చిత్రం: ఒక చిన్న మాట (1997)
సంగీతం: రమణి భరద్వాజ్
నటీనటులు: జగపతి బాబు, ఇంద్రజ, రక్ష
దర్శకత్వం: ముత్యాల సుబ్బయ్య
నిర్మాత: బూరుగుపల్లి శివరామకృష్ణ
విడుదల తేది: 27.05.1997
Songs List:
ఓ మనసా తొందర పడకే పాట సాహిత్యం
చిత్రం: ఒక చిన్న మాట (1997)
సంగీతం: రమణి భరద్వాజ్
సాహిత్యం: భువనచంద్ర
గానం: యస్.పి.బాలు, చిత్ర
ఓ మనసా తొందర పడకే
పదిమందిలో అల్లరి తగదే
కను చూపులు కలిసే వేళ
నా మాటలు కొంచం వినవే
వరమిచ్చిన దేవుని చూసే
సుముహూర్తం వస్తున్న వేళ
నీకెందుకే ఈ తొందర
ఓ మనసా తొందర పడకే
పదిమందిలో అల్లరి తగదే
కను చూపులు కలిసే వేళ
నా మాటలు కొంచం వినవే
చిరునవ్వుల దేవిని చూసే
సుముహూర్తం వస్తున్న వేళ
నీకెందుకే ఈ తొందర
కోరుస్:
చెప్పవమ్మ చెప్పవమ్మ ఒక చిన్న మాట
చిన్నవాడి మనసు నీతో అన్న మాట
కోరుస్:
చెప్పు చెప్పు ఒక చిన్న మాట
చిన్నదాని మనసు నీతో అన్న మాట
తాజా గులాబి కన్నా
మురిపించు మల్లెల కన్నా
మెరిసే తార కన్నా
తన తలపే నాకు మిన్న
వేదాల ఘోష కన్నా
చిరుగాలి పాట కన్నా
ప్రియమార నన్ను తలిచే
తన మనసే నాకు మిన్న
మోహం, తొలి మోహం
కనుగీటుతున్న వేళ
రాగం, అనురాగం
ఎదపొంగుతున్న వేళ
చెప్పాలి ఒక చిన్న మాట
కోరుస్:
చెప్పవమ్మ చెప్పవమ్మ ఒక చిన్న మాట
చిన్నవాడి మనసు నీతో అన్న మాట
కోరుస్:
చెప్పు చెప్పు ఒక చిన్న మాట
చిన్నదాని మనసు నీతో అన్న మాట
నాలోని ఆశ తానై
తనలోని శ్వాస నేనై
రవలించు రాగమేదో
పలికింది ఈ క్షణాన
నా కంటి పాప తానై
తన గుండె చూపు నేనై
పాడేటి ఊసులన్ని
మెదిలాయి ఈ క్షణాన
గాలి, చిరుగాలి
కబురైనా చేర్చలేవా
చెలిని, నెచ్చెలని
ఒకమారు చూపలేవా
విరహాన వేచే క్షణాన
కోరుస్:
చెప్పవయ్య చెప్పవయ్య ఒక చిన్న మాట
చిన్నదాని మనసు నీతో అన్న మాట
కోరుస్:
చెప్పు చెప్పు ఒక చిన్న మాట
చిన్నవాడి మనసు నీతో అన్న మాట
కుర్రకారు పూజించే దైవమేది పాట సాహిత్యం
చిత్రం: ఒక చిన్న మాట (1997)
సంగీతం: రమణి భరద్వాజ్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్.పి.బాలు, చిత్ర
కుర్రకారు పూజించే దైవమేది
ముమ్ము ముమ్ము ముద్దిస్తా మెత్తగా పాట సాహిత్యం
చిత్రం: ఒక చిన్న మాట (1997)
సంగీతం: రమణి భరద్వాజ్
సాహిత్యం: భువనచంద్ర
గానం: మనో, శ్రీలేఖ
ముమ్ము ముమ్ము ముద్దిస్తా మెత్తగా
మధురము కాదా తిరుమల నాధ పాట సాహిత్యం
చిత్రం: ఒక చిన్న మాట (1997)
సంగీతం: రమణి భరద్వాజ్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: చిత్ర
మధురము కాదా తిరుమల నాధ
ప్రతి ఒకరికి తొలి వలపున పాట సాహిత్యం
చిత్రం: ఒక చిన్న మాట (1997)
సంగీతం: రమణి భరద్వాజ్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్.పి.బాలు, చిత్ర
ప్రతి ఒకరికి తొలి వలపున
ఎవరిని చూస్తూ ఉన్నా పాట సాహిత్యం
చిత్రం: ఒక చిన్న మాట (1997)
సంగీతం: రమణి భరద్వాజ్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్.పి.బాలు, చిత్ర
ఎవరిని చూస్తూ ఉన్నా
చిత్రం: కలిసి నడుద్దాం (2001)
సంగీతం: యస్. ఎ. రాజ్ కుమార్
నటీనటులు: శ్రీకాంత్, సౌందర్య
దర్శకత్వం: కోడి రామకృష్ణ
నిర్మాత: బూరుగుపల్లి శివరామకృష్ణ
విడుదల తేది: 29.06.2001
Songs List:
ఒక్క సారి క్రిందికి రా పాట సాహిత్యం
చిత్రం: కలిసి నాడుద్దాం
సంగీతం: యస్. ఎ. రాజ్ కుమార్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: హరిహరన్, సుజాత
ఒక్క సారి క్రిందికి రా
కాంచారే కాంచారే పాట సాహిత్యం
చిత్రం: కలిసి నాడుద్దాం
సంగీతం: యస్. ఎ. రాజ్ కుమార్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: హరిహరన్, సుజాత
కాంచారే కాంచారే
హల్లో లేడి.. సూపర్ జోడి పాట సాహిత్యం
చిత్రం: కలిసి నాడుద్దాం
సంగీతం: యస్. ఎ. రాజ్ కుమార్
సాహిత్యం: జొన్నవిత్తుల
గానం: శ్రీరాం, సునీత, కృష్ణరాజు, సుప్రజా
హల్లో లేడి.. సూపర్ జోడి
యేనాటి సరసమిది.. పాట సాహిత్యం
చిత్రం: కలిసి నాడుద్దాం
సంగీతం: యస్. ఎ. రాజ్ కుమార్
సాహిత్యం: వేటూరి
గానం: చిత్ర
యేనాటి సరసమిది..ఎన్నాళ్ళ సమరమిది
కలహాలు విరహాలేనా కాపురం?
ఓనాటి ఇష్ట సఖి..ఈనాటి కష్ట సుఖి
పంతాలు పట్టింప్పులకా జీవితం?
పురుషా పురుషా ఆడది అలుసా?
అభిమానాం నీ సొత్తా?
అవమానాం తన వంతా?
ఆడది మనిషే కాదా?
ఆమెది మనసేగా
సమ భావం నీకుంటే...ఆమె నీ మనిషేగా
ఏ ఎండమావులలో ఒంటరిగానే ఎదురీత
నిన్నడిగి రాసాడా బ్రహ్మ నీ తలరత
తరిగెనేమో సంస్కారం
తిరగబడెను సంసారం
శయనేషు రంభలట, బోజ్యేషు మాతలట
కరనేషు మంత్రులు మాత్రం కారట
నింగిలో తారల కోసం శ్రీవారి పోరాటం
ఇంటిలో వెన్నెల కోసం శ్రీమతికి ఆరాటం
ఏ సవాలు ఎదురైనా నీ శక్తికదే ఉరిపిరి రాయి
ఓనమాలు దిద్దుకు చూడు ఒద్దికలో ఉన్నది హాయి
చెప్పలేని అనురాగాం
చెయ్యమంటే ఈ త్యాగం
హక్కున్న శ్రీమతిగా..? పార్వతిగా
కార్యేషు దాసివి ఇకపై కావుగా
జిల్ జిల్ జిల్ జిల్ పాట సాహిత్యం
చిత్రం: కలిసి నాడుద్దాం
సంగీతం: యస్. ఎ. రాజ్ కుమార్
సాహిత్యం: భువనచంద్ర
గానం: మనో , స్వర్ణలత
జిల్ జిల్ జిల్ జిల్
అటు ఇటు చూడకే దోర వయసా పాట సాహిత్యం
చిత్రం: కలిసి నాడుద్దాం
సంగీతం: యస్. ఎ. రాజ్ కుమార్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్.పి.బాలు, చిత్ర
అటు ఇటు చూడకే దోర వయసా
చిత్రం: సాహస వీరుడు సాగర కన్య (1996)
సంగీతం: యమ్. యమ్.కీరవాణి
సాహిత్యం: భువనచంద్ర
గానం: యస్. పి.బాలు, చిత్ర
పల్లవి:
ఘడియ ఘడియకో ముద్దు ఘనమైన ముద్దు అబ్బా అహా
తడవ తడవకో ముద్దూ తడిరేపు ముద్దు అబ్బా ఆహా
తీపి తీపి తేనే ఎంగిళ్ళతో...
తాళలేని లేత అధరాలపై
కిస్స్ మీ కిస్స్ మీ కిస్స్ మీ కిస్స్ మీ కిస్స్ మీ
కిస్సు కిస్సు కిస్సు కిస్సు కిస్సు కిస్సు కిస్స్ మీ
కిస్స్ కిస్స్ కిస్స్ మీ కిస్స్ కిస్స్ మీ
కిస్స్ మీ కిస్స్ మీ కిస్స్ మీ కిస్స్ మీ కిస్స్ మీ
కిస్సు కిస్సు కిస్సు కిస్సు కిస్సు కిస్సు కిస్స్ మీ
ఎనివేర్ కిస్స్ మీ
ఎవ్రీవేర్ కిస్స్ మీ
కిస్స్ కిస్స్ మీ
చరణం: 1
నా చిట్టి బుగ్గమీద పెట్టుకున్న ముద్దు సెగలు రేపితే
నీ పైటచెంగు చాటు పొంచి ఉన్న ముద్దు వయ్యారంగా వాటెయ్మంది
ఓ రాలుగాయి ముద్దు రైకలోన దూరి చనువు కోరితే
నా వయసు రగిలి ముద్దు నాకు వద్దన్నదీ
మగసిరి ముద్దులో ఎంతో సుఖమున్నదీ
సొగసరి ముద్దులై చానాలని అన్నది
ముద్దు ఇంత గొప్పదా
పెదవికి అది తప్పదా
కిస్స్ మీ కిస్స్ మీ కిస్స్ మీ కిస్స్ మీ కిస్స్ మీ
కిస్సు కిస్సు కిస్సు కిస్సు కిస్సు కిస్సు కిస్స్ మీ
కిస్స్ కిస్స్ కిస్స్ మీ కిస్స్ కిస్స్ మీ
చరణం: 2
నీ నంగనాచి ముద్దు దొంగలాగ వచ్చి నడుము తడిమితే
నీ కొంటె కొంటె ముద్దు కోకమీద వాలి ఉయ్యాలల్లే ఊపేసింది
ఓ బుల్లి ఒంపులోన చిక్కుకున్న ముద్దు జగడమాడితే
ఆ చిలిపి తగువు పెంచు ముద్దు హాయన్నది
తడిపొడి ముద్దులో ఏదో రుచి ఉన్నది
చెదరని ముద్దులో చాలా కథ ఉన్నది
ముద్దు ఇంత గొప్పదా
మధనుడి గురి తప్పదా
మీనా మీనా జలతారు వీణ పాట సాహిత్యం
చిత్రం: సాహస వీరుడు సాగర కన్య (1996)
సంగీతం: యమ్. యమ్.కీరవాణి
సాహిత్యం: వేటూరి
గానం: యస్. పి.బాలు, యమ్.యమ్.కీరవాణి
మీనా మీనా జలతారు వీణ
ఏమ్మా ఏమ్మా ఇది కలకాదు లేమ్మా
జలాల లాలి పాటలో
జనించు ప్రేమ బాటలో
జలదరింతలో వింతగా జరిగేను సంగమం
మీనా మీనా జలతారు వీణ
ఏమ్మా ఏమ్మా కలకాదు లేమ్మా
గల గల గల మిల మిల మిల
జల జల జల తళ తళ తళ
కనుల తెరల కలల అలల
కిల కిల కిల కిల కిల కిల లల లల లల లల లలలా
ఓ హలా ఇలా
అలల పల్లకీతో తోరణాలు మణులు కురియదా
తరంగ తంగ వాలుతళుకు తెలిసెలే
ఓ సఖీ చెలీ
వలపు సాగరాల వడ్డుకోరి నీటి నురగనై
స్పృశించ గాలి వీతగాలు వనికెలే
నీటు చీర జారుతున్న నిషిరాత్రిలో
గవ్వలాడు యవ్వనాల కసి రాత్రిలో
ఇద్దరం ఈదుతూ ఏ తీరమో చేరితే
మధుర యాతనే వంతెనై కలిపింది ప్రేమనే
మీనా మీనా జలతారు వీణ
ఏమ్మా ఏమ్మా ఇది కలకాదు లేమ్మా
ఓ ప్రియా ప్రియా
ఎదలు ఒక్కసారి పక్కతాళ జతులు కలుపద
నరాలు నాగవల్లి సాగి నడుమున
నా లయా క్రియా
తెలిసి తామరాకు తల్లడిల్లి తాళమేయగా
సరోజమైన సోకు తాకి చూడనా
ప్రేమలోతు అందుకోనిదే తాపము
హంసలాగ పైన తేలు ఈ ఆభము
చాపలా మారితే గాళాన్ని వేసెయ్యనా
నురగ నవ్వుతో వెల్లువై ముంచెయ్ ముద్దుగా
మీనా - ఏమ్మా
మీనా మీనా జలతారు వీణ
ఏమ్మా ఏమ్మా కలకాదు లేమ్మా
పాలల్లే ఉండాలి హౄదయాల తెలుపు
పరుపల్లే ఉండాలి పడుచోళ్ళ వలపు
తీపల్లే ఉండాలి చిలకమ్మ పిలుపు
ధూపం లా ఉండాలి చినవాడి ఒడుపు
తొలి రేయి యెన్నెన్నో వివరాలు తెలుపు
ఆ.. నా లావణ్యం నీ నైపుణ్యం కలయిక శీతోష్ణం
చీకటి పుణ్యం చేసిన సుదినం యవ్వనమే ధన్యం
ఇక వలదే ధన ధాన్యం
గిల్లాలి అంటోంది నా వేలి గోరు
అల్లాలి అంటోంది నా వంటి పోరు
ఉరకాలి అంటోంది నా కుర్ర కారు
కురవాలి అంటోంది నా చెమట నీరు
కొయ్యాలి అంటోంది వయ్యారి పైరు
ఆ.. గందరగోళం తొందర జాలం సౄష్టికి ఇది మూలం
ఒకటే గేయం సుఖమే ధ్యేయం ఇదుగో అధ్యాయం
అనుభవమే అభ్యాసం
చిత్రం: సీతారత్నం గారి అబ్బాయి (1992)
సంగీతం: రాజ్ - కోటి
సాహిత్యం: భువనచంద్ర
గానం: యస్. పి బాలు, చిత్ర
నాదిరి దినతొం దినతొం దిల్ దిల్లానా
నాదిరి దినతొం దినతొం దిల్ దిల్లానా
దిల్ దిల్ త్రిల్లాన దిల్ దిల్ త్రిల్లాన
ఓ...మత్తుగా గమ్మత్తుగా
చిత్తుగా చెంగొత్తగా
పసిడి పైట పాన్పు చేయనా
పడుచు తనపు పొగరు చూపనా
ఓ...మత్తుగా గమ్మత్తుగా
చిత్తుగా చెంగొత్తగా
నాదిరి దినతొం దిన దినతొం దిన దినతొం దిరినా దిరినా
నాదిరి దినతొం దిన దినతొం దిన దినతొం దిరినా దిరినా
త్రిల్లాన దిల్లానా
దిల్ దిల్ త్రిల్లాన దిల్ దిల్ త్రిల్లాన
దిల్ దిల్ త్రిల్లాన దిల్ దిల్ త్రిల్లాన
లే వయసా తెలుసా తొలిపరువపు పిటపిటలు
నా ఎదలో మెదిలే తొలి ముద్దుల కిటకిటలు
ఓ మనసా వినవే చిరు పెదవుల గుసగుసలు
లాలనగా తడిమే చిరు స్వాసల సరిగమలు
పుట్టిందమ్మా ఈడు ఆ ఆ ఆ...
కోరిందయ్యో తోడు ఆ ఆ ఆ...
తపించి తపించి తరించనా నీలో నేనూ
జపించి జపించి జయించనా నిన్నే నేనూ
తాకాలి ఒళ్ళు ఒళ్ళు కురవాలి ప్రేమ జల్లు గుండెల్లో
ఓ...మత్తుగా గమ్మత్తుగా
చిత్తుగా చెంగొత్తగా
తాంకు జంతై కిటతక జకుతై తాంకు జంతై (2)
ఈ రగిలే సెగలు తొలి వలపుల రిమరిమలే
నీ ఒడిలో పొదిగే అలుపెరుగని విరహములే
ఓ సుఖమే కలిగే కుడిఎడమల నడుమలలో
యవ్వనమే కరిగే తడి తమకపు గడబిడలో
పట్టిందయ్యో పిచ్చి ఆ ఆ ఆ...
గిట్టేంచెయనా వచ్చి ఆ ఆ ఆ...
నిషాలు రసాలు పుట్టించుకో మళ్ళి మళ్ళీ
నషాల నిషాలు రెట్టించుకో తుళ్ళి తుళ్ళి
కూసింది కన్నె కోడి కుదిరింది మంచి జోడి వారేవా
ఆ...మత్తుగా గమ్మత్తుగా
చిత్తుగా చెంగొత్తగా
పడుచు తనపు పొగరు చూపనా
పసిడి పైట పాన్పు చేయనా
ఓ...మత్తుగా గమ్మత్తుగా
చిత్తుగా చెంగొత్తగా
పసివాడో ఏమిటో ఆ పైవాడు పాట సాహిత్యం
చిత్రం: సీతారత్నం గారి అబ్బాయి (1992)
సంగీతం: రాజ్ - కోటి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్. పి బాలు
పసివాడో ఏమిటో ఆ పైవాడు
తను చేసిన బొమ్మలతో తలపడతాడు
వేధించే పంతాలు ఏమిటో
వేటాడే ఈ ఆటకంతు ఎక్కడో
పసివాడో ఏమిటో ఆ పైవాడు
తను చేసిన బొమ్మలతో తలపడతాడు
తాళెరుగని తల్లోక్కరు
తోడెరుగని మోడొక్కరు
కొడుకుండి తండ్రవలేక
సతులుండి పతి కాలేక
తన తలరాతకు తలవంచి
శిలలాగే బ్రతికే దొకరు
బంధాలే సంకెళ్లు వేయగా
బ్రతుకంతా చెరసాల లాగా మారగా
పసివాడో ఏమిటో ఆ పైవాడు
తను చేసిన బొమ్మలతో తలపడతాడు
చేజేతులా ఏ ఒక్కరు
ఏ నేరము చేసెరగరు
తెలిసెవరూ దోషులు కారు
ఫలితం మాత్రం మోశారు
పరులంటూ ఎవరూ లేరు
ఐనా అంతా పగవారు
ఇకనైనా ఈ మంటలారునా
ఇకనైనా ఈ జంట చెంత చేరునా
పసివాడో ఏమిటో ఆ పైవాడు
తను చేసిన బొమ్మలతో తలపడతాడు
వేధించే పంతాలు ఏమిటో
వేటాడే ఈ ఆటకంతు ఎక్కడో
పసివాడో ఏమిటో ఆ పైవాడు
తను చేసిన బొమ్మలతో తలపడతాడు ఆ...
నా మొగుడే బ్రహ్మచారి పాట సాహిత్యం
చిత్రం: సీతారత్నం గారి అబ్బాయి (1992)
సంగీతం: రాజ్ - కోటి
సాహిత్యం: వేటూరి
గానం: రాజ్, పి. సుశీల, యస్. పి. శైలజ
యాహూ...
రంగమ్మత్తా, అనుసూయక్క
సీతమ్మొదినా, చెల్లాయమ్మా
ఇది విన్నారా
ఏమిటే
కొత్తగా వచ్చిన బ్యాంకు మేనేజర్ కి పెళ్ళికాలేదు
అలాగా ఐతే మా మనవరాల్నిచ్చి చేస్తాను
మనవరాలికిచ్చి చేస్తావా
పోనీ నువ్వే చేసుకోకూడదు
మా ముసలోడొప్పుకోడెమోనే
సిగ్గులేకపోతే సరి
వాడు నా మొగుడూ
నా మొగుడే బ్రహ్మచారి
నేనేమో కన్యాకుమారి
నా మొగుడే బ్రహ్మచారి
నేనేమో కన్యాకుమారి
మూడేళ్ళ కిందటే ఈడొచ్చింది
మూడేళ్ళ కిందటే ఈడొచ్చింది
ముదురు బెండకాయ చూసి మూడొచ్చింది
నా మొగుడే బ్రహ్మచారి
నేనేమో కన్యాకుమారి
సోదెమ్మా సోదెమ్మా
ఎలా ఉంది మా జంట
జంట అది ఇప్పపూల పంట
ఐతే మా పెళ్ళేప్పుడంటా
చెబుతాను చెబుతాను
కంచి కామాక్షి మధుర మీనాక్షి
బెజవాడ కనకదుర్గ మీన ఆన
ఇనుకోయే కూనా
నీ పక్కనున్న పోటుగాడే
నిన్ను ఎదుక్కుంటా వచ్చిన ఏటగాడు
ఈడే నీ మెడ్లో తాళి కడతడు
నీ ఒళ్ళో తల పెడతడు
నీ ఊపుకు పగ్గమేస్తడు
ఉయ్యాలకి పాపనిస్తడు
ఇది ఎరుకల సాని మాట
యాహూ...
ఒడ్డు చుస్తే పొడుగు నాకు తెలిసివచ్చింది
బొడ్డు కింద చీరకట్టు అలిసిపోయింది
వాడి చూపు కన్నే వయసు పోపు పెట్టింది
రేపునైనా చేయ్యమంటూ రెచ్చగొట్టింది
ఉలకడు అసలే పలకడు
ఉలకడు అసలే పలకడు
రవికుల తిలకుడు రవికే అడగడు
నా మొగుడే బ్రహ్మచారి
నేనేమో కన్యాకుమారి
నా మొగుడే బ్రహ్మచారి
నేనేమో కన్యాకుమారి
చారి గారు పూజారి గారు
మేము చేసేసు కుంటున్నాము
ఏమిటి
లవ్వు
అవ్వా నువ్వా లవ్వా
అవునోయ్ చెవిలో పువ్వా
పెట్టుమరి పెళ్లి ముహూర్తం
పెడతా పెడతా చూసి మరీ పెడతా
స్వస్తి శ్రీ ప్రజాపతి నామ
ప్రజాపతి హలోపతి హోమియోపతి ఏమిటీ సుత్తి
ముందు ఈ పతి సంగతి చెప్పు
వస్తున్నా వస్తున్నా
వైశాఖ మాసే శుక్లపక్షే ఏకాదశి నాటి రాత్రి
తొమ్మిది ఘడియల పంతొమ్మిదివిఘడియలకు
ఘడియా ఐతే వేసేసు కుంటాం
వేసికుందురు గాని వేసికుందురు గాని
వేసుకోవడానికి వేరే ముహూర్తం ఉంది
ముహూర్తమా ములక్కాయ హ హ హ...
ముహుర్తాలు చూసుకోవు ముద్దు ముచ్చట్లు
మూడు ముళ్ళు కోరుకోవు మూతి చప్పట్లు
అందమంతా అగ్గిమంట రాజుకుంటుంటే
లగ్గమంటూ ఆపమాకు లవ్వు మీదుంటే
జడవను అసలే విడువను
జడవను అసలే విడువను
పెళ్ళికి ముందే తొలిరేయంటా
నా మొగుడే బ్రహ్మచారి
నేనేమో కన్యాకుమారి
నా మొగుడే బ్రహ్మచారి
నేనేమో కన్యాకుమారి
ఆ పాపి కొండల్లో పాట సాహిత్యం
చిత్రం: సీతారత్నంగారి అబ్బాయి (1992)
సంగీతం: రాజ్ - కోటి
సాహిత్యం: భువనచంద్ర
గానం: యస్. పి బాలు, చిత్ర
ఆ పాపి కొండల్లో ఈ పాప గుండెల్లో
ఆ పాపి కొండల్లో ఈ పాప గుండెల్లో ఎన్నో ఊసులు
గోరింక నవ్వుల్లో గోరింట పంటల్లో ఎన్నో బాసలు
బులిపించే చలిలో మది మురిపించే గిలిలో
పరువాల ఒడిలో ఆ సరసాల సడిలో
చలిగాలి కొట్టాల చెలరేగిపోవాల లాయి లాయిలో
ఆ పాపి కొండల్లో ఈ పాప గుండెల్లో
ఆ పాపి కొండల్లో ఈ పాప గుండెల్లో ఎన్నో ఊసులు
గోరింక నవ్వుల్లో గోరింట పంటల్లో ఎన్నో బాసలు
బులిపించే చలిలో మది మురిపించే గిలిలో
పరువాల ఒడిలో ఆ సరసాల సడిలో
చలిగాలి కొట్టాల చెలరేగిపోవాల లాయి లాయిలో
ఆ పాపి కొండల్లో ఈ పాప గుండెల్లో ఎన్నో ఊసులు
తడిగా ఒక పెదవి పొడిగా ఒక పెదవి
తడిగా పొడితడిగా తమకాన దాగితే
తడిగా ఒక తనువు మడిగా ఒక తనువు
తడిగా మడితడిగా తొలి హద్దు దాటితే
తెరిచేయనా ఆ తెరచాపని
విడదీయని ఓ విడిధీయనా
తపనలే తగలనీ లాయి లాల లాయి లాయిలో
ఆ పాపి కొండల్లో ఈ పాప గుండెల్లో ఎన్నో ఊసులు
కొరికే కోరికలే కరిచే కౌగిలిలో
ఎదతో పై ఎదతో సయ్యాటలాడితే
కరిగే ప్రతి నిమిషం మరిగే పరవశమై
కదిపి నిను కుదిపి కేరింతలాడితే
కవ్వించనా కొంగు కొసరించనా
ఊరించకే ఊయలూగించకే
మనువులే కుదరనీ వెన్నెలమ్మ లాయి లాయి లో
ఆ పాపి కొండల్లో ఈ పాప గుండెల్లో ఎన్నో ఊసులు
బులిపించే చలిలో మది మురిపించే గిలిలో
పరువాల ఒడిలో ఆ సరసాల సడిలో
చలిగాలి కొట్టాల చెలరేగిపోవాల లాయి లాయిలో
చిత్రం: తమ్ముడు (1999)
సంగీతం: రమణ గోగుల
నటీనటులు: పవన్ కళ్యాణ్, ప్రీతి జింగానియా, అతిధి గోవిత్రికర్
దర్శకత్వం: పి.ఏ. అరుణ్ ప్రసాద్
నిర్మాత: బూరుగపల్లి శివరామకృష్ణ
విడుదల తేది: 15.07.1999
Songs List:
మేడిన్ ఆంధ్ర స్టూడెంట్ అంటే అర్థం వివరిస్తా పాట సాహిత్యం
చిత్రం: తమ్ముడు (1999)
సంగీతం: రమణ గోగుల
సాహిత్యం: చంద్రబోస్
గానం: రమణ గోగుల
తేరారర తారారే రారర తారారేరా
తేరారర తారారే రారర తారారేరా
తేరారర తారారే రారర తారారేరా
తేరారర తారారే రారర తారారేరా
దిగిదిగితకతక దిగిదిగి తకతక దిగిదిగి తకతకతా
హోయ్ మేడిన్ ఆంధ్ర స్టూడెంట్ అంటే అర్థం వివరిస్తా
నలిగిన డ్రెస్సు కొంత చెదిరిన క్రాపు కొంత
ఎవరూ అనుకోనంత వింతగ ఉంటే చల్తా
హే దిగిదిగితకతక దిగిదిగి తకతక దిగిదిగి తకతకతా
అరె మేడిన్ ఆంధ్ర స్టూడెంట్ అంటే అర్థం వివరిస్తా
నలిగిన డ్రెస్సు కొంత చెదిరిన క్రాపు కొంత
ఎవరూ అనుకోనంత వింతగ ఉంటే చల్తా
చరణం: 1
హే లవ్లీ గర్ల్సే మా టార్గెట్
రిస్కెంతున్నా we don't care
Speed and fast అను సూత్రంతోనే
సెన్సేషనే సృష్టిస్తాం
మా స్టూడెంట్ లైఫే గ్రేటంటూ
మా సాటెవరూ మరి లేరంటూ
తను తలచిన పనిని తప్పక చేసే
ఆంద్రా స్టూడెంట్స్ కింగంటారో
హే... దిగిదిగితకతక దిగిదిగి తకతక దిగిదిగి తకతకతా
అరె మేడిన్ ఆంధ్ర స్టూడెంట్ అంటే అర్థం వివరిస్తా
నలిగిన డ్రెస్సు కొంత చెదిరిన క్రాపు కొంత
ఎవరూ అనుకోనంత వింతగ ఉంటే చల్తా
హే దిగిదిగితకతక దిగిదిగి తకతక దిగిదిగి తకతకతా
అరె మేడిన్ ఆంధ్ర స్టూడెంట్ అంటే అర్థం వివరిస్తా
నలిగిన డ్రెస్సు కొంత చెదిరిన క్రాపు కొంత
ఎవరూ అనుకోనంత వింతగ ఉంటే చల్తా
చరణం: 2
Rough and tough ఏ మా నైజం
రఫ్ఫాడైడం mannerism
Fashion world guys మేమని
మురిసే మీతో ఛాలెంజ్ చేస్తాం
హైటు వెయిటూ వేస్టంటూ
మా హార్టులో గట్సే బెస్టంటూ
ఈ కాలం హీరో ఆజాను బాహుడు
అవనక్కర్లేదనిపిస్తారో...
Hey... Come and get
Hey... Come and get
Hey...
దిగితకతక దిగిదిగి తకతక దిగిదిగి తకతకతా
హేయ్ మేడిన్ ఆంధ్ర స్టూడెంట్ అంటే అర్థం వివరిస్తా
నలిగిన డ్రెస్సు కొంత చెదిరిన క్రాపు కొంత
ఎవరూ అనుకోనంత వింతగ ఉంటే చల్తా
హే దిగిదిగితకతక దిగిదిగి తకతక దిగిదిగి తకతకతా
మేడిన్ ఆంధ్ర స్టూడెంట్ అంటే అర్థం వివరిస్తా
నలిగిన డ్రెస్సు కొంత చెదిరిన క్రాపు కొంత
ఎవరూ అనుకోనంత వింతగ ఉంటే చల్తా
డిస్కోటెక్ లో rap and pop
Every sweep లో లాలిపాప్
Shock and spark అనే సీక్రెట్ తో
మీ చిలకల మనసులు దోచేస్తాం
మా daring dashing చూపించి
Dearest darling అనిపించి
తన దిల్లుకు నచ్చిన లవరొకురుంటే
రాకెట్ స్పీడ్ తో పోతుంటారో
Hey...
పెదవి దాటని మాటొకటుంది పాట సాహిత్యం
చిత్రం: తమ్ముడు (1999)
సంగీతం: రమణ గోగుల
సాహిత్యం: సిరివెన్నెల
గానం: రమణ గోగుల, సునీత
పెదవి దాటని మాటొకటుంది
తెలుసుకో సరిగా హే హే హే
అడుగుతావని ఆశగా ఉంది
అడగవే త్వరగా లలలలలా
అడగరానిది ఏమిటి ఉంది
తెలుపవా సరిగా హో హో హో
మనసు చాటున ఎందుకు ఉంది
తెరలు తీ త్వరగా లల లల లా
చరణం: 1
మనసు నిన్నే తలచుకుంటోంది
వినపడదా దాని గొడవ
తలచుకునే అలసిపోతోందా
కలుసుకునే చొరవ లేదా
ఇబ్బందిపడి ఎన్నాళ్ళిలా ఎలాగ మరి
అందాల సిరి ఒళ్ళొ ఇలా
వచ్చేస్తే సరి హే హే హే
పెదవి దాటని మాటొకటుంది
తెలుసుకో సరిగా హే హే హే
అడుగుతావని ఆశగా ఉంది
అడగవే త్వరగా
చరణం: 2
ఇదిగిదిగో కళ్ళలో చూడు
కనపడదా ఎవ్వరున్నారు
ఎవరెవరో ఎందుకుంటారు
నీ వరుడే నవ్వుతున్నాడు
ఉండాలి నువ్వు నూరేళ్ళిలా
చిలిపి కల
బాగుందిగాని నీ కోరిక
కలైతే ఏలా హే హే హే
పెదవి దాటని మాటొకటుంది
తెలుసుకో సరిగా హే హే హే
అడుగుతావని ఆశగా ఉంది
అడగవే త్వరగా లలలలలా
హే కోయిలా... ఓ కోయిలా... (4)
ఏదోలా ఉందీవేళ నాలో పాట సాహిత్యం
చిత్రం: తమ్ముడు (1999)
సంగీతం: రమణ గోగుల
సాహిత్యం: సురేంద్ర కృష్ణ
గానం: రమణ గోగుల
ఏదోలా ఉందీవేళ నాలో
ఈ వింత ఏమిటో గిలిగింత ఏలనో
ఈ మాయే ప్రేమేనేమో భాయి
ఎటువైపు చూసినా ఎదలోని రూపమే
She looks just like monalisa
స్మైలిస్తే ఒక థ్రిల్లేరా
She opens my heart, god! she is so cute
చెలి వదనం సుమకుసుమం రా
హేయ్ are you in love?
Yes yes I am in love Tell me
హేయ్ are you in love?
Yes yes I am in love
అరే కొంపతీసి లవ్ లో పడిపోయాడేటి?
పిల్లోయీ... మది సంగీతం పాడింది
పిల్లోయీ... ప్రేమే నాలో ఆడింది
ఏదోలా ఉందీవేళ నాలో
ఈ వింత ఏమిటో గిలిగింత ఏలనో
ఈ మాయే ప్రేమేనేమో భాయి
ఎటువైపు చూసినా ఎదలోని రూపమే
చరణం: 1
పిల్లోయీ... మది సంగీతం పాడింది
చెలి తనువును తాకిన చిరుగాలైనా
నా తనువు తాకగా మది పులకరించదా
తన పలుకులు వింటే కోయిల కూడా
మరి చిన్న బోవదా శెలవంటూ సాగదా
She looks just like monalisa
స్మైలిస్తే ఒక థ్రిల్లేరా
She opens my heart, god! she is so cute
చెలి వదనం సుమకుసుమం రా
హేయ్ are you in love?
Yes yes I am in love Tell me
హేయ్ are you in love?
Yes yes I am in love
చరణం: 2
ఏదోలా ఉందీవేళ నాలో
ఈ వింత ఏమిటో గిలిగింత ఏలనో
ఈ మాయే ప్రేమేనేమో భాయి
ఎటువైపు చూసినా ఎదలోని రూపమే
She looks just like monalisa
స్మైలిస్తే ఒక థ్రిల్లేరా
She opens my heart, god! she is so cute
చెలి వదనం సుమకుసుమం రా
హేయ్ are you in love?
Yes yes I am in love Tell me
హేయ్ are you in love?
Yes yes I am in love
ఒరేయ్ మనోడు ఈ రేసులో పాడేస్తున్నాడేంట్రోయ్
పిల్లోయీ... మది సంగీతం పాడింది
పిల్లోయీ... ప్రేమే నాలో ఆడింది
లవ్ లో పడ్డావా... అరె లవ్ లో పడ్డాను
లవ్ లో పడ్డావా... Yes yes I am in love
రేయ్ రేయ్ లవ్ లో పడ్డావా... ఔన్రా లవ్ లో పడ్డాను
లవ్ లో పడ్డవా... Yes yes I am in love
వయ్యరి భామ నీ హంస నడక పాట సాహిత్యం
చిత్రం: తమ్ముడు (1999)
సంగీతం: రమణ గోగుల
సాహిత్యం: సిరివెన్నెల
గానం: రమణ గోగుల
వయ్యారి భామ నీ హంస నడక
ఎందుకే ఈ తొందర తొందర
ముద్దుల గుమ్మ ఇందరి ముందర
రేపకే నా గుండెలో దడదడ
ఏ పిల్లా నీ పేరు లవ్లీ జారిపోకే చేపల్లే తుళ్ళి
జాంపండులా ఉన్నావే బుల్లి ఊరించకె మళ్ళీ మళ్ళీ
వయ్యరి భామ నీ హంస నడక
ఎందుకే ఈ తొందర తొందర
ముద్దుల గుమ్మ ఇందరి ముందర
రేపకే నా గుండెలో దడదడ
చరణం: 1
అరె ఎన్ని సైగలు చేశా దొరసానికి కనబడదే
తన కోసమే కదా వేషాలేశా సిగ్నలే రాదే
పలకరిస్తే సరదాగా బదులురాదే అసలు
నడుమూగుతూ ఊపుతూ సింగారంగా
చూడు ఆ లయలు
Why doesn't she talk to me?
మా సిన్నోడ్తో ఊసులాడవే సిలక
Why doesn't she walk with me?
ఈ సంటోడెనకే ఎళ్ళవే కులుకా
వయ్యరి భామ నీ హంస నడక
ఎందుకే ఈ తొందర తొందర
ముద్దుల గుమ్మ ఇందరి ముందర
రేపకే నా గుండెలో దడదడ
చరణం: 2
ఏం చేస్తే ఈ చిన్నారి లిల్లి
ఏరికోరి నా చెంతకొస్తుంది
ఏమిస్తే తనగాలి మళ్ళి
ఎగురుకుంటూ ఒళ్ళో పడుతుంది
ఓరి ఫ్రెండు చెప్పరా సలహా
షార్టురూటు వుందా లేదా
ఏందిరా ఈ అమ్మడి తరహా
ఎంత కాలం నాకీబాధ
మన హైటు సరిపోలేదా
తనకన్న పొడవు కదా
మన లెవలు సంగతి తెలుసోలేదో
చెప్పరా గురుడా
పెదవినుంచి ఒక నవ్వొస్తే
తన సొమ్మేం పోదుకదా
పడుచువోణ్ణి కొనచూపుతో చూస్తే
అరిగిపోదు కదా
Why doesn't she look at me?
ఒక చూపు చూడవే అమ్మే ఈణ్ణి
Why doesn't she care for me?
ఛీ కొట్టి ఎళ్ళిపోకే సిన్ని
Why doesn't she stop for me?
జర ఆగే ఆగే ఆగే రాణి
Why doesn't she just love me?
ప్రేమించరాదటే ఈణ్ణి పోని
Oh! why doesn't she just love me?
పో ప్రేమించరాదటే ఈణ్ణి పోని
Why doesn't she just love me?
ప్రేమించరాదటే బుల్లో ఈణ్ణి
Why doesn't she just love me?
ప్రేమించోలమ్మో ఈణ్ణి పోని
Why doesn't she just love me?
Travelling Soldier పాట సాహిత్యం
చిత్రం: తమ్ముడు (1999)
సంగీతం: రమణ గోగుల
సాహిత్యం: రమణ గోగుల
గానం: రమణ గోగుల
Look at my face in the mirror
and I wonder what I see
I'm just a travelling soldier
and I'll be all I can be
But right now I just wanna be free
I wanna be all I can be
But right now I just wanna be free
I wanna be all I can be though
you may say I am a player
you may know who I can be
If they wanna know who I am
they just have to wait and see
But right now I just wanna be free
I wanna be all I can be
look at my face in the mirror
and I wonder what I see
I'm just a travelling soldier
and I'll be all I can be
But right now I just wanna be free
I wanna be all I can be
But right now I just wanna be free
I wanna be all I can be
hey hey I wanna be all I can be
చరణం: 1
I'm just a travelling soldier
and I'll be all I can be
But right now I just wanna be free
I wanna be all I can be
But right now I just wanna be free
I wanna be all I can be
I'm just a travelling soldier
and I'll be all I can be
But right now I just wanna be free
I wanna be all I can be
But right now I just wanna be free
I wanna be all I can be
hey hey I wanna be all I can be
hey hey I wanna be all I can be
hey hey I wanna be all I can be
కళకళలు కిలకిలలు పాట సాహిత్యం
చిత్రం: తమ్ముడు (1999)
సంగీతం: రమణ గోగుల
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్. పి.బాలు
కళకళలు కిలకిలలు కొత్తగ చేరెను మా ఎదగూటికి
వెలుతురులు వెన్నెలలు ఎదురుగ నిలిచెను మా కన్నులకి
రాముడికి జానకికి పెళ్ళి కుదిరినది
ఈ... సందడికి విందులకి ఇల్లు మురిసినది
గల గల కళకళలు కిలకిలలు
కళకళలు కిలకిలలు కొత్తగ చేరెను మా ఎదగూటికి
వెలుతురులు వెన్నెలలు ఎదురుగ నిలిచెను మా కన్నులకి
రాముడికి జానకికి పెళ్ళి కుదిరినది
ఈ... సందడికి విందులకి ఇల్లు మురిసినది... హోయ్
చరణం: 1
నమ్మలేని లోకం నుంచి మహాలక్ష్మిలాగా
అమ్మలేని మా ఇంట్లోకి వదినమ్మ రాకా
ఎన్నడైన తన వెనకాలే ఉంటాను కనకా
అన్నగారు తననేమన్నా ఉరుకోను ఇంకా
నా చిన్ని అల్లర్లన్నీ భరించాలి అంతా ఓర్పుగా
కళకళలు కిలకిలలు కొత్తగ చేరెను మా ఎదగూటికి
వెలుతురులు వెన్నెలలు ఎదురుగ నిలిచెను మా కన్నులకి
చరణం: 2
మెట్టినింటి దీపం నీతో వెలగాలి మళ్ళీ
కూతురంటి రూపం నీదే నా చిట్టితల్లి
ఆశలన్నీ అక్షింతలుగా జరగాలి పెళ్ళీ
అందమైన జంటను చూసి మురవాలి తాళి
విడిది నేను ఇస్తానంటూ తపించాలి నింగిన జాబిలి
కళకళలు కిలకిలలు కొత్తగ చేరెను మా ఎదగూటికి
వెలుతురులు వెన్నెలలు ఎదురుగ నిలిచెను మా కన్నులకి