చిత్రం: మామా మశ్చీంద్ర (2023) సంగీతం: చైతన్ భరద్వాజ్ నటీనటులు: సుధీర్ బాబు, ఈషారెబ్బ దర్శకత్వం: మురళి కిషోర్ అబ్బూరు నిర్మాత: బన్నీ వాస్ విడుదల తేది: 2023
Songs List:
గాలుల్లోనా కలలే వాలే పాట సాహిత్యం
చిత్రం: మామా మశ్చీంద్ర (2023) సంగీతం: చైతన్ భరద్వాజ్ సాహిత్యం: కృష్ణకాంత్ గానం: కపిల్ కపిలన్, నూతన్ మోహన్ గాలుల్లోనా కలలే వాలే కనురెప్పే దాటే కొత్తగా సరికొత్తగా నీలా మారే మైకంలోన కనులే తేలే అరె, నిన్నే చూసే చుట్టిలా కనికట్టులా మాయే చేరే ఏమైందో భూమే నేడిలా ఆగాగి తిరిగెలే నా కలలు పిలిచెగా నిలిచి నా ముందే ఏమైందో సాగే మేఘమే తలను నిమిరేలే నీ వలన కుదురుగా మనసు లేకుందే అమ్మమ్మో నిన్నే చూస్తు చూస్తు మారే తనువే అద్దంలో నేనే వేరేలా ఉన్నా అమ్మాయో మాయో నీతో చేరే చనువే గుండెల్లోనా మోగెలే గాలుల్లోనా కలలే వాలే కనురెప్పే దాటే కొత్తగా సరికొత్తగా నీలా మారే మైకంలోన కనులే తేలే అరె, నిన్నే చూసే చుట్టిలా కనికట్టులా మాయే చేరే తెగదు కల నీదేలే నీదెలే ఈవేళే పగలు ఒకటే గొడవ ఎలా నడిపే నను నీవేలే నీవేలే నీవేలే నీకేదిష్టం అయితే నే మెచ్చేస్తా చెలియా నువ్వేసే ఓ అడుగే రమ్మంటు నన్నడిగే ఎందాకైనా వస్తా నీతో పాటే తూఫాను నీ పరుగే గల్లంతు నా గొడుగే వదలనులే నిన్నే పదా ఏమైందో భూమే నేడిలా ఆగాగి తిరిగెలే నా కలలు పిలిచెగా నిలిచి నా ముందే ఏమైందో సాగే మేఘమే తలను నిమిరేలే నీ వలన కుదురుగా మనసు లేకుందే అమ్మమ్మో నిన్నే చూస్తు చూస్తు మారే తనువే అద్దంలో నేనే వేరేలా ఉన్నా అమ్మాయ్యో మాయో నీతో చేరే చనువే గుండెల్లోనా మోగెలే దీంతనా హఠాత్తుగా నా రాతలో గ్రహాలు మలుపే తిరిగే కనులు కనులు కలిసి చెలిమి పెరిగే మరుగుపడని మధురక్షణమిదే అదేమిటో నీ రాకతో లయలూగిందే ఊపిరే నీవైపే చూపే లాగే ఈ క్షణం ఇలా నీతో పాటే అలా అణువణువు మెరిసే మిలమిలా ఆకాశమే ఈ వేళే నాకోసమే ఈ నేలే తాకే తీరాలే ఆశే తీరేలా ఏమైందో భూమే నేడిలా ఆగాగి తిరిగెలే నా కలలు పిలిచెగా నిలిచి నా ముందే ఏమైందో సాగే మేఘమే తలను నిమిరేలే నీ వలన కుదురుగా మనసు లేకుందే అమ్మమ్మో నిన్నే చూస్తు చూస్తు మారే తనువే అద్దంలో నేనే వేరేలా ఉన్నా అమ్మాయ్యో మాయో నీతో చేరే చనువే గుండెల్లోనా మోగెలే దీంతనా
మందు సాంగ్ పాట సాహిత్యం
చిత్రం: మామా మశ్చీంద్ర (2023) సంగీతం: చైతన్ భరద్వాజ్ సాహిత్యం: చైతన్య ప్రసాద్ గానం: సింహ, హరిణి హే వాట్ ఎ డే వాట్ ఎ నైట్ వచ్చెను వండరుగా హే వాట్ టు డూ, వై టు డూ డౌటులు ఏలా? సై అంటూనే అంటూనే సందాడి చెయ్యుమురా హే లవ్లీగా జాలీగా అల్లరి అల్లరిగా ఈ రాత్రొక తెలియని స్కెచ్చు అరె వెచ్చగ పిలిచెను స్కాచు నచ్చని విలువలు తూచ్చు ఇక రచ్చే రచ్చే రచ్చే కాదా అమ్మ బాబోయ్ ఏప్పుడేమవ్వుతుందో గుండె గట్టిగ కొట్టుకుందే అయ్య బాబోయ్ భయ్యమే రయ్యుమంటు దెయ్యమయ్యి పట్టిందే ఉండలేమే ఎప్పుడు ఒక్కలాగే అప్పుడప్పుడు తప్పు ఓకే రైటు ఏదో రాంగేదో చెప్పలేము నచ్చినట్టు చెయ్యాలే మొన్నెప్పుడో మెచ్చుకుందే ఈ రోజునే నచ్చదు అంటే అదేదో ఘోరమైన తప్పుగా చూడవచ్చున, నా నా రొటీనునే రోస్టని అంటే ఒపీనియన్ మార్చుకుంటే క్యారెక్టర్ పిచ్చుక గూడులా కుప్పకూలి పోవునా, నా నా చిన్న మాటలోని తేడా నిన్న రోడ్డులోనే పాడా కళ్ళెమెయ్యలేని ఘోడ ఆశ కూడ దూకి కొత్త కొత్త కొత్త కొత్త దౌడు తీసెలే అమ్మ బాబోయ్ ఏమిటో చెప్పలేను అర్ధమవ్వుతు అవ్వకుందే అయ్య బాబోయ్ డెస్టినీ ద్రుష్టి ఏంటో పిచ్చి పట్టి పోతుందే ఉండలేమే ఎప్పుడు ఒక్కలాగే అప్పుడప్పుడు తప్పు ఓకే రైటు ఏదో రాంగేదో చెప్పలేము నచ్చినట్టు చెయ్యాలే ఆనాటి ఆ ఓల్డు వైను ఏనాటికి గోల్డెను మైను అంటూనే నెత్తిమీద మొయ్యనా పారాబొయ్యనా వచ్చాక ఓ న్యూ సన్ షైను వచ్చెనులే కాంతి రేణు వద్ధంటు కర్టెన్ ముయ్యనా కాలు అడ్డుపెట్టనా, నా నా చాలు చిత్రమైన థాట్సు ఇంక కొట్టమంది చీర్సు బ్రేకు అయ్యిపోతె రూల్సు వెయ్యి పఠాసు కొట్టు మస్తు మస్తు మస్తు మస్తు మస్తు వీర ఛాన్సులే అమ్మ బాబోయ్ సంగతే తేలకుంది బెంగ బెంగగా ఉంది లోన అయ్య బాబోయ్ నంగిలా నవ్వుతోంది దొంగలాంటి ఈ వేళా
Maama Mascheendra (2023)
చిత్రం: వినరో భాగ్యము విష్ణుకథ (2023) సంగీతం: చైతన్ భరద్వాజ్ నటీనటులు: కిరణ్ అబ్బవరం , కాశ్మీర దర్శకత్వం: మురళి కిషోర్ అబ్బూరు నిర్మాత: బన్నీ వాస్ విడుదల తేది: 17.02.2023
Songs List:
వాసవ సుహాస గమన సుధా పాట సాహిత్యం
చిత్రం: వినరో భాగ్యము విష్ణుకథ (2023) సంగీతం: చైతన్ భరద్వాజ్ సాహిత్యం: కళ్యాణ చక్రవర్తి త్రిపురనేని గానం: కారుణ్య వాసవ సుహాస గమన సుధా ద్వారవతీ కిరనార్బటీ వసుధా అశోక విహితాం క్రుపానాన్రుతాం కోమలామ్ మనోజ్ఞితం మమేకవాకం మయూఖ యుగళ మధుసూదన మదనా మహిమగిరి వాహఘనా నాం రాగ రధసారధి హే రమణా శుభచలన సం ప్రోక్షణా యోగ నిగమ నిగమార్చన వశనా అభయప్రద రూపగుణ నాం లక్ష్య విధి విధాన హే సదనా నిఖిల జన సా లోచన యుగ యుగాలుగా ప్రభోధమై పది విధాలుగా పదే పదే పలికేటి సాయమీమన్న జాడలే కదా నువ్వెదికినదేదైనా చిరుమోవికి జరిగిన చిరునవ్వుల ప్రాసన చిగురేయక ఆగునా… నువ్వెళ్ళే దారిన నిను నిన్నుగా మార్చిన… నీ నిన్నటి అంచున ఓ కమ్మటి పాఠమే… ఎటు చూసినా మయూఖ యుగళ మధుసూదన మదనా మహిమగిరి వాహఘనా నాం రాగ రధసారధి హే రమణా శుభచలన సం ప్రోక్షణా యోగ నిగమ నిగమార్చన వశనా అభయప్రద రూపగుణ నాం లక్ష్య విధి విధాన హే సదనా నిఖిల జన సా లోచన
ఓ బంగారం పాట సాహిత్యం
చిత్రం: వినరో భాగ్యము విష్ణుకథ (2023) సంగీతం: చైతన్ భరద్వాజ్ సాహిత్యం: భాస్కరభట్ల గానం: కపిల్ కపిలన్ ఓ బంగారం... నీ చెయ్యి తాకగానే ఉప్పొంగి పోయిందే నా ప్రాణం నా బంగారం... కన్నెత్తి చూడగానే నిద్దర్లె మానేచి జాగారం నా చిట్టి చిట్టి గుండే నీ లోనే కొట్టుకుందే బుర్రంతా పిచ్చెక్కిందే నా బంగారు తల్లి ఏ మొట్ట మొదటిసారి మరిచానే ఇంటి దారి ఆ సొట్ట బుగ్గతోటే నువ్వు నవ్వబట్టే అద్తోదం ఇంత యుద్ధం చేయలేదే నీకోసం మారిపోవడం నమ్మే లేదే పుట్టాక ఇంత ఆనందం చూడలేదే నీ పేరే చెప్పుకుంటా ఈ పుణ్యం నీదే నువ్వు పక్కనుంటే చాల్లే మత్తుఎక్కి తూలె మాయదారి మనసే మరి నిన్ను తాకే గాలే నన్ను తాకుతుంటే ఆదమరుపు ఇప్పుడే ఎగసే నీ చూపు వలకే చాపలా దొరికే నా ఊపిరే తొలిగా అల్లాడే ఈ ప్రేమ వలలో ఏదో ఏదో జరిగే నడిచి నడిచి ఆగి ఆగేలా.. నా చిట్టి చిట్టి గుండె నీలోనే కొట్టుకుందే బుర్రంతా పిచ్చెక్కిందే నా బంగారు తల్లి ఏ మొట్టమొదటిసారి మరిచానే ఇంటి దారి ఆ సొట్ట బుగ్గ తోటే నువ్వు నవ్వబట్టే కాటుక కనులే పుట్టిస్తుంటే కలలే వదిలేదెట్టాగే ఓ మైనా నీ వల్లే మొదలై తిక్క తిక్క పనులే దిల్ రూబా మోగిందే నాలోనా నీ పేరు పిలిచే ఆస్తమాను తలిచే నా సంగతే మరిచా అదేంటో ఈ ప్రేమ కథలో చాలా చాలా తెలిసే ఒకటో రెండో ఎన్నో ఎన్నెన్నో చిట్టి చిట్టి గుండె నీలోనే కొట్టుకుందే బుర్రంతా పిచ్చెక్కింది నా బంగారు తల్లి ఏ మొట్టమొదటిసారి మరిచానే ఇంటి దారి ఆ సోట్ట బుగ్గ తోటే నువ్వు నవ్వబట్టే
దర్శన పాట సాహిత్యం
చిత్రం: వినరో భాగ్యము విష్ణుకథ (2023) సంగీతం: చైతన్ భరద్వాజ్ సాహిత్యం: భాస్కరభట్ల గానం: అనురాగ్ కులకర్ణి మనసే మనసే తననే కలిసే అపుడే అపుడే తొలిప్రేమలోన పడిపోయా కదా తనతో నడిచే అడుగే మురిసే తనకా విషయం చెప్పలేక ఆగిపోయా కదా ఎన్నో ఊసులు ఉన్నాయిలే గుండే లోతుల్లో అన్ని పంచేసుకుందామంటే కళ్ళముందు లేదాయే దర్శన దర్శన తన దర్శనానికింకా ఎన్నాళ్ళు కన్నీళ్లతో ఉండాలిలా తట్టుకోడం కాదే నావల్ల వయ్యారి పిల్ల గుక్కపట్టి ఏడుస్తుందే ప్రాణం నీవల్లా తట్టుకోడం కాదే నావల్ల వయ్యారి పిల్ల గుక్కపట్టి ఏడుస్తుందే ప్రాణం నీవల్లా ఇష్టమైంది లాగేసుకుంటే చంటిపిల్లాడల్లాడినట్టే దిక్కు తోచకుందే నాకు నువ్వే లేకుంటే నువ్వుగాని నాతో ఉంటే నవ్వులేరుకుంటానంతే నీ జతలో క్షణాలకే దొరికెను పరిమళమే చక్కగా చెట్టాపట్టా తిరిగాం అట్టా ఇట్టా అరె లెక్కపెట్టుకుంటే బోలెడు ఉన్నాయిలే చెప్పాలంటే తట్టుకోడం కాదే నావల్ల వయ్యారి పిల్ల గుక్కపట్టి ఏడుస్తుందే ప్రాణం నీవల్లా తట్టుకోడం కాదే నావల్ల వయ్యారి పిల్ల గుక్కపట్టి ఏడుస్తుందే ప్రాణం నీవల్లా దారులన్ని మూసేసినట్టే చీకటేసి కప్పేసినట్టే నువ్వు లేకపోతే నేను ఉన్నా లేనట్టే చందమామ రావే రావే జాబిలమ్మ రావే రావే కమ్ముకున్న ఈ మేఘాలలో వెలుతురు కనబడదే బెంగతో ఇల్లా ఇల్లా పోయేలా ఉన్నానే పిల్ల నువ్వొచ్చేదాకా పచ్చి గంగైనా ముట్టనులే నీమీదొట్టే తట్టుకోడం కాదే నావల్ల వయ్యారి పిల్ల గుక్కపట్టి ఏడుస్తుందే ప్రాణం నీవల్లా తట్టుకోడం కాదే నావల్ల వయ్యారి పిల్ల గుక్కపట్టి ఏడుస్తుందే ప్రాణం నీవల్లా
చుక్కలెత్తు కొండలే పాట సాహిత్యం
చిత్రం: వినరో భాగ్యము విష్ణుకథ (2023) సంగీతం: చైతన్ భరద్వాజ్ సాహిత్యం: కళ్యాణ చక్రవర్తి త్రిపురనేని గానం: అనురాగ్ కులకర్ణి చుక్కలెత్తు కొండలే నిండినా శ్రీపురం నెత్తికొప్పు దేవుడీ కాపురం మట్టితల్లి బొట్టులా ఎప్పుడూ సంబరం ఎంకన్న సామికున్న ఎండి దోరం ఊరులెన్ని చూసుకో వారికో వీరికో పేరు పెట్టుకోవడం ఖచ్చితం ఎల్లలన్ని ఏకమై చేసినా సంతకం వేవేల మైళ్ళకైనా కాదు దూరం పేదరాసి పెద్ద ముత్తైదువురా సాధువురా ఈ ఊరే చేసుకున్న పూర్వపుణ్యముంటేనే పుడతారే మా ఊరే దేశం మొత్తం పరపతిరా తిరుపతి పేరంటే మోతరా సామికైనా ధీమాలాగా నిలబడతారే ఇట్టాంటి ఊరు చూడరే చుక్కలెత్తు కొండలే నిండినా శ్రీపురం నెత్తికొప్పు దేవుడీ కాపురం మట్టితల్లి బొట్టులా ఎప్పుడూ సంబరం ఎంకన్న సామికున్న ఎండి దోరం సరదా సంద్రంలా ఉంటారే సర్దుకు పోతారే సమయాసమయాలే లేకుండా సాయం చేసే కుదురే దిగులే దాటుకొని స్థిరంగా నిలబడిపోతారే కల్లాకపటాన్నే ఖండించి నవ్వుతు గెలువగ పొగరే ఈ యాసలో ఉందో కదరే అరె వినరో భాగ్యంబిదికదరే మీసాల సామి ఉన్న ఊరే రోషాలకేమో మాది పెద్ద పేరే ఊరు చూస్తే కొత్తకొత్తగుంటుందీ ప్రతిసారి కంగారే వింద వింద గోవిందా అనుకుంటూ కష్టాలే దాటేరే దేశం మొత్తం పరపతిరా తిరుపతి పేరంటే మోతరా సామికైనా ధీమాలాగా నిలబడతారే ఇట్టాంటి ఊరు చూడరే (2) చుక్కలెత్తు కొండలే నిండినా శ్రీపురం నెత్తికొప్పు దేవుడీ కాపురం మట్టితల్లి బొట్టులా ఎప్పుడూ సంబరం ఎంకన్న సామికున్న ఎండి దోరం
ప్రవాసాన్ని పాట సాహిత్యం
చిత్రం: వినరో భాగ్యము విష్ణుకథ (2023) సంగీతం: చైతన్ భరద్వాజ్ సాహిత్యం: కళ్యాణ చక్రవర్తి త్రిపురనేని గానం: హైమత్ మహమ్మద్ ప్రవాసాన్ని
Vinaro Bhagyamu Vishnu Katha (2023)
చిత్రం: 18 Pages (2022) సంగీతం: గోపి సుందర్ నటీనటులు: నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ దర్శకత్వం: పలనాటి సూర్య ప్రతాప్ నిర్మాత: బన్నీ వాస్ విడుదల తేది: 23.12.2022
Songs List:
నన్నయ్య రాసిన పాట సాహిత్యం
చిత్రం: 18 Pages (2022) సంగీతం: గోపి సుందర్ సాహిత్యం: శ్రీమణి గానం: పృద్వి చంద్ర, సితార కృష్ణ కుమార్ ఏ కన్నుకి… ఏ స్వప్నమో ఏ రెప్పలైనా తెలిపేనా ఏ నడకది… ఏ పయనమో ఏ పాదమైనా చూపేనా నీలో స్వరాలకే నేనే సంగీతమై నువ్వే వదిలేసిన పాటై సాగనా నన్నయ్య రాసిన కావ్యమాగితే తిక్కన తీర్చెనుగా రాధమ్మ ఆపిన… పాట మధురిమ కృష్ణుడు పాడెనుగా ఏ కన్నుకి… ఏ స్వప్నమో ఏ రెప్పలైనా తెలిపేనా నిన్నెవరో పిలిచి రమ్మని అన్నట్టు ఏ వైపుకో, ఓ ఓ నువ్వెళ్లినా నాకెవ్వరో చెప్పినట్టు నీ పనులే చేస్తున్నా ఒట్టూ నన్నయ్య రాసిన కావ్యమాగితే తిక్కన తీర్చెనుగా, ఆ ఆ రాధమ్మ ఆపిన… పాట మధురిమ కృష్ణుడు పాడెనుగా, ఆ ఆ ఏ కన్నుకి… ఏ స్వప్నమో ఏ రెప్పలైనా తెలిపేనా ఏ నడకది… ఏ పయనమో ఏ పాదమైనా చూపేనా నీలో స్వరాలకే నేనే సంగీతమై నువ్వే వదిలేసిన పాటై సాగనా నన్నయ్య రాసిన కావ్యమాగితే తిక్కన తీర్చెనుగా రాధమ్మ ఆపిన… పాట మధురిమ కృష్ణుడు పాడెనుగా నన్నయ్య రాసిన కావ్యమాగితే తిక్కన తీర్చెనుగా రాధమ్మ ఆపిన… పాట మధురిమ కృష్ణుడు పాడెనుగా
టైం ఇవ్వు పిల్ల పాట సాహిత్యం
చిత్రం: 18 Pages (2022) సంగీతం: గోపి సుందర్ సాహిత్యం: శ్రీమణి గానం: శిలంబరసన్ (శింబు) ఏ నీకు నాకు బ్రేకప్ అయ్యి వన్ డే కూడా అవ్వలేదు నా గుండె ఇంకా నమ్మలేదు కంటి రెప్ప కింద తడి ఇంక ఆరనైనా లేదు ఇంతలోనే ఇంకోడితో ఇకిలించేస్తు ఇన్‌స్టాగ్రామ్ రీలే పెట్టకు నా మనసుని ఇష్టం వచ్చినట్టు చితక్కొట్టకు టైం ఇవ్వు పిల్ల కొంచెం టైం ఇవ్వు నిన్ను కొంచెం కొంచెం మర్చిపోయే టైమివ్వు టైం ఇవ్వు పిల్ల కొంచెం టైం ఇవ్వు నిన్ను కొంచెం కొంచెం మర్చిపోయే టైమివ్వు ఏ పోయిందల్లా పాస్టేనంటూ జరిగిందంతా వేస్టేనంటూ మోటివేషన్ కొటేషన్లు గూగుల్ నుంచి కాపీ చేసి బ్యూటీ మోడ్ సెల్ఫీ తీసీ ఆడ్నీ ఈడ్నీ ట్యాగే చేసి ఫేస్ బుక్కు వాల్ పైనా పోస్ట్ వెయ్యకు నా పిడికిడంత గుండెకు పోస్టుమార్టం చెయ్యకు టైం ఇవ్వు పిల్ల కొంచెం టైం ఇవ్వు నిన్ను కొంచెం కొంచెం మర్చిపోయే టైమివ్వు టైం ఇవ్వు పిల్ల కొంచెం టైం ఇవ్వు నిన్ను కొంచెం కొంచెం మర్చిపోయే టైమివ్వు ఈ జనరేషన్ పిల్లగాన్ని కాదా నేను మరి నీలాగా మూవ్ ఆన్ ఎందుకవ్వలెను ఐ లవ్ యూ రా బేబీ అంటూ డేలీ నువ్వు వాట్సాప్ లో చేసిన చాట్ కి వాల్యూ ఇవ్వు మన పాస్ట్ అసలు గుర్తే రాదా నీక్కొంచమైనా గిల్టీ లేదా ఎన్ని రకాలుగా ఎంత కసాయిగా నన్ను బ్లాకింగ్ చేసినవే బొమ్మ చూపించేసినావే టైం ఇవ్వు పిల్ల కొంచెం టైం ఇవ్వు నిన్ను కొంచెం కొంచెం మర్చిపోయే టైమివ్వు టైం ఇవ్వు పిల్ల కొంచెం టైం ఇవ్వు నిన్ను కొంచెం కొంచెం మర్చిపోయే టైమివ్వు ఫుల్ కొట్టినా కిక్కు ఎక్కట్లేదు కిక్కు ఎక్కట్లేదు కిక్కు ఎక్కట్లేదు డోప్ లాగినా హై అస్సల్లేదు హై అస్సల్లేదు హై అస్సల్లేదు పబ్బుకెల్లినా మూడ్ మారలేదు ఈ పేన్ కసలు ఫుల్ స్టాప్ లేదు మన పాస్ట్ అసలు గుర్తే రాదా నీక్కొంచెమైనా గిల్టీ లేదా ఎన్ని రకాలుగా ఎంత కసాయిగా నన్ను ఘోస్టింగు చేసినావే ఫుల్లు రోస్టింగు చేసినావే టైం పాసింగు చేసి నువ్వే సంక నాకించినావే ఏ నీకు నాకు బ్రేకప్ అయ్యి వన్ డే కూడా అవ్వలేదు నా గుండె ఇంకా నమ్మలేదు కంటి రెప్ప కింద తడి ఇంక ఆరనైనా లేదు ఇంతలోనే ఇంకోడితో ఇకిలించేస్తు ఇన్‌స్టాగ్రామ్ రీలే పెట్టకు నా మనసుని ఇష్టం వచ్చినట్టు చితక్కొట్టకు టైం ఇవ్వు పిల్ల కొంచెం టైం ఇవ్వు నిన్ను కొంచెం కొంచెం మర్చిపోయే టైమివ్వు టైం ఇవ్వు పిల్ల కొంచెం టైం ఇవ్వు నిన్ను కొంచెం కొంచెం మర్చిపోయే టైమివ్వు టైం ఇవ్వు పిల్ల కొంచెం టైం ఇవ్వు నిన్ను కొంచెం కొంచెం మర్చిపోయే టైమివ్వు టైం ఇవ్వు పిల్ల కొంచెం టైం ఇవ్వు నిన్ను కొంచెం కొంచెం మర్చిపోయే టైమివ్వు కొంచెం టైమివ్వమ్మా
ఏడు రంగుల వాన పాట సాహిత్యం
చిత్రం: 18 Pages (2022) సంగీతం: గోపి సుందర్ సాహిత్యం: శ్రీమణి గానం: సిద్ శ్రీరామ్ ఏడు రంగుల వాన
18 Pages (2022)
చిత్రం: ఊర్వశివో రాక్షసివో (2022) సంగీతం: అచ్చు రాజమణి బ్యాక్ గ్రౌండ్ స్కోర్: అనూప్ రూబెన్స్ నటీనటులు: అల్లు శిరీష్, అను ఇమాన్యుయెల్ దర్శకత్వం: రాకేష్ శశి నిర్మాత: బన్నీ వాసు విడుదల తేది: 04.11.2022
Songs List:
ధీంతనన ధీంతనన పాట సాహిత్యం
చిత్రం: ఊర్వశివో రాక్షసివో (2022) సంగీతం: అచ్చు రాజమణి సాహిత్యం: పూర్ణాచారి గానం: సిద్ శ్రీరాం అనగా అనగనగ కనులే కలగనగా నిజమయ్యే మెరుపల్లే వాలెగా నా ఊపిరి నడక తన ఊపిరి జతగ కలగలిసి మొదలయ్యే నాలో అలజడిగా అరెరే అరెరె మనసే అదిరే నీవల్ల నాలోన ఈ అల్లరే ఎవరే ఎవరే కుదురే చెదిరే తొలిసారి తనువంత ఓ జాతరే ఆరాటము మెహమాటము జతగా కలిగే నాకెందుకో అలవాటులో పొరపాటుగా నను నేను దాస్తున్నానెందుకో..! ధీంతనన ధీంతనన నీచూపుల దాడి చేసిందే చేసిందే ఈ గారడి ధీంతనన ధీంతనన నన్నే నే వీడి నీతో కలిసే (2) నీ అడుగుల వెంట నే గురుతై ఉంటా నీ పాదమే దాటు ప్రతి చోటున నీ పెదవులు తాకే నా పేరును వింట ఓ స్పర్శకే పొంగి పోతానట కాలం కలిపింది ఈ జోడి బాగుందని ప్రాణం అడిగింది నీతోడు సాగాలని దూరం దూరం అయ్యే దారే చూపిస్తుంది ఒకటవ్వనే, ఓ ఓ ఓ ఓ ధీంతనన ధీంతనన నీచూపుల దాడి చేసిందే చేసిందే ఈ గారడి ధీంతనన ధీంతనన నన్నే నే వీడి నీతో కలిసే ఆకాశం తానే చినుకల్లే మారి అక్షింతలై పైన రాలాయిగా ఆ ఉరుముల శబ్దం మనసున నిశ్శబ్దం మోగాయిలే మేళతాళాలుగా రాయబారాలు పంపాను నా భాషలో రాయలేనన్ని భావాలు నా ఊహలో మౌనం మౌనం వీడి మాటే నేర్పిస్తుంది ఈ ప్రేమలో, ఓ ఓ ఓ ఓ ధీంతనన ధీంతనన నీచూపుల దాడి చేసిందే చేసిందే ఈ గారడి ధీంతనన ధీంతనన నన్నే నే వీడి నీతో కలిసే
మాయారే ఈ అమ్మయిలంతా పాట సాహిత్యం
చిత్రం: ఊర్వశివో రాక్షసివో (2022) సంగీతం: అచ్చు రాజమణి సాహిత్యం: కాసర్ల శ్యామ్ గానం: రాహుల్ సిప్లిగంజ్ పోరిల ఎంట పోకు ఫ్రెండు ఆడుకుంటరు నిన్నో రౌండు ఎందుకలా వై వై ఎందూకలా పడిపోకురా ఇస్తే స్మైలు బతుకైతది గూడ్స్ రైలు ఎందుకలా వై వై ఎందూకలా చేసేదంతా చేసేసి జారుకుంటదమ్మాయి దిక్కు మొక్కు ఏం లేక బారుకాడ అబ్బాయి మాయారే ఈ అమ్మాయిలంతా మాయారే గాయలే ఈళ్ళతోటి పెట్టుకుంటే గాయలే మాయారే ఈ అమ్మయిలంతా మాయారే మాయ మాయ మాయ మాయ జిందగీ గయా గయా మాయ మాయ మాయ మాయ బతుకే గయా గయా ఏ ఆకలుండదు నిద్దరుండదు వీళ్ళ వల్ల మైండే దొబ్బి లైఫే ఉండదు ఫ్రెండు అంటరు లవ్వు అంటరు డైలీ వాట్సాప్ స్టాటస్ లాగ మారిపోతారు మంటల కలిసి పోయేది మనం మనల్నే తిడతారు ఎర్రి జనం పబ్జీ లాగ ఆడేస్తు బుజ్జికన్న అంటారు బ్రిడ్జిలాగా మనముంటే రైలే ఎక్కి పోతారు మాయారే ఈ అమ్మయిలంతా మాయారే గాయలే ఈళ్ళతోటి పెట్టుకుంటే గాయలే మాయారే ఈ అమ్మయిలంతా మాయారే మాయ మాయ మాయ మాయ జిందగీ గయా గయా మాయ మాయ మాయ మాయ బతుకే గయా గయా పోరిల ఎంట పోకు ఫ్రెండు ఆడుకుంటరు నిన్నో రౌండు ఎందుకలా వై వై ఎందూకలా పడిపోకురా ఇస్తే స్మైలు బతుకైతది గూడ్స్ రైలు ఎందుకలా వై వై ఎందూకలా ఎందూకలా ఎందూకలా ఎందూకలా వద్దుర పోరిల జోలికి పోరి దూల తీర్చి పోతది ఫుల్ టార్చరు పెడ్తది మెంటల్లీ ఇగ రాడ్డేరా జిందగి టోటల్లీ వీళ్ళ ఫోన్లు బ్లాకైపోను వీళ్ళ అకౌంట్లు హ్యాకైపోను షాపింగ్ మాల్లు లాకైపోను పబ్బుల్లో పోరిల్ని చెయ్యాలి బ్యాను మేకప్ కిట్లు కాకెత్క పోను బ్యూటీ పార్లర్లు బందైపోను కురాళ్ళ ఉసురు వీళ్లకి తగిలి ఉన్న జుట్టు ఊడిపోను అమ్మాయిలందరు వచ్చే జన్మల అబ్బాయిలుగ మారిపోను మారిపోను పోను పోను పోను పోను
కలిసుంటే నువ్వు నేనిలా పాట సాహిత్యం
చిత్రం: ఊర్వశివో రాక్షసివో (2022) సంగీతం: అచ్చు రాజమణి సాహిత్యం: కృష్ణకాంత్ గానం: అర్మాన్ మాలిక్ కలిసుంటే నువ్వు నేనిలా కలలాగే ఉంది నమ్మవా ఎప్పటికి నా మనసే ఇక నీకే ఓ ఓ ప్రతి రోజు కొత్త జన్మలా అల్లావే అన్ని వైపులా నిను చూసే ప్రతిసారి పడతానే ఓ ఓ చెలివే చెలివే సరిపోదే గుప్పెడు గుండె చెలివే చెలివే మరు హృదయం అప్పడిగానే నను తాకే ఊపిరి ఓ ఓఓ అలవాటే అయినది నదిలో అలలా కలిసేపోనీ స స సస స ని ని స కవిత్వాలు నేర్పే సొగసా సస స సస ని ని స ని ని స మాటే మూగబోయెను తెలుసా స సస ని ని స కొంచెం తెలుగునడిగే చూసా సస స సస ని ని స ని ని స సరిపోదులే పొగడగా ఓ భాష వెతికే నన్నే నన్నే కదిలే అద్ధంలోనే సగమే సగమే దొరికావ్ మసకుంది ఇన్నాల్లే బతికే ఇన్నాళ్లు నే కరిగే ఊహల్లోనే మరిచా మరిచా గతమే వెలుగొచ్చే నీవల్లే ఓ ఓ సొంతం అని అనుకుంటూనే పంతానికి పోతుంటావే కొంచెం కొంచెం చనువే పెంచి నువ్వుండి పోవే సంతోషమే ఇకపై నాదే సందేహమే నాకిక లేదే సమానమై పోదాం రావే నువ్వుండి పోవే స స సస స ని ని స కవిత్వాలు నేర్పే సొగసా సస స సస ని ని స ని ని స మాటే మూగబోయెను తెలుసా స సస ని ని స కొంచెం తెలుగునడిగే చూసా సస స సస ని ని స ని ని స సరిపోదులే పొగడగా ఓ భాష
సీతాకోక చిలుక పాట సాహిత్యం
చిత్రం: ఊర్వశివో రాక్షసివో (2022) సంగీతం: అచ్చు రాజమణి సాహిత్యం: శ్రీమణి గానం: శ్రీకృష్ణ సీతాకోక చిలుక
Urvasivo Rakshasivo (2022)
చిత్రం: పక్కా కమర్షియల్ (2022) సంగీతం: జాక్స్ బిజోయ్ నటీనటులు: గోపీచంద్, రాశి ఖన్నా దర్శకత్వం: మారుతి నిర్మాత: బన్నీ వాస్ విడుదల తేది: 20.05.2022
Songs List:
పక్కా కమర్షియలే… పాట సాహిత్యం
చిత్రం: పక్కా కమర్షియల్ (2022) సంగీతం: జాక్స్ బిజోయ్ సాహిత్యం: సిరివెన్నెల గానం: జాక్స్ బిజోయ్, హేమచంద్ర పూజలు పునస్కరాలౌ నమస్కారాలు అన్నీ పక్కా కమర్షియలే దేవుడు జీవుడు భక్తులు అగరతులు అన్నీ పక్కా కమర్షియలే గురువులు శిష్యులు చదువులు చట్టబంధాలు అన్నీ పక్కా కమర్షియలే పక్కా పక్కా పక్కా కమర్షియలే ఎయిర్ ఫ్రీ ఆహ్ నో ఫైర్ ఫ్రీ ఆహ్ నో నీరూ ఫ్రీ ఆహ్ నో నువ్వు నిల్చునా జానెడు జాగా ఫ్రీ ఆహ్ రా నో నో.. పక్కా కమర్షియలే… జన్మించిన మరనించిన అవదా కర్చు జీవించడం అడుగుడుగున కార్చె కర్చు తప్పు తప్పు అంటావా అనకూడదు అంటావా ఎంత మొత్తుకుని చెబుతున్నా చెవి పెట్టాను అంటావా విత్తానికిండే వైభవం మన జగత్తులో ఏం ఉంటుంది రా పైకానికి లోకం బాంచన్ అంటూ సాష్టాంగ పడుతోంది రా ఎంతకీ నువ్వు సెప్పెడి ఎండన్నా పక్కా పక్కా పక్కా పక్కా కమర్షియల్లీ చుక్క ముక్క పక్కా అన్నీ కమర్షియల్ పక్కా కమర్షియల్… అవును నోటు లేని ఓటు వుంటుందా పైసా లేకుంటే పవర్ వుంటుంది ధనం కాని ధర్మం కాని కర్చె లేకుండా అయిపోతుంది దండం తో సరిపెట్టేస్తే పుణ్యం వచ్చేస్తుందా హుండీకి అంతో ఇంతో రేటు కట్టంధేయ్ నీతులు రాసే పుస్తకమైనా ఉచితంగా ఇచ్చేస్తారా ఫీజు ఇవ్వందే స్వాములు సైతం ఫ్రీగా దీవించేస్తారా వ్యాపారాలన్నీ వ్యాపారలేగా గీతోపదేశం ఇదే కదా అనే స్మరిస్తు.. తరిస్తు విజయాలని పొందు పక్కా పక్కా పక్కా పక్కా కమర్షియలే చుక్క ముక్క పక్కా అన్నీ కమర్షియలే పక్కా కమర్షియల్… అవును మంచోళ్లని చాడోల్లని తేడలోడు అయినోళ్ళకి కానోళ్ళకి ఒకటే పద్దు చిప్ప చేతిలో పెట్టె గొప్ప సంగతులు మనోకొద్దు కోట్ల సొమ్ము కూడబెట్టు అధి గొడ్డునైనా కొనిపెట్టు ఆ కళ్లేకేమో గంథాలుండి అన్యాయం అయిన చూడొద్దంటూ అవకాశలే ఎదురొచ్చాయంటే రెండు చేతులతో కొల్లగొట్టు పక్కా పక్కా పక్కా పక్కా కమర్షియలే చుక్క ముక్క పక్కా అన్నీ కమర్షియలే
అందాల రాశి పాట సాహిత్యం
చిత్రం: పక్కా కమర్షియల్ (2022) సంగీతం: జాక్స్ బిజోయ్ సాహిత్యం: కృష్ణ కాంత్ గానం: సాయి చరణ్ భాస్కరుని, రమ్యా బెహ్రా అందాల రాశి మేకప్పేసి నాకోసం వచ్చావే స్వర్గం లో కేసే నామీద ఎసి భూమీద మూసావే నరుడా వకీల పని నేర్పుతారా నను చేర్చుకోరా రెడీగా ఉన్నారా పే వద్దు లేదా ఫేమస్సు కార ఇక నా సేవ చేసేసుకో ఆగేటట్లుందే నా గుండె హిప్సేయ్ చూస్తుంటే ఏది గుర్తుకురాధే పాప పక్కన నువ్వుంటే (2) అందాల రాశి మేకప్పేసి నాకోసం వచ్చావే బుల్లి తెరనే ఏలే బిగ్ స్టార్ని నేనే తెలుగిళ్లలోనే ప్రతి ఒక్కరు ఫ్యానే అన్ని వదిలి వచ్చేసాను పోస్టే ఇచ్చుకో మొహమాటాలు ఏమి లేక ఫాలో చేసుకో బ్లాక్ అండ్ వైట్ హాల్ కి మొత్తం కలరింగ్ వచ్చిందే నా కండిషన్సే నీకిష్టమైతే ఇంకా వచ్చేయ్ లేటెందుకే కాంబో కుదిరిందే మనిద్దరి కాంబో కుదిరిందే ఎండ్ లేని సీరియళ్ల వందేల్లుండాలే (2) అందాల రాశి మేకప్పేసి నాకోసం వచ్చావే స్వర్గం లో కేసే నామీద ఎసి భూమీద మూసావే ఆగేటట్లుందే నా గుండె హిప్సేయ్ చూస్తుంటే ఏది గుర్తుకురాధే పాప పక్కన నువ్వుంటే (2)
అదిరింది మాస్టారు పాట సాహిత్యం
చిత్రం: పక్కా కమర్షియల్ (2022) సంగీతం: జాక్స్ బిజోయ్ సాహిత్యం: కృష్ణ కాంత్ గానం: శ్రీకృష్ణ , సాహితి చాగంటి అదిరింది మాస్టారు
లెహంగాలో లేడీ డాను పాట సాహిత్యం
చిత్రం: పక్కా కమర్షియల్ (2022) సంగీతం: జాక్స్ బిజోయ్ సాహిత్యం: కృష్ణ కాంత్ గానం: విజయ్ ప్రకాష్ , యం.యం,శ్రీలేఖ లెహంగాలో లేడీ డాను లెవలిస్తే ఏమైపోను లేటెస్టు పూలన్ దేవేరా అందమేమో మస్తుగుంది అందుకుంటే కస్సుమందిరా కట్టౌటు హీరోగున్నా విలనల్లే చూపే తేడ ఫైటొద్దు నాతో పోరడా చుట్టు చుట్టు తిప్పుకుంది మీదకొస్తే తప్పుకుంది ఓ హో టెక్కు ఎక్కువున్న అమ్మాయంటే సరదా వేరే తేలిగ్గా తెగిపోతుంటే కిక్కేముందే వేల మందే వెంటపడ్డ చూడలేదు రేంజు వేరే పో గాలమేసే సీను నీకు లేనే లేదు నేనే సైకోరో అబ్బబ్బబ్బబ్బా ఏం తిమ్మిరుందే జున్నుముక్క జున్నుముక్క పిల్ల కన్నుగీటి గన్నుతోటి బీటుకొచ్చె చూడరా జింగిచక్క జింగిచక్క జున్నుముక్క పిల్ల వెన్నపూస సూపుతోటి సంపుతుందిరా కోపమొచ్చినా నీకే కొంపముంచుతూ రాకే కోరి కోరి పడిపోకే బల్కులోన మిల్కుతోటి బ్రహ్మగారి వర్షనే నువా హే, కట్టౌటు హీరోగున్నా విలనల్లే చూపే తేడ ఫైటొద్దు నాతో పోరడా చుట్టు చుట్టు తిప్పుకుంది మీదకొస్తే తప్పుకుంది కోటి కట్నమిస్త ఒక్క మంతు చాలదంట ఇల్లరికము వస్తా ఇంటి పేరు మార్చనంట తెచ్చి వేస్తా నగలు ఆపెయ్ ఇంకా వగలు కచితంగా ఎర్రంగా పండుతుంది మెహందీ నాలాంటోడే నిన్నే కట్టుకుంటే సామిరంగా పోదింక పండగందే తేనంటుగుంటు రోజు మనతోనే నీటుగాడ మాటతోటే ఘాటు కాను ప్లాను ఫ్లాపే పో పో పో రాటుదేలి ఉన్న కంచుపాప టైపు నేను సైకోరో జున్నుముక్క జున్నుముక్క పిల్ల కన్నుగీటి గన్నుతోటి బీటుకొచ్చె చూడరా జింగిచక్క జింగిచక్క జున్నుముక్క పిల్ల వెన్నపూస సూపుతోటి సంపుతుందిరా కోపమొచ్చినా నీకే కొంపముంచుతూ రాకే కోరి కోరి పడిపోకే బల్కులోన మిల్కుతోటి బ్రహ్మగారి వర్షనే నువా అబ్బబ్బబ్బా, కట్టౌటు హీరోగున్నా విలనల్లే చూపే తేడ ఫైటొద్దు నాతో పోరడా చుట్టు చుట్టు తిప్పుకుంది మీదకొస్తే తప్పుకుంది
Pakka Commercial (2022)
చిత్రం: చావు కబురు చల్లగా (2021) సంగీతం: జాక్స్ బిజోయ్ నటీనటులు: కార్తికేయ, లావణ్య త్రిపాఠి, ఆమని, బద్రం దర్శకత్వం: కౌశిక్ పెగళ్ళపాటి నిర్మాత: బన్నీ వాసు సమర్పణ: అల్లు అరవింద్ విడుదల తేది: 19.03.2021
Songs List:
మై నేమ్ ఈజు రాజూ పాట సాహిత్యం
చిత్రం: చావు కబురు చల్లగా (2021) సంగీతం: జకెస్ బిజాయ్ సాహిత్యం: కరుణాకర్ అడిగర్ల గానం: రేవంత్ పల్లవి: ఎట్టా ఎట్టా ఎట్టా ఎట్టా ఎట్టాగా పుట్టావురో అట్టా అట్టా అట్టా అట్టా అట్టాగే పోతావురో ఇట్టే ఇట్టే ఇట్టే ఇట్టే ఫీలైపోతారేందిరో సత్తే సత్తే సత్తే సత్తే సత్తే ఏమౌతాదిరో గాల్లో దీపం గుండెల్లో ప్రాణం ఎప్పుడు తుసంటుందో ఎవడికీ తెలుసును లేరా ఒంట్లో జీవం కాదె మన సొంతం ఉన్నన్నాళ్ళు పండగ చేసి పాడెక్కేయిరా పోయేవాడిని పోనివ్వక నీ ఏడుపు ఎందుకు రా నీ ఆస్తి గీస్తి ఏమైనా ఆడట్టుకుపోతాడా కోటల్లోని రారాజైన కాటికి పోవాలా నువ్వు నేను ఎవడైనా కట్టెల్లో కాలాల మై నేమ్ ఈజు రాజూ బస్తి బాలరాజు చావు కబురు చల్లగా చెబుతా ప్రతి రోజూ మై నేమ్ ఈజు రాజూ బస్తి బాలరాజు చావు కబురు చల్లగా చెబుతా ప్రతి రోజూ చరణం: 1 చుట్టం చూపుకు వస్తాం పెట్టిందల్లా తింటాం పెర్మనెంటుగా ఆ ఇంట్లోనే బైఠాఇంచముగా సినిమా పోస్టరు చూస్తాం ఓ టిక్కెట్ తీసి వెళతాం అయిపోయాక కుర్చీ ఖాళీ చెయ్యక తప్పదుగా ఆరడుగుల బాడీ అంతే అద్దెకు ఉంటున్నామంతే ఈ బాడీ కంపనీ వదిలేయాలి టైమే అయిపోతే పుట్టేటప్పుడు ఊపేస్తారు నిన్నే ఉయ్యాల పోయేటప్పుడు నలుగురువచ్చి చక్కా మోయాలా ఉన్నన్నాళ్ళు ఆ నలుగురిని సంపాదించాలా ఊరాంతా నిను ఊరేగించి టాటా సెప్పలా స్వర్గానికి తొలి మెట్టు నా బండేరా ఒట్టు ఎవ్వడైనా సచ్చాడంటే నాకే ఫోనూ కొట్టు స్వర్గానికి తొలి మెట్టు నా బండేరా ఒట్టు ఎవ్వడైనా సచ్చాడంటే నాకే ఫోనూ కొట్టు చరణం: 2 సన్ను డాటారు అవుతాం సిస్టర్ బ్రదరు అంటాం అందరితోనూ బంధాలెన్నో కలుపుకుపోతుంటాం అప్పుల్లో మునిగుంటాం అంబానీ కల కంటాం చిల్లర కోసం ఎన్నో ఎన్నో వేషాలే వేస్తాం ఈ లైఫ్ ఒక నాటకమేలే మన ఆక్టింగులు అయిపోతే ఈ ఊరు పేరు మేకప్ తీసి చెక్కేయాలంతే శివుడాగ్నే లేకుండా చీమైనా కుడుతుందా అంటూ మహాభాగా ఎదంతం సెబుతావంట అన్ని ఇచ్చిన ఆ సామె సావుని గిఫ్ట్ ఇవ్వంగ అయ్యయ్యయ్యో ఒద్దంటా వేందయ్యో సిత్రంగా జజ్జనకా జజ్జనకా తోడుంటా నీ ఎనకా పువ్వుల్లోన మోసుకెళ్లి పూడ్చేస్తా పద కొడకా జజ్జనకా జజ్జనకా తోడుంటా నీ ఎనకా పువ్వుల్లోన మోసుకెళ్లి పూడేస్తా పద కొడకా మై నేమ్ ఈజు రాజూ బస్తి బాలరాజు ఆ చావు కబురు చల్లగా చెబుతా ప్రతి రోజూ
కదిలే కాలాన్నడిగా పాట సాహిత్యం
చిత్రం: చావు కబురు చల్లగా (2021) సంగీతం: జాక్స్ బిజోయ్ సాహిత్యం: కౌశిక్ పెగళ్ళపాటి, సనరే (సత్యన్నారాయణ రెడ్డి) గానం: గౌతమ్ భరద్వాజ్, షశ తిరుపతి పడవై కదిలింది మనసే ఆకాశం వైపే గొడవే పెడుతూ ఉందే నువ్వు కావాలనే నువ్వొచ్చావనీ వచ్చావని వచ్చావనీ నా ప్రాణం చెప్పిందే నిససస నిస సగరిగరిగ నిససస నిస సగరిగరిగ మా పగపమగరిగరిసా గరిరిగరి నిససస నిస సగరిగరిగ నిససస నిస సగరిగరిగ సరిగపనిసరి సా గపగరిసనిప కదిలే కాలాన్నడిగా ఈ చోటే పరుగాపమని తిరిగే భూమిని అడిగా నీ వైపే నను లాగమని నా ప్రాణం ఎక్కడో దాచిందా సందడే నీ తోడే చేరగా తెలిసిందా నేడే మహారాజై మురిసానే ఆకాశ దేశాన నీ మాట విన్నాకా.... మెరుపల్లే మెరిసానే ఆ నీలిమేఘాన తెలిసేలా నీదాకా.... ఈ వర్షంలో పురివిప్పే నెమలి వలే నా హృదయాన్నే తడిపేసే చినుకు ఇదే ఈ వర్షములో పురివిప్పే నెమలి వలే నా హృదయాన్నే తడిపేసే చినుకువి నువ్వే కదిలే కాలాన్నడిగా ఈ చోటే పరుగాపమని తిరిగే భూమిని అడిగా నీ వైపే నను లాగమని ఆశలే ఆవిరై ఎగిరిపోతుంటే చెలిమితో చేరువై వెతికి తెచ్చేసానలా మనసావాచా మనసిచ్చాగా నీ తలరాతే మార్చేస్తాన చిరునామాగా కలలో కూడా కలిసుంటాగా ఏ దూరాలు రాలేవడ్డంగా నిజంగానే మరో లోకం సమీపిస్తోందా మళ్ళీ నీలా నన్నే కాలం పరీక్షిస్తుందా బ్రతుకైనా చితికైనా నీ లోపలి హృదయాన్ని నిన్నంటే నేనుంటా చనిపోయే క్షణమైనా విడిపోని ప్రణయాన్నై నీడల్లే తోడుంటా ఈ వర్షంలో పురివిప్పే నెమలి వలే నా హృదయాన్నే తడిపేసే చినుకు ఇదే ఈ వర్షములో పురివిప్పే నెమలి వలే నా హృదయాన్నే తడిపేసే చినుకువి నువ్వే కదిలే కాలాన్నడిగా ఈ చోటే పరుగాపమని తిరిగే భూమిని అడిగా నీ వైపే నను లాగమని
పైన పటారం పాట సాహిత్యం
చిత్రం: చావు కబురు చల్లగా (2021) సంగీతం: జాక్స్ బిజోయ్ సాహిత్యం: సనరే (సత్యన్నారాయణ రెడ్డి) గానం: మంగ్లీ, రామ్, సాకేత్ పుట్టువేళ తల్లికి నువ్వు పురిటి నొప్పివైతివి గిట్టువేళ ఆలికేమో మనసు నొప్పివైతివా గిట్టువేళ ఆలికేమో మనసు నొప్పివైతివా బట్ట మరక పడితే నువ్వు కొత్త బట్టలంటివీ ఇప్పుడేమో ఉతకలేని మట్టి బట్ట కడితివా ఇప్పుడేమో ఉతకలేని మట్టి బట్ట కడితివా ఇట్టాగున్నవయ్యో పీటారన్నయ్యో నీది ఏదేమైనా శానా గొప్ప సావయ్యో పుచ్చు తోసి మంచి వంగ ఏరినట్టు స్వచ్ఛమంటి స్వామి నిన్నే కోరినాడయ్య పైన పటారం ఈడ లోన లొటారం ఇను బాసు సెబుతానీలోకమెవ్వారం ఇను బాసు సెబుతానీలోకమెవ్వారం పైకి బంగారం లోన గూడు పుటారం గెలికి సూడు తెలిసిపోద్ది అసలు బండారం గెలికి సూడు తెలిసిపోద్ది అసలు బండారం మనుషులు మాయగాళ్ళు మచ్చలున్న కేటుగాళ్ళు కానీ ఎవరికాళ్ళు మనసులున్న గ్రేటుగాళ్ళు నాది నాది అన్న స్వార్ధమున్న చెడ్డవాళ్ళు నీలా బ్రతకలేని డబ్బులున్న పేదవాళ్ళు నాకాడ వందుంటే నా ఏంటే తిరిగేటోళ్ళు నీకాడ వెయ్యుంటే నాపైనే మొరుగుతారు సందంట పోతాంటే సూసి కూడా పలకనోళ్ళు నీకాడ సొమ్ముంటే ఇంట చేరి పొగుడుతారు లోకమెంతో లోతయ్యా పీటరన్నయ్యా అది తవ్వి చూడడానికే ఈ జీవితమయ్యా తొవ్వేకొద్దీ వస్తుంటారు నిండా ముంచి పోతుంటారు నీతో నాతో ఉండే సగం దొంగోల్లేనయ్యా వి ఆర్ వెరీ హ్యాపీ బాసు నువ్వుండేదే సేఫెస్టు ప్లేసు అరె వి ఆర్ వెరీ హ్యాపీ బాసు నువ్వుండేదే సేఫెస్టు ప్లేసు హే పైన పటారం ఈడలోన లొటారం ఇను బాసు సెబుతానీలోకమెవ్వారం పైకి బంగారం లోన గూడు పుటారం గెలికి సూడు తెలిసిపోద్ది అసలు బండారం కారు బంగళాలు వేలికున్న ఉంగరాలు ఏవీ రావంట సచ్చినాక మనవెంట నీతో ఉన్నవాళ్ళు నిన్ను మోసి కన్నవాళ్ళు వెళిపోతారంతా వెలిగినాక చితిమంట మట్టి మీద నువ్ కలిసిన బంధాలన్నీ అబద్ధం మట్టిలోన పిచ్చి పురుగుల జట్టే చివరి ప్రపంచం మనిషి తీరు మారదయ్యా పీటరన్నయ్యా అందుకనే సెబుతున్న ఇనరాదయ్యా బాధే లేని బెంగే లేని రేపేంటన్న సింతేలేని సోటేదైనా ఉన్నాదంటే స్మశానమేరా అందుకే వీ ఆర్ వెరీ హ్యాపీ బాసు నువ్వుండేదే సేఫెస్టు ప్లేసు హే పైన పటారం ఈడ లోన లొటారం ఇను బాసు సెబుతానీలోకమెవ్వారం పైకి బంగారం లోన గూడు పుటారం గెలికి సూడు తెలిసిపోద్ది అసలు బండారం గెలికి సూడు తెలిసిపోద్ది అసలు బండారం గెలికి సూడు తెలిసిపోద్ది అసలు బండారం
ఫిక్సై పో, ఫిక్సై పో పాట సాహిత్యం
చిత్రం: చావు కబురు చల్లగా (2021) సంగీతం: జాక్స్ బిజోయ్ సాహిత్యం: కౌశిక్ పెగల్లపాటి గానం: రాహుల్ సిప్లిగంజ్, ఆదిత్య తాడేపల్లి హేయ్.. ఓర కంటితో అలా చూస్తావే బుర్ర వేడెక్కిపోయేలా హేయ్.. దూరదూరంగా నన్ను తోస్తావే సర్ర సర్రా మండేలా పోరా పొమ్మన్నా సిగ్గే లేకుండా వెంటే వస్తానే జడకొప్పులా బస్తీగాన్నైనా బానే ఉంటాగా సరిగా సూడే పిల్లా హే అమ్మో అమ్మో అమ్మో అమ్మో అమ్మో అమ్మో అమ్మాయో కుర్రాడికో కొంపుందమ్మాయో అరె అమ్మో అమ్మో అమ్మమ్మో అమ్మో అమ్మో అమ్మాయో కుడికాలెట్టెయ్యమ్మో ఫిక్సై పో, ఫిక్సై పో, ఫిక్సై పో, ఫిక్సై పో ఈ జన్మే నాకంటూ ఫిక్సై పో, ఫిక్సై పో ఈ రాజుకి రాణె ఫిక్సై పో హేయ్.. ఓర కంటితో అలా చూస్తావే బుర్ర వేడెక్కిపోయేలా హేయ్.. దూరదూరంగా నన్ను తోస్తావే సర్ర సర్రా మండేలా సావు మేళాలే డోలూ సన్నాయై వినిపిస్తూ ఉన్నాయే కాటి కన్నీళ్ళే , పెళ్ళి సందడ్లై మురిపిస్తూ ఉన్నాయే వలపుల నదిలోనా మునిగిన మదిని కనికరమే సూపించి కాపాడవే పలకవే ఇకనైనా అలకను వదిలి నరకమే సూపితే నేనేమై పోవాలే వేడెక్కి పోతాందే నా గుండె నీ గాలికి హే అమ్మో అమ్మో అమ్మో... అమ్మో అమ్మో అమ్మో అమ్మాయో పాడెక్కి పోతున్నా లేస్తానే నీ సూపుకి అరె అమ్మో అమ్మో అమ్మమ్మో అమ్మో అమ్మో అమ్మాయో సెప్పేదింకేముందే.. ఫిక్సై పో, ఫిక్సై పో, ఫిక్సై పో, ఫిక్సై పో గంగమ్మ కోడలిగా ఫిక్సై పో, ఫిక్సై పో అరె మందుకి సిందై మిక్సై పో హేయ్.. ఓర కంటితో అలా చూస్తావే బుర్ర వేడెక్కిపోయేలా హేయ్.. దూరదూరంగా నన్ను తోస్తావే సర్ర సర్రా మండేలా (ఇంకోసారి నా వెంట పడితే కాళ్ళు ఇరగొడత, నువ్వు ఇరగొడితే పొయ్ రబ్బరు కాళ్ళట్టుకొచ్చి నేను నీ ఎంట పడ్డా) హే అమ్మో అమ్మో అమ్మో అమ్మో అమ్మో అమ్మో అమ్మాయో కుర్రాడికో కొంపుందమ్మాయో అరె అమ్మో అమ్మో అమ్మమ్మో అమ్మో అమ్మో అమ్మాయో కుడికాలెట్టెయ్యమ్మో ఫిక్సై పో, ఫిక్సై పో, ఫిక్సై పో, ఫిక్సై పో ఈ జన్మే నాకంటూ ఫిక్సై పో, ఫిక్సై పో ఈ రాజుకి రాణె ఫిక్సై పో
హయ్యయ్యయ్యయ్యో పాట సాహిత్యం
చిత్రం: చావు కబురు చల్లగా (2021) సంగీతం: జాక్స్ బిజోయ్ సాహిత్యం: కరుణాకర్ అడిగర్ల గానం: ఆదిత్య తాడేపల్లి హయ్యయ్యయ్యయ్యో ఏమయ్యిందయ్యో ప్రాణానికే సిలిపి సేతబడయ్యిందో హయ్యో హయ్యయ్యో ఏంటో ఏంమాయో నీ సేతిలో బుజ్జి బొమ్మైపోయిందో సిట్టి మిరాకు పురుగు సీతాకోకైనట్టు రెక్కల బతుకే మొదలైందే మట్టిలో పుట్టిన సిగురు మర్రి సెట్టైనట్టు మనసు ఆ మబ్బుల దాకా ఎగిరెళ్ళిందే సముద్రంలో సిందే సేపా ఎగిసి నింగిని చూస్తున్నట్టు గుండెకేమో లోకమంతా కొత్తగుందే బీడు నేల వాన జల్లే తాకి పచ్చని పొలమైనట్టు మొదటిసారి సావు కబురే సల్లగుందే హయ్యయ్యయ్యయ్యో ఏమయ్యిందయ్యో ప్రాణానికే సిలిపి సేతబడయ్యిందో హయ్యో హయ్యయ్యో ఏంటో ఏంమాయో నీ సేతిలో బుజ్జి బొమ్మైపోయిందో బురదా సెరువల్లే ఉంటాదే మా బతుకే సిరు కమలాలు పూసాయే ఆ నీటికే మిణుగు మిణుగురులా సాగే ఈ నా కథకి పున్నమిలోని వెన్నెల్లు అద్దావులే నేలపై రాలిన సినుకు నదుల నురగైనట్టు పాదమే సెలయేరల్లే తీసే పరుగు వేసవికి ఎండిన మోడు... పూల కొమ్మెనట్టు పసితనంతో మొదలయ్యే జన్మే ఇపుడు ఆటు పోటు అలల్లోన తీరం తెలియని పడవై ఉన్న అంతలోనే ప్రేమదీవై ఎదురయ్యావే ఈ పొరకోడి గుండెకాయ కదలికే లేనిది అనుకున్న ఇప్పుడెంటో ఉప్పెనల్లే పొంగుతోందే హయ్యయ్యయ్యయ్యో ఏమయ్యిందయ్యో ఆకాశం అంతందం ఎదురయ్యిందయ్యో హయ్యో హయ్యయ్యో ఏంటో ఏంమాయో తలరాత ఓ మలుపు తిరిగేసిందయ్యో తిరిగేసిందయ్యో ఓ ఓ ఓ అయ్యో అయ్యో అయ్యో అయ్యో అయ్యయ్యో
ఎందరో మోసిన పాట సాహిత్యం
చిత్రం: చావు కబురు చల్లగా (2021) సంగీతం: జాక్స్ బిజోయ్ సాహిత్యం: సనరే (సత్యన్నారాయణ రెడ్డి) గానం: దీపిక . వి ఎందరో మోసిన సుందర భావము సుగుణభి రాముని సొంతమయే సంబర వీధిన ఆతని హృదయము చలముతో తకధిమి నాట్యమయే కన్నుల ముందర దేవత రూపము చూసెడి భాగ్యము దొరికినదే తప్పని తెలుపుతు దైవము దిగిన ఆపితే ఆగని వరుస ఇది ఎందరో మోసిన సుందర భావము సుగుణభి రాముని సొంతమయే అధరాల ఎరుపుకి నీరాజనం జలజాక్షి మోముకి నీరాజనం అధరాల ఎరుపుకి నీరాజనం జలజాక్షి మోముకి నీరాజనం అలివేణి తురుముకి అపురూప సొగసుకి అలివేణి తురుముకి అపురూప సొగసుకి హృదయ తరము నుండి నీరాజనం ప్రేమ నీరాజనం ఎందరో మోసిన సుందర భావము సుగుణభి రాముని సొంతమయే మకుటము లేని ఏలికసాని మనసుని కదిపిన మోక్ష ప్రదాయని వదనము చూడగ మాటే రాని గారడమున్నద నయనములోని అడగక నే మది సుమధుర రమణిని చూపిన క్షణమున వదిలా తనువుని కలిసా వలుపుని ఎందరో మోసిన సుందర భావము సుగుణభి రాముని సొంతమయే సంబర వీధిన ఆతని హృదయము చలముతో తకధిమి నాట్యమయే కన్నుల ముందర దేవత రూపము చూసెడి భాగ్యము దొరికినదే తప్పని తెలుపుతు దైవము దిగిన ఆపితే ఆగని వరుస ఇది
ఓరోరి దేవుడో.. పాట సాహిత్యం
చిత్రం: చావు కబురు చల్లగా (2021) సంగీతం: జాక్స్ బిజోయ్ సాహిత్యం: కరుణాకర్ అడిగర్ల గానం: అనిరుద్ సుస్వరం గుండెలోనా సవ్వడుందే గొంతులోనా ప్రాణముందే గువ్వలోనా సవ్వడుందే గొంతులోనా ప్రాణముందే ఊపిరి మాత్రం ఉన్నపలంగా పోతున్నట్టుందే ఉక్కిరి బిక్కిరి చేసే భాదే చుట్టుముట్టిందే ఓరోరి దేవుడో..! ఎన్నెన్ని సిత్తరాలు సేత్తావు నీరాతలో నీ సేతి బొమ్మలా ఈ నేల మీద మేము ఆడాలి ఎన్ని ఆటలో... ఓరోరి దేవుడో..! ఎన్నెన్ని సిత్తరాలు సేత్తావు నీరాతలో నీ సేతి బొమ్మలా ఈ నేల మీద మేము ఆడాలి ఎన్ని ఆటలో రాయిరప్పల్ని తీసుకొచ్చి గుళ్ళో దేవత సేత్తావు రక్తమాంసాలు మాకు పోసి మట్టిపాలుకమ్మంటావు అమ్మా ఆలి బంధాలిచ్చి అంతలోనే తెంచి లోకంలోన ఏదీ లేదంటు నీ వెంట తీసుకుపోతావూ ఓరోరి దేవుడో..! ఎన్నెన్ని సిత్తరాలు సేత్తావు నీరాతలో నీ సేతి బొమ్మలా ఈ నేల మీద మేము ఆడాలి ఎన్ని ఆటలో ఓరోరి దేవుడో..! ఎన్నెన్ని సిత్తరాలు సేత్తావు నీరాతలో నీ సేతి బొమ్మలా ఈ నేల మీద మేము ఆడాలి ఎన్ని ఆటలో....
Chaavu Kaburu Challaga (2021)
చిత్రం: మోస్ట్ ఎలజిబుల్ బ్యాచిలర్ (2021) సంగీతం: గోపి సుందర్ నటీనటులు: అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే దర్శకత్వం: బొమ్మరిల్లు భాస్కర్ నిర్మాతలు: బన్నీ వాసు, వాసు వర్మ విడుదల తేది: 19.06.2021
Songs List:
మనసా... మనసా... పాట సాహిత్యం
చిత్రం: మోస్ట్ ఎలజిబుల్ బ్యాచిలర్ (2021) సంగీతం: గోపి సుందర్ సాహిత్యం: సురేంద్ర కృష్ణ గానం: సిద్ శ్రీరామ్ మనసా... మనసా... మనసా మనసా మనసారా బ్రతిమాలా తన వలలో పడబోకే మనసా పిలిచా అరిచా అయినా నువ్ వినకుండా తనవైపు వెలతావ మనసా నా మాట అలుసా నేనెవరో తెలుసా నాతోనే ఉంటావు నన్నే నడిపిస్తావు నన్నేడిపిస్తావే మనసా మనసా మనసా మనసారా బ్రతిమాలా తన వలలో పడబోకే మనసా పిలిచా అరిచా అయినా నువ్ వినకుండా తనవైపు వెలతావ మనసా ఏముంది తనలోన గమ్మత్తు అంటే అది దాటి మత్తేదో ఉందంటు అంటూ తనకన్నా అందాలు ఉన్నాయి అంటే అందానికే తాను ఆకాశమంటూ నువ్వే నా మాట.. హే... నువ్వే నా మాట వినకుంటే మనసా తానే నీ మాట వింటుందా ఆశ నా మాట అలుసా నేనెవరో తెలుసా నాతోనే ఉంటావు నన్నే నడిపిస్తావు నన్నేడిపిస్తావే మనసా మనసా మనసా మనసారా బ్రతిమాలా తన వలలో పడబోకే మనసా.. పిలిచా అరిచా అయినా నువ్ వినకుండా తనవైపు వెలతావ మనసా.. తెలివంతనా సొంతమనుకుంటు తిరిగా తనముందు నుంచుంటే నా పేరు మరిచా ఆమాటలేవింటు మతిపోయి నిలిచా బదులెక్కడుందంటు ప్రతి చోట వెతికా తనతో ఉండే... హే.... తనతో ఉండే ఒక్కొక్క నిమిషం మరలా మరలా పుడతావా మనసా నా మాట అలుసా నేనవరో తెలుసా నాతోనే ఉంటావు నన్నే నడిపిస్తావు నన్నేడిపిస్తావే మనసా.. మనసా మనసా మనసారా బ్రతిమాలా తన వలలో పడబోకే మనసా.. పిలిచా అరిచా అయినా నువ్ వినకుండా తనవైపు వెలతావ మనసా..
అరె గుచ్చే గులాబి లాగా పాట సాహిత్యం
చిత్రం: మోస్ట్ ఎలజిబుల్ బ్యాచిలర్ (2021) సంగీతం: గోపి సుందర్ సాహిత్యం: శ్రీమణి, అనంత్ శ్రీరామ్ గానం: అర్మాన్ మాలిక్ అరె గుచ్చే గులాబి లాగా నా గుండెలోతునే తాకినదే వెలుగిచ్చే మతాబులాగా నా రెండు కళ్ళలో నిండినదే, హే... యే ఎవరే నువ్వే ఏం చేసినావే ఇటుగా నన్నే లాగేసినావే చిటికే వేసే క్షణంలో నన్నే చదివేస్తున్నావే ఎదురై వచ్చి ఆపేసి నువ్వే ఎదరేముందో దాచేసినావే రెప్పల దుప్పటి లోపల గుప్పెడు ఊహలు నింపావే కుదురే కదిపేస్తావులే నిదురే నిలిపేస్తావులే కదిలే వీలే లేని వలలు వేస్తావులే ఎపుడూ వెళ్ళే దారినే అపుడే మార్చేస్తావులే నా తీరం మరిచి నేను నడిచానులే అరె గుచ్చే గులాబి లాగా వెలుగిచ్చే మతాబులాగా కళతెచ్చే కళ్ళాపిలాగా నచ్చావులే భలేగా అరె గుచ్చే గులాబి లాగా వెలుగిచ్చే మతాబులాగా కళతెచ్చే కళ్ళాపిలాగా నచ్చావులే భలేగా ఎవరే నువ్వే ఏం చేసినావే ఇటుగా నన్నే లాగేసినావే చిటికే వేసే క్షణంలో నన్నే చదివేస్తున్నావే ఊపిరి పని ఊపిరి చేసే ఊహలు పని ఊహలు చేసే నా ఆలోచనలోకొచ్చి నువ్వేం చేస్తున్నావే నేనేం మాటాడాలన్నా నన్నడిగి కదిలే పెదవే నా అనుమతి లేకుండానే నీ పలుకే పలికిందే ఏమిటే ఈ వైఖరి ఊరికే ఉంచవుగా మరి అయ్యా నేనే ఓ మాదిరి అరె గుచ్చే గులాబి లాగా వెలుగిచ్చే మతాబులాగా కళతెచ్చే కళ్ళాపిలాగా నచ్చావులే భలేగా అరె గుచ్చే గులాబి లాగా వెలుగిచ్చే మతాబులాగా కళతెచ్చే కళ్ళాపిలాగా నచ్చావులే భలేగా ఎవరే నువ్వే ఏం చేసినావే ఇటుగా నన్నే లాగేసినావే చిటికే వేసే క్షణంలో నన్నే చదివేస్తున్నావే నీకోసం వెతుకుతూ ఉంటే నేమాయం అవుతున్నానే నను నాతో మళ్ళీ మళ్ళీ కొత్తగ వెతికిస్తావే బదులిమ్మని ప్రశ్నిస్తావే నను పరుగులు పెట్టిస్తావే నేనిచ్చిన బదులుని మళ్ళీ... ప్రశ్నగ మారుస్తావే హే పిల్లో..! నీతో కష్టమే బళ్ళో గుళ్ళో చెప్పని పాఠమే... నన్నడుగుతు ఉంటే ఏం న్యాయమే
జిందగీ పాట సాహిత్యం
చిత్రం: మోస్ట్ ఎలజిబుల్ బ్యాచిలర్ (2021) సంగీతం: గోపి సుందర్ సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి గానం: నఫీషా హనియా జిందగీ
లెహరాయి లెహరాయీ పాట సాహిత్యం
చిత్రం: మోస్ట్ ఎలజిబుల్ బ్యాచిలర్ (2021) సంగీతం: గోపి సుందర్ సాహిత్యం: శ్రీమణి గానం: సిద్ శ్రీరామ్ లెహరాయి లెహరాయీ లెహరాయి లెహరాయి గుండె వెచ్చనయ్యె ఊహలెగిరాయి లెహరాయి లెహరాయి గోరువెచ్చనైన ఊసులదిరాయి ఇన్నినాళ్ళు ఎంత ఎంత వేచాయి కళ్ళలోనే దాగి ఉన్న అమ్మాయి సొంతమల్లె చేరుకుంటే ప్రాణమంత చెప్పలేని హాయీ, ఓ ఓ లెహరాయి లెహరాయి గుండె వెచ్చనయ్యె ఊహలెగిరాయీ లెహరాయి లెహరాయి గోరువెచ్చనైన ఊసులదిరాయీ, ఆఆ రోజు చెక్కిలితో సిగ్గుల తగువాయే రోజా పెదవులతో ముద్దుల గొడవాయే ఒంటగదిలో మంటలన్నీ ఒంటిలోకే ఒంపుతుంటే మరి నిన్నా మొన్నా ఒంటిగ ఉన్నా ఈడే నేడే లెహరాయి లెహరాయి లెహరాయి గుండె వెచ్చనయ్యె ఊహలెగిరాయీ లెహరాయి లెహరాయి గోరువెచ్చనైన ఊసులదిరాయీ, ఓ ఓఓ వేళాపాలలలే మరిచే సరసాలే తేదీ వారాలే చెరిపే చెరసాలే చనువు కొంచం పెంచుకుంటూ తనువు బరువే పంచుకుంటూ మనలోకం మైకం ఏకం అవుతూ ఏకాంతాలే లెహరాయి లెహరాయి లెహరాయి గుండె వెచ్చనయ్యె ఊహలెగిరాయి లెహరాయి లెహరాయి గోరువెచ్చనైన ఊసులదిరాయి ఇన్నినాళ్ళు ఎంత ఎంత వేచాయి కళ్ళలోనే దాగి ఉన్న అమ్మాయి సొంతమల్లె చేరుకుంటే ప్రాణమంత చెప్పలేని హాయీ, ఓ ఓ
చిట్టి అడుగా పాట సాహిత్యం
చిత్రం: మోస్ట్ ఎలజిబుల్ బ్యాచిలర్ (2021) సంగీతం: గోపి సుందర్ సాహిత్యం: సిరివెన్నెల గానం: Zia UI Haq & Chorus ఓ సోనియే ఓ సోనియే… ఓ సోనియే అరెరే ఎవ్వరూ ఏం చెప్పలేదా ఒక్కసారి ఇన్నాళ్లు గాలిలోనే తేలియాడే చిట్టి అడుగా సరిలే ఇపుడైనా తెలిసిందిగా తొలిసారి ఇకనైనా నేల తాకి నేర్చుకోవే కొత్త నడక ఇన్నాళ్లు నిన్నెత్తుకొని ఊరేగించిన ఈ లోకం తన బరువు తానే సరిగా మోయలేని ఓ మాలోకం ఇన్నాళ్లు గాలిలోనే తేలియాడే చిట్టి అడుగా ఇకనైనా నేల తాకి నేర్చుకోవే కొత్త నడక శిలలాంటి నిన్ను ఇలా శిల్పంగా మలిచింది ఆ నవ్వులో చురకలే నీ సొంత కలలాగా నీ కంట నిలిచింది ఆ దివ్వెలో మెరుపులే అచ్చంగా తనలా ఉందా అద్దం చూపే నీ రూపం నీ సొంత చిరునామాలా కనిపిస్తోందా ఈ మలుపు ఇన్నాళ్లు గాలిలోనే తేలియాడే చిట్టి అడుగా ఇకనైనా నేల తాకి నేర్చుకోవే కొత్త నడక ఎన్నెన్ని జన్మాలైనా తెగిపోని బంధం ఏదో ఎదురైంది నీ దారిలో, ఓ ఓ మాటలకందని భావం మనసెలా గుర్తిస్తుందో తెలిసింది ఆ చెలిమితో ఇంకెవరి కల్లో చూసే కలవే నువ్వు ఇన్నాళ్లు ఎంత బాగుందో చూడు నీ తొలి వేకువ ఈనాడు ఇన్నాళ్లు గాలిలోనే తేలియాడే చిట్టి అడుగా ఇకనైనా నేల తాకి నేర్చుకోవే కొత్త నడక అరెరే ఎవ్వరూ ఏం చెప్పలేదా ఒక్కసారి ఇన్నాళ్లు గాలిలోనే తేలియాడే చిట్టి అడుగా సరిలే ఇపుడైనా తెలిసిందిగా తొలిసారి ఇకనైనా నేల తాకి నేర్చుకోవే కొత్త నడక ఇన్నాళ్లు నిన్నెత్తుకొని ఊరేగించిన ఈ లోకం తన బరువు తానే సరిగా మోయలేని ఓ మాలోకం ఇన్నాళ్లు గాలిలోనే తేలియాడే చిట్టి అడుగా ఇకనైనా నేల తాకి నేర్చుకోవే కొత్త నడక (2) ఓ సోనియే, హే హే ఏ ఏ