చిత్రం: మహాత్మ (2009)
సంగీతం: విజయ్ ఆంటోని
నటీనటులు: శ్రీకాంత్, భావన, ఛార్మి
దర్శకత్వం: కృష్ణవంశీ
నిర్మాత: సి.ఆర్. మనోహర్
విడుదల తేది: 09.10.2009
Songs List:
ఇందిరమ్మ ఇంటి పేరు పాట సాహిత్యం
చిత్రం: మహాత్మ (2009)
సంగీతం: విజయ్ ఆంథోనీ
సాహిత్యం: సిరివెన్నెల సీతారామ శాస్త్రి
గానం: ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం
రఘుపతి రాఘవ రాజారాం
పతిత పావన సీతారాం !
ఈశ్వర అల్లా తేరో నాం
సబుకో సన్మతి దే భగవాన్ !!
ఇందిరమ్మ ఇంటి పేరు కాదుర గాంధీ
ఊరికొక్క వీధి పేరు కాదుర గాంధీ
ఇందిరమ్మ ఇంటి పేరు కాదుర గాంధీ
ఊరికొక్క వీధి పేరు కాదుర గాంధీ
కరెన్సీ నోటు మీదా .. ఇలా నడి రోడ్డు మీద
మనం చూస్తున్న బొమ్మ కాదుర గాంధీ
భరతమాత తలరాతను మార్చిన విధాతరా గాంధీ
తరతరాల యమ యాతన తీర్చిన వరదాతర గాంధీ
ఇందిరమ్మ ఇంటి పేరు కాదుర గాంధీ
ఊరికొక్క వీధి పేరు కాదుర గాంధీ
రామనామమే తలపంతా
ప్రేమధామమే మనసంతా
ఆశ్రమ దీక్షా స్వతంత్ర్య కాంక్షా
ఆకృతి దాల్చిన అవధూతా
అపురూపం ఆ చరితా !
కర్మయోగమే జన్మంతా
ధర్మక్షేత్రమే బ్రతుకంతా
సంభవామి అని ప్రకటించిన
అలనాటి కృష్ణ భగవద్గీతా
ఈ బోసినోటి తాతా !!
మనలాగే ఓ తల్లి కన్న
మామూలు మనిషి కదరా గాంధీ
మహాత్ముడంటూ మన్నన పొందే స్థాయికి
పెంచద ఆయన స్పూర్తీ
సత్యాహింసల మార్గజ్యోతీ !
నవశకానికే నాందీ !!
రఘుపతి రాఘవ రాజారాం
పతీత పావన సీతారాం !
ఈశ్వర అల్లా తేరో నాం
సబుకో సన్మతి దే భగవాన్ !! (2)
గుప్పెడు ఉప్పును పోగేసీ
నిప్పుల ఉప్పెనగా చేసీ
దండి యాత్రనే దండయాత్రగా
ముందుకు నడిపిన అధినేతా
సిసలైన జగజ్జేతా !
చరఖాయంత్రం చూపించీ
స్వదేశి సూత్రం నేర్పించీ
నూలుపోగుతో మదపుటేనుగుల
బంధించాడుర జాతిపితా
సంకల్పబలం చేతా !!
సూర్యుడస్తమించని రాజ్యానికి
పడమర దారిని చూపిన క్రాంతీ
తూరుపు తెల్లారని నడిరాత్రికి
స్వేచ్చాభానుడి ప్రభాత కాంతీ
పదవులు కోరని పావన మూర్తీ !
హృదయాలేలిన చక్రవర్తీ !!
ఇలాంటి నరుడొక ఇలా తలంపై
నడయాడిన నాటి సంగతీ
నమ్మరానిదని నమ్మకముందే
ముందు తరాలకు చెప్పండీ
" సర్వజన హితం నా మతం
అంటరానితనాన్ని, అంతఃకలహాలని
అంతం చేసేందుకే నా ఆయువంతా అంకితం
హే .. రామ్ ! "
ఏం జరుగుతోంది ఏం జరుగుతోంది పాట సాహిత్యం
చిత్రం: మహాత్మ (2009)
సంగీతం: విజయ్ ఆంటోని
సాహిత్యం: సిరివెన్నెల
గానం: కార్తిక్ , సంగీత
ఏం జరుగుతోంది ఏం జరుగుతోంది నా మనసుకివాళ
ఏం వెతుకుతోంది ఏం వెతుకుతోంది నా వయసు ఇవేళ
హే నీ ఎదట నిలిచే వరకు ఆపదట తరిమే పరుగు
ఎం పనట తమతో తనకు తెలుసా
నీ వెనుక తిరిగే కనులు చూడవట వేరే కలలు
ఏం మాయ చేసావ్ అసలు సొగసా
ఏం జరుగుతోంది ఏం జరుగుతోంది నా మనసుకివాళ
ఏ ఏ ఏ ఏ ఏం వెతుకుతోంది ఏం వెతుకుతోంది నా వయసు ఇవేళ
పరాకులో పడిపోతుంటే కన్నె వయసు కంగారు
అరె అరె అంటు వచ్చి తోడు నిలబడు
పొత్తిళ్ళల్లో పసిపాపల్లె పాతికేళ్ళ మగ ఈడు
ఎక్కెక్కి ఏం కావాలందో అడుగు అమ్మడు
ఆకాశమె ఆపలేని చినుకు మాదిరి
నీ కోసమె దూకుతోంది చిలిపి లాహిరి
ఆవేశమె ఓపలేని వేడి ఊపిరి
నీతో సావాసమె కోరుతోంది ఆదుకో మరి
ఏం జరుగుతోంది ఏం జరుగుతోంది నా మనసుకివాళ
ఆ.. ఏం వెతుకుతోంది ఏం వెతుకుతోంది నా వయసు ఇవేళ
దిస్ ఇస్ ద వే టు గొ
దిస్ ఇస్ ఎక్స్‌టసీ
దిస్ సాంగ్ ఇస్ జస్ట్ ఎ వేక్ మిమిక్రి
ఫీలింగ్ ఇస్ సొ మేంట్ టు బి యొ హొ
దిస్ ఇండిస్‌క్రైబబిల్
కాణ్ట్ యు సీ
నాక్స్ మి డౌన్ యొ
బేబి కాణ్ట్ బిలీవ్
జస్ట్ ఎ సర్‌వైవల్ డెస్టిని యొ హొ
ఉండుండిలా ఉబికొస్తుందేం కమ్మనైన కన్నీరు
తీయనైన గుబులిది అంటె నమ్మేదెవ్వరు
మధురమైన కబురందిందె కలత పడకు బంగారు
పెదవితోటి చెక్కిలి నిమిరె చెలిమి హాజరు
గంగలాగ పొంగి రాన ప్రేమ సంద్రమా
నీలొ కరిగి అంతమవన ప్రాణ బంధమా
అంతులేని దాహమవన ప్రియ ప్రవాహమా
నీతో కలిసి పూర్తి అవన మొదటి స్నేహమా
ఏం జరుగుతోంది ఏం జరుగుతోంది నా మనసుకివాళ
హ..ఏం వెతుకుతోంది ఏం వెతుకుతోంది నా వయసు ఇవేళ
నీ యెదుట నిలిచే వరకు
ఆపదట తరిమె పరుగు
ఏం మాయ చేసావ్ అసలు సొగసా..
ఏం జరుగుతోంది ఏం జరుగుతోంది నా మనసుకివాళ
ఏ ఏ ఏ ఏ ఏం వెతుకుతోంది ఏం వెతుకుతోంది నా వయసు ఇవేళ
కుర్ర కుర్ర పాట సాహిత్యం
చిత్రం: మహాత్మ (2009)
సంగీతం: విజయ్ ఆంథోనీ
సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ
గానం: విజయ్ అంటోని, సుర్చిత్ , వినయ
కుర్ర కుర్ర
తలయెత్తి పాట సాహిత్యం
చిత్రం: మహాత్మ (2009)
సంగీతం: విజయ్ ఆంథోనీ
సాహిత్యం: సిరివెన్నెల సీతారామ శాస్త్రి
గానం: యస్.పి.బాలు
తలయెత్తి
జజ్జనక జజ్జనక పాట సాహిత్యం
చిత్రం: మహాత్మ (2009)
సంగీతం: విజయ్ ఆంథోనీ
సాహిత్యం: లక్ష్మి భోపాల్
గానం: విజయ్ ఆంథోనీ
గోలకొండ గోలపెట్టి చార్మినార్ సిటీ కొట్టి
ఎసెరా జజ్జనక జజ్జనక
గోలకొండ గోలపెట్టి చార్మినార్ సిటీ కొట్టి
ఎసెరా జజ్జనక జజ్జనక
ఎసెరా జజ్జనక జజ్జనక
జజ్జనక జజ్జనక జజ్జనక
ఎసెరా జజ్జనక జజ్జనక
జజ్జనక జజ్జనక జజ్జనక
గోలకొండ గోలపెట్టి చార్మినార్ సిటీ కొట్టి
ఎసెరా జజ్జనక జజ్జనక
గోలకొండ గోలపెట్టి చార్మినార్ సిటీ కొట్టి
ఎసెరా జజ్జనక జజ్జనక
ఎసెరా జజ్జనక జజ్జనక
జజ్జనక జజ్జనక జజ్జనక
ఎసెరా జజ్జనక జజ్జనక
జజ్జనక జజ్జనక జజ్జనక
లారిస్ సోనా లారిస్ సోనా లారిస్ సోనారే
లారిస్ సోనా లారిస్ సోనా లారిస్ సోనారే
లారిస్ సోనా లారిస్ సోనా లారిస్ సోనారే
ఊరకుక్క పేరేసి మురికి అంత మీద ఎసి
ఆస్కార్ తెచ్చేసి పరువంతా తీసేసి
తెల్లోడికి లోకువ లోకువ లోకువ
కుక్కవ కుక్కవ కుక్కవ కుక్కవ
మంది సొమ్ము రాజమిచ్చి 7 ఊసలు లెక్కపెడితే
రాజు గారిని ముసలి మింగి ఏడువేల కోట్లు ఉంటె
ఎవడి బాబు సొమ్మురా సొమ్మురా సొమ్మురా
సిగ్గురా సిగ్గురా సిగ్గురా సిగ్గురా
గోలకొండ గోలపెట్టి చార్మినార్ సిటీ కొట్టి
ఏసెరా
గోలకొండ గోలపెట్టి చార్మినార్ సిటీ కొట్టి
ఏసెరా
లారిస్ సోనా లారిస్ సోనా లారిస్ సోనారే
లారిస్ సోనా లారిస్ సోనా లారిస్ సోనారే
పార్టీ కి ఒక పేపరు పమ్ప్లేట్ల మ్యాటర్ ఉ
రాతలన్నీ రోతలూ కబుర్లు అన్ని కోతలు
జనాలు అంత ఎధవలా ఎధవలా ఎధవలా
చదవరా చదవరా చదవరా చదవరా
ఊర్లోనే పెళ్లి ఐతే కుక్కలన్ని గోలరా
ఎంకి పెళ్లి సుబ్బు చావు మీడియా కి న్యూస్ ర
సిగ్గు ఎగ్గూ లేదు ర లేదు ర లేదు ర
నారద నారద నారద నారద
గోలకొండ గోలపెట్టి చార్మినార్ సిటీ కొట్టి యేసెరా
గోలకొండ గోలపెట్టి చార్మినార్ సిటీ కొట్టి యేసెరా
లారిస్ సోనా లారిస్ సోనా లారిస్ సోనారే
లారిస్ సోనా లారిస్ సోనా లారిస్ సోనారే
లారిస్ సోనా లారిస్ సోనా లారిస్ సోనారే
గోలకొండ గోలపెట్టి చార్మినార్ సిటీ కొట్టి
ఎసెరా జజ్జనక జజ్జనక
గోలకొండ గోలపెట్టి చార్మినార్ సిటీ కొట్టి
ఎసెరా జజ్జనక జజ్జనక
ఎసెరా జజ్జనక జజ్జనక
జజ్జనక జజ్జనక జజ్జనక
ఎసెరా జజ్జనక జజ్జనక
జజ్జనక జజ్జనక జజ్జనక
డైలమో డైలామో పాట సాహిత్యం
చిత్రం: మహాత్మ (2009)
సంగీతం: విజయ్ ఆంథోనీ
సాహిత్యం: సిరివెన్నెల సీతారామ శాస్త్రి
గానం: బాలాజీ సంగీత, మేఘ
డైలమో డైలామో డైలా డైలా డైలమో
డైలమో డైలమో డైలమో డైలమో
డైలమో డైలామో డైలా డైలా డైలమో
డైలమో డైలమో డైలమో డైలమో
నువ్వు వస్తావో రావో అదో డైలమా
నువ్వు వస్తావో రావో అదో డైలమా
ఎంచేస్తోవో ఏమో అదో డైలమా
రహస్యంగా ఏదైనా అంటావ్ ఏమో
సందేహంగా చూస్తూనే ఉంటావ్ ఏమో
డైలమో డైలామో డైలా డైలా డైలమో
డైలమో డైలమో డైలమో డైలమో
డైలమో డైలామో డైలా డైలా డైలమో
డైలమో డైలమో డైలమో డైలమో
బోలోజి బాలాజీ ఏంకావాలో లేలోజి
కౌగిలి లో పడిపోదామా రాజి రాజి
నా మాటలో లాలూజీ కావలి అంటే లోలాక్షి
కిడించి మెలించాలె కుర్చీ
నోరారా మెచ్చి మెచ్చి మెచ్చి మెచ్చి
గోరారా గీచి గీచి గీచి గీచి
కన్నారా హదే పెంచి పన్నారా ముద్దె ఇచ్చి
లైలని లాలించి చూపించు లవ్ లో రుచి
డైలమో డైలామో డైలా డైలా డైలమో
డైలమో డైలమో డైలమో డైలమో
డైలమో డైలామో డైలా డైలా డైలమో
డైలమో డైలమో డైలమో డైలమో
కావిస్తా ఊరించి కాస్తో కూస్తో మేనేజ్ చై
కేవ్ అంటుంది ఏమో నాతో పేచీ
ఇందాక రప్పించి కాదంటానా కదిలించి
కానిలే నాకు ఏంటి అంట బూచి
కొరిగా నచ్చి నచ్చి నచ్చి నచ్చి
కనుక గ వచ్చి వచ్చి వచ్చి వచ్చి
చేచిగా నిన్నే మెచ్చి నాజుగా నచ్చే వీచి
వెచ్చము గ విదిస్తా విచేయి మందిచ్చి
డైలమో డైలామో డైలా డైలా డైలమో
డైలమో డైలమో డైలమో డైలమో
డైలమో డైలామో డైలా డైలా డైలమో
డైలమో డైలమో డైలమో డైలమో
నువ్వు వస్తావో రావో అదో డైలమా
నువ్వు వస్తావో రావో అదో డైలమా
ఎంచేస్తోవో ఏమో అదో డైలమా
రహస్యం గ ఏదైనా అంటావు ఏమో
సందేహం గ చూస్తూనే ఉంటావు ఏమో
నీలపూరి గాజుల పాట సాహిత్యం
చిత్రం: మహాత్మ (2009)
సంగీతం: విజయ్ ఆంథోనీ
సాహిత్యం: సిరివెన్నెల సీతారామ శాస్త్రి
గానం: కాసర్ల శ్యామ్
నీలపూరి గాజుల ఓ నీల వేణి నిలుసుంటే కృష్ణవేణి
నువ్వు లంగా వోణి వేసుకొని నడుస్తు ఉంటే నిలువలేనే బాలామణి
నడుము చూస్తే కందిరీగ నడకచూస్తే హంసనడక నిన్ను చూడలేనే బాలికా
నీ కళ్ళు జూసీ నీ పళ్లు జూసీ కలిగెనమ్మ ఏదో కోరిక
నీలపూరి గాజుల ఓ నీల వేణి నిలుసుంటే కృష్ణవేణి
నువ్వు లంగా వోణి వేసుకొని నడుస్తు ఉంటే
నిలువలేనే బాలామణి
నడుము చూస్తే కందిరీగ నడకచూస్తే హంసనడక
నిన్ను చూడలేనే బాలికా
నీ కళ్ళు జూసీ నీ పళ్లు జూసీ కలిగెనమ్మ ఏదో కోరిక
నల్ల నల్లాని నీ కురులు దువ్వి తెల్ల తెల్లాని మల్లెలు తురిమి
చేమంతి పూలు పెట్టుకోని నీ పెయ్యంత సెంటు పూసుకోని
ఒళ్లంత తిప్పుకుంటూ వయ్యారంగా పోతు ఉంటే
నిలువదాయే నా ప్రాణమే
నీలపూరి గాజుల ఓ నీల వేణి నిలుసుంటే కృష్ణవేణి
నువ్వు లంగా వోణి వేసుకొని నడుస్తు ఉంటే
నిలువలేనే బాలామణి
నడుము చూస్తే కందిరీగ నడకచూస్తే హంసనడక
నిన్ను చూడలేనే బాలికా
నీ కళ్ళు జూసీ నీ పళ్లు జూసీ కలిగెనమ్మ ఏదో కోరిక
నీ చూపుల్లో ఉంది మత్తు సూది నా గుండెల్లో గుచ్చుకున్నాది
నీ మాటల్లో తుపాకి తూట అబ్బ జారిపోయెనమ్మ నీ పైట
నీ కొంగు చాటు అందాలు చూసి నేను ఆగమైతి
ఒక్కసారి తిరిగి చూడవే
నీలపూరి గాజుల ఓ నీల వేణి నిలుసుంటే కృష్ణవేణి
నువ్వు లంగా వోణి వేసుకొని నడుస్తు ఉంటే
నిలువలేనే బాలామణి
నడుము చూస్తే కందిరీగ నడకచూస్తే హంసనడక
నిన్ను చూడలేనే బాలికా
నీ కళ్ళు జూసీ నీ పళ్లు జూసీ కలిగెనమ్మ ఏదో కోరిక