-->
Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Ravi Varma"



చిత్రం: కనబడుట లేదు (2021)
సంగీతం: మధు పొన్నాస్
నటీనటులు: సునీల్, సుక్రాంత్ వీరెల్ల,  వైశాలి రాజ్,ససిత కోన, హిమజ
దర్శకత్వం: యమ్. బాలరాజు
నిర్మాతలు: సుదీర్ తలసిల, దేవీప్రసాద్  బలివాడ , సతీష్ రాజు 
విడుదల తేది: 19.08.2021



Songs List:



మామా పాట సాహిత్యం

 
చిత్రం: కనబడుట లేదు (2021)
సంగీతం: మధు పొన్నాస్ 
సాహిత్యం: మధు నందన్ 
గానం: రాహుల్ నంబియర్

మామా




ఎదకేమై ఉంటుందే పాట సాహిత్యం

 
చిత్రం: కనబడుట లేదు (2021)
సంగీతం: మధు పొన్నాస్ 
సాహిత్యం: పూర్ణ చారి 
గానం: కార్తీక్

ఎదకేమై ఉంటుందే ఏదో చిత్రం జరిగిందే
ఎపుడు లేదే మాయే నీదే
కథ మారేపోయిందే మధనం మొదలయ్యిందే
ఈ ఆలోచన ఎంతో బాగుందే
అది ప్రతిసారి నీవైపోస్తుందే
ఒక నిముషం చూసేలోగా సమయానికి ఈ పరుగేలా
ఇక ఆగే వీలే లేదే
ఉరిమే మనసిపుడే ఎగిరే ఎద లయలే
మాటే వినదసలే ఓ పిల్లా
కనులే కురిసెనులే కలలే తడిపెనులే
కథనం కుదిరినదే నీ వల్లా…

ఎదకేమై ఉంటుందే ఏదో చిత్రం జరిగిందే
ఎపుడు లేదే మాయే నీదే

వెనకాలె నీ వెనకాలే అడుగే సాగిందే
మునకేసే తాను మునకేసే
నీ ఊహల్లె ఉందే దాచే మాటె నీదని
నిన్నే ధాటి పోనని నీతో ఉన్నానంటే నాకో వరమే
పిలిచే నీ పలకుల మధురం
తెగ మురిసెను ఆధారం
ఈ చిన్ని చిన్ని జ్ఞాపకాలు గుండె లోతుల్లో పదిలం
ఉరిమే మనసిపుడే ఎగిరే ఎద లయలే
మాటే వినదసలే ఓ పిల్లా
కనులే కురిసెనులే కలలే తడిపెనులే
కథనం కుదిరినదే నీ వల్లా…

వయసే… తన తొలకరి అలజడి తెలిసిన
పరువపు కదలిన అలలుగా ఎగిసెను మాయాలోన తేలి
అది మోయలేని హాయి
మారులోకం చూసే ఆశే తీరే మార్గం ఉండే వెళదామా ఇపుడే




ప్రేమే లేదు పాట సాహిత్యం

 
చిత్రం: కనబడుట లేదు (2021)
సంగీతం: మధు పొన్నాస్ 
సాహిత్యం: మధు నందన్ 
గానం: రాహుల్ సిప్లిగంజ్ , రవి ప్రకాష్ చోడిమల్ల 

ప్రేమే లేదు 




తొలిసారి నిన్నే పాట సాహిత్యం

 
చిత్రం: కనబడుట లేదు (2021)
సంగీతం: మధు పొన్నాస్ 
సాహిత్యం: చంద్రబోస్
గానం: హరిచరణ్

తానాననా తానాన దిరనా
తొలిసారి నేనే ఒక సంద్రాన్నై ఎగసానే
నువు అలై కంటపడగానే, ఏ ఏ
తొలిసారి నేనే ఒక ఆకసమై ఎదిగానే
వెన్నెలై నువు రాగానే, ఏ ఏ
నిజంగా నీకోసమే ఇవ్వాళ నా మౌనమే
వేవేల రాగాలై మోగిందిలే

ఈ భూమి తిరిగే వరకు… నీ ప్రేమై నేనుంటానే
ఈ గాలి వీచే వరకు… నీ శ్వాసై ఉంటా
ఈ భూమి తిరిగే వరకు… నీ ప్రేమై నేనుంటానే
ఈ గాలి వీచే వరకు… నీ శ్వాసై ఉంటా, ఆ ఆఆ
(నీ శ్వాసై ఉంటా… నీ శ్వాసై ఉంటా)

ఏదో బ్రతుకుతున్నానే నిన్నాలుగా
ఏదోలా కదులుతున్నా నిశిలో నీడలా
పాదాన్ని నీవైపు నడిపావుగా
ప్రాణాన్ని తేనెల్లో తడిపావుగా
తీయ తియ్యగా… నను పైకి తీయగా
ఆనందాల తాళం తియ్యగా, ఆ ఆ

ఈ భూమి తిరిగే వరకు నీ ప్రేమై నేనుంటానే
ఈ గాలి వీచే వరకు నీ శ్వాసై ఉంటా
ఈ భూమి తిరిగే వరకు నీ ప్రేమై నేనుంటానే
ఈ గాలి వీచే వరకు నీ శ్వాసై ఉంటా, ఆ ఆఆ

నాకై ఎదురుచూసే బంధమే లేదుగా
నువ్విలా ఎదిగినావే కోటి బంధాలుగా
కౌగిళ్ళలో ఇంత బలముందని
కన్నీళ్ళలో ఇంత రుచి ఉందని
చూపినావుగా ఊయలూపినావుగా
నా రెండో రూపైనావుగా

తొలిసారి నేనే ఒక సంద్రాన్నై ఎగసానే
నువు అలై కంటపడగానే, ఏ ఏ

Palli Balakrishna Wednesday, September 1, 2021
Amma Nanna O Tamila Ammayi (2003) Telugu Songs Lyrics Album Cover

Amma Nanna O Tamila Ammayi (2003) Telugu Songs Lyrics

MOVIE DETAILS
Movie : Amma Nanna O Tamila Ammayi (2003)
Music : Chakri
Director : Puri Jagannadh
Producer : K. L. N. Raju
Actresses : Asin, Jayasudha
Release Date : 19 April 2003

Chennai Chandrama Song Lyrics in Telugu – Amma Nanna O Tamila Ammayi (2003)

'Chennai Chandrama' song from Amma Nanna O Tamila Ammayi (2003) movie is composed by Chakri and sung by Chakri and Kousalya.

SONG INFORMATION
Movie : Amma Nanna O Tamila Ammayi (2003)
Music : Chakri
Lyricist : Kandikonda
Singers : Chakri, Kousalya
చిత్రం: అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి (2003) సంగీతం: చక్రి సాహిత్యం: కందికొండ గానం: చక్రి, కౌసల్య పల్లవి: చెన్నై చంద్రమా మనసే చేజారి చెన్నై చంద్రమా నీలోన చేరి తెగించి తరలిపోతోంది హృదయం కోరే నీ చెలిమి చెన్నై చంద్రమా మనసే చేజారి చెన్నై చంద్రమా మనసే చేజారి చెన్నై చంద్రమా నీలోన చేరి తెగించి తరలిపోతోంది హృదయం కోరే నీ చెలిమి చెన్నై చంద్రమా మనసే చేజారి చరణం: 1 ప్రియా ప్రేమతో ఆ ఆ.. ప్రియా ప్రేమతో పలికే పూవనం ప్రియా ప్రేమతో పలికే పూవనం పరవశంగ ముద్దాడనీ ఈ క్షణం చెలి చేయని పెదవి సంతకం చెలి చేయని పెదవి సంతకం అదరపు అంచున తీపి జ్ఞాపకం చెన్నై చంద్రమా మనసే చేజారి చెన్నై చంద్రమా చరణం: 2 సఖి చేరుమా ఆ ఆ.. సఖి చేరుమా చిలిపితనమా సఖి చేరుమా చిలిపితనమా సోగ కనులు చంపేయకే ప్రేమా ఎదే అమృతం నీకే అర్పితం ఎదే అమృతం నీకే అర్పితం గుండెల నిండుగ పొంగెను ప్రణయం చెన్నై చంద్రమా మనసే చేజారి చెన్నై చంద్రమా నీలోన చేరి తెగించి తరలిపోతోంది హృదయం కోరే నీ చెలిమి చెన్నై చంద్రమా మనసే చేజారి

Lunchkostava Song Lyrics in Telugu – Amma Nanna O Tamila Ammayi (2003)

'Lunchkostava' song from Amma Nanna O Tamila Ammayi (2003) movie is composed by Chakri and sung by Chakri and Kousalya.

SONG INFORMATION
Movie : Amma Nanna O Tamila Ammayi (2003)
Music : Chakri
Lyricist : Sahithi
Singers : Chakri, Kousalya
చిత్రం: అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి (2003) సంగీతం: చక్రి సాహిత్యం: సాహితి గానం: చక్రి, కౌసల్య జింత చితా జింత చితా జింత చితా చితా చితా జింత చితా జింత చితా జింత చితా చితా చితా జింత చితా జింత చితా జింత చితా చితా చితా లంచుకొస్తావా మంచె కొస్తావా కోడ్ని కోస్తావా కన్నె డిన్నరిస్తావా ఓయ్.. లంచుకొస్తావా మంచె కొస్తావా కోడ్ని కోస్తావా కన్నె డిన్నరిస్తావా సోక్కు పాకవా పాత్తు కేక్కవా పూక్కల్ కొడుక్కవా కన్నె డిన్నరిడుక్కువా సై సై సోకులతో సై అంటావా ధై ధై తోపుకులే ధోలడిక్కవా గున్నమామి తోటకొస్తావా గుమ్మసోకు పండు ఇస్తావా కాదల్ మన్నన్ కున్నడిక్కవా కడికిర మామన కైపిడిక్కవా లంచుకొస్తావా మంచె కొస్తావా కోడ్ని కోస్తావా కన్నె డిన్నరిస్తావా పైట నీదే పట్టుకుంటే వెచ్చ పడే ఊపిరి హెయ్య హెయ్య హెయ్య హేయ్య పరువత్తిలే ముట్టమిడ వెక్క పాట్టలెప్పడి హెయ్య హెయ్య హెయ్య హేయ్య హే, పైట నీదే పట్టుకుంటే వెచ్చ పడే ఊపిరి పరువత్తిలే ముట్టమిడ వెక్క పాట్టలెప్పడి పిలక జడ నడుము ఇలా ఎగిసిపడే ఏంటటా తుళ్ళి ఆడుం నెంజమెల్లాం గిడుగిడుక్కుం ఓసైథాన్ చెయ్ చెయ్ కస్సుమని చేరుకుందామా నాదై కిస్కుపడి ఆడుగిర నేరందాన్ కోరుకున్న రవ్వల జాణా కోరిక తీర్చెయ్ నా కొరమీనా మధురై మీట సుందర పాయ్యా మనదై కేక్క విరుడుక్కు వాయ్యా ఓయ్, లంచుకొస్తావా మంచె కొస్తావా కోడ్ని కోస్తావా కన్నె డిన్నరిస్తావా మేని పార్త్త ముందిరిదాన్ ఇంద అళగు సుందరి ఓయ్య ఓయ్య ఓయ్య ఓయ్య హత్తుకుంటే మతులకే మతులుపోయే లాహిరి ఓయ్య ఓయ్య ఓయ్య ఓయ్య మేని పార్త్త ముందిరిదాన్ ఇంద అళగు సుందరి ఓయ్, ఓయ్య ఓయ్య ఓయ్య హత్తుకుంటే మతులకే మతులుపోయే లాహిరి పొంగి వరుం ఇళమైయెల్లాం ఉనక్కు దానే మన్నవా పరుచుకుంటు పట్టె మంచం పంచుకుందాం మక్కువ కై కై సేర్థ్తు విట్టు పాతుకాలమా హొయ్ హొయ్ గుమ్ముగుమ చేసుకోన అందమా నీతాన్ ఎనక్కు పొన్నిర వందు - ఆ నాన్తాన్ ఉనక్కు తేంద్రల్ కండు - హ హ సండే తెస్తా పువ్వుల చెంగు కంది చేలో సిద్ధంగుండు హాయ్, లంచుకొస్తావా మంచెకొస్తావా కోడ్ని కోస్తావా కన్నె డిన్నరిస్తావా సోక్కు పాకవా పాత్తు కేక్కవా పూక్కల్ కొడుక్కవా కన్నె డిన్నరిడుక్కువా సై సై సోకులతో సై అంటావా ధై ధై తోపుకులే ధోలడిక్కవా గున్నమామి తోటకొస్తావా గుమ్మసోకు పండు ఇస్తావా కాదల్ మన్నన్ కున్నడిక్కవా కతికిర మామన కైపిడిక్కవా లంచుకొస్తావా మంచె కొస్తావా కోడ్ని కోస్తావా కన్నె డిన్నరిస్తావా ॥

Neeve Neeve Song Lyrics in Telugu – Amma Nanna O Tamila Ammayi (2003)

'Neeve Neeve' song from Amma Nanna O Tamila Ammayi (2003) movie is composed by Chakri and sung by Chakri.

SONG INFORMATION
Movie : Amma Nanna O Tamila Ammayi (2003)
Music : Chakri
Lyricist : Peddada Murthy
Singers : Chakri
చిత్రం: అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి (2003) సంగీతం: చక్రి సాహిత్యం: పెద్దాడ మూర్తి గానం: చక్రి నీవే నీవే నీవే నేనంటా నీవే లేక నేనే లేనంటా వరమల్లే అందిందేమో ఈ బంధం ఓ ఓ వెలలేని సంతోషాలే నీ సొంతం నీవే నీవే నీవే నేనంటా నీవే లేక నేనే లేనంటా వరమల్లే అందిందేమో ఈ బంధం ఓ ఓ వెలలేని సంతోషాలే నీ సొంతం నీవే నీవే నీవే నేనంటా నీవే లేక నేనే లేనంటా నా కలలని కన్నది నీవే నా మెలకువ వేకువ నీవే ప్రతి ఉదయం వెలుగయ్యింది నీవేగా నా కష్టం నష్టం నీవే చిరునవ్వు దిగులు నీవే ప్రతి నిమిషం తోడై ఉంది నీవేగా కనిపించకపోతే బెంగై వెతికేవే కన్నీరే వస్తే కొంగై తుడిచేవే నీవే నీవే నీవే నేనంటా నీవే లేక నేనే లేనంటా నే గెలిచిన విజయం నీదే నే ఓడిన క్షణమూ నాదే నా అలసట తీరే తావే నీవేగా అడుగడుగున నడిపిన దీపమ ఇరువురికే తెలిసిన స్నేహమ మది మురిసే ఆనందాలే నీవేగా జన్మిస్తే మళ్ళీ నీవై పుడతాలే ధన్యోస్మీ అంటూ దణ్ణం పెడతాలే నీవే నీవే నీవే నేనంటా నీవే లేక నేనే లేనంటా వరమల్లే అందిందేమో ఈ బంధం ఓ ఓ వెలలేని సంతోషాలే నీ సొంతం నీవే నీవే నీవే నేనంటా నీవే లేక నేనే లేనంటా వరమల్లే అందిందేమో ఈ బంధం ఓ ఓ వెలలేని సంతోషాలే నీ సొంతం నీవే నీవే నీవే నేనంటా నీవే లేక నేనే లేనంటా

Zum Zummare Song Lyrics in Telugu – Amma Nanna O Tamila Ammayi (2003)

'Zum Zummare' song from Amma Nanna O Tamila Ammayi (2003) movie is composed by Chakri and sung by Kousalya.

SONG INFORMATION
Movie : Amma Nanna O Tamila Ammayi (2003)
Music : Chakri
Lyricist : Chandrabose
Singers : Kousalya
చిత్రం: అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి (2003) సంగీతం: చక్రి సాహిత్యం: చంద్రబోస్ గానం: కౌసల్య జుం జుమారే జుం జుం జుం జుం డం డుమారే డుం డుం డుం డుం జంటకొస్తే నీదే బబుల్ గమ్ ఓఓఓ ఇంటికి వస్తే ఇస్తా బ్రెడ్ జామ్ జాజిమల్లి మేరా నామ్ జాణతనమే మేరా కామ్ జాము రేయి చేస్తా ట్రాఫిక్ జామ్ ఓఓఓ ఆపై తలపై రాస్తా జండూబామ్ జుం జుమారే జుం జుం జుం జుం డం డుమారే డుం డుం డుం డుం జంటకొస్తే నీదే బబుల్ గమ్ ఓఓఓ ఇంటికి వస్తే ఇస్తా బ్రెడ్ జామ్ ఒపెల్ ఆస్ట్రా కారు ఉన్నా ఏడు ఫ్లోర్ల మేడున్నా ఒంట్లో మాత్రం ఓపిక ఉండాలోయ్ అమ్మా బాబు పోగేసే అంతేలేని డబ్బున్నా గుండెల్లోనే దమ్ముండాలి కళ్లల్లో కలలుండాలి కలలే తీరే దారే వెతకాలోయ్ నా దారికి నువ్వే వచ్చేయ్ నచ్చింది నేడే దోచేయ్ ఇష్టంగా ఏదో చేసేసేయ్ ఓఓఓ ఇచ్చి పుచ్చుకుంటే హ్యాపీసోయ్ నిన్నంటూ లేనే లేదోయ్ రేపంటూ రానే రాదోయ్ ఈ నాడే ఈడే తోడేసేయ్ ఓఓఓ ఇప్పుడిక్కడ వయసే వాడేసేయ్ జుం జుమారే జుం జుం జుం జుం డం డుమారే డుం డుం డుం డుం జంటకొస్తే నీదే బబుల్ గమ్ ఓఓఓ ఇంటికి వస్తే ఇస్తా బ్రెడ్ జామ్ ఫ్యాషన్ టీవీ చూసేస్తూ పోస్టర్లంకా కన్నేస్తూ గుటికలు వేస్తూ కాలం గడపొద్దోయ్ కోరికంతా దాచేస్తూ ఆశలన్నీ మూసేస్తూ బాడీలోని వేడే పెరిగి ఆ పైన బీపీ వచ్చి హాస్పిటల్‌లో అడ్మిట్ అవ్వొద్దోయ్ నీ ప్రాబ్లమ్ నా ప్రాబ్లమ్ గా మీ సౌఖ్యం నా సౌఖ్యం గా ఫ్రెండ్లీగా సాయం చేస్తాగా ఓఓఓ హండ్రెడ్ పర్సెంట్ అన్నీ ఇస్తాగా మీటింగే పెట్టేస్తాగా గ్రీటింగ్సే చెప్పేస్తాగా ఆటేదో ఆడించేస్తాగా ఓఓఓ హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్ అంటాగా జుం జుమారే జుం జుం జుం జుం డం డుమారే డుం డుం డుం డుం జంటకొస్తే నీదే బబుల్ గమ్ ఓఓఓ ఇంటికి వస్తే ఇస్తా బ్రెడ్ జామ్ జాజిమల్లి మేరా నామ్ జాణతనమే మేరా కామ్ జాము రేయి చేస్తా ట్రాఫిక్ జామ్ ఓఓఓ ఆపై తలపై రాస్తా జండూబామ్ జుం జుమారే జుం జుం జుం జుం డం డుమారే డుం డుం డుం డుం జంటకొస్తే నీదే బబుల్ గమ్ ఓఓఓ ఇంటికి వస్తే ఇస్తా బ్రెడ్ జామ్ ॥

Chumma Chumma Song Lyrics in Telugu – Amma Nanna O Tamila Ammayi (2003)

'Chumma Chumma' song from Amma Nanna O Tamila Ammayi (2003) movie is composed by Chakri and sung by Ravi Varma and Kousalya.

SONG INFORMATION
Movie : Amma Nanna O Tamila Ammayi (2003)
Music : Chakri
Lyricist : Bhaskarabhatla
Singers : Ravi Varma, Kousalya
చిత్రం: అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి (2003) సంగీతం: చక్రి సాహిత్యం: భాస్కరభట్ల గానం: రవివర్మ, కౌసల్య పల్లవి: చుమ్మా చుమ్మా దే చుమ్మా యమ్మ యమ్మగున్నది గుమ్మా ఆడేసుకుంటానమ్మా అచ్చంగ అష్టా చమ్మా బస్సెక్కి రానా రైలెక్కి రానా ఏకంగా ఫ్లైటెక్కి వచ్చేయనా జర్నీలు చేస్తే టైం అంత వేస్ట్ రెక్కలు కట్టుకు వచ్చేయవ త్వరగా త్వరగా త్వరత్వరగా చుమ్మా చుమ్మా దే చుమ్మా యమ్మ యమ్మగున్నది గుమ్మా ఆడేసుకుంటానమ్మా అచ్చంగ అష్టా చమ్మా బస్సెక్కి రానా రైలెక్కి రానా ఏకంగా ఫ్లైటెక్కి వచ్చేయనా జర్నీ లు చేస్తే టైం అంత వేస్ట్ రెక్కలు కట్టుకు వచ్చేయవ త్వరగా త్వరగా త్వరత్వరగా చరణం: 1 పొద్దున ఇచ్చే ముద్దు వద్దన్న ఆగదు లెద్దు సాయంకాలం ముద్దు సాయం కోరెను లెద్దు లిప్పుకి లిప్పు ఇచ్చిన ముద్దు నిప్పుల కుంపటి పెట్టేయదా గాలికి పంపేయ్ ఘాటైన ముద్దు గుండెకి గాలం వేసెయ్యదా కొత్తగా ఓయ్ కొత్తగా ఓయ్ కొత్తగా కొత్తగా కొత్తకొత్తగా మత్తుమత్తుగా ఉందిగా మెతగ్గా నన్ను హత్తుకో మరి హోయ్ హోయ్ హోయ్ హోయ్ చుమ్మా చుమ్మా దే చుమ్మా యమ్మ యమ్మగున్నదే గుమ్మా చుమ్మా చుమ్మా దే చుమ్మా యమ్మ యమ్మగున్నదే గుమ్మా గుమ్మా చరణం: 2 బుగ్గకి ఇచ్చే ముద్దు సిగ్గును పెంచును లెద్దు పాదం పైన ముద్దు పారాణి లాగేయొద్దు నడుముకి ఇచ్చే నాజుకు ముద్దు సన్నాయిమేళం మోగించదా మనసుని తాకే వెచ్చని ముద్దు నిన్ను నన్ను కలిపేయదా మస్తుగా హాయ్ మస్తుగా హాయ్ మస్తు మస్తుగా మస్తుగా శ్రీరస్తుగా శుభమస్తుగా వస్తగా పుస్థలే కొని తెస్తగా మరి హోయ్ హోయ్ హోయ్ హోయి హోయ్ హోయ్ చుమ్మా చుమ్మా దే చుమ్మా యమ్మ యమ్మగున్నదే గుమ్మా ఆడేసుకుంటానమ్మా అచ్చంగ అష్టా చమ్మా బస్సెక్కి రానా రైలెక్కి రానా ఏకంగా ఫ్లైటెక్కి వచ్చేయనా ఎహె జర్నీలు చేస్తే టైం అంత వేస్ట్ రెక్కలు కట్టుకు వచ్చేయవ త్వరగా త్వరగా త్వరత్వరగా చుమ్మా చుమ్మా దే చుమ్మా యమ్మ యమ్మగున్నదే గుమ్మా ఆడేసుకుంటానమ్మా అచ్చంగ అష్టా చమ్మా బస్సెక్కి రానా రైలెక్కి రానా ఏకంగా ఫ్లైటెక్కి వచ్చేయనా జర్నీలు చేస్తే టైం అంత వేస్ట్ రెక్కలు కట్టుకు వచ్చేయవ త్వరగా త్వరగా త్వరత్వరగా

Taluku Taluku Song Lyrics in Telugu – Amma Nanna O Tamila Ammayi (2003)

'Taluku Taluku' song from Amma Nanna O Tamila Ammayi (2003) movie is composed by Chakri and sung by Raghu Kunche and Smita.

SONG INFORMATION
Movie : Amma Nanna O Tamila Ammayi (2003)
Music : Chakri
Lyricist : Bhaskarabhatla
Singers : Raghu Kunche, Smita
చిత్రం: అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి (2003) సంగీతం: చక్రి సాహిత్యం: భాస్కరభట్ల గానం: రఘు కుంచే, స్మిత కోరస్: తళుకు తళుకు తళుకు తళుకు తళుకు తళుకు తళుకు తళుకు తళుకు తళుకు తళుకు తళుకు తళుకు త పల్లవి: తళుకు తళుకు తళుకు మంది సరుకు కలుపు కలుపు కలుపు చేయి కలుపు తళుకు తళుకు తళుకు మంది సరుకు కలుపు కలుపు కలుపు చేయి కలుపు దడకు దడ తలుపు గడ అదిరిపడే ఎడాపెడా పెరుగు వడ చెరుకు గడ జమా జమా రే గుంతలకడి ఘుమ ఘుమ గుంతలకడి ఘుమ ఘుమ గుంతలకడి గుంతలకడి ఘుమ ఘుమ హో హే తళుకు తళుకు తళుకు మంది సరుకు హే పడకు పడకు పడకు తత్తర పడకు చరణం: 1 వెన్న జున్ను కలిపి తెచ్చావే తిలోత్తమా చెమ్మచెక్క ఆట ఆడించనా కన్ను కన్ను కలిపి చేసావో హడావిడి గంగా యమునా తీరం చూపించనా అబ్బో నువ్వు గులాబిలా ఉంటే జిల్ జిలేబిలా వచ్చా నే ఇలా ఇలా ముద్దులు పెట్టేస్తా చూసేయ్ నువ్వు ఎగదిగా వచ్చే మరి ఉగాదిగా నీతో నే షికారుగా తొందరగొచ్చేసా హోఓఓఓఓ హోయ్ తప్పదు రాణి నీ చెక్కిలి బోణి హే నాగమణి నేడు మరి ధుమ్ము ధుమారే గుంతలకడి ఘుమ ఘుమ గుంతలకడి ఘుమ ఘుమ గుంతలకడి గుంతలకడి ఘుమ ఘుమ హో తళుకు తళుకు తళుకు మంది సరుకు కలుపు కలుపు కలుపు చేయి కలుపు హే చరణం: 2 చన్నా గున్న నడుము అమ్మమో అరేబియా నున్నగున్న షోకే నైజీరియా తట్టా బుట్టా పట్టు కోచాలే మహాశయా అట్టా ఇట్టా చేసి చుట్టెయ్యవా నువ్వే నా కందిపొడి రావే నా నైటు ఒడి నీకే నా పెట్టుబడి చప్పున వచ్చేసా నీకే నా మొక్కుబడి విప్పేయ్ రా చిక్కుముడి నీపై నే మోజుపడి చెంగున కట్టేసా హోఓఓఓఓ హోయ్ కిన్నెరసాని నిన్ను కమ్ముకుపోని నా కంటపడి వెంటపడి చంపుతున్నావే గుంతలకడి ఘుమ ఘుమ గుంతలకడి ఘుమ ఘుమ గుంతలకడి గుంతలకడి ఘుమ ఘుమ హో తళుకు తళుకు తళుకు మంది సరుకు కలుపు కలుపు కలుపు చేయి కలుపు తళుకు తళుకు తళుకు మంది సరుకు కలుపు కలుపు కలుపు చేయి కలుపు దడకు దడ తలుపు గడఅదిరిపడే ఎడాపెడా పెరుగు వడ చెరుకు గడ జమా జమా రే గుంతలకడి ఘుమ ఘుమ గుంతలకడి ఘుమ ఘుమ గుంతలకడి గుంతలకడి ఘుమ ఘుమ హో ॥

Palli Balakrishna Wednesday, July 26, 2017
Idiot (2002) Telugu Songs Lyrics Album Cover

Idiot (2002) Telugu Songs Lyrics

MOVIE DETAILS
Movie : Idiot (2002)
Music : Chakri
Director : Puri Jagannadh
Producer : Puri Jagannadh
Actors : Ravi Teja
Actresses : Rakshita
Release Date : 22 August 2002

Sye Sara Sye Song Lyrics in Telugu – Idiot (2002)

'Sye Sara Sye' song from Idiot (2002) movie is composed by Chakri and sung by Chakri.

SONG INFORMATION
Movie : Idiot (2002)
Music : Chakri
Lyricist : Kandikonda
Singers : Chakri
చిత్రం: ఇడియట్ (2002) సంగీతం: చక్రి సాహిత్యం: కందికొండ గానం: చక్రి సై సర సర సై వెయ్ చిరు చిందెయ్ సై సై సై సై సై సై సై సర సర సై సై సై సై సై సై సై వెయ్ వెయ్ వెయ్ వెయ్ వెయ్ చిరు చిందెయ్ వెయ్ వెయ్ వెయ్ వెయ్ నింగిలోని తార నీ చేతిలోకి రాదా తల దిండు తీసి లేరా దునియాను దున్నుకోరా నవ్వే నువ్వై నిప్పు రవ్వై కదంతొక్కెయ్ రా సర సర సై చిరు చిందెయ్ చేసేదేదైనా చెప్పేదేదైనా చేసెయ్ జంకుబొంకు లేకుండా పిందే పండైనా ఎక్కెయ్ ఎవరెస్టైనా సాహసంతో సావాసం చేసెయ్ రా చివరి వీధి నిండా ఎగరెయ్యి ప్రేమ జెండా చిరాకు నీకు లేస్తే అమ్మెయ్ రా గోల్కొండ నిన్న తప్పు తలుచుకొని ఫీల్ కాకురా తప్పువల్ల కొత్త నిజం తెలుసుకోరా చాన్సు ఉంటే మళ్ళీ తప్పు చేసి చూడరా చేసిన ఆ తప్పే మళ్ళీ చేయమాకు, చేయమాకు బిల్ గేట్సే గొప్ప కాదురా, ఓరయ్య రయ్యా నీకు నువ్వే కింగు సోదరా నవ్వే నువ్వై నిప్పురవ్వై కదంతొక్కెయ్ రా సర సర సై చిరు చిందెయ్ పుట్టాకెవడైనా బ్రతకాలేమైనా వేసెయ్ ముందడుగు ఇకనైనా వద్దు కొండైనా, చాలు రవ్వైనా తోసెయ్ నచ్చకుంటే దేన్నైనా కాలరెగరవేస్తూ కదిలెల్లు సామిరంగా ఎదురొస్తే ఎవ్వడైనా తన్నెయ్ సుబ్బరంగా చెయ్యగలను కానీ అనే మాటలొద్దురా గుండెలోన దమ్ములుంటే చేసి చూపరా నడిచి నడిచి పాతబడ్డ బాటలొద్దురా సత్తువుంటే కొత్త బాట వేసి చూపు, వేసి చూపు రేపు ఏంటో ఎవడికెరుకరా, ఓరయ్య రయ్యా ఉన్న నేటిననుభవించరా నవ్వే నువ్వై నిప్పురవ్వై కదంతొక్కెయ్ రా సర సర సై చిరు చిందెయ్ (వెయ్ వెయ్ వెయ్ వెయ్) సై సై సై సై సై సై సై సర సర సై సై సై సై సై సై సై వెయ్ వెయ్ వెయ్ వెయ్ వెయ్ చిరు చిందెయ్ వెయ్ వెయ్ వెయ్ వెయ్ నింగిలోని తార నీ చేతిలోకి రాదా తల దిండు తీసి లేరా దునియాను దున్నుకోరా నవ్వే నువ్వై నిప్పు రవ్వై కదంతొక్కెయ్ రా, సై

Choopultho Guchi Song Lyrics in Telugu – Idiot (2002)

'Choopultho Guchi' song from Idiot (2002) movie is composed by Chakri and sung by Shankar Mahadevan.

SONG INFORMATION
Movie : Idiot (2002)
Music : Chakri
Lyricist : Kandikonda
చిత్రం: ఇడియట్ (2002) సంగీతం: చక్రి సాహిత్యం: కందికొండ గానం: శంకర్ మహదేవన్ చూపుల్తో గుచ్చి గుచ్చి చంపకే మేరే హాయ్ ఒలల్ల గుండెల్ని గుల్ల చేసి జారకే మేరే హాయ్ నీ ప్రేమ కోసం నేను పిచ్చోణ్ణైపోయానే నీ ప్రేమ కోసం నేను పిచ్చోణ్ణైపోయానే నీ కళ్ళు పేలిపోను చూడవే మేరే హాయ్ నీ ప్రేమ నాలో నింపే మైకమే హాయ్ మైకమే హే నీ ప్రేమ నాలో నింపే మైకమే హాయ్ మైకమే ఏదోలా కొత్తగ ఉంది లోకమే హాయ్ లోకమే నిలువెల్లా నీరైపోయే దేహమే హాయ్ దేహమే లైఫంతా అయిపోయింది భారమే హాయ్ నీ అందం అడవైపోను చూడవే మేరే హాయ్ ఒలల్లా చూపుల్తో గుచ్చి గుచ్చి చంపకే మేరే హాయ్ నవ్వుల్తో పిండేస్తావు హృదయమే హాయ్ హృదయమే (2) నిను విడిచి ఉండలేను నిమిషమే హాయ్ నిమిషమే సై అంటే చూపిస్తాను స్వర్గమే హాయ్ స్వర్గమే ఛి అంటే జిందగి మొత్తం నరకమే హాయ్ నీ ఈడు బీడైపోను చూడవే మేరే హాయ్ ఒలల్లా చూపుల్తో గుచ్చి గుచ్చి చంపకే మేరే హాయ్ గుండెల్ని గుల్ల చేసి జారకే మేరే హాయ్ ఒలల్ల నీ ప్రేమ కోసం నేను పిచ్చోణ్ణైపోయానే నీ ప్రేమ కోసం నేను పిచ్చోణ్ణైపోయానే నీ కళ్ళు పేలిపోను చూడవే మేరే హాయ్

Cheliya Cheliya Song Lyrics in Telugu – Idiot (2002)

'Cheliya Cheliya' song from Idiot (2002) movie is composed by Chakri and sung by Ravi Varma.

SONG INFORMATION
Movie : Idiot (2002)
Music : Chakri
Lyricist : Peddada Murthy
Singers : Ravi Varma
చిత్రం: ఇడియట్ (2002) సంగీతం: చక్రి సాహిత్యం: పెద్దాడ మూర్తి గానం: రవివర్మ చెలియా చెలియా తెలుసా కళలే కలలై మిగిలే మదిలో దిగులే రగిలే సఖియా మనసే అలుసా కలిసే దారే కరువై కనులా నీరే నదులై ప్రియురాలా కనవా నా ఆవేదన ప్రియమారా వినవా ఈ ఆలాపన వలపే విషమా మగతే చలమా ప్రణయమా చెలియా చెలియా తెలుసా కళలే కలలై సఖియా మనసే అలుసా కలిసే దారే కరువై మదిలో దిగులే రగిలే కనులా నీరే నదులై ఎదలో ఒదిగే ఎదనే ఎదుటే దాచిందెవరు ఆశై ఎగసే అలనే మాయం చేసిందెవరు వినపడుతున్నవి నా మదికి చెలి జిలిబిలి పలుకుల గుసగుసలు కనబడుతున్నవి కన్నులకి నిన మొన్నల మెరిసిన ప్రియ లయలు ఇరువురి ఎద సడి ముగిసినదా కలవరమున చెర బిగిసినదా చెలియా చెలియా దరి రావా సఖియా సఖియా జత కావా ఓ ఓ ఓ... ఓ ఓ ఓ... రెప్పల మాటున ఉప్పెన రేపిన మేఘం ఈ ప్రేమ చెలియా చెలియా తెలుసా కళలే కలలై మిగిలే మదిలో దిగులే రగిలే సఖియా మనసే అలుసా కలిసే దారే కరువై కనులా నీరే నదులై గతమే చెరిపేదెవరు దిగులే ఆపేదెవరు కబురే తెలిపేదెవరు వలపే నిలిపేదెవరు జననం ఒకటే తెలుసు మరి తన మరణం అన్నది ఎరుగదది కాదని కత్తులు దూస్తున్నా మమకారం మాత్రం మరువదది చరితలు తెలిపిన సత్యమిదే అంతిమ విజయం ప్రేమలదే చెలియా చెలిమే విడువకుమా గెలిచేదోకటే ప్రేమ సుమా ఓ ఓ ఓ... ఓ ఓ ఓ... గుండెల గుడిలో ఆరక వెలిగే దీపం ఈ ప్రేమ చెలియా చెలియా తెలుసా కళలే కలలై మిగిలే మదిలో దిగులే రగిలే ప్రియురాలా కనవా నా ఆవేదన ప్రియమారా వినవా ఈ ఆలాపన వలపే విషమా మగతే చలమా ప్రణయమా చెలియా చెలియా తెలుసా కళలే కలలై మిగిలే మదిలో దిగులే రగిలే చెలియా...

Ee Roje Song Lyrics in Telugu – Idiot (2002)

'Ee Roje' song from Idiot (2002) movie is composed by Chakri and sung by Kousalya.

SONG INFORMATION
Movie : Idiot (2002)
Music : Chakri
Lyricist : Kandikonda
Singers : Kousalya
చిత్రం: ఇడియట్ (2002) సంగీతం: చక్రి సాహిత్యం: కందికొండ గానం: కౌశల్య ఈ రోజే తెలిసింది నీలో దాగిన ప్రేమా చిత్రంగా కురిసింది మదిపై మల్లెల వాన నా ఊపిరితో జీచించేటి ఓ చంటి ఐ లవ్ యు రా నిన్నే తలచి నన్నే మరిచా ఓ కన్నా ఐ లవ్ యు రా కను రాల్చే కన్నీరువ నను చేరే పన్నీరువా నీ ఎద చాటు వలపెంతో తెలిసిందిరా ఈ రోజే తెలిసింది నీలో దాగిన ప్రేమా చిత్రంగా కురిసింది మదిపై మల్లెల వాన కన్నులులోన వెన్నెలలోన నీ రూపు తోచే ఊహాలలోన ఊసులులోన నీ ఆశలే నాలో నీ బాసలే తొలిసారిగ సిగ్గేస్తోంది మొగ్గేస్తుంది తనువంతా అపుడపుడు తడిమేస్తుంది తడిపేస్తుంది మధువుల వాన ఆనందమై నాలో అనుభందమై నీ ప్రేమ నను చేరి ఉడికించేరా ఈ రోజే తెలిసింది నీలో దాగిన ప్రేమా చిత్రంగా కురిసింది మదిపై మల్లెల వాన ఏయ్... ఎంటలా చూస్తున్నావ్ ? సిగ్గేస్తుంది, దగ్గరికి రావద్దు ప్లీజ్... చంటి నిన్నే అరే ఉదయించే అరుణం నేనై నిను చేరుకోన వికసించే కుసుమము నేనై నిను తాకన నీలో సడి చేయనా పని చేస్తూ పక్కన చేరి సందడి చేస్తూ గుసగుసలే పడుకుంటే అల్లరి చేస్తూ నను లాగేస్తూ తుంటరి కలలే సంగీతమై నాలో సంతోషమై నీ ప్రేమ ఫలమేందో పండించరా ఈ రోజే తెలిసింది నీలో దాగిన ప్రేమా చిత్రంగా కురిసింది మదిపై మల్లెల వాన నా ఊపిరితో జీచించేటి ఓ చంటి ఐ లవ్ యు రా నిన్నే తలచి నన్నే మరచా ఓ కన్నా ఐ లవ్ యు రా కను రాల్చే కన్నీరువ నను చేరే పన్నీరువా నీ ఎద చాటు వలపెంతో తెలిసిందిరా చంటి... ప్లీజ్... ఛి

Le Letha Song Lyrics in Telugu – Idiot (2002)

'Le Letha' song from Idiot (2002) movie is composed by Chakri and sung by Udit Narayan and Kousalya.

SONG INFORMATION
Movie : Idiot (2002)
Music : Chakri
చిత్రం: ఇడియట్ (2002) సంగీతం: చక్రి సాహిత్యం: భాస్కరభట్ల గానం: కౌశల్య, ఉదిత్ నారాయణ్ లేలేత నవ్వులా పింగాని బొమ్మలా అందాలు అందితే అల్లుకోనా  బాగుంది వెన్నెలా కూ అంది కోయిలా కౌగిళ్ళలో నిన్ను హత్తుకోనా  ఏలో ఏలో ప్రేమా సరసాల సత్యభామా  కోలో కోలో రామా నువ్వేలే కోనసీమా  రంగేళి రూపమా బంగాళఖాతమా ఊరించి చేయకే హైరానా  లేలేత నవ్వులా పింగాని బొమ్మలా అందాలు అందితే అల్లుకోనా  బాగుంది వెన్నెలా కూ అంది కోయిలా కౌగిళ్ళలో నిన్ను హత్తుకోనా  చరణం: 1  ఎట్టా దాచావోగాని ఇన్నాళ్ళుగా దోచుకుంటా ఇచ్చేయ్ దోరగా  ఒళ్ళే వేడిక్కి ఉంది చాన్నాళ్ళుగా అది చేసింది ఎంతచొరవా  ఒడి చేరమంటు పిలిచింది ఆడతనమా హో...  నిను చూసినాక నా మనసు ఆపతరమా... నీ కాలి మువ్వనైపోనా నువు ఊగేటి ఊయలైరానా  నీ పూల పక్కనైపోనా తమలపాకుల్లో వక్కనై రానా  గోదారి తీరమా మంజీరనాదమా కవ్వింతలెందుకే హాయ్ రామా  లేలేత నవ్వులా పింగాని బొమ్మలా అందాలు అందితే అల్లుకోనా  బాగుంది వెన్నెలా కూ అంది కోయిలా కౌగిళ్ళలో నిన్ను హత్తుకోనా  చరణం: 2  లిల్లీ పూవంటి సోకు నాదేనుగా మరి గిల్లి గిచ్చెయ్ తేరగా  అగ్గే రేగింది నాలో చూశావుగా అది చేసింది ఎంతగొడవా  చిరు చీకటింట చేరాలి కొంటెతనమా... దరి చేరినాక పులకించు పూలవనమా... నీ గోటి గాటునైపోనా మరి నీగుండె గూటికే రానా  ఆ గోరువంకనైపోనా చెలి ఈ వాగువంకనై రానా  నాలోని భాగమా ఆ నీలిమేఘమా ఇచ్చాక ఎందుకో హైరనా  లేలేత నవ్వులా పింగాని బొమ్మలా అందాలు అందితే అల్లుకోనా  బాగుంది వెన్నెలా కూ అంది కోయిలా కౌగిళ్ళలో నిన్ను హత్తుకోనా  ఏలో ఏలో ప్రేమా సరసాల సత్యభామా  కోలో కోలో రామా నువ్వేలే కోనసీమా  రంగేళి రూపమా బంగాళఖాతమా ఊరించి చేయకే హైరానా  లేలేత నవ్వులా పింగాని బొమ్మలా అందాలు అందితే అల్లుకోనా  బాగుంది వెన్నెలా కూ అంది కోయిలా కౌగిళ్ళలో నిన్ను హత్తుకోనా 

Jai Veeranjaneya Song Lyrics in Telugu – Idiot (2002)

'Jai Veeranjaneya' song from Idiot (2002) movie is composed by Chakri and sung by Raghu Kunche.

SONG INFORMATION
Movie : Idiot (2002)
Music : Chakri
Singers : Raghu Kunche
చిత్రం: ఇడియట్ (2002) సంగీతం: చక్రి సాహిత్యం: భాస్కరభట్ల గానం: రఘు కుంచె జై వీరాంజనేయ... ఓ... ఏయ్ దీని తస్సదియ్య... ఓ... దుమ్ము రేపే దమ్ము ఉంది చూపులోనే చురుకు ఉన్నదిరో... పంబ రేపేయ్ కుర్రోడా బెండు తీసేయ్ చిన్నోడా చెడుగుడు ఆడేయ్ బుల్లోడా నిప్పులు చెరిగేయ్ సూరీడా ప్రేమలో పడితే కష్టాలుంటాయ్ కష్టాలున్నపుడే ఈ కన్నీళ్ళోస్తాయ్ ఈ కష్టాలు కన్నీళ్ళు మనకెందుకులే అనుకోని ప్రేమించడం మానేస్తే గొడ్డుకి మనిషికి తేడా ఏముంటుందిరో గుప్పెడు గుండెను తట్టిందా ఉప్పెన లాంటి ఈ ప్రేమా ఎనకడుగేస్తే దక్కేనా వన్నెచిన్నెలా ఈ భామా తల్లిని ప్రేమిస్తాడోకడు పిల్లిని ప్రేమిస్తాడోకడు అక్కను ప్రేమిస్తాడోకడు కుక్కను ప్రేమిస్తాడోకడు అలాంటపుడు నువీ పిల్లను ప్రేమిస్తే తప్పేమిటిరో ప్రాణంగాను ప్రేమిస్తే ముందు వెనకా చూడకురో అడ్డం వస్తే ఎవడైనా తాడో పేడో తేల్చేయ్ రో ఓరోరి కుర్రోడో ఆ పిల్ల నీదేరో సీమంటూ కుట్టాక సిర్రెత్తు కొస్తాది ప్రేమంటూ పుట్టిందా ఏదేదో అవుతాది ప్రేమేగానయ్యిందంటే చచ్చేదాక అసలే వదలదురోయి విడదీయలనుకుంటున్న అయ్యెరామ ఇంచే కదలదు రోయి పెద్దోళ్ళ ఏడుపు చూసి కరగొద్దు ముద్దుల కన్నా అయ్యయ్యో అన్నావంటే నీ ప్రేమే నిండు సున్నా ప్రేమించుకోవయ్యో తప్పేమికాదయ్యో నవాబు గరీబు తేడాలే లేవంటూ ఆనాడు ఈనాడు గెలిచేదే ప్రేమంటా లోకంలో అన్నిటికన్నా అద్దిరబన్నా ప్రేమే గొప్పదిరోయి కుర్రోడు ముసలోడైన ఎప్పటికైనా ప్రేమలో పడతాడోయి ప్రేమిస్తే సరిపోదన్నా ప్రాణాలే ఇచ్చేయాలి అదికూడా కాదంటావా ప్రాణాలే తీసేయాలి ఇటు చూడు బ్రహ్మయ్యో ఇతగాడి జోరయ్యో ప్రేమించే పిల్లాడు ఎదురించి నిలిచాడు ప్రేమిస్తే ఇట్టాగే పోరాడాలన్నాడు సుడిగుండాలెన్నెదురైనా బిత్తర పోక ఒడ్డుకు చేరాలోయి బుసకొట్టే పాములు ఉన్నా తత్తరపడక బరిలో గెలవాలోయి అన్నన్నా ఓరన్నా నిప్పయ్యి రేగాలన్నా ఎదురింకా లేదన్నా గెలిచేది నువ్వేనన్నా అన్నన్నా ఓరన్నా నిప్పయ్యి రేగాలన్నా ఎదురింకా లేదన్నా గెలిచేది నువ్వేనన్నా అన్నన్నా ఓరన్నా నిప్పయ్యి రేగాలన్నా ఎదురింకా లేదన్నా గెలిచేది నువ్వేనన్నా

Palli Balakrishna Monday, July 24, 2017

Most Recent

Default