-->
Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Ghantasala Krishnamurthy"



చిత్రం: రేచుక్క (1955)
సంగీతం: అశ్వద్ధామ
సాహిత్యం: మల్లాది రామకృష్ణశాస్త్రి
నటీనటులు:  యన్. టి. రామారావు, అంజలీ దేవి
కథ: ఘంటసాల బలరామయ్య
దర్శకత్వం: పి.పుల్లయ్య
నిర్మాత: ఘంటసాల కృష్ణమూర్తి
విడుదల తేది: 25.03.1955



Songs List:



ఆ మనసేమో ఆ సొగసేమో పాట సాహిత్యం

 
చిత్రం: రేచుక్క (1954)
సంగీతం: అశ్వద్ధామ
సాహిత్యం: మల్లాది రామకృష్ణశాస్త్రి
గానం: జిక్కీ (పి. జి. కృష్ణవేణి)

ఆ మనసేమో ఆ సొగసేమో 
ఆ మనసేమో 
గారామో అది మారామో 
ఆ తీరే...వేరేమో
మనసేమో సొగసేమో

లాలనగా రారా రమ్మని
లాలనగా రారా రమ్మని
మాలిమైన జవరాలిపైన
మాలిమైన జవరాలిపైన
జాలి లేదో...జాలి లేదో మరీ మరీ 
బ్రతి మాలించుకోవాలో
బ్రతిమాలించుకోవాలో

ఆ మనసేమో ఆ సొగసేమో 
గారామో అది మారామో 
ఆ తీరే...వేరేమో
మనసేమో సొగసేమో

నీరనితనమా నెరజాణ తనమా
నీరనితనమా నెరజాణ తనమా
సరసాల వేళలో చెరసాలె సుఖమేమో
సరసాల వేళలో చెరసాలె సుఖమేమో

మనసేమో ఆ సొగసేమో 
గారామో అది మారామో 
ఆ తీరే... వేరేమో
మనసేమో సొగసేమో




అయ్ సంబరమే పాట సాహిత్యం

 
చిత్రం: రేచుక్క (1954)
సంగీతం: అశ్వద్ధామ
సాహిత్యం: మల్లాది రామకృష్ణశాస్త్రి
గానం: పి. లీల

అయ్ సంబరమే
అయ్ సంబరమే ఆయ్ పండగలే
చినదాన వన్నెదాన
నిను రమ్మనెనే ఇది నమ్మకమే
మనసైనవాడె ఆ రాణా

అయ్ సంబరమే

మరోసారి వాదులాడ
వేడుకైనదో ఏమో ఆ జాణకు
సరేకాని ఇంకోపాటా పాడించనా
దరిజేరి ఇంకో ఆట ఆడించనా

కంటికి బందం వేసి బలేపిల్ల గీర
కంటికి బందం వేసి బలేపిల్ల గీర
ఎటు మారిపోవునో ఏమో

అయ్ సంబరమే ఆయ్ పండగలే
చినదాన వన్నెదాన
నిను రమ్మనెనే ఇది నమ్మకమే
మనసైనవాడె ఆ రాణా
అయ్ సంబరమే

తనో అందగాడేలే చిందులాడి చిన్నదాని
ఒక చూపులోనే మెచ్చి తలక్రిందులాయెలే
తనో అందగాడేలే చిందులాడి చిన్నదాని
ఒక చూపులోనే మెచ్చి తలక్రిందులాయెలే

దారికి రానే రానీ దారికి రానే రానీ 
సరాగాల బాణి 
ఎటుమారిపోయెనా కానీ

అయ్ సంబరమే ఆయ్ పండగలే
చినదాన వన్నెదాన
నిను రమ్మనెనే ఇది నమ్మకమే
మనసైనవాడె ఆ రాణా
అయ్ సంబరమే




అయ్యో బంగారు సామి పాట సాహిత్యం

 
చిత్రం: రేచుక్క (1955)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: మల్లాడి రామక్రిష్ణ శాస్త్రి 
గానం: పి.లీల 

అయ్యోవ్ బంగారు సామీ! 
ఓ రబ్బి బంగారు సామీ!
ఓరయ్యో బంగారు సామీ!
గువ్వలాటిదాన్ని - మల్లెపువ్వు లాటి చిన్నదాన్ని
రవ్వలేం జేసుకోనురో - రాయడా 
రవ్వలొదురా దొర నవ్వు నవ్వరా

ముంతమీద ముంతపెట్టి - రాజా
ముల్లెదీసి మూటగట్టి
ఉట్టిమీద దాచపెట్టి - ఇట్టే తొంగుండగానే
ముంగిలాంటి గండుపిల్లి మూట దాటిసెరో
మూటలో ఏం పోయె - చింతకాయ్ 

తంటాలమారి గువ్వ చేరువకు రాకపోతే
దొరికాయ్ తెన్ను కాయ్ - కాయ్ రాజా కాయ్ ! 
నీడచూసి జాడచూసి నీనీటే వాటమేసి
పట్టుకో - చెట్టబట్టుకో !

దప్పికంటే ఒప్పుకోకు – దూరంగా తప్పుకోకు
చిక్కురా రేచుక్కరా!
గువ్వ దక్కాలంటే - గూడుకట్ట మక్కువుంటే 
కాటమ రాయుడా కంటా కట్టెయ్యరో !




భలే భళా పరువమా పాట సాహిత్యం

 
చిత్రం: రేచుక్క (1955)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: మల్లాడి రామక్రిష్ణ శాస్త్రి 
గానం: ఘంటసాల 

భలే భళా పరువమా
గడనూ పావురమా !
ఎగరాలీ సరదా తిరగ పావురమా 

మబ్బులకు సరాసరి ఎగరాలి హాంసలా
చిక్కాలి నీకూ చక్కని చుక్కలూ
ఆకసమంతా నిరాజ్యమే
ఓ పల్టి వేయించగ బల్ మొనగాడూ
మనకన్నా ఘనుడూ ఏనాడులేడు
బల్ గడుసరి లేడు 

ప్రతిపూటా పంతాలే రోజూ పందెములే
అయితేనేలే హాయీ - ఈ రవ్వలకు
కాలికి తోడా జోడించుకో
కనుచూపు మేరలు అందాలన్నీ చేదుకో
మనసైనా దినుసు ఏ జాడనైనా
అందిన మరీ బాగూ 



ఎక్కడిదీ అందం పాట సాహిత్యం

 
చిత్రం: రేచుక్క (1954)
సంగీతం: అశ్వద్ధామ
సాహిత్యం: మల్లాది రామకృష్ణశాస్త్రి
గానం: జిక్కీ (పి. జి. కృష్ణవేణి)

ఎక్కడిదీ...
ఎక్కడిదీ అందం ఎవ్వరిదీ ఆనందం
ఎక్కడిదీ అందం ఎవ్వరిదీ ఆనందం
వెలిగే ఆనందం చెలరేగే ఆనందం
ఎక్కడిదీ ఆనందం

లోకంలో కన్నెలకూ లోపాలెన్నే చిన్నది
లోకంలో కన్నెలకూ లోపాలెన్నే చిన్నది
మారుని జవరాలికైనా వంకలు దిద్దే వన్నెది
మారుని జవరాలికైనా వంకలు దిద్దే వన్నెది

వెన్నెల దీపల్లె  మెరుపూతీవల్లె
వెన్నెల దీపల్లె  మెరుపూతీవల్లె
ఏడుమల్లె పూవులెత్తు
తూగే బంగారుపాప ఎవరో
ఏలేవేరెవరో కలలేలేవారెవరో

ఎన్నెన్నో ఊహలు కొసరే కోరికవేళ
ఎన్నెన్నో ఊహలు కొసరే కోరికవేళ
మేల్ మేల్ నెయ్యములు మిడిసే వేడుక వేళ
మేల్ మేల్ నెయ్యములు మిడిసే వేడుక వేళ

చిక్కని మక్కువల చక్కలి గింతలవేళ
చిక్కని మక్కువల చక్కలి గింతలవేళ
ఊహల ఉయ్యాలలో ఊగే బంగారు పాప ఎవరో

ఏలేవారెవరో  కలలేలేవారెవరో
ఏలేవారెవరో




ఎటు చూసినా బూటకాలే పాట సాహిత్యం

 
చిత్రం: రేచుక్క (1954)
సంగీతం: అశ్వద్ధామ
సాహిత్యం: మల్లాది రామకృష్ణశాస్త్రి
గానం: పి. లీల

ఎటు చూసినా బూటకాలే
ఎవరాడినా నాటకాలే
ఎటు చూసినా బూటకాలే
ఎవరాడినా నాటకాలే
ఎటు చూసినా బూటకాలే

తలక్రిందుల మారి కలికాలంలో
చెడిపోలేనివారూ చేతకానివారే
తలక్రిందుల మారి కలికాలంలో
చెడిపోలేనివారూ చేతకానివారే
అంటుంది నానా నమ్మమంటుంది నానా
అంటుంది నానా

రూకల సంచీ రొండిన గ్రుచ్చితే
రొమ్ము విరుపొచ్చిందా మొనగాడా
కరుకుందా కాళ్ళకు కదనుందా
ఒరతీయని చురకత్తికి పదునుందా
మనలో కదనుందా పదునుందా

పాగా చుట్టావ్ పగడీ పెట్టావ్
వేషం కట్టావ్ మీసం మెలేశావ్ దొర కొడుకా
పాగా చుట్టావ్ పగడీ పెట్టావ్
వేషం కట్టావ్ మీసం మెలేశావ్ దొర కొడుకా

అడవుల్లో పులికి ఆకలేసి
నీ మీదికి ఒక దుముకు దుమికితే
నిలబడి కలబడతావా?
లాలించి లంచం పెడతావా హోయ్
నిలబడి కలబడతావా?
లాలించి లంచం పెడతావా

ఆ... లేక లేక ఓపిక చేసుకు
రాక రాక రానే వచ్చావ్ గాని ఏం లాభం
లేక లేక ఓపిక చేసుకు
రాక రాక రానే వచ్చావ్ గాని
ఆ... లేక లేక ఓపిక చేసుకు
రాక రాక రానే వచ్చావ్ గాని ఏం లాభం

మీ జగం కాదు ఈ యుగం వేరు తాతా
తరాల్ మారి సంబరాల్ మీరినయ్ తాతా
మీ జగం కాదు ఈ యుగం వేరు తాతా
తరాల్ మారి సంబరాల్ మీరినయ్ తాతా
ఓ తాతా

ఎటు చూసినా బూటకాలే
ఎవరాడినా నాటకాలే
ఎటు చూసినా బూటకాలే




నీ సరి నీవేనమ్మా పాట సాహిత్యం

 
చిత్రం: రేచుక్క (1955)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: మల్లాడి రామక్రిష్ణ శాస్త్రి 
గానం: పి.లీల 

నీ సరి నీవేనమ్మా వయారీ! 
పుట్టిననాడే భూమికి పండుగ
నువ్వు పుట్టిననాడే భూమి పండుగ 
చేపట్టేవారి జన్మ - పండుగ

చూపులతోనే లోకాలేలే సురతాణి అందాల రాణి!
చందమామ కన్న ఎంతో చక్కనీ దానవమ్మా !
చక్కని దానవమ్మా - చక్కానీ దానవమ్మ..
రవ్వల నవ్వుల పువుబోణి- మహా రాజుకు నీవే సంపదవమ్మ
పరువంలో గరువంలో మా కన్నెకులానికి దీవెనవమ్మా 





ఒంటరొంటరిగ పాట సాహిత్యం

 
చిత్రం: రేచుక్క (1954)
సంగీతం: అశ్వద్ధామ
సాహిత్యం: మల్లాది రామకృష్ణశాస్త్రి
గానం: ఘంటసాల

ఒంటరొంటరిగ పోయెదానా
ఒకమాట వినిపో ఒకమాట వినిపొ
ఒంటరొంటరిగ పోయెదానా
ఒకమాట వినిపో ఒకమాట వినిపొ

ఆడేపాడే ఆడేపాడే ఈడున 
తోడుండాలి సైదోడుండాలి నానా ఓ నానా
అదిగదిగో చిట్టడవి అల్లదిగో నట్టడవి
సింహాలుంటాయ్ సివంగులుంటే
రేసులుంటాయ్ దోబూచులుంటాయ్
నాన్న రేసులుంటాయ్ దోబూచులుంటాయ్
ఉసుకోమంటే....ఉసుకోమంటే
ఉలిక్కిపడతావ్ నానా ఓ నానా

తేరతేరగా దొరికిందంటూ
దొర మనసూ దోచుకుపోతావ్
తేరగా దోచుకుపోతవ్

తేరతేరగా దొరికిందంటూ
దొర మనసూ దోచుకుపోతావ్
తేరగా దోచుకుపోతవ్ 

నిన్నంటే కన్నెత్తనంటావ్
పలుకరిస్తే పన్నెత్తనంటావ్
ఓ మైనా... ఈ పైన 
ఓ మైనా... ఈ పైన 
చీటికి మాటికి కోపాలైతే
చిరాకు పెడితే చిక్కున పడతావ్ 

నానా ఓ నానా
ఓ నానా ఓ నానా


Palli Balakrishna Sunday, March 3, 2019

Most Recent

Default