-->
Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Madhavi"



చిత్రం: మరణ శాసనం (1987)
సంగీతం: రాజ్-కోటి 
నటీనటులు: కృష్ణం రాజు, జయసుధ, మాధవి, శోభన 
దర్శకత్వం: యస్.యస్.రవిచంద్ర 
సమర్పణ: కృష్ణ ఘట్టమనేని  
నిర్మాత: హనుమంతరావు ఘట్టమనేని
విడుదల తేది: 10.04.1987

Palli Balakrishna Thursday, May 21, 2026



చిత్రం: మూడు ముళ్ళ బంధం (1980)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: సి.నారాయణరెడ్డి
నటీనటులు: శరత్ బాబు, మాధవి, రాజేంద్ర ప్రసాద్ 
దర్శకత్వం: ముత్యాల సుబ్బయ్య 
నిర్మాతలు: రంగన అశ్వత్థనారాయణ, పొన్నతోట రఘురాం
విడుదల తేది: 06.12.1980

దర్శకుడిగా ముత్యాల సుబ్బయ్య మొదటి సినిమా ఇది.



Songs List:



ఆ చూపే ఒక వల పాట సాహిత్యం

 
చిత్రం: మూడు ముళ్ళ బంధం (1980)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: సి.నారాయణరెడ్డి
గానం: ఆదినారాయణ రావు, ఎస్. జానకి

ఆ చూపే ఒక వల ఆ రూపే వెన్నెల



కల ఎదురుగ నిలిచిందా పాట సాహిత్యం

 
చిత్రం: మూడు ముళ్ళ బంధం (1980)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: సి.నారాయణరెడ్డి
గానం: ఆదినారాయణ రావు, ఎస్. జానకి

కల ఎదురుగ నిలిచిందా అల ఎదలో కదిలిందా ఈ వేళ జరిగింది - పి. సుశీల



తులసి కోటలో వెలిగే దీపం పాట సాహిత్యం

 
చిత్రం: మూడు ముళ్ళ బంధం (1980)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: సి.నారాయణరెడ్డి
గానం: ఎస్. జానకి

తులసి కోటలో వెలిగే దీపం మాంగల్యానికి మరో రూపం 




ప్రతి మనిషికి రెండే పాట సాహిత్యం

 
చిత్రం: మూడు ముళ్ళ బంధం (1980)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: సి.నారాయణరెడ్డి
గానం: యస్.పి.బాలు 

ప్రతి మనిషికి రెండే మనసులుంటే ఎంత బాగుండేది 



మూడుముళ్ళ బంధం పాట సాహిత్యం

 
చిత్రం: మూడు ముళ్ళ బంధం (1980)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: సి.నారాయణరెడ్డి
గానం: జి. ఆనంద్

మూడుముళ్ళ బంధం ఏడేడు జన్మల బంధం 



రారా కృష్ణయ్యా పాట సాహిత్యం

 
చిత్రం: మూడు ముళ్ళ బంధం (1980)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: సి.నారాయణరెడ్డి
గానం: ఎస్.జానకి, ఎస్.పి. శైలజ

రారా కృష్ణయ్యా ఇటు రారా కృష్ణయ్య నీ అల్లరి పనులకు

Palli Balakrishna Wednesday, May 20, 2026



చిత్రం: స్వర్గం (1981)
సంగీతం: కె. చక్రవర్తి
నటీనటులు: చంద్రమోహన్, జయసుధ
దర్శకత్వం: దుర్గా నాగేశ్వరరావు
నిర్మాణ సంస్థ: ఉదయం ప్రొడక్షన్స్ 
విడుదల తేది: 16.05.1981



Songs List:



వెయ్యనా తాళం వెయ్యనా నోటికి వెయ్యనా పాట సాహిత్యం

 
చిత్రం: స్వర్గం (1981)
సంగీతం:  కె. చక్రవర్తి
సాహిత్యం: రాజశ్రీ
గానం: యస్. పి. బాలు, పి సుశీల

వెయ్యనా తాళం వెయ్యనా నోటికి వెయ్యనా



కొండపల్లి బొమ్మలాగా కులికే అమ్మాయి పాట సాహిత్యం

 
చిత్రం: స్వర్గం (1981)
సంగీతం:  కె. చక్రవర్తి
సాహిత్యం: రాజశ్రీ
గానం: పి సుశీల

కొండపల్లి బొమ్మలాగా కులికే అమ్మాయి



ప్రియమోహనా అనురాగమయ జీవనా పాట సాహిత్యం

 
చిత్రం: స్వర్గం (1981)
సంగీతం:  కె. చక్రవర్తి
సాహిత్యం: వేటూరి 
గానం: యస్. పి. బాలు, యస్. జానకి 

ప్రియమోహనా అనురాగమయ జీవనా




ఈ గిలిగింత ఈ పులకింత పాట సాహిత్యం

 
చిత్రం: స్వర్గం (1981)
సంగీతం:  కె. చక్రవర్తి
సాహిత్యం: రాజశ్రీ
గానం: యస్. పి. బాలు, పి సుశీల

ఈ గిలిగింత ఈ పులకింత కదిలించెను ఊహలు

Palli Balakrishna Tuesday, May 19, 2026



చిత్రం: ఇల్లే స్వర్గం (1981)
సంగీతం: రమేష్ నాయుడు
నటీనటులు: చంద్రమోహన్, మాధవి
దర్శకత్వం: గార్ల సత్యనారాయణ మూర్తి
నిర్మాతలు: డా. సి. ఆంజనేయులు, దాసరి గోపాలకృష్ణ, సంబంగి అప్పారావు 
విడుదల తేది: 25.04.1981



Songs List:



జీవితమే ఒక సెలయేరు పాట సాహిత్యం

 
చిత్రం: ఇల్లే స్వర్గం (1981)
సంగీతం: రమేష్ నాయుడు
సాహిత్యం: శ్రీశ్రీ
గానం: యస్. జానకి 

జీవితమే ఒక సెలయేరు - అది సుధాప్రవాహం



బతకాలా? చావాలా? పాట సాహిత్యం

 
చిత్రం: ఇల్లే స్వర్గం (1981)
సంగీతం: రమేష్ నాయుడు
సాహిత్యం: శ్రీశ్రీ
గానం: యస్. పి. బాలు 

బతకాలా? చావాలా? అతీగతీ లేని జనం ఆకలితో చీకటితో 



ఏవో ఏవో ఆశించావు పాట సాహిత్యం

 
చిత్రం: ఇల్లే స్వర్గం (1981)
సంగీతం: రమేష్ నాయుడు
సాహిత్యం: శ్రీశ్రీ
గానం: యస్. పి. బాలు 

ఏవో ఏవో ఆశించావు




మేలుకో రామా పాట సాహిత్యం

 
చిత్రం: ఇల్లే స్వర్గం (1981)
సంగీతం: రమేష్ నాయుడు
సాహిత్యం: కృష్ణశాస్త్రి
గానం: వాణీ జయరాం

మేలుకో రామా



చీకటి తెర తొలగించి పాట సాహిత్యం

 
చిత్రం: ఇల్లే స్వర్గం (1981)
సంగీతం: రమేష్ నాయుడు
సాహిత్యం: కృష్ణశాస్త్రి
గానం: యస్. పి. బాలు 

చీకటి తెర తొలగించి 

Palli Balakrishna



చిత్రం: పిచ్చి పంతులు  (1983)
సంగీతం: కె. చక్రవర్తి 
నటీనటులు: మురళి మోహన్,మాధవి
దర్శకత్వం: రాజా చంద్ర
నిర్మాత: మాగంటి వెంకటేశ్వర రావు
విడుదల తేది: 1983

Palli Balakrishna Wednesday, November 29, 2023



చిత్రం: ఒక చల్లని రాత్రి (1979)
సంగీతం: కె.వి.మహదేవన్ 
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ 
గానం: యస్.పి.బాలు, పి.సుశీల, ఎల్.ఆర్.ఈశ్వరి 
నటీనటులు: చంద్రమోహన్, మాధవి, రామకృష్ణ , హలం 
దర్శకత్వం: పి.వాసు 
నిర్మాత: పి.రామమోహనరావు
విడుదల తేది: 18.05.1979



Songs List:



ఈ రాతిరిలో నీ జాతకమే పాట సాహిత్యం

 
చిత్రం: ఒక చల్లని రాత్రి (1979)
సంగీతం: కె.వి.మహదేవన్ 
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ 
గానం: ఎల్.ఆర్.ఈశ్వరి 

పల్లవి:
ఈ రాతిరితో నీ జాతకమే మార్చేస్తాను
నా పాత కథే కొత్తగా నీచేతే రాయిస్తాను

చరణం: 1 
నువ్వే హీరో నా కథలో
కానీ జీరో నాజతలో
ఒకటి పక్కన వుంటేనే సున్న పది అవుతుంది.
నా పక్కన వుంటేనే నీకొక కథవుంటుంది

చరణం: 2
నువ్వూ నేను ఒక్కటైతే
నేనే చివరకు వుండేది
ఒకటి ఒకటి గుణిస్తే
అది ఒకటవుతుంది
ఆ ఒకటి కాస్త తీసేస్తే సున్న మిగులుతుంది 




అమ్మమ్మ ఈనాడు శనివారం పాట సాహిత్యం

 
చిత్రం: ఒక చల్లని రాత్రి (1979)
సంగీతం: కె.వి.మహదేవన్ 
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ 
గానం: యస్.పి.బాలు, పి.సుశీల

అమ్మమ్మా ఈనాడు శనివారం 
ఆ ఏడుకొండల స్వామివారం
ఉండాలి ఉపవాసం లేకుంటే అపచారం
యాయ్యా యాయ్యా యాయ్యా
అమ్మమ్మా ఈనాడు శనివారం
అర్ధరాత్రి దాటితే ఆదివారం
ఆపైన ఉపవాసం అన్యాయం అన్యాయం
యాయ్యా యాయ్యా యాయ్యా

చరణం: 1
శనివారమైనా చేస్తారు ఫలహారం
అది ఆచారం కాదపచారం
అసలును మించిన వడ్డీవ్యాపారం
నీ ఫలహారం వ్యవహారం
ఎందుకు ఇంకా గందర గోళం
తిప్పేద్దాము గడియారం

చరణం: 2
బెలూన్ బెలూన్ ఇది ప్రేమ బెలూన్
కమాన్ కమాన్ చేరుదాం చందమామను
చంద్రుడిలో ఏముంది కొండలు బండలు
మరెందుకు పోల్చుతావు నా మోమును
తప్పు తప్పు ఇంకెప్పుడు అనను
ఒప్పుకుంటే చాలదు దింపుకో నన్ను




అధి ఒక చల్లని రాత్రి పాట సాహిత్యం

 
చిత్రం: ఒక చల్లని రాత్రి (1979)
సంగీతం: కె.వి.మహదేవన్ 
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ 
గానం: యస్.పి.బాలు, పి.సుశీల

పల్లవి:
అది ఒక చల్లని రాత్రి
మరుమల్లెలు చల్లిన రాత్రి
ఇక ప్రతి రాత్రి అదేరాత్రి
వలపుల జల్లుల రాత్రి

చరణం: 1
మనసుకు మనసు మంగళసూత్రం కట్టిన శుభరాత్రి
సొగసును వయసు బిగికౌగిలిలో పొదిగిన తొలిరాత్రి
శివుడు పార్వతికి తనసగమిచ్చిన పవిత్ర శివరాత్రి
యువతీ యువకులు నవశిల్పాలై కొలువగు నవరాత్రి

చరణం: 2
పూర్వజన్మల పుణ్యం ఏదో పండినదా రాత్రి
ముందు జన్మల అనుబంధం ముడివేసినదీ రాత్రి
పరువం ప్రణయం పరవశించి మైమరచినదా రాత్రి
ముద్దూ ముచ్చట మూటలు విప్పి మురిసేదీ రాత్రి

చరణం: 3
అంతులేని ఆనందం చిగురించినదా రాత్రి
అనురాగాళా తీగలల్లీ పెనవేసినదీ రాత్రి
చిన్ననాటి నేస్తం మొగ్గలు తొడిగినదా రాత్రి
జీవితానికి పువ్వుల బాటను పరిచినదీ రాత్రి.




దుక్ఖమంటే యేమిటని పాట సాహిత్యం

 
చిత్రం: ఒక చల్లని రాత్రి (1979)
సంగీతం: కె.వి.మహదేవన్ 
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ 
గానం: యస్.పి.బాలు

పల్లవి:
దుఃఖమంటే ఏమిటని దేవుడ్ని అడిగాను
ఒకసారి ప్రేమించి చూడరా అన్నాడు
ఆమాట నమ్మాను ప్రేమించినాను
దుఃఖమే నేనుగా మారాను నేడు

చరణం: 1
ప్రేమే బొమ్మయితే దుఃఖమే బొరుసు
ఈ చేదు నిజము ఎందరికి తెలుసు
తెలియక మునుపాబొమ్మను వలచాను
తెలిసిన పిదపే చేదును మింగాను

చరణం: 2
దుఃఖమే నేటిది సుఖమేమొ నిన్నది
ఈ రెండూ కానిది నే వెతుకుతున్నది
కన్నీటి ఏటిని దాటాలి దానికి
ఎన్నాళ్ళకో చేరేది ఆ చోటికి




నువ్వెవరో నాకు తెలుసును పాట సాహిత్యం

 
చిత్రం: ఒక చల్లని రాత్రి (1979)
సంగీతం: కె.వి.మహదేవన్ 
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ 
గానం: పి.సుశీల, మోహన్

నువ్వెవరో నాకు తెలుసును
క్యా.... క్యా....
హా..... హా....
నేనెవరో నీకు తెలుసును
తెలిసినట్టు నీకు నాకు తెలియక పోవచ్చును
ఏకై సా హోతా
హోతా హోతా
ఏ అనుబంధమో తెచ్చింది నిన్ను
ఏ అనురాగమో కలిపింది నన్ను
అచ్చా అచ్చా
ఈ రుణం నేటితో తీరదులే
నా గుణం యిప్పుడే తెలియదులే
ఠీక్ హై... ఠీక్ హై....

వేషమేదై తేనేం భాష రాకుంటేనేం
లోపలున్నదేదో తెలుసుకుంటే చాలును
వేషం నిముషంలో మార్చుతాను

భాషంతా కళ్ళతోటి నేర్పుతాను
నీ రసికతకు దాసిని నేను
నా సొగసులకు బానిస నీవు
ఆప్ కి కసమ్
నేను నీ వశం
అనుమానం యింకా నీ కెందుకు
పెన వేసి రారా నా ముందుకు
॥నువ్వెవరో ॥




అధి ఒక చల్లని రాత్రి (విచారం) పాట సాహిత్యం

 
చిత్రం: ఒక చల్లని రాత్రి (1979)
సంగీతం: కె.వి.మహదేవన్ 
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ 
గానం: యస్.పి.బాలు, పి.సుశీల

అది ఒక చల్లని రాత్రి
విషబీజం చల్లిన రాత్రి
యిక ప్రతి రాత్రి నల్లని రాత్రి
కన్నీటి జల్లుల రాత్రి 

చరణం: 1
మనసే సాక్ష్యం నిలిచిన రాత్రి
మమత లగ్నమై కలిపిన రాత్రి
తనువును పూజాపుష్పం చేసిన రాత్రి
నా తలరాతే మార్చిన రాత్రి

చరణం: 2
ఆవేశం పెనవేసిన రాత్రి
ఆనందం చవిచూసిన రాత్రి
వయసు మత్తులో హద్దులు మరచిన రాత్రి
వెన్నెల చాటున చీకటి పెరిగిన రాత్రి 

చరణం: 3
అన్నెం పున్నెం ఎరుగనిదా రాత్రి
అంతా చేదై చెదిరినదీ రాత్రి
కన్నుల నిండా నువ్వున్నది ఆరాత్రి
కన్నీళ్ళే మిగిలించినదీ రాత్రి

Palli Balakrishna Monday, October 30, 2023



చిత్రం: బొమ్మాబొరుసే జీవితం (1979)
సంగీతం: జే. వి. రాఘవులు 
సాహిత్యం: వేటూరి , వీటూరి 
గానం: యస్.పి.బాలు, పి.సుశీల 
నటీనటులు: చంద్రమోహన్, మాధవి, జయమాలిని 
మాటలు: జంధ్యాల 
దర్శకత్వం: కొమ్మినేని శేషగిరిరావు 
సహాయ దర్శకుడు: వంశీ 
నిర్మాత: USR మోహనరావు 
విడుదల తేది: 21.06.1979

(గమనిక: వేటూరి సుందరరామ మూర్తి, వీటూరి వెంకట సత్య సూర్యనారాయణమూర్తి ఇద్దరు వేరు వేరు, కానీ వీరిద్దరు పాటలు రచయితలు. వీరిద్దరూ కలిసి ఒకే సినిమాలో పాటలు రాసిన సినిమాలు:
1.యమగోల (1977)
2. మల్లెపువ్వు (1978)
3. విజయ (1979)
4. బొమ్మాబొరుసే జీవితం (1979)
5. చెయ్యెత్తి జై కొట్టు (1979)
6. జూదగాడు (1979)
7. మామా అల్లుళ్ళ సవాల్ (1980) 
8. మంగళ గౌరి (1980) 
ఈ ఎనిమిది సినిమాలలో వీరిద్దరి పేర్లు కనిపిస్తాయి )



Songs List:



అందాల సృష్టికి మూలం పాట సాహిత్యం

 
చిత్రం: బొమ్మాబొరుసే జీవితం (1979)
సంగీతం: జే. వి. రాఘవులు 
సాహిత్యం: వీటూరి 
గానం: పి.సుశీల 

అందాల సృష్టికి మూలం ఆనాటి ఏడమ్
ఆనందం సృష్టిస్తోంది - ఈనాడీ మేడమ్
గరీబుకైనా  బికారికైనా |
అవసరమొకటి 
నిషాగా ఖుషీగా  సుఖాల చరించడం 
పక్కింటి రాముడుకోసం - పంకజాక్షి విరహం
ఎదురింటి రాజాపైనా అబుల్లా మొహం
ఎల్లమ్మ తోటలోనా - ఎంకినాయుళ్ళు సరసం :
శాంతమ్మ సంతకెళ్ళినా
గోవిందు గోడ దూకినా 
ఎందుకోసం ? పొందుకోసం ? జగమంతా
ప్రేమ విలాసం 

కన్నెపిల్ల కనిపించిందా కన్ను గీటే కాలేజీ బాయ్
హయ్ .... హయ్
చిన్నపిల్ల బుగ్గ నిమిరీ ఇకిలించే తాతాయీ
కొంగుచూసి రంగైపోయే దొంగచూపు పూజారీ
పార్కుల్లో ఊసులాటలూ
తిరునాళ్ళ తిప్పలాటలూ
ఏమిగోలా  ప్రేమగోలా ? జగమంతా ॥అందాలా॥




వింటే భారతం వినాలీ పాట సాహిత్యం

 
చిత్రం: బొమ్మాబొరుసే జీవితం (1979)
సంగీతం: జే. వి. రాఘవులు 
సాహిత్యం: వీటూరి 
గానం: యస్.పి.బాలు, పి.సుశీల

హిహిహిహి ....
మన్మధలీలా 

వింటే భారతం వినాలీ
తింటే గారెలే తినాలీ
పడితే గొప్పోణీ పట్టాలి
కొడితే జాక్ పాట్ కొట్టాలీ
మీరంతా ఈలలు వెయ్యాలీ
మా జేబులు బాగా నిండాలి
భారతానికి మూలకారణం

ద్రౌపది వస్త్రాపహరణం
ప్రజలకు నచ్చే సన్ని వేశమూ
పసందైన శృంగార దృశ్యమూ

నేనే కురునాదూడా - నాదూడా
అపక్ర విక్రమ పరాక్రముండ
సుయోధనా సార్వబౌముండ - ఘనుండ
నే కురు నాయకుండ

హల్లో బ్రదర్ దుశ్శాసనా
రేపింగ్ కళా ప్రవీణా
ఎక్కడ ఆ FIVE STARS పతివ్రతా
గుమ్మడి పండులాంటి ఉమ్మపతి - ద్రౌపతీ
పాలమీగడలాంటి వయ్యారీ
చెఱుకు గడలావున్న చిన్నారీ
పొడుముకాయలాంటి నడుమూపీ జడవూపీ
తొడపైన కూర్చోవే ఒకసారి
నా తొడపైన కూర్చోవే ఒకసారి

ఏయ్ ...
ఎవరనుకున్నావూ ఏమనుకున్నావూ
అయిదుగురు భర్తలకు నే సింగిల్ భార్యనూ
అఫ్కోర్స్
దమర్మము లేరుగని కోర్టుల కెక్కని
ఘనుడు ధర్మరాజూ
గదతో రొమ్ముల దుమ్మును దులిపే
బలుడు భీమరాజూ
షూటింగ్లో ఫైటింగ్ హీరో అర్జునుడూ
హర్స్ రేసులో అగ్రగణ్యుడు నకిలీలేని నకులుడూ
పేరు పొందిన పశువుల డాక్టరు తిరుగులేని
సహదేవుడూ
ఎవరనుకున్నావూ ఏమనుకున్నావూ
అయిదుగురు భర్తలకు నే సింగిల్ భార్యను

ఏయ్ ---
చాలించవే నీ గొప్పలు
ఇక చూసుకోవే నీ తిప్పలు

నిన్ను నాకు నాజూదంలో ఓడినారె నీ భర్తలు
Don't you know it ?

Is it ?
తన్నోడి నన్నోడినా నారాజు
నన్నోడి తన్నోడెనా
తనుముందు ఓడితే నన్నోడ హక్కేది
ఈ జూదమాడగా లైసెన్సు నీకేది

పాయింటు పట్టిందిరో - లా
పాయింటు పట్టిందిరో -
హైకోర్టు కెళ్ళినా అప్పీలు లేదురా
పాయింటు పట్టిందిరో - లా పాయింటు పట్టిందిరో
ఏయ్ -- విప్పరా
తప్పురా..
విప్పరా
తప్పురా..... కృష్ణా.....

కృష్ణా - కృష్ణా కృష్ణా కృష్ణా
పోలీస్ పోలీస్ పోలీస్



లుక్ చుక్ లుక్ పాట సాహిత్యం

 
చిత్రం: బొమ్మాబొరుసే జీవితం (1979)
సంగీతం: జే. వి. రాఘవులు 
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, సాయిబాబా 

లుక్ చుక్ లుక్ చుక్ వ్యాపారం
గప్ చిప్ గప్ చిప్ మనబేరం
బొమ్మా బొరసే జీవితం -
ఆడే బొమ్మల నాటకం

బొమ్మలు: 
Twinkle Twinkle Little Master
How We wonder you are here !
మనిషి చేసిన బొమ్మలు మీరు
మనసే ఉండడూ వయసే పండదూ
దేవుడు చేసిన బొమ్మలు మేము -
బుద్దులు మారే మనుషులమూ
పొదువాలితే పోతాము -
గుడిలో బొమ్మను అర్చిస్తాం 
అంగడిలో బొమ్మను అమ్మేస్తాం 

బొమ్మలు: 
బొమ్మల పాలిట బ్రహ్మలు మీరట
పేరు గొప్పట ఊరు దిబ్బట -
అయ్యోపాపం : అయ్యోపాపం..కీలుబొమ్మలు 
ఆ బ్రహ్మదేవుడే కీలుబొమ్మ శ్రీ విష్ణువు చేతులలో
ఆ వైష్ణవ మాయలలో…
ఈ తోలు బొమ్మలూ కీలుబొమ్మలే ఈకలికాలంలో
ఆకలికాలంలో -
ధనమదాంధులు జరాసంధులు ఆడే చదరంగంలో
పేదజీవులం మేముపావులం
కసాయి సాలకు పోతున్నా గరికెలు మేసే గోవులం
ఇది గండు పిల్లల చెలగాటంలో
నిండు బ్రతుకుల ప్రాణ సంకటం





అమ్మ అనేదీ అచ్చ తెలుగుమాటరా పాట సాహిత్యం

 
చిత్రం: బొమ్మాబొరుసే జీవితం (1979)
సంగీతం: జే. వి. రాఘవులు 
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.పి.బాలు, పి.సుశీల 

అమ్మ అనేదీ అచ్చ తెలుగుమాటరా
జన్మ జన్మ కదే నిత్యవెలుగు బాటరా
ప్రేమకు పెట్టనికోట మమతల మల్లెలతోట
తనపిల్లల క్షేమమే పల్లపైన పాట
మధుర మధుర మధురమైన మాటరా : అమ్మా

కాలు మోపితే అమ్మ అవతరించె కాశీ
తానమాడితే అమ్మ తరించింది గంగ
మెరిసె లక్ష్మణరేఖ నడిచే భగవద్గీత
తొలి పలుకులు దిద్దుకుంది తెలుగుపాప ఆమ్మతో
తొలివెలుగులు దిద్దుకుంది తూర్పు అమ్మ చూపుతో
దేవుడైన చెప్పలేడు ఆ దేవత ఎంత గొప్పదో
అమ్మా - ॥అమ్మ॥

అనగనగా ఓ రాజకుమారి
వన్నెచిన్నెల వయ్యారి - నాట్యంలో మయూరి
యెందరెందరో రాకుమారులు, ప్రేమ బిక్షకై 
అర్ధించారు నిరాశ చెందారు 

డైలాగ్: ఇలా వుండగా ఓనాడు -
పెన్నిధి తనతల్లి అయిన పేదయువకుడొకడు
ఆ రంభలాంటి చిన్న చూచాడు
అందానికి కన్ను చెదిరి  ఆ క్షణాన వళ్ళు మరిచి
ప్రేమ పిచ్చిలో పడ్డాడు పెళ్ళిచేసుకో మన్నాడు!

డైలాగ్ : అప్పుడా సుందరి ఏమడిగిందో తెలుసా ?
కానుకగా కన్నతల్లి గుండె కోరెనా చిన్నది
తేలికగా తెస్తా లెమ్మన్నాడు - ప్రేమ ఎంతగుడ్డిది
ఆ కామమెంత చెడ్డది

కన్నుల కడవెలుగు దాచి  కన్న కడుపునే తలచి
తలవాకిట నిలచినదా తల్లి కన్నతల్లి
వచ్చిన బిడ్డనుచూచి వెచ్చని మమతలుపోసి
వండిన అన్నము పెట్టెను - నిండుగుండెతో
ఆ తల్లి బిడ్డకడుపు నిండుగా మళ్ళీ మళ్ళీ
ఇటు కన్నతల్లి మమకారము 
అటు కన్నెపిల్ల శృంగారమూ
ఇటు తల్లిగుండె గుడిగంటలూ 
అటు కన్నె కంటి చలిమంటలూ
ఇటు నెత్తురు - అటు అత్తరు
ఇటు త్యాగము - అటు భోగము
ఉన్మత్తుడై, చలచిత్తుడై, కామాంధుడై, పాపాత్ముడై
పుత్రరూపమున శత్రువై, మాతృ హత్యనే చేశాడు
జన్మనిచ్చిన తల్లినే చంపుకున్నాడు
కన్నుమిన్ను కానక, కన్నతల్లి గుండె కానుక
కన్నెపిల్ల కే ఇవ్వగా !

కన్నుకానక పరుగులెత్తగా - కాలుజారి పడిపోయాడూ
చావు దెబ్బతిని అమ్మా అమ్మా అమ్మా అంటూ
గావు బొబ్బలే పెట్టాడు

డైలాగ్ : అప్పుడు ఆ తల్లి గుండె యెమన్నదో తెలుసా?
నాయనా దెబ్బతగిలిందా ? జాగ్రత్త నాయనా
నా ఆయుష్షు పోసుకొని నూరేళ్ళు చల్లగా
వర్ధిల్లు నాయనా -

అమ్మ కోరేదీ ఒకే ఒక్క మాటరా 
అయిదూ ప్రాణాలుపోసి  నవమాసాలు మోసిన
తనకు అప్పు పడ్డందుకు
తలకు కొరివి పెట్టమనీ
తన ఋణమును తీర్చమనీ
ఎన్ని జన్మలెత్తినా తనబిడ్డయి పుట్టమనీ
అమ్మా అని పిలవమనీ -
మాతృదేవోభవా ! మాతృదేవోభవా !
మాతృదేవోభవా |

Palli Balakrishna Sunday, October 29, 2023

Most Recent

Default