-->
Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box






పాట: అందాల నా మొగుడు (2019)
సంగీతం: జి.యల్.నాందేవ్
సాహిత్యం: పొద్దుపొడుపు శంకర్
గానం: లక్ష్మి


అందాల నా మొగుడు సాహిత్యం

 
పాట: అందాల నా మొగుడు (2019)
సంగీతం: జి.యల్.నాందేవ్
సాహిత్యం: పొద్దుపొడుపు శంకర్
గానం: లక్ష్మి

పల్లవి
అందాల నా మొగుడు భూమి కేమో జానెడు
వాడు చేసే చేష్టలకు చస్తున్నానక్కో 
ఏమని చెప్పు కొందునో
వడియాల రామ ఉండలేను ఉండలేను
ఏమని చెప్పు కొందునో
ఓల సందమామ ఉండలేనుండలేను

దువ్వనేమో నా ఇంట్ల దూసుడేమో  దానింట్ల
నా పెనిమిటి దానింట్లో ఉంటాడాటక్కో
ఒక్క దానొక్కదాన్ని
ఉడియాల రామ ఉండలేను ఉండలేను
ఒక్క దానొక్కదాన్ని
ఉడియాల రామ ఉండలేనుండలేను

విరసాలు నా ఇంట్ల సరసాలు దానింట్ల
సూటు బూటు వేసుకొని తిరుగుతుంటడక్కో 
ఒక్క దానొక్క దాన్ని
ఓల సందమామ ఉండలేనుండలేను

మనిషేమో నా ఇంట్ల మనసేమో  దానింట్ల
కలలో కూడా దాని పేరు కలవరిస్తడక్కో
ఒక్క దానొక్కదాన్ని
ఓల సందమామ ఉండలేనుండలేను

కష్టాలు నా ఇంట్ల ఇష్టాలు దానింట్ల
ముద్దు ముచ్చట కేమో కరువైతినక్కో
ఒక్క దానొక్కదాన్ని
ఉడియాల రామ ఉండలేనుండలేను
ఒక్క దానొక్కదాన్ని
ఉడియాల రామ ఉండలేనుండలేను

పచ్చిపులుసు నా ఇంట్ల చాపల కూర దానింట్ల
నానా రుచులు వాడు కోరుతుంటడక్కో
ఒక్క దానొక్క దాన్ని
ఓల సందమామ ఉండలేను ఉండలేను
ఒక్క దానొక్కదాన్ని
ఉడియాల రామ ఉండలేనుండలేను

నా మాట ఓకారం దాని మాట బంగారం
నా సవతి మాటలేమో జవదాటడక్కో
ఒక్క దానొక్క దాన్ని
ఓలా సందమామ ఉండలేనుండలేను

పగలంతా నా ఇంట్ల రేయంత  దానింట్ల
మందు పెట్టి నా మొగుడ్ని మలుపుకున్నదక్కో
ఒక్క దానొక్కదాన్ని
ఉడియాల రామ ఉండలేనుండలేను
ఒక్క దానొక్కదాన్ని
ఉడియాల రామ ఉండలేనుండలేను

ఏగ లేనే ఇక నేను మా ఇంటికి నేను పోతా
కాళ్ల ఏల్ల పడ్డ గాని నేను రానక్కో
ఒక్క దానొక్క దాన్ని
ఓల సందమామ ఉండలేనుండలేను

No comments

Most Recent

Default