-->
Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Sharada"



చిత్రం: జీవితం (1973)
సంగీతం: రమేశ్ నాయుడు 
నటీనటులు: శోభన్ బాబు, కృష్ణరాజు, శారద, జయంతి, జ్యోతిలక్ష్మి
దర్శకత్వం: కె. ఎస్. ప్రకాశరావు
నిర్మాతలు: సూర్యచంద్రరావు, గిరిబాబు
విడుదల తేది: 18.05.1973



Songs List:



మామిడి తోపుల్లోనా.. పాట సాహిత్యం

 
చిత్రం:  జీవితం (1973)
సంగీతం:  రమేశ్ నాయుడు 
సాహిత్యం::  సినారె
గానం:  ఎల్. ఆర్. ఈశ్వరి

పల్లవి :
మామిడి తోపుల్లోనా..  మాపటేల మాటేసి
చిక్కుడు పాదూకాడా ..  చీకటేల పట్టేసి
మామిడితోపుల్లోనా..  మాపటేల మాటేసి
చిక్కుడుపాదూకాడా..  చీకటేల పట్టేసి
చెప్పలేని రుచులెన్నో.. చిటికెలోన చూపించి
చెప్పలేని రుచులెన్నో.. చిటికెలోన చూపించి.. చూపించి ? 
 
మాయ చేసి పోతివిరో నాగులూ... నా మాట మరచిపోతివిరే నాగులూ
ఓ లమ్మో... ఓ లమ్మో... ఓ లమ్మో.. ఒరి నాయనో
ఓ లమ్మో.. ఒరి నాయనో.. ఓ లమ్మో.. ఒరి నాయనో..  ఓ లమ్మో.. ఒరి నాయనో
 
చరణం: 1 
నిన్నే కావాలని ఎన్నుకొంటిని.. నీ చుట్టూ నా మనసే అల్లుకొంటిని
రేకెత్తే నా సొగలే నీకు ముడుపు కడితిని
ఇన్నీచేసినదాన్ని ఏమెరుగని చిన్నదాన్ని
ఇన్నీచేసినదాన్ని ఏమెరుగని చిన్నదాన్ని
 
మాయ చేసి పోతివిరో నాగులూ.. నా మాట మరచిపోతివిరో నాగులూ
ఓ లమ్మో... ఓ లమ్మో... ఓ లమ్మో.. ఒరి నాయనో
ఓ లమ్మో.. ఒరి నాయనో.. ఓ లమ్మో.. ఒరి నాయనో..  ఓ లమ్మో.. ఒరి నాయనో

చరణం: 2
నట్టింట ఒంటరిగా కాచుకొంటిని.. నడిరాతిరి ఉసురుసురంటూ వేచియుంటిని
ఆకు చప్పుడైనా నీ అడుగులే అనుకొంటిని
నిన్నే నమ్మినదాన్ని... నీకే నచ్చినదాన్ని
నిన్నే నమ్మినదాన్ని... నీకే నచ్చినదాన్ని....  కాదు మరి

మాయ చేసి పోతివిరో నాగులూ.. నా మాట మరచిపోతివిరో నాగులూ
ఓ లమ్మో... ఓ లమ్మో... ఓ లమ్మో.. ఒరి నాయనో
ఓ లమ్మో.. ఒరి నాయనో.. ఓ లమ్మో.. ఒరి నాయనో..  ఓ లమ్మో.. ఒరి నాయనో



ఇక్కడే కలుసుకొన్నాము.. పాట సాహిత్యం

 
చిత్రం: జీవితం (1973)
సంగీతం: రమేశ్ నాయుడు 
సాహిత్యం: సినారె
గానం: పి.సుశీల, రామకృష్ణ

పల్లవి :
ఇక్కడే కలుసుకొన్నాము..  ఎప్పుడో కలుసుకున్నాము
ఈ జన్మలోనో... ఏ జన్మలోనో..  ఎన్నెన్ని జన్మలలోనో
ఇక్కడే కలుసుకొన్నాము...  ఎప్పుడో కలుసుకున్నాము
 
చరణం: 1
నీలనీల గగనాల మేఘ తల్పాల పైన.. 
పారిజాత సుమసౌరభాల కెరటాలలోన
నీ చేయి నా పండువెన్నెల దిండుగా.. 
నీ రూపమే నా గుండెలో నిండగా  
కలలన్నీ వడబోసి... కలలన్నీ వడబోసి.. కౌగిలిలో చవి చూసి
 
ఇక్కడే కలుసుకొన్నాము.. ఎప్పుడో కలుసుకున్నాము
 
చరణం: 2 
నాటి జన్మలో ఓ చెలీ నా చరణాల వ్రాలి ఎమన్నావు? 
జన్మజన్మలకు నా స్వామీ నీ చరణదాసినని అన్నాను
అంతలో నిను చేరదీసి నేనేమన్నాను?
ఓ సఖీ నా ఊపిరిలో నీ వున్నావని అన్నావు
ఆనాటి అనుబంధం ఈ నాటి మనబంధం.. ఆనాటి అనుబంధం ఈ నాటి మనబంధం
 
ఇక్కడే కలుసుకొన్నాము...  ఎప్పుడో క





అంతేనేమో అది ఒక వింతేనేమో.... పాట సాహిత్యం

 
చిత్రం: జీవితం (1973)
సంగీతం: రమేశ్ నాయుడు 
సాహిత్యం: సినారె
గానం: పి.సుశీల, రామకృష్ణ

అమ్మో యీవేళ మనసే అదోలా 
కువకువమన్నది ఎందుకో ఎందుకో.........

విను నేను తాకితే వను వీపు తాకితే 
అంతేనేమో అది గిలిగింతేనేమో ?

అంతేనేమో అది ఒక వింతేనేమో....

ఎవరైనా పిలిచారా యీ ఏరు పరుగిడుతున్నది ఎందుకో

దూరాన సాగరాన కలవాలని కలవరపడినది 
అందుకెనేమో పరుగులు అందుకేనేమో

అంతేనేమో అది ఒక వింతేనేమో 
అందుకేనేమో పరుగులు అందుకేనేమో 
అంతేనేమో అది ఒక వింతేనేమో

పండుమీదే రామచిలక పదేపదే వాలుతుంది 
ఎందుకో ఎందుకో

పండులోనే రసముందని గండుచిలక గమనించింది. 
అందుకేనేమో రుచులను అందుకోనేమో

అంతేనేమో అది ఒక వింతేనేమో ?
అందుకేనేమో రుచులను అందుకోనేమో
అంతేనేమో అది ఒక వింతేనేమో 

మన మేనులూ ఒకలాగే-పెనవేసుకుపోతున్నాయి ఎందుకో ?

ఎందుకో ?

ఇద్దరు ఒకరౌతారంటే ఇదేనేమో ఇదేనేమో 

అంతేనేమో అది మరి అంతేనేమో 
అంతేనేమో అది ఒక వింతేనేమో ....




చిన్నారి ఓ బాబు పాట సాహిత్యం

 
చిత్రం: జీవితం (1973)
సంగీతం: రమేశ్ నాయుడు 
సాహిత్యం: సినారె
గానం: పి.సుశీల

చిన్నారి ఓబాబూ
బలేబలేబాబూ వరాల బాబ
అమ్మానాన్న దీవనలంది వర్ధిల్లాలి
అలా అలా నవ్వు

మీ అమ్మ మోము చూడ మిసిమినవ్వు 
విరిసేను మిసిమినవ్వు విరిసేను

మీ నాన్న కళ్లు చూడ ముత్యాలై మెరిసేను 
ఆ నవ్వుల పువ్వుగా - ఆకన్నుల దివ్వెగా 
ఉదయించిన నిన్నుగని నా మనసే మురిసేను

బాబూ నిన్నెత్తుకుంటే - పసిడికొండనౌతాను 
పాపా నిను హత్తుకుంటే పాలవెల్లినౌతాను 
పాలవెల్లినౌతాను …

మీ ఇద్దరూ వుండగా, నా ముద్దుల పండగా 
ఏ తల్లీ పొందలేని ఆనందం పొందేను -ఉఁహూఁహూఁ

అమ్మా నానా దీవనలంది వర్ధిల్లాలి అలా అలా నువ్వు



తొలిరేయి పాట సాహిత్యం

 
చిత్రం: జీవితం (1973)
సంగీతం: రమేశ్ నాయుడు 
సాహిత్యం: సినారె
గానం: పి.సుశీల

తొలిరేయీ... ఇది తొలిరేయి
ఇద్దరమూ చెరిసగమూ
ముద్దూ ముచ్చట పంచుకొనే... తొలిరేయీ..ఇది తొలిరేయి

పెళ్ళిపందిట నీవువేసిన మూడుముళ్ళూ
చల్ల చల్లగా వుండాలి... అవి ఒక నూరేళ్ళూ
మూగ గదిలో నేడు పలికే... ఈ రాగం..
ఆ.... ఆ... ఆ.... ఆ

ముందు ముందు బ్రతుకును..పండించె అనురాగం
నవదంపతులా ఆశా లతలా..పూచిన తొలిపూవు ఈ రేయీ 

తొలిరేయీ... ఇది తొలిరేయి

కన్నులేమో వేరు వేరు... కలలు ఒకటేలే
తనువులేమో వేరు వేరు... మనసులొకటేలే
పూలపానుపులా... వేయిమల్లెల పిలుపులొకటేలే
కలవరించే కోటికోర్కెలా... గమ్యమొకటేలే... గమ్య మొకటేలే
ఆలుమగల అంతరంగాల...అందాలతొలకరి..ఈ రేయీ

తొలిరేయీ... ఇది తొలిరేయి
ఇద్దరమూ  చెరిసగమూ
ముద్దూ ముచ్చట పంచుకొనే... తొలిరేయీ..ఇది తొలిరేయి

Palli Balakrishna Thursday, April 9, 2026



చిత్రం: ఎదురీత (1963)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ, ఆరుద్ర
గానం: పి.బి.శ్రీనివాస్, మాధవపెద్ది సత్యం, పిఠాపురం నాగేశ్వరరావు, ఎస్.జానకి, కె.జమునారాణి
నటీనటులు: కాంతారావు, కృష్ణకుమారి, శారద, గిరిజ, హేమలత
దర్శకత్వం: బి.ఎస్.నారాయణ
నిర్మాత: ఎం.ఎ.వేణు
విడుదల తేది: 14.01.1963



Songs List:



ఈ వేళ మనం వ్రాసుకున్న ప్రేమపత్రం పాట సాహిత్యం

 
చిత్రం: ఎదురీత (1963)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: కె.జమునారాణి, పిఠాపురం నాగేశ్వరరావు

ఈ వేళ మనం వ్రాసుకొన్న ప్రేమపత్రము
ఖరామ చేసుకొందుము
తరులు గిరులు జరులు దరులు దాటిపోదాము
తనివిదీర తలపులూర దరులు దాటిపోదాము
మనసులనే కాగితాన కనుల భాషతో
ఆశతో
మమతలనే షరతులతో వ్రాసుకొంటిమి
ఉంటిమి
పెళ్లి ముద్రవేసి గట్టిచేసుకుందాము - గుట్టు దాచుకుందాము
అదే అందము
వడ్డీకి వడ్డీ వేసి వలపు పెంచుదాం
మించుదాం
అసలు తీరిపోకుండ అప్పు నిలుపుదాం
కలుపుదాం పిల్లలతో చెల్లు వేసుకుందాము, మళ్ళీ వ్రాసుకుందాం
ఈ వేళ మనం వ్రాసుకున్న ప్రేమపత్రము ఖరారుచేసుకుందము




ఉన్నవారికన్న మనం ఎక్కువేలే పాట సాహిత్యం

 
చిత్రం: ఎదురీత (1963)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం:  ఆరుద్ర
గానం: పి.బి.శ్రీనివాస్

ఉన్నవారికన్న మనం ఎక్కువేలే మన
హృదయంలో అందరిపై మక్కువేలే
పాటువడి అలుపు తీర్చు ఆటలాడుదాం
బాధలన్ని ఎగిరిపోవు పాటపాడుదాం

కోటికి పడగెత్తలేము కొరతేలేదు
నోటిమాట జారబోము లోటే రాదు
పాటుపడగ ఒళ్ళు మనం దాచుటలేదు
పరుల దోచుటలేదు చేయి చాచుటలేదు

అయిదువేళ్లు నోటిలోకి పోవుటలేదు
అందుచేత కాని పనులు చేయుటలేదు.
రోజుకొక్క జోడుకట్టి వలచుటలేదు
మోజుదీరి చిన్నదాన్ని విడుచుటలేదు

కళ్ళలోన దుమ్ముకొట్టి బతుకుటలేదు
కాళ్ళకింద గోతులు తవ్వుట లేదు
మనకెందుకు వద్దులే యితరుల ఊసు
మనకు లేదులే యీసు మన బ్రతుకే నైసు




ఒకే మాట ఒకేమాట పాట సాహిత్యం

 
చిత్రం: ఎదురీత (1963)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: పి.బి.శ్రీనివాస్, ఎస్.జానకి

ఒకేమాట ఒకమాట అడగనా చెలీ
ఒకే బదులు ఒకే బదులు చెప్పినామరి
పరుగులెత్తు పరువానికి ఏది పగ్గము
పలుకరించు కనులలోని చిలిపి అందము
పగటివేళ కాంచు కలలకేమి అర్థము

మధుర మధుర భావములకు మారు రూపము
దినం దినం కొత్తదనం దేనికున్నది
చెలికన్నుల చెరలాడే చెలిమి కున్నది
వెన్నెలలే వేడిగా వేచు డెపుడు
వెన్నంటి కన్నెకొరకు వేచినప్పుడు
అందిన కనిపించి అందనిదేది
అందానికి సహజమైన అందమే అది
లోకమంత ఏకమైన లొంగని దెవరు
ఏకమై లోకమే ఏలు జంటలు




ధనంలొనే జగం ఉన్నది పాట సాహిత్యం

 
చిత్రం: ఎదురీత (1963)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: మాధవపెద్ది సత్యం

పల్లవి: 
ధనంలోనే జగం ఉన్నది నిజం నిజం
ధనం ముందు గుణం చిన్నది నిజం నిజం

అనుపల్లవి: 
కలవాడే మొనగాడీ కాలంలో ధనం
లేనివాడు అందరికీ కానివాడు ధరలో

చరణం: 
కలిమిలోన పూలు చల్లి పూజచేతురు
లేమిలో రాళ్లు దువ్వి తరిమి వేతురు
కాలచక్రమిటే మారిపోవునని ఎరుగరు
గతం మరచి గంతులేయు మూఢమనుజులు
మంచితనం చేతకాని తనమీ నాడు
మానవత్వమున్న బ్రతుకలేదు ఎవడు
ఉన్ననాడె అందరు మనకు ఆప్తులు
చెరువు నిండినప్పుడు చేరు కప్పలు





పూవు పుట్టగానే తాను పరిమళించును పాట సాహిత్యం

 
చిత్రం: ఎదురీత (1963)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: ఆరుద్ర
గానం: పి.బి.శ్రీనివాస్, ఎస్.జానకి

పువ్వు పుట్టగానే తాను పరిమళించును
నువ్వు నన్ను చేర మనసు పరవశించును
చందమామ మోముచూచి జలధి పొంగును
అందగత్తె అంతకన్న ఆశగొలుపును

చేతిలోన చేయి చేయి చింతతీరును
చెలియగాలి సోకి మనసు నేద తీరును
స్వాతి వానకొరకు చేను ఎదురు చూచును
లేత మనసు ప్రియునికొరకు వేచియుండును

నీరు వీడి చేపకున బ్రతుకనేరదు
నిన్ను విడిచి నాదుమేను నిలువజాలదు
నీటిమబ్బు మూయగానే నెమలి ఆడును
గూటిలోన పావురాళ్లు కొసరి పాడును

మనసులోని కలలు పండి తనివి తీరును
మరల మరల నిన్నుచూడ మత్తు గలుగును
మల్లెపూల తేనెటీగ పలుకరించును
చల్లగాలి వీచి జంట పులకరించును
పువ్వు పుట్టగానే తాను పరిమళించును
నువ్వు నన్ను చేర మనసు పరవశించున




ఎవరికెవరురా బంధువులు పాట సాహిత్యం

 
చిత్రం: ఎదురీత (1963)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: ఆరుద్ర
గానం: పి.బి.శ్రీనివాస్

ఎవరికెవరురా బంధువులు
ఎటు చూపే అటు మోసాలు
చివికిన చీకటి జీవిత మందున
చెదిరే నాలుగు స్తంభాలు

చేతిలో కనకం ఉన్నంతనేపే కాకి బలగమంట - ఆ
చేతిలో కనకం తీరిన వెనుక తిరిగి చూడరంట

రాసులు చేర్చగ మోసంచేస్తే రాజభోగమంట
రంగులు మార్చే ఊసరవెల్లికి రత్నపీఠ మంట

తల్లీ తోడే ఎల్లాగున్నా తలచుకొందురంట
తక్కిన వాళ్లో ధనహీనుణ్ణి తరిమి వేతురంట

Palli Balakrishna Friday, November 24, 2023



చిత్రం: శివమెత్తిన సత్యం (1980)
సంగీతం: జె.వి.రాఘవులు
నటీనటులు: కృష్ణంరాజు, శారద, జయసుధ
దర్శకత్వం: వి.మధుసుదనరావు
నిర్మాత: జి.సత్యనారాయణరాజు
విడుదల తేది: 11.01.1980



Songs List:



శంభో హరహర పాట సాహిత్యం

 
చిత్రం: శివమెత్తిన సత్యం (1980)
సంగీతం: జె. వి. రాఘవులు
సాహిత్యం: ఆత్రేయ
గానం: యస్.పి.బాలు 

శంభో హరహర.... భోళాశంకర
వినరా వినరా జంగం దేవర
శివశివ శంకర....యివరం సెప్పర
బస్తీ బాబులకు... అరెరెరెరే ....
నీ భక్తుడంటే.... ఈ సత్తెమంటే
ఎట్టాంటోడో తెలిసేందుకు.....
రైతంటే బైతనుకుంటే... నీ బతుకు భజగోవిందే
తెలివంటె నీదనుకుంటే.... నీ తెలివి తెల్లారినట్టే
పనికి రాని మనిషి .... ఒక్కడైన లేడు
ఆ మనిషి పనికి నువ్వు ఖరీదు కట్టలేవు
డబ్బు కట్టే గోనిసంచి గొప్ప కాదురో.... ॥శివ శివ ॥

సత్తెమంటే సల్లగాలి.... సత్తెమంటే అగ్గినిప్పు
మంచోళ్ళ ప్రాణం సతైం.... మనసున్న మనిషే సత్తెం
ముతక కట్టినోడు .... మొద్దు ఎదవకాడు
సద్ది తిన్నవోడు.... సచ్చు సవటకాడు
నిద్దరోయె బెబ్బులి మేక కాదురో .... ॥శివ శివ ॥

పట్నంలో సదువులు సదివి.... పట్టాలు పొందిన బాబులు
సూశారు కండబలము .... సూత్తారా బుద్ది బలము
మాయ సేయలేదు ....మంత్రమేమి కాదు
గుప్పెట్లో యిసక సెప్పుకోండి ఎంత....?
ఎంత... ? ఎంత ....? ఎంత....? తెలీలా .... 
గుప్పెడంత యిసకంటే గుప్పెడేనులో.... ॥శివ శివ ॥




నిన్నా మొన్నటి చిన్నారివే పాట సాహిత్యం

 
చిత్రం: శివమెత్తిన సత్యం (1980)
సంగీతం: జె. వి. రాఘవులు
సాహిత్యం: ఆత్రేయ
గానం: యస్.పి.బాలు 

నిన్నా మొన్నటి చిన్నారివే
చిన్నారి పలుకుల చెల్లెమ్మవే
ఈ పెళ్ళి చూపుతో ఈ చీర కట్టుతో
ఎంత ఎదిగినావే........

పెళ్ళీడు వచ్చింది అమ్మాయి
పిల్లాడ్ని చూడరా నీ చెల్లికి
అని పెద్దోళ్ళు పదిసార్లు అన్నారని
ఉబలాటపడ్డాను చూద్దామని
ఈ ముస్తాబులో ....ఆ నగుమోములో
చూశాను చెల్లీ.... మన తల్లిని....

ఒకరికి ఒకరం.... ఇక ఎవరికి ఎవరం
ఓర్వనిదైనా..... తప్పని దూరం
ఏ ఆడపిల్లా.... కాదీడపిల్ల
ఏనాటికైనా ....అది ఆడపిల్ల
చేశానమ్మా..... నే చేయగలది
ఈ ఇంటి పేరింక ఆ ఇంట నిలపాలి




మేకారే మేకా .... పాట సాహిత్యం

 
చిత్రం: శివమెత్తిన సత్యం (1980)
సంగీతం: జె. వి. రాఘవులు
సాహిత్యం: ఆత్రేయ
గానం: యస్.పి.బాలు , యస్.పి.శైలజ

మేకారే మేకా .... హే.... మేకా
తోకారే తోకా... హే.... తోకా
మిల మిలలాడే కన్నులతో
మిస మిసలాడే వన్నెలతో
చుర చురలాడే చూపులతో
కొర కొరలాడే కోర్కెలతో
బిలబిల కిలకిల గలగల గలగల అమ్మాయిలూ
చకచక టకటక లుకలుక లుకలుక అబ్బాయిలూ
ఒకరిని ఒకరు ఒరుసుకొని
ముందూ వెనకా వెనకా ముందూ
ముందూ వెనకా వెనకా ముందు
ముందుగ వెళుతుంటె ....

పెట పెటలాడే పదహారేళ్ళు
చిమ చిమలాడే యిరవై యేళ్ళు
చెకుముకి రాళ్ళు ఈ కుర్రాళ్ళు
బరిలో దూకే పందెం కోళ్ళు
కిస్ మిస్ కిస్ మిస్ కిస్ మిస్ కిస్ మిస్
పిట్టల్లాడు
కుంవా కుంవా కుంవా కుంవా గువ్వల్లాగా
ఒకరిని ఒకరు తరుముకొని
పగలూ రేయీ రేయీ పగలూ
పరుగులు తీసూ ఉరకలు వేసు
పడుతూ లేసుంటే....




గీతా .... ఓ గీతా .... పాట సాహిత్యం

 
చిత్రం: శివమెత్తిన సత్యం (1980)
సంగీతం: జె. వి. రాఘవులు
సాహిత్యం: ఆరుద్ర
గానం: కె. జె. ఏసుదాసు, వాణీ జయరామ్

గీతా .... ఓ గీతా ....
డార్లింగ్.... మై డార్లింగ్ ....
మనసార నీతో మాటాడుకోనీ
రాజా....ఓ రాజా....
డార్లింగ్.... మై డార్లింగ్ ....

మనసార నీతో మాటాడుకోనీ
పర దేశంలో.... ఆవేశంలో
ప్రేమించిన మనకనుమతి ....
బహుమతి.... ఈ దేశంలో... సంతోషంతో
మనవాడినచో అనుబంధం
ఆనందం ... వెచ్చని వలపుల ముచ్చట తీరును
అనురాగ బంధం ముడివేసుకోనీ

చిరునవ్వులతో పులకింతలతో
వికసించిన మధువనం
యవ్వనం .. ఈ భంగిమలో నీ పొంగులతో
మురిపించే బిగికౌగిలి
జిలిబిలి.... ఊహలే రేగితే మోహమే ఆగుణా
ఒడిలోన నన్ను ఒదిగొదిగిపోనీ




నీవు నా పక్కనుంటే హాయి పాట సాహిత్యం

 
చిత్రం: శివమెత్తిన సత్యం (1980)
సంగీతం: జె. వి. రాఘవులు
సాహిత్యం: ఆరుద్ర
గానం: కె. జె. ఏసుదాసు, వాణీ జయరామ్

నీవు నా పక్కనుంటే హాయి
నీవు లేకుంటే చీకటి రేయి
నీ కన్నులలోన ఎన్నో ఎన్నో ఎన్నో
కిరణాలు మెరిశాయి

నీవు నా పక్కనుంటే హాయి
నీవు లేకుంటే చీకటి రేయి
నీ కన్నులలోన ఎన్నో ఎన్నో ఎన్నో
కిరణాలు మెరిశాయి

కొండలలో కోనలలో ఏకాంత వేళ
గుండెలలో రేగింది సరసాల లీల
కొండలలో కోనలలో ఏకాంత వేళ
గుండెలలో రేగింది సరసాల లీల

అనురాగ శిఖరాన అందాల తోట
ఆ చోట కోనేట సయ్యాటలాడాలి
కొనగోట మీటిన మాణిక్యవీణ
కొసరే మమతల తొలకరి వాన
కొనగోట మీటిన మాణిక్యవీణ
కొసరే మమతల తొలకరి వాన
కన్ను సైగల కౌగిలింతల సన్న జాజితాని
ఎన్నమారులు నిన్ను చూసినా దేవరంభ ఠీవి
మువ్వల రవళి మోహన మురళీ
మధురం మధురం మానసకేళీ

Palli Balakrishna Monday, November 6, 2023



చిత్రం: ఆడంబరాలు అనుభందాలు (1974)
సంగీతం: కె. చక్రవర్తి 
నటీనటులు: కృష్ణ, కాంతారావు, ప్రభాకరరెడ్డి, రాజబాబు, శారద, సావిత్రి, విజయలలిత, రమాప్రభ
దర్శకత్వం: సి. ఎస్. రావు 
నిర్మాణసంస్థ: లోకేశ్వరి ఆర్ట్ పిక్చర్స్
విడుదల తేది: 09.08.1974



Songs List:



అంబా శాంభవీ (శ్లోకం) పాట సాహిత్యం

 
చిత్రం: ఆడంబరాలు అనుభందాలు (1974)
సంగీతం: కె. చక్రవర్తి 
సాహిత్యం: మూలం: శ్రీ రాజరాజేశ్వరి అష్టకం
గానం: ఘంటసాల

అంబా శాంభవీ చంద్రమౌళిరవళ అపర్ణ (శ్లోకం) 




ఇదిగిదిగో తీపి కల్లురా పాట సాహిత్యం

 
చిత్రం: ఆడంబరాలు అనుభందాలు (1974)
సంగీతం: కె. చక్రవర్తి 
సాహిత్యం: కొసరాజు
గానం: ఎల్. ఆర్. ఈశ్వరి బృందం

ఇదిగిదిగో తీపి కల్లురా ఏసుకోరా జోరైన యీత



ఏనాటి వరమో పాట సాహిత్యం

 
చిత్రం: ఆడంబరాలు అనుభందాలు (1974)
సంగీతం: కె. చక్రవర్తి 
సాహిత్యం: దాశరధి
గానం: పి. సుశీల

ఏనాటి వరమో ఏనోము ఫలమో ఎనలేని ప్రేమ విడలేని




తాతలు ముత్తాతలు పాట సాహిత్యం

 
చిత్రం: ఆడంబరాలు అనుభందాలు (1974)
సంగీతం: కె. చక్రవర్తి 
సాహిత్యం: యు. విశ్వేశ్వరరావు
గానం: యస్.పి. బాలు బృందం

తాతలు ముత్తాతలు తాతలు తాగిన



నీ రూపం నా హృదయంలో పాట సాహిత్యం

 
చిత్రం: ఆడంబరాలు అనుభందాలు (1974)
సంగీతం: కె. చక్రవర్తి 
సాహిత్యం: దాశరధి
గానం: పి. సుశీల

నీ రూపం నా హృదయంలో నిరతము నిలిపేనా



వారానికి ఏడు రోజులు పాట సాహిత్యం

 
చిత్రం: ఆడంబరాలు అనుభందాలు (1974)
సంగీతం: కె. చక్రవర్తి 
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: పి. సుశీల, యస్.పి. బాలు

వారానికి ఏడు రోజులు ఎందుకని రోజుకు ఇన్ని




సొమ్ముకరిది సోకొకరిదీ పాట సాహిత్యం

 
చిత్రం: ఆడంబరాలు అనుభందాలు (1974)
సంగీతం: కె. చక్రవర్తి 
సాహిత్యం: ఆరుద్ర
గానం: ఎస్. జానకి

సొమ్ముకరిది సోకొకరిదీ కమ్మని కైపుల సుఖమెవరిదీ 

Palli Balakrishna Saturday, June 10, 2023



చిత్రం: రాధమ్మ పెళ్లి (1974)
సంగీతం: పసుపులేటి రమేష్ నాయుడు
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి (All)
గానం: రమేష్ నాయుడు, యస్.జానకి, యస్.పి.బళ్ళు, ఎల్.ఆర్. అంజలి, రాజాబాబు, రమాప్రభ
నటీనటులు: కృష్ణ, మురళీమోహన్ ,  శారద (త్రిపాత్రాభినయం)
దర్శకత్వం: దాసరి నారాయణ రావు 
నిర్మాత: పి.యస్.భాస్కర రావు 
విడుదల తేది: 06.06.1974



Songs List:



పారే గోదావరిలా పాట సాహిత్యం

 
చిత్రం: రాధమ్మ పెళ్లి (1974)
సంగీతం: రమేష్ నాయుడు
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: యస్. జానకి

పారే గోదావరిలా పరుగెట్టేదే వయసు 



అయ్యింది రాధమ్మ పెళ్లి పాట సాహిత్యం

 
చిత్రం: రాధమ్మ పెళ్లి (1974)
సంగీతం: రమేష్ నాయుడు
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: రమేష్ నాయుడు

అయ్యింది రాధమ్మ పెళ్లి 



ఆడది కోరుకునే వరాలు పాట సాహిత్యం

 
చిత్రం: రాధమ్మ పెళ్లి (1974)
సంగీతం: రమేష్ నాయుడు
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: యస్. జానకి

పల్లవి:
ఆడది కోరుకునే వరాలు రెండే రెండు
చల్లని సంసారం  చక్కని సంతానం
ఆడది కోరుకునే వరాలు రెండే రెండు
చల్లని సంసారం చక్కని సంతానం

చరణం: 1 
కాపురమే ఒక మందిరమై పతియే తన దైవమై
కాపురమే ఒక మందిరమై పతియే తన దైవమై
అతని సేవలో తన బ్రతుకే హారతి యైపోతే
అంతకుమించిన సౌభాగ్యం ఆడదానికేముంది
ఆడదానికింకేముంది
ఆడది కోరుకునే వరాలు రెండే రెండు
చల్లని సంసారం  చక్కని సంతానం

చరణం: 2 
ఇల్లాలే ఒక తల్లియై  చల్లని మమతల పాలవెల్లియై
తన పాప లాలనలో తాను కరిగిపోతే
ఇల్లాలే ఒక తల్లియై చల్లని మమతల పాలవెల్లియై
తన పాప లాలనలో తాను కరిగిపోతే
అంతకు మించిన ఆనందం ఆ తల్లికేముంది.. 
ఆ తల్లికింకేముంది   
ఆడది కోరుకునే వరాలు రెండే రెండు
చల్లని సంసారం చక్కని సంతానం
ఆడది కోరుకునే వరాలు రెండే రెండు
చల్లని సంసారం చక్కని సంతానం




తాగుబోతు నయంరా తమ్ముడు పాట సాహిత్యం

 
చిత్రం: రాధమ్మ పెళ్లి (1974)
సంగీతం: రమేష్ నాయుడు
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: యస్.పి. బాలు

తాగుబోతు నయంరా తమ్ముడు 



సంకురాతిరి అల్లుడూ పాట సాహిత్యం

 
చిత్రం: రాధమ్మ పెళ్లి (1974)
సంగీతం: రమేష్ నాయుడు
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: యస్. జానకి, యస్.పి. బాలు, ఎల్.ఆర్. అంజలి

సంకురాతిరి అల్లుడూ మూతి ముడుచుకొని



కాకినాడ రేవుకాడ పాట సాహిత్యం

 
చిత్రం: రాధమ్మ పెళ్లి (1974)
సంగీతం: రమేష్ నాయుడు
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: రాజబాబు, రమాప్రభ

కాకినాడ రేవుకాడ ఓడెక్కి బొంబాయి రేవు కాడ 




ఆడది కోరుకునే వరాలు (విషాదం) పాట సాహిత్యం

 
చిత్రం: రాధమ్మ పెళ్లి (1974)
సంగీతం: రమేష్ నాయుడు
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: యస్. జానకి

ఆడది కోరుకునే వరాలు రెండే రెండు 
చల్లని సంసారం చక్కని సంతానం  (విషాదం)

Palli Balakrishna



చిత్రం: బొబ్బిలి బ్రహ్మన్న (1984)
సంగీతం: కె. చక్రవర్తి 
సాహిత్యం: వేటూరి (All)
గానం: యస్.పి.బాలు, పి.సుశీల
నటీనటులు: కృష్ణం రాజు, శారద, జయసుధ, రాజేష్ , ముచ్చెర్ల అరుణ 
కథ, మాటలు: పరుచూరి బ్రదర్స్
దర్శకత్వం: కె. రాఘవేంద్ర రావు 
నిర్మాత: ఉప్పలపాటి సూర్యనారాయణరాజు 
విడుదల తేది: 25.05.1984



Songs List:



అబ్బా నాతో పెట్టుకోమాక పాట సాహిత్యం

 
చిత్రం: బొబ్బిలి బ్రహ్మన్న (1984)
సంగీతం: కె. చక్రవర్తి 
సాహిత్యం:  వేటూరి
గానం: యస్.పి.బాలు, పి.సుశీల

అబ్బా నాతో పెట్టుకోమాక 



బొబ్బిలి బ్రహ్మన్న వీర కథ పాట సాహిత్యం

 
చిత్రం: బొబ్బిలి బ్రహ్మన్న (1984)
సంగీతం: కె. చక్రవర్తి 
సాహిత్యం:  వేటూరి
గానం: పి.సుశీల & కోరస్ 

బొబ్బిలి బ్రహ్మన్న వీర కథ 



చలిగాలి వీచింది పాట సాహిత్యం

 
చిత్రం: బొబ్బిలి బ్రహ్మన్న (1984)
సంగీతం: కె. చక్రవర్తి 
సాహిత్యం:  వేటూరి
గానం: యస్.పి.బాలు, పి.సుశీల

చలిగాలి వీచింది 




ఓ రాతి మనిషి పాట సాహిత్యం

 
చిత్రం: బొబ్బిలి బ్రహ్మన్న (1984)
సంగీతం: కె. చక్రవర్తి 
సాహిత్యం:  వేటూరి
గానం: యస్.పి.బాలు, పి.సుశీల

ఓ రాతి మనిషి



తద్దినక తద్దినక మల్లెలు తెచ్చా పాట సాహిత్యం

 
చిత్రం: బొబ్బిలి బ్రహ్మన్న (1984)
సంగీతం: కె. చక్రవర్తి 
సాహిత్యం:  వేటూరి
గానం: యస్.పి.బాలు, పి.సుశీల

తద్దినక తద్దినక మల్లెలు తెచ్చా

Palli Balakrishna Thursday, September 15, 2022



చిత్రం: భలే అల్లుడు (1977)
సంగీతం: జె. వి రాఘవులు 
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ, కొసరాజు 
గానం: యస్.పి. బాలు, పి. సుశీల, యస్. జానకి 
నటీనటులు: కృష్ణంరాజు, ఊర్వశీ శారద, పద్మప్రియ, జయలక్ష్మి, మోహన్ బాబు, చంద్రమోహన్ 
కథ, మాటలు: గొల్లపూడి 
దర్శకత్వం: పి. చంద్రశేఖర్ రెడ్డి 
నిర్మాతలు: కడియాల విఠలేశ్వర రావు, కె. యస్. చౌదరి 
విడుదల తేది: 14.10.1977



Songs List:



ప్రేమిస్తే ఏమౌతుంది పాట సాహిత్యం

 
చిత్రం: భలే అల్లుడు (1977)
సంగీతం: జె. వి రాఘవులు 
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: యస్.పి. బాలు, పి. సుశీల 

ప్రేమిస్తే ఏమౌతుంది 



అయ్యయ్యో పిచ్చి తల్లి పాట సాహిత్యం

 
చిత్రం: భలే అల్లుడు (1977)
సంగీతం: జె. వి రాఘవులు 
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: యస్.పి. బాలు

అయ్యయ్యో పిచ్చి తల్లి 




నిదురపోండి పాపల్లార పాట సాహిత్యం

 
చిత్రం: భలే అల్లుడు (1977)
సంగీతం: జె. వి రాఘవులు 
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: పి. సుశీల 

నిదురపోండి పాపల్లార 




ఓ బెల్లం కొట్టిన రాయి పాట సాహిత్యం

 
చిత్రం: భలే అల్లుడు (1977)
సంగీతం: జె. వి రాఘవులు 
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: యస్.పి. బాలు, యస్. జానకి 

ఓ బెల్లం కొట్టిన రాయి



సూత్రం లేని సుందరు లారా పాట సాహిత్యం

 
చిత్రం: భలే అల్లుడు (1977)
సంగీతం: జె. వి రాఘవులు 
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: యస్.పి. బాలు 

సూత్రం లేని సుందరు లారా 



అరె జంతర్ మంతర్ మామ పాట సాహిత్యం

 
చిత్రం: భలే అల్లుడు (1977)
సంగీతం: జె. వి రాఘవులు 
సాహిత్యం: కొసరాజు 
గానం: యస్.పి. బాలు 

అరె జంతర్ మంతర్ మామ 

Palli Balakrishna Saturday, July 9, 2022

Most Recent

Default