Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Raveena Tandon"
K.G.F: Chapter 2 (2022)



చిత్రం: K.G.F Chapter 2 (2022)
సంగీతం: రవి బసృర్
నటీనటులు: యష్, శ్రీనిధి షెట్టి, సంజయ్ దత్, రవీనాటాండన్
దర్శకత్వం: ప్రశాంత్ నీల్ 
నిర్మాత: విజయ్ కిరగందూర్
విడుదల తేది: 14.04.2022



Songs List:



తూఫాన్ పాట సాహిత్యం

 
చిత్రం: K.G.F Chapter 2 (2022)
సంగీతం: రవి బసృర్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి 
గానం: సాయి కృష్ణ , పృద్వీ చంద్ర , అరుణ్ కౌండిన్య , సాయి చరణ్, సంతోష్ వెంకయ్, మోహన్ కృష్ణ, సచిన్ బసృర్, రవి బసృర్, పునీత్ రుద్రనాగ్ , మనీష్ దినకర్ , హరిణి ఇవటూరి , గిరిధర్ కామత్, రక్షా కామత్ , సించన కామత్, నిశాంత్ కిని, భారత్ భట్ , అనఘ నాయక్, అవని భట్, స్వాతి కామత్, శివానంద్ నాయక్, కీర్తన బసృర్

తూఫాన్




ఎదగరా ఎదగరా పాట సాహిత్యం

 
చిత్రం: K.G.F Chapter 2 (2022)
సంగీతం: రవి బసృర్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి 
గానం: సుచేత బసురూర్

ఎదగరా ఎదగరా



సుల్తానా పాట సాహిత్యం

 
చిత్రం: K.G.F Chapter 2 (2022)
సంగీతం: రవి బసృర్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి 
గానం: సాయి కృష్ణ , పృద్వీ చంద్ర , అరుణ్ కౌండిన్య , సాయి చరణ్, సంతోష్ వెంకయ్, మోహన్ కృష్ణ, సచిన్ బసృర్, రవి బసృర్, పునీత్ రుద్రనాగ్ , మనీష్ దినకర్ , హరిణి ఇవటూరి 

రణ రణ రణ రణధీరా
గొడుగెత్తే నీలి గగనాలు
రణ రణ రణ రణధీరా
పదమొత్తె వేల భువనాలు


రణ రణ రణ రణధీరా
తలవంచే నీకు శిఖరాలు
రణ రణ రణ రణధీరా
జేజేలు పలికే ఖనిజాలు

నిలువెత్తు నీ కదము
ముష్కరులపాలి ఉక్కు సమ్మెటా
అనితరము నీ పదము
అమావాస్య చీల్చు అగ్గి బావుటా

రగిలే పగిలే నిట్టూర్పులకు
నీ వెన్నుదన్నే ఓదార్పు
మా బతుకిదిగో నీకై ముడుపు
నడిపించర తూరుపు వైపు

ధీర ధీర ధీర ధీరా సుర సుల్తానా
ధీర ధీర ధీర ధీరా సుర సుల్తానా
ధీర ధీర ధీర ధీరా సుర సుల్తాన
ధీర ధీర ధీర ధీరా సుర సుల్తానా, ఆ ఆ

కధమెత్తిన బలవిక్రముడై
దురితమతులు పని పట్టు
పేట్రేగిన ప్రతి వైరుకలా
పుడమి ఒడికి బలిపెట్టు

ఏయ్, కట్టకటిక రక్కసుడే ఒక్కొక్కడు
వేటుకొకడు ఒరిగేట్టు వెంటపడు
సమరగమన సమవర్తివై నేడు
శత్రుజనుల ప్రాణాలపైనబడు

తథ్యముగ జరిగి తీరవలే
కిరాతక దైత్యుల వేట
ఖచ్చితముగా నీ ఖడ్గ సిరి
గురితప్పదెపుడు ఏ చోటా

రగిలే పగిలే నిట్టూర్పులకు
నీ వెన్నుదన్నే ఓదార్పు
మా బతుకిదిగో నీకై ముడుపు
నడిపించర తూరుపు వైపు
(జై జై జై… జై జై జై)

రణ రణ రణ రణధీరా
గొడుగెత్తే నీలి గగనాలు
రణ రణ రణ రణధీరా
పదమొత్తె వేల భువనాలు

రణ రణ రణ రణధీరా
తలవంచే నీకు శిఖరాలు
రణ రణ రణ రణధీరా
జేజేలు పలికే ఖనిజాలు

నిలువెత్తు నీ కదము
ముష్కరులపాలి ఉక్కు సమ్మెటా
అనితరము నీ పదము
అమావాస్య చీల్చు అగ్గి బావుటా

రగిలే పగిలే నిట్టూర్పులకు
నీ వెన్నుదన్నే ఓదార్పు
మా బతుకిదిగో నీకై ముడుపు
నడిపించర తూరుపు వైపు

ధీర ధీర ధీర ధీరా సుర సుల్తానా
ధీర ధీర ధీర ధీరా సుర సుల్తానా
ధీర ధీర ధీర ధీరా సుర సుల్తాన
ధీర ధీర ధీర ధీరా సుర సుల్తానా, ఆ ఆ





మెహబూబా పాట సాహిత్యం

 
చిత్రం: K.G.F Chapter 2 (2022)
సంగీతం: రవి బసురూర్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి 
గానం: అనన్య భట్ 

మండే గుండెలో
చిరుజల్లై వస్తున్నా
నిండు కౌగిలిలో
మరుమల్లెలు పూస్తున్నా

ఏ అలజడి వేళనైనా
తలనిమిరే చెలినై లేనా
నీ అలసట తీర్చలేనా
నా మమతల ఒడిలోనా

మెహబూబా… మై తెరి మెహబూబా
మెహబూబా… మై తెరి మెహబూబా
మెహబూబా… మై తెరి మెహబూబా
మెహబూబా… ఓ మై తెరి మెహబూబా

చనువైన వెన్నెల్లో చల్లారనీ
అలలైనా దావానలం
ఉప్పెనై ఎగసిన శ్వాస పవనాలకు
జత కావాలి అందాల చెలి పరిమళం


రెప్పలే మూయని విప్పు కనుదోయికి
లాలి పాడాలి పరువాల గమదావనం

వీరాధి వీరుడివైన
పసివాడిగ నిను చూస్తున్నా
నీ ఏకాంతాల వెలితే
పూరిస్తా ఇకపైనా

మెహబూబా… మై తెరి మెహబూబా
మెహబూబా… మై తెరి మెహబూబా
మెహబూబా… మై తెరి మెహబూబా
మెహబూబా… ఓ మై తెరి మెహబూబా

హుహు హూ మ్ హూ హూ హూ
హుహు హూ మ్  ఊహుఁ హుఁ




తందాని నానే తానితందానో పాట సాహిత్యం

 
చిత్రం: K.G.F Chapter 2 (2022)
సంగీతం: రవి బసురూర్
సాహిత్యం: అదితి సాగర్ 
గానం: అదితి సాగర్ 

పడమర నిశితెర వాలనీ
చరితగా ఘనతగా వెలగరా

అంతులేని గమ్యము కదరా
అంతవరకు లేదిక నిదురా

అష్టదిక్కులన్నియూ అదర
అమ్మకన్న కలగా పదరా

చరితగా ఘనతగా వెలగరా
చరితగా ఘనతగా వెలగరా

జననిగా దీవెనం
గెలుపుకె పుస్తకం… నీ శఖం
ధగ ధగ కిరణమై
ధరణిపై చేయరా సంతకం

తందాని నానే తానితందానో
తానె నానేనో
హే, నన్నాని నానే తానితందానో
తానె నానేనో

Palli Balakrishna Tuesday, April 26, 2022
Saadu (1994)



Movie Details

Palli Balakrishna Thursday, August 26, 2021
Akasa Veedhilo (2001)


చిత్రం: ఆకాశ వీధిలో (2001)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: చంద్రబోస్
గానం: దేవి శ్రీ ప్రసాద్, గంగ
నటీనటులు: నాగార్జున, రవీనా టండన్, కస్తూరి
దర్శకత్వం: సింగీతం శ్రీనివాసరావు
నిర్మాత: రామోజీరావు
విడుదల తేది: 23.08.2001

వెన్నెల్లొ ఆడపిల్ల నువ్వైతే
వెచ్చని అల్లరి నాదైతే
ఊహలకేవో రెక్కలు రాగా
ఎగిరి పోతుంటె ఆకాశవీధిలో

వెన్నెల్లొ ఆడపిల్ల నేనైతే
వెచ్చని అల్లరి నీదైతే
ఊహలకేవో రెక్కలు రాగా
ఎగిరి పోతుంటె ఆకాశవీధిలో

మేఘాలే ముగ్గులు పెట్టె మేలల్లో
దేహాలే ఉగ్గులు కోరె దాహంలో
చందమామే మంచం...ఓహో హో...సర్దుకుందం కొంచం
అహో రాత్రులూ ఒకే యాత్రలూ
రహస్యాల రహదారిలో ఆకాశవీధిలో

వెన్నెల్లొ ఆడపిల్ల నేనైతే
వెచ్చని అల్లరి నాదైతే

భూదేవె బిత్తరపోయె వేగంలో
నా దేవె నిద్దర లేచె విరహంలో
తోక చుక్కై చూస్తా...ఓహో హో...సోకు లెక్కె రాస్తా
ముల్లోకాలకే ముచ్చెమటెయగా
ముస్తాబంత ముద్దడుకో ఆకాశవీధిలో

వెన్నెల్లొ ఆడపిల్ల నువ్వైతే
వెచ్చని అల్లరి నాదైతే
ఊహలకేవో రెక్కలు రాగా
ఎగిరి పోతుంటె ఆకాశవీధిలో

వెన్నెల్లొ ఆడపిల్ల నేనైతే


Palli Balakrishna Monday, January 8, 2018
Bangaru Bullodu (1993)



చిత్రం: బంగారు బుల్లోడు (1993)
సంగీతం: రాజ్-కోటి
నటీనటులు: బాలక్రిష్ణ, రవీణా టండన్, రమ్యకృష్ణ
దర్శకత్వం: రవిరాజా పినిశెట్టి
నిర్మాత: వి.బి.రాజేంద్రప్రసాద్
విడుదల తేది: 03.09.1993



Songs List:



గుడివాడ గుమ్మరో పాట సాహిత్యం

 
చిత్రం: బంగారు బుల్లోడు (1993)
సంగీతం: రాజ్-కోటి
సాహిత్యం: భువనచంద్ర
గానం: యస్. పి. బాలు , చిత్ర

గుడివాడ గుమ్మరో ఘుమ ఘుమ గుందిరో ముడేసి నే పడేసుకోనా
గుంటూరు గుంటడు యమ యమ గుంన్నాడు మిలేసి నే కలేసుకోనా
తడి పొంగులో తస్సాదియ్యా
మడి దున్నుకో ఓ బావయ్యో

గుడివాడ గుమ్మరో ఘుమ ఘుమ గుందిరో ముడేసి నే పడేసుకోనా
గుంటూరు గుంటడు యమ యమ గుంన్నాడు మిలేసి నే కలేసుకోనా

అరే గుడివాడ గుమ్మరో ఘుమ ఘుమ గుందిరో ముడేసి నే పడేసుకోనా
గుంటూరు గుంటడు యమ యమ గుంన్నాడు మిలేసి నే కలేసుకోనా

చిరుజల్లు కొట్టిందే చిటపట చిన్నారి 
చలిమంట వెసేయ్యనా
వరదలే పొంగింది వలపంతా ఓరయ్యో ఒడుపెంతో చూసేయ్యనా
అదిరే చలి బంగారు బొమ్మ 
ముదిరే ఇది వన్నెల రెమ్మ
పుడితే కసి గువ్వల చెన్న 
చెడదా మతి ముద్దుల కన్నా
అరే అలటప యవ్వారాలు సాగవే బుల్లెమ్మో
అరే వంపులు దోచే వెచ్చని పక్క వేద్దాం రావమ్మో

హోయ్ గుంటూరు గుంటడు యమ యమ గుంన్నాడు మిలేసి నే కలేసుకోనా
గుడివాడ గుమ్మరో ఘుమ ఘుమ గుందిరో ముడేసి నే పడేసుకోనా

పరువాల పేరంటం హుషారుగ పిల్లోడా 
ఒడిలోన పెట్టేైనా
సరసాల తారంగం తిరకాసు బుచ్చమ్మో 
జలసాగ లాగించనా
పనిలో పని అద్దిరబన్నా 
మొదలై మరీ ఒంటరిగున్నా
పదవే అంటు చమ్మక చలో 
పడతా పని తిగర బుల్లో
తయ్యతక్క ముద్దుల మేళం మోగాలి ఈ పూట
హద్దుల దాటి అల్లరి వేట సాగాలి ఈ చోట

హొయ్ హొయ్... 
గుడివాడ గుమ్మరో ఘుమ ఘుమ గుందిరో ముడేసి నే పడేసుకోనా
యహ యహ యహ యహ
గుంటూరు గుంటడు యమ యమ గుంన్నాడు మిలేసి నే కలేసుకోనా
అరే తడి పొంగులో తస్సాదియ్యా
మడి దున్నుకో ఓ బావయ్యో

గుడివాడ గుమ్మరో ఘుమ ఘుమ గుందిరో ముడేసి నే పడేసుకోనా
గుంటూరు గుంటడు యమ యమ గుంన్నాడు మిలేసి నే కలేసుకోనా





ఎన్నెట్లో చాపేసి పాట సాహిత్యం

 
చిత్రం: బంగారు బుల్లోడు (1993)
సంగీతం: రాజ్-కోటి
సాహిత్యం: వేటూరి
గానం: యస్. పి. బాలు , చిత్ర

ఎన్నెట్లో చాపేసి ఎన్నిచ్చి కూకుంటా
ఎంకల్లే పాటల్లో కంకేస్తే సోకంటా
ఊరే నా తేనెముద్దు ఉగ్గు పట్టుకుంటా
ఉంగా ఉంగంటు మొగ్గ ఎంగిలంటుకుంటా
ఊరే నా తేనెముద్దు ఉగ్గు పట్టుకుంటా
ఉంగా ఉంగంటు మొగ్గ ఎంగిలంటుకుంటా
చలికాలంలో చెలరేగే గరంగరం నరాలలో మంట

ఎన్నెట్లో చాపేసి ఎన్నిచ్చి కూకుంటా
ఎంకల్లే పాటల్లో కంకేస్తే సోకంటా

ఏడురంగుల ఈ వానవిల్లు
చెయ్యి తాకిడికే చెమ్మగిల్లు
చుక్కలేలకు నూ సూదికళ్లు
చూపుకే నడుమే సన్నగిల్లు
పాలలో మీగడెందుకో పైటలో పొంగులందుకే
చల్లలో వెన్నలెందుకో జంటలో వేడి అందుకే
జాజివనం చేరుకుని జానపదం పాడుకుని
ఆడుకునే వయ్యారమే వసంతపు దుకాణమే అంట

ఎన్నెట్లో చాపేసి ఎన్నిచ్చి కూకుంటా
ఎంకల్లే పాటల్లో కంకేస్తే సోకంటా

భామలందరిలో బంతిపువ్వు
చెంగుకోరని చామంతిపువ్వు
దండయాత్రకు దక్కాలి నువ్వు
కౌగిలింతల కట్నాలు ఇవ్వు
ఇంటిలో గుట్టు పెల్లికి దండగే పూలపల్లకి
సోకుతో శోభనాలకి దీపమే అడ్డు రాత్రికి
కోడెతనం కొంగుకసి ఆడతనం పొంగురుచి
కోరుకునే వయస్సులో ఎడాపెడా ఫలించులే పంట

ఎన్నెట్లో చాపేసి ఎన్నిచ్చి కూకుంటా
ఎంకల్లే పాటల్లో కంకేస్తే సోకంటా

ఊరే నా తేనెముద్దు ఉగ్గు పట్టుకుంటా
ఉంగా ఉంగంటు మొగ్గ ఎంగిలంటుకుంటా
ఊరే నా తేనెముద్దు ఉగ్గు పట్టుకుంటా
ఉంగా ఉంగంటు మెుగ్గ ఎంగిలంటుకుంటా
చలికాలంలో చెలరేగే గరంగరం నరాలలో మంట




తధిగినతొం తధిగినతొం బాలయ్యో పాట సాహిత్యం

 
చిత్రం: బంగారు బుల్లోడు (1993)
సంగీతం: రాజ్-కోటి
సాహిత్యం: భువనచంద్ర
గానం: మనో, చిత్ర, మినీ మినీ

దితొం దితొం
తధిగినతొం తధిగినతొం బాలయ్యో 
ఇటు రావయ్యో నా చూపే శృంగారం
తకదిమితొం తకదిమితొం బావయ్యో 
ఇటు చూడయ్యో నా ఒంపే వయ్యారం
వినవే అనులమిన్న తగువే వద్దని అన్న 
ఇప్పుడే పుట్టా బుల్లేమ్మో
కనవే తొక్కుడు బిల్ల జగడం ఎందుకే మళ్ళ 
రాజీ ఉండాలే పిల్లో 
హరిలో హరి సరికి సరి వినవే మరీ తతొం దితొం

తధిగినతొం తధిగినతొం బాలయ్యో 
ఇటు రావయ్యో నా చూపే శృంగారం
తకదిమితొం తకదిమితొం బావయ్యో 
ఇటు చూడయ్యో నా ఒంపే వయ్యారం

కమ్మంగా కౌగిట్లో కవ్వించేయ్నా
కసిగా ఉయ్యాలో జంపాలో ఊగించేయ్నా
ఒళ్లోని వైకుంఠం చూపించెయ్నా
అదిరే అందాలే అచ్చంగా అందించెయ్నా
రంభా ఊర్వసులే నా సరి రారురా
రతి నా చెలికత్తె ఇటు రారో
ఇక చాలు చాలు ఆగడాలు అమ్మాయో ఓ ఓ ఓ...
నే వేగలేను రాలుగాయి గుమ్మాయో ఓ ఓ ఓ...
హరిలో హరి సరికి సరి పదవే మరీ తతొం దితొం

తధిగినతొం తధిగినతొం బాలయ్యో 
ఇటు రావయ్యో నా చూపే శృంగారం
తకదిమితొం తకదిమితొం బావయ్యో 
ఇటు చూడయ్యో నా ఒంపే వయ్యారం

చూశా నీ యవ్వారం వన్నెలాడి 
నిన్ను గోదాట్లో తొక్కేస్తా గిన్నెకోడి
చాలించే గప్పాలు కుర్ర కేడి
మనతో పందేలు వేశావో చిక్కే బాడి
భరతం పడతాను పదవే పోకిరి
దుమ్ము దులిపేస్తా గయ్యాలి
అరె ఆపు ఆపు తందనాలు చామంతి హొ హొ హో...
నే చూడలేనె కొట్టుకుంటే పూబంతి ఓ ఓ ఓ...
హరిలో హరి సరికి సరి పదవే మరీ తతొం దితొం

తధిగినతొం తధిగినతొం బాలయ్యో 
ఇటు రావయ్యో నా చూపే శృంగారం
తకదిమితొం తకదిమితొం బావయ్యో 
ఇటు చూడయ్యో నా ఒంపే వయ్యారం
హోయ్ వినవే అనులమిన్న తగువే వద్దని అన్న 
ఇప్పుడే పుట్టా బుల్లేమ్మో
కనవే తొక్కుడు బిల్ల జగడం ఎందుకే మళ్ళ 
రాజీ ఉండాలే పిల్లో 
హరిలో హరి సరికి సరి వినవే మరీ తతొం దితొం





వానా వానా వచ్చేనంట పాట సాహిత్యం

 
చిత్రం: బంగారు బుల్లోడు (1993)
సంగీతం: రాజ్-కోటి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, చిత్ర

(ఈ పాటను అల్లరి నరేష్ నటించిన బంగారు బుల్లోడు (2021)  సినిమాలో రీమిక్స్ చేశారు దానికి సంగీతం సాయి కార్తిక్ అందించారు, పాడిన వారు ఎల్.వి.రేవంత్, నాధప్రియ  )

వానా వానా వచ్చేనంట వాగు వంకా మెచ్చేనంట
తీగా డొంకా కదిలేనంట తట్టాబుట్టా కలిసేనంట
ఎండా వానా పెళ్ళాడంగా కొండా కోనా నీళ్ళాడంగా
కృష్ణా గోదారమ్మ కలిసి పరవళ్ళెత్తి పరిగెత్తంగా
వానా వానా వచ్చేనంటా వాగు వంకా మెచ్చేనంటా...

ఓహో... ఓహో...

స్వాతిలో ముత్యమంత ముద్దులా ముట్టుకుంది సంధ్య వాన
సందెలో చీకటంత సిగ్గులా అంటుకుంది లోన లోనా
అల్లో మల్లో - అందాలెన్నో యాలో యాల

స్వాతిలో ముత్యమంత ముద్దులా ముట్టుకుంది సంధ్య వాన
సందెలో చీకటంత సిగ్గులా అంటుకుంది లోన లోనా

చరణం: 1
తాకిడి పెదవుల మీగడ తరకలు కరిగే వేళ
మేనక మెరపులు ఊర్వశి ఉరుములు కలిసేనమ్మా
కోకకు దరువులు రైకకు బిగువులు పెరిగే వేళ
శ్రావణ సరిగమ యవ్వన ఘుమ ఘుమ లయనీదమ్మ
వానా వానా వల్లప్పా వాటేస్తేనే తప్పా
సిగ్గు యెగ్గూ చెల్లెప్పా కాదయ్యో నీ గొప్పా
నీలో మేఘం నాలో దాహం యాలో యాల

స్వాతిలో ముత్యమంత ముద్దులా ముట్టుకుంది సంధ్య వాన
సందెలో చీకటంత సిగ్గులా అంటుకుంది లోన లోనా

చరణం: 2
వానా వానా వచ్చేనంట వాగు వంకా మెచ్చేనంట
తీగా డొంకా కదిలేనంట తట్టాబుట్టా కలిసేనంట
ఎండా వానా పెళ్ళాడంగా కొండా కోనా నీళ్ళాడంగా
కృష్ణా గోదారమ్మ కలిసి పరవళ్ళెత్తి పరిగెత్తంగా

తుమ్మెద చురకలు తేనెల మరకలు కడిగే వాన
తిమ్మిరి నడుమున కొమ్మల తొడిమలు వణికే వాన
జన్మకు దొరకని మన్మధ తలుపులు ముదిరే వాన
చాలని గొడుగున నాలుగు అడుగుల నటనే వాన
వానల్లోన సంపెంగ ఒళ్ళంతా ఓ బెంగా
గాలి వాన గుళ్ళోనా ముద్దేలే జేగంట
నాలో రూపం నీలో తాపం యాలో యాల

స్వాతిలో ముత్యమంత ముద్దులా ముట్టుకుంది సంధ్య వాన
సందెలో చీకటంత సిగ్గులా అంటుకుంది లోన లోనా
అల్లో మల్లో - అందాలెన్నో - యాలో యాల

వానా వానా వచ్చేనంట వాగు వంకా మెచ్చేనంట
తీగా డొంకా కదిలేనంట తట్టాబుట్టా కలిసేనంట
ఎండా వానా పెళ్ళాడంగా కొండా కోనా నీళ్ళాడంగా
కృష్ణా గోదారమ్మ కలిసి పరవళ్ళెత్తి పరిగెత్తంగ



మనసు ఆగదు వయసు తగ్గదు పాట సాహిత్యం

 
చిత్రం: బంగారు బుల్లోడు (1993)
సంగీతం: రాజ్-కోటి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, యస్.పి.శైలజ

మనసు ఆగదు వయసు తగ్గదు
ఓలమ్మో... ఒంటిగా నిదుర పట్టదు
మనసు మారదు ఉడుకు తగ్గదు
ఏందమ్మో జంటగా చిలక వాలదు
ప్రేమంటేనె పేచీలు రాత్రికి మాత్రం రాజీలు
గిల్లిగిచ్చి కజ్జాలు లవ్లీ లావా దేవీలు

అబబ్బ నెమ్మది - మధన మన్మది
వలది నేడదీ... -  హా....

మనసు ఆగదు వయసు తగ్గదు
ఓలమ్మో... ఒంటిగా నిదుర పట్టదు
మనసు మారదు ఉడుకు తగ్గదు
ఏందమ్మో  జంటగా చిలక వాలదు

చరణం : 1
ఎద ఉరుకులు పొదలకు ఎరుపట
పొద ఇరుకులు జతలకు చెరుకట
ఓ ఓ ఓ ఓ... ఓ ఓ ఓ ఓ 
తొలివలపులు తొలకరి ఋతువట
చలి పిలుపులు చెలిమికి రుజువట
ఓ ఓ ఓ ఓ... ఓ ఓ ఓ ఓ 
సొగసరి ఇటు మగసిరి అటు
కలబడినది కసి కాటు...హా
మనసులు ఇటు కలిసినవటు
మనుగడకిది తొలిమాటు
చూపుకు చూపే చుమ్మా
ఊపిరి వెడేకొమ్మా
ముద్దుకు ముద్దె గుమ్మా ముచ్చట నేడే నమ్మా
వయసు లేడిరో - వలపు తాడుతో 
నిలిపి చూడరో - హా...

మనసు ఆగదు వయసు తగ్గదు
ఓలమ్మో.... ఒంటిగా నిదుర పట్టదు
మనసు మారదు ఉడుకు తగ్గదు
ఏందమ్మో జంటగా చిలక వాలదు

చరణం : 2
ఓ ఓ ఓ ఓ... ఓ ఓ ఓ 
రుచులాడిగెను  పెదవిని పెదవులు 
కోసరడిగెను వలపుల ముడుపులు
ఓ ఓ ఓ ఓ ....ఓ ఓ ఓ ఓ
తనువడిగెను తపనల తనువులు
జతనడిగెను మదనుడి మణువులు
ఓ ఓ ఓ ఓ ....... ఓ ఓ ఓ ఓ 
పులి తగిలిన గిలిరగిలిన శిల 
అడిగెను నీ రూపం  హా....
నిను తగిలిన సొనలిరిగిన వయసడిగెను నీ తాపం
మనసే మల్లెల తోటా పొంగే తేనెల తేట
తొలిగా తుమ్మెద వేట జారే అల్లరి పైట
మెరుపు మెడలో
ఉరిమి చూడరో
కరుకు చూపరో  
ఆ.... - హా.....

మనసు ఆగదు వయసు తగ్గదు
ఓలమ్మో... ఒంటిగా నిదుర పట్టదు
మనసు మారదు ఉడుకు తగ్గదు
ఏందమ్మో జంటగా చిలక వాలదు
ప్రేమంటేనె పేచీలు రాత్రికి మాత్రం రాజీలు
గిల్లిగిచ్చి కజ్జాలు లవ్లీ లావా దేవీలు

అబబ్బ నెమ్మది - మధన మన్మది
వలది నేడదీ... -  హా.... - అహ హా


Palli Balakrishna Saturday, October 21, 2017
Pandavulu Pandavulu Tummeda (2014)


చిత్రం: పాండవులు పాండవులు తుమ్మెద (2014)
సంగీతం: అచ్చు రాజమని, బప్పా. బి.లహరి
సాహిత్యం: చంద్రబోస్
గానం: ఉదిత్ నారాయణ్
నటీనటులు: మోహన్ బాబు, విష్ణు, మనోజ్, వరుణ్ సందేశ్, తనీష్ , వెన్నెల కిషోర్, హన్సిక, ప్రణీత, రవీనా టండన్
దర్శకత్వం: శ్రీవాస్
నిర్మాత: మంచు విష్ణు, మంచు మనోజ్
విడుదల తేది: 31.01.2014

అచ్చ తెలుగంటి  పెదవుల్ని వెలుగంటి బుగ్గలని
దగ్గరగా చూశాను నేనే
పచ్చి పసుపంటి పాదాల్ని పాలంటి గుండెల్ని
పిచ్చెక్కి చూశాను నేనే
చూశా నేనే చూశా నేనే అందం మొత్తం చూసేశానే
రాశా నేనే రాశా నేనే హృదయం నీకే రాసిచ్చానే

చరణం: 1
ఓ నా కళ్ళలో మెరుపొచ్చేలా నీ కళ్ళు చూశాను నేనే
నా వెన్నులో ఉడుకొచ్చేలా నీ వెన్ను చూశాను నేనే
నీ ఒంపులో ఆపేశావే కాలాన్నే
నీలో సంద్రాల లోతుల్ని శిఖరాల ఎత్తుల్ని
నిఖరంగా చూశాను నేనే
పిల్లా నీ పీఠభూముల్ని  నునులేత కనులన్నీ
నిశ్చంగా  చూశాను నేనే

చూశా నేనే చూశా నేనే అందం మొత్తం చూసేశానే
రాశా నేనే రాశా నేనే హృదయం నీకే రాసిచ్చానే

చరణం: 2
ఆ ఊబిలో  దిగిపోయేలా నీ నాభి చూశాను నేనే
ఆ మడతలో మునకేసేలా  నీ నడుమే చూశాను నేనే
నీ రూపుతో పిండేసావే ప్రాణాన్నే
అబ్బో  ఆ సూర్య చంద్రుల్ని చూల్లేని  చోటుల్ని
అడ్డంగా  చూశాను నేనే
అమ్మో నువ్వైన నీలోన చూల్లేని  సోకుల్ని
అద్దంలా చూశాను నేనే

చూశా నేనే  చూశా నేనే   అందం మొత్తం చూసేశానే
రాశా నేనే రాశా నేనే హృదయం నీకే రాసిచ్చానే

అచ్చ తెలుగంటి  పెదవుల్ని వెలుగంటి బుగ్గలని దగ్గరగా చూశాను నేనే
పచ్చి పసుపంటి పాదాల్ని పాలంటి గుండెల్ని  పిచ్చెక్కి చూశాను నేనే

చూశా నేనే చూశా నేనే అందం మొత్తం చూసేశానే
రాశా నేనే రాశా నేనే హృదయం నీకే రాసిచ్చానే
చూశా నేనే చూశా నేనే అందం మొత్తం చూసేశానే
రాశా నేనే రాశా నేనే హృదయం నీకే రాసిచ్చానే

Palli Balakrishna Sunday, October 1, 2017
Upendra (2000)


చిత్రం: ఉపేంద్ర (2000)
సంగీతం: గురుకిరణ్
సాహిత్యం: సురేంద్ర కృష్ణ (All Song)
గానం: చిత్ర
నటీనటులు: ఉపేంద్ర , రవీనాటండన్ , ప్రేమ
దర్శకత్వం: ఉపేంద్ర
నిర్మాత: శిల్పా శ్రీనివాస్
విడుదల తేది: 22.10.1999

ఏముంది ఏముంది నీకు నాకు నడుమా ఏముంది ఏమేముంది
ఏముంది ఏముంది నీకు నాకు నడుమా ఏముంది
ఎండకి నీడకి ఏముంది వాగుకి వానకి ఏముంది
మనిషికి మనసుకి ఏముంది ఏముందీ  ఏముంది ఏమేముంది

చరణం: 1
జరిగిన రోజులు మాసిపోగా నీ తలపే ఓదార్పుగా కంటికీ రెప్పకీ చీకటి వెలుగుకి ఏముంది
ప్రశ్నకీ బదులునీ అడిగినచో  ఇక ఏముంది వెతికినచో ఏమేముంది
ఏముంది ఏముంది నీకు నాకు నడుమా ఏముంది ఏమేముంది

చరణం: 2
మనసంతా నువ్వు నిండివున్నా మదినిండా మరి శున్యమే
అచ్చటా ముచ్చటా ఏమిటీపని ప్రేమికా
నీదేగా కావుగా పెనిమిటి పగదే నీదేగా పెనిమిటి మాత్రం కావుగా
ఏముంది ఏముంది నీకు నాకు నడుమా ఏముంది
ఎండకి నీడకి ఏముంది వాగుకి వానకి ఏముంది
ఏముంది ఏముంది నీకు నాకు నడుమా ఏముంది ఏమేముంది

Palli Balakrishna Tuesday, August 1, 2017

Most Recent

Default