Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Yashoda"



చిత్రం: యశోద (2022)
సంగీతం: మణిశర్మ 
నటీనటులు: సామంత, వరలక్ష్మి శరత్ కుమార్, ఉన్ని ముకుందన్ 
దర్శకత్వం: హరి హరీష్ 
నిర్మాత: శివలెంక కృష్ణ ప్రసాద్ 
విడుదల తేది: 11.11.2022



Songs List:



Baby Shower పాట సాహిత్యం

 
చిత్రం: యశోద (2022)
సంగీతం: మణిశర్మ 
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి 
గానం: సాహితి చాగంటి 

లాయి లాయి లల్లాయి లాయి
లాయి లాయి లాయీ
లాయి లాయి లల్లాయి లాయి
లాయి లాయి లాయీ

లాయి లాయి చిన్నారి చెల్లాయి
కన్నకలలు నెరవేరనున్నాయి

డివ్వి డివ్విట్టం అందాల కోలాటం
బొట్టు పెట్టింది అరుదైన పేరంటం
ముద్దుగుమ్మకు మురిపాల సీమంతం
ఇంటి పెద్దలా ఈ తంతు జరిపిద్దాం

డివ్వి డివ్విట్టం… అందాల కోలాటం
బొట్టు పెట్టింది… అరుదైన పేరంటం

పుట్టింటివారైనా అత్తింటివారైనా
నీ అక్కచెల్లెళ్ళం మేమే
హమ్మమ్మో చెయ్యొద్దు ఏ చిన్నిపనైనా
నీ మంచిమన్ననంతా మాదే

ఏ, ఉయ్యాలే ఉయ్యాలే ఉయ్యా ఉయ్యా ఉయ్యాలే
కన్నా రా నువ్వింకా హాయిగ నిద్దురపోవాలి
ఏ, ఉయ్యాలే ఉయ్యాలే ఉయ్యా ఉయ్యా ఉయ్యాలే
నీ హాయే పాపాయై పొత్తిళ్ళల్లో వాలాలి

డివ్వి డివ్విట్టం… అందాల కోలాటం
బొట్టు పెట్టింది… అరుదైన పేరంటం

ప్రాణాల అంచుల్లో తానాలు పోసేటి
త్యాగ గుణమే అమ్మా
బరువైన బంధాన్నే మునిపంట మోసేటి
ఆదిశక్తి  ఆడజన్మ

ఏ, ఉయ్యాలే ఉయ్యాలే ఉయ్యా ఉయ్యా ఉయ్యాలే
బుజ్జి బుజ్జి బొజ్జల్లో కొలువై ఉన్నది దేవుళ్ళే
ఏ, ఉయ్యాలే ఉయ్యాలే ఉయ్యా ఉయ్యా ఉయ్యాలే
దేవుణ్ణే నీళ్ళాడే అమ్మలు కూడా దేవతలే

డివ్వి డివ్విట్టం… అందాల కోలాటం
బొట్టు పెట్టింది… అరుదైన పేరంటం

లాయి లాయి లల్లాయి లాయి
లాయి లాయి లాయీ
లాయి లాయి లల్లాయి లాయి
లాయి లాయి లాయీ

Palli Balakrishna Friday, November 25, 2022

Most Recent

Default