Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "1966"
Dr. Anand (1966)



చిత్రం: డాక్టర్ ఆనంద్ (1966) 
సంగీతం: కె.వి. మహదేవన్ 
సాహిత్యం: ఆత్రేయ, దేవులపల్లి కృష్ణ శాస్త్రి, కొసరాజు, డా॥ సి. నారాయణరెడ్డి 
గానం: ఘంటసాల, పి.సుశీల, బి. వసంత, పి.బి.శ్రీనివాస్, పిఠాపురం నాగేశ్వరరావు
నటీనటులు: రామారావు, అంజలీ దేవి, కాంచన 
దర్శకత్వం: వి. మధుసూదనరావు 
నిర్మాత: డి.వెంకటపతిరెడ్డి
విడుదల తేది: 14.10.1966



Songs List:



చక్కని చల్లని యిల్లు పాట సాహిత్యం

 
చిత్రం: డాక్టర్ ఆనంద్ (1966) 
సంగీతం: కె.వి. మహదేవన్ 
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ 
గానం: ఘంటసాల, పి. సుశీల 

చక్కని చల్లని యిల్లు
చక్కెర బొమ్మలు పాపలు 
మల్లెల మనసులు విరజల్లు
మమతల కలలకు పందిళ్ళు 

చక్కని చల్లని యిల్లు, 
చక్కెర బొమ్మలు పాపలు 
మల్లెల మనసులు విరజల్లు
మమతల కలలకు పందిళ్ళు 
చక్కని చల్లని యిల్లు
చక్కెర బొమ్మలు పాపలు 

చరణం:1
అమ్మా, నాన్నా కట్టినవి
అమ్మా, నాన్నా కట్టినవి
అల్లరి పిల్లలు పుట్టినవీ.. అహహహ 
అల్లరి పిల్లలు పుట్టినవి 
ముద్దుల ముద్దలు పెట్టినవి
ముల్లోకాలకు స్వర్గమిదీ..ఈ..

అహహహా.. అహహహా...అహహహా

చక్కని చల్లని యిల్లు
చక్కెర బొమ్మలు పాపలు 

చరణం: 2
మనసు పెరిగితే ఒకటౌతాము
వయసు పెరిగితే వేరౌతాము 
మనసు పెరిగితే ఒకటౌతాము
వయసు పెరిగితే వేరౌతాము 
పెరిగే మీరు తరిగే మేము 
ప్రేమనిక్కడే చవి చూద్దాము 

అహహహా.. అహహహా...అహహహా

చక్కని చల్లని యిల్లు
చక్కెర బొమ్మలు పాపలు 
మల్లెల మనసులు విరజల్లు
మమతల కలలకు పందిళ్ళు 
చక్కని చల్లని యిల్లు
చక్కెర బొమ్మలు పాపలు 

అహహహా.. అహహహా...అహహహా



నీలమోహనా.. రారా పాట సాహిత్యం

 
చిత్రం: డాక్టర్ ఆనంద్ (1966) 
సంగీతం: కె.వి. మహదేవన్ 
సాహిత్యం: దేవులపల్లి 
గానం: పి. సుశీల 

పల్లవి: 
నీలమోహనా.. రారా 
నిన్ను పిలిచె నెమలి నెరజాణ 
నీలమోహనా.. రారా
నిన్ను పిలిచె నెమలి నెరజాణ 
నీలమోహనా.. రారా

జారువలపు జడివాన కురిసెరా.. 
జాజిలత మేను తడిసెరా 
జారువలపు జడివాన కురిసెరా.. 
జాజిలత మేను తడిసెరా
లతలాగే నా మనసు తడిసెరా.. 
నీలమోహనా.. రారా
రారా..రారా.. 

చరణం: 1
ఏలాగె మతిమాలి? ఏడే నీ వనమాలి? 
ఏలాగె మతిమాలి? ఏడే నీ వనమాలి? 

అతడేనేమో అనుకున్నానే.. 
అంత దవుల శ్రావణ మేఘములగనీ 
అతడేనేమో అనుకున్నానే.. 
అంత దవుల శ్రావణ మేఘములగనీ 

ప్రతిమబ్బు ప్రభువైతే... 
ప్రతికొమ్మ మురళైతే ఏలాగె 
ఆ... ఏలాగె మతిమాలి.... 
ఏడే నీ వనమాలి? 
హ హా హా.. 
హా హా.. 

నీలమోహనా.. రారా..  
నిన్ను పిలిచె నెమలి నెరజాణ 
నీలమోహనా.. రారా.. రా రా రా... 

చరణం: 2
ఆ... సారెకు దాగెదవేమి? 
నీ రూపము దాచి దాచి 
ఊరించుటకా స్వామీ? 
సారెకు దాగెదవేమి..? 
నీ కన్నుల తోడు నీ కలికి నవ్వుల తోడు 
నీకోసం ఎంత వేగిపోయానో కృష్ణా 
కృషా కృష్ణా కృష్ణా... 
సారెకు దాగెదవేమి..? 

చరణం: 3
అటు... అటు... ఇటు... ఇటు... 
ఆ పొగడకొమ్మవైపు 
ఈ మొగలి గుబురువైపు 

కార్తీక రాతిరిలో కఱి మబ్బుంటుందా...
నీలిమేఘమాకాశము విడిచి... 
నేల నడుస్తుందా ? 
కార్తీక రాతిరిలో కఱి మబ్బుంటుందా...
నీలిమేఘమాకాశము విడిచి... 
నేల నడుస్తుందా ? 

నడిచే మబ్బులకు నవ్వే పెదవుందా? 
నవ్వే పెదవులకూ మువ్వల మురళుందా? 
పెదవి నందితే పేద వెదుళ్ళు 
కదిలి పాడుతాయా? 

నడిచే మబ్బులకు నవ్వే పెదవులు 
నవ్వే పెదవులకు మువ్వల వేణువులు 

మువ్వల వేణువులు... 
మువ్వల వేణువులు




పెరుగుతుంది హృదయం పాట సాహిత్యం

 
చిత్రం: డాక్టర్ ఆనంద్ (1966) 
సంగీతం: కె.వి.మహదేవన్ 
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ 
గానం: పి.సుశీల 

పెరుగుతుంది హృదయం 




మదిలోని నా స్వామి పాట సాహిత్యం

 
చిత్రం: డాక్టర్ ఆనంద్ (1966) 
సంగీతం: కె.వి. మహదేవన్ 
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి 
గానం: పి. సుశీల 

మదిలోని నా స్వామి ఎదురాయె నేడు
శిలయైన నా మేను పలికించినాడు
మదిలోని నా స్వామి ఎదురాయె నేడు
శిలయైన నా మేను పలికించినాడు

అతనిని కనినంత అందెలు పలికే
అతనిని కనినంత అందెలు పలికే
అందెలు రవళించ డెందము పలికే
నాలో శతకోటి భావాలు పలికే

మదిలోని నా స్వామి ఎదురాయె నేడు
శిలయైన నా మేను పలికించినాడు

మనసెరిగిన వాడు మమతల నెలరేడు
వలపుల దీపాలని నిలిపిన చెలికాడు
మనసెరిగిన వాడు మమతల నెలరేడు
వలపుల దీపాలు నిలిపిన చెలికాడు
ఇన్నాళ్లకు తానే నన్నేలినాడు

మదిలోని నా స్వామి ఎదురాయె నేడు
శిలయైన నా మేను పలికించినాడు

అతడే నాపాలి అభినవ వనమాలి
ఆతని నయనాలు అందిన నయనాలు
అతడే నాపాలి అభినవ వనమాలి
ఆతని నయనాలు అందిన గగనాలు
ఆతని పాదాలు నా పారిజాతాలు

మదిలోని నా స్వామి ఎదురాయె నేడు
శిలయైన నా మేను పలికించినాడు.




నీలాల కన్నులతో పాట సాహిత్యం

 
చిత్రం: డాక్టర్ ఆనంద్ (1966) 
సంగీతం: కె.వి. మహదేవన్ 
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి 
గానం: ఘంటసాల, పి. సుశీల 

నీలాల కన్నులతో ఏలాగో చూసేవు ఎందుకని చూసేవెందుకని



ముసుగు తీయవోయి పాట సాహిత్యం

 
చిత్రం: డాక్టర్ ఆనంద్ (1966) 
సంగీతం: కె.వి.మహదేవన్ 
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ 
గానం: పి.బి.శ్రీనివాస్ 

ముసుగు తీయవోయి 




తళుకు బెళుకు చీరదాన పాట సాహిత్యం

 
చిత్రం: డాక్టర్ ఆనంద్ (1966) 
సంగీతం: కె.వి.మహదేవన్ 
సాహిత్యం: కొసరాజు 
గానం: పిఠాపురం, స్వర్ణలత 

తళుకు బెళుకు చీరదాన




చక్కని చల్లని యిల్లు (Female Version) పాట సాహిత్యం

 

చిత్రం: డాక్టర్ ఆనంద్ (1966) 
సంగీతం: కె.వి. మహదేవన్ 
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ 
గానం: పి. సుశీల 

చక్కని చల్లని యిల్లు
చక్కెర బొమ్మలు పాపలు 

Palli Balakrishna Monday, October 16, 2023
Paramanandayya Sishyula Katha (1966)



చిత్రం: పరమానందయ్య శిష్యుల కథ (1966)
సంగీతం: ఘంటసాల
నటీనటులు: యన్.టి.రామారావు, కె.ఆర్.విజయ 
దర్శకత్వం: సి.పుల్లారావు
నిర్మాత: తోట సుబ్బారావు 
విడుదల తేది: 07.04.1966



Songs List:



ఓం నమశ్శివాయ పాట సాహిత్యం

 
చిత్రం: పరమానందయ్య శిష్యుల కథ (1966)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: వెంపటి సదాశివ బ్రహ్మం 
గానం: పట్టాభి, రఘురాం, బద్రం, గోపాల్ రావు, బాబు, సరోజినీ, విజయలక్ష్మి

ఓం నమశ్శివాయ



ఇదిగో వచ్చితి రతిరాజా పాట సాహిత్యం

 
చిత్రం: పరమానందయ్య శిష్యుల కథ (1966)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: శ్రీ శ్రీ
గానం: యస్.జానకి 

ఇదిగో వచ్చితి రతిరాజా 



ఎనలేని ఆనందం పాట సాహిత్యం

 
చిత్రం: పరమానందయ్య శిష్యుల కథ (1966)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: వెంపటి సదాశివ బ్రహ్మం 
గానం: ఘంటసాల, యస్.జానకి 

ఎనలేని ఆనందం 




ఓ మహాదేవ పాట సాహిత్యం

 
చిత్రం: పరమానందయ్య శిష్యుల కథ (1966)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: వెంపటి సదాశివ బ్రహ్మం 
గానం: పి.సుశీల 

ఓ మహాదేవ 



నాలోని రాగ పాట సాహిత్యం

 
చిత్రం: పరమానందయ్య శిష్యుల కథ (1966)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: సి.నారాయణ రెడ్డి 
గానం: ఘంటసాల, పి.సుశీల 

నాలోని రాగ 



వనిత తానంతట పాట సాహిత్యం

 
చిత్రం: పరమానందయ్య శిష్యుల కథ (1966)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: వెంపటి సదాశివ బ్రహ్మం 
గానం: పి.లీల, ఏ.పి.కోమల

వనిత తానంతట 




పరమ గురుడు పాట సాహిత్యం

 
చిత్రం: పరమానందయ్య శిష్యుల కథ (1966)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: కొసరాజు 
గానం: పిఠాపురం నాగేశ్వరరావు, రాఘవులు, చక్రవర్తి, బద్రం, కృష్ణమూర్తి 

పరమ గురుడు 




కామినీ మధన రారా పాట సాహిత్యం

 
చిత్రం: పరమానందయ్య శిష్యుల కథ (1966)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: సముద్రాల జూనియర్
గానం: ఘంటసాల, పి.లీల

కామినీ మధన రారా

Palli Balakrishna Monday, July 24, 2023
Shakuntala (1966)



చిత్రం: శకుంతల (1966)
సంగీతం: ఘంటసాల
సహాయకులు: జె.వి.రాఘవులు
సాహిత్యం: సముద్రాల, శ్రీ శ్రీ , సినారె, దాశరధి, కొసరాజు, ఆరుద్ర 
గానం: ఘంటసాల, పి.సుశీల , పి. లీల , వైదేహి, మాధవపెద్ది రమేష్, పిఠాపురం, రాఘవులు
నటీనటులు: యన్.టి.రామారావు , బి.సరోజ దేవి
దర్శకత్వం: కమలాకర కామేశ్వరరావు
నిర్మాతలు: లక్ష్మిరాజ్యం , శ్రీధర్ రావు 
విడుదల తేది: 03.03.1966



Songs List:



కనరా మణిశేఖర పాట సాహిత్యం

 
చిత్రం: శకుంతల (1966)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: సముద్రాల సినియర్
గానం: పి.సుశీల 

కనరా మణిశేఖర



సదాశివా ( శ్లోకం) పాట సాహిత్యం

 
చిత్రం: శకుంతల (1966)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: DEVOTIONAL
గానం: ఘంటసాల

సదాశివా  ( శ్లోకం)



మధుర మధుర సుమసీమ పాట సాహిత్యం

 
చిత్రం: శకుంతల (1966)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: ఆరుద్ర 
గానం: పి.సుశీల 

మధుర మధుర సుమసీమ సుధలు కురియు వనసీమ
మధుర మధుర సుమసీమ సుధలు కురియు వనసీమ
ఏవేవో భావాలు పూవులవోలె పూచే సీమ
మధుర మధుర సుమసీమ
సుధలు కురియు వనసీమ

తేటికి పాట నెమలికి ఆట
తెలిపే అందాలు,ఉసిగొలిపే చందాలు
తేటికి పాట నెమలికి ఆట
తెలిపే అందాలు,ఉసిగొలిపే చందాలు
హంసకు నడకు లేడికి పరుగు నేర్పే పరువాలు
హాయ్ హాయ్ నీ నిగనిగ చెలువాలు
హంసకు నడకు లేడికి పరుగు నేర్పే పరువాలు
నీ నిగనిగ చెలువాలు
కన్నియ చిరునవ్వు, కమ్మని నునుసిగ్గు
ఎన్నటికైనా వాడని సీమ ఆ ఆ
హొయ్ హొయ్ హొయ్

మధుర మధుర సుమసీమ
సుధలు కురియు వనసీమ
మధుర మధుర సుమసీమ
సుధలు కురియు వనసీమ

చల్లని మాసం పెళ్ళిముహూర్తం
మల్లిక వధువు సుమా
ఎలమావే వరుడు సుమా
చల్లని మాసం పెళ్ళిముహూర్తం
మల్లిక వధువు సుమా
ఎలమావే వరుడు సుమా
మంజులగానం మంగళగీతం మన్మధ వేదాలు
హాయ్ హాయ్ తొలివలపుల మంత్రాలు
మంజులగానం మంగళగీతం మన్మధ వేదాలు
తొలివలపుల మంత్రాలు
పువ్వుల కళ్యాణం నవ్వుల వైభోగం
ముచ్చటలన్ని తీరే సీమ ఆ ఆ
హొయ్ హొయ్ హొయ్

మధుర మధుర సుమసీమ
సుధలు కురియు వనసీమ
ఏవేవో భావాలు పూవులవోలె పూచే సీమ
మధుర మధుర సుమసీమ
సుధలు కురియు వనసీమ
మధుర మధుర సుమసీమ
సుధలు కురియు వనసీమ




అనార్గ్రాతాం పాట సాహిత్యం

 
చిత్రం: శకుంతల (1966)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: కాళిదాస్ 
గానం: ఘంటసాల

అనార్గ్రాతాం




మదిలో మౌనంగా పాట సాహిత్యం

 
చిత్రం: శకుంతల (1966)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: ఘంటసాల

మదిలో మౌనంగా 




నిర్ధయా పాట సాహిత్యం

 
చిత్రం: శకుంతల (1966)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: సముద్రాల సినియర్
గానం: పి.సుశీల, ఘంటసాల 

నిర్ధయా




చల్లని పాట సాహిత్యం

 
చిత్రం: శకుంతల (1966)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: కందుకూరి వీరేశలింగం
గానం: ఘంటసాల

చల్లని 



తరతమా బేధము పాట సాహిత్యం

 
చిత్రం: శకుంతల (1966)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: సముద్రాల సినియర్
గానం: ఘంటసాల

తరతమా బేధము



నీవు నేను కలిసిన నాడే పాట సాహిత్యం

 
చిత్రం: శకుంతల (1966)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: ఘంటసాల, పి.సుశీల 

నీవు నేను కలిసిన నాడే నింగి నేల కలిసెనులే
నీవే నేనై నిలచిన నాడే జీవనరాగం తెలిసెనులే
నీవు నేను కలిసిన నాడే నింగి నేల కలిసెనులే

అలలై పిలిచే నీ అందాలే వలపు తేనియలు చిలికెను నాలో
అలలై పిలిచే నీ అందాలే వలపు తేనియలు చిలికెను నాలో
నీలో సాగే అనురాగాలే నీలో సాగే అనురాగాలే
వేణువులూదెను నాలో లోలో

నీవు నేను కలిసిన నాడే నింగి నేల కలిసెనులే
నీవే నేనై నిలచిన నాడే జీవనరాగం తెలిసెనులే

నీలో విరిసే దరహాసాలే పాలవెల్లులై పొంగెను నాలో
నీలో విరిసే దరహాసాలే పాలవెల్లులై పొంగెను నాలో
జగమును దాటి గగనము మీటి
జగమును దాటి గగనము మీటి
ఎగిసెను ఊహలు నాలో లోలో

నీవు నేను కలిసిన నాడే నింగి నేల కలిసెనులే





సరసన నీవుంటే పాట సాహిత్యం

 
చిత్రం: శకుంతల (1966)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: దాశరధి
గానం: ఘంటసాల, పి.సుశీల 

సరసన నీవుంటే జాబిలి నాకేల అహ
సరసన నీవుంటే జాబిలి నాకేల
మనసున నీవుంటే స్వర్గము నాకేల
సరసన నీవుంటే జాబిలి నాకేల

నీకన్నులలో నిగనిగ చూసి
నివ్వెరపోయెను తారకలు ఆ ఉం
నీకన్నులలో నిగనిగ చూసి
నివ్వెరపోయెను తారకలు
తారలలోని తరుణిమ నీవై
తారలలోని తరుణిమ నీవై
నన్నే మురిపింతువే అదే హాయ్

సరసన నీవుంటే జాబిలి నాకేల
మనసున నీవుంటే స్వర్గము నాకేల
సరసన నీవుంటే జాబిలి నాకేల

చక్కని నీ ముఖ చంద్రుని చూడగ
జాబిలి అదిగో ఆగెనులే
చక్కని నీ ముఖ చంద్రుని చూడగ
జాబిలి అదిగో ఆగెనులే
కౌగిలిలోన ఊగిన వేళ
కౌగిలిలోన ఊగిన వేళ
కాలమే ఆగిందిలే అదే హాయ్

సరసన నీవుంటే జాబిలి నాకేల
మనసున నీవుంటే స్వర్గము నాకేల
సరసన నీవుంటే జాబిలి నాకేల




యస్యేస్తజ్యే పాట సాహిత్యం

 
చిత్రం: శకుంతల (1966)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: కాళిదాస్ 
గానం: ఘంటసాల

యస్యేస్తజ్యే



గురు జనముల పాట సాహిత్యం

 
చిత్రం: శకుంతల (1966)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: సముద్రాల సినియర్
గానం: ఘంటసాల

గురు జనముల 




చెంగావి కట్టిన పాట సాహిత్యం

 
చిత్రం: శకుంతల (1966)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: కొసరాజు 
గానం: ఘంటసాల

చెంగావి కట్టిన 



అమ్మా చకుంతుల పాట సాహిత్యం

 
చిత్రం: శకుంతల (1966)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: శ్రీ శ్రీ 
గానం: పి.లీల 

అమ్మా చకుంతుల



పాతకాలం నాటి పాట సాహిత్యం

 
చిత్రం: శకుంతల (1966)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: కొసరాజు
గానం: మాధవపెద్ది సత్యం, పిఠాపురం, రాఘవులు

పాతకాలం నాటి 




నాకంటి పాపవైనా పాట సాహిత్యం

 
చిత్రం: శకుంతల (1966)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: దాశరధి
గానం: పి.సుశీల 

నాకంటి పాపవైనా నా ఇంటి దీపమైనా
నీవే సుకుమార రారా ఓ వీర
నాకంటి పాపవైనా నా ఇంటి దీపమైనా
నీవే సుకుమార రారా ఓ వీర

నెలరాజులోని సొగసు
దినరాజులోని వెలుగు
నెలరాజులోని సొగసు
దినరాజులోని వెలుగు
నీయందు నిండి నా కలలు పండి
యువరాజువవుదులేరా
రారా సుకుమార ఒహో వీర

హరిచేత సిరులు పొంది
హరుచేత వరములొంది
హరిచేత సిరులు పొంది
హరుచేత వరములొంది
లోకాలనేలి భోగాల తేలి
చిరకీర్తినందుకోర
రారా సుకుమార ఒహో వీర

ఇంటింట శాంతి నిలిపి
జగమంత కాంతి నింపి
ఇంటింట శాంతి నిలిపి
జగమంత కాంతి నింపి
సురవరుల నరుల జేజేలనంది
వర్ధిల్లు భరతవీర
రారా సుకుమార ఒహో వీర

నాకంటి పాపవైనా నా ఇంటి దీపమైనా
నీవే సుకుమార రారా ఓ వీర
రారా ఓ వీర




అమ్మా శరణమ్మా పాట సాహిత్యం

 
చిత్రం: శకుంతల (1966)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: సముద్రాల సినియర్
గానం: పి.సుశీల

అమ్మా శరణమ్మా

Palli Balakrishna Tuesday, July 19, 2022
Srikakula Andhra Maha Vishnu Katha (1966)



చిత్రం: శ్రీకాకుళ ఆంధ్రమహావిష్ణు కథ (1966)
సంగీతం: పెండ్యాల
నటీనటులు: యన్.టి.రామారావు, జమున 
దర్శకత్వం: ఎ. కె. శేఖర్ 
నిర్మాత: దగ్గుబాటి లక్ష్మినారాయణ చౌదరి 
విడుదల తేది: 06.05.1966



Songs List:



జయహే జయహే పాట సాహిత్యం

 
చిత్రం: శ్రీకాకుళ ఆంధ్రమహావిష్ణు కథ (1966)
సంగీతం: పెండ్యాల
సాహిత్యం: పింగళి నాగేంద్ర రావు
గానం: పి. లీల 

జయహే జయహే   




కుశలమా ఎచ నుంటివో పాట సాహిత్యం

 
చిత్రం: శ్రీకాకుళ ఆంధ్రమహావిష్ణు కథ (1966)
సంగీతం: పెండ్యాల
సాహిత్యం: పింగళి నాగేంద్ర రావు
గానం: ఘంటసాల, యస్. జానకి 

కుశలమా ఎచ నుంటివో 



మోహన రమణుడ పాట సాహిత్యం

 
చిత్రం: శ్రీకాకుళ ఆంధ్రమహావిష్ణు కథ (1966)
సంగీతం: పెండ్యాల
సాహిత్యం: పింగళి నాగేంద్ర రావు
గానం: మాధవపెద్ది సత్యం, బి. వసంత 

మోహన రమణుడ 




నే రానంటినా ఓ మామయ్య పాట సాహిత్యం

 
చిత్రం: శ్రీకాకుళ ఆంధ్రమహావిష్ణు కథ (1966)
సంగీతం: పెండ్యాల
సాహిత్యం: పింగళి నాగేంద్ర రావు
గానం: యస్. జానకి 

నే రానంటినా ఓ మామయ్య 




ఓహిరి సాహిరి పాట సాహిత్యం

 
చిత్రం: శ్రీకాకుళ ఆంధ్రమహావిష్ణు కథ (1966)
సంగీతం: పెండ్యాల
సాహిత్యం: పింగళి నాగేంద్ర రావు
గానం: యస్. జానకి, ఘంటసాల 

ఓహిరి సాహిరి 



ఓ సుమబాల పాట సాహిత్యం

 
చిత్రం: శ్రీకాకుళ ఆంధ్రమహావిష్ణు కథ (1966)
సంగీతం: పెండ్యాల
సాహిత్యం: పింగళి నాగేంద్ర రావు
గానం: పి. సుశీల, బి. వసంత 

ఓ సుమబాల 




వల్లభ ప్రియ వల్లభ పాట సాహిత్యం

 
చిత్రం: శ్రీకాకుళ ఆంధ్రమహావిష్ణు కథ (1966)
సంగీతం: పెండ్యాల
సాహిత్యం: పింగళి నాగేంద్రరావు
గానం: యస్.జానకి 

వల్లభ ప్రియ వల్లభ 





కుశలమా కుశలమా పాట సాహిత్యం

 
చిత్రం: శ్రీకాకుళ ఆంధ్రమహావిష్ణు కథ (1966)
సంగీతం: పెండ్యాల
సాహిత్యం: పింగళి నాగేంద్ర రావు
గానం: యస్. జానకి, స్వర్ణలత, బి. వసంత 

కుశలమా కుశలమా 




వసంత గాలికి వలపులు రేగ పాట సాహిత్యం

 
చిత్రం: శ్రీకాకుళ ఆంధ్రమహావిష్ణు కథ (1966)
సంగీతం: పెండ్యాల
సాహిత్యం: పింగళి నాగేంద్ర రావు
గానం: యస్. జానకి , బాలమురళి కృష్ణ   

పల్లవి:
వసంత గాలికి వలపులు రేగ
వరించు బాలిక మయూరి కాగ
తనువు మనసు ఊగి తూగి
ఒక మైకం కలిగేనులే
ఈ మహిమ నీదేనులే ప్రేమతీరు ఇంతేనులే

చరణం :1 
రవంత సోకిన చల్లని గాలికి 
మరింత సోలిన వసంతుడనగా
తనువు మనసు ఊగి తూగి
ఈ లోకం మారేనులే
ఈ మహిమ నీదేనులే... ఆహా భలే హాయిలే

చరణం: 2 
విలాస మాధురి వెన్నెల కాగా...
విహార వీణలు విందులు కాగా
ఏకాంతంలో నీవూ నేనే
ఒక స్వర్గం కనుపించెనే

ఈ మహిమ నీదేనులే... ప్రేమ తీరు ఇంతేనులే

Palli Balakrishna Sunday, July 17, 2022
Aame Evaru? (1966)



చిత్రం: ఆమె ఎవరు (1966)
సంగీతం: వేదా 
సాహిత్యం: దాశరథి (All)
నటీనటులు: జగ్గయ్య, జయలలిత, వాణిశ్రీ 
దర్శకత్వం: బి.ఎస్.నారాయణ 
నిర్మాత: పి.ఎస్.వీరప్ప 
విడుదల తేది: 22.07.1966



Songs List:



టిక్కిరికి టిక్కిరికి టట్టటా పాట సాహిత్యం

 
చిత్రం: ఆమె ఎవరు (1966)
సంగీతం: వేదా 
సాహిత్యం: దాశరథి
గానం: పి. బి. శ్రీనివాస్, ఎల్. ఆర్. ఈశ్వరి 

టిక్కిరికి టిక్కిరికి టట్టటా 



నీవు చూసే చూపులో పాట సాహిత్యం

 
చిత్రం: ఆమె ఎవరు (1966)
సంగీతం: వేదా 
సాహిత్యం: దాశరథి
గానం: పి. బి. శ్రీనివాస్, ఎల్. ఆర్. ఈశ్వరి 

నీవు చూసే చూపులో 




కన్నె మనసు దోచుకున్న మామయ్య పాట సాహిత్యం

 
చిత్రం: ఆమె ఎవరు (1966)
సంగీతం: వేదా 
సాహిత్యం: దాశరథి
గానం: ఎల్. ఆర్. ఈశ్వరి 

కన్నె మనసు దోచుకున్న మామయ్య
ఈ చిన్నదాన్ని కనికరించవేమయ్య




అందాల ఈ రేయి పాట సాహిత్యం

 
చిత్రం: ఆమె ఎవరు (1966)
సంగీతం: వేదా 
సాహిత్యం: దాశరథి
గానం: పి. సుశీల

అందాల ఈ రేయి 




ఓ నా రాజా రావా రావా... పాట సాహిత్యం

 
చిత్రం: ఆమె ఎవరు (1966)
సంగీతం: వేదా 
సాహిత్యం: దాశరథి
గానం: పి. సుశీల

ఓ నా రాజా రావా రావా...
ఓ నా రాజా రావా రావా... 
చెలినే మరిచేవా...

ఓ నా రాజా రావా రావా
ఓ నా రాజా రావా రావా

నీ రూపే ఆశ రేపేను 
నీ మాటే వీణ మీటేను
ఓ... ఓ... ఓ...
నీ రూపే ఆశ రేపేను 
నీ మాటే వీణ మీటేను
గతాలే నన్ను పిలిచాయి 
ఆ హాయే నేడు లేదోయి
కలగ కరిగిందంతా జగమే యెంతో వింత
రేయి పగలు నిన్నే వెతికేనూ....

ఓ నా రాజా... రావా రావా...
ఓ నా రాజా... రావా రావా
వృధాగ కాలమేగెను... 
నిరాశే పొంగివచ్చేను
ఓ... ఓ... ఓ...
వృధాగ కాలమేగెను నిరాశే పొంగి వచ్చేను
తరంగంలాగ రావోయి ప్రియా నన్నాదుకోవోయి
యేదో తీరని బాధ కన్నీరొలికే గాధ
రేయి పగలు నిన్నే వెతికేనూ...

ఓ నా రాజా... రావా రావా
ఓ నా రాజా... రావా రావా
నీ కోసం నేనే వచ్చాను నీ ఇంటికి దీపమైనాను

నీ కోసం నేనే వచ్చను నీ ఇంటికి దీపమైనాను
నా తోని ఆడు కోవేల ఈ కోపం నేడు నీకేలా
నీ అడుగులలో నేను నా కన్నులలో నీవు
నాలో నీవు... నీలో నేనేలే....

ఓ నా రాజా రావా రావా
చెలినే మరిచేవా....

ఓ నా రాజా రావా రావా
ఓ నా రాజా రావా రావా

వరించిన మంచి వధువునులే 
రుచించే తీపి మధువునులే
ప్రియా నీ ప్రేమ కథనోయి 
సదా నీ నీలినీడనులే
ఏనాటిదో అనుబంధం 
ఎన్నడు తెగదీ బంధం...
రేయి పగలు నిన్నే వెతికేనూ....

ఓ నా రాజా... రావా రావా
ఓ నా రాజా... రావా రావా




నీ కన్నులలోన కన్నీరా పాట సాహిత్యం

 
చిత్రం: ఆమె ఎవరు (1966)
సంగీతం: వేదా 
సాహిత్యం: దాశరథి
గానం: పి. సుశీల

నీ కన్నులలోన కన్నీరా





అందచందాల పాట సాహిత్యం

 
చిత్రం: ఆమె ఎవరు (1966)
సంగీతం: వేదా 
సాహిత్యం: దాశరథి
గానం: పి. సుశీల

అందచందాల


Palli Balakrishna Sunday, June 26, 2022
Adugu Jaadalu (1966)


చిత్రం: అడుగు జాడలు (1966)
సంగీతం: మాస్టర్ వేణు
సాహిత్యం: శ్రీ శ్రీ
గానం: ఘంటసాల , బి.వసంత
నటీనటులు: యన్.టి.రామరావు, జమున
దర్శకత్వం: తాపీ చాణక్య
నిర్మాతలు: ఎమ్.సాంబశివరావు, జి. వందనం
విడుదల తేది: 29.09.1966

మల్లెలు కురిసిన చల్లని వేళలో
మనసే పలికెను నేడేలనో... ఎలానో
మల్లెలు కురిసిన చల్లని వేళలో
మనసే పలికెను నేడేలనో... ఎలానో
మల్లెలు కురిసిన చల్లని వేళలో
మనసే పలికెను నేడేలనో... ఎలానో

చరణం: 1
చలిచలి గాలులు చిలిపిగ వీచే....జిలిబిలి తలపులు చిగురులు వేసే
తొలకరి వయసే తొందర చేసే
యవ్వనమేమో సవ్వడి చేసే....యవ్వనమేమో సవ్వడి చేసే....
సవ్వడి చేసే

మల్లెలు కురిసిన చల్లని వేళలో
మనసే పలికెను నేడేలనో... ఎలానో

చరణం: 2
పిలువని కనులే పిలిచెను నన్నే...పలుకని జాబిలి వలచెను నన్నే ...
అందాలేవో అలలై ఆడే... అందని కౌగిళి అందెను నేడే..
అందని కౌగిళి అందెను నేడే .. అందెను నేడే !

మల్లెలు కురిసిన చల్లని వేళలో
మనసే పలికెను నేడేలనో... ఎలానో

చరణం: 3
సొగసులు విరిసే వెన్నెలలోన
ఎగిసే ఊహల పల్లకి పైన
నీవే నేనై పయనించేమా
నేనే నీవై పయనించేమా
జీవన రాగం పలికించేమా....జీవన రాగం పలికించేమా....
పలికించేమా

మల్లెలు కురిసిన చల్లని వేళలో
మనసే పలికెను నేడేలనో... ఎలానో
అహ...హ...అహ..హా...అహ...హ...అహ...హా...



******  ******  ******


చిత్రం: అడుగు జాడలు (1966)
సంగీతం: మాస్టర్ వేణు
సాహిత్యం: శ్రీ శ్రీ
గానం: ఘంటసాల, బి.వసంత

పల్లవి:
తూలీ సోలెను తూరుపు గాలి
తూలీ సోలెను తూరుపు గాలి – గాలివాటులో సాగెను నావ
తూలీ సోలెను తూరుపు గాలి – గాలివాటులో సాగెను నావ
నావను నడిపే మాలిని నేనే – నావను నడిపే మాలిని నేనే
నన్నే నడిపే దేవత నీవే …
తూలీ సోలెను తూరుపు గాలి
హైలెస్సా....హైలెస్సా....హైలెస్సా....

చరణం: 1
గాలి విసరి నీ కురులే చేదరీ నీలి మబ్బులే గంతులు వేసే
బెదరు పెదవుల నవ్వులు చూసి – బెదరు పెదవుల నవ్వులు చూసి
చిరు కెరటాలే చిందులు వేసే – చిరు కెరటాలే చిందులు వేసే
తూలీ సోలెను తూరుపు గాలి

చరణం: 2
చెలి కన్నులలో చీకటి చూచీ జాలి జాలిగా కదలెను నావ
చీకటి ముసరిన జీవితమల్లే – చీకటి ముసరిన జీవితమల్లే
నీ కన్నులతో వెదకెద త్రోవ – నీ కన్నులతో వెదకెద త్రోవ

తూలీ సోలెను తూరుపు గాలి – గాలివాటులో సాగెను నావ
తూలీ సోలెను తూరుపు గాలి – గాలివాటులో సాగెను నావ
నావను నడిపే మాలిని నేనే – నావను నడిపే మాలిని నేనే
నన్నే నడిపే దేవత నీవే …
తూలీ సోలెను తూరుపు గాలి
హైలేసా హైలేసా హైలే హైలేసా – హైలేసా హైలేసా హైలే హైలేసా





Palli Balakrishna Saturday, March 2, 2019
Kanne Manasulu (1966)



చిత్రం: కన్నెమనసులు (1966)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: దాశరథి, ఆరుద్ర , ఆచార్య ఆత్రేయ, కొసరాజు 
గానం: ఘంటసాల, పి. సుశీల, వెంకటరావు, కె. జమునారాణి, టి. కృష్ణ, రాధాకుమారి, రావికొండలరావు 
నటీనటులు: రామ్మోహన్, సుకన్య, కృష్ణ, సంధ్య, పుష్ప కుమారి
దర్శకత్వం: ఆదుర్తి సుబ్బారావు
నిర్మాత: సి. సుందరం 
విడుదల తేది: 13.07.1966



Songs List:



ఓహో తమరేనా చూడ వచ్చారు..(Male) పాట సాహిత్యం

 
చిత్రం: కన్నెమనసులు (1966) 
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం:  ఆచార్య ఆత్రేయ
గానం:  ఘంటసాల

పల్లవి:
ఓహో తమరేనా చూడ వచ్చారు.. చూసే ఏం చేస్తారు
ఓహో తమరేనా చూడ వచ్చారు.. చూసే ఏం చేస్తారు
ఓ భామా...  అయ్యో రామా
ఓహో తమరేనా చూడ వచ్చారు.. చూసే ఏం చేస్తారు

చరణం: 1
ఆకతాయి రాలుగాయి అమ్మాయి
అంతకన్న గడుగ్గాయి అబ్బాయి
ఆకతాయి రాలుగాయి అమ్మాయి
అంతకన్న గడుగ్గాయి అబ్బాయి

మండేన ఒళ్ళు...  కొరికేవ పళ్ళు
ఎరుపెక్కె కళ్ళు...  అరికాళ్ళ ముళ్ళు
కోపాల తాపాల...  శాపాన రూపాన.. తొక్కేవు పరవళ్ళు..

ఓ భామా...  అయ్యో రామా
ఓహో తమరేనా చూడ వచ్చారు.. చూసే ఏం చేస్తారు

చరణం: 2
మూతిని ముడవకే ముద్దులగుమ్మా
ఆ..  ఆ...  ఆ..  ముచ్చటలాడితినే వలపుల రెమ్మా
ముసిముసి నవ్వులతో మోడీ చేతునే
ముసిముసి నవ్వులతో మోడీ చేతునే
కసిదీరా గుణపాఠం నేర్పిస్తానే

ఓ భామా...  అయ్యో రామా
ఓహో తమరేనా చూడ వచ్చారు.. చూసే ఏం చేస్తారు

చరణం: 3 
కుక్కకాటు చెప్పుదెబ్బ సామెతకు
చక్కనైన మచ్చుతునక నీ బ్రతుకు
కుక్కకాటు చెప్పుదెబ్బ సామెతకు
చక్కనైన మచ్చుతునక నీ బ్రతుకు
అమ్మాయిగారు ముయ్యాలి నోరు
మాతోను మీరు సరిసాటి కారు
కన్నీరు మున్నీరు కాదండి పన్నీరు... తగ్గాలి మీ జోరు

ఓ భామా...  అయ్యో రామా
ఓహో తమరేనా చూడ వచ్చారు.. చూసే ఏం చేస్తారు

ఓహో తమరేనా చూడ వచ్చారు.. చూసే ఏం చేస్తారు




ఓహో తమరేనా చూడవచ్చారు...(Female) పాట సాహిత్యం

 
చిత్రం: కన్నెమనసులు (1966)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: పి.సుశీల 

పల్లవి:
ఓహో తమరేనా చూడవచ్చారు... చూసీ ఏం చేస్తారు
ఓహో తమరేనా చూడవచ్చారు... చూసీ ఏం చేస్తారు

అమ్మమ్మ... అమ్మమ్మా ... అయ్యో రామా
ఓహో తమరేనా చూడవచ్చారు... చూసీ ఏం చేస్తారు

చరణం: 1
సంతలోని జంతువును కాను సుమా
వంట యింటి కుందేలును అవను సుమా
సంతలోని జంతువును కాను సుమా
వంట యింటి కుందేలును అవను సుమా

ఎవరేమిటన్నా మగవాళ్ళకన్నా
మా వాళ్ళె మిన్నా నీ డాబు సున్నా..
వెళ్ళండి వెళ్ళండి మీ దారి మళ్ళండి...  డూ డూ డూ బసవన్నా

ఓ మామా....  అయ్యో రామా
ఓహో తమరేనా చూడవచ్చారు... చూసీ ఏం చేస్తారు

చరణం: 2
అలుగుట తగదురా పెళ్ళి కుమారా
హాస్యములాడితిరా వలపుల చోరా
చెమటలు పోసినవా చెంగున వీతురా
చెమటలు పోసినవా చెంగున వీతురా 
చెలరేగి నీ భరతం పట్టిస్తారా

ఓ మామా....  అయ్యో రామా
ఓహో తమరేనా చూడవచ్చారు... చూసీ ఏం చేస్తారు

చరణం: 3
మూడునాళ్ళ ముచ్చటకే మురిసినచో
ఆడపిల్ల బ్రతుకంతా హరోంహరా
మూడునాళ్ళ ముచ్చటకే మురిసినచో
ఆడపిల్ల బ్రతుకంతా హరోంహరా
పెళ్ళాడు రోజు ఉంటుంది మోజు
ఆపైన క్లోజు పడుతుంది బూజు
ఆనాడు ఈనాడు ఏనాడు మనువాడు ఇంతే రివాజు

ఓ మామా....  అయ్యో రామా
ఓహో తమరేనా చూడవచ్చారు... చూసీ ఏం చేస్తారు





సిత్రంగా ఉన్నది ఈ ఏల.. పాట సాహిత్యం

 
చిత్రం: కన్నెమనసులు (1966)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: దాశరథి
గానం: పి.సుశీల 

పల్లవి:
హ్మ్మ్..హ్మ్మ్మ్ ...హ్మ్మ్..
సిత్రంగా ఉన్నది ఈ ఏల.. ఊగిందినా మనసు ఉయ్యాలా
ఊగిందినా మనసు ఉయ్యాలా

సిత్రంగా ఉన్నది ఈ ఏల.. ఊగిందినా మనసు ఉయ్యాలా
ఊగిందినా మనసు ఉయ్యాలా

చరణం: 1
దూరాన ఓ ఏరూ గలగలలాడింది.. గంతులేసింది
ఏటీ గాలికి పైట తొలిగిపోయింది... ఎగిరిపోయింది
దూరాన ఓ ఏరూ గలగలలాడింది.. గంతులేసింది
ఏటీ గాలికి పైట తొలిగిపోయింది... ఎగిరిపోయింది 

ఎగిరిపోయిన పైట ఏమి సెప్పిందో... పైటలా మా బావ పెనవేసుకున్నాడు 

సిత్రంగా ఉన్నది ఈ ఏల.. ఊగిందినా మనసు ఉయ్యాలా
ఊగిందినా మనసు ఉయ్యాలా 

చరణం: 2
దూరాన ఓ మబ్బు తొంగి చూసింది...
సల్లగా ఓ సిన్న జల్లు కురిసింది
జల్లులో మా బావ  కళ్ళు కలిపాడు...
సిగ్గు ముంచేసింది... బుగ్గ తుంచేశాడు

సిత్రంగా ఉన్నది ఈ ఏల.. ఊగిందినా మనసు ఉయ్యాలా
ఊగిందినా మనసు ఉయ్యాలా 

చరణం: 3
దూరాన మా బావ ఒళ్ళు తడిసింది.. ఒణికిపోయింది
ఒణికిపోయిన ఒళ్లు వాలిపోయింది.. సోలిపోయింది
దూరాన మా బావ ఒళ్ళు తడిసింది.. ఒణికిపోయింది
ఒణికిపోయిన ఒళ్లు వాలిపోయింది.. సోలిపోయింది 

సెంత చేరి సైగ చేసి సేతులు జాపాడు
నా వలపులోని వేడి తాను పంచుకున్నాడు

సిత్రంగా ఉన్నది ఈ ఏల.. ఊగిందినా మనసు ఉయ్యాలా
ఊగిందినా మనసు ఉయ్యాలా
సిత్రంగా ఉన్నది ఈ ఏల.. ఊగిందినా మనసు ఉయ్యాలా
ఊగిందినా మనసు ఉయ్యాలా 




వలపులో వద్దు వద్దు పాట సాహిత్యం

 
చిత్రం: కన్నెమనసులు (1966)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: దాశరథి
గానం: పి.సుశీల 

పల్లవి:
వలపులో....
వలపులో వద్దు వద్దు వద్దంటు పడ్డానులే... కలలలో రా రమ్మంటు పిలిచావులే
వలపులో వద్దు వద్దు వద్దంటు పడ్డానులే... కలలలో రా రమ్మంటు పిలిచావులే
వలపులో.... 

చరణం: 1
అందలం నే దిగి వచ్చాను... అందని మనసే ఇచ్చాను
అందలం నే దిగి వచ్చాను... అందని మనసే ఇచ్చాను
నీలో ఏదో ఉన్నదిలే.. అది నీతో నన్నే కలిపెనులే..

వలపులో వద్దు వద్దు వద్దంటు పడ్డానులే... 

కలలలో రా రమ్మంటు పిలిచావులే
వలపులో.... 

చరణం: 2
కనపడగానే కరిగిస్తావని కలలే ఎన్నో కన్నాను
కనపడగానే కరిగిస్తావని కలలే ఎన్నో కన్నాను
ఉలకవు పలకవు ఎందుకని?... ఈ అలకకు కారణం ఏమిటని?

వలపులో వద్దు వద్దు వద్దంటు పడ్డానులే... 

కలలలో రా రమ్మంటు పిలిచావులే
వలపులో....

చరణం: 3
మగవారంటే పగవారనుట... తగదని నేడే తెలిసింది 
మగవారంటే పగవారనుట... తగదని నేడే తెలిసింది
నదులు కడలిలో చేరాలి... కలువ జాబిలి కలవాలి

వలపులో వద్దు వద్దు వద్దంటు పడ్డానులే... 

కలలలో రా రమ్మంటు పిలిచావులే
వలపులో....




ఓ హృదయం లేని ప్రియురాలా పాట సాహిత్యం

 
చిత్రం: కన్నెమనసులు (1966)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: ఘంటసాల

పల్లవి:
ఓ హృదయం లేని ప్రియురాలా
ఓ హృదయం లేని ప్రియురాలా
వలపును రగిలించావు
పలుకక ఊర్కున్నావు
ఏంకావాలనుకున్నావు
వీడేం కావాలనుకున్నావు

ఓ.. ఓ ఓ హృదయం లేని ప్రియురాలా

చరణం: 1
చిరుజల్లు వలే చిలికావు.. పెను వెల్లువగా ఉరికావు
చిరుజల్లు వలే చిలికావు..పెను వెల్లువగా ఉరికావు
సుడిగుండముగా వెలిశావు
అసలెందుకు కలిసావు...నన్నెందుకు కలిసావు..

ఓ.. ఓ ఓ హృదయం లేని ప్రియురాలా

చరణం: 2
అగ్గి వంటి వలపంటించి హాయిగ వుందామనుకోకు
అగ్గి వంటి వలపంటించి హాయిగ వుందామనుకోకు
మనసు నుంచి మనసుకు పాకి
ఆరని గాయం చేస్తుంది...అది తీరని తాపం ఔతుంది

ఓ.. ఓ ఓ హృదయం లేని ప్రియురాలా

చరణం: 3
నీ మనసుకు తెలుసు నా మనసు.. నీ వయసుకు తెలియదు నీ మనసు
నీ మనసుకు తెలుసు నా మనసు..నీ వయసుకు తెలియదు నీ మనసు
రాయి మీటితే రాగం పలుకును
రాయి కన్న రాయివి నీవు...కసాయివి నీవు

ఓ.. ఓ ఓ హృదయం లేని ప్రియురాలా



ఈ ఉదయం...నా హృదయం పాట సాహిత్యం

 
చిత్రం: కన్నెమనసులు (1966)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: ఘంటసాల

పల్లవి:
ఈ ఉదయం...నా హృదయం
పురులు విరిసి ఆడింది..పులకరించి పాడింది
పురులు విరిసి ఆడింది..పులకరించి పాడింది

ఈ ఉదయం..ఊ...ఊ...ఊ...ఊ...

చరణం: 1
పడుచు పిల్ల పయ్యెదలా...పలుచని వెలుగు పరచినది
పడుచు పిల్ల పయ్యెదలా...పలుచని వెలుగు పరచినది
కొండల కోనల మలుపుల్లో...కొత్త వంపులు చూపినది

ఈ ఉదయం...ఊ...ఊ....ఊ...ఊ..

చరణం: 2
చిగురాకులతో చిరుగాలీ...సరసాలాడి వచ్చినది
చక్కలిగింతలు పెట్టినదీ...వేసవికే చలి వేసినదీ
ఓ..ఓ..ఓహో...ఓ...ఓ...ఓహో...

ఈ ఉదయం....ఊ...ఊ...ఊ...ఊ...

చరణం: 3
సరస్సున జలకాలాడేదెవరో...తేటిని వెంట తిప్పేదెవరో
సరస్సున జలకాలాడేదెవరో...తేటిని వెంట తిప్పేదెవరో
రేయికి సింగారించే కలువో...పగలే వగలు రగిలే కమలమో...

ఈ ఉదయం...నా హృదయం..
పురులు విరిసి ఆడింది...పులకరించి పాడింది
ఈ ఉదయం...ఊ...ఊ...ఊ...ఊ





ఏమిటిది ఏమి జరిగింది పాట సాహిత్యం

 
చిత్రం: కన్నెమనసులు (1966)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: దాశరధి 
గానం: పి.సుశీల, టి.కృష్ణ 

హాయి .... హాయి ..... హాయీ 
ఏమిటిది? ష్.... ఏం జరిగింది?
హాయి .... హాయి ..... హాయీ 
ఏమిటిది? ఎం జరిగింది?
ఇది అది యని సెప్పరానిదీ ఏమిటిది?
ఎన్నెల తెలుసు - యెండా తెలుసునమ్మా
ఎన్నెల్లో ఎండా తెలియదోయమ్మా ఏమిటిది?
అదే.... తొలి వలపులోని తాపం 

నీరూ వుంది నిప్పూ ఉందమ్మా
నీళ్ళల్లో నిప్పూ ఎలా వుందమ్మా? ఏమిటది?
అదే దోరవయసులోని వేడి
పువ్వులు సూశా- ముళ్ళూ సూశానమ్మా
పువ్వుల్లో ముళ్ళూ సూడలేదమ్మా ఏమిటిది?
అదే, కన్నెమనసులోని మాయ





చుక్కలాంటి చిన్నోడు పాట సాహిత్యం

 
చిత్రం: కన్నెమనసులు (1966)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: కొసరాజు 
గానం: పి.సుశీల, జమునారాణి 

హు....స్స్....హ....స్స్....
సుక్కలాంటి సిన్నోడు సోకు జేసుకున్నాడు
సాకిరేవు సాకు జెప్పి సరసమాడ వచ్చాడు...వరసగలప వచ్చాడు....
ఉడుకు ఉడుకు సలవ మడత - ఊరేసి నానేసి
ఊరేసి నానేసి
ఉల్లి పూవులా కోక - ఉతికి పెడ్తానన్నాడు

మల్లిపూవులా రైక - మడత పెడ్తానన్నాడు
పడుసు పిల్లతోటి నీకు - పల్లదనం ఎందుకంటె
తెల్లబోయి సూశాడు కళ్ళు తేలవేశాడు....

యద్ధనపుడి గాజులకు - ముద్దు ముద్దు నేతులకు
ఒద్దికేదో ఉన్నదని - గుద్ది గుద్ది చెప్పాడు
గుద్ది గుద్ది చెప్పాడు
వద్దకు రావద్దంటే - బుద్దిగాదు పొమ్మంటే
సుద్ద మొగము వేశాడు - మొద్దు మొగము వేశాడు ....
సల్లగాలి ఇసురుతువుంటే - బుల్లినవ్వు ముసురుతువుంటే
పచ్చులాల కింపంగా పదము నెను పాడుతువుంటే
ఓయబ్బో ఎప్పుడెప్పుడన్నాడు?
సెప్పు సూద్దమన్నాడు 
సిలిపికూతలేమిటంటే
సెంపలేసుకున్నాడు - లెంపలేసుకున్నాడు




అమ్మలగన్న అమ్మ గాజులమ్మ పాట సాహిత్యం

 
చిత్రం: కన్నెమనసులు (1966)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: దాశరధి 
గానం: పి. సుశీల, వెంకటరావు, కె. జమునారాణి, రాధాకుమారి, రావికొండలరావు 

అమ్మలగన్న యమ్మ గాజులమ్మ ముగ్గురమ్మలయమ్మా
సంపదలిచ్చే లచ్చువమ్మ సదువులు చెప్పే సరసోతమ్మా
పసుపు కుంకుమల పార్వతమ్మా ముగ్గురమ్మల మూలపుటమ్మా
గాజులమ్మా ఇలలో యెలినేనే కొలిసినవారి మనసులోని కోరిక తీర్చెనే

అనగనగనగనగా, పల్లొకటుంది పల్లెలో, సక్కని పిల్లవుంది.
ఝణ ఝుణ ఝుణ ఝుణనా, బాజాలు మోగే పెళ్ళున పిల్లకు పెళ్ళి జరిగె
పుత్తడిబొమ్మా ముస్తాబయినాది తన పెనిమిటి యెంటా 
ఆత్తోరిఁటికి పయనామయినాది....

కాకులు దూరని కారడివి అసలు సంజవేళ
పెళ్లోరి యెడ్లబళ్ళు సీమల బారుగా యెళ్ళిపోతున్నాయి.... అప్పుడూ.....
దొంగలు వచ్చీ పడ్డారు నిలువు దోపిడీ వేశారు
దొంగల సరదారొచ్చాడు బంగరు బొమ్మమ సూశాడు
సూసి గుమ్మైపోయాడు .. మీసంపై సేయి వేశాడు

ఏసీ..... ఓహో! పెళ్ళోరూ యీ సిన్నారి సిలుకను నాకిస్తే
నే దోసిని సొమ్ములు తిరిగిస్తానన్నాడు....
ఆహా! దొంగయినా దొరలా సవాల్ చేశాడు... ఏం? దోసిన
సొమ్ములతోబాటు
ఆ బంగారు బొమ్మనుకూడా ఎగరేసుకు
పోవచ్చే, కాదనే వాడెవడు, అడ్డేవాడెవడు?
అప్పుడా పెళ్ళోరేం చేశారో తెలుసా?
ఏం చేశారూ?
సొమ్ములకోసం ఆడబిడ్డను దొంగలపాలు చేస్తారా? ఎవరై నా?
సెయ్యరూ
డబ్బుకోసం తాళిగట్టిన పెళ్ళాన్నమ్ముకుంటారా, ఎవరైనా?
ఊహూఁ...!
అయితే పెళ్ళి పెద్దమ్మ “ఊఁ” అని తలాడించింది.
సూర్పణఖా....మాంఖాళీ ....
పెళ్ళి పెద్దలెవరూ కిక్కురుమనలేదు....
వాజమ్మలు.... దద్దమ్మలు....
పెళ్ళికొడుకు కుక్కిన పేనయ్యాడు
సచ్చిన పీనుగయ్యాడు... ధూ.....

కాళ్ళ పారాణి ఆరాలేదు కళ్ళకాటుకా కరగాలేదు
నుదుటి కుంకుమా సెదరాలేదు ముద్దు ముచ్చటా తీరాలేదు
గద్దనోటిలో గువ్వలా అగ్గిమంటలో పువ్వులా
దొంగనేతిలో సిక్కిందీ సిన్నారితల్లీ, గోడుగోడునా ఏడ్చిందీ.....

అన్నా! అన్నా! ఇది తగదన్నా దయ గనుమోయన్నా!
రామయ తండ్రి రాజ్యమేలినా బూమే నీదన్నా 
పరకాంతలు నీ తోబుట్టువులను నీతి మరువకన్నా
సెల్లెలు మీదా సేయి వేసితే కళ్ళు పోవునన్నా......
అని కంటికీ మంటికి ఏకధారగా ఏడుస్తూ కాళ్ళా యేళ్ళాబడి బతిమాలిందా పెళ్ళికూతురు
నెమలి కంటికి నీరుగారితే వేటగానికి లోటు ఏమిరా?
ఎలకపిల్లకు ప్రాణసంకటం పిల్లికీ సెలగాటమాయెరా
కళ్ళకావరం గొప్పెరా వళ్ళు తెలియక పోయెరా
సెంతకు సేరి సిన్నారి మీద చేయి వేసెరా 
అంతే ఆ యిల్లాలులోని అభిమానం కోడెతానై లేసింది

పడగ యిప్పింది బుసలు కొట్టింది
గాజులు గలగల లాడెరా కళ్ళు కణకణ మండెరా
దుష్టుని పాపం పండెరా మంటలు మింటిని యంటెరా
ఆంటెరా.... అంటెరా
భగ భగ భగ భగ మండిన మంట
స్త్రి శీలానికి బుజువగుజ్యోతి
స్త్రీ లోకానికి మంగళహారతి
ధగ ధగ ధగ ధగ వెలిగిన జ్యోతి
ఆరంజ్యోతి అంతట నిండెనే సుఖదుఃవాలలో మనకందరికీ అండగా నిలిచెనే.....


Palli Balakrishna Thursday, February 21, 2019

Most Recent

Default