Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Rangabali (2023)




చిత్రం: రంగబలి (2023)
సంగీతం: పవన్ CH
నటీనటులు: నగశౌర్య, యుక్తి తరేజా
దర్శకత్వం: పవన్ బసం శెట్టి
నిర్మాత: చెరుకూరి సుధాకర్ 
విడుదల తేది: 07.07.2023



Songs List:



మన ఊర్లో ఎవడ్రా ఆపేది పాట సాహిత్యం

 
చిత్రం: రంగబలి (2023)
సంగీతం: పవన్ CH
సాహిత్యం: పవన్ బసం శెట్టి, శ్రీ హర్ష ఏమని
గానం: అనురాగ్ కులకర్ణి 

తూరుపు పడమర
ఏ దిక్కు పడవురా
నువ్వే మాకు దిక్కురా

గోపురం గుడికిరా
అక్షరం బడికిరా
ఊపిరి నువ్వే ఊరికిరా

చెన్నై నుంచి చైనా దాక
యాడ లేని సరుకురా
సున్నాకైనా వాల్యూ ఇచ్చే
నెంబర్ వన్ అన్నరా

పీఎంకైనా అన్న పర్మిషన్
ఉండాల్సిందే
పీఎంఎం కైనా అన్నా పర్మిషన్
ఉండాల్సిందే
ఊర్లో అడుగే పెట్టాలంటే

(ఏయ్ ఏయ్… కొంచం ఎక్కువైందిరా
నీ యమ్మ… మన ఊర్లో మనల్ని ఎవడ్రా ఆపేది, నువ్ కొట్టో)

ఏ, దూలెక్కితే గొడవలే
పగిలిపోతాయి బల్బులే
మనల్ని ఆపేది ఎవడులే
మనం కనెక్ట్ ఐతే కింగులే
లేకుంటె ఎముకలే విర్గిపోతాయిలే

బైకుల పైన ఆటోల పైన
అన్న నీయే ఫోటోసు
షో అన్నతో సెల్ఫీ అంటే
అదే పెద్ద లైసెన్స్

మన ఊరికే ఉండవే
ఏ పుట్టగతులే
అరె మన ఊరికే ఉండవే
ఏ పుట్టగతులే, అన్న ఇక్కడ పుట్టకపోతే

సార్ అని బైటూర్లో
బ్రతిమాలడం కన్నా
ఒరేయ్ బావ అంటూ
ఊరిలో కాలర్ ఎగిరేసిన్నా

ఎహె శివుడుకైనా కైలాసంలో
కంఫర్ట్ రా మావా
సొంతూర్లో ఉండే సుఖం
యాడ లేదురా
(అందుకే మన ఊర్లో మనముంటే)

వాహ్ వా బావా వసల వసల వాహ్ వా
వాహ్ వా బావా వసల వసల వాహ్ వా
వాహ్ వా బావా వసల వసల వాహ్ వా
వా వా బావా హాట్ సాలా

వాహ్ వా బావా వసల వసల వాహ్ వా
వాహ్ వా బావా వసల వసల వాహ్ వా
వాహ్ వా బావా వసల వసల వాహ్ వా, వా వా బావా



కల కంటు ఉంటె పాట సాహిత్యం

 
చిత్రం: రంగబలి (2023)
సంగీతం: పవన్ Ch
సాహిత్యం: కృష్ణకాంత్ 
గానం: శరత్ కళ్యాణి, వైష్ 

అందరిలోను ఒక్కడు కాను
నేను వేరే తీరులే
కలిసే తాను… వెలిగే మేను
మాయ నాలో జరిగెనే
ఇది ఓ వింతే

మనసేమో ఆగదసలే
ఎగిరింది పైకి మేఘాలు తాకి
గురి చూసి దాటె గగనాలనే
ఇరుకు గుండె లోతులకి
కాలమే ముడిచి అంతరిక్షమొదిగే

కల కంటు ఉంటె, అది కరిగి కరిగి
నిజమంటు మాయ మరి జరిగి జరిగి
జగమంత చోటు మరి తరిగి తరిగి
భుజమంటుకుంటు తెగ తిరిగి తిరిగి

విడిగుంటె గుండె
మరి నలిగి నలిగి
ఎదురుంటె ప్రేమ ఇక
పెరిగి పెరిగి, పెరిగీ

తళుకు తళుకుమని మెరిసె నా కొరకు
అనిగిమనిగి మరి వచ్చె నీ కుదుపు
సహజమే నాకు ప్రాణమయ్యేటి
మాయే మాయే

మాయ మాయే అంత మాయే
నువ్వు లేనీ ఊహలే
మాయ మాయే సొంతమాయే
కంచె లేని లోకమే
వదిలుండలేని అలవాటులా
ముదిరే ప్రేమ చూడు నేడిలా

కల కంటు ఉంటె, అది కరిగి కరిగి
నిజమంటు మాయ మరి జరిగి జరిగి
జగమంత చోటు మరి తరిగి తరిగి
భుజమంటుకుంటు తెగ తిరిగి తిరిగి

విడిగుంటె గుండె
మరి నలిగి నలిగి
ఎదురుంటె ప్రేమ ఇక
పెరిగి పెరిగి, పెరిగీ

అందరి లోను ఒక్కడు కాను
నేను వేరే తీరులే
కలిసే తాను… వెలిగే మేను
మాయ నాలో జరిగెనే
ఇది ఓ వింతే

ఎవరు ఎవరు అని అడిగె నా మనసు
అవును నిజమె నువు కొంచెమే తెలుసు
తెలియనేలేదు కమ్మేనే జోరు మాయే మాయే

మాయె మాయే అంతా మాయే
ఒంటరైనా నిన్నలే
మాయె మాయే సొంతమాయే
నన్ను దాచే కన్నులే
వదిలుండలేని అలవాటులా ముదిరే
ప్రేమె పొంగే నదిలా

కల కంటు ఉంటె, అది కరిగి కరిగి
నిజమంటు మాయ మరి జరిగి జరిగి
జగమంత చోటు మరి తరిగి తరిగి
భుజమంటుకుంటు తెగ తిరిగి తిరిగి

విడిగుంటె గుండె
మరి నలిగి నలిగి
ఎదురుంటె ప్రేమ ఇక
పెరిగి పెరిగి, పెరిగీ




పద పద ప్రేమ పాట సాహిత్యం

 
చిత్రం: రంగబలి (2023)
సంగీతం: పవన్ Ch
సాహిత్యం: అనంత శ్రీరాం 
గానం: హిరాల్ విరదియా, అరవింద్ శ్రీనివాస్ 

పద పద ప్రేమ 

No comments

Most Recent

Default