Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Palasa 1978 (2020)




చిత్రం: పలాస 1978 (2020)
సంగీతం: రఘు కుంచె
నటీనటులు: రక్షిత్, నక్షత్ర, రఘు కుంచె
దర్శకత్వం: కరుణ కుమార్
నిర్మాత: ధ్యాన్ అట్లూరి
విడుదల తేది: 06.03.2020



Songs List:



ఓ సొగసరి ప్రియలాహిరి పాట సాహిత్యం

 
చిత్రం: పలాస 1978 (2020)
సంగీతం: రఘు కుంచె
సాహిత్యం: లక్ష్మి భూపాల
గానం: ఎస్.పి.బాలు, బేబి పసల

ఓ సొగసరి ప్రియలాహిరి
తొలకరి వలపుల సిరీ
ఓ గడసరి తెలిసెనుమరి
పరువపు శరముల గురీ
నువ్వే రమ్మంటావు వస్తే పొమ్మంటావు
కానీ కవ్విస్తావు అదేం మరి
వస్తే ముద్దంటావు హద్దే దాటేస్తావు
నన్నేఇమ్మంటావు పోవోయ్ మరీ

అహహా హహ ఆహహా
ఒహొహో హొహొ ఓహొహో
అహహా హహ ఆహహా
ఒహొహో హొహొ ఓహొహో

చలివేళలో చెలి ఏలనే
సొగసుకు బిడియపు ముసుగూ
ఈవేళలో ఆగావని
అతిగా ప్రణయం విసుగు
విరహమంటాను నేను
కసురుకుంటావు నువ్వు
సరసమేలేదు సయ్యాటలో
నేను వింటూనే ఉంటే
ఏదో అంటావునువ్వు
నీతో తంటాలు సిగ్గాటలో

అహహా హహ ఆహహా
ఒహొహో హొహొ ఓహొహో
అహహా హహ ఆహహా
ఒహొహో హొహొ ఓహొహో

చెలి కురులలో జలపాతమే
తనువొకధనువై మెరుపూ
ప్రణయాలలో ఈమాటలే
మనసుకు ముచ్చటగొలుపు
వెండి వెన్నెల్గొనువ్వు
నిండు జాబిల్లినవ్వు
కన్నెచెక్కిళ్ళు నాకోసమే
ఎంతసేపంటు నన్ను
పొగుడుతుంటావు నువ్వు
ఆపు చాలింక నచ్చావులే..

అహహా హహ ఆహహా
ఒహొహో హొహొ ఓహొహో
అహహా హహ ఆహహా
ఒహొహో హొహొ ఓహొహో

ఓ సొగసరి ప్రియలాహిరి
తొలకరి వలపుల సిరీ
ఓ గడసరి తెలిసెనుమరి
పరువపు శరముల గురీ
నువ్వే రమ్మంటావు వస్తే పొమ్మంటావు
కానీ కవ్విస్తావు అదేం మరి
వస్తే ముద్దంటావు హద్దే దాటేస్తావు
నన్నేఇమ్మంటావు పోవోయ్ మరీ

అహహా హహ ఆహహా
ఒహొహో హొహొ ఓహొహో
అహహా హహ ఆహహా
ఒహొహో హొహొ ఓహొహో




నాది నక్కిలీసు గొలుసు పాట సాహిత్యం

 
చిత్రం: పలాస 1978 (2020)
సంగీతం: రఘు కుంచె
సాహిత్యం: ఉత్తరాంధ్ర జానపదం
గానం: రఘు కుంచె, తేజస్విని నందిబట్ల

నీ పక్కన పడ్డాదిలేదో చూడొలె పిల్లా 
నాది నక్కిలీసు గొలుసు
నీ పక్కన పడ్డాదిలేదో చూడొలె పిల్లా 
నాది నక్కిలీసు గొలుసు

హే పక్కన పడ్డాదిలేదో చూడొలె పిల్లా 
నాది నక్కిలీసు గొలుసు
నీ పక్కన పడ్డాదిలేదో చూడొలె పిల్లా 
నాది నక్కిలీసు గొలుసు

నీ పక్కన పడ్డాదిలేదో చూడొలె పిల్లా 
నాది నక్కిలీసు గొలుసు
నీ పక్కన పడ్డాదిలేదో చూడొలె పిల్లా
నాది నక్కిలీసు గొలుసు

మీ బావ గారు వచ్చేటివేళ - ఆ..
నీకు బంతి పూలు తెచ్చేటి వేళా - ఆహా
మీ బావ గారు వచ్చేటివేళ
నీకు బంతి పూలు తెచ్చేటివేళా

మీ మరిదిగారు వచ్చేటివేళ - ఓసి
నీకు మందారం తెచ్చేటివేళా - అబ్బో
మీ మరిదిగారు వచ్చేటివేళ
నీకు మందారం తెచ్చేటి వేళా

మీ మామగారు - ఆ..
పిల్ల మామగారు - ఎల్లే..

మీ మామగారు వచ్చేటివేళా
నీకు మరుమల్లెలు తెచ్చేటి వేళా
మీ మామగారు వచ్చేటి వేళా
నీకు మరుమల్లెలు తెచ్చేటివేళా

నాది
నాది

నాది నక్కిలీసు గొలుసు...
నీ పక్కన పడ్డాదిలేదో చూడొలె పిల్లా 
నాది నక్కిలీసు గొలుసు
నీ పక్కన పడ్డాదిలేదో చూడొలె పిల్లా 
నాది నక్కిలీసు గొలుసు

నీకు కడియాలు తెచ్చేటి వేళా - ఆ
నీకు కొనకమ్మలు తెచ్చేటివేళా - ఓహో
నీకు కడియాలు తెచ్చేటి వేళా
నీకు కొనకమ్మలు తెచ్చేటివేళా

నీకు బొట్టుబిళ్ళ తెచ్చేటి వేళా - ఊ..
అది పెట్టుకుని వచ్చేటి వేళా - చీ
నీకు బొట్టుబిళ్ళ తెచ్చేటి వేళా
అది పెట్టుకుని వచ్చేటి వేళా

నీకు పట్టుచీర
అబ్బబ్బో పట్టుచీర

పిల్లా పట్టుచీర తెచ్చేటివేళా
అది కట్టుకుని వచ్చేటివేళా
నీకు పట్టుచీర తెచ్చేటివేళా
అది కట్టుకుని వచ్చేటి వేళా

నాది
నాది

నాది నక్కిలీసు గొలుసు...
నీ పక్కన పడ్డాదిలేదో చూడొలె పిల్లా 
నాది నక్కిలీసు గొలుసు
హే పక్కన పడ్డాదిలేదో చూడొలె పిల్లా 
నాది నక్కిలీసు గొలుసు
నీ పక్కన పడ్డాదిలేదో చూడొలె పిల్లా 
నాది నక్కిలీసు గొలుసు

నాది నక్కిలీసు గొలుసు...
నాది నక్కిలీసు గొలుసు...
నాది నక్కిలీసు గొలుసు...
నాది నక్కిలీసు గొలుసు...
నాది నక్కిలీసు గొలుసు...

నాది
నాది
నాది
నాది

నాది నాది నాది నాది నాది
నాది నాది నాది నాది నాది




బావచ్చాడో లప్పా బావచ్చాడ పాట సాహిత్యం

 
చిత్రం: పలాస 1978 (2020)
సంగీతం: రఘు కుంచె
సాహిత్యం: ఉత్తరాంధ్ర జానపదం
గానం: అదితి భావరాజు

బావచ్చాడో లప్పా బావచ్చాడు
ఎంత బాగున్నాడో లప్ప బాగున్నాడు (4)

తెల్లచీర కట్టుకోని రామ్మన్నాడు
మంచి మల్లెపూలు పెట్టుకోని రామ్మన్నాడు (2)

పట్టు లంగా కట్టుకోని రామ్మన్నాడు
తీరా వెళ్ళాక వోగ్గేసి వెళ్ళిపొయినాడు (2)

బావొచ్చి బావొచ్చి భలే బావొచ్చి

బావచ్చాడో లప్పా బావచ్చాడు
ఎంత బాగున్నాడో లప్ప బాగున్నాడు (2)

ఒరే అన్నయ్యా
ఆ చెల్లి
ఒకటి చెప్పాలా
బేగి చెప్పేయే
చెప్పటానికి  ఎంటుందిరన్నయ్య
ఇంకా నాలుగు ముక్కలు పాడేస్తాను వినుర

యెడమ కాలికేసినాడు ఎర్రటి జోడు
వాడు కుడి కాలుకు ఏసినాడు కర్రిటి జోడు (2)

గుడివెనుక తోటలోకి రమ్మన్నాడు
తీరా వెళ్ళాక తాగేసి తోంగున్నాడు (2)

బావొచ్చే అరే బావొచ్చే అరెరే బావొచ్చే

బావచ్చాడో లప్ప బావ వచ్చాడు
ఎంత బాగున్నాడో లప్ప బాగున్నాడు (4)





ఏ ఊరు ఏ ఊరే వలె భామ.. పాట సాహిత్యం

 
చిత్రం: పలాస 1978 (2020)
సంగీతం: రఘు కుంచె
సాహిత్యం: భాస్కర భట్ల రవి కుమార్
గానం: విజయలక్ష్మి , రాజు, జముకు అసిరయ్య

ఏ ఊరు ఏ ఊరే వలె భామ..
నీది ఏ ఊరే వలె భామ... నీది ఏ ఊరే
సీకకుళం జిల్లా...
జిల్లాలో పలాస మా ఊరు వస్తావా.. 
పలాస మా ఊరు...
బోగట్టలేటేటే మీ ఊరి.. బొగటలింకేటే..
నా దుక్కు సూస్తూనే సెప్తావా...
ఒకసారి ఇంటానే...

ఏ ఊరు ఏ ఊరే.. వలె భామ..
నీది ఏ ఊరే వలె భామ.... నీది ఏ ఊరే.
పలాస మా ఊరు వస్తావా...
పలాస మా ఊరు...

భుగత ఇను ఇను.. సెబుతా ఇను ఇను..
మా ఊరి వైభోగం...
భుగత ఇను ఇను..సెబుతా ఇను ఇను...
మా ఊరి వైభోగం...
జెముకల కుండని వాయించనా
డేకురు కొండని సూపించనా...

ఏటికి అవతల ఏపుగా ఎదిగిన 
పచ్చాని సౌభాగ్యం..
జీడీ తోటల సింగారాలు.. 
ఆ ఎర్రాసెరువు.. ఎగిరే కొంగల కోలాటాలు.
జీడి పప్పు పేరు సెపితే చాలు...
పలాస విలాసం గురుతొస్తాది.
దేశాలన్నీ తెల్ల బంగారంలా
భావించే విలువైన పంటే ఇది..
ఎంతటి వంటైనా ఇదివుంటే ఓ అందం.
ఎంతటి వాడైనా, దీని రుచికే దాసోహం...
రెక్కలు ముక్కలు సెమట సుక్కలు
మంకీనమ్మకి నైవేద్యం...
బస్తాలెత్తే వస్తాదులు.. ఆ కండలు ఎరగవు
అందరిలాంటి ముస్తాబులు..
బస్తాలెత్తే వస్తాదులు.. ఆ కండలు ఎరగవు
అందరిలాంటి ముస్తాబులు...

పోరాటాల పురిటి గడ్డే ఇది
చైతన్య గీతాల గొంతే ఇది...
కదిలొచ్చిన చదువుల తల్లే ఇది
జననేతలుదయించే ఇల్లే ఇది...
వలస పిట్టలకి తేలి నీలాపురము
పాదయాత్రలకు మొదలు ఇచ్ఛాపురము
పచ్చని చీరని కట్టిన నేలకి
నుదుటున తూరుపు సింధూరం..

మనం మనం బరంపురం అనుకుంటూ
వరసలు కలుపుకు పోదా తరం తరం...
దేవుడు ఇచ్చిన వరం వరం
ఆ నెత్తురు బదులు ప్రేమే పొంగెను నరం నరం...




కళావతి కళావతి పాట సాహిత్యం

 
చిత్రం: పలాస 1978 (2020)
సంగీతం: రఘుకుంచె
సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ
గానం: రమ్యా బెహ్రా , రఘుకుంచె

కళావతి కళావతి
కళావతి కళావతి… కళావతి వద్దే వద్దే
కళావతి కళావతి… కళావతి వద్దే వద్దే
హోయ్ హోయ్…
మిడ్డేసుకున్న దాన్ని సూత్తవో… చున్నేసుకున్న దీన్ని సూత్తవో
మిడ్డేసుకున్న దాన్ని సూత్తవో… చున్నేసుకున్న దీన్ని సూత్తవో
మిడ్డి లేదు, చున్నీ లేదు… పొట్ట నువ్వు సూడకుండ
వడ్డాణవెట్టుకున్న… నన్ను సూత్తవో

దాన్ని సూత్తవో… దీన్ని సూత్తవో
నీ కన్నులల్ల మన్నుపొయ్య… నన్నే సూత్తావో 

మిడ్డేసుకున్న దాన్ని సూత్తనో… చున్నేసుకున్న దీన్ని సూత్తనో
మిడ్డేసుకున్న దాన్ని సూత్తనో… చున్నేసుకున్న దీన్ని సూత్తనో
దాన్ని సూత్తనో… దీన్ని సూత్తనో
వడ్డాణవెట్టుకున్న… నిన్ను కూడా వదిలిపెట్టనే
ఓయ్ ఓయ్ ఓయ్…

సాకిలేటులాగున్న దాన్ని తింటవో… ఐస్ ఫ్రూట్ లాగున్న దీన్ని తింటవో (2)
ఐస్ లేదు, గీసు లేదు వయసునంత కరగబోసి
ఎన్నె పూస లాగున్న నన్ను తింటవో
దాన్ని తింటవో, దీన్ని తింటవో… నీ కారమొళ్ళు పాడుగాను నన్ను తింటవో
కళావతి కళావతి… కళావతి వతి వతి

సాకిలేటులాగున్న దాన్ని తింటనో… ఐస్ ఫ్రూట్ లాగున్న దీన్ని తింటనో (2)
దాన్ని తింటనో, దీన్ని తింటనో… ఎన్నె పూస లాగున్న నిన్ను కూడ మింగేస్తనే
ఎల్లెహే…

ఆ రమ్మేసుకొచ్చినాది దానికిస్తవో… బబ్లు గమ్మేసుకొచ్చినాది దీనికిస్తవో
రమ్ము లేదు గమ్ము లేదు… తమ్మలపాకు నమిలి
తెన్నీటి పెదవులున్న నాకిస్తవో…
దానికిత్తవో దీనికిత్తవో… నా పెదవులల్ల తేనె పుయ్య నాకు ఇత్తవో
దానికిత్తవో దీనికిత్తవో… నా పెదవులల్ల తేనె పుయ్య నాకు ఇత్తవో

రమ్మేసుకొచ్చినా దానికిత్తనో… బబ్లు గమ్మేసుకొచ్చినాది దీనికిత్తనో
రమ్మేసుకొచ్చినా దానికిత్తనో… బబ్లు గమ్మేసుకొచ్చినాది దీనికిత్తనో
దానికిత్తనో దీనికిత్తనో… తెన్నీరు పెదవులన్న నీకు కూడా ఇచ్చేత్తానే
కళావతి కళావతి… కళావతి వతి వతి




చింత చెట్టు కింద పాట సాహిత్యం

 
చిత్రం: పలాస 1978 (2020)
సంగీతం: రఘుకుంచె
సాహిత్యం: కరుణాకర్
గానం: సంధ్యా కొయ్యాడ

చింత చెట్టు కింద

No comments

Most Recent

Default