చిత్రం: అందరికీ మొనగాడు (1971) సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం సాహిత్యం: ఆరుద్ర (All) గానం: పి. సుశీల, ఎల్.ఆర్.ఈశ్వరి, యస్.పి. బాలు నటీనటులు: కృష్ణ , భారతి, జయసుధ నిర్మాత, దర్శకత్వం: ఎమ్.మల్లికార్జున రావు విడుదల తేది: 13.02.1971
Songs List:
అడగనా మాననా అమ్మాయి పాట సాహిత్యం
చిత్రం: అందరికీ మొనగాడు (1971) సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం సాహిత్యం: ఆరుద్ర గానం: యస్.పి. బాలు, పి. సుశీల పల్లవి: అడగనా మాననా అమ్మాయి అడిగితే ఇస్తావా హాయి అడగనా మాననా అమ్మాయి అడిగితే ఇస్తావా హాయి అడిగినా మానినా అబ్బాయి ఎన్నడో కలిపాను చేయి అడిగినా మానినా అబ్బాయి ఎన్నడో కలిపాను చేయి చరణం: 1 మగవాడు చేసేది ఏమిటి వగలాడి మురిసేది ఏమిటి మగవాడు చేసేది ఏమిటి వగలాడి మురిసేది ఏమిటి మగవాడు చేసేది అల్లరి మగవాడు చేసేది అల్లరి వగలాడి మురిసేది రాగ వల్లరి అడగనా మాననా అమ్మాయి అడిగితే ఇస్తాను హాయి చరణం: 2 మగవాడు తలచేది ఏమిటీ జవరాలు మరువనిది ఏమిటీ మగవాడు తలచేది ఏమిటీ జవరాలు మరువనిది ఏమిటీ మగవాడు తలచేది కమ్మని కైపు మగవాడు తలచేది కమ్మని కైపు ప్రియురాలు మరువనిది ప్రియతమ రూపు అడగనా మాననా అమ్మాయి అడిగితే ఇస్తాను హాయి చరణం: 3 మగవాడు కోరేది ఏమిటీ ప్రియురాలు ఇచ్చేది ఏమిటీ మగవాడు కోరేది ఏమిటీ ప్రియురాలు ఇచ్చేది ఏమిటీ మగవాడు కోరేది ఆనందం మగవాడు కోరేది ఆనందం ప్రియురాలు ఇచ్చేది మెచ్చేది అనుబంధం అడగనా మాననా అమ్మాయి అడిగితే ఇస్తావా హాయి అడిగినా మానినా అబ్బాయి ఎన్నడో కలిపాను చేయి
నా బింకం లోని పెంకితనం పాట సాహిత్యం
చిత్రం: అందరికీ మొనగాడు (1971) సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం సాహిత్యం: ఆరుద్ర గానం: ఎల్.ఆర్.ఈశ్వరి నా బింకం లోని పెంకితనం నాదే నాదే నాదే నా పొంకం లోని వెచ్చదనం నీదే నీదే నీదే
దారెంట పోయేదానా పాట సాహిత్యం
చిత్రం: అందరికీ మొనగాడు (1971) సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం సాహిత్యం: ఆరుద్ర గానం: యస్.పి. బాలు దారెంట పోయేదానా నీవెంట నేను రానా
ఓ...కమ్మనిదొకటి దాచాను పాట సాహిత్యం
చిత్రం: అందరికీ మొనగాడు (1971) సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం సాహిత్యం: ఆరుద్ర గానం: ఎల్.ఆర్.ఈశ్వరి & కోరస్ ఓ...కమ్మనిదొకటి దాచాను ఇమ్మన్నది నీకు ఇస్తానూ చక్కని వాడ మక్కువ తీర ఉక్కిరి బిక్కిరి చేస్తాను
ఒక పని మీద వచ్చాను పాట సాహిత్యం
చిత్రం: అందరికీ మొనగాడు (1971) సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం సాహిత్యం: ఆరుద్ర గానం: ఎల్.ఆర్.ఈశ్వరి ఒక పని మీద వచ్చాను వచ్చిన పనినే మరచాను నీ మగసిరి రవ్వంత చూసి నా మనసు పూర్తిగా ఇచ్చాను
1971
,
Andariki Monagadu
,
Bharathi
,
Chellapilla Satyam
,
Jayasudha
,
Krishna Ghattamaneni
,
M.Mallikarjuna Rao
Andariki Monagadu (1971)
Palli Balakrishna
Sunday, July 10, 2022
