చిత్రం: భట్టి విక్రమార్క (1961)
సంగీతం: పెండ్యాల నాగశ్వరరావు
సాహిత్యం: అనిశెట్టి సుబ్బారావు (All)
నటీనటులు: యన్. టి. రామరావు, అంజలి, కాంతారావు
దర్శకత్వం: జంపాన చంద్రశేఖర్ రావు
నిర్మాత: పి.వి.వి సత్యన్నారాయణ మూర్తి
విడుదల తేది: 28.09.1960
Songs List:
జైరే జంబైరే ఒకసారి పాట సాహిత్యం
చిత్రం: భట్టి విక్రమార్క (1961)
సంగీతం: పెండ్యాల
సాహిత్యం: అనిశెట్టి సుబ్బారావు
గానం: మాధవ పెద్ది సత్యం, జిక్కీ
జాయిరే - జంభొయిరే
ఒక్కసారైన రావేమి సుందరీ
నీ మాయమాటల నాటకం
వట్టి బూటకం నా చెంతకు రాబోకు మావయ్యా
ముచ్చటైన రామచిలుకా నీ కెందుకొచ్చె నీఅలుకా
ముద్దుల గుమ్మా దానిమ్మ రెమ్మా
మోజును తీర్చే తాజాబొమ్మా
మాయలు చాలించు మావఁయ్యా,
నీ వేషాలు సాగవు పోవయ్యా
ముచ్చట తీరిన వెనుక నీవు మోసంచేసి పోదువయ్యా
జాయిరే జంభాయిరే
అంత తేలికగా రాను మాపయ్యా
చేశా నీకు సింగారం
ఇచ్చా, నీను బంగారం నెత్తి పెట్టుకొని పూజించినా
రాతిరి పగలూ సేవించినా
ప్రేమిస్తేనే పాపమాయె పెళ్లే నాకు శాపమాయే
మతిలేనట్టి ప్రతిమగాడు మహాఘనుడివంటాడు
బ్రతిమాలితె బెదిరిస్తాడు
భయపడితే లొంగుతాడు
చాలించవోయ్ అధికారం
సాగదింశ వ్యవహారం
కన్నెపిల్ల సొగసు చూడు పాట సాహిత్యం
చిత్రం: భట్టి విక్రమార్క (1961)
సంగీతం: పెండ్యాల
సాహిత్యం: అనిశెట్టి సుబ్బారావు
గానం: జిక్కీ
కన్నె పిల్ల సొగను చూడు - మహరాజ
కన్నెపిల్ల వన్నెలాడి నగపు నాది – మహరాజ
వెన్న లొలుకు మొగము చూడు వెన్నలాంటి మనసు నాది
సీగలో పూవులే సిగ్గుతో రాలెరా
అందెల రవళిలో వీణెకు మ్రోగెరా
నా చిరునవ్వులా తేనెల జల్లులో
గుండెలు ఘల్లనగా కోరికలూరెరా
ఈ సింగారమూ ఇంత వయ్యారమూ
ఎందున లేదురా పందెము వేతురా
ముద్దులగుమ్మను మోహించేనురా
మురిపెం తీర్చరా ముచ్చట గూర్చరా
చల్లని చూపులా లాలించేనురా
సల్లాపాలలో తేలించేనురా
ఆటపాటలే ఆనందించరా
ఆశలు తీర్చుమురా ఆదరించుమురా
కొమ్ములు తిరిగిన మొనగాడు పాట సాహిత్యం
చిత్రం: భట్టి విక్రమార్క (1961)
సంగీతం: పెండ్యాల
సాహిత్యం: అనిశెట్టి సుబ్బారావు
గానం: జిక్కీ
కొమ్ములు తిరిగిన మగవారూ
కొంగు తగిలితే పోలేరు
కొంప తగిలితే పోలేరు
కత్తులు దూసే మగవాడు ఎత్తులు వేసే మొనగాడు
గాజుల గలగల గజ్జెల ఝణఝణ
విన్నాడంటే తిన్నాడే కన్నెకు దాశ్యం చేశాడే
కొమ్ములు తిరిగిన మగవారు.
కన్నులు సైగలు చేశాయంటే పెదవుల నవ్వులు విరిశాయంటే
ముదుసలియైనా ముచ్చటపడులె పడుచుదనమ్మే కోరునులే
ప్రణయంలో పడిపోవునులే -
కొమ్ములు తిరిగిన మగనారూ
పడతుల తీయని కౌగిలిలో ప్రభువైనా పసిబాలు డెలే
మంచిని చెడుగా చెడును మంచిగా
మార్చేశక్తి ఆడుయుక్తి ఆడదంటే యీ జగతి
కొమ్ములు తిరిగిన మగవారూ
మనసారా ప్రేమించినారా పాట సాహిత్యం
చిత్రం: భట్టి విక్రమార్క (1961)
సంగీతం: పెండ్యాల
సాహిత్యం: అనిశెట్టి సుబ్బారావు
గానం: పి.సుశీల, ఏ.పి.కోమలి
జై నవమన్మధాకారా జై
జై మానినీసనసబోరా జై
మనసార ప్రేమించినారా
మరు కేళి తేలింపవేరా
మాగాడు తానెంత క్రూరుడు గాకున్న
మగువల మంత్రించి వంచించురా
మారుని వంచింప విరహము వారింప
రారా బిరాన కుబేరా సమాన
రారా నే పిలచిన లోపలేరా
నీకిది మరియాదట పోరా
నీ పంతమె నా చెంతను సాగింతున
ఆకంతుని సామంతునిగా నెంతువ బలే బలే రసపిపాసీ
ఇదా సరస మిదా సమయం మీదా వరస
రసహృదయ మిది గనర సరస
నటించన జగాలనే జయించన పాట సాహిత్యం
చిత్రం: భట్టి విక్రమార్క (1961)
సంగీతం: పెండ్యాల
సాహిత్యం: అనిశెట్టి సుబ్బారావు
గానం: పి.సుశీల, పి.లీల
నటించనా జగాలనే జయించనా
రసిక హృదయాలె తపించగ
నటించనా జగాలనే జయించనా
రసిక హృదయాలె తిపించగ
నటించనా జగాలనే జయించనా
పలుకే కమ్మని గానకుయెనో
నా కులుకే తీయని సోనలయేనో
నటించనా జగాలనే జయించనా
రసిక హృదయాలె తపించగ
నటించనా జగాలనే జయించనా
హావభావాల అభినయమందు
నా అందములే కనువిందు
చరణ ఝణంఝణ స్వరముల పిలుపు
తరుణ జనాళి శృతి×లుపు
నటించగా దిగాలనే జయించనా
రసిక హృదయాలె తపించగ
నటించినా జగాలనే జయించనా
నిన్ను నమ్మి పాట సాహిత్యం
చిత్రం: భట్టి విక్రమార్క (1961)
సంగీతం: పెండ్యాల
సాహిత్యం: అనిశెట్టి సుబ్బారావు
గానం: ఘంటసాల
నిను నమ్మి సేవించు మనుజుండు ధన్యుండు
పట్ట గొమ్మవుగాదె భ క్తతతికి
జగదంబవగు నీకు సరియగు దైవంబు
మఱి యెవ్వరమ్మ తామరసనయన
మదిలోని నీదు నామము నెంచినంతనే
కలుషంబు లన్నియు దొలగిపోవు
క్లేశంబు లన్నియు నాశమగున్ మహా
సంతోషమును దృప్తి సంఘటిల్లు
ఆశ్రితావశీల! గుణాలవాల
శైలరాజాత్మజా ! పుణ్య చరితి! దుర్గ !
మ్రొక్కెదను నన్ను గావుము దిక్కు నీవ
పాటతో త్తమ జనపాళి భద్రకాళీ
ఓ నెలరాజా వెన్నెల రాజా పాట సాహిత్యం
చిత్రం: భట్టి విక్రమార్క (1961)
సంగీతం: పెండ్యాల
సాహిత్యం: అనిశెట్టి సుబ్బారావు
గానం: ఘంటసాల, పి.సుశీల
పల్లవి:
ఓ నెలరాజా వెన్నెల రాజా
నీ వన్నెలన్ని చిన్నెలన్ని మాకేనొయ్
మా వెన్నుతట్టి పిలిచిందీ నీవేనొయ్.. ఓ నెలరాజా...
చరణం: 1
ఓ.... ఓ...
చల్లగాలి జాడలో తెల్లమబ్బు నీడలో
చల్లగాలి జాడలో తెల్లమబ్బు నీడలో
ఓ....ఓ..ఓ..ఓ..
కొంటె చూపు నీకేలా చంద్రుడా
నా వెంటనంటి రాకోయీ చంద్రుడా
ఆ...
ఓ నెలరాజా వెన్నెల రాజా
నీ వన్నెలన్ని చిన్నెలన్ని మాకేనొయ్
మా వెన్నుతట్టి పిలిచిందీ నీవేనొయ్....ఓ నెలరాజా...
ఆ..ఆ..
చరణం: 2
ఆ..ఆ..ఆ..
ఆ..ఆ..ఆ..ఆ
కలువల చిరునవ్వులే కన్నెల నును సిగ్గులే
ఓ...ఓ..ఓ..ఓ..
కలువల చిరునవ్వులే కన్నెల నును సిగ్గులే
వెంటనంటి పిలిచినపుడు చంద్రుడా
వాని విడవ మనకు తరమవున చంద్రుడా
ఆ..ఆ..ఆ..ఆ..
ఓ నెలరాజా వెన్నెల రాజా
నీ వన్నెలన్ని చిన్నెలన్ని మాకేనొయ్
మా వెన్నుతట్టి పిలిచిందీ నీవేనొయ్.... ఓ నెలరాజా...
చరణం: 3
లేత లేత వలపులే పూత పూయు వేళలో...
కలవరింత లెందుకోయి చంద్రుడా..
నా చెలిమి నీదెకాదటోయి చంద్రుడా..
కలవరింత లెందుకోయి చంద్రుడా..
నా చెలిమి నీదెకాదటోయి చంద్రుడా..
ఆ..ఆ..ఆ..ఆ
ఓ నెలరాజా వెన్నెల రాజా
నీ వన్నెలన్ని చిన్నెలన్ని మాకేనొయ్
మా వెన్నుతట్టి పిలిచిందీ నీవేనొయ్....ఓ నెలరాజా...
ఓ శైల సుధామాత పాట సాహిత్యం
చిత్రం: భట్టి విక్రమార్క (1961)
సంగీతం: పెండ్యాల
సాహిత్యం: అనిశెట్టి సుబ్బారావు
గానం: జిక్కీ
(కోయపాట )
మేల్ భళీ కాలగళీ కాళి మహాకాళి మేల్
మాతల మాతా నేతలు నేతా జేత జేతా మాంకాళీ
ఓ.........
పల్లవి:
శైలసుతా మాతా
పతిపదసేవా - నిరతము నీవా
కులపతి మొర వినవా ఆ...ఆ...
అబలను దయగనవా
కాళీ జయ జయ జయ జయ
కాళీ జయ జయ జయ జయ
మేల్ భళీ - కాలగళీ కాళి మహా కాళి
మాతల మాతా నేతల గీతా జేతల జేతా మాంకాళీ
చరణం: 1
పతివ్రత బ్రతుకే - భూమికి భారమా
మరణమే శరణమా నీ హితిమా
శైలసుతా మాతా పతిపద సేవా నిరతము
నీవా కులసతి మొర వినవా
అబలను నను కనవా - ఓ శైలసుతా మాతా
ఒహ్హో హొ హో హై
అంబా మాంకాళీ
చరణం: 2
చావడియే - దీవనయా అప
వాదుల బాధల విడుదలయా
కాళీ మాంకాళీ కాళీ -మాం కాళీ
పల్లవి:
ఫెళ ఫెళ మని - తళతళమని
పిడుగు నుడుల నడలకే
చరణం: 3
భుగభుగలా - ధగధగలా
నుడివడులా వడినడలా
కనుమంటా మిన్నంటా
ఓ సుందరి అందమే విందురా పాట సాహిత్యం
చిత్రం: భట్టి విక్రమార్క (1961)
సంగీతం: పెండ్యాల
సాహిత్యం: అనిశెట్టి సుబ్బారావు
గానం: పి.సుశీల
ఓ ఓహోహో సుందరీ అందమే
ఆహాహా విందురా - ఉహుహు పొందరా
ఆనందములన్నీ నీవెరా - ఒహొహో
చేతికి దొరికిన చిలుకను గా నా చిలికెద
తీయని వలపుల వానా
నీకోసం ఈ వేషం - సల్లాపాలతో తేలించేనురా
ఓ ఓహోహో సుందరీ అందమే......
ఆహాహా వింగురా ఉహుహు పొందరా
ఆనందములన్నీ నీవేరా ఓహోహో -
లోకములేలే జడదారీ లొంగెనులే వయ్యారిని గోరి
ఈ వేలా నా లీలా
నా కనుసన్నల నిన్నూగించనా
ఓహోహో
తళతళచూపుల వనితల చెంత తలక్రిందైరీ తాపసులంత
నీ వెంత - ఈ కాంత పక్కున నవ్విన బానిస నౌదువే
ఓ ఓ హోహో సుందరీ అందమే
సత్యమయ్యా గరుడ నిత్యమయ్య పాట సాహిత్యం
చిత్రం: భట్టి విక్రమార్క (1961)
సంగీతం: పెండ్యాల
సాహిత్యం: అనిశెట్టి సుబ్బారావు
గానం: మాధవపెద్ది
సత్యామయా గురుడ నిత్యామయా
నిత్యామయా గురుడ సత్యామయా
సత్యామయా గురుడ నిత్యామయా
నిత్యామయా గురుడ సత్యామయా
గురుడు చెప్పినమాట నరుని కిచ్చిన మూట
మూట నున్నది మాట మర్మమయా -
ఆ మూట నున్నది మేటి మర్మమయా - గురుడ
సత్యామయా గురుడ నిత్యామయా ...
సహవాస దోషంబుకున్న చెడ్డది వేరి
లేదు లేదని చాటమన్నారయా
కలనైన స్త్రీలతో చెలిమికోరినవాని
ముక్కు చెవులూ కోయకున్నారయా- గురుడ
సత్యామయా గురుడ నిత్యా మయా
కలికాలధర్మాన కళ్ళుమూసుకుపోయి
ఆడుదానిని నమ్మ మోసమయా
ప్రేమంటు గీయుంటు పెద్దకబుగులు చెప్పి
నమ్మించి నట్టేట ముంచేసియా - గురుడ
సత్యామయా గురుడ నిత్యామయా
చతుర్భుజే చంద్రకళ పాట సాహిత్యం
చిత్రం: భట్టి విక్రమార్క (1961)
సంగీతం: పెండ్యాల
సాహిత్యం: అనిశెట్టి సుబ్బారావు
గానం: ఘంటసాల
చతుర్భుజే చంద్రకళావతంటే
కుచోన్నతే కుంకుమరాగశోణే
పుండ్రేక్షు పాశాంకుశ పుష్పబ్యా
హస్తే నమస్తే జగదేకమాతః.
వింత అయిన విధి విలాసం పాట సాహిత్యం
చిత్రం: భట్టి విక్రమార్క (1961)
సంగీతం: పెండ్యాల
సాహిత్యం: అనిశెట్టి సుబ్బారావు
గానం: ఘంటసాల
అయ్యో తల్లీ ! ప్రణయమే
నీ జీవితాన ప్రళయమై చెలరేగినా
వింతయైన విధివిలాసమ్మిదేనా
మనసంత చింతల చివికిపోయె
నా అమరమౌ నీ ప్రేమయే ఆవేదనయ్యేనా
నీ ఆశలే కన్నీటిధారల కరిగిపోయేనా
కటిక గుండెతో ప్రాణసఖుడే కాలదన్నేనా
మహారాణివి ఒక అనాథగా మారితివొ తల్లీ
మాట రాక రూపులేక నశించెదవో తల్లి