Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box






చిత్రం: క్వశ్చన్ మార్క్ (2021)
సంగీతం: రఘు కుంచె
సాహిత్యం: బండి సత్యం
గానం: మంగ్లీ
నటీనటులు: ఆధా శర్మ
దర్శకత్వం: విప్ర
నిర్మాత: గౌరీ కృష్ణ
విడుదల తేది: 2021

రాంసక్కనోడివిర పిలగో 
రైయ్ అంటూ నువ్ దూకితే మరి ఎలగో
రాంసక్కనోడివిర పిలగో 
రైయ్ అంటూ నువ్ దూకితే  మరి ఎలగో

ఎనకెనకే పడతావు ఎగా దిగా చూస్తావు
డీజే లు కడతావు డిస్కోలు అడావు 
కథ ఏంటి ? నీ కథ ఏంటి
కారెడ్డము అడమాకు పిలగో 
నా కంట్లో నలుసవ్వమాకు పిలగో

రాంసక్కనోడివిర పిలగో 
రైయ్ రైయ్ అంటూ దూకితే మరి ఎలగో

గుప్పెడు పూలొట్టుకొని పప్పులుడకవంటావు
గుప్పెడంత గుండెలోన కుంపటెట్టి పోతావు
జాన బెత్తెడు నడుము చాన బాగుగుందని వెళ్లకుండ గిల్లిపోయి నన్నేమో పరిషాను జేస్తావు
ఇక చుసి ఎగ చుసి సిర్రెత్తు కొత్తుంటే సీటీలే కొట్టేత్తావు
తెగ ఆశ పెట్టేసి నా వైపే రాకుండా ఏ వైపో ఎలిపోతావు

కథ ఏంటి  నీ కథ ఏంటి అసలు కథ ఏంటి
ఎడమ కన్ను అదిరింది పిలగో నా వెన్నపూస కరిగింది పిలగో
ఎహె రాంసక్కనోడివిర పిలగో 
రైయ్ రైయ్ అంటూ దూకితే మరి ఎలగో

పాపిటి బిల్లట్టుకొని ఎగా దిగా జూస్తావు
పాయసాలు పెట్టు అని పగలబడి నవ్వావు
చెక్కరకేలి పండు చెక్కిలి పై రుద్దొద్దు
చిటికేసి చటుక్కున చతికిల పడిపోతావు
గరం గరం నరం నరం మెలిపెట్టి తిప్పేసి
హడావిడి చేసేస్తావు
సల్లకొచ్చి ముంత దాసి నన్ను నువు ఎలాగోల సురా సురా చుట్టేత్తావు

కథ ఏంటి అసలు కథ ఏంటి నీ కథేంది రా
లడాయికి వచ్చినావ పిలగో
మరి లగ్గమైతే తీసేస్కో పిలగో
రామసక్కనోడివిర పిలగో 
రైయ్ అంటూ నువ్ దూకితే మరి ఎలగో...


No comments

Most Recent

Default