Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "K. S. Rama Rao"
Tej I Love U (2018)

చిత్రం: తేజ్  I Love You (2018)
సంగీతం: గోపి సుందర్
సాహిత్యం: సాహితి
గానం: హరిచరన్, చిన్మయి
నటీనటులు: సాయిధరమ్ తేజ్, అనుపమ పరమేశ్వరన్
దర్శకత్వం: ఎ. కరుణాకరన్
నిర్మాత: కె.ఎస్. రామారావు
విడుదల తేది: 2018

అందమైన చందమామ నీవేనా
నిన్ను నేను అందుకుంది నిజమేనా
నువు తోడుంటే ఓ లాల
ఈ లైఫంతా ఉయ్యాల
హగ్ చేయవే ఓ పిల్లా
వైఫై లా నాన్నిల్లా

అందమైన చందమామ నీవేనా
నిన్ను నేను అందుకుంది నిజమేనా

పరుగిడు ఈ కాలాన
అడుగులు దరికాలేక
మనమెవరో ఏమో ఎందాక
పరవశమే ప్రతి రాక
చూపి ఓ శుభలేఖ
మన మధిలో ప్రేమే కలిగాక
మన ఇద్దరి పైనే విరిపూలు చెల్లింది పున్నాగా
నీ ముద్దులకోసం నే వేచి ఉన్నా

అందమైన చందమామ నీవేనా
నిన్ను నేను అందుకుంది నిజమేనా
నువు తోడుంటే ఓ లాల
ఈ లైఫంతా ఉయ్యాల
హగ్ చేయవే ఓ పిల్లా
వైఫై లా నాన్నిల్లా

ఓ అరవిరిసే జాజుల్లో కలగలిసే మోజుల్లో
అలలెగసే ఆసే ప్రేమంటా
మధి మురిసే వలపుల్లో మైమరచే మెరుపుల్లో
మెలితిరిగే వయసా రమ్మంటా
పడకింటి కొచ్చి నువ్వు పాల మురిపాలు కోరంగా
నడుమిచ్చు కుంటా వయ్యారిలాగ

అందమైన చందమామ నీవేనా
నిన్ను నేను అందుకుంది నిజమేనా
నువు తోడుంటే ఓ లాల
ఈ లైఫంతా ఉయ్యాల
హగ్ చేయవే ఓ పిల్లా
వైఫై లా నాన్నిల్లా

అందమైన చందమామ నీవేనా
నిన్ను నేను అందుకుంది నిజమేనా (2)

Palli Balakrishna Wednesday, July 11, 2018
Marana Mrudangam (1988)



చిత్రం: మరణ మృదంగం (1988)
సంగీతం: ఇళయరాజా
నటీనటులు: చిరంజీవి, రాధ, సుహాసిని
దర్శకత్వం: ఎ.కోదండరామిరెడ్డి
నిర్మాత: కె.యస్.రామారావు
విడుదల తేది: 04.08.1988



Songs List:



గొడవే గొడవమ్మ పాట సాహిత్యం

 
చిత్రం: మరణ మృదంగం (1988)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, చిత్ర

పల్లవి:
గొడవే గొడవమ్మ చేయి పట్టే చిలిపివాడమ్మ...
గొడవే లేదమ్మా దారి పట్టి పొదకే పదవమ్మ...
అడుగు అడిగేది అడుగు... వయసే మిడిసి పడుతుంటే...
తళుకే సుడులే తిరిగి ఒరిగి ఒదిగి పోతుంటే...
తడిసి మెడిసి మెరిసే సొగసు ఉలికి పడుతు

గొడవే గొడవమ్మ చేయి పట్టే చిలిపివాడమ్మ
గొడవే లేదమ్మా దారి పట్టి పొదకే పదవమ్మ 

చరణం: 1
మొదటే చలి గాలి సలహాలు వింటే
ముసిరే మోహాలు దాహాలు పెంచే
కసిగా నీ చూపు నా దుంప తెంచే
అసలే నీ వంపు నా కొంప ముంచే

ముదిరే వలుపులో నిదురే సేవంట
కుదిరే మనువుల్లో ఎదురే నే ఉంటా
బెదిరే కళ్ళలో కధలే నే వింటా
అదిరే గుండెలో శృతులే ముద్దంటా
దోబోచులాడేటి అందమొకటి ఉంది
దోచేసుకోలేని బంధమొకటి అంది
పదుకో రగిలే పరువం సిగలో విరిసే మరువం
పగలే పెరిగే బిడియం కలిపి చెరిగే ప్రణయం

గొడవే గొడవమ్మ చేయి పట్టే చిలిపివాడమ్మ...
గొడవే లేదమ్మా దారి పట్టి పొదకే పదవమ్మ..
అడుగు అడిగేది అడుగు వయసే మిడిసి పడుతుంటే
తళుకే సుడులే తిరిగి ఒరిగి ఒదిగి పోతుంటే
తడిసి మెడిసి మెరిసే సొగసుఉలికి పడుతు

గొడవే గోడవమ్మ చేయి పట్టే చిలిపివాడమ్మ
గొడవే లేదమ్మా దారి పట్టి పోదకే పదవమ్మ

చరణం: 2
ఇప్పుడే తెలిసింది ఈ ప్రేమ ఘాటు
పడితే తెలిసింది తొలిప్రేమ కాటు
కునుకే లేకున్నా ఈ నైట్ బీటు
ఎప్పుడో మార్చింది నా హార్ట్ బీటు

పిలిచే వయస్సులతో జరిగే పేరంటం
మొలిచే సొగసులతో పెరిగే ఆరాటం
చలికే వొళ్ళంతా పలికే సంగీతం
సరదా పొద్దులోకరిగే సాయంత్రం

నీ ఎడారి నిండా ఉదక మండలాలు
నీటి ధార దాటే మౌన పంజరాలు
తనువే తగిలే హృదయం కనులై విరిసే ఉదయం
జతగా దొరికే సమయం ఒకటైపోయే ఉభయం

గొడవే గొడవమ్మ చేయి పట్టే చిలిపివాడమ్మ...
గొడవే లేదమ్మా దారి పట్టి పొదకే పదవమ్మ..
అడుగు అడిగేది అడుగు వయసే మిడిసి పడుతుంటే
తళుకే సుడులే తిరిగి ఒరిగి ఒదిగి పోతుంటే
తడిసి మెడిసి మెరిసే సొగసు ఉలికి పడుతు

గొడవే గోడవమ్మ చేయి పట్టే చిలిపివాడమ్మ
గొడవే లేదమ్మా దారి పట్టి పోదకే పదవమ్మ





కొక్కర పిక్కర చక్ పాట సాహిత్యం

 
చిత్రం: మరణ మృదంగం (1988)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వేటూరి
గానం:  యస్.పి.బాలు

పల్లవి :
హూ కొక్కర పిక్కర చక్ కుప్పుకర్ చక్
కుక్కుకర్ చక్ కుప్పుకర్ చక్ కుప్పుకర్ తక్
యుగాక్కర్ కొక్కర పిక్కర తక్కర కక్కర కక్కర
తిక్కర ధిక్కార కొక్కర కొక్కర పిక్కర తక్కర
కక్కర కక్కర తక్కర పిక్కర
కోక్కరో కో కో కో కో కో కో
కొక్కర కో కొక్కర కో కో కో కో కో కో కో
కొక్కర కో కో కో కో కో కో కో
కోక్కరో కో కో కో జిం జిం జిం జిం జిం జిం
జిం జిం జిం జిం జిం జిం

హే...  జంగిలి జిమ జిమ జాకెట్ చిమ చిమ
సందడి గుమ గుమ సంగతి యమ యమ ఓ.. ఆహ... ఆ..
మిస్సులు మిల మిల కిస్సులు కిల కిల
డ్రెస్సులు జల జల yes అని పద పద ఓ... ఆహ్... ఏ
అరె సిగ్గులు విడిచిన లంగరు సింగడు వీడే ఇడియట్
దిక్కులు కట్టిన దేవుడు లొంగడు లేవే...  you.....
అం భం భం మేడా రంభం నీదే కుంభం నాదే లాభం

హే జంగిలి జిమ జిమ జాకెట్ చిమ చిమ
సందడి గుమ గుమ సంగతి యమ యమ ఓ....  ఛీ పో
మిస్సులు మిల మిల కిస్సులు కిల కిల
డ్రెస్సులు జల జల yes అని పద పద ఓ ఓ ఓ...  ఆహ్...  గెట్ లాస్ట్ 

చరణం: 1
చెట్టు పుట్ట పిట్ట బట్ట కట్టుకోవులే
పుట్టేనాడు గిట్టేనాడు గుడ్డే లేదులే
చెట్టు పుట్ట పిట్ట బట్ట కట్టుకోవు లే
పుట్టేనాడు గిట్టేనాడు గుడ్డే లేదులే
పేచి లేని గోచి పెట్టె యోగి వేమన
పూచి నాదే డంగై పోకు లింగు లిటుకుమ్మా
ఆనాడు శ్రీకృష్ణుడే చీరెత్తుకేల్లేడులే...  షట్ అప్
ఈనాటి ఓ భామలో సిగ్గు ఎత్తుకేల్లావ్ లే...  you...  you
అందం చందం పంతం బంధం అన్ని దోస్తలే

జంగిలి జిమ జిమ జాకెట్ చిమ చిమ
సందడి గుమ గుమ సంగతి యమ యమ ఓ ఆహ ఆ..
అరె మిస్సులు మిల మిల కిస్సులు కిల కిల
డ్రెస్సులు జల జల yes అని పద పద ఓ ఆహ్..  Get away
అరె సిగ్గులు విడిచిన లంగరు సింగడు వీడే
దిక్కులు కట్టిన దేవుడు లొంగడు లేవే
అం భం భం మేడా రంభం నీదే కుంభం నాదే లాభం

హే జంగిలి జిమ జిమ జాకెట్ చిమ చిమ
సందడి గుమ గుమ సంగతి యమ యమ ఓ ఓ
మిస్సులు మిల మిల కిస్సులు కిల కిల
డ్రెస్సులు జల జల yes అని పద పద ఓ ఆహ్ 

చరణం: 2
కావాలంటే చూపిస్తా లే కండల్లో కసి
వద్దుంటున్నా వడ్డిస్తాలే కౌగట్లిలో రుచి
కావాలంటే చూపిస్తా లే కండల్లో కసి
వద్దుంటున్నా వడ్డిస్తాలే కౌగట్లిలో రుచి
21st సెంచురీని నేనే కొట్టేస్తా
చంటి చిట్టి పొట్టి అంటే ముద్దే పెట్టేస్తా ఛీ పాడు
ఏ వీధి నాట్యాలలో నేను ఆడుతుననులే యు నాటి
నా చాటు కావ్యాలకే నే పాడుతుననులే హౌ సిల్లి
పత్రం పుష్పం శిల్పం తల్పం లూటీ చేస్తాలే

జంగిలి జిమ జిమ జాకెట్ చిమ చిమ
సందడి గుమ గుమ సంగతి యమ యమ ఓ ఆహ ఆ..
అరే మిస్సులు మిల మిల కిస్సులు కిల కిల
డ్రెస్సులు జల జల yes అని పద పద ఓ ఆహ్
అరె సిగ్గులు విడిచిన లంగరు సింగడు వీడే.. వేవ్వే వేవ్వే
దిక్కులు కట్టిన దేవుడు లొంగడు లేవే ... ఛీఛీ ఛీపో
అం భం భం మేడా రంభం నీదే కుంభం..  నాదే లాభం

జంగిలి జిమ జిమ జాకెట్ చిమ చిమ
సందడి గుమ గుమ సంగతి యమ యమ...  ఓ ఓ
మిస్సులు మిల మిల కిస్సులు కిల కిల
డ్రెస్సులు జల జల yes అని పద పద ఓ ... ఆహ్




కరిగిపోయాను కర్పూర వీణలా పాట సాహిత్యం

 
చిత్రం: మరణ మృదంగం (1988)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, పి.సుశీల

పల్లవి:
కరిగిపోయాను కర్పూర వీణలా
కలిసిపోయాను నీ వంశధారలా
నా గుట్టు జారిపోతున్నా
నీ పట్టు చిక్కిపోతున్నా
నీ తీగ వణికిపోతున్నా
రాగాలు దోచుకుంటున్నా
కురిసిపోయింది ఓ సందె వెన్నెలా..
కలిసిపోయాక ఈ రెండు కన్నులా...

చరణం: 1
మనసుపడిన కథ తెలుసుగా
ప్రేమిస్తున్నా తొలిగా
పడుచు తపనలివి తెలుసుగా
మన్నిస్తున్నా చెలిగా
ఏ ఆశలో...  ఒకే ధ్యాసగా
ఏ ఊసులో ...  ఇలా బాసగా
అనురాగాలనే బంధాలనే పండించుకోమని తపించగా

కరిగిపోయాను కర్పూర వీణలా
కురిసిపోయింది ఓ సందె వెన్నెలా
నా గుట్టు జారిపోతున్నా
నీ పట్టు చిక్కిపోతున్నా
నీ తీగ వణికిపోతున్నా
రాగాలు దోచుకుంటున్నా
కరిగిపోయాను కర్పూర వీణలా
కురిసిపోయింది ఓ సందె వెన్నెలా

చరణం: 2
అసలు మతులు చెడి జంటగా
ఏమవుతామో తెలుసా
జతలుకలిసి మనమొంటిగా
ఏమైనా సరిగరిసా
ఏ కోరికో శృతే మించగా
ఈ ప్రేమలో ఇలా ఉంచగా
అధరాలెందుకో అందాలలో నీ ప్రేమలేఖలే లిఖించగా

కురిసిపోయింది ఓ సందె వెన్నెలా
కలిసిపోయాను నీ వంశధారలా
నీ తీగ వణికిపోతున్నా
రాగాలు దోచుకుంటున్నా
నా గుట్టు జారిపోతున్నా
నీ పట్టు చిక్కిపోతున్నా
కురిసిపోయింది ఓ సందె వెన్నెలా
కలిసిపోయాను నీ వంశధారలా



కొట్టండి తిట్టండి పాట సాహిత్యం

 
చిత్రం: మరణ మృదంగం (1988)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వేటూరి
గానం:  యస్.పి.బాలు, చిత్ర

పల్లవి:
కొట్టండి తిట్టండి గిల్లండి గిచ్చండి
కొయ్యండి చంపండి పిచ్చిండి నమ్మండి ప్రేమా..
కొట్టండి తిట్టండి గిల్లండి గిచ్చండి
కొయ్యండి చంపండి పుట్టాక పోదండీ ప్రేమా...
మహా కసి గున్నది భలే రుచిగుంటది
ఒకే గిలిగున్నది ఎదే ఒడి అంటది
ఈ ముద్దులో ముంచేసే ముద్దులే తడిపేసే కొట్టండి కొట్టండి

కొట్టండి తిట్టండి గిల్లండి గిచ్చండి
కొయ్యండి చంపండి పుట్టాక పోదండీ ప్రేమా...
కొట్టండి తిట్టండి గిల్లండి గిచ్చండి
కొయ్యండి చంపండి పిచ్చిండి నమ్మండి ప్రేమా...

చరణం: 1
కళ్ళు కళ్ళు కలిసాక కవ్వింతగా
ఒళ్ళు ఒళ్ళు కలిపేది ప్రేమా...
ఒళ్ళు ఒళ్ళు కలిసాక ఓ జంటగా
ఎద ఎద కలిపేది ప్రేమా....
శృంగార వీధిల్లోనా షికారు చేసి
ఊరోళ్ల నోళ్ళలోనా పుకారు వేసి
పరువమే హుషారు పుట్టించి
పరువునే బజారు కెక్కించి
మాటిస్తే వినుకోదు
లాలిస్తే పడుకోదు
చోటిస్తే సరిపోదు
ఊరిస్తే ఊర్కోదు
ఈ చిగురు వలుపు చిలిపి పిలుపు కొట్టండి కొట్టండి

కొట్టండి తిట్టండి గిల్లండి గిచ్చండి
కొయ్యండి చంపండి పుట్టాక పోదండీ ప్రేమా...
కొట్టండి తిట్టండి గిల్లండి గిచ్చండి
కొయ్యండి చంపండి పిచ్చిండి నమ్మండి ప్రేమా..
మహా కసి గున్నది భలే రుచిగుంటది
ఒకే గిలిగున్నది ఎదే ఒడి అంటది

కొట్టండి తిట్టండి గిల్లండి గిచ్చండి
కొయ్యండి చంపండి పిచ్చిండి నమ్మండి ప్రేమా..
కొట్టండి తిట్టండి గిల్లండి గిచ్చండి
కొయ్యండి చంపండి పుట్టాక పోదండీ ప్రేమా...

చరణం: 2
మళ్లీ మళ్లీ అంటుంది మారాముగా
ఒల్లోకి వోచి తాకుతుంది ప్రేమా..
తుళ్ళి తుళ్ళి పడుతోంది మర్యాదగా
చెల్లించేయ్ ఆ కాస్త ప్రేమా..

మంచాల అంచుల్లోన మకాము చేసి
మందార గంధాలు ఎన్నో మలాము వేసి
వయస్సుని వసంత మాడించే
మనస్సులో తుళ్ళింత పుట్టించే
చూపుల్తో శ్రుతి కాదు
మాటల్తో మతి రాదు
ముద్దుల్తో సరి కాదు
ముట్టందే చలి పోదు
ఈ మనసు మధన తనువు తపన కొట్టండి కొట్టండి

కొట్టండి తిట్టండి గిల్లండి గిచ్చండి
కొయ్యండి చంపండి పిచ్చిండి నమ్మండి ప్రేమా..
కొట్టండి తిట్టండి గిల్లండి గిచ్చండి
కొయ్యండి చంపండి పుట్టాక పోదండీ ప్రేమా...

మహా కసి గున్నది భలే రుచిగుంటది
ఒకే గిలిగున్నది ఎదే ఒడి అంటది
ఈ ముద్దులో ముంచేసే ముద్దులే తడిపేసే కొట్టండి కొట్టండి

కొట్టండి తిట్టండి గిల్లండి గిచ్చండి
కొయ్యండి చంపండి పుట్టాక పోదండీ ప్రేమా...
కొట్టండి తిట్టండి గిల్లండి గిచ్చండి
కొయ్యండి చంపండి పిచ్చిండి నమ్మండి ప్రేమా..



సరిగమ పదనిస రసనసా పాట సాహిత్యం

 
చిత్రం: మరణ మృదంగం (1988)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, చిత్ర

పల్లవి:
సరిగమ పదనిస రసనసా
ఇది కనివిని ఎరుగని గుసగుస
సరిగమ పదనిస రసనసా
ఇది కనివిని ఎరుగని గుసగుస

ముద్దు పెట్టు ముద్దు పెట్టు పదా
ముద్దులేక పొద్దుపోని కథా
ముద్దుకాటు పడ్డ కన్నె ఎదా
విచ్చుకున్న ముద్దబంతి కథా

సరిగమ పదనిస రసనసా
ఇది కనివిని ఎరుగని గుసగుస
సరిగమ పదనిస రసనసా
ఇది కనివిని ఎరుగని గుసగుసా

చరణం: 1
రెండు హృదయాల పిట్టపోరూ తీరనంటుంది ఎందుకో
దొంగ యోగాల కొంగగారూ గాలమేసేది ఎందుకో
చేతికందాక జాబిలీ చుక్కతో నాకు ఏం పనీ
తట్టుకున్నాక కౌగిళీ ఏమి కావాలొ చెప్పనీ
కస్సుమన్న దాని సోకు కసిగా ఉంటుందీ
తుమ్మెదొచ్చి వాలినాక పువ్వేమంటుందీ

సిగ్గో చీనీలపండు 
బుగ్గో బత్తాయిపండు 
అల్లో నేరేడుపండు నాదీ
అరె నా నా నా నా నా నేనే కాదంటున్నానా

సరిగమ పదనిస రసనసా
ఇది కనివిని ఎరుగని గుసగుస
సరిగమ పదనిస రసనసా
ఇది కనివిని ఎరుగని గుసగుస

ముద్దు పెట్టు ముద్దు పెట్టు పదా
ముద్దులేక పొద్దుపోని కథా
ముద్దుకాటు పడ్డ కన్నె ఎదా
విచ్చుకున్న ముద్దబంతి కథా

సరిగమ పదనిస రసనసా
ఇది కనివిని ఎరుగని గుసగుస
సరిగమ పదనిస రసనసా
ఇది కనివిని ఎరుగని గుసగుసా

చరణం: 2
వయసు వడగళ్ళ వాన నీరూ వంటపట్టింది ఎందుకో
నన్ను దులిపేసి వలపు గాలీ నిన్ను తాకింది తట్టుకో
లేత అందాల దోపిడీ ఇప్పుడే కాస్త ఆపనీ
ఆపినా ఆగి చావదూ అందచందాల ఆ పనీ
ఇంతదాక వచ్చినాక ఇంకేమౌతుందీ
లబ్జు లబ్జు మోజు మీదా లంకే అంటోందీ

అబ్బొ నా బాయ్ ఫ్రెండు 
ముద్దిస్తె నోరు పండు 
వాటేస్తె ఒళ్ళుమండునమ్మా
అరె నా నా నా నా నా నేనే కాదంటున్నానా

సరిగమ పదనిస రసనసా
ఇది కనివిని ఎరుగని గుసగుస
సరిగమ పదనిస రసనసా
ఇది కనివిని ఎరుగని గుసగుస

ముద్దు పెట్టు ముద్దు పెట్టు పదా
ముద్దులేక పొద్దుపోని కథా
ముద్దుకాటు పడ్డ కన్నె ఎదా
విచ్చుకున్న ముద్దబంతి కథా

సరిగమ పదనిస రసనసా
ఇది కనివిని ఎరుగని గుసగుస
సరిగమ పదనిస రసనసా
ఇది కనివిని ఎరుగని గుసగుసా

Palli Balakrishna Tuesday, August 29, 2017
Chanti (1992)




చిత్రం: చంటి (1991)
సంగీతం: ఇళయరాజా
నటీనటులు: వెంకటేష్, మీనా
దర్శకత్వం: రవిరాజా పినిశెట్టి
నిర్మాత: కె.ఎస్. రామారావు
విడుదల తేది: 10.01.1992



Songs List:



అన్నుల మిన్నల పాట సాహిత్యం

 
చిత్రం: చంటి (1991)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: సాహితి
గానం: యస్.పి.బాలు

అమ్మలారా కొమ్మలారా కన్నె గౌరి వన్నె మీరే
తియ్యరారే దిష్టి మీరే ఇవ్వరారే చిమ్మి నూరే
శ్రీలొలుకు నోములకే చాయనిడే పసుపులు
స్త్రీ కొరకు చేతులకె సొంపసగె గాజులూ

అన్నుల మిన్నల అమ్మడి కన్నులు గుమ్మడి పువ్వులులే 
తొలి సిగ్గుల మొగ్గల బుగ్గలు కందిన పుత్తడి అందములే
సుమ సుందరి అందెలలో చిరు మువ్వల సందడులే
సుభ మంగళ వేలలో సుభమస్తుల దీవెనలే
అలివేనే ఈ రాణి...

అన్నుల మిన్నల అమ్మడి కన్నులు గుమ్మడి పువ్వులులే 
తొలి సిగ్గులమొగ్గల బుగ్గలు కందిన పుత్తడి అందములే

ఆ దేవుడు ఆ దేవితో అలకపూనెనేమో
ఈ రూపుగ శ్రీదేవిని ఇలకు పంపెనేమో
మొహనాల సొయగాల మేనకో
మరి దేవలోక పారిజాత మాలికో
రేకులు విచ్చిన సిరి మల్లి అన్నల ముద్దుల చెల్లి 
నేలకు వచిన జాబిల్లి వన్నెల రంగుల వల్లి 
విరబూసే పూభోని...

అన్నుల మిన్నల అమ్మడి కన్నులు గుమ్మడి పువ్వులులే 
తొలి సిగ్గుల మొగ్గల బుగ్గలు కందిన పుత్తడి అందములే

సుమ సుందరి అందెలలో చిరు మువ్వల సందడులే
సుభ మంగళ వేలలో సుభమస్తుల దీవెనలే
అలివేనే ఈ రాణి...

అన్నుల మిన్నల అమ్మడి కన్నులు గుమ్మడి పువ్వులులే 
తొలి సిగ్గుల మొగ్గల బుగ్గలు కందిన పుత్తడి అందములే

ఆ కలువలు ఈ కనులకు మారు రూపులేమో
ఆ నగవులు వేకువలకు మేలుకొలుపులేమో

పాలకడలి మీద తేలు చంద్రికో 
గగనాల వేలకాంతులీదు తారకో

వెన్నెల్లా వస్తాడు ఓనాడు రాజంటి గొప్పింటి మొగుడు
ఊరంతా సందడ్లు ఆనాడు వాడంతా వియ్యాలవారు
పిపి పీ పీ డుమ్ డుమ్ డుమ్... అహా... హా...

అన్నుల మిన్నల అమ్మడి కన్నులు గుమ్మడి పువ్వులులే 
తొలి సిగ్గుల మొగ్గల బుగ్గలు కందిన పుత్తడి అందములే
సుమ సుందరి అందెలలో చిరు మువ్వల సందడులే
సుభ మంగళ వేలలో సుభమస్తుల దీవెనలే
అలివేనే ఈ రాణి...

అన్నుల మిన్నల అమ్మడి కన్నులు గుమ్మడి పువ్వులులే 
తొలి సిగ్గుల మొగ్గల బుగ్గలు కందిన పుత్తడి అందములే




ఎన్నెన్నో అందాలు పాట సాహిత్యం

 
చిత్రం: చంటి (1991)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వేటూరి
గానం: చిత్ర, యస్.పి.బాలు

ఎన్నెన్నో అందాలు ఏవేవో రాగాలు
వేసే పూల బాణం కూసే గాలి గంధం
పొద్దేలేని ఆకాశం హద్దేలేని ఆనందం
ఎన్నెన్నో అందాలు ఏవేవో రాగాలు

సిరిగల చిలకలు ఇలదిగి నడచుట న్యాయమా ధర్మమా
తొలకరి మెరుపులు చిలికిన చినుకులు నింగిలో ఆగునా
చలిమర గదులలో సుఖపడు బతుకులు వేసవే కోరునా
అలికిన గుడిసెల చలువుల మనసులు మేడలో దొరుకునా
అందాల మేడల్లోనే అంటదు కాలికి మన్ను
బంగారు పంటలు పండే మన్నుకు చాలదు మిన్ను
నిరుపేదిల్లు పొదరిల్లు
ఇలలో ఉన్న హరివిల్లు

ఎన్నెన్నో అందాలు ఏవేవో రాగాలు
వేసే పూల బాణం కూసే గాలి గంధం
పొద్దేలేని ఆకాశం హద్దేలేని ఆనందం
ఎన్నెన్నో అందాలు ఏవేవో రాగాలు

జలజల పదముల అలజడి నదులకు వంత నే పాడనా
మిలమిల మెరిసిన తళతళ తారలు నింగినే వీడునా
చెరువుల కడుపున విరిసిన తామర తేనెలే పూయునా
మిణుగురు పురుగుల మిడిమిడి వెలుగులు వెన్నెలై కాయునా
ఏ గాలి మేడల్లోనో దీపంలా నే ఉన్నా
మా పల్లె సింగారాలు నీలో నేనే కన్నా
గోదారమ్మ పరవళ్ళు
తెలుగింటమ్మ తిరునాళ్ళు

ఎన్నెన్నో అందాలు ఏవేవో రాగాలు
వేసే పూల బాణం కూసే గాలి గంధం
పొద్దేలేని ఆకాశం హద్దేలేని ఆనందం
ఎన్నెన్నో అందాలు ఏవేవో రాగాలు




ఇది తైలం పెట్టి తాళం పట్టి పాట సాహిత్యం

 
చిత్రం: చంటి (1991)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు

స్... అబ్బా... గట్టిగా కొట్టొద్దురోయ్ వాయించటానికి నేను తబలా కాదు  మెల్లిగా మెల్లిగా ఆఁ....

ఊఁ... ఇది తైలం పెట్టి తాళం పట్టి తలాంగుతో తలంటితే మోత
ఇది ఒళ్ళే రుద్ది బుద్దే శుద్ది చేసే కొద్దీ తమాషాలే తీత
ఓ నమః శివాయహా ఒంట్లొ వేడే మాయం
తమ కాస్తో కూస్తో అయిందంటే హాయేనండి గాయం
ఓ నమః శివాయహా ఒంట్లొ వేడే మాయం
తమ కాస్తో కూస్తో అయిందంటే హాయేనండి గాయం
ఇది తైలం పెట్టి తాళం పట్టి తలాంగుతో తలంటితే మోత

నవ్విస్తూ నడిపిస్తా పని పాటలు
మిమ్ము కవ్విస్తూ వినిపిస్తా నా పాటలు
మమతల మారాజులులే ఈ అన్నలు
పసి మనసున్న మల్లికలే ఆ చెల్లెలు
పెంచానండి కండ ఆ కండల్లోనే గుండె
మీరే నాకు అండ మీరంతా చల్లంగుండ
అహ ఏగానైనా మగాణైనా ఎంతో కొంత ఉండాలండి
ఉంది మనసుంది

ఇది తైలం పెట్టి తాళం పట్టి తలాంగుతో తలంటితే మోత
ఇది ఒళ్ళే రుద్ది బుద్దే శుద్ది చేసే కొద్దీ తమాషాలే తీత
ఓ నమః శివాయహా ఒంట్లొ వేడే మాయం
తమ కాస్తో కూస్తో అయిందంటే హాయేనండి గాయం
ఇది తైలం పెట్టి తాళం పట్టి తలాంగుతో తలంటితే మోత

గుళ్ళోకి పోలేదు నేనెప్పుడూ
అమ్మ ఒళ్ళోనే ఉన్నాడు నా దేవుడు
బళ్ళోకి పోలేదు చిన్నప్పుడు
పల్లే పాఠాలే నేర్చాడు ఈ భీముడు
నీ పాదాలంటే చోటే నే పాగా వేసే కోట
చెల్లిస్తా మీ మాట నే వల్లిస్తా మీ పాట
పలుగాకులలో పుట్టానండి కోకిలగా మారానండి
కాకా ఇది కుకు

ఇది తైలం పెట్టి తాళం పట్టి తలాంగుతో తలంటితే మోత
ఇది ఒళ్ళే రుద్ది బుద్దే శుద్ది చేసే కొద్దీ తమాషాలే తీత
ఓ నమః శివాయహా ఒంట్లొ వేడే మాయం
తమ కాస్తో కూస్తో అయిందంటే హాయేనండి గాయం
ఓ నమః శివాయహా ఒంట్లొ వేడే మాయం
తమ కాస్తో కూస్తో అయిందంటే హాయేనండి గాయం
ఇది తైలం పెట్టి తాళం పట్టి తలాంగుతో తలంటితే మోత ఆ... ఓ... ఓ



జాబిలికీ వెన్నెలకీ పాట సాహిత్యం

 
చిత్రం: చంటి (1991)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: సాహితి
గానం: యస్.పి.బాలు

జాబిలికీ వెన్నెలకీ పుట్టిన పున్నమిలే 
గంగలలో తేనెలలో కడిగిన ముత్యములే
ముద్దులోనే పొద్దుపోయే
కంటి నిండా నిద్దరోవే చంటి పాడే జోలలోనే
జాబిలికీ వెన్నెలకీ పుట్టిన పున్నమిలే 
గంగలలో తేనెలలో కడిగిన ముత్యములే

కన్నతల్లి ప్రేమ కన్నా అన్నమేది పాపలకి
అమ్మ ముద్దు కన్నా వేరే ముద్ద లేదు ఆకలికి
కన్నతల్లి ప్రేమ కన్నా అన్నమేది పాపలకి
అమ్మ ముద్దు కన్నా వేరే ముద్ద లేదు ఆకలికి
దేవతంటి అమ్మనీడే కోవెలే బిడ్డలకీ
చెమ్మగిల్లు బిడ్డకన్నే ఏడుపే అమ్మలకి
అమ్మ చేతి కమ్మనైన దెబ్బ కూడ దీవెన
బువ్వ పెట్టీ బుజ్జగించే నాలమెంతో తియ్యన
మంచుకన్నా చల్లనైనా
మల్లెకన్నా తెల్లనైన అమ్మ పాటే పాడుకోనా
మల్లెకన్నా తెల్లనైన అమ్మ పాటే పాడుకోనా



ఓ ప్రేమా... నా ప్రేమా... పాట సాహిత్యం

 
చిత్రం: చంటి (1991)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వేటూరి
గానం: చిత్ర

ఓ ప్రేమా... నా ప్రేమా...
దైవాలాడే జూదం... దయ్యంపాడే వేదం...
ఓ ప్రేమా నా ప్రేమా ప్రేమిస్తే చావేనా
దైవాలాడే జూదం దయ్యంపాడే వేదం
రక్తంలోని సుడిగుండం రాయైపోయే అనుబందం
ఓ ప్రేమా నా ప్రేమా ప్రేమిస్తే చావేనా

క్షణమొక యుగముగా గడిపిన బ్రతుకిది తెలుసుకో ప్రియతమా
విరహమే సుఖమని కలయిక కలయని తలచుటే మధురమా
మృతులకు చితులకు ముగియని కధలివి కదలిరా ప్రణయమా
అడుగులు చిలికిన రుధిరవు మడుగుల ఎరుపులే ప్రళయమా
జారిపోయే కాలం చేజారిపోయే యోగం
రగులుతున్న గాయం నేనడగలేను న్యాయం
కరువౌతాను కన్నుల్లో గురుతుంటాను గుండెల్లో


ఓ ప్రేమా నా ప్రేమా ప్రేమిస్తే చావేనా
దైవాలాడే జూదం దయ్యంపాడే వేదం
రక్తంలోని సుడిగుండం రాయైపోయే అనుబందం
ఓ ప్రేమా నా ప్రేమా ప్రేమిస్తే చావేనా

గిరులను విడిచిన నదులిక వెనుకకు తిరుగునా జగమున
కులమని కడుదని కులమని విలువలు చెరుగునా మనసున
గగనము మెరుపుల నగలను తొడిగితే ఘనతలే పెరుగునా
ఉరుములు వినపడి ఉదయపు వెలుగులు అదురునా చెదురునా
పేదవాళ్ళ ప్రేమ కాటువేసే పామా
స్వాగతాలు అనగా చావుకైనా ప్రేమ
మానై నేను బ్రతికున్నా మనిషై నేను చస్తున్నా

ఓ ప్రేమా నా ప్రేమా ప్రేమిస్తే చావేనా
దైవాలాడే జూదం దయ్యంపాడే వేదం
రక్తంలోని సుడిగుండం రాయైపోయే అనుబందం
ఓ ప్రేమా నా ప్రేమా ప్రేమిస్తే చావేనా




పావురానికీ పంజరానికి పాట సాహిత్యం

 
చిత్రం: చంటి (1991)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు

పావురానికీ పంజరానికి పెళ్ళి చేసే పాడు లోకం
కాళరాత్రికీ చందమావకీ ముళ్ళు పెట్టే మూఢలోకం
పావురానికీ పంజరానికి పెళ్ళి చేసే పాడు లోకం
కాళరాత్రికీ చందమావకీ ముళ్ళు పెట్టే మూఢలోకం
కొడిగట్టిన దీపాలే గుడి హారతులయ్యేనా
ఓ...ఓ...ఓ...ఓ...

పావురానికీ పంజరానికి పెళ్ళి చేసే పాడు లోకం
కాళరాత్రికీ చందమావకీ ముళ్ళు పెట్టే మూఢలోకం

తానిచ్చు పాలలో ప్రేమంతా కలిపి చాకింది నా కన్న తల్లి
లాలించు పాటలో నీతంతా తెలిపీ పెంచింది నా లోన మంచి
కపటాలు మోసాలు నాలోన లేవు కలనైన అపకారి కాను
చేసిన పాపములా ఇవి ఆ విధి శాపములా
మారని జాతకమా ఇది దేవుని శాసనమా
ఇది తీరేదే కాదా...


పావురానికీ పంజరానికి పెళ్ళి చేసే పాడు లోకం
కాళరాత్రికీ చందమావకీ ముళ్ళు పెట్టే మూఢలోకం
కొడిగట్టిన దీపాలే గుడి హారతులయ్యేనా
ఓ...ఓ...ఓ...ఓ...

పావురానికీ పంజరానికి పెళ్ళి చేసే పాడు లోకం
కాళరాత్రికీ చందమావకీ ముళ్ళు పెట్టే మూఢలోకం

తాళంటే తాడనే తలిచాను నాడు అది ఏదో తెలిసేను నేడు
ఆ తాళి పెళ్ళికే ఋజువన్న నిజము తరువాత తెలిసేమి ఫలము
ఏమైనా ఏదైనా జరిగింది ఘోరం నా మీద నాకేలే కోపం
నాతోనే వేదములా ఇది తీరని వేదనలా
నా మది లోపములా ఇవి ఆరని శోకములా
ఇక ఈ బాదే పోదా...

పావురానికీ పంజరానికి పెళ్ళి చేసే పాడు లోకం
కాళరాత్రికీ చందమావకీ ముళ్ళు పెట్టే మూఢలోకం
కొడిగట్టిన దీపాలే గుడి హారతులయ్యేనా
ఓ...ఓ...ఓ...ఓ...

పావురానికీ పంజరానికి పెళ్ళి చేసే పాడు లోకం
కాళరాత్రికీ చందమావకీ ముళ్ళు పెట్టే మూఢలోకం



జాబిలికీ వెన్నెలకీ పాట సాహిత్యం

 
చిత్రం: చంటి (1991)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: సాహితి
గానం: చిత్ర

జాబిలికీ వెన్నెలకీ పుట్టిన పున్నమిలే 
గంగలలో తేనెలలో కడిగిన ముత్యములే
ముద్దులోనే పొద్దుపోయే
కంటి నిండా నిద్దరోవే చంటి పాడే జోలలోనే
జాబిలికీ వెన్నెలకీ పుట్టిన పున్నమిలే 
గంగలలో తేనెలలో కడిగిన ముత్యములే

వేమనయ్య నా గురువే వేలిముద్ర నా చదువే
పాలబువ్వ నా పలుకే హాయి నిద్ర పాపలకే
వేమనయ్య నా గురువే వేలిముద్ర నా చదువే
పాలబువ్వ నా పలుకే హాయి నిద్ర పాపలకే
కూనలమ్మ నా పదమే తేనెకన్నా తియ్యనిదే
కోనలన్నీ పాడుకునే గువ్వ చిన్న పాట ఇదే
రాగముల తాళములు నాకసలే రావులే
పాడుకొను జ్ఞానమునే నా కొసగే దైవమే
ముద్దులోనే పొద్దుపోయే
కంటి నిండా నిద్దరోవే చంటి పాడే జోలలోనే
జాబిలికీ వెన్నెలకీ పుట్టిన పున్నమిలే 
గంగలలో తేనెలలో కడిగిన ముత్యములే



ఓ ప్రేమా... నా ప్రేమా... పాట సాహిత్యం

 
చిత్రం: చంటి (1991)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వేటూరి
గానం: యస్ పి బాలు

ఓ ప్రేమా... నా ప్రేమా...
ప్రేమే నాకు దైవం నీవే నాకు ప్రాణం
ఓ ప్రేమా నా ప్రేమ నా పాటే వినరావా
ప్రేమే నాకు దైవం నీవే నాకు ప్రాణం
వినిపించేను నా గానం రప్పించేను నీ ప్రాణం
ఓ ప్రేమా నా ప్రేమ నా పాటే వినరావా

గడచిన దినముల కధలను మరువకు మనసులో ప్రియతమా
శిలనొక మనిషిగ మలచిన చెలియకు మరణమే శరణమా
ప్రణయపు పిలుపులు ప్రళయపు బిగువులు తెలుసుకో ప్రియతమా
విధికిక విలయము ఎదలకు విజయము గెలుచుకో హృదయమా
నేను కానే దూరం ఈ ప్రేమ కాదే నేరం
సాగిపోతే దూరం ఇక ఆగిపోదా కాలం
గుడిలో దేవి లేకుంటే కొడిగట్టేను ఈ దీపం

ఓ ప్రేమా నా ప్రేమ నా పాటే వినరావా
ప్రేమే నాకు దైవం నీవే నాకు ప్రాణం
వినిపించేను నా గానం రప్పించేను నీ ప్రాణం
ఓ ప్రేమా నా ప్రేమ నా పాటే వినరావా

Palli Balakrishna Tuesday, August 1, 2017
Criminal (1995)




చిత్రం: క్రిమినల్ (1994)
సంగీతం: యమ్. యమ్. కీరవాణి
నటీనటులు: నాగార్జున, మనీషా కొయిరాల, రమ్యకృష్ణ
దర్శకత్వం: మహేష్ భట్
నిర్మాత: కె.ఎస్. రామారావు
విడుదల తేది: 14.10.1994



Songs List:



ముద్దంటే వద్దంటే పాట సాహిత్యం

 
చిత్రం: క్రిమినల్ (1994)
సంగీతం: యమ్. యమ్. కీరవాణి
సాహిత్యం: వెన్నెలకంటి 
గానం: యస్.పి.బాలు, చిత్ర 

ముద్దంటే  వద్దంటే 



పాపికి పాపికి పాట సాహిత్యం

 
చిత్రం: క్రిమినల్ (1994)
సంగీతం: యమ్. యమ్. కీరవాణి
సాహిత్యం: సిరివెన్నెల 
గానం: యస్.పి.బాలు, చిత్ర 

పాపికి పాపికి 




హెల్లొ గురు కిస్సు పాట సాహిత్యం

 
చిత్రం: క్రిమినల్ (1994)
సంగీతం: యమ్. యమ్. కీరవాణి
సాహిత్యం: వెన్నెలకంటి 
గానం: యస్.పి.బాలు, చిత్ర 

హెల్లొ గురు కిస్సు కొట్టెయ్ గురు
మిస్సు కావద్దురా లవ్వరూ
కానీ షురూ సోకులే సూపరూ
కౌగిలే కమ్మనీ లాటరూ
పెరిగను దాహాల పెదవుల జోరు
తరగనొ మోహాల తపనల తీరు
లబాబ లబాబ లబాబ లబాబ
లబాబ లబాబ లబాబ లబాబ
య య య యా

హెల్లొ గురు కిస్సు కొట్టెయ్ గురు
మిస్సు కావద్దురా లవ్వరూ
కానీ షురూ సోకులే సూపరూ
కౌగిలే కమ్మనీ లాటరూ

నీ అనీ పెదాలలో రుచి అదెంతొ చూడాలి
తీయని పదాలలో పదె పదేదొ పాడాలి
మిస మిసలా మీగదని పదె పదె కాజెయ్యనా
కసి కసిగా కోరికనే మరీ మరీ రాజెయ్యనా
యబాబ యబాబ యబాబ యబాబ
యబాబ యబాబ యబాబ యబాబ
యబాబ యబాబ యబాబ యబాబ
యా యా యా యా

కానీ షురూ సోకులే సూపరూ
కౌగిలే కమ్మనీ లాటరూ
హెల్లొ గురు కిస్సు కొట్టెయ్ గురు
మిస్సు కావద్దురా లవ్వరూ

హా ప్రియ ఇదే కదా సదా స్వరాల గోదారి
హో సఖీ సుఖీభవా అనే వరాల రాదారి
ఒక శ్రుతిగా ఓ లయగా నిరంతరం పాడాలిలే
కలయికలో కౌగిలిలో యుగం క్షనం కావాలిలే
యబాబ యబాబ యబాబ యబాబ
యబాబ యబాబ యబాబ యబాబ
యబాబ యబాబ యబాబ యబాబ
యా యా యా యా



తెలుసా మనసా పాట సాహిత్యం

 
చిత్రం: క్రిమినల్ (1994)
సంగీతం: యమ్. యమ్. కీరవాణి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్.పి.బాలు, చిత్ర
 
తెలుసా మనసా ఇది ఏనాటి అనుబంధమో
తెలుసా మనసా ఇది ఏ జన్మ సంబంధమో
తరిమిన ఆరు కాలాలు ఏడు లోకాలు చేరలేని ఒడిలో
విరహపు జాడలేనాడు వేడి కన్నేసి చూడలేని జతలో
శతజన్మాల బంధాల బంగారు క్షణమిది

తెలుసా మనసా ఇది ఏనాటి అనుబంధమో
తెలుసా మనసా ఇది ఏ జన్మ సంబంధమో
 
ప్రతిక్షణం... నా కళ్ళల్లో నిలిచె నీ రూపం
బ్రతుకులో... అడుగడుగునా నడిపె నీ స్నేహం
ఊపిరే నీవుగా ప్రాణమే నీదిగా
పది కాలాలు ఉంటాను నీ ప్రేమ సాక్షిగ

తెలుసా మనసా ఇది ఏనాటి అనుబంధమో 
 
ఆహా... ఆహా... అ...ఆ...ఆ...

Darling, every breath you take,
Every move you make I will be there with you
What would I do without you?
I want to love you forever... and ever... and ever

ఎన్నడూ... తీరిపోని రుణముగా ఉండిపో
చెలిమితో... తీగ సాగే మల్లెగా అల్లుకో
లోకమే మారినా కాలమే ఆగినా
మన ఈ గాధ మిగలాలి తుదిలేని చరితగ...

తెలుసా మనసా ఇది ఏనాటి అనుబంధమో
తెలుసా మనసా ఇది ఏ జన్మ సంబంధమో
తరిమిన ఆరు కాలాలు ఏడు లోకాలు చేరలేని ఒడిలో 
విరహపు జాడలేనాడు వేడి కన్నేసి చూడలేని జతలో
శతజన్మాల బంధాల బంగారు క్షణమిది
తెలుసా మనసా ఇది ఏనాటి అనుబంధమో



జమ జమ పాట సాహిత్యం

 
చిత్రం: క్రిమినల్ (1994)
సంగీతం: యమ్. యమ్. కీరవాణి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్.పి.బాలు, సుజాత 

జమ జమ జమా ఓ జమా
జమ జమ జమా ఓ జమా
జమ జమ జమా
జీన్స్ పాంటు స్టైలు చూసి
డన్సు చేసె మూడు వచ్చె
జంట చేరె జింక పిల్ల జం జం
తుప్పు రేపె డప్పు మీద
వెస్టురన్ను మిక్సు చేసి స్టెప్పులేసె జీను లేని గుర్రం
అమ్మమ్మో ఉక్కిరి బిక్కిరి చేసె నీ అందం

చిమ చిమ చిమా చిం చిమా
చిమ చిమ చిమా చిం చిమా
చిమ చిమ చిమా
మోడరన్ను డ్రస్సు కట్టి
మీదకొచ్చి మిస్సును చూసి
క్లాప్స్ కొట్టె కుర్రవాడి వాటం
రోజు లాంటి లిప్సు చూసి
మోజు తీరె కిస్సు కోరి
రాజుకన్న కత్తిలాంటి మీసం
అమ్మమ్మో చక్కిలి గింతలు పెట్టె మోమాటం

ఓ పాప షోకేసు బొమ్మల్లె వచ్చి
ప్రిపాసులిచ్చెసావె పసివాల్లు
పడుచాల్లు ముసలాల్లు వెంకాలే పడి వస్తుంటె
traffic jaam ఐపోదా
నీ సొగసుకు చాటె లేదా
బోలొ బోలొ బోలో

ఎర్ర ఎర్ర ఎర్రాని ముక్కు చిలకా
బుల్లి బుల్లి బుగ్గలు నే కొరకా
వర్ర వర్ర వర్రాని చిట్టి చిటికా
కందిపోదా నాజూకు ఆడ పుటకా
కుర్ర కూనలమ్మ కూత పెట్టి
కూన మంటె ఆగుతుంద కోడె ఈడు కమ్ముకోకా
సర్రు సర్రు మంటు లవ్వు దూసుకొస్తు ఉంటె
కందిపోద కట్టుకున్న కన్నె కోకా

చిమ చిమ చిమా చిం చిమా
చిమ చిమ చిమా చిం చిమా
చిమ చిమ చిమా
జమ జమ జమా ఓ జమా
జమ జమ జమా ఓ జమా
జమ జమ జమా

అబ్బొ అబ్బొ అందాల హంస నడకా
గొప్ప గుందే ముస్తాబు ముందు వెనకా
అందుచేతె అర్జెంటు పెళ్ళి కొడకా
లెక్కలేస్తు కొచ్చాను పెళ్ళి పడకా
ఖోక పిక్క పైకి ఎత్తి తిప్పుకుంటు వస్తు ఉంటె
నాకు పుట్టుకొచ్చె దప్పికా
కంటపడ్డ పిల్ల సోత్తు కొల్లగొట్టి పోతానంటె
ఒప్పుకోనా అడ్డు చెప్పకా

జమ జమ జమా ఓ జమా
జమ జమ జమా ఓ జమా
జమ జమ జమా
జీన్స్ పాంటు స్టైలు చూసి
డన్సు చేసె మూడు వచ్చె
జంట చేరె జింక పిల్ల జం జం
తుప్పు రేపె డప్పు మీద
వెస్టురన్ను మిక్సు చేసి స్టెప్పులేసె జీను లేని గుర్రం
అమ్మమ్మో ఉక్కిరి బిక్కిరి చేసె నీ అందం

జమ జమ జమా ఓ జమా
జమ జమ జమా ఓ జమా
జమ జమ జమా



తెలుసా మనసా -1 పాట సాహిత్యం

 
చిత్రం: క్రిమినల్ (1994)
సంగీతం: యమ్. యమ్. కీరవాణి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యమ్. యమ్. కీరవాణి

తెలుసా మనసా ఇది ఏనాటి అనుబంధమో
తెలుసా మనసా ఇది ఏ జన్మ సంబంధమో
తరిమిన ఆరు కాలాలు ఏడు లోకాలు చేరలేని వడిలో
విరహపు జాడలేనాడు వేడి కన్నేసి చూడలేని జతలో
శత జన్మాల బంధాల బంగారు క్షణమిది
తెలుసా మనసా ఇది ఏనాటి అనుబంధమో 
తెలుసా మనసా ఇది ఏ జన్మ సంబంధమో

చరణం: 1
ఎన్నడూ తీరి పోనీ ఋణముగా వుండిపో
చెలిమితో తీగసాగే మల్లెగా అల్లుకో 
లోకమే మారినా కాలమే ఆగినా మన ఈగాధ మిగలాలి తుదిలేని చరితగ
తెలుసా మనసా ఇది ఏనాటి అనుబంధమో

చరణం: 2
ప్రతిక్షణం నా కళ్ళలో నిలిచే నీరూపం
బ్రతుకులో అడుగడుగునా నడిపె నీ స్నేహం
ఊపిరే నీవుగా ప్రాణమే నీదిగా పది కాలాలు ఉంటాను నీప్రేమ సాక్షిగ 
తెలుసా మనసా ఇది ఏనాటి అనుబంధమో 
తెలుసా మనసా ఇది ఏ జన్మ సంబంధమో 
తరిమిన ఆరు కాలాలు ఏడు లోకాలు చేరలేని వడిలో 
విరహపు జాడలేనాడు వేడి కన్నేసి చూడలేని జతలో
శత జన్మాల బంధాల బంగారు క్షణమిది
తెలుసా మనసా ఇది ఏనాటి అనుబంధమో

Palli Balakrishna
Abhilasha (1983)




చిత్రం: అభిలాష (1983) 
సంగీతం: ఇళయరాజా
నటీనటులు: చిరంజీవి, రాధిక
దర్శకత్వం: ఏ. కోదండ రామిరెడ్డి
నిర్మాత: కె.ఎస్. రామారావు
విడుదల తేది: 11.03.1983



Songs List:



నవ్వింది మల్లెచెండు పాట సాహిత్యం

 
చిత్రం: అభిలాష (1983) 
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, ఎస్. జానకి

పల్లవి:
యురేకా...హహ్హాహ్హా...
తార తతార తతారత్తా... తార తతార తతారత్తా...
హహ్హాహ్హా... హహ్హాహ్హా... హే...
నవ్వింది మల్లెచెండు నచ్చింది గర్ల్‌ఫ్రెండు
దొరికెరా మజాగ ఛాన్సు జరుపుకో భలే రొమాన్సు
యురేకా సకమిక... నీ ముద్దు తీరేదాక
నవ్వింది మల్లెచెండు నచ్చింది గర్ల్‌ఫ్రెండు
దొరికెరా మజాగ ఛాన్సు జరుపుకో భలే రొమాన్సు
యురేకా సకమిక... సకమిక సకమిక సకమిక సకమిక

చరణం: 1
లవ్వు సిగ్నల్ నాకివ్వగానే నవ్వుకున్నాయ్ నా యువ్వనాలే
ఆ నవ్వుతోనే కదిలెయ్యుగానే నాటుకున్నయ్ నవనందనాలే
అహా చూపుల్లో నీ రూపం కనురెప్పల్లో నీ ప్రాణం
కన్నుకొట్టి కమ్ముకుంట.... కాలమంత అమ్ముకుంట
రపప్ప రపప్ప రపప్ప రపప్ప
కన్నె ఈడు జున్నులన్నీ జుర్రుకుంటా
నవ్వింది మల్లెచెండు నచ్చింది గర్ల్‌ఫ్రెండు
దొరికెరా మజాగ ఛాన్సు జరుపుకో భలే రొమాన్సు
యురేకా సకమిక...

చరణం: 2
కస్సుమన్న ఓ కన్నెపిల్ల యుస్సు అంటే ఓ కౌగిలింత
కిస్సులిచ్చి నే కౌగిలిస్తే అరె తీరిపోయే నాకున్న చింత
నేను పుట్టిందే నీ కోసం ఈ జన్మంతా నీ ధ్యానం
ముద్దు పెట్టి మొక్కుకుంట మూడు ముళ్ళు వేసుకుంట
సబబ్బా రిబబ్బా సబబ్బా సబరిబరబ...
ఏడు జన్మలేలుకుంట నేను జంటగా
నవ్వింది మల్లెచెండు నచ్చింది గర్ల్‌ఫ్రెండు
దొరికెరా మజాగ ఛాన్సు జరుపుకో భలే రొమాన్సు
యురేకా సకమిక... నీ ముద్దు తీరేదాక...
యురేకా సకమిక... నీ ముద్దు తీరేదాక...
యురేకా సకమిక... నీ ముద్దు తీరేదాక....



ఉరకలై గోదావరి పాట సాహిత్యం

 
చిత్రం: అభిలాష (1992)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, ఎస్.జానకి

ఉరకలై గోదావరి ఉరికె నా ఒడిలోనికి
సొగసులై బృందావని విరిసె నా సిగలోనికి
జత వెతుకు హృదయానికీ శృతి తెలిపె మురళీ
చిగురాకు చరణాలకి సిరిమువ్వ రవళీ
రసమయం జగతి

ఉరకలై గోదావరి ఉరికె నా ఒడిలోనికి

నీ ప్రణయభావం నా జీవ రాగం
నీ ప్రణయభావం నా జీవ రాగం
రాగాలు తెలిపే భావాలు నిజమైనవి
లోకాలు మురిసే స్నేహాలు రుజువైనవి
అనురాగ రాగాల స్వరలోకమె మనదైనది
 
ఉరకలై గోదావరి ఉరికె నా ఒడిలోనికి
జత వెతుకు హృదయానికీ శృతి తెలిపె మురళీ 
చిగురాకు చరణాలకి సిరిమువ్వ రవళీ
రసమయం జగతి

నా పేద హృదయం నీ ప్రేమ నిలయం
నా పేద హృదయం నీ ప్రేమ నిలయం
నాదైన బ్రతుకే ఏనాడో నీదైనది
నీవన్న మనిషే ఈ నాడు నాదైనది
ఒక గుండె అభిలాష పది మందికి బ్రతుకైనది

ఉరకలై గోదావరి ఉరికె నా ఒడిలోనికి
సొగసులై బృందావని విరిసె నా సిగలోనికి
జత వెతుకు హృదయానికీ శృతి తెలిపె మురళీ
చిగురాకు చరణాలకి సిరిమువ్వ రవళీ
రసమయం జగతి
బంతీ చామంతీ ముద్దాడుకున్నాయిలే



సందెపొద్దుల కాడ పాట సాహిత్యం

 
చిత్రం: అభిలాష (1983) 
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, ఎస్. జానకి

సందెపొద్దుల కాడ సంపంగి నవ్వింది
అందగత్తెను చూడ జాబిల్లి వచ్చింది
మబ్బు పట్టే కళ్ళు తబ్బిబ్బులయ్యే ఒళ్ళు
ఎవ్వరికిస్తుందో ఏమౌతుందో
ఎవ్వరికిస్తుందో ఏమౌతుందో
సందెపొద్దుల కాడ సంపంగి నవ్వింది
అందగాడికి తోడు చలిగాలి రమ్మంది
ఎల్లువయ్యే ఈడు ఏడెక్కీపోయే వాడు
ఎన్నడు వస్తాడో ఏమిస్తాడో
ఎన్నడు వస్తాడో ఏమిస్తాడో

చరణం: 1
కొండాకోన జలకాలాడే వేళ
కొమ్మరెమ్మ చీర కట్టే వేళ
పిందె పండై చిలక కొట్టే వేళ
పిల్ల పాప నిదరే పోయే వేళ
కలలో కౌగిలి కన్నులు దాటాల
ఎదలే పొదిరిల్లై వాకిలి తియ్యాల
ఎదటే తుమ్మెద పాట పువ్వుల బాట వెయ్యాల

సందెపొద్దుల కాడ సంపంగి నవ్వింది
అందగత్తెను చూడ జాబిల్లి వచ్చింది
ఎల్లువయ్యే ఈడు ఏడెక్కీపోయే వాడు
ఎన్నడు వస్తాడో ఏమిస్తాడో
ఎన్నడు వస్తాడో ఏమిస్తాడో

చరణం: 2
మల్లె జాజి మత్తు చల్లే వేళ
పిల్లా గాలి జోల పాడే వేళ
వానే వాగై వరదై పొంగే వేళ
నేనే నీవై వలపై సాగే వేళ
కన్నులు కొడుతుంటే ఎన్నెల పుట్టాల
పుట్టిన ఎన్నెల్లో పుట్టకళ్ళు తాగాల
పగలే ఎన్నెల గుమ్మా చీకటి గువ్వాలాడాల

సందెపొద్దుల కాడ సంపంగి నవ్వింది
అందగాడికి తోడు చలిగాలి రమ్మంది
మబ్బు పట్టే కళ్ళు తబ్బిబ్బులయ్యే ఒళ్ళు
ఎవరికిస్తుందో ఏమౌతుందో
ఎవరికిస్తుందో ఏమౌతుందో
సందెపొద్దుల కాడ సంపంగి నవ్వింది
అందగాడికి తోడు చలిగాలి రమ్మంది



బంతీ చామంతీ పాట సాహిత్యం

 
చిత్రం: అభిలాష (1983) 
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, ఎస్.జానకి

బంతీ చామంతీ ముద్దాడుకున్నాయిలే
మల్లీ మందారం పెళ్ళాడుకున్నాయిలే
నిద్దరనే సెలవడిగి ఇద్దరిని కలవమని
నిద్దరనే సెలవడిగి ఇద్దరిని కలవమని
బంతీ చామంతీ ముద్దాడుకున్నాయిలే

తేనెవాగుల్లో మల్లె పూలల్లే తేలిపోదాములే
గాలీవానల్లో మబ్బు జంటల్లే రేగిపోదాములే
విసిరే కొసచూపే ముసురై పోతుంటే
ముసిరే వయసుల్లో మతి అసలే పోతుంటే
వేడెక్కి గుండెల్లో తలదాచుకో
తాపాలలో ఉన్న తడి ఆర్చుకో
ఆకాశమంటే ఎదలో జాబిల్లి నీవే వెన్నెల్లు తేవే

బంతీ చామంతీ ముద్దాడుకున్నాయిలే
నిద్దరనే సెలవడిగి ఇద్దరిని కలవమని
నిద్దరనే సెలవడిగి ఇద్దరిని కలవమని
బంతీ చామంతీ ముద్దాడుకున్నాయిలే

తారత్తా తరతత్ తరతా 
తారత్తా తరతత్ తరరా

పూతపెదవుల్లో పుట్టు గోరింట బొట్టు పెట్టిందిలే
ఎర్ర ఎర్రంగా కుర్ర బుగ్గల్లో సిగ్గు తీరిందిలే
ఒదిగే మనసేదో ఒకటై పొమ్మంటే
ఎదిగే వలపంతా ఎదలొకటై రమ్మంటే
కాలాలు కరిగించు కౌగిళ్ళలో
దీపాలు వెలిగించు నీ కళ్ళతో
ఆ మాట వింటే కరిగే నా ప్రాణమంతా నీ సొంతమేలే

బంతీ చామంతీ ముద్దాడుకున్నాయిలే
మల్లీ మందారం పెళ్ళాడుకున్నాయిలే
నిద్దరనే సెలవడిగి ఇద్దరిని కలవమని
నిద్దరనే సెలవడిగి ఇద్దరిని కలవమని



వేళా పాళ లేదు పాట సాహిత్యం

 
చిత్రం: అభిలాష (1983) 
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, ఎస్. జానకి

వేళా పాళ లేదు కుర్రాల్లాటకు... ఓడే మాట లేదు ఆడే వాళ్లకు...
ఏది గెలుపో హొయ్ హొయ్ ఏది మలుపో హొయ్ హొయ్
తెలియువరకు ఇదే ఇదే ఆట మనకు
వేళా పాళ లేదు కుర్రాల్లాటకు ఓడే మాట లేదు ఆడే వాళ్లకు
తకదిమి తద్దోంత తకదిమి తద్దోంత
తకదిమి తద్దోంత తకదిమి తద్దోంత

మన్మధుడే నీకు మంత్రి అనుకోకు నీ వయసు కాచేందుకూ
వయసు ఒక చాకు అది వాడుకోకు నా మన్సు కోసేందుకూ
మనసే లేదు నీకు ఇచ్చేసావు నాకు
లేదని నీదని కలగని నిజమని అనుకొని ఆడకు
లల…
తకదిమి తద్దోంత తకదిమి తద్దోంత
తకదిమి తద్దోంత తకదిమి తద్దోంత

కలలకొక రూపు కనులకొక కైపు తొలి మాపు విరి పానుపూ
కవితలిక ఆపు కలుసుకో రేపు చెబుతాను తుది తీరుపూ
అహ ఏ తీర్పు వొద్దు ఇదిగో తీపి ముద్దు
వొద్దని ముద్దని చిదుమని పెదవని చిటికెలు వెయ్యకు

వేళా పాళ లేదు కుర్రాల్లాటకు ఓడే మాట లేదు ఆడే వాళ్లకు
ఏది గెలుపో హొయ్ హొయ్ ఏది మలుపో హొయ్ హొయ్
తెలియువరకు ఇదే ఇదే ఆట మనకు
వేలా పాల లేదు కుర్రాల్లాటకు ఓడే మాట లేదు ఆడే వాళ్లకు

Palli Balakrishna Thursday, July 27, 2017
Matru Devo Bhava (1993)




చిత్రం: మాతృదేవోభవ (1993)
సంగీతం: యమ్. యమ్. కీరవాణి
నటీనటులు: నాజర్, మాధవి
దర్శకత్వం: కె. అజయ్ కుమార్
నిర్మాత: కె.యస్. రామారావు
విడుదల తేది: 16.07.1993

(మాతృదేవోభవ 1993 లో విడదలై పలువురి మన్ననలు పొందిన ఒక సినిమా. విధివశాత్తూ భర్తను కోల్పోయిన ఒక స్త్రీ, క్యాన్సర్ సోకి తను కూడా కొద్ది రోజుల్లో మరణిస్తానని తెలుసుకొని తన ముగ్గురు బిడ్డల బంగారు భవిష్యత్తు కోసం పడే తపన, ఆరాటమే ఈ సినిమా  వేణువై వచ్చాను భువనానికి అనే పాటకు చిత్ర గారికి నంది అవార్డు వచ్చింది. అలాగే వేటూరి గారికి రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే పాటకు నేషనల్ అవార్డు వచ్చింది. )



Songs List:



రాగం అనురాగం పాట సాహిత్యం

 
చిత్రం: మాతృదేవోభవ (1993)
సంగీతం: యమ్. యమ్. కీరవాణి
సాహిత్యం: వేటూరి
గానం:  యస్.పి.బాలు  చిత్ర


రాగం అనురాగం 



కన్నీటి కలువలు పాట సాహిత్యం

 
చిత్రం: మాతృదేవోభవ (1993)
సంగీతం: యమ్. యమ్. కీరవాణి
సాహిత్యం: వేటూరి
గానం:  యస్.పి.బాలు


కన్నీటి  కలువలు



వేణువై వచ్చాను పాట సాహిత్యం

 
చిత్రం: మాతృదేవోభవ (1993)
సంగీతం: యమ్. యమ్. కీరవాణి
సాహిత్యం: వేటూరి
గానం: చిత్ర

వేణువై వచ్చాను భువనానికి
గాలినై పోతాను గగనానికి
వేణువై వచ్చాను భువనానికి
గాలినై పోతాను గగనానికి
మమతలన్ని మౌన గానం
వాంఛలన్ని వాయులీనం

వేణువై వచ్చాను భువనానికి
గాలినై పోతాను గగనానికి

మాతృదేవోభవ (మాతృదేవో భవ)
పితృదేవోభవ (పితృదేవో భవ)
ఆచార్యదేవోభవ (ఆచార్యదేవో భవ)

ఏడు కొండలకైన బండ తానొక్కటే
ఏడు జన్మల తీపి ఈ బంధమే
ఏడు కొండలకైన బండ తానొక్కటే
ఏడు జన్మల తీపి ఈ బంధమే
నీ కంటిలో నలత లో వెలుగునే కనక
నేను మేననుకుంటే ఎద చీకటే 
హరీ... హరీ... హరీ...
రాయినై ఉన్నాను ఈ నాటికి
రామ పాదము రాక ఏ నాటికి

వేణువై వచ్చాను భువనానికి
గాలినై పోతాను గగనానికి
వేణువై వచ్చాను భువనానికి
గాలినై పోతాను గగనానికి

నీరు కన్నీరాయే ఊపిరే బరువాయే
నిప్పు నిప్పుగ మారె నా గుండెలో
నీరు కన్నీరాయే ఊపిరే బరువాయే
నిప్పు నిప్పుగ మారె నా గుండెలో
ఆ నింగిలో కలిసి నా శూన్య బంధాలు
పుట్టిల్లు చేరే మట్టి ప్రాణాలు
హరీ... హరీ... హరీ...
రెప్పనై ఉన్నాను నీ కంటికి
పాపనై వస్తాను మీ ఇంటికి
వేణువై వచ్చాను భువనానికి
గాలినై పోయాను గగనానికి
గాలినై పోయాను గగనానికి




రాలిపోయే పువ్వా పాట సాహిత్యం

 
చిత్రం: మాతృదేవోభవ (1993)
సంగీతం: యమ్. యమ్. కీరవాణి
సాహిత్యం: వేటూరి
గానం: యమ్. యమ్. కీరవాణి

రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే
తోటమాలి నీ తోడు లేడులే
వాలిపోయే పొద్దా నీకు వర్ణాలెందుకే
లోకమెన్నడో చీకటాయెలే
నీకిది తెల్లవారని రేయమ్మా
కలికి మా చిలక పాడకు నిన్నటి నీ రాగం

రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే
తోటమాలి నీ తోడు లేడులే
వాలిపోయే పొద్దా నీకు వర్ణాలెందుకే
లోకమెన్నడో చీకటాయెలే

చెదిరింది నీ గూడు గాలిగా
చిలక గోరింకమ్మ గాధగా
చిన్నారి రూపాలు కన్నీటి దీపాలు కాగా
తనవాడు తారల్లో చేరగా
మనసు మాంగల్యాలు జారగా
సింధూర వర్ణాలు తెల్లారి చల్లారిపోగా
తిరిగే భూమాతవు నీవై వేకువ లో వెన్నెలవై
కరిగే కర్పూరము నీవై ఆశలకే హారతివై

రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే
తోటమాలి నీ తోడు లేడులే
వాలిపోయే పొద్దా నీకు వర్ణాలెందుకే


అనుబంధమంటేనే అప్పులే
కరిగే బంధాలన్నీ మబ్బులే
హేమంత రాగాల చేమంతులే వాడిపోయే
తన రంగు మార్చింది రక్తమే
తనతో రాలేనంది పాశమే
దీపాల పండక్కి దీపాలే కొండెక్కిపోయే
పగిలే ఆకాశం నీవై జారిపడే జాబిలివై
మిగిలే ఆలాపన నీవై తీగ తెగే వీణియవై

రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే
తోటమాలి నీ తోడు లేడులే
వాలిపోయే పొద్దా నీకు వర్ణాలెందుకే
లోకమెన్నడో చీకటాయెలే

Palli Balakrishna

Most Recent

Default