Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Krithi Shetty"
Manamey (2024)



చిత్రం: మనమే (2024)
సంగీతం: హేశం అబ్దుల్ వహాబ్
నటీనటులు: శర్వానంద్, కృతి శెట్టి
దర్శకత్వం: టి. శ్రీరామ్ ఆదిత్య 
నిర్మాతలు: టిజి విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల
విడుదల తేది: 07.06.2024



Songs List:



ఇక నా మాటే పాట సాహిత్యం

 
చిత్రం: మనమే (2024)
సంగీతం: హేశం అబ్దుల్ వహాబ్
సాహిత్యం: కృష్ణ చైతన్య 
గానం: హేశం అబ్దుల్ వహాబ్

ఇక నా మాటే



ఓ మనమే పాట సాహిత్యం

 
చిత్రం: మనమే (2024)
సంగీతం: హేశం అబ్దుల్ వహాబ్
సాహిత్యం: కృష్ణకాంత్
గానం: కార్తీక్, గీతామాధురి

ఓ మనమే
ఓహ్ మనమే మనమే
పడదో క్షణమే
రోజూ రోజూ పేచీ పడ్డా మనమే

హే మనమే మనమే
కలిశాం మనమే
కొంచెం కొంచెం
రాజీ పడ్డ వైనమే

పంతాలలో ఓ పాపాయిలా
మంచోడిపై నీ కోపాలేలా
ఏమైనా సరే నీలో అల్లరే
ముద్దొచ్చే ముప్పూటలా

ఎంతో అద్భుతం కాదా
మారిందేంటో మా కథ

కసిరే చూపు కాసేపాపు
పుట్టిందోయమ్మా
ఊహల్లోన చిన్ని ఉప్పెన

తెలిసేలోపు నా దరిదాపు
మార్చేసావమ్మా
మంత్రం ఉందా మాట మాటునా

మబ్బులో పైరులా
మన్నులో తారలా
దిక్కులే ఒక్కటై చేరగా

ఇలా కొత్తగా ఇదో వింతగా
మొదలైందిగా మన కథా

ఎంతో అద్భుతం కాదా
మారిందేంటో మా కథ

Oh Youre My Rise
In The Sunshine
Youre The Moon
In The Moonlight

Youre My Rise
Youre My Shining Heart
In The Dream

అంతా నాదే అన్నీ నేనే
అంటావేంటమ్మా
మీదడిపోయే మిర్చీ మిస్సమ్మా

అంతల్లోనే ఉన్నట్టుండి
గమనించేశాలే
గోలేంటమ్మ గుండె చాటున

చేతిలో గీతలా
కాగితం కవితలా
రాతలే నేడిలా కలిసేగా

ఇలా కొత్తగా ఇదో వింతగా
సమ్మేళనం అవ్వగా




టప్పా టప్పా పాట సాహిత్యం

 
చిత్రం: మనమే (2024)
సంగీతం: హేశం అబ్దుల్ వహాబ్
సాహిత్యం: కాసర్ల శ్యామ్
గానం: రామ్ మిరియాల, హేశం అబ్దుల్ వహాబ్

టప్పా టప్పా




భూం భూం పాట సాహిత్యం

 
చిత్రం: మనమే (2024)
సంగీతం: హేశం అబ్దుల్ వహాబ్
సాహిత్యం: భాస్కర భట్ల
గానం: హేమచంద్ర, శీరత్ కపూర్

భూం భూం




నీ స్నేహం పాట సాహిత్యం

 
చిత్రం: మనమే (2024)
సంగీతం: హేశం అబ్దుల్ వహాబ్
సాహిత్యం: భాస్కర భట్ల
గానం: హేశం అబ్దుల్ వహాబ్

నీ స్నేహం 



జానీ జానీ యస్ పాప పాట సాహిత్యం

 
చిత్రం: మనమే (2024)
సంగీతం: హేశం అబ్దుల్ వహాబ్
సాహిత్యం: లక్ష్మి ప్రియాంక 
గానం: విజయ్ ప్రకాష్ 

జానీ జానీ యస్ పాప




చిన్న బాబు పాట సాహిత్యం

 
చిత్రం: మనమే (2024)
సంగీతం: హేశం అబ్దుల్ వహాబ్
సాహిత్యం: లక్ష్మి ప్రియాంక 
గానం: రోల్ రైడ, హేశం అబ్దుల్ వహాబ్

చిన్న బాబు 



ఓ మహియా పాట సాహిత్యం

 
చిత్రం: మనమే (2024)
సంగీతం: హేశం అబ్దుల్ వహాబ్
సాహిత్యం: లక్ష్మి ప్రియాంక 
గానం: హారిక నారాయణ్ , హేశం అబ్దుల్ వహాబ్

ఓ మహియా 



అతిలోక కోమలాంగి పాట సాహిత్యం

 
చిత్రం: మనమే (2024)
సంగీతం: హేశం అబ్దుల్ వహాబ్
సాహిత్యం: లక్ష్మి ప్రియాంక 
గానం: అరవింద్ వేణుగోపాల్, హేశం అబ్దుల్ వహాబ్

అతిలోక కోమలాంగి 




సమ్మోహన పాట సాహిత్యం

 
చిత్రం: మనమే (2024)
సంగీతం: హేశం అబ్దుల్ వహాబ్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి 
గానం: శ్వేతా మోహన్, హేశం అబ్దుల్ వహాబ్

సమ్మోహన  




చేరువైనా నీవే పాట సాహిత్యం

 
చిత్రం: మనమే (2024)
సంగీతం: హేశం అబ్దుల్ వహాబ్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి 
గానం: హేశం అబ్దుల్ వహాబ్

చేరువైనా నీవే 



World of Manamey పాట సాహిత్యం

 
చిత్రం: మనమే (2024)
సంగీతం: హేశం అబ్దుల్ వహాబ్
సాహిత్యం: రోల్ రైడ, హేశం అబ్దుల్ వహాబ్
గానం: రోల్ రైడ, సాహితి చాగంటి 

World of Manamey

Palli Balakrishna Saturday, August 10, 2024
Custody (2023)



చిత్రం: కస్టడి (2023)
సంగీతం: ఇళయరాజా
నటీనటులు: నాగ చైతన్య , కృతి శెట్టి 
దర్శకత్వం: వెంకట్ ప్రభూ 
నిర్మాత: శ్రీనివాస చిట్టూరి
విడుదల తేది: 12.05.2023



Songs List:



హెడప్ హై లుకింగ్ ఫ్లై పాట సాహిత్యం

 
చిత్రం: కస్టడి (2023)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి 
గానం: యువన్ శంకర్ రాజా, అరుణ్ కౌండిన్య, అసల్ కోలార్ 

హెడప్ హై లుకింగ్ ఫ్లై
గాట్ దా ఫీలింగ్స్
దట్ ద వల్డ్ ఈస్ మైన్
ఫ్రమ్ ద స్ట్రీట్స్ డ్రీమింగ్ బిగ్
బట్ ఏంట్ నో లాంగర్ డ్రీమిన్
దిస్ లెజిట్

సేఫ్టీ సెక్యూరిటీకి సింబల్ ఈ ఖాకీరా
మఫ్టిలో ఉన్నా మన పవరే పట్టాకీరా
డ్యూటీ లో రౌండ్ ద క్లాక్ ఫుల్ టు చలాకీర
ఈ లాఠీతో జర్నీ చేసే లైఫే ఎంతో లక్కీరా

రోజువారి సర్వీస్ కి రోజాపూల సన్మానాలే
వద్దులే అస్సలే
వెన్నుతట్టి వెల్ డన్ అనో
థాంక్యూ అనో పబ్లికే అంటే
అది చాలే, హ్యాపీలే

శాంతి ఓం శాంతి
మంత్రం మా నినాదం
జాలీ జాలీగా
జనంతో కలిసిపోతాం

కంటి నిద్దర్లు మాని
కావలుంటాం
రక్షించే కర్తవ్యం
మాదంటాం

ఎలాంటి చిక్కులు
చిటికేసి పిలిచినా
శ్రీ విష్ణుమూర్తిల హలో అంటాం
ఏ రాతి వేళలో ఏ గొడవ జరిగినా
చక్రాలకాల్లతో చలో అంటాం

ఉండీ లేన్నట్టు ఉన్నదే
ఫ్యామిలీ టైము
ఫస్ట్ వైఫేగా వేసుకున్న యూనిఫార్మ్
ప్రతి పోలీస్ లైఫే ఇది
సేము టు సేము
ఎంత కష్టాన్నైనా కష్టమనుకోము

హెడప్ హై లుకింగ్ ఫ్లై
గాట్ దా ఫీలింగ్స్
దట్ ద వల్డ్ ఈస్ మైన్
ఫ్రమ్ ద స్ట్రీట్స్ డ్రీమింగ్ బిగ్
బట్ ఏంట్ నో లాంగర్ డ్రీమిన్
దిస్ లెజిట్

హెడప్ హై లుకింగ్ ఫ్లై
గాట్ దా ఫీలింగ్స్
దట్ ద వల్డ్ ఈస్ మైన్
ఫ్రమ్ ద స్ట్రీట్స్ డ్రీమింగ్ బిగ్
బట్ ఏంట్ నో లాంగర్ డ్రీమిన్
దిస్ లెజిట్  




లవ్ ఎట్ ఫస్ట్ సైట్ పాట సాహిత్యం

 
చిత్రం: కస్టడి (2023)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి 
గానం: యువన్ శంకర్ రాజా, కపిల్ కపిలన్  

లవ్ ఎట్ ఫస్ట్ సైట్
అంతే అయ్యిందలా
చూస్తూనే ఎంతో నచ్చేసిందా బుజ్జి పిల్లా

జల్లులాయె జ్ఞాపకాల చినుకులు
తలుచుకుంటు తడిసిపోన
చిన్ననాటి గుర్తులు

లవ్ ఎట్ ఫస్ట్ సైట్
అంతే అయ్యిందలా
చూస్తూనే ఎంతో నచ్చేసిందా బుజ్జి పిల్లా

చక్రాల్లా కళ్ళు ముత్యాల్లా పల్లు
నవ్వుకు పడిపోయా
రంగు రిబ్బన్లా ఆ రెండు జెల్లు
ఓ వలేసి లాగుతుంటే కాదనలేకపోయా

లవ్ ఎట్ ఫస్ట్ సైట్
అంతే అయ్యిందలా
చూస్తూనే ఎంతో నచ్చేసిందా
బుజ్జి పిల్లా హెయ్ ఏ

స్కూలుమేటు తానే సోలుమేటు తానే
స్కూలుమేటు తానే సోలుమేటు తానే

హే స్కూలుమేటు తానే సోలుమేటు తానే
కలల పుస్తకాన కలరు పెన్సిలైనది

కాలేజి జంట గువ్వలా
నాతోనే ఉన్నది
వంద ఏళ్ళు నీడలా
నీతోనే అన్నది

ఇల్లాంటమ్మాయి ఇల్లాలై వస్తే
అంతకన్నా ఇష్టమైన రాజయోగమేది

టిక్ టాక్ టిక్ టోక్ ఫ్లైటే ఎక్కించనా
నా ప్రేమ స్టోరీ భారీ తెరపై చూపించనా
కోటలోని రాకుమారి లాలన
తోటరాముడల్లే నేను పాట కట్టి చెప్పనా

టిక్ టాక్ టిక్ టోక్ ఫ్లైటే ఎక్కించనా
నా ప్రేమ స్టోరీ భారీ తెరపై చూపించనా

నాకై పుట్టింది నన్నే చేరింది
ఆరో తరగతిలో
ఒట్టే పెట్టింది… నా చెయ్ పట్టింది
నన్ను తనలో దాచుకుంది
ఎంత మంచి పిల్లో

టిక్ టాక్ టిక్ టోక్ ఫ్లైటే ఎక్కించనా
నా ప్రేమ స్టోరీ భారీ తెరపై చూపించనా




అమ్మున్ని రుక్కుమణీ పాట సాహిత్యం

 
చిత్రం: కస్టడి (2023)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి 
గానం: యువన్ శంకర్ రాజా, ప్రేమ్జి అమరెన్, మనసి మహాదేవన్ 

అమ్మున్ని రుక్కుమణీ
అందమంత నింపుకొని
హత్తేరి అట్టా ఎట్టా పుట్టేసావే నువ్వు

వేళాపాళా చూడనని
యాడనున్నా రయ్యిమని గుర్తుకొచ్చి
కుర్రాన్నేమో కిర్రెక్కిస్తావు

ఇంతమందిలో ఏదైతే అయ్యిందని
నీ మీదికొచ్చి నన్ను చుట్టేస్తావే
ఏందా మోజని ఎవరెన్ని చెప్పినా
పోండ్రా పొమ్మని గెంటేస్తావే

కుర్రా మనసిది
ఇరక్క ఇరక్క పోయెనే
నీపై ప్రేమకు
దొరికి దొరికి పోయెనే

కుర్రా మనసిది
ఇరక్క ఇరక్క పోయెనే
నీపై ప్రేమకు
దొరికి దొరికి పోయెనే

హెయ్ అల్లరోడు నువ్వు
యెహ వల్ల కాదు నీతో
పడుచందాలతో బిల్లంగోడు ఆడేస్తున్నావే

ఆ, ఎలా చెప్పుకోను
సొద ఇదీ అంటూ నీతో
సోకు తాయిలాలు
నోరూరించి తిప్పిస్తున్నావే

సుట్టూరా కళ్లన్నీ
నిన్ను నన్నే చూస్తుంటే
కూసింత కాసింతైనా పట్టించుకోవే
ఐతే కానీమ్మని సూత్తే సూడనిమ్మని
నీ మైకానా మునిగిపోయా

కుర్రా మనసిది
ఇరక్క ఇరక్క పోయెనే
నీపై ప్రేమకు
దొరికి దొరికి పోయెనే

కుర్రా మనసిది
ఇరక్క ఇరక్క పోయెనే
నీపై ప్రేమకు
దొరికి దొరికి పోయెనే

ఇరక్క ఇరక్క పోయెనే
దొరికి దొరికి పోయెనే
ఇరక్క ఇరక్క పోయెనే
దొరికి దొరికి పోయెనే





అన్నా తమ్ములంటే పాట సాహిత్యం

 
చిత్రం: కస్టడి (2023)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి 
గానం:  యువన్ శంకర్ రాజా , విజయ్ యేసుదాస్ 

అన్నా తమ్ములంటే 

Palli Balakrishna Friday, May 26, 2023
Aa Ammayi Gurinchi Meeku Cheppali (2022)



చిత్రం: ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి (2022)
సంగీతం: వివేక్ సాగర్ 
నటీనటులు: సుదీర్ బాబు, కృతి శెట్టి 
దర్శకత్వం: మోహనకృష్ణ ఇంద్రగంటి 
నిర్మాత: మహేంద్ర బాబు, కిరణ్ బల్లపల్లి 
విడుదల తేది: 16.09.2022



Songs List:



కొత్త కొత్తగా ఉన్నా పాట సాహిత్యం

 
చిత్రం: ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి (2022)
సంగీతం: వివేక్ సాగర్ 
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి 
గానం: చైత్ర అంబడిపూడి, అభయ్ జోద్పుర్కర్

హా, అల్లంత దూరంగ నువ్వు నీ కన్ను
నన్నే చూస్తుంటే ఏం చెయ్యాలో
హా, రవ్వంత గారంగా నాలో నీ నన్ను
మాటాడిస్తుంటే ఏం చెప్పాలో

ఆ, అనగనగా మనవి విను
ముసిముసి ముక్తసరి నవ్వుతో
నిలకడగా అవును అను
తెరలు విడే… పలుకు సిరితో

కొత్త కొత్తగా ఉన్నా కొంచెం బావుందే
పోను పోను ఇంకొంచెం బావుండేలా ఉందే
ఆ, కొత్త కొత్తగా ఉన్నా కొంచెం బావుందే
పోను పోను ఇంకొంచెం బావుండేలా ఉందే

హా, అల్లంత దూరంగ నువ్వు నీ కన్ను
నన్నే చూస్తుంటే… ఏం చెయ్యాలో
హా, రవ్వంత గారంగా… నాలో నీ నన్ను
మాటాడిస్తుంటే… ఏం చెప్పాలో

హో ఆ, తలపు దాకా వచ్చాలే
తగని సిగ్గు చాల్లే
తగిన ఖాళీ పూరిస్తాలే
హా, చనువు కొంచం పెంచాలే
మొదటికన్నా మేలే
కుదిరినంతా కులాసాలే

హా నిను కననీ
నిను కననీ కదలికకు తెలవారదే
హో, నిదురవనీ ప్రతి కలలో
నీ ఊసే తారాడుతోందే

కొత్త కొత్తగా ఉన్నా కొంచెం బావుందే
పోను పోను ఇంకొంచెం బావుండేలా ఉందే
ఆ, కొత్త కొత్తగా ఉన్నా కొంచెం బావుందే
పోను పోను ఇంకొంచెం బావుండేలా ఉందే

సమయమెల్లా సాగిందో గమనమైనా లేదే
తమరి మాయేగా ఇదంతా
ఓ ఓ, పయనమెల్లా పండిందో
మరపురానే రాదే
మధురమాయే సంగతంతా

ఆ ఆ, ఎద గదిలో ఓ ఓ
ఎద గదిలో కిరణమయే తరుణం ఇదే
ఇరువురిలో చలనమిలా
ప్రేమన్న పేరందుకున్నదే


హా, కొత్త కొత్తగా ఉన్నా… కొంచెం బావుందే
ఆ ఆ, పోను పోను ఇంకొంచెం బావుండేలా ఉందే
హో, చెలిమి కల చెరిసగమే
చిటికెన వేలి చివరంచులో
సఖిలదళ విడివడని
ముడిపడవే ప్రియతమ ముడితో




మీరే హీరోలా ఉన్నారు పాట సాహిత్యం

 
చిత్రం: ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి (2022)
సంగీతం: వివేక్ సాగర్ 
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి 
గానం: విజయ్ ప్రకాష్

మీరే హీరోలా ఉన్నారు
మరి తెర్రంగేట్రం ఎప్పుడు చేస్తారు
హహ, ఆ పని మనకెందుకు మాష్టారు
మైటీ హీరోలే మన మాటింటారు

ఆ, ఫుల్ టూ సక్సెస్ లో ఉన్నారు
ఓ, అది నా బలహీనత అంటుంటారు
బడ్జెట్ భారీగా ఎక్కిస్తారే మీరు
బదులుగా రెట్టింపు లెక్కిస్తారు వారు

పాన్ ఇండియాకు… వెళుతున్నారా మీరు
ఏ, ఆల్ ఇండియాలో మనకు ఫ్యాన్స్ ఉన్నారు
మనమే ట్రెండు రా, బ్రాండు రా లెజెండురా
బాక్స్ ఆఫీస్ కు మనమే గోల్డెన్ హ్యాండురా

ఏమా జాతకం నంబర్ వన్ను రాకం
సిల్వర్ స్క్రీన్ పై మీదే నవశకం

ఏ, పుట్టుకతో నేనింతే
బద్దలు కొడతానంతే
బొమ్మలు తీశానంతే
దిమ్మలు తిరగాలంతే

నా ఫైరింగ్ వల్లేగా
చల్లంగుంది ఇండస్ట్రీ
మనమే ట్రెండురా
బ్రాండు రా లెజెండురా
హా హ, బాక్స్ ఆఫీస్ కు మనమే
గోల్డెన్ హ్యాండురా

మీకు యాటిట్యూడ్ అంటారే
మాతో బాగానే ఉంటారే
రెండు మీవాళ్ళే రాస్తారే
గాసిప్ గల్లాట చేస్తారే

ప్రతి సినిమాకు కత్తర్లే
అయినా అనుకుందే తీస్తాలే
సోషల్ మెసేజ్ స్క్రిప్ట్ ముట్టుకోరెం
అయ్యో రామ మనమాగొడవెట్టుకోమే

చాలనే మీకు ఓవర్ కాన్ఫిడెన్స్
ఏంటి బ్రదర్ నేనేంటో నాకు తెలుసు
నో కామెంట్స్ 

మనమే ట్రెండు రా
బ్రాండు రా లెజెండురా
బాక్స్ ఆఫీస్ కు మనమే
గోల్డెన్ హండురా

గడియారంతో పరిగెడతా
పాత రికార్డులు పడగొడతా
భల భీభత్సంగా ఆడిస్తా ఆట

ఇక చాల్లే ఇంకెన్నని చెబుతా
తతీమా ఎమున్నా కబురెడుతా
మల్లి ప్రెస్‌మీట్‌లో కనబడతా
టాటా టాటా టాటా




ఆ మెరుపేమిటో పాట సాహిత్యం

 
చిత్రం: ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి (2022)
సంగీతం: వివేక్ సాగర్ 
సాహిత్యం: సిరివెన్నెల
గానం: అనురాగ్ కులకర్ణి 

ఆ మెరుపేమిటో
కనుపాపతో ఏమన్నదో
ఆ చిరునవ్వులో
తెరచాటుగా ఏమున్నదో

నమ్మలేని మర్మమేదో దాగి ఉందా
ఎవ్వరూ రాయని కవితలా
రమ్యమైన రాగమేదో లాగుతూ ఉందా
మౌనమే మువ్వలా పలకగా

ఏమో నిజానికి ఇలాంటిది కలే కదా
అయినా కలే కదా అనేదెలా
ఏమో నిజానికి ఇలాంటిది కలే కదా
అయినా కలే కదా అనేదెలా

ఈ శిల్పంలో గల ఈ కల
ఏ ఉలి ఊహలో 
ఏ శిలా ఈ చెలి రూపమై నడయాడెనో

నేల చూపులు దీపాలై
వెలగవా మరీ 
ఎక్కడో ఏ హృదయమో
తన కోసమే కల్లలై ఉన్నది

ఏమో నిజానికి ఇలాంటిది కలే కదా
అయినా కలే కదా అనేదెలా
ఏమో నిజానికి ఇలాంటిది కలే కదా
అయినా కలే కదా అనేదెలా




అందమైన సుందరి పాట సాహిత్యం

 
చిత్రం: ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి (2022)
సంగీతం: వివేక్ సాగర్ 
సాహిత్యం: కాసర్ల శ్యామ్ 
గానం: స్పందన్ భట్టాచార్య

సక్కంగ సాగే కథనే
అడ్డంగ తిప్పిండే
భద్రంగ దాసిన బతుకే
సిత్రంగ సింపిడే

సక్కంగా సాగే కథనే
అడ్డంగ తిప్పిండే
భద్రంగా దాసిన బతుకే
చిత్రంగా సింపిడే

గిల్లేసి పాడే జోలపాటా ఆ ఆ
పైవాడికెంత ఏడుకంటా
ఈ సల్లనైన ఎన్నెల పూట
నిప్పు లేని మంటలు ఎట్టిండంట

ఓ, అందమైన సుందరి జిందగిలో
ఆ ఆ, సిందులేసే గందరగోళంలో
ఈ అంతులేని సిందరవందరలో
ఆ ఆ, సింతలన్ని ఎప్పుడు తీరునురో

ఓ ఓ, నీటి మీద రాతల
బంధాలే కలిపేసి
అంటనట్టు ఉంటడే
అరె సిన్నిగుండె గోడపై
ముందే బొమ్మేసి, ఆటలాడుతుంటడే

సీకటిలో రంగు కలలే సూపి
తెలవారి మాయ చేసి పోతడే
అరె, అల్లరి పిల్లడి గారడే

అందమైన సుందరి జిందగిలో
ఆ ఆ, సిందులేసే గందరగోళంలో
ఈ అంతులేని సిందరవందరలో
ఆ ఆ, సింతలన్ని ఎప్పుడు తీరునురో



ఆటోమేటిక్ దర్వాజా పాట సాహిత్యం

 
చిత్రం: ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి (2022)
సంగీతం: వివేక్ సాగర్ 
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి 
గానం: సాహితి చాగంటి 

ఆటోమేటిక్ దర్వాజా

Palli Balakrishna Sunday, October 16, 2022
The Warriorr (2022)



చిత్రం: ద వారియర్  (2022)
సంగీతం:  దేవి శ్రీ ప్రసాద్  
నటీనటులు: రామ్ పోతినేని , కృతి షెట్టి, అక్షర గౌడ , ఆది పినిశెట్టి, నదియా
దర్శకత్వం: యన్. లింగు స్వామి
నిర్మాత: శ్రీనివాస చిట్టూరి
విడుదల తేది: 14.07.2022



Songs List:



బుల్లెట్టు పాట సాహిత్యం

 
చిత్రం: ద వారియర్  (2022)
సంగీతం:  దేవి శ్రీ ప్రసాద్ 
సాహిత్యం: శ్రీమణి 
గానం: శింబు, హరిప్రియ 

నా పక్కకు నువ్వే వస్తే
హార్ట్ బీటే స్పీడౌతుంది
ఓ టచ్ఛే నువ్వే ఇస్తే
నా బ్లడ్డే హీటౌతుంది

నా బైకే ఎక్కావంటే
ఇంక బ్రేకే వద్దంటుంది
నువ్వు నాతో రైడుకి వస్తే
రెడ్ సిగ్నల్ గ్రీనౌతుంది

కమ్, కమాన్ బేబీ లెట్స్ గో ఆన్ ద బులెటు
ఆన్ ద వే లో పాడుకుందాం డ్యూయెటు
కమాన్ బేబీ లెట్స్ గో ఆన్ ద బులెటు
ఆన్ ద వే లో పాడుకుందాం డ్యూయెటు

హే, ట్వంటీ ట్వంటీలాగ
నీ ట్రావెల్ థ్రిల్లింగుంది
వరల్డ్ కప్పే కొట్టినట్టు
నీ కిస్సే కిక్కిచ్చింది

హే, బస్సు లారీ కారు
ఇక వాటిని సైడుకి నెట్టు
మన బైకే సూపర్ క్యూటు
రెండు చక్రాలున్న ఫ్లైటు

కమాన్ బేబీ లెట్స్ గో ఆన్ ద బుల్లెట్టు
ఆన్ ద వే లో పాడుకుందాం డ్యూయెట్టు
కమాన్ బేబీ లెట్స్ గో ఆన్ ద బుల్లెటు
ఆన్ ద వే లో పాడుకుందాం డ్యూయెట్టు

డుడుడుడు డుడుడుడు
హైవేపైనే వెళ్తూ వెళ్తూ
ఐస్క్రీమ్ పార్లర్లో ఆగుదాం
ఓ కుల్ఫీతోనే సెల్ఫీ తీసుకుందాం
డుడుడుడు డుడుడుడు

టుమారో నే లేనట్టుగా
టుడే మనం తిరుగుదాం
వన్డేలోనే వరల్డే చుట్టేద్దాం
డుడుడుడు డుడుడుడు

మిడ్నైట్ అయినా కూడా
హెడ్ లైట్ ఏసుకుపోదాం
అరె హెల్మెట్ నెత్తిన పెట్టి
కొత్త హెడ్ వెయిట్ తోనే పోదాం
సీటు మీద జారిపడి
చిన్ని చిన్ని ఆశలు తీర్చుకుందాం

కమాన్ బేబీ లెట్స్ గో ఆన్ ద బుల్లెట్టు
ఆన్ ద వే లో పాడుకుందాం డ్యూయెట్టు
కమాన్ బేబీ లెట్స్ గో ఆన్ ద బుల్లెటు
ఆన్ ద వే లో పాడుకుందాం డ్యూయెట్టు

ఏ, చెట్టాపట్టాలేసుకొని ఇంస్టా రీలు దింపుదాం
నా ఉడ్బీ అంటూ స్టేటస్ పెట్టుకుందాం
డుడుడుడు డుడుడుడు
హారర్ సినిమా హాలుకు వెళ్ళి
కార్నర్ సీట్లో నక్కుదాం
భయపెట్టే సీన్లో ఇట్టే హత్తుకుందాం
డుడుడుడు డుడుడుడు

సైలెన్సర్ హీటు… వేసుకుందాం హామ్లెట్టు
మన రొమాంటిక్కు ఆకలికి ఇదో కొత్త రూటు
సుర్రుమంటూ తుర్రుమంటూ
ఈ బండి పండగని ఎంజాయ్ చేద్దాం

కమాన్ బేబీ లెట్స్ గో ఆన్ ద బుల్లెట్టు
ఆన్ ద వే లో పాడుకుందాం డ్యూయెట్టు
క్ కమాన్ బేబీ లెట్స్ గో ఆన్ ద బుల్లెటు
ఆన్ ద వే లో పాడుకుందాం డ్యూయెట్టు, హాయ్

డుడుడుడు డుడుడుడు
డుడుడుడు డుడుడుడుర్ర్ర్




దడ దడమని హృదయం పాట సాహిత్యం

 
చిత్రం: ద వారియర్  (2022)
సంగీతం:  దేవి శ్రీ ప్రసాద్ 
సాహిత్యం: శ్రీమణి 
గానం: హరిచరణ్ 

దడ దడమని హృదయం శబ్దం
నువ్వు ఇటుగా వస్తావని అర్ధం
బడ బడమని వెన్నెల వర్షం
నువ్వు ఇక్కడే ఉన్నావని అర్ధం

నువ్వు విసిరినా విజిల్ పిలుపొక
గజల్ కవితగా మారే
చెవినది పడి కవినయ్యానే

తెలియదు కదా పిరమిడులను
పడగొట్టే దారే
నీ ఊహల పిరమిడు నేనే

దడ దడమని హృదయం శబ్దం
నువ్వు ఇటుగా వస్తావని అర్ధం
బడ బడమని వెన్నెల వర్షం
నువ్వు ఇక్కడే ఉన్నావని అర్ధం

నలుపని తెలిసి కనులకు రాసి
కాటుకనేమో తెగ పొగిడేస్తావే
క్షణమొక రంగే నీకై పొంగే
నా హృదయాన్నె మరి కసిరేస్తావే

ఇటు వెళ్లిన నువ్వే అటు కనిపిస్తావే
ఎటు వెళ్లని వల వేస్తావే
ఏంచేశానంటూ నను నిలదీస్తావే
ఏం చేయలేక చూస్తూ ఉంటె జాలి చూపవే

దడ దడమని హృదయం శబ్దం
నువ్వు ఇటుగా వస్తావని అర్ధం, హ హా
బడ బడమని వెన్నెల వర్షం
నువ్వు ఇకడే ఉన్నావని అర్ధం

తేనెలో పడడం చీమకు ఇష్టం
నీ ప్రేమలో పడడం నాకింకా ఇష్టం
ఉల్కలు పడితే భూమికి నష్టం
నువ్వు కనబడకుంటే నాకింకా కష్టం

రాసిన రాతైనా మళ్ళీ రాస్తున్న
విసుగుండదు ఇది ఏం కవితో
రోజు చూస్తున్నా… మళ్ళీ వస్తున్న
నిను ఎంత చూడు కనులకసలు తనివి తీరదే

దడ దడమని హృదయం శబ్దం
నువ్వు ఇటుగా వస్తావని అర్ధం
బడ బడమని వెన్నెల వర్షం
నువ్వు ఇక్కడే ఉన్నావని అర్ధం




ద విజిల్ సాంగ్ పాట సాహిత్యం

 
చిత్రం: ద వారియర్  (2022)
సంగీతం:  దేవి శ్రీ ప్రసాద్ 
సాహిత్యం: సాహితి గాలిదేవర 
గానం: అంటోనీ దాసన్, శ్రీనిషా జయసీలం 

నాలికిట్ట మడత పెట్టి
వేళ్ళు రెండూ జంట కట్టి
ఊదు మరి ధమ్మే బట్టి

విజిలు విజిలు విజిలు విజిలే
హే విజిలు విజిలు విజిలు విజిలే

కళ్ళలోన టార్చు పెట్టి
లిప్పు లోన స్కాచ్ పెట్టి
వచ్చిందిరో క్యూటీ బ్యూటీ

విజిలు విజిలు విజిలు విజిలే
హే విజిలు విజిలు విజిలు విజిలే

నీ ఊపిరేమో గుప్పుమంది పెర్ఫ్యూమల్లె
నీ తిట్లు కూడా తీయ్యనైన పోయెమ్సేలే 
నీ రంగు గోళ్లు నింగిలోన రైన్బోసేలే
నీ అందాలన్నీ అందంగా వర్ణించాలంటే ఫజిల్సేలే

విజిలు విజిలు విజిలు విజిలే
హే విజిలు విజిలు విజిలు విజిలే

నీ లుక్కే  నా వెంట పడి హుక్కై నను లాగినాది
చుక్క ఆ లుక్ఒ క్క విజిలు 
నీ టచ్చే తాకిందో ఆలా స్విచ్చై ఆన్ అయ్యే ఇలా
గిచ్చే నీ టచ్ కొక విజిలు 

హాటీ గా నువ్వుంటే నాటీ గా నేనుంటే
నా ఊపిరేసిందే విజిలు 
నీ టఫ్ జిం బాడీ పెంచిందే నా వేడి
నాలో నేనే వేశాలే విజిలు 

విజిలు విజిలు విజిలు విజిలే
హే విజిలు విజిలు విజిలు విజిలే

ఆఫీస్ లో లీవిస్తే ఆశలతో నేనొస్తే
టూ పీఎస్ లో నువ్వుంటే విజిలు 
నా డ్రీం లోన నువ్వున్నా టైం లోన నే లేస్తే
రూమ్  లోన నువ్వుంటే విజిలు 

అరే మైక్రోస్కోప్ చూడలేని నాజూకు నీ నడుముని
నే వెతికి పెట్టానో విజిలు 
నువ్ టక్కరల్లే వాటేస్తే కుక్కరల్లే నే మారి
వేసేస్తానే విజిలు విజిలు 

విజిలు విజిలు విజిలు విజిలు
విజిలు విజిలు విజిలు విజిలు
విజిలు విజిలు విజిలు విజిలు
విజిలు విజిలు విజిలు విజిలు విజిలే

విజిలు విజిలు విజిలు విజిలే
హే విజిలు విజిలు విజిలు విజిలే
విజిలు విజిలు విజిలు విజిలే
హే విజిలు విజిలు విజిలు విజిలే




కల కల కలర్ పాట సాహిత్యం

 
చిత్రం: ద వారియర్  (2022)
సంగీతం:  దేవి శ్రీ ప్రసాద్ 
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి 
గానం: జాస్ప్రీత్ జస్జ్

ఆ ఆఆ ఆఆ ఆ ఆ
కల కల కలర్ కలర్
కల కల కలర్ కలర్, కలర్
ఆ ఆఆ ఆఆ ఆ ఆ

హే, ఎల్ ఎల్ ఎల్ ఎల్లో ఓణీ వేసిన రాగిణి, యా
నీకోసం తిరిగి నలిగి
కరిగి పోయాడాంటోనీ

హే, రెడ్ రెడ్ రెడ్
రెడ్డు రోజ్ పెట్టిన రూపిణి, యా
నీ రోజే చూసీ
లూజ్ అయిపోయాడు అయ్యో శివమణి

కల కల కలర్
కల కల కలర్

హే, బ్లూ బ్లూ బ్లూ
బ్లూ సల్వార్‌లో మెరిసిన పార్వతి, మ్
నువ్ పడనన్నాకే పడిపోయిందే
భాస్కర్ పరపతి, అయ్యయ్యో

బ్లా బ్లా బ్లా
బ్లాక్ సారీలో ఆసమ్ అంజలి, మ్
నువ్ నో అన్నందుకు హౌసే మారెను
కౌశిక్ ఫ్యామిలీ, పాపం

కల కల కల కలరు
ఇది రెయిన్బో రంగుల షవరూ
ఆ ఆఆ ఆఆ ఆ ఆ
కల కల కల కలరు
ఈ కలరుకి పడనోడెవరు
ఆ ఆఆ ఆఆ ఆ ఆ

హే, రెడ్ కలర్, బ్లూ కలర్
యెల్లో కలర్, గ్రీన్ కలర్
నాదేగా ఒక్కొక్క కలరు, పోరా

వైట్ కలర్, బ్లాక్ కలర్
పింక్ కలర్, మెరూన్ కలర్
నాదేగా ఒక్కొక్క ఫిగరు, ఆశ

హే, బి-బ్లాక్ బేబీ పరిమళ
పీకాక్ లాగా నడిచెరా
బేబీ పింకు టాపులో
సూపర్ మెరిసెరా, హహ్హా

మాంగో కలరు రసగుల్లా, ఆ
తన పేరేమో ఇసాబెల్లా, హా
లాంగ్ హెయిర్ లూజుగా వదిలితే
చుక్కల్ కురిసెరా, హహ్హా

వేణు హార్టుకి స్ట్రాబెర్రీ సరితే
వెల్డింగ్ పెట్టెరా
క్యారెట్ కమలా డైటింగ్ చేస్తే
ఊరే పస్తురా

రాముడి నీలం జీన్సే
తొడిగిన డీజే దీపిక
గ్రామర్ తప్పుగా మాట్లాడేసిన
గ్లామర్ గుందిరా

కల కల కల కలరు
ఇది రెయిన్బో రంగుల షవరూ
ఆ ఆఆ ఆఆ ఆ ఆ
కల కల కల కలరు
ఈ కలరుకి పడనోడెవరు
ఆ ఆఆ ఆఆ ఆ ఆ

హే, రెడ్ కలర్, బ్లూ కలర్
ఎల్లో కలర్, గ్రీన్ కలర్, ఎయ్
యెయ్, వైట్ కలర్, బ్లాక్ కలర్
పింక్ కలర్, మెరూన్ కలర్

మిల్కీ బ్యూటీ మెహబూబా
మిస్ వరల్డ్ లా వస్తుందిరా
తన క్యాట్ వాక్ మహమ్మద్
మనసునే నలిపేస్తోందిరా, అహ్హా

లావెండర్ డ్రెస్ లక్షణ, ఆ
సిడ్నీ షెల్డన్ ఫిక్షనా, హా
డైలీ సస్పెన్స్ తేలకే
డేవిడ్ టెన్షనా, ఆహా

ఆలివ్ పచ్చ మిడ్డీలోనా
అదిరే అంజన
హార్ట్ ఎటాకే అల్ఫోన్స్ కీ
నువ్వు మెసేజ్ చేసినా

చార్కోల్ బ్లాకు రింగుల కురుల
జమున డార్లింగే
నీ బౌలింగ్ దెబ్బకి
ప్రతి కుర్రాడు ధోని బాటింగే

కల కల కల కలరు
ఇది రెయిన్బో రంగుల షవరూ
ఆ ఆఆ ఆఆ ఆ ఆ
కల కల కల కలరు
ఈ కలరుకి పడనోడెవరు
ఆ ఆఆ ఆఆ ఆ ఆ

కల కల కలర్ కలర్
కల కల కలర్ కలర్, కలర్

Palli Balakrishna Monday, July 11, 2022
Macherla Niyojakavargam (2022)



చిత్రం: మాచర్ల నియోజకవర్గం (2022)
సంగీతం: మహతి స్వర సాగర్ 
నటీనటులు: నితిన్, కృతి శెట్టి, కేథరిన్ థెరిసా
దర్శకత్వం: ఎం.ఎస్.రాజశేఖర్ రెడ్డి
నిర్మాత: సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి
విడుదల తేది: 12.08.2022



Songs List:



చిల్ మారో పాట సాహిత్యం

 
చిత్రం: మాచర్ల నియోజకవర్గం (2022)
సంగీతం: మహతి స్వర సాగర్ 
సాహిత్యం: కృష్ణ చైతన్య 
గానం: నకాష్ అజీజ్, సంజనా కల్మాన్జి

ఆవో, చిల్ మారో చిల్ మారో… చిల్ మారో
జెట్ స్పీడు జిందగీ… కొత్త చిల్ మారో
సున్లో యారో సున్లో యారో… సున్లో యారో
మనసులో మాటలే కొంత సున్లో యారో

ఓఓ ఓ ఓఓ ఓ
తప్పు కాదులే వయసులో
తప్పు చేయడం
ఓఓ ఓ ఓఓ ఓ
వేళ కాని వేళ ఎందుకంత మోయడం

ట్రిప్పింగ్ ట్రిప్పింగ్ ట్రిప్పింగ్
ఆన్ ద ఫ్లోర్
ట్రిప్పింగ్ ట్రిప్పింగ్ ట్రిప్పింగ్
ఆన్ ద ఫ్లోర్
ట్రిప్పింగ్ ట్రిప్పింగ్ ట్రిప్పింగ్
ఆన్ ద ఫ్లోర్

అండ్ ట్రిప్పింగ్ ట్రిప్పింగ్ ప్రాపర్లీ
మైండ్ ఈస్ స్కిప్పింగ్ లేట్లీ
మబ్బులో ఉన్న గ్రేట్లీ
ఖతము అయిన టోటల్లీ

ఛలో సమ్మగుంది పాట
ఇక బేబీ కోసం వేట
లెట్’స్ షేక్, లెట్’స్ షేక్
బ్రింగ్ ద పార్టీ యప్ ద పోక్

కారో యార్… తోడ ప్యార్
అన్ని మర్చిపోదాం యార్
యుగాలు ఇవాళే చూద్దాం

ఓ హమేషా తమాషా
నువ్వేలే నా భరోసా
బోలో యార్ టైమే ఫ్రీజ్ చేద్దాం

పిల్లే చూస్తే నాటీ
పైగా రేవ్ పార్టీ
రానా గీత దాటి
అంటోంది నాతోటి

స్టెప్ ఏదైనా రాండమ్
నచ్చిందే ఈ ఫ్రీడమ్
హలో మిస్ మేడం
ఇక ఇక్కడ వేద్దాం

ఓఓ ఓ ఓఓ ఓ
ఉల్లాలాల్ల హార్ట్ రేట్ పెరుగుతుంది
ఓఓ ఓ ఓ ఓఓ
ఓ అనేలా వెదరే ఉన్నది

ట్రిప్పింగ్ ట్రిప్పింగ్ ట్రిప్పింగ్
ఆన్ ద ఫ్లోర్
ట్రిప్పింగ్ ట్రిప్పింగ్ ట్రిప్పింగ్
ఆన్ ద ఫ్లోర్
ట్రిప్పింగ్ ట్రిప్పింగ్ ట్రిప్పింగ్
ఆన్ ద ఫ్లోర్




రా రా రెడ్డి... ఐ యాం రెడీ పాట సాహిత్యం

 
చిత్రం: మాచర్ల నియోజకవర్గం (2022)
సంగీతం: మహతి స్వర సాగర్ 
సాహిత్యం: కాసర్ల శ్యామ్
గానం: లిప్సిక 

ఆ, మాచర్ల సెంటర్ లో
మాపటేల నేనొస్తే
సందమామ సందులోకి వచ్చెనంటరే

మసక మసక వింటర్ లో
పైట నేను జారిస్తే
పట్టపగలే సుక్కలు
సూపిచ్చెనంటరే

వేసవి లో ఎండకు
పట్టేటి సెమటకు
నా పైటే ఏసీ గా ఊపుతానులే
వింటర్ లో మంటకు
వణికేటి జంటకు
నా ఒంటి హీటర్’నే ఎలిగిస్తాలే

ఐ యాం రెడీ…
నన్ను ఎట్టాగ పిలిసినా రెడీ
వచ్చి నా సోకులిస్తా మీకు వడ్డీ
మల్లె పువ్వులాంటి ఒల్లు సెంటు బుడ్డీ

రా రా రెడ్డి… ఐ యాం రెడీ…
నన్ను ఎట్టాగ పిలిసినా రెడీ
వచ్చి నా సోకులిస్తా మీకు వడ్డీ
మల్లె పువ్వులాంటి ఒల్లు సెంటు బుడ్డీ
రా రా రెడ్డి..!

యే, లవ్వింగు సేత్తవా… ఐ యాం సారీ
కలిసి లివ్వింగు ఇష్టమా… వెరీ సారీ
మరి పెళ్లాంగా వస్తవా… సో సో సారీ
ఆ గొల్లెం నాకొద్దురో… సారీ సారీ

నేనేమో ఒంటరు… నాకుంది మేటరు
ఒక సోట ఆగలేను నేనొసారి
తిరుగుద్ది మీటరు… హై బీపీ రెటురో
ఈ రూట్ కు మల్లోత్త ఏదో సారి

ఐ యాం రెడీ…
నన్ను ఎట్టాగ పిలిసినా రెడీ
వచ్చి నా సోకులిస్తా మీకు వడ్డీ
మల్లె పువ్వులాంటి ఒల్లు సెంటు బుడ్డీ

రా రా రెడ్డి… ఐ యాం రెడీ…
నన్ను ఎట్టాగ పిలిసినా రెడీ
వచ్చి నా సోకులిస్తా మీకు వడ్డీ
మల్లె పువ్వులాంటి ఒల్లు సెంటు బుడ్డీ
రా రా రెడ్డి..!

రాను రానంటూనే సిన్నదో సిన్నదో
రాములోరి గుడికొచ్చె సిన్నదో సిన్నది
రాను రానంటూనే సిన్నదో సిన్నదో
రాములోరి గుడికొచ్చే సిన్నదో సిన్నది

కాదు కాదంటూనే కుర్రదో కుర్రదో
తోటకాడకొచ్చింది కుర్రదో కుర్రది
పచ్చి పచ్చి వంటూనే పిల్లదో పిల్లదో
పళ్ళోట్టుకొచ్చిందే పిల్లదో పిల్లది

రాను రానంటూనే సిన్నదో సిన్నదో
రాములోరి గుడికొచ్చె సిన్నదో సిన్నది
రాను రానంటూనే సిన్నదో సిన్నదో
రాములోరి గుడికొచ్చే సిన్నదో సిన్నది




అదిరిందే పసి గుండె పాట సాహిత్యం

 
చిత్రం: మాచర్ల నియోజకవర్గం (2022)
సంగీతం: మహతి స్వర సాగర్ 
సాహిత్యం: కృష్ణ కాంత్ 
గానం: సంజిత్ హెగ్డే

అదిరిందే పసి గుండె
తగిలిందే హై వోల్టే
ఫైవ్ ఎయిట్ హైట్ ఉన్నా
పిడుగే పడెనే

అదిరిందే పసి గుండె
తగిలిందే హై వోల్టే
ఫైవ్ ఎయిట్ హైట్ ఉన్నా
పిడుగే పడెనే

మత్తులో ఉన్నానా కొత్తగా పుట్టానా
కారణం నీవేనా జానే జానా
వెంటపడి చస్తున్నా ఎంత ప్రేమిస్తున్నా
చూపవా నాపైన కొంచెమైనా

దయలేని దానివి నువ్వు
మగజాతికి హానివే నువ్వు
నా పక్కన రాణివి నువ్వు
ఒక ఛాన్స్ ఇవ్వు

కుదిరిందా కిస్సోటివ్వు
కొసరంటూ హగ్గోటివ్వు
మంటెక్కితే లాగోటివ్వు
ఏదోటివ్వు టెన్ టు ఫైవ్

హై స్పీడు షాటులోన
నీ పెదాలే చూస్తుంటే
ఏమైందో ఒక్కసారి
లోకమంతా ఫ్రీజయిందే

నీ ముందు మూన్ లైటు
తేలిపోయి డిమ్మయిందే
నాదేమో ప్రాణమంతా
లైట్ వెయిటై తేలిందే

పైపైకి పోజులున్న
నిజములే నా ప్రేమ
పొమ్మన్న పోనే పోదు
నీదేగా ఈ జన్మ
ఏ రోజుకైనా గాని… తగ్గదే నా ప్రేమ
అవకాశమిచ్చి చూడమ్మా

దయలేని దానివి నువ్వు
మగ జాతికి హానివే నువ్వు
నా పక్కన రాణివి నువ్వు
ఒక ఛాన్స్ ఇవ్వు

కుదిరిందా కిస్సోటివ్వు
కొసరంటూ హగ్గోటివ్వు
మంటెక్కితే లాగోటివ్వు
ఏదోటివ్వు



పోరీ సూపరో పాట సాహిత్యం

 
చిత్రం: మాచర్ల నియోజకవర్గం (2022)
సంగీతం: మహతి స్వర సాగర్ 
సాహిత్యం: కృష్ణ కాంత్ 
గానం: రాహుల్ సిప్లిగంజ్, గీతామాధురి

పోరీ సూపరో యయ్త్ వండరో
ఫ్లడ్ లైట్ ఐస్ రో
లుక్కుతో హార్టే ఆపెరో

క్యూటీ థండరో షేపే టాపురో
నట్ట నడివీధిలో నవ్వుతు
నన్నే సంపెరో 

పాలకన్న నువ్వే వైటే
యేసుకోన నీకే సైటే
నువ్వు ఇచ్చావంటే డేటే
ఎక్కి రానా ఫ్లైటే

కూలుగుందే ఈ క్లైమేటే
హాటులోన మోగే బీట్ యే
చేయకుందా ఇంకా లేటే
ఏసుకుందాం పాటే

వల్లరే వల్లారే
వల్లే వల్లే వల్లారే
చెయ్యన పిల్లా
నీ సీనే సితారే, హా

వల్లరే వల్లారే
వల్లే వల్లే వల్లారే
చెయ్యన పిల్లా
నీ సీనే సితారే, హా

చూపే లేజరు ఈడే ఫైటరు
హార్టు దోచే హంటరు
దొంగలా ఎంటరు అయ్యాడే

స్మైలే మ్యాడురో
స్టైలే బ్రాండురో
డాన్స్-కేమో డాడురో
పెంచరో డీజే సౌండేరో

చూసుకోవే సోలో స్టెప్పు
దద్ధరిల్లేలాగా డప్పు
ఇంకా వద్దే ఇంచు గ్యాపు
మర్చిపోదాం స్లీపు

తెచుకోవే గూగుల్ మ్యాపు
నిన్న డేటే మారేలోపు
టిప్పుకొస్తా ఫారిన్ ట్రిప్పు
బేబీ ఎస్సే జెప్పు

వల్లరే వల్లారే
వల్లే వల్లే వల్లారే
చెయ్యన పిల్లా
నీ సీనే సితారే, హా

వల్లరే వల్లారే
వల్లే వల్లే వల్లారే
చెయ్యన పిల్లా
నీ సీనే సితారే, హా

Palli Balakrishna
Shyam Singha Roy (2021)



చిత్రం: శ్యామ్ సింగరాయ్ (2021)
సంగీతం: మిక్కీ జే మేయర్
నటీనటులు: నాని, సాయిపల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్
దర్శకత్వం: రాహుల్ సంక్రిత్యన్
నిర్మాత:వెంకట్ ఎస్. బోయనపల్లి
విడుదల తేది: 24.12.2021



Songs List:



పుట్టిందా ఓ అక్షరమే పాట సాహిత్యం

 
చిత్రం: శ్యామ్ సింగరాయ్ (2021)
సంగీతం: మిక్కీ జే మేయర్
సాహిత్యం: కృష్ణ కాంత్ 
గానం: విశాల్ దద్లాని, అనురాగ్ కులకర్ణి 

పుట్టిందా ఓ అక్షరమే
కాగితపు కడుపు చీల్చే
అన్యాయం తలే తెంచే
అరె కరవాలంలా పదునాకలమేరా

శ్యామ్ సింగ రాయ్
అరె, ఎగసి ఎగసిపడు అలజడి వాడే
శ్యామ్ సింగ రాయ్
అరె, తిరగబడిన సంగ్రామం వాడే
శ్యామ్ సింగ రాయ్
అరె, వెనకబడని చైతన్యం వాడే
శ్యామ్ సింగ రాయ్… టెన్ టు ఫైవ్ సింగ రాయ్
సింగ రాయ్ సింగ రాయ్… సింగ రాయ్ (2)

పటాసుల్నే లిఖిస్తాడు
నిజం కోసం శ్రమిస్తాడు
జనం కోసం తపిస్తాడు
అరె అజ్ఞానానికి పాతర వేస్తాడు

పడుతూ ఉన్నా ప్రతి పుటపైనా
తన నెత్తురు సిరలా పారేరా
మెడలే వంచే రాజులతోనే
కవి ప్రశ్నల యుద్ధంరా
సింధూరం రంగున్న జెండారా

శ్యామ్ సింగ రాయ్
అరె, ఎగసి ఎగసిపడు అలజడి వాడే
శ్యామ్ సింగ రాయ్
అరె, తిరగబడిన సంగ్రామం వాడే
శ్యామ్ సింగ రాయ్
అరె, వెనకబడని చైతన్యం వాడే
శ్యామ్ సింగ రాయ్… టెన్ టు ఫైవ్ సింగ రాయ్
సింగ రాయ్ సింగ రాయ్… సింగ రాయ్ (2)

గర్జించే గొంతేరా
తెల్లోడైనా నల్లోడైనా తేడా లేదురా
స్వాతంత్య్రం నీ స్వప్నంరా
ఏ క్రోదాలు ఉద్వేగాలు నిన్నేం చేయురా

గుడిలో ఉన్నా గడిలో ఉన్నా
స్త్రీ శక్తికి ఇంతటి కష్టాలా
తలలే తెంపే ఆ కాళికకే
చెరబట్టుతూ సంకేతాలా
నీ వల్లే ఈ స్వేచ్ఛే సాధ్యంరా

శ్యామ్ సింగ రాయ్
అరె, ఎగసి ఎగసిపడు అలజడి వాడే
శ్యామ్ సింగ రాయ్
అరె, తిరగబడిన సంగ్రామం వాడే
శ్యామ్ సింగ రాయ్
అరె, వెనకబడని చైతన్యం వాడే
శ్యామ్ సింగ రాయ్… సింగ రాయ్
సింగ రాయ్ సింగ రాయ్… సింగ రాయ్ (2)




ఏదో ఏదో పాట సాహిత్యం

 
చిత్రం: శ్యామ్ సింగరాయ్ (2021)
సంగీతం: మిక్కీ జే మేయర్
సాహిత్యం: కృష్ణ కాంత్ 
గానం: చైత్ర అంబడిపూడి

ఏదో ఏదో తెలియని లోకమా
ఏదో ఏదో తహ తహ మైకమా

ఐ యామ్ సో ఇన్ టూ యూ
ఐ యామ్ సో ఇన్ టూ యూ
టచ్ మీ లైక్ యూ డు
లవ్ మీ లైక్ యూ వాంట్ ఇట్

ఐ యామ్ సో ఇన్ టూ యూ
ఐ యామ్ సో ఇన్ టూ యూ
ఐ యామ్ సో ఇన్ టూ యూ
ఐ యామ్ సో ఇన్ టూ యూ

కైపే తెర తెగిన పడవా, ఆ ఆ
అలజడుల గొడవా, ఆ ఆ
లోలోపలా మరో తీరమే మరి రమ్మనే
ఎరే వేసిన సాయంత్రమా

నువ్వే నా ఎదురుగా ఉంటే
ఏ మధురిమో తాకే
నీ అధరమే గీసే ఓ చిత్రమే
హాయే వరద నది తీరునా
కనుల ఒడి చేరెను ఈ వేళనా

ఐ యామ్ సో ఇన్ టూ యూ
ఐ యామ్ సో ఇన్ టూ యూ
టచ్ మీ లైక్ యూ డు
లవ్ మీ లైక్ యూ వాంట్ ఇట్

ఐ యామ్ సో ఇన్ టూ యూ
ఐ యామ్ సో ఇన్ టూ యూ
ఐ యామ్ సో ఇన్ టూ యూ
ఐ యామ్ సో ఇన్ టూ యూ

ప్రాణం తీసే ఈ అల్లరే
కళ్ళే మూసే ధ్యానాలే
ఈ చలిచలితో ఇలా ఈ తొందరలో
ఓ తమాషా తెగబడుతూ పరిగెడుతూ
ఉరకలు వేసే ఈ అతిశయమే
పెరిగెనులే కొంచం కొంచం
అంతా సొంతం అంటూ

డోంట్ నో వై
యూ లెట్ ద ఫైర్ ఇన్ మై సోల్
కార్చిచ్చే కళ్ళంచుల్లో… కలలు కలబడగా
మోహం తలుపు తెరిచేనా
తెలిసి పెరిగేనా ఈ వేధన

ఏదో ఏదో… తెలియని లోకమా
ఏదో ఏదో… తహ తహ మైకమా




సిరివెన్నెల పాట సాహిత్యం

 
చిత్రం: శ్యామ్ సింగరాయ్ (2021)
సంగీతం: మిక్కీ జే మేయర్
సాహిత్యం: సిరివెన్నెల 
గానం:  అనురాగ్ కులకర్ణి

డుం డక డుం డక డుం డక డుండుం
డుం డక డుం డక డుం డక డుం
డుం డక డుం డక డుం డక డుండుం
డుం డక డుం డక డుం డక డుం

నెల రాజుని… ఇల రాణిని
కలిపింది కదా సిరివెన్నెల
దూరమా దూరమా తీరమై చేరుమా
నడి రాతిరిలో తెరలు తెరచినది
నిద్దురలో మగత మరచి ఉదయించినదా
కులుకులొలుకు చెలి మొదటి కలా

తన నవ్వులలో తళుకు తళుకు
తన చెంపలలో చమకు చమకు
తన మువ్వలలో ఝనకు ఝనకు
సరికొత్త కలా

డుం డక డుం డక డుం డక డుండుం
డుం డక డుం డక డుం డక డుం
డుం డక డుం డక డుం డక డుండుం
డుం డక డుం డక డుం డక డుం

ఓ, ఛాంగురే ఇంతటిదా నా సిరి
అన్నది ఈ శారద రాతిరి
మిలమిలా చెలి కన్నుల
తన కలలను కనుగొని
అచ్చెరువున మురిసి

అయ్యహా ఎంతటిదీ సుందరి
ఎవ్వరూ రారు కదా తన సరి
సృష్టికే అద్దము చూపగ పుట్టినదేమో
నారి సుకుమారి
ఇది నింగికి నేలకి జరిగిన పరిచయమే

తెర దాటి చెర దాటి
వెలుగు చూస్తున్న భామని
సరిసాటి ఎదమీటి
పలకరిస్తున్న శ్యాముని

ప్రియమార గమనిస్తూ
పులకరిస్తోంది యామిని
కలబోసే ఊసులే, ఓ ఓ
విరబోసే ఆశలై, ఓ ఓ

నవరాతిరి పూసిన వేకువ రేఖలు
రాసినదీ నవలా
మౌనాలే మమతలై, ఓ ఓ
మధురాలా కవితలై, ఓ ఓ
తుది చేరని కబురుల
కథాకళి కదిలెను
రేపటి కధలకు మున్నుడిలా

తన నవ్వులలో తళుకు తళుకు
తన చెంపలలో చమకు చమకు
తన మువ్వలలో ఝనకు ఝనకు
సరికొత్త కలా

డుం డక డుం డక డుం డక డుండుం
డుం డక డుం డక డుం డక డుం
డుం డక డుం డక డుం డక డుండుం
డుం డక డుం డక డుం డక డుం

ఇదిలా అని ఎవరైనా
చూపనేలేదు కంటికి
అదెలాగో తనకైనా
తోచనే లేదు మాటకి
ఇపుడిపుడే మనసైన
రేపు దొరికింది చూపుకి

సంతోషం సరసన, ఓ ఓ
సంకోచం మెరిసిన, ఓ ఓ
ఆ రెంటికి మించిన పరవశ లీలను
కాదని అనగలమా

ఆ, కథ కదిలే వరుసనా, ఓ ఓ
తమ ఎదలేం తడిసినా, ఓ ఓ
గత జన్మల పొడవున
దాచిన దాహము ఇపుడే
వీరికి పరిచయమా

తన నవ్వులలో తళుకు తళుకు
తన చెంపలలో చమకు చమకు
తన మువ్వలలో ఝనకు ఝనకు
సరికొత్త కలా (2)

డుం డక డుం డక డుం డక డుండుం
డుం డక డుం డక డుం డక డుం
డుం డక డుం డక డుం డక డుండుం
డుం డక డుం డక డుం డక డుం




ప్రణవాలయ పాట సాహిత్యం

 
చిత్రం: శ్యామ్ సింగరాయ్ (2021)
సంగీతం: మిక్కీ జే మేయర్
సాహిత్యం: సిరివెన్నెల 
గానం:  అనురాగ్ కులకర్ణి

ప్రణవాలయ పాహి
పరిపాలయ పరమేశి
కమలాలయ శ్రీదేవీ
కురిపించవే కరుణాంబురాశి

ధీంతాన ధీం ధీం తాన, జతులతో
ప్రాణమే నాట్యం చేసే, గతములతో
నామషతమ్ముల నథులతో, ఓ ఓ
నాపైన నీ చూపు ఆపేలా, ఆ ఆఆ

శరణంటినే జనని నాధ వినోదిని
భువన పాలినివే, ఏ ఏఏ
అనాథ రక్షణ నీ విధి కాదటే
మొరవిని చేరవటే
ఏ ఏఏ ఏఏ ఏఏ ఏ ఆ ఆఆ ఆఆ ఆ

నా ఆలోచనే నిరంతరం
నీకు నివాళినివ్వాలనీ
నాలో ఆవేదనే
నువ్వాధరించేలా నివేదనవ్వాలనీ

దేహమునే కోవెలగా… నిన్ను కొలువుంచా
జీవముతో భావముతో… సేవలు చేశా
ప్రతి ఋతువు… ప్రతి కృతువు
నీవని ఎంచా… శతతము నీ స్మరణే నే

ధీంతాన ధీం ధీం తాన, జతులతో
ప్రాణమే నాట్యం చేసే, గతములతో
నామషతమ్ముల నథులతో, ఓ ఓ
నాపైన నీ చూపు ఆపేలా, ఆ ఆఆ

శరణంటినే జనని నాధ వినోదిని
భువన పాలినివే, ఏ ఏఏ
అనాథ రక్షణ నీ విధి కాదటే
మొరవిని చేరవటే
ఏ ఏఏ ఏఏ ఏఏ ఏ ఆ ఆఆ ఆఆ ఆ

దింతాన దింతాన తోం
దింతాన దింతాన తోం
దింతాన దింతాన తోం



తార పాట సాహిత్యం

 
చిత్రం: శ్యామ్ సింగరాయ్ (2021)
సంగీతం: మిక్కీ జే మేయర్
సాహిత్యం: కార్తీక్
గానం:  కృష్ణకాంత్

ఓ నా న్నా న్న… ఓ నా న్నా న్నాయె
ఓ నా న్నా న్న… ఓ నా న్నా న్న
ఓ నా న్నా న్న… ఓ నా న్నా న్నాయె
ఓ నా న్నా న్న న… ఓ నా న్నా న్న

తెర పైన కదిలేలా
కధలేవో మొదలే

తార నింగి దిగి నేలా
కింద నడిచేలా వచ్చేనిలా
బాల కోపాల బాలా
వేషాలు నేడే వేసేనుగా

చూస్తూనే ఆ మతే పోయే ప్రతిదీ ఇక
క్షణాల్లోనే పొగ చేసే ప్రతి సృష్టిగా
మాయ కాదా కంటినే మించిన కన్నురా

ఈ లెన్సుల్లో లైఫునే చూడరా
అన్ని మెరుగై చూపదా
నీడే మెరుపై చూపదా

ఆఆ, ఆ వింతేంటో తీస్తుంటే
కష్టాలే ఎన్నున్నా
ఇష్టంగా తోచేనా, ఆ హా

ఓ నా న్నా న్న… ఓ నా న్నా న్నాయె
ఓ నా న్నా న్న… ఓ నా న్నా న్న
ఓ నా న్నా న్న… ఓ నా న్నా న్నాయె
ఓ నా న్నా న్న న… ఓ నా న్నా న్న

కలలను కంటే… ముగిసిక పోదు
పరుగులతో అవి… నిజమై రావు
కలతలు రానీ… సమయము పోనీ
భరించరా వెన్నే చూపక
నీ కల తీరక చస్తుందా

ఆ రంగులే రెండే కదా
ఆ ఎండే మార్చదా ఏడుగా
రంగేయరా నీ ఆశకే
ఆ వెండి గోడను చేరగా
ఎంతెంత దూరాన గమ్యమే ఉన్నా
నేను సాధించుకోనా..!

ఈ లెన్సుల్లో లైఫునే చూడరా
అన్ని మెరుగై చూపదా
నీడే మెరుపై చూపదా

ఆఆ, ఆ వింతేంటో తీస్తుంటే
కష్టాలే ఎన్నున్నా
ఇష్టంగా తోచేనా, ఆ హా

ఓ నా న్నా న్న… ఓ నా న్నా న్నాయె
ఓ నా న్నా న్న… ఓ నా న్నా న్న
ఓ నా న్నా న్న… ఓ నా న్నా న్నాయె
ఓ నా న్నా న్న న… ఓ నా న్నా న్న

Palli Balakrishna Thursday, December 23, 2021
Uppena (2021)




చిత్రం: ఉప్పెన (2021)
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
సాహిత్యం: శ్రీమణి , రకీబ్ అలమ్
గానం: జేవేద్ అలీ
నటీనటులు: వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి, విజయ్ సేతుపతి
దర్శకత్వం: బుచ్చిబాబు సాన
నిర్మాతలు: సుకుమార్, వై. రవిశంకర్, వై. నవీన్
విడుదల తేది: 12.02.2021




Songs List:





నీ కన్ను నీలి సముద్రం పాట సాహిత్యం

చిత్రం: ఉప్పెన (2021)
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
సాహిత్యం: శ్రీమణి , రకీబ్ అలమ్
గానం: జేవేద్ అలీ





ఇష్క్ షిఫాయా ఇష్క్ షిఫాయా
ఇష్క్ పర్దే మే కిసి కీ ఆంఖో మే లబ్రేజ్ హై
ఇష్క్ షిఫాయా మెహబూబ్ క సాయా
ఇష్క్ మల్ మల్ మే యః లిప్త హువా తెబ్రేజ్ హై

ఇష్క్ హై పీర్ పాయంబార్
అర్రే ఇష్క్, అలీ దమ్ మస్త్ కలందర్
ఇష్క్, హై పీర్ పాయంబార్
అర్రే ఇష్క్, అలీ దమ్ మస్త్ కలందర్
ఇష్క్, కబీ ఖత్రా హై
అర్రే ఇష్క్, కబీ హై ఏక్ సమందర్
ఇష్క్ కబీ ఖత్రా హై
అర్రే ఇష్క్, కబీ హై ఏక్ సమందర్

నీ కన్ను నీలి సముద్రం
నా మనసేమో అందుల్లో పడవ ప్రయాణం 

నీ కన్ను నీలి సముద్రం
నా మనసేమో అందుల్లో పడవ ప్రయాణం 

నీ నవ్వు ముత్యాలహారం
నన్ను తీరానికి లాగేటి దారం దారం 

నీ నవ్వు ముత్యాలహారం
నన్ను తీరానికి లాగేటి దారం దారం

నల్లనైన ముంగురులే - ముంగురులే
అల్లరేదో రేపాయిలే - రేపాయిలే
నువ్వుతప్ప నాకింకొ లోకాన్ని లేకుండా కప్పాయిలే
ఘల్లుమంటే నీ గాజులే - నీ గాజులే
ఝల్లుమంది నా ప్రాణమే - నా ప్రాణమే
అల్లుకుంది వానజల్లులా ప్రేమే...

నీ కన్ను నీలి సముద్రం
నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం

కోరస్: నీ కన్ను నీలి సముద్రం
నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం

నీ నవ్వు ముత్యాలహారం 
నన్ను తీరానికి లాగేటి దారం దారం

కోరస్: నీ నవ్వు ముత్యాలహారం 
నన్ను తీరానికి లాగేటి దారం దారం

చరణం: 1
చిన్ని ఇసుకగూడు కట్టినా... నీ పేరు రాసి పెట్టినా
దాన్ని చెరిపేటి కెరటాలు పుట్టలేదు తెలుసా...
ఆ గోరువంక పక్కన...రామ చిలుక ఎంత చక్కన
అంతకంటే చక్కనంట నువ్వుంటే నాపక్కనా.....
అప్పు అడిగానే... కొత్త కొత్త మాటలనీ
తప్పుకున్నాయే...భూమి పైన భాషలన్నీ...
చెప్ప..లే..మ..న్నా..యే అక్షరాల్లో ప్రేమనీ...

నీ కన్ను నీలి సముద్రం
నా మనసేమో అందుల్లో పడవ ప్రయాణం

కోరస్: నీ కన్ను నీలిసముద్రం
నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం

నీ నవ్వు ముత్యాలహారం
నన్ను తీరానికి లాగేటి దారం దారం

కోరస్: నీ నవ్వు ముత్యాలహారం
నన్ను తీరానికి లాగేటి దారం దారం

చరణం: 2
నీ అందమంత ఉప్పెన... నన్ను ముంచినాది చప్పున
ఎంత ముంచేసినా తేలే బంతిని నేనేననా..
చుట్టూ ఎంత చప్పుడొచ్చినా....నీ సవ్వడేదో చెప్పనా
ఎంతదాచేసినా నిన్ను జల్లడేసి పట్టనా...
నీ ఊహలే ఊపిరైన పిచ్చోడిని...
నీ ఊపిరే ప్రాణమైన పిల్లాడిని...
నీ ప్రే..మా వలలో చిక్కుకున్న చేపనీ....

ఇష్క్ హై పీర్ పాయంబార్
అర్రే ఇష్క్, అలీ దమ్ మస్త్ కలందర్
ఇష్క్ హై పీర్ పాయంబార్
అర్రే ఇష్క్, అలీ దమ్ మస్త్ కలందర్
ఇష్క్, కబీ ఖత్రా హై
అర్రే ఇష్క్, కబీ హై ఏక్ సమందర్
ఇష్క్ కబీ ఖత్రా హై
అర్రే ఇష్క్, కబీ హై ఏక్ సమందర్

ఇష్క్ షిఫాయా ఇష్క్ షిఫాయా
ఇష్క్ పర్దే మే కిసి కీ ఆంఖో మే లబ్రేజ్ హై
ఇష్క్ షిఫాయా మెహబూబ్ క సాయా
ఇష్క్ మల్ మల్ మే యః లిప్త హువా తెబ్రేజ్ హై





ధక్.. ధక్.. ధక్.. పాట సాహిత్యం

చిత్రం: ఉప్పెన (2021)
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
సాహిత్యం: చంద్రబోస్
గానం: శరత్ సంతోష్, హరిప్రియ





నువ్వు నేను ఎదురైతే ధక్.. ధక్.. ధక్..
మనసు మనసు దగ్గరయితే ధక్.. ధక్.. ధక్
ఆశలు అలలై పొంగుతుంటే ధక్.. ధక్.. ధక్
ఆకలి నిద్దుర మింగుతుంటే ధక్.. ధక్.. ధక్
ఊపిరి మొత్తం ఉప్పెనైతే ధక్..ధక్..ధక్..ధక్..ధక్

చూపుల పిలుపులు మోగుతుంటే ధక్.. ధక్.. ధక్
మాటలు గొంతులో ఆగుతుంటే ధక్.. ధక్.. ధక్
గుండెకు చెమటలు పడుతుంటే ధక్.. ధక్.. ధక్
ముందుకు వెనుకకు నెడుతుంటే ధక్.. ధక్.. ధక్
ఊపిరి మొత్తం ఉప్పెనైతే ధక్..ధక్..ధక్..ధక్..ధక్

చీటికి మాటికి గురుతోస్తే...
మిగతావన్నీ మరుపోస్తే...
కాలానికి ఇక పరుగోస్తే....
ఆలోచనలకు బరువస్తే...
ఊపిరి మొత్తం ఉప్పెనైతే ధక్..ధక్..ధక్..ధక్..ధక్




రంగులద్దుకున్నా తెల్ల రంగులౌదాం పాట సాహిత్యం

చిత్రం: ఉప్పెన (2021)
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
సాహిత్యం: శ్రీమణి
గానం: యాసిన్ నిజార్, హరిప్రియ




రంగులద్దుకున్నా తెల్ల రంగులౌదాం
పూలు కప్పుకున్నా కొమ్మలల్లే ఉందాం
ఆకు చాటుకున్నా పచ్చి పిందెలౌదాం
మట్టి లోపలున్నా జంట వేరులౌదాం

ఎవ్వరీ కంటి చూపు చేరలేని
ఎక్కడా మన జంట ఊసురాని
చోటున పద నువ్వు నేనుందాం

రంగులద్దుకున్నా తెల్ల రంగులౌదాం
పూలు కప్పుకున్నా కొమ్మలల్లే ఉందాం

తేనె పట్టులోన తీపి గుట్టు ఉందిలే
మన జట్టులోన ప్రేమ గుట్టుగుందిలే
వలలు తప్పించుకెళ్ళు మీనాల వైనాల
కొంటె కోణాలు తెలుసుకుందాం 
లోకాల చూపుల్ని ఎట్టా తప్పించుకెళ్ళాలో
కొత్త పాఠాలు నేర్చుకుందాం
అందరూ ఉన్న చోట ఇద్దరౌదాం
ఎవ్వరూ లేని చోట ఒక్క రౌదాం
ఏక్షణం విడివిడిగా లేమందాం

రంగులద్దుకున్నా తెల్ల రంగులౌదాం
పూలు కప్పుకున్నా కొమ్మలల్లే ఉందాం

మన ఊసుమోసే గాలిని మూట కడదాం
మన జాడ తెలిపే నేలనుపాతి పెడదాం
చూస్తున్న సూర్యుని తెచ్చి 
లాంతర్లో దీపాన్ని చేసి చూరుకేలాడదీద్దాం
సాక్ష్యంగా సంద్రాలు ఉంటే
దిగుడు బావిలో దాచి మూత పెడదాం
నేనిలా నీతో ఉండడం కోసం
చేయని ఈ చిన్నపాటి మోసం
నేరమేంకాదే ఇది మన కోసం

రాయిలోన శిల్పం దాగి ఉండునంటా
శిల్పి ఎదురైతే బయటపడునంటా
అద్దమెక్కడున్నా ఆవైపు వెళ్ళకంటా
నీలో ఉన్న నేనే బయటపడిపోతా
పాలలో ఉన్న నీటి బొట్టులాగా
నీళ్లలో దాగి ఉన్న మెట్టులాగా
నీనిలా నీ లోపల దాక్కుంటా

హైలెస్సా హైలెస్సా హాయ్ 
హైలెస్సా హైలెస్సా హాయ్
హైలెస్సా హైలెస్సా హాయ్
హైలెస్సా హైలెస్సా హాయ్



జల జల జలపాతం నువ్వు పాట సాహిత్యం


చిత్రం: ఉప్పెన (2021)
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
సాహిత్యం: శ్రీమణి
గానం: జస్ప్రీత్ జస్, శ్రేయా ఘోషల్



జల జల జలపాతం నువ్వు
సెల సెల సెలయేరుని నేను
సలసల నువు తాకితే నన్ను
పొంగే వరదై పోతాను

చలి చలి చలిగాలివి నువ్వు
చిరు చిరు చిరు అలనే నేను
చర చర నువ్వళ్ళితే నన్ను
ఎగసే కెరటాన్నౌతాను

హే మన జంట వైపు 
జాబిలమ్మ తొంగి చూసెనే
హే ఇటు చూడకంటు 
మబ్బు రెమ్మ దాన్ని మూసెనే

ఏ నీటి చెమ్మ తీర్చలేని దాహమేసెనే హా...

జల జల జలపాతం నువ్వు
సెల సెల సెలయేరుని నేను
సలసల నువు తాకితే నన్ను
పొంగే వరదై పోతాను

చలి చలి చలిగాలివి నువ్వు
చిరు చిరు చిరు అలనే నేను
చర చర నువ్వళ్ళితే నన్ను
ఎగసే కెరటాన్నౌతాను

సముద్రమంత ప్రేమ ముత్యమంత మనసు
ఎలాగ దాగి ఉంటుంది లోపలా
ఆకాశమంత ప్రణయం
చుక్కలాంటి హృదయం
ఇలాగ బయట పడుతోంది ఈ వేళ హా
నడి ఎడారిలాంటి ప్రాణం
తడి మేఘానితో ప్రయాణం
ఇక నా నుంచి నిన్ను
నీ నుంచి నన్ను, తెంచలేదు లోకం

జల జల జలపాతం నువ్వు
సెల సెల సెలయేరుని నేను
సలసల నువు తాకితే నన్ను
పొంగే వరదై పోతాను

ఇలాంటి తీపి రోజు రాదు రాదు రోజు
ఎలాగ వెళ్లిపోకుండా ఆపడం
ఇలాంటి వాన జల్లు తడపదంట ఒళ్ళు
ఎలాగ దీన్ని గుండెల్లో దాచడం
ఎప్పుడూ లేనిదీ ఏకాంతం
ఎక్కడా లేని ఏదో ప్రశాంతం
మరి నాలోన నువ్వు నీలోన నేను
మనకు మనమే సొంతం

జల జల జలపాతం నువ్వు
సెల సెల సెలయేరుని నేను
సలసల నువు తాకితే నన్ను
పొంగే వరదై పోతాను

చలి చలి చలిగాలివి నువ్వు
చిరు చిరు చిరు అలనే నేను
చర చర నువ్వళ్ళితే నన్ను
ఎగసే కెరటాన్నౌతాను




ఈశ్వరా పరమేశ్వరా పాట సాహిత్యం

చిత్రం: ఉప్పెన (2021)
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
సాహిత్యం: చంద్రబోస్
గానం: దేవిశ్రీ ప్రసాద్




ఈశ్వరా పరమేశ్వరా
చూడరా ఇటు చూడరా
రెండు కన్నుల మనిషి బ్రతుకును
గుండె కన్నుతో చూడరా
ఎదుట పడనీ వేదనలను
నుదుటి కన్నుతో చూడరా
ఈశ్వరా పరమేశ్వరా
చూడరా ఇటు చూడరా

దారి ఏదో, తీరమేదో
గమనమేదో, గమ్యమేదో
లేత ప్రేమల లోతు ఎంతో
లేని కన్నుతో చూడరా

చీకటేదో, వెలుతురేదో
మంచు ఏదో, మంట ఏదో
లోకమెరుగని ప్రేమకథని
లోని కన్నుతో చూడరా

ఈశ్వరా పరమేశ్వరా
చూడరా ఇటు చూడరా
ఈశ్వరా పరమేశ్వరా
చూడరా ఇటు చూడరా

నువ్వు రాసిన రాతలిచ్చట
మార్చుతూ ఏమార్చుతుంటే
నేల పైన వింతలన్నీ
నింగి కన్నుతో చూడరా

ఈశ్వరా పరమేశ్వరా
చూడరా ఇటు చూడరా
మసకబారిన కంటిపాపకి
ముసుగు తీసే వెలుగులాగ
కాలమడిగిన కఠిన ప్రశ్నకి
బదులువై ఎదురవ్వరా

ఈశ్వరా పరమేశ్వరా
చూడరా ఇటు చూడరా
ఈశ్వరా పరమేశ్వరా
చూడరా ఇటు చూడరా




సంద్రంలోన నీరంతా పాట సాహిత్యం

చిత్రం: ఉప్పెన (2021)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: దేవి శ్రీ ప్రసాద్
గానం: సీన్ రోల్డెన్




సంద్రంలోన నీరంతా కన్నీరాయేనే
గుండెల్లోనా ప్రతిమూల నీ గొంతే మోగేనే
ఉప్పు గాలి నిప్పై మారి నన్నే కాల్చేనే
ఈ సుడిగాలి నిన్నెత్తుకెళ్లి నన్నే కూల్చేనే

హే... ఏలే ఏలే ఏలే లే లే... ఏలే ఏలే లే

సంద్రంలోన నీరంతా కన్నీరాయేనే
గుండెల్లోనా ప్రతిమూల నీ గొంతే మోగేనే
ఉప్పు గాలి నిప్పై మారి నన్నే కాల్చేనే
ఈ సుడిగాలి నిన్నెత్తుకెళ్లి నన్నే కూల్చేనే

హే... ఏలే ఏలే ఏలే లే లే... ఏలే ఏలే లే

గాలిలో నీ మాటే అలలపై నీ పాటే
ఎంత గాలిస్తున్న నువ్వు లేవే
అమ్మవై ప్రతి ముద్ద తినిపించి పెంచావే
ప్రేమ కోరే ఆకలున్న నువ్వు రావే
ఎన్నో మాటలు ఇంకా నీతో చెప్పాలని
దాచుంచానే వాటికేమీ చెప్పేది
ఎన్నో రంగులు పూసేటి నీ చిరునవ్వుని
మళ్ళి నేనే ఎపుడు చూసేది
నిజమే చెప్పాలి అని నాకు చెప్పే నువ్వే
ఎన్నడు నాతో ఉంటానని అబద్దం చెప్పావే

సంద్రంలోన నీరంతా కన్నీరాయేనే
గుండెల్లోనా ప్రతిమూల నీ గొంతే మోగేనే
ఉప్పు గాలి నిప్పై మారి నన్నే కాల్చేనే
ఈ సుడిగాలి నిన్నెత్తుకెళ్లి నన్నే కూల్చేనే

హే... ఏలే ఏలే ఏలే లే లే... ఏలే ఏలే లే
హే... ఏలే ఏలే ఏలే లే లే... ఏలే ఏలే లే



నిన్నే నా నిన్నే పాట సాహిత్యం


చిత్రం: ఉప్పెన (2021)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: శ్రీమణి
గానం: సమీరా భరద్వాజ్




నిన్నే నా నిన్నే
వెతికినే నా కన్నే
నన్నే నీ నన్నే
మరిచావే నాతోనే

వస్తూ పొతున్నాడు
ప్రతిరోజు సూరీడు
నిన్నే తెస్తాడని చూస్తున్నా
వినిపించే ప్రతి మాటా
సడి చేసే ప్రతి పాటా
నీ ఊసేమోనని వింటున్నా

నిన్నే నా నిన్నే
వెతికిందే నా కన్నే
నన్నే నీ నన్నే
మరిచావే నాతోనే




యే సిలక సిలక గోరింకా పాట సాహిత్యం

చిత్రం: ఉప్పెన (2021)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: శ్రీమణి
గానం: కైలాష్ ఖేర్




యే సిలక సిలక గోరింకా
ఎగిరే ఎగిరే ఎందాక
దారి లేని నీ ఉరక
ఈ దరికా మరి ఆ దరికా

హే సినుకా సినుకా జారింక
మేఘం నీదే కాదింకా
సొంత రెక్కలు కట్టాకా
నీదారో ఎదో నీదింకా

సెలయేరుందో సుడిగాలుందో వెళ్ళే దారిలో
చిరు జల్లుందో జడివానుందో ఈ మలుపులో
ఇచ్చే పూలో గుచ్చే ముల్లో వాలే వాకిట్లో
ఎం దాగుందో ఏమో ప్రేమ నీ గుప్పిట్లో

హే సిలక సిలక గోరింకా
నీలాకాశం నీదింకా
రెక్క విప్పి ఎగురింకా
నిన్నే ఆపేదేవరింకా

యే సినుకా సినుకా జారింక
వాగు వంక నీదింకా
అలుపు సొలుపు లేదింకా
దొరికిందిగా దారింకా

సెలయేరల్లె పొంగి పొర్లే ప్రేమే సంతోషం
దాని అట్టే పెట్టు నీ గుండెల్లోనే కలకాలం
పొలిమేరలే లేనేలేని ప్రేమే నీ సొంతం
ఇక నిన్నే వీడి పోనే పోదు ఈ వసంతం

యే సిలక సిలక గోరింకా
నీలాకాశం నీదింకా
రెక్కే విప్పి ఎగురింకా
నిన్నే ఆపేదేవరింకా

హే సినుకా సినుకా జారింక
వాగు వంక నీదింకా
అలుపు సొలుపు లేదింకా
దొరికిందిగా దారింకా

యేలే లమ్మయే హా

Palli Balakrishna Sunday, November 1, 2020

Most Recent

Default