చిత్రం: V (2020)
సంగీతం: అమిత్ త్రివేది
సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి
గానం: యాజిన్ నజీర్, శశ తిరుపతి
నటీనటులు: నాని, సుధీర్ బాబు, నివేథ థామస్, అదితి రావ్ హైదరి
దర్శకత్వం: మోహన్ కృష్ణ ఇంద్రంటి
నిర్మాతలు: దిల్ రాజు, శిరీష్, హర్షిత్ రెడ్డి
విడుదల తేది: 05.09.2020
మనసు మరీ మత్తుగా
తూగి పోతున్నదే ఏమో ఈ వేళ
వయసు మరీ వింతగా
విస్తుబోతున్నదే నీదే ఈ లీల
అంతగా కవ్విస్తావేం గిల్లి,
అందుకే బంధించెయ్ నన్నల్లీ..
ఖిలాడీ కోమలీ.. గుళేబకావలి,
సుఖాల జావలి.. వినాలి కౌగిలీ...
మనసు మరీ మత్తుగా..
తూగి పోతున్నదే ఏమో ఈ వేళ
వయసు మరీ వింతగా..
విస్తుబోతున్నదే నీదే ఈ లీల
ఓ.. అడుగులో అడుగువై..
ఇలా రా నాతో నిత్యం వరాననా…
హా బతుకులో బతుకునై…
నివేదిస్తా, నాసర్వం జహాపనా..
పూల నావ.. గాలి తోవ
హైలో.. హైలెస్సో.. - ఓ ఓ ఓ
చేరనీవా చేయనీవా - సేవలేవేవో..
మనసు మరీ మత్తుగా..
తూగి పోతున్నదే ఏమో ఈ వేళ
వయసు మరీ వింతగా..
విస్తుబోతున్నదే నీదే ఈ లీల
మనసులో అలలయే రహస్యాలేవో
చెప్పే క్షణం ఇది…
మనువుతో మొదలయే
మరో జన్మాన్నై పుట్టే వరమిది…
నీలో ఉంచా.. నా ప్రాణాన్ని
చూసి పోల్చుకో..ఓ ఓ..
హో నాలో పెంచా నీ కలలన్నీ
ఊగనీ ఉయ్యాల్లో……..
మనసు మరీ మత్తుగా..
తూగి పోతున్నదే ఏమో ఈ వేళ.
వయసు మరీ వింతగా..
విస్తుబోతున్నదే నీదే ఈ లీల
అంతగా కవ్విస్తావేం గిల్లి,
అందుకే బంధించెయ్ నన్నల్లీ..
ఖిలాడీ కోమలీ.. గుళేబకావలి,
సుఖాల జావలి.. వినాలి కౌగిలీ…
No comments
Post a Comment