Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box






పాట: రాములో రాములా  
సంగీతం: తిరుపతి మట్ల
సాహిత్యం: తిరుపతి మట్ల
గానం: మౌనిక యాదవ్ 


రాములో రాములా సాహిత్యం

 
పాట: రాములో రాములా  
సంగీతం: తిరుపతి మట్ల
సాహిత్యం: తిరుపతి మట్ల
గానం: మౌనిక యాదవ్ 

మందు పెట్టినావురో  రాములో రాములా  
ఏం  మాయ చేసినావురో  రాములో రాములా  
మందు పెట్టినావురో  రాములో రాములా  
ఏం  మాయ చేసినావురో  రాములో రాములా

నీ వలలొ  చిక్కిన   సేప పిల్లలా
కొట్టుకుంటున్నా  గిల గిల గిల
మందు పెట్టినావురో  రాములో రాములా  
ఏం  మాయ చేసినావురో రాములో రాములా

నిన్నేమన్నా అంటినా నీ సొమ్మేమన్నా  తింటినా
పల్లెత్తూ మాట అంటినా పది మందిలొ నిన్నూ   సూత్తినా 
కనికట్టేదో చేసీ రాములో రాములా 
సుట్టు తిప్పూ కుంటివిరో రాములో రాములా  
కనికట్టేదో చేసీ రాములో రాములా 
సుట్టు తిప్పూ కుంటివిరో రాములో రాములా
 
బడె బడె బద్మాషు గాళ్ళకీ  దొరకాలేదు  ఇరకాలేదు  
ఎవ్వడన్న  నా ఎంబడి  పడితె  
బొక్కాలిరిసి సేతిల పెడితీ 
నువ్వు కలిసిన నుండీ  రాములో రాములా 
నా కతే మారెరో  రాములో రాములా 
నువ్వు కలిసిన నుండీ  రాములో రాములా 
నా కతే మారెరో  రాములో రాములా 
 
మా ఊరి పోరగాండ్లు గడ గడ గడ వణికేటోళ్లు 
నా దిక్కు సూడాలన్న నాతో మాట్లాడాలన్నా 
ఏం మంత్రమేస్తివిరో రాములో  రాములా 
కంత్రోని వున్నవురో రాములో  రాములా  
ఏం మంత్రమేస్తివిరో రాములో  రాములా 
కంత్రోని వున్నవురో రాములో  రాములా

నీ సూపులల్ల  సుర  కత్తులు రా నీ  
మాటలల్ల  మత్తు రవ్వలు రాముల 
నాకున్న దాన్ని ముంగటేస్తివి రా 
నీ అది లోన ముంచవెడితివి రా 
నీ మాయల పడితిరో రాములో  రాములా 
మడిసెట్ల ఉందురో రాములో రాములా
నీ మాయల పడితిరో రాములో  రాములా 
మడిసెట్ల ఉందురో రాములో రాములా

ఎన్నడు లేనిది మొండిగుండెకూ 
నీ  మీద మనసాయెరా 
నిన్ను సూడ బుద్ధాయెరా నిదురే  కరువాయెరా 
కళ్ళు మూసుకుంటె  సాలురో  రాములో రాములా 
కలలోకి వస్తివిరో రాములో రాములా
కళ్ళు మూసుకుంటె  సాలురో  రాములో రాములా 
కలలోకి వస్తివిరో రాములో రాములా

No comments

Most Recent

Default