుంది బాలా నీ నవ్వు మొఖంమింద నంగనాచి అలక భలేగుంది బాలా వచ్చానంటివో పోతానంటివో వగలు పలుకుతావే కట్టమింద పొయ్యే అలకల సిలకా భలేగుంది బాలా దాని ఎధాన ఉండే పూల పూల రైక భలేగుందే బాలా హో ఓ ఓ... హో ఓ ఓ... ఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓ... అరరే అరరే అరె అరె అరె అరె తిక్కరేగి ఎక్కినావు కోమలి అలక నులక మంచం తిక్కరేగి ఎక్కినావు కోమలి అలక నులక మంచం అల సందా పోవ్వ నీకు అలక ఏలనే అగుడు సేయ తగునా అల సందా పోవ్వ నీకు అలక ఏలనే అగుడు సేయ తగునా వచ్చానంటివో అరె వచ్చానంటివో ఓ ఓ ఓ వచ్చానంటివో పోతానంటివో వగలు పలుకుతావే కట్టమింద పొయ్యే అలకల సిలకా భలేగుంది బాలా దాని ఎధాన ఉండే పూల పూల రైక భలేగుంది బాలా అరెరెరెరే సురుకు సూపు సొరకత్తులిసరకే సింత ఏల బాలా సురుకు సూపు సొరకత్తులిసరకే సింత ఏల బాలా కారమైన ముది కారామైన ముది కారమైన నీ మూతి ఇరుపులు భలేగున్నయే బాలా నీ అలక తీరనూ ఏమి భరణము ఇవ్వగలను భామ ఎన్నెలైన ఏమంత నచ్చదూ ఊ ఊ ఊ ఎన్నెలైన ఏమంత నచ్చదూ నువ్వు లేని చోటా ఎన్నేలైన ఏమంత నచ్చదూ నువ్వు లేని చోటా నువ్వు పక్కనుంటే నువ్వు పక్కానుంటే నువ్వు పక్కనుంటే ఇంకేమి వద్దులే చెంత చేర రావా ఇంకనైన పట్టించుకుంటనని మాట ఇవ్వు మావా తుర్రుమంటు పైకెగిరిపోద్ది నా అలక సిటికలోన
సందల్లే సందల్లే పాట సాహిత్యం
చిత్రం: శ్రీకారం (2021) సంగీతం: మిక్కీ జే మేయర్ సాహిత్యం: సనపాటి భరద్వాజ్ పాత్రుడు గానం: అనురాగ్ కులకర్ణి, మోహన భోగరాజు సందల్లే సందల్లే సంక్రాంతి సందల్లే అంగరంగ వైభవంగా సంక్రాంతి సందల్లే సందల్లే సందల్లే సంక్రాంతి సందల్లే అంగరంగ వైభవంగా సంక్రాంతి సందల్లే మన ఊరితో సమయాన్నిలా గడిపేయడం ఒక సరదారా మనవారితో కలిసుండడం ఒక వరమేరా నను మరవని చూపులెన్నెన్నో నను నడిపిన దారులెన్నెన్నో నను మలచిన ఊరు ఎన్నెన్నో గురుతులనిచ్చినదే సందల్లే సందల్లే సంక్రాంతి సందల్లే అంగరంగ వైభవంగా సంక్రాంతి సందల్లే సందల్లే సందల్లే సంక్రాంతి సందల్లే అంగరంగ వైభవంగా సంక్రాంతి సందల్లే ముగ్గుమీద కాలు వెయ్యగానే రయ్యిమంటూ కయ్యిమన్న ఆడపిల్ల ముక్కు మీదకొచ్చే కోపం భోగి మంట ముందు నిల్చొనుంది చల్లగాలి ఒంటినే వెచ్చగా తాకుతోంది తంబురాలతో చిడత పాడెనంట గంగిరెద్దులాటలో డోలు సన్నాయంట పెద్ద పండగొచ్చెనోయంటూ ముస్తాబుఅయ్యింది చూడరా, ఊరు ఇచ్చటా ఇంటిగడప ఉంది స్వాగతించడానికి వీధి అరుగు ఉంది మాట కలపడానికి రచ్చబండ ఉంది తీర్పు చెప్పడానికి ఊరు ఉంది చింత దేనికీ మన ఊరితో సమయాన్నిలా గడిపేయడం ఒక సరదారా మన వారితో కలిసుండడం ఒక వరమేరా ఓఓఓ... దెబ్బలాటలోన ఓడిపోతే కోడిపుంజు పొయ్యి మీద కూరలాగా తాను మాడిపోదా పాపం నేల మీది నుండి గాలిపటం నింగిదాకా దారమే తోకగా ఎగురుతుంది ఎడ్ల బండిపై ఎక్కు చిన్నా పెద్దా గోలగోల చెయ్యడం ఎంత బాగుందంట రోజు మారిపోయినాగాని తగ్గేది లేదంటా అంతటా సంబరాలే విందు భోజనాలు చేసి రావడానికి నచ్చినట్టు ఊరిలోన తిరగడానికి అంతమందినొక్కసారి కలవడానికి చాలవంట మూడు రోజులు మన ఊరితో సమయాన్నిలా గడిపేయడం ఒక సరదారా మన వారితో కలిసుండడం ఒక వరమేరా ఆ ఆ ఆ... మన ఊరితో సమయాన్నిలా గడిపేయడం ఒక సరదారా మనవారితో కలిసుండడం ఒక వరమేరా ఓఓఓ... సందల్లే సందల్లే సంక్రాంతి సందల్లే అంగరంగ వైభవంగా సంక్రాంతి సందల్లే సందల్లే సందల్లే సంక్రాంతి సందల్లే అంగరంగ వైభవంగా సంక్రాంతి సందల్లే
హేయ్ అబ్బాయి పాట సాహిత్యం
చిత్రం: శ్రీకారం (2020) సంగీతం: మిక్కీ జే మేయర్ సాహిత్యం: కృష్ణ కాంత్ గానం: నూతన మోహన్, హైమత్ నో నో వద్దన్నా నిను ఫాలో చేస్తున్నా ఏదో రోజు ఎస్ అంటావని ఎదురే చూస్తున్నా హే పో పో పోమ్మన్నా పడిగాపే కాస్తున్నా గర్ల్ ఫ్రెండయ్యే మూమెంట్ కోసం ప్లానే వేస్తున్నా సారీ అన్నా క్షమిస్తానా నే వింటానా వస్తా ఏమైనా హేయ్ అబ్బాయి హే హేయ్ అబ్బాయి ఇంకా ఫోజులు చాలోయి కాస్తా ఇటేపు చూడోయి హేయ్ అబ్బాయి సిగ్గేంటోయ్ అబ్బాయి నీకే ముద్దోటిచ్చి పోగొట్టెయ్ నా హే హేయ్ అబ్బాయి హేయ్ అబ్బాయి హే హేయ్ అబ్బాయి నేను చూస్తున్నా పరువే తీసేస్తున్నా పోనీ పాపం అమ్మాయంటు వదిలేస్తూ ఉన్నా నీదే తప్పున్నా ఇన్నాళ్ళు తగ్గున్నా పడనే నేను వదిలేయ్ నన్ను ఆపేయ్ అంటున్నా నువ్వేమన్నా వస్తానన్నా నే వింటానా బుద్దిగా ఆగమ్మా హేయ్ అమ్మాయి హే హేయ్ అమ్మాయి ఆపేసెయ్ గోలంటూ ఇంకా ఎలాగ చెప్పాలి హేయ్ అమ్మాయి హే హేయ్ అమ్మాయి ఓ మీదే పడిపోయి ఇట్టా కలరింగిస్తే కట్ చేసెయ్నా తెగ ప్రేమే ఉన్నానీ పైన చీపయ్యానా తొలిచూపుల్లోనే మనసు నీదే తెలుసుకున్నా ఇక అప్పట్నుంచే ఏమైనా నీతో ఉన్నా ఒక నిన్నే నిన్నే తగిన జోడనే ఊహిస్తున్నా నేడని రేపని ఎంతకాలమే అయినా ఏదీ చూడక ఒక్కమాటపై నేనున్నా అయినా నీకిది అర్థమైననూ కాకున్నా అసలే నిన్ను వదిలేపోను నీతోపాటే నేనుంటా హేయ్ హేయ్ అబ్బాయి హే హేయ్ అబ్బాయి ఇంకా ఫోజులు చాలోయి కాస్తా ఇటేపు చూడోయి హేయ్ అబ్బాయి హే హేయ్ అబ్బాయి సిగ్గేంటోయ్ అబ్బాయి నీకే ముద్దోటిచ్చి పోగొట్టెయ్నా
శ్రీకారం పాట సాహిత్యం
చిత్రం: శ్రీకారం (2020) సంగీతం: మిక్కీ జే మేయర్ సాహిత్యం: కృష్ణ కాంత్ గానం: హైమత్, నూతన్ మోహన్ కనివిని ఎరుగని కదలిక మొదలైంది అడుగులో అడుగుగా....వెతికిన వెలుగుగా అలికిడి ఎదురయ్యింది...నిశీధినే జయించగా శ్రీకారం కొత్త సంకల్పానికి.... కళలు చిగురిస్తున్న సంతోషం ఇది శ్రీకారం కొత్త అధ్యాయానికి....చినుకు పరిమళమల్లే దీవిస్తున్నదీ పుడమి వారసులం మనమేగా..... నిన్నటి మొన్నటి పద్ధతికి వారధులం మనమేగా.... రేపటి మార్పులకీ రెవల్యూషన్, ఇట్స్ ఆ చేంజ్ రెవల్యూషన్ ఇట్స్ ఆ ఫైర్ రెవల్యూషన్ లెట్ అస్ ఆల్ ఇన్స్ఫెర్ రెవల్యూషన్, ఇట్స్ ఆ వే రెవల్యూషన్ లెట్స్ సే రెవల్యూషన్ వి కెన్ మేక్ ఆ బెటర్ ఫ్యూచర్ మండే ఎండకు ఫ్రెండ్ అవడం... మనకు తెలుసుగా అలవాటే ఇక.. చెమటతడి పండుగ ఏసీ గదులకి బాయ్ బాయ్ చెప్పాము అలవోకగా పయనం కదిలిందిలా... మనసుకు నచ్చిన దారిగా బురదేం కాదిది....మనకిది ఒక సరదా సంబరం నేలమ్మ ఒడిలో మనకిక.... ప్రతిదినమొక పాఠం ప్రకృతి పిలుపిది... ఇన్నాళ్ళుగా వేసిన మలుపిది కలలకు తలపాగ చుడదాం... బంగారం పండిద్దాం రెవల్యూషన్, ఇట్స్ ఆ చేంజ్ రెవల్యూషన్ ఇట్స్ ఆ ఫైర్ రెవల్యూషన్ లెట్ అస్ ఆల్ ఇన్స్ఫెర్ రెవల్యూషన్, ఇట్స్ ఆ వే రెవల్యూషన్ లెట్స్ సే రెవల్యూషన్ వికెన్ మేక్ ఆ బెటర్ ఫ్యూచర్ అచ్చంగా మనం... కంప్యూటర్ కాలం యువకులం మెదడే ఇంధనం... చదువు మన సాధనం సాధ్యం కానిది లేదంటుంది... ఈ మన యవ్వనం మనసుపడి ఏ పని చేసినా... సుళువుగా రాణిస్తాం మనం తరముల నాటిది.... మన తాతలు చేసిన కృషి ఇది తెలియనిదేం కానేకాదులే... మనకీ వ్యవసాయం, హో హో జీన్సే తొడిగినా.. మన జీన్స్ లో ఈ కళ ఉన్నదే పదపద మొదలౌదాం... నేడే నవయువ కర్షకులై
Sreekaram (2021)
చిత్రం: జాను (2020) సంగీతం: గోవింద్ వసంత నటీనటులు: శర్వానంద్, సమంత దర్శకత్వం: సి. ప్రవీణ్ కుమార్ నిర్మాత: దిల్ రాజు విడుదల తేది: 07.02.2020
Songs List:
The Life of Ram పాట సాహిత్యం
చిత్రం: జాను (2020) సంగీతం: గోవింద్ వసంత సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి గానం: ప్రదీప్ కుమార్ ఏ దారెదురైనా ఎటు వెళుతుందో అడిగానా ఏం తోచని పరుగై ప్రవహిస్తూ పోతున్నా ఏం చూస్తూ ఉన్నా నే వెతికానా ఏదైనా ఊరికినే చుట్టూ ఏవేవో కనిపిస్తూ ఉన్నా కదలని ఓ శిలనే అయినా త్రుటిలో కరిగే కలవే అయినా ఏం తేడా ఉందట నువ్వెవరంటూ అడిగితే నన్నెవరైనా ఇల్లాగే కడదాకా ఓ పశ్నై ఉంటానంటున్నా ఏదో ఒక బదులై నను చెరపొద్దని కాలాన్నడుగుతు ఉన్నా నా వెంట పడి నువ్వింత ఒంటరి అనొద్దు అనొద్దు దయుంచి ఎవరూ ఇంకొన్ని జన్మాలకి సరిపడు అనేక స్మృతుల్ని ఇతరులు ఎరుగరు నా ఊపిరిని ఇన్నాళ్లుగా తనవెన్నంటి నడిపిన చేయూత ఎవరిది నా ఎద లయను కుశలము అడిగిన రుసరుస కబురుల ఘుమ ఘుమ లెవిరివీ... ఉదయం కాగానే తాజాగా పుడుతూ ఉంటా కాలం ఇపుడే నను కనగా అనగనగా... అంటూనే ఉంటా ఎపుడూ పూర్తవనే అవక తుధి లేని కథ నేనుగా గాలి వాటం లాగ.. ఆగే అలవాటే లేక కాలం నిలవదు ఏ చోట నిలకడగా యే చిరునామాలేక యే బదులు పొందని లేఖ ఎందుకు వేస్తుందో కేక.. మౌనంగా నా వెంట పడి నువ్వింత ఒంటరి అనొద్దు అనొద్దు దయుంచి ఎవరూ ఇంకొన్ని జన్మాలకి సరిపడు అనేక స్మృతుల్ని ఇతరులు ఎరగరు నా ఊపిరిని ఇన్నాళ్లుగా తనవెన్నంటి నడిపిన చేయూత ఎవరిది నా ఎద లయను కుశలము అడిగిన గుసగుస కబురుల ఘుమ ఘుమ లెవిరివీ లోలో ఏకాంతం నా చుట్టూ అల్లిన లోకం నాకే సొంతం అంటున్నా విన్నారా నేనూ నా నీడ ఇద్దరమే చాలంటున్నా రాకూడదు ఇంకెవరైనా అమ్మ వడిలో మొన్న అందని ఆశలతో నిన్న ఎంతో ఊరిస్తూ ఉందీ జాబిల్లి అంత దూరానున్నా వెన్నెలగా చెంతనే ఉన్నా అంటూ ఉయాలలూపింది జొలాలి
ప్రాణం నా ప్రాణం పాట సాహిత్యం
చిత్రం: జాను (2020) సంగీతం: గోవింద్ వసంత సాహిత్యం: శ్రీమణి గానం: చిన్మయి, గౌతం భరద్వాజ్ ప్రాణం నా ప్రాణం నీతో ఇలా గానం తొలి గానం పాడే వేళ తారా తీరం మన దారిలో కాంతులే కురిసేలా చాలా దూరం రాబోవు ఉదయాలనే విసిరేలా ప్రాణం నా ప్రాణం - నీతో ఇలా గానం తొలి గానం పాడే వేళ మన బాల్యమే ఒక పౌర్ణమి ఒకే కథై అలా మన దూరమే అమావాస్యలే చెరో కథై ఇలా మళ్ళి మళ్ళి జాబిలి వేళ వెన్నెల జల్లిందిలా నీ జంటగా మారేలోపే ఈ నిమిషం కలలా దాచేయాలి గుండెలో గురుతుల తారా తీరం మన దారిలో కాంతులే కురిసేలా చాలా దూరం రాబోవు ఉదయాలనే విసిరేలా
ఊహలే ఊహలే పాట సాహిత్యం
చిత్రం: జాను (2020) సంగీతం: గోవింద్ వసంత సాహిత్యం: శ్రీమణి గానం: చిన్మయి, గోవింద్ వసంత పియా బాలము మోరా పియా మోరా బాలము పియా ఘర్ ఆవో ఘర్ ఆ పియా ఘర్ ఆ ఆ జీ బాలమ మోరా బాలము మోరా పియా పియా హ బాలము మోరా మోరా ఆ ఆ చిన్ని మౌనములోన ఎన్ని ఊగిసలో కంట నీరు లేని రోజు కలిసెనే ప్రాణములో ప్రాణ సడే ఊహలే ఊహలే నిను విడవవులే గుండెకే ప్రాణమై పూసే పూసే ఊహలే ఊహలే నిను మరిచిన వేళ ఊపిరే లేని వేళ ఆ ఆ ఆ
నా కలే కలై పాట సాహిత్యం
చిత్రం: జాను (2020) సంగీతం: గోవింద్ వసంత సాహిత్యం: శ్రీమణి గానం: బ్రింద నా కలే కలై నన్నే వదిలే నే నిలా ఎలా ఎలా నమ్మనీ నిజమే.. కుదురు చెదిరింది లే కలత తొలిసారిలా నాలోపలే అయ్యానులే శిలై ఎదురుపడవే నువ్వే మదికి వివరించవే నిజం ఇదేనని బదులే నువ్వే నా జతగా నువ్వే లేక తరగతి గది గతై మారేనే ఇలా నీ మరుపే గురుతే రాక మది పదే పదే నిన్నే వెతికెనే వలలా అసలు ఇది ఎవరి నేరమా ఎలా అడగను కనుల నది దాటు నీరునే ఎలా నిలుపను మనసుకిది ఎంత భారమో ఎలా తెలుపను సెలవికనే ఎంత సులువుగా ఎలా నమ్మను
ఇంతేనా ఇంతేనా పాట సాహిత్యం
చిత్రం: జాను (2020) సంగీతం: గోవింద్ వసంత సాహిత్యం: శ్రీమణి గానం: చిన్మయి ఇంతేనా ఇంతేనా ఒక మాటైనా మాటాడవేదైనా ఇంతేనా ఇక ఇంతేనా ఎన్ని ఆశలతో ఆలా నువ్వు నీ చెంతనా కాలమే మారెనా దూరమే చేరినా వసంతమెగిరే ఎడారి ఎదురైనా ఈరోజు కోసం వేచింది నా ప్రాణమే ఈరోజు కుడా గెలిచిందిలే నీ మౌనమే సూటిగా చూపదే నీ గుండె చాటు భావాల బాధనే నువ్వే ఎలా చెప్పాలి? ఎలా అడగాలి? నాతోటి ఆటలాడేటి రాతల నువ్వే పాఠాలు చదివిన కాలం నువ్వే పాఠాలు నేర్పిన కాలం నువ్వే అర్ధం అవ్వనీ పాఠమల్లే ప్రతి క్షణం నా నువ్వే సంద్రాలు దాటెను నా రెక్కలే తీరాలు తాకేను నా పరుగులే మనసు మాత్రం నువ్వు విడిచిన చోటునే ఆగెనే.. రేపటి ఊహలు నిన్నటి ఆశలే కన్నీటి పాటల నిన్ను దాటనులే ఈరోజు కోసం వీచింది నా ప్రాణమే ఈరోజు కూడా నిన్ను అనే పోనివ్వనే
కొమ్మ వీడి గువ్వే వెళుతోందిలె పాట సాహిత్యం
చిత్రం: జాను (2020) సంగీతం: గోవింద్ వసంత సాహిత్యం: శ్రీమణి గానం: చిన్మయి, గోవింద్ వసంత కొమ్మ వీడి గువ్వే వెళుతోందిలె పువ్వు కంట నీరే కురిసే అమ్మ ఒడి వీడే పసిపాపలా వెక్కి వెక్కి మనసే తడిసే చదివే బడికే వేసవి సెలవులా తిరిగి గుడికే రావాలి నువ్విలా ఒక్కపూట నిజమై మన కలలు ఇలా... ముందరున్న కాలం గడిచేది ఎలా బ్రతుకే గతమై ఈ చోటా ఆగేలా కన్ను వీడి చూపే వెళుతోందిలే కంట నీరు తుడిచేదెవరే చిరునవ్వులే ఇక నన్నే విడిచేనులే నిను విడువని ఏ నన్నో వెతికేనులే చిగురాశలే ఇక శ్వాసే నిలిపేనులే మన ఊసులే జతలేక ఎడబాసెలే నా నుంచి నిన్నే విడదీసేటి విధినైనా వేధించి ఓడించే ఇంకో జన్మే వరమే వరమే మనం మనం చెరో సగం చెరో దిశల్లే మారినా ఒకే స్వరం ఏకాక్షరం చెరో పదంలో చేరినా నువున్న వైపు తప్ప చూపు తప్పు దిశను చూపునా అడుగులన్ని మనము కలిసి ఉన్న దారి విడిచెనా మరీ మరీ నిన్నడగమంది జ్ఞాపకాల ఉప్పెన చిరాయువేదో ఊపిరై నీకోసమెదురు చూపు కవితలే రాసే నీకై మల్లీ రా
అనంతమే పాట సాహిత్యం
చిత్రం: జాను (2020) సంగీతం: గోవింద్ వసంత సాహిత్యం: శ్రీమణి గానం: గోవింద్ వసంత, చిన్మయి శ్రీపద కాలాల ప్రేమ పుట్టేది ఎప్పుడంటే ఏమో కదా యుగాల ప్రేమ జాగాలనేలుతోంది రాజు లాగ శపించు వరమా పూసే పువ్వోటి చాలే లోకాన్ని గెలిచి చూపుతోందే తీపి కన్నీరు దాగుండే సాగరం ఇదే ఈ ప్రేమ కావ్యం రాసిందే ఎవ్వరంటే ఏమో ఈ ప్రేమ గాయం చేసేది ఎవ్వరంటే వివరమేది లేదంది కాలం కాదన్న ప్రేమ - నీడలాగా వస్తుందే అవునన్న ప్రేమ - చేతికంది రాదే ప్రేమల్లో పడితే - మాయలాగా ఉంటుందే ప్రేమల్లో చెడితే ప్రాణమే నిశి ఆగనంటూనే సాగదే సాగనంటూనే ఆగదే అన్ని అంటూనే మూగదే ప్రేమకేది సాటిరాదే ప్రాణమెంతున్న చాలదే జన్మలెన్నున్న మారదే విశ్వమంతున్న ప్రేమదే గుప్పెడంత గుండే ఓ ఈ ప్రేమలే అనంతమే ఆనందమల్లే ఓ ఈ ప్రేమలే అనంతమే ఆవేదనల్లే ఓ ఓ చిన్ని మౌనములోన ఎన్ని ఊగిసలో రాసి లేని కావ్యం ఊసు కలపదే ప్రేమలకే.. ఊపిరిదే ఊహలే ఊహలే నిను విడవవులే గుండెకే ప్రాణమై పూసే పూసే ఊహలే ఊహలే నిను మరిచిన వేళ ఊపిరే లేని వేళ ఆ ఆ ఆ... ఓ ఈ ప్రేమలే అనంతమే ఆనందమల్లే… ఓ ఈ ప్రేమలే అనంతమే ఆవేదనల్లే… ఓ..ఓహో శ్రీకారమే ఆకారం ఓంకారం ప్రేమే ఓ..ఓహో అనంతమే అనంతమే ఇదంత ప్రేమే చెప్పకుండా వచ్చే ఆ అనుభూతిని నీ గుండె చప్పుడు నీకు ముందే చెబుతుంది ప్రేమ! ప్రేమ ఒక రోజు నిన్నూ పలకరిస్తుంది, దాన్ని కౌగిలించు, కంటిరెప్పల్లో దాచు. ప్రేమ ఆగి చూస్తుంది. ప్రేమ తడబడుతుంది. ప్రేమ నవ్వుతుంది. ప్రేమ కవ్విస్తుంది, కవిత్వం రాస్తుంది. ప్రేమ ఏడుస్తుంది. ప్రేమ కల్లోలంలో పడేస్తుంది. ప్రేమ కాస్తంత అర్థం అవుతుంది. ప్రేమ విరహాన్ని పెంచుతుంది. ప్రేమ విడిపోతుంది వెళ్లి రమ్మని ప్రేమకి తలుపు మూసినా చప్పుడవ్వని వీడుకోలు లేచి ఇవ్వు ఒకవేళ ప్రేమ మల్లి వస్తే, దూరంగా ఆగి చూస్తే దగ్గరగా వెళ్ళు, ప్రేమతో పిలుపునివ్వు, అది చాలు. ప్రేమ నీ సొంతం. నీ హృదయం ప్రేమ సొంతం. మార్పులే ప్రశ్న మార్పులే సమాధానం - ప్రేమ




