చిత్రం: ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి (2022) సంగీతం: వివేక్ సాగర్ నటీనటులు: సుదీర్ బాబు, కృతి శెట్టి దర్శకత్వం: మోహనకృష్ణ ఇంద్రగంటి నిర్మాత: మహేంద్ర బాబు, కిరణ్ బల్లపల్లి విడుదల తేది: 2022
Songs List:
కొత్త కొత్తగా ఉన్నా పాట సాహిత్యం
చిత్రం: ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి (2022) సంగీతం: వివేక్ సాగర్ సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి గానం: చైత్ర అంబడిపూడి, అభయ్ జోద్పుర్కర్ హా, అల్లంత దూరంగ నువ్వు నీ కన్ను నన్నే చూస్తుంటే ఏం చెయ్యాలో హా, రవ్వంత గారంగా నాలో నీ నన్ను మాటాడిస్తుంటే ఏం చెప్పాలో ఆ, అనగనగా మనవి విను ముసిముసి ముక్తసరి నవ్వుతో నిలకడగా అవును అను తెరలు విడే… పలుకు సిరితో కొత్త కొత్తగా ఉన్నా కొంచెం బావుందే పోను పోను ఇంకొంచెం బావుండేలా ఉందే ఆ, కొత్త కొత్తగా ఉన్నా కొంచెం బావుందే పోను పోను ఇంకొంచెం బావుండేలా ఉందే హా, అల్లంత దూరంగ నువ్వు నీ కన్ను నన్నే చూస్తుంటే… ఏం చెయ్యాలో హా, రవ్వంత గారంగా… నాలో నీ నన్ను మాటాడిస్తుంటే… ఏం చెప్పాలో హో ఆ, తలపు దాకా వచ్చాలే తగని సిగ్గు చాల్లే తగిన ఖాళీ పూరిస్తాలే హా, చనువు కొంచం పెంచాలే మొదటికన్నా మేలే కుదిరినంతా కులాసాలే హా నిను కననీ నిను కననీ కదలికకు తెలవారదే హో, నిదురవనీ ప్రతి కలలో నీ ఊసే తారాడుతోందే కొత్త కొత్తగా ఉన్నా కొంచెం బావుందే పోను పోను ఇంకొంచెం బావుండేలా ఉందే ఆ, కొత్త కొత్తగా ఉన్నా కొంచెం బావుందే పోను పోను ఇంకొంచెం బావుండేలా ఉందే సమయమెల్లా సాగిందో గమనమైనా లేదే తమరి మాయేగా ఇదంతా ఓ ఓ, పయనమెల్లా పండిందో మరపురానే రాదే మధురమాయే సంగతంతా ఆ ఆ, ఎద గదిలో ఓ ఓ ఎద గదిలో కిరణమయే తరుణం ఇదే ఇరువురిలో చలనమిలా ప్రేమన్న పేరందుకున్నదే హా, కొత్త కొత్తగా ఉన్నా… కొంచెం బావుందే ఆ ఆ, పోను పోను ఇంకొంచెం బావుండేలా ఉందే హో, చెలిమి కల చెరిసగమే చిటికెన వేలి చివరంచులో సఖిలదళ విడివడని ముడిపడవే ప్రియతమ ముడితో
No comments
Post a Comment