Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box




చిత్రం: అంతిమ తీర్పు (2023)
సంగీతం: కోటి
నటీనటులు: సాయి ధన్షిక, విమలా రామన్, గణేష్ వెంకట్రామన్
దర్శకత్వం: ఎ.అభిరాము 
నిర్మాత: డి.రాజేశ్వరరావు
విడుదల తేది: 18.12.2023



Songs List:



తిప్ప తిప్ప పాట సాహిత్యం

 
చిత్రం: అంతిమ తీర్పు (2023)
సంగీతం: కోటి
సాహిత్యం: కాసర్ల శ్యామ్
గానం: మంగ్లీ, శివ  

తిప్ప తిప్ప 



నేలపై చినుకు పూలు పాట సాహిత్యం

 
చిత్రం: అంతిమ తీర్పు (2023)
సంగీతం: కోటి
సాహిత్యం: వనమాలి 
గానం: శ్రుతిక, సాయి శ్రీ చరణ్ 

నేలపై చినుకు పూలు
చీర నేసెలే
చేలపై చిలకపచ్చ
రంగులేసెలే

పిలిచింది నన్ను చిటికేస్తు చిరుగాలే
పసిగువ్వ కన్ను కలిపేస్తూ ఇటు వాలే
ఎటు అడుగేసినా వన్నెలే
ఇల హరివిల్లులే పల్లెలే

యేటిలో ఆటలాడే
చిలిపి చేపలే
తేటితో వరస కలిపే
తేనె పూ పొదలే

ప్రపంచమే సరితూగేనా పల్లెసీమకే
ప్రతీ ఎద పరవశమవదా వారి ప్రేమకే

మనసుల చెలిమే
తరగని కలిమే
ఒకమాట చాలు
పంచుతారుగా ప్రాణమే

సొగసుగ నేలపై చినుకు పూలు
చీర నేసెలే
చేలపై చిలకపచ్చ
రంగులేసెలే

నిరంతరం తోడుగ సాగే ఏరువాకలే
నిశీధినే దూరం చేసె కాంతి రేఖలే

మమతలే మతము
మది అమృతము
ప్రతి గుండెలోన
దాగి ఉందిగా దైవము

కుదురుగ నేలపై చినుకు పూలు
చీర నేసెలే
చేలపై చిలకపచ్చ
రంగులేసెలే

No comments

Most Recent

Default