-->
Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Vikram K. Kumar"




చిత్రం: గ్యాంగ్ లీడర్ (2019)
సంగీతం: అనిరుద్ రవిచంద్రన్
నటీనటులు: నాని, కార్తికేయ రెడ్డి, ప్రియాంక అరుల్ మోహన్
దర్శకత్వం: విక్రమ్ కె కుమార్
నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, సి. వి. మోహన్
విడుదలతేది: 13.09. 2019



Songs List:



రా రా జగతిని జయించుదాం పాట సాహిత్యం

 
చిత్రం: గ్యాంగ్ లీడర్ (2019)
సంగీతం: అనిరుద్ రవిచంద్రన్
సాహిత్యం: అనంత శ్రీరామ్
గానం: పృద్వి చంద్ర, బషీర్ మాక్స్

రా రా జగతిని జయించుదాం
రా రా చరితను లిఖించుదాం
రా రా భవితను సవాలు చేసే కవాతు చేద్దం తెగించుదాం
రా రా నడుములు భిగించుదాం
రా రా పిడుగులు ధరించుదాం
రా రా చెడునిక దహించివేసే రహస్య వ్యూహం రచించుదాం

గదులు గడులుగ గడపలు దాటేయ్
దడలు దడులు దరులను దాటేయ్
ఎగిరెగిరి ఎగిరి యెగిరి ఎగిరెగిరి యెగిరి దస దిసల కొసకు పోదాం
యెరలు మొరలు చెరలను దటేయ్
తరులు గిరులు జరులను దాటేయ్
ఎరిరెగిరి ఎగిరి యెగిరి ఎగిరెగిరి యెగిరి తుది గెలుపు మెరుపు చూద్దాం
రా.........

సరిగా సరిగా మన శక్తులన్ని ఒక చోట చేర్చుదాం
త్వరగా త్వరగా మన తప్పులన్ని సరిదిద్ది సగుదాం
చెమటె చెమటే చమురైన వాహనం దేహమే కదా
శ్రమకే శ్రమకే తను కోరుకున్న గమ్యాన్ని చూపుదాం
తారల కలలు తాకుదాం మన తీరుని తెలుపుదాం
ఆరని తపన ఆయుదం ఇక పోరుని సలుపుదాం

గదులు గడులుగ గడపలు దాటేయ్
దడలు దడులు దరులను దాటేయ్
ఎగిరెగిరి ఎగిరి యెగిరి ఎగిరెగిరి యెగిరి దస దిసల కొసకు పోదాం
యెరలు మొరలు చెరలను దటేయ్
తరులు గిరులు జరులను దాటేయ్
ఎరిరెగిరి ఎగిరి యెగిరి ఎగిరెగిరి యెగిరి తుది గెలుపు మెరుపు చూద్దాం
రా.........

రా రా జగతిని జయించుదాం
రా రా చరితను లిఖించుదాం
రా రా భవితను సవాలు చేసే కవాతు చేద్దం తెగించుదాం
రా రా నడుములు భిగించుదాం
రా రా పిడుగులు ధరించుదాం
రా రా చెడునిక దహించివేసే రహస్య వ్యూహం రచించుదాం





హొయ్ నా హొయ్ నా పాట సాహిత్యం

 
చిత్రం: గ్యాంగ్ లీడర్ (2019)
సంగీతం: అనిరుద్ రవిచంద్రన్
సాహిత్యం: అనంత శ్రీరామ్
గానం: ఇన్నో జంగా, అనిరుద్ రవిచంద్రన్

వేరే కొత్త భూమిపై ఉన్నానా
ఏదో వింత రాగమే విన్నానా
వేరే కొత్త భూమిపై ఉన్నానా
ఏదో వింత రాగమే విన్నానా

పలికే పాల గువ్వతో
కులికే  పూల కొమ్మతో
కసిరే వెన్నెలమ్మతో
స్నేహం చేశా
ఎగిరే పాలవెల్లితో
నడిచే గాజు బొమ్మతో
బంధం ముందు జన్మదా
ఏమో బహుశా

హొయ్ నా హొయ్ నా హొయ్ నా హొయ్ నా 
హొయ్ నా హొయ్ నా హొయ్ నా హొయ్ నా
ఇక ఏదేమైనా నీతో చిందులు వేయనా వేయనా
హొయ్ నా హొయ్ నా హొయ్ నా హొయ్ నా
హొయ్ నా హొయ్ నా హొయ్ నా
కలకాలం నీతో కాలక్షేపం చేయనా చేయనా

Think I caught the feels this summer
Bae you’re one of a kind no other
Be my sweetie be my sugar
Had enough as a one side lover
I think I caught the feels this summer
Bae you’re one of a kind no other
Be my sweetie be my sugar
Had enough as a one side lover

నా జీవితానికి రెండో
ప్రయాణముందని
దారి వేసిన చిట్టి పాదమా
నా జాతకానికి  రెండో భాగముందని
చాటి చెప్పిన చిన్ని ప్రాణమా

గుండెలోన రెండో వైపే చూపి
సంబరాన ముంచావే నేస్తమా
నాలో నాకే రెండో రూపం చూపి
దీవించిందే నీలో పొంగే ప్రేమ

వెలిగే వేడుకవ్వనా
కలిసే కానుకవ్వనా
పెదవుల్లోయినా నింపైనా
చిరుదరహాసం

ఎవరో రాసినట్టుగా
జరిగే నాటకానికి
మెరుగులు దిద్ది వెయ్యనా
ఇక నా వేషం

హొయ్ నా హొయ్ నా హొయ్ నా హొయ్ నా
హొయ్ నా హొయ్ నా హొయ్ నా
ఇక ఏదేమైనా నీతో చిందులు వేయనా వేయనా
హొయ్ నా హొయ్ నా హొయ్ నా హొయ్ నా
హొయ్ నా హొయ్ నా హొయ్ నా
కలకాలం నీతో కాలక్షేపం చేయనా చేయనా…

వేరే కొత్త భూమిపై ఉన్నానా.. 
ఏదో వింత రాగమే విన్నానా
వేరే కొత్త భూమిపై ఉన్నానా.. 
ఏదో వింత రాగమే విన్నానా




నిను చూసే ఆనందంలో పాట సాహిత్యం

 
చిత్రం: గ్యాంగ్ లీడర్ (2019)
సంగీతం: అనిరుద్ రవిచంద్రన్
సాహిత్యం: అనంత శ్రీరామ్
గానం: సిద్ శ్రీరామ్

కథ రాయడం మొదలుకాకముందు 
అపుడే ఎలాంటి మలుపో
కల దేనికో తెలుసుకోకముందు 
అపుడే ఇదేమి తలపో

నిను చూసే ఆనందంలో
కనుపాపే కడలై పొంగినదే
నిను తాకే ఆరాటంలో
నను నేనే వదిలేశాను కదే

అరె భారమెంత నువు మోపినా 
మనసు తేలికౌతుందే

నిను చూసే ఆనందంలో
కనుపాపే కడలై పొంగినదే
కథ రాయడం మొదలుకాకముందు 
అపుడే ఎలాంటి మలుపో

అణువణువున ఒణుకు రేగినది
కనబడదది కనులకే
అడుగడుగున అడుగుతోంది మది
వినబడదది చెవులకే

మెదడుకు పది మెలికలేసినది
తెలియనిదిది తెలివికే
ఇదివరకెరుగనిది ఏమిటిది
నిదరయినది నిదరకే

తడవ తడవ గొడవాడినా
తగని తగువు పడినా
విడిగ విడిగ విసిగించినా
విడని ముడులు పడెనా

నిను చూసే ఆనందంలో
కనుపాపే కడలై పొంగినదే
నిను తాకే ఆరాటంలో
నను నేనే వదిలేశాను కదే
అరె భారమెంత నువు మోపినా 
మనసు తేలికౌతూ ఉందే

నిను చూసే ఆనందంలో
కనుపాపే కడలై పొంగినదే
కథ రాయడం మొదలుకాకముందు
అపుడే ఎలాంటి మలుపో

ఒకటొకటిగ పనులు పంచుకొని
పెరిగిన మన చనువుని
సులువుగ చులకనగా చూడకని
పలికెను ప్రతి క్షణమిలా

ఒకటొకటిగ తెరలు తెంచుకొని
తరిగిన మన వెలితిని
పొరబడి నువు మరల పెంచకని
అరిచెను ప్రతి కణమిలా

వెతికి వెతికి బతిమాలినా
గతము తిరగబడదే
వెనక వెనక అణిచేసినా
నిజము మరుగుపడదే

నిను చూసే ఆనందంలో
కనుపాపే కడలై పొంగినదే
నిను తాకే ఆరాటంలో
నను నేనే వదిలేశాను కదే
అరె భారమెంత నువు మోపినా 
మనసు తేలికౌతూ ఉందే

నిను చూసే ఆనందంలో
కనుపాపే కడలై పొంగినదే
కథ రాయడం మొదలుకాకముందు 
అపుడే ఎలాంటి మలుపో..



గ్యాంగు గ్యాంగు లీడరు పాట సాహిత్యం

 
చిత్రం: గ్యాంగ్ లీడర్ (2019)
సంగీతం: అనిరుద్ రవిచంద్రన్
సాహిత్యం: అనంత శ్రీరామ్
గానం: అనిరుద్ రవిచంద్రన్

యే సీను సిరిగి సీటులిరిగి సీటి కొట్టాలోయ్
యే సీడెడు నైజాం ఆంద్రా సిందు తొక్కాలోయ్
సిటికే వేసి వెల్కం చెప్పండోయ్
సిరునవ్వులతో హారతి పట్టందోయ్
గ్యాంగు గ్యాంగు లీడరు వచ్చడు లెగండోయ్
హ్యాంగు హ్యాంగు ఓవరులో ఊగాలి పదండోయ్
గ్యాంగు గ్యాంగు లీడరు వచ్చడు లెగండోయ్
హ్యాంగు హ్యాంగు ఓవరులో ఊగాలి పదండోయ్

యే సీను సిరిగి సీటులిరిగి సీటి కొట్టాలోయ్
యే సీడెడు నైజాం ఆంద్రా సిందు తొక్కాలోయ్
పీ పీ ......

హేయ్ సరస్వతీ పేరులోనె కొత్త సాఫ్టురో
ఈ బామ్మమ్మరో బధ్రఖాళి కదరో
హేయ్ వరలక్ష్మి మాటలోనె అంత హార్డురో
ఈ అమ్మ ఇంకో అన్నపూర్ణ కదరో
ఆ కంట్లో కోపాన్ని ఈ కంట్లో ఇష్టాన్ని
చూపిస్తు ఉంటాదోయ్ మా ప్రియా డార్లింగ్
స్వాతిలా ఓ చెల్లి అందారికి ఉండుంటె
ఈ లోఅం ఓ స్వర్గం అవునని నా ఫీలింగ్
అడ్డెడ్డె చిన్ను చిన్ను... పెన్సిల్ కి ఇది పెన్ను
అంత కలిసి మించేస్తరు మిన్ను

గ్యాంగు గ్యాంగు లీడరు వచ్చడు లెగండోయ్
హ్యాంగు హ్యాంగు ఓవరులో ఊగాలి పదండోయ్
గ్యాంగు గ్యాంగు లీడరు వచ్చడు లెగండోయ్
హ్యాంగు హ్యాంగు ఓవరులో ఊగాలి పదండోయ్

యే సీను సిరిగి సీటులిరిగి సీటి కొట్టాలోయ్
యే సీడెడు నైజాం ఆంద్రా సిందు తొక్కాలోయ్
పీ పీ.....

గ్యాంగు గ్యాంగు లీడరు వచ్చడు లెగండోయ్
హ్యాంగు హ్యాంగు ఓవరులో ఊగాలి పదండోయ్
గ్యాంగు గ్యాంగు లీడరు వచ్చడు లెగండోయ్
హ్యాంగు హ్యాంగు ఓవరులో ఊగాలి పదండోయ్




కథ రాయడం పాట సాహిత్యం

 
చిత్రం: గ్యాంగ్ లీడర్ (2019)
సంగీతం: అనిరుద్ రవిచంద్రన్
సాహిత్యం: అనంత శ్రీరామ్
గానం: అనిరుద్ రవిచంద్రన్

కథ రాయడం
Katharaayadam Reprise

Palli Balakrishna Sunday, July 21, 2019



చిత్రం: హలో (2017)
సంగీతం: అనూప్ రూబెన్స్
నటీనటులు: అఖిల్ , కళ్యాణి ప్రియదర్శన్
దర్శకత్వం: విక్రమ్ కుమార్
నిర్మాత: అక్కినేని నాగార్జున
విడుదల తేది: 22.12.2017



Songs List:



హెల్లొ పాట సాహిత్యం

 
చిత్రం: హలో (2017)
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం: శ్రేష్ఠా , వనమాలి
గానం: అర్మాన్ మాలిక్

హెల్లొ ఎక్కడున్న హెల్లొ 
ఎమయ్యవ్ హెల్లొ 
వింటున్నవా ఈ వేలలో 
హెల్లొ ఇటు రావా హెల్లొ 
హెల్లొ మరిచావా హెల్లొ 
గడిపేస్తున్న నీ ద్యాసలో 

హెల్లొ ఎక్కడెక్కడున్నవు 
హెల్లొ ఎం చేస్తున్నవు 
కనపడవా, వినపడవా 
ఎంత కాలమైన నన్ను చేరవా 
girl i say hello hello 
i feel the love 
and it makes me glow 
girl you are my love for sure 
i hear you calling me hello hello 

నువ్వెంత దూరమున్న 
ఏ చోట దాగి ఉన్నా 
నీ జాడ తెలుసుకోనా 
నీ చెంత చేరుకొనా 
యె నాడు వీడిపోనీ 
నీ తోడు నీడ నేనై 
నీ వెంటే నడిచి రానా 
నీతోనె ఉండిపోనా 
ఉండిపోనా.. 

హెల్లొ ఎక్కడున్న హెల్లొ 
ఎమయ్యవ్ హెల్లొ 
వింటున్నవా ఈ వేలలో 
హెల్లొ ఇటు రావా హెల్లొ 
హెల్లొ మరిచావా హెల్లొ 
గడిపేస్తున్న నీ ద్యాసలో 





అనగనగా ఒక ఊరు పాట సాహిత్యం

 
చిత్రం: హలో (2017)
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం: చంద్రబోస్
గానం: శ్రీ ధృతి

అనగనగా ఒక ఊరు 
అనుకోకుండ ఒక నాడు 
కలిసారే పసివాల్లు స్నేహంగా 
సంతోషమంత రెక్కలుగా 
రివ్వంటు యెగిరె పక్షులుగా 
ఆకశమంత ఆటాడుకుంటు ఉన్నరు సరదాగా 
ఒకరేమొ సీను ఒక్కరెమొ జున్ను 
కలిసారె ప్రాణంగ కురిసారె వర్షంగ 
పాటేమొ సీను ఆటెమొ జున్ను 
ఒకటై యెదిగారె మధురంగ 

ప్రపంచమంత తమ ఇల్లంటు 
ప్రతి క్షణం ఒక పండుగగా 
కన్నీరు లేని కలలే కంటు 
చిన్నరి చెలిమే బలపడగా 
తియ తియ్యని ఊసులతో 
తెల తెల్లని మనసులలో 
కథ ఇలాగ మొదలయ్యెగా 
కథ ఇలాగ మొదలయ్యెగా 

అనగనగా ఒక ఊరు 
అనుకోకుండ ఒక నాడు 
కలిసారె పసివాల్లు స్నేహంగ 

యెగిరిన బుడకలలోన చెలిమె 
ఉరికిన పడవలలోన చెలిమె 
రంగుల రట్నంలో చెలిమె చిందులు వేసిందే 
మినుగురు వెలుగులలోన చెలిమె 
తొలకరి తేనెలలోన చెలిమె 
గాజుల గలగలలో చెలిమె సందడి చెసిందే 
ఈ గ్నాపకాలన్ని నిలెచెనులే 
ఈ జీవితానికి బలమై నడిపెనులే 
ఈ సాక్ష్యాలే అనుభందాల 
బవనానికి స్థంబాలె 

అనగనగ ఒక ఊరు 
అనుకోకుండ ఒక నాడు 
కలిసారె పసివాల్లు స్నేహంగ 

తెలపని కబురులలోన చెలిమె 
తిరగని మలుపులలోన చెలిమె 
దొరకని చూపులలో చెలిమె 
దోసిలి నింపింది 
జరిగిన నిమిషములోన చెలిమె 
యెరగని మరు నిమిషాన చెలిమె 
కాలం చెక్కిలిలో చెలిమె 
చుక్కై మెరిసిందే 
చిననాడు మురిపించే ఈ గురుతులె 
కనరాని దారిని చూపే మీ గురువులె 
ఉండాలంటు ఈ బతుకంతా 
ఈ మాటలకి కట్టుబడి 




తలచి తలచీ పాట సాహిత్యం

 
చిత్రం: హలో (2017)
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం: వనమాలి
గానం: హరిచరణ్

తెలిసీ తెలియని ఊహలో 
కలిసీ కలవని దారిలో 
యెటు వెల్లిందొ యెటు వెల్లిందో మనసే 

విరిసీ విరియని స్నేహమై 
పలికీ పలకని రాగమై 
యెటు వెల్లిందొ యెటు వెల్లిందో మనసే 

పలకరించె పాటలా 
మనసూగెను ఊయలా 
ఎదిగింది అందమైన ఓ కలా 
ఏమయ్యిందో ఏమో గాని 
యెవరు పోల్చుకోని 
ఇరు దారుల్లొ యెటు నడిచారొ ఈ వేలా 
తలచి తలచీ వెతికే కన్నులివిగో 
తిరిగి తిరిగీ అలిసే అడుగులివిగో 
యెదురు చూసి చూసీ యెంతకాలమైనా 
జత చేరకుండ ఆశ జారిపోయెనా 

తలచి తలచీ వెతికే కన్నులివిగో 
తిరిగి తిరిగీ అలిసే అడుగులివిగో 

తెలిసీ తెలియని ఊహలో 
కలిసీ కలవని దారిలో 
యెటు వెల్లిందొ యెటు వెల్లిందో మనసే 

విరిసీ విరియని స్నేహమై 
పలికీ పలకని రాగమై 
యెటు వెల్లిందొ యెటు వెల్లిందో మనసే 

కన్నుల్లొ కల నిజమవక 
నిదురించవుగ ఈ హ్రుదయాలు 
ముల్లున్న తమ దారుల్లొ 
పరుగాపరులే ఈ పసివాల్లు 
ఆ నిన్నలో ప్రతి గ్నాపకము 
ఈ జంటనె వెంటాడేన 
ఆ లోకమె యెటు వెల్లిందొ 
కానరాదు కాస్తైనా 

తలచి తలచీ వెతికే కన్నులివిగో 
తిరిగి తిరిగీ అలిసే అడుగులివిగో 
యెదురు చూసి చూసీ యెంతకాలమైనా 
జత చేరకుండా ఆశ జారిపోయేనా 

తలచి తలచీ వెతికే కన్నులివిగో 
తిరిగి తిరిగీ అలిసే అడుగులివిగో 

ఇద్దరికి పరిచయమే 
ఒక కల లాగ మొదలయ్యిందా 
ఇద్దరుగా విడిపోయక 
అది కలాగానె మిగిలుంతుందా 
పసి వాల్లుగ వేరయ్యక 
ఇన్నల్లుగ యెమయ్యరొ 
ఈ నేలపై నలుదిక్కుల్లొ 
యెటు దాగి ఉన్నరొ 

తలచి తలచీ వెతికే కన్నులివిగో 
తిరిగి తిరిగీ అలిసే అడుగులివిగో 
యెదురు చూసి చూసీ యెంతకాలమైనా 
జత చేరకుండ ఆశ జారిపోయెనా 
తలచి తలచీ వెతికే కన్నులివిగో 
తిరిగి తిరిగీ అలిసే అడుగులివిగో 




ఏవేవో కలలు కన్న  పాట సాహిత్యం

 
చిత్రం: హలో (2017)
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం: చంద్రబోస్
గానం: అఖిల్ అక్కినేని, జోనిత గాంధి

ఏవేవో కలలు కన్న 
ఏవైపో కదులుతున్న 
ఏమైందొ తెలియకున్న 
ఎన్నెన్నొ జరుగుతున్న 
ఏమొ ఏమైందో నాలోనె ఏమైందో 
ఏమొ ఏముందో ఇకముందేం కానుందో 
ఇదేమి ఇదేమిటో...ఈమాయ పేరేమిటో 
ఇదేమి ఇదేమిటో...ఈమాయ పేరేమిటో 

ఏవేవో కలలు కన్న 
ఏవైపో కదులుతున్న 
ఏమైందొ తెలియకున్న 
ఎన్నెన్నొ జరుగుతున్న 
ఏమొ ఏమైందో నాలోనె ఏమైందో 
ఏమొ ఏముందో ఇకముందేం కానుందో 
ఇదేమి ఇదేమిటో...ఈమాయ పేరేమిటో 
ఇదేమి ఇదేమిటో...ఈమాయ పేరేమిటో 

తలచుకున్న వేలలో తెలుసుకున్న వెలుగేమిటో 
కలుసుకున్న వేలలో క్షనముకింత విలుమేమిటో 
ఇలా నేను నా నువ్వు మనమైన ఈ వేలల్లో 
ఈ వెలుగేమొటో...ఈ పరుగేమిటో...మైమరపేమిటో 
హాయి గీతాలలో ఈ బాషేమిటొ భవాలేమిటో 
ఈ తియ్యనీ బంధాలేమొటో 

ఏవేవో కలలు కన్న 
ఏవైపో కదులుతున్న 
ఏమైందొ తెలియకున్న 
ఎన్నెన్నొ జరుగుతున్న 
ఏమొ ఏమైందో నాలోనె ఏమైందో 
ఏమొ ఏముందో ఇకముందేం కానుందో 
ఇదేమి ఇదేమిటో...ఈమాయ పేరేమిటో 
ఇదేమి ఇదేమిటో...ఈమాయ పేరేమిటో 




అనగనగా ఒక ఊరు  పాట సాహిత్యం

 
చిత్రం: హలో (2017)
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం: చంద్రబోస్
గానం: శ్రేయా ఘోషల్

అనగనగా ఒక ఊరు 
అనుకోకుండ ఒక నాడు 
కలిసారే పసివాల్లు స్నేహంగా 
సంతోషమంత రెక్కలుగా 
రివ్వంటు యెగిరె పక్షులుగా 
ఆకశమంత ఆటాడుకుంటు ఉన్నరు సరదాగా 
ఒకరేమొ సీను ఒక్కరెమొ జున్ను 
కలిసారె ప్రాణంగ కురిసారె వర్షంగ 
పాటేమొ సీను ఆటెమొ జున్ను 
ఒకటై యెదిగారె మధురంగ 

ప్రపంచమంత తమ ఇల్లంటు 
ప్రతి క్షణం ఒక పండుగగా 
కన్నీరు లేని కలలే కంటు 
చిన్నరి చెలిమే బలపడగా 
తియ తియ్యని ఊసులతో 
తెల తెల్లని మనసులలో 
కథ ఇలాగ మొదలయ్యెగా 
కథ ఇలాగ మొదలయ్యెగా 

అనగనగా ఒక ఊరు 
అనుకోకుండ ఒక నాడు 
కలిసారె పసివాల్లు స్నేహంగ 

యెగిరిన బుడకలలోన చెలిమె 
ఉరికిన పడవలలోన చెలిమె 
రంగుల రట్నంలో చెలిమె చిందులు వేసిందే 
మినుగురు వెలుగులలోన చెలిమె 
తొలకరి తేనెలలోన చెలిమె 
గాజుల గలగలలో చెలిమె సందడి చెసిందే 
ఈ గ్నాపకాలన్ని నిలెచెనులే 
ఈ జీవితానికి బలమై నడిపెనులే 
ఈ సాక్ష్యాలే అనుభందాల 
బవనానికి స్థంబాలె 

అనగనగ ఒక ఊరు 
అనుకోకుండ ఒక నాడు 
కలిసారె పసివాల్లు స్నేహంగ 

తెలపని కబురులలోన చెలిమె 
తిరగని మలుపులలోన చెలిమె 
దొరకని చూపులలో చెలిమె 
దోసిలి నింపింది 
జరిగిన నిమిషములోన చెలిమె 
యెరగని మరు నిమిషాన చెలిమె 
కాలం చెక్కిలిలో చెలిమె 
చుక్కై మెరిసిందే 
చిననాడు మురిపించే ఈ గురుతులె 
కనరాని దారిని చూపే మీ గురువులె 
ఉండాలంటు ఈ బతుకంతా 
ఈ మాటలకి కట్టుబడి 




మెరిసే మెరిసే మెరిసే పాట సాహిత్యం

 
చిత్రం: హలో (2017)
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం: వనమాలి
గానం: హరిచరన్, శ్రీనిధి వెంకటేష్ , శృతి రంజిని

మెరిసే మెరిసే మెరిసే 
ఆ కన్నుల్లో ఏదో మెరిసే
ఆ మనసే మురిసే మురిసే
ఆ సంగతి నాకు తెలుసే
కురిసే కురిసే కురిసే
నవ్వుల్లో వెన్నెల కురిసే 
ఇది కొత్తగా మారిన వరసే
ఆ సంగతి నాకు తెలుసే
సన్నాయి  మోగేనా అమ్మాయి
గుండెలో ఈ రేయి ఆశలే రేగేలా
రావోయి అల్లరి అబ్బాయి
అందుకో ఈ చేయి ఒకటై సందడి చేసేలా

దినక్ నక్ దిరణ తనక్ దిన దినక్ నక్ దిరణ
ఓ దినక్ నక్ దిరణ జోర్ సే డోలు బజావో నా (2)

రెండు గుండెల చప్పుడు ఒకటే
మూడు ముళ్ల ముచ్చట కాగా
ఈడు జోడు కలిసి తోడు నీడై సాగగా
ఏడు జన్మల బంధమిదేలే 
ఏడు అడుగులు వేస్తూ ఉంటే 
చిన్న పెద్ద అంతా సంబరాలే చేయరా
ఆనందం పువ్వుల మాలలుగా 
ఇప్పుడే అల్లెస్తూ హాయిగా తేల్చేగా
బంధాలే ఈ ప్రేమ జంటనిలా
పెళ్లిలో బంధించే కమ్మని కన్నుల పండుగగా

దినక్ నక్ దిరణ తనక్ దిన దినక్ నక్ దిరణ
ఓ దినక్ నక్ దిరణ జోర్ సే డోలు బజావో నా 

అరె షాదియాల వచ్చెరా షురూగిట్ల పరిషాను 
సంజైతాలేదా చెప్తా చూడు ఓ కహానీ
పెండ్లి పిల్లగాడు ముందు కింగు లెక్క తిరుగుతుండె
ఇంక పెండ్లి అయ్యినంక ఆమె కొంగుబట్టి ఊగుడంతే
హోయ్ - అంతే 
హోయ్ - అంతే  అంతే 
మాటలాడనంటది వెయ్యకుంటే సోపు
అందగత్తె లెందరున్న నువ్వేమేటి తోపు అంటు
గాపులేక పొగడకుంటే రోజు గిట్ల గడవదంతే
అంతే అంతే
ఆమె గొప్పలెన్నో జెప్పనీకి తిప్పలెన్నో పెట్టెనంట
సప్పగున్న లైఫ్ లోకి అప్పు లొల్లి తప్పదంతే
ఆడిగినన్ని చీరలింక నువ్వుతెచ్చి పెట్టకుంటే
మాటనీది ఇంటిలోన నడవదంతే నడవదంతే
అంతే అంతే అంతే

మెరిసే మెరిసే మెరిసే 
ఆ కన్నుల్లో ఏదో మెరిసే
ఆ మనసే మురిసే మురిసే
ఆ సంగతి నాకు తెలుసే

దినక్ నక్ దిరణ తనక్ దిన దినక్ నక్ దిరణ
ఓ దినక్ నక్ దిరణ జోర్ సే డోలు బజావో నా (2)


Palli Balakrishna Thursday, December 7, 2017





చిత్రం: ఇష్టం (2001)
సంగీతం: డి.జె.గోపీనాథ్
నటీనటులు: చరణ్ రెడ్డి దొడ్ల, శ్రేయ శరన్ (తొలిపరిచయం)
దర్శకత్వం: విక్రమ్ కుమార్ - రాజ్ కుమార్
నిర్మాత: రామోజీరావు
విడుదల తేది: 30.12.2001

(ఈ సినిమా డైరెక్టర్లలో ఒకరైన విక్రమ్ కుమార్ గారికి ఇది మొదటి సినిమా,  తరువాత నితిన్ తో ఇష్క్ , నాగార్జున గారితో మనం అలాగే సూర్య గారితో 24 అనే సినిమాలు తీశారు)

(అక్కినేని నాగేశ్వరరావు మనవరాలు సుప్రియ (హీరో సుమంత్ అక్క, అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాలో హీరోయిన్) భర్తే ఈ చరణ్ రెడ్డి దొడ్ల ఈయన ఈ ఒకేఒక్క సినిమాలో నటించారు తరువాత తన  36 వ ఏట మరణించారు)



Songs List:



నువ్వంటే ఇష్టమని పాట సాహిత్యం

 
చిత్రం: ఇష్టం (2001)
సంగీతం: డి.జె.గోపీనాథ్
సాహిత్యం: సిరివెన్నెల 
గానం: చిత్ర, హరిహరన్ 

నువ్వంటే ఇష్టమని




ఈ అందాల కాలేజీలో పాట సాహిత్యం

 
చిత్రం: ఇష్టం (2001)
సంగీతం: డి.జె.గోపీనాథ్
సాహిత్యం: పోతుల రవికిరణ్ 
గానం: టిప్పు 

ఈ అందాల కాలేజీలో



ఎవరైనా చూసారా... పాట సాహిత్యం

 
చిత్రం: ఇష్టం (2001)
సంగీతం: డి.జె.గోపీనాథ్
సాహిత్యం: సిరివెన్నెల 
గానం: చిత్ర, హరిహరన్ 

ఎవరైనా చూసారా... పరువే చెడదా పురుషోత్తమా... 
అరెరె అనరా ప్రియ నేస్తమా...
ఎవరైనా చూసారా
గారంగా కొసరే వేళ ... కారంగా కసిరే వేలా
గుండెల్లో జరిగే గోలా... మౌనంగా ఉంటే మేలా...
ఎవరైనా చూసారా...  పరువే చెడదా పురుషోత్తమా... 
అరెరె అనరా ప్రియ నేస్తమా...
ఎవరైనా చూసారా

అప్పుడప్పుడీ ఉపవాసం ...తమ అలవాటా ...
కోరుకుంటె  నా సహవాసం... ఏం పొరపాటా ...
ఒహో ఏమా రోషం ... వామ్మో సమరావేసం
కొరికేసే ఉక్రోషం...
కరిగించే సరసం కోసం ... అడిగేస్తే ఏమిటి దోషం
ఇష్టమంత ఉగ్గబట్టి ఎందుకంత మొగమాటం

ఎవరైనా చూసారా
పరువే చెడదా పరిహాసమా... చెబితే వినవా చెలగాటమా
ఎవరైనా చూసారా

లేనిపోని సైగలు చేసి నను లాగాలా..
చేరగానే వెనకడుగేసి వెటకారాలా
లోలో సరదా లేదా... పై పై పరదాలేలా
తగువేలా నాతో తగువేలా
బిగువేలా ఇంకా బిడియాలా
గుట్టే దాచాలన్నా దాగేనా

ఎవరైనా చూసారా...  పరువే చెడదా పురుషోత్తమా... 
అరెరె అనరా ప్రియ నేస్తమా...
ఎవరైనా చూసారా
ఎర  వేసే అల్లరి ఈల...  పొరపాటే అయిపోవాలా
దరి దాటే వరదయ్యేలా...  పరుగెడితే పడవా బాల
ఎవరైనా చూసారా
పరువే చెడదా పరిహాసమా... చెబితే వినవా చెలగాటమా
ఎవరైనా చూసారా





Why Don't You Enjoy పాట సాహిత్యం

 
చిత్రం: ఇష్టం (2001)
సంగీతం: డి.జె.గోపీనాథ్
సాహిత్యం: కులశేఖర్
గానం: టి.ఆర్.కార్తీక్ 

Why Don't You Enjoy



కాన్వెంటులో కాలేజిలో పాట సాహిత్యం

 
చిత్రం: ఇష్టం (2001)
సంగీతం: డి.జె.గోపీనాథ్
సాహిత్యం: సిరివెన్నెల 
గానం: యస్.పి.బాలు

కాన్వెంటులో కాలేజిలో 



యాఊరు యాఊరే పాట సాహిత్యం

 
చిత్రం: ఇష్టం (2001)
సంగీతం: డి.జె.గోపీనాథ్
సాహిత్యం: వరికుప్పల యాదగిరి
గానం: వరికుప్పల యాదగిరి

యాఊరు యాఊరే చిన్నదానా ఉన్నాయె సోకులు చానా
నా వద్దకొస్తావా ఓ సారైనా ఓ చిన్న ముద్దీవే మైనా
నీ అందం మస్తుగుందే సుల్తానా...
అయిపోయా నేనే నీకు దీవానా...
ఓ జాని... ఓ జాని... ఓ జాని...
నీ ఎంటె రమ్మందే నీ వోణి

చరణం: 1
నీ స్మైలే చూస్తున్నప్పుడు పెరిగిందే గుండె చప్పుడూ
నీ వాయిసే వింటున్నప్పుడు  మత్తెక్కిపోయిందమ్మడూ
నిజ్జంగా నువ్వంటేనే ఇష్టం నువ్వోకే చెప్పకుంటె కష్టం
నిజ్జంగా నువ్వంటేనే ఇష్టం  నువ్వోకే చెప్పకుంటె కష్టం
ఏం చెయ్మంటావె పిల్లా మనసే ఫిక్సయ్యిందట్లా

చరణం: 2
మోడల్‌గా నువ్వొచ్చావంటే యాడ్ లోకం మొత్తం నీచుట్టే
ఎంటివి యాంకర్ నువ్వైతే నీ ప్రోగ్రామ్సన్నీ బిగ్ హిట్టే
సినిమాల్లో కొచ్చావంటె చాలే  గ్లామర్లో ముంచేస్తారే రీళ్ళే
సినిమాల్లో కొచ్చావంటె చాలే  గ్లామర్లో ముంచేస్తారే రీళ్ళే
ప్రతి స్టార్లు దైరెక్టర్లు నువ్వే కావాలంటారె

చరణం: 3
వెజిటబుల్ మార్కెట్ దగ్గర  లవ్ లెటర్ ఇద్దామనుకున్నా
శంకర్‌మట్ టెంపుల్ దగ్గర నా మాటర్ చెబ్దామనుకున్నా
నిజ్జంగా ఆ రోజే నా బాడ్‌లక్  పోలీసోళ్ళొచ్చేసారే వేళక్
నిజ్జంగా ఆ రోజే నా బాడ్‌లక్  పోలీసోళ్ళొచ్చేసారే వేళక్
ఫ్రెండ్సంతా చెబ్తుంటారె ఎప్పుడు చూసిన గుడ్‌లక్ గుడ్‌లక్





చిరు చిరు నగవుల పాట సాహిత్యం

 
చిత్రం: ఇష్టం (2001)
సంగీతం: డి.జె.గోపీనాథ్
సాహిత్యం: భువనచంద్ర
గానం: చిత్ర 

చిరు చిరు నగవుల 

Palli Balakrishna Tuesday, October 17, 2017


చిత్రం: 24 (2016)
సంగీతం: ఏ.అర్.రెహమాన్
సాహిత్యం: చంద్రబోస్
గానం: నిత్యామీనన్
నటీనటులు: సూర్యా , సమంత , నిత్యామీనన్
దర్శకత్వం: విక్రమ్ కుమార్
నిర్మాత: సూర్యా
విడుదల తేది: 06.05.2016

లాలీజో... లాలీజో...
కన్నాజో...  చిన్నిరాజుకు లాలీజో
లాలీజో... లాలీజో...
కన్నాజో...  చిన్నిరాజుకు లాలీజో
లేతవేళ్ళుకు లాలీజో
లేలేతకాళ్ళకు లాలీజో

నాలోని కళలను వెలిగించే
నీళాల కళ్ళకు లాలీజో
నీ చిట్టి చేతుల సైగలతో
నీ చుట్టు గాలై తిరిగానే

నీ చిరు గుండెల సవ్వడిలో
నింపానురా నా కాలాన్ని

లాలీజో... లాలీజో...
కన్నాజో...  చిన్నిరాజుకు లాలీజో

జన్మం ఉంది ప్రతి జీవికి
ఏదో అర్ధం ఉంటుందిరా

నాకు అర్ధం నువ్వేరా
నాకు అర్ధం నువ్వేరా
తపస్సు నీకై చేస్తున్నా
నా ఆయుస్సు నీకే పోస్తున్న
సిరుల నెలవో లాలీజో

చిత్రాల కొలువా లాలీజో
సిరుల నెలవో లాలీజో
చిరంజీవా లాలీజో
లాలీజో... లాలీజో...
కన్నాజో...  చిన్నిరాజుకు లాలీజో
లాలీజో... లాలీజో...
కన్నాజో...  చిన్నిరాజుకు లాలీజో
కన్నాజో...  చిన్నిరాజుకు లాలీజో
చిన్నిరాజుకు లాలీజో


*******     *******     *******


చిత్రం: 24
సంగీతం: ఏ.అర్.రెహమాన్
సాహిత్యం: చంద్రబోస్
గానం: హ్రిదయ్ గట్టాని, చిన్మయ శ్రీపద

ప్రేమ పరిచయమే దైవదర్శనమే
ప్రేమ స్వరములలో దైవస్మరణములే
అది తెలిసింది తొలిసారి నీ ప్రేమతో
మది మునిగింది నీ ప్రేమలో
ప్రేమ పరిచయమే దైవదర్శనమే
ప్రేమ అడుగులలో దేవతార్చనమే

చరణం: 1
కోకిలసలు కోరుకొనని ప్రేమ తపస్సు మనదిలే
అతిధులెవరు ఎదురు పడని ప్రేమ తిధులు మనవే అమృతములు ఎగసిపడిన ప్రేమ నదులు మనవే
చరితల కాగితాల లోన చెలిమిలేని ప్రేమనే నీలో చదివా ఈ క్షణమే
ప్రేమ పరిచయమే  దైవదర్శనమే
ప్రేమ అడుగులలో దేవతార్చనమే

చరణం: 2
హృదయ గళము పాడుతున్న ప్రేమ గీతి మనదిలే
కనుల కలము రాసుకున్న ప్రేమ లేఖ మనదే
పెదవి ప్రమిద పంచుతున్న ప్రేమ జ్యోతి మనదే
మనుషుల ఊహాలోన సైతం ఉండలేని ప్రేమతో ఎదుటే ఉన్నా ఈ క్షణాలలో
ప్రేమ పరిచయమే  దైవదర్శనమే
ప్రేమ అడుగులలో దేవతార్చనలే
అది తెలిసింది తొలిసారి నీ ప్రేమతో మది మునిగింది నీ ప్రేమలో
ప్రేమ పరిచయమే  దైవదర్శనమే
ప్రేమ స్వరములలో దైవస్మరణములే
అది తెలిసింది తొలిసారి నీ ప్రేమతో మది మునిగింది నీ ప్రేమలో
ప్రేమ పరిచయమే దైవదర్శనమే

Palli Balakrishna Sunday, July 30, 2017
Manam (2014) Telugu Songs Lyrics Album Cover

Manam (2014) Telugu Songs Lyrics

MOVIE DETAILS
Movie : Manam (2014)
Music : Anup Rubens
Director : Vikram Kumar
Producer : Akkineni Family
Supporting Cast : Neetu Chandra, Tejaswi Madivada
Release Date : 23 May 2014

Kanulanu Thaake Song Lyrics in Telugu – Manam (2014)

'Kanulanu Thaake' song from Manam (2014) movie is composed by Anup Rubens and sung by Arijit Singh.

SONG INFORMATION
Movie : Manam (2014)
Music : Anup Rubens
Lyricist : Vanamali
Singers : Arijit Singh
చిత్రం: మనం (2014) సంగీతం: అనూప్ రూబెన్స్ సాహిత్యం: వనమాలి గానం: అర్జిత్ సింగ్ ఓ కనులను తాకే ఓకలా చూపే నిన్నిలా నన్నే మార్చినా నువ్వైయేలా... ఓ మనసును లాగే మాయలా వేసే ఓవలా నీనవ్వులే నేడిలా ఓ ఆయి నీలో ఉన్నా నీలోనే ఉన్నా నిప్రేమే నేకోరుతున్నా నీలో ఉన్నా నీతోడై ఉన్నా నిన్నే నేప్రేమించినా ఓ కనులను తాకే ఓకలా... ఓ...ఓ హో ఇన్నాళ్లూ ఆనందం వెల్లువాయనె ఏమైందో ఈనిమిషం దూరమాయనే వెన్నెలింక చీకటయ్యేలా నవ్వులింక మాయమయ్యేలా బాధలింక నీడలాగ నాతో సాగేనా నాలో రేగింది ఓ గాయమే దారే చూపేనా ఈకాలం... నీవేనేలా నీమౌనంనేలా నీ ఊసే ఈగుండెలోనా నీతోలేనా అహా... ఓ కనులను తాకే ఓకలా... ఓ...ఓ చంద ఓ చందమామా రావా మావెంటే రావా పైనే నువ్వుదాక్కున్నావా... వానా ఓ వెన్నెల వానా రావా నువ్వైనా రావా మాతో నువ్వు చిందేస్తావా... ఓ ఈదూరం ఎందాకా తీసుకెల్లునో ఈమౌనం ఏనాటికి వీడిపోవునో బంధమింక ఆవిరయ్యేనా పంతమింక ఊపిరయ్యేనా నీటిమీద రాతలాగ ప్రేమే మారేనా ఇంకా ఈజీవితం ఎందుకో కంట కన్నీరు నింపేందుకో... ఓ...ఓ నీతో రానా నీ నీడైపోనా నీకోపం వెంటాడుతున్నా నీలో లేనా అహా...

Chinni Chinni Aasalu Song Lyrics in Telugu – Manam (2014)

'Chinni Chinni Aasalu' song from Manam (2014) movie is composed by Anup Rubens and sung by Shreya Ghoshal, Ashwin and Hari.

SONG INFORMATION
Movie : Manam (2014)
Music : Anup Rubens
Lyricist : Chandrabose
చిత్రం: మనం (2014) సంగీతం: అనూప్ రూబెన్స్ సాహిత్యం: చంద్రబోస్ గానం: శ్రేయాఘోషల్, అశ్విన్ శేఖర్, హరి యాయాయే యాయాయా యాయాయా యాయా యాయా యా హో చిన్ని చిన్ని చిన్ని చిన్ని చిన్ని ఆశలు నాలో రేగెనే చిరు చిరు చిరు చిరు చిరు చిందులు మనసే వేసెనే చిట్టి చిట్టి చిట్టి చిట్టి చిట్టి ఊహలు ఎదలో ఊగెనే ఏంచెయ్యనూ ఏంచెయ్యనూ ఏంచెయ్యనూ... తొలిచూపు నీపైనే తొలిపలుకు నీతోనే తొలి అడుగు నీకై సాగెనే హో హో హో తొలిప్రేమ నువ్వేలే తుదివరకు నీతోనే ఈ మాట నాలో దాగెనే హే హే చిన్ని చిన్ని ఆశలు నాలో రేగెనే చిరు చిరు ఊహలు ఎదలో ఊగెనే... ఉఁ యాయాయే ఉఁ యాయాయా యాయాయా యాయా యాయా యా ఓ... ఐ లవ్ యూ...ఐ లవ్ యూ... ఐ లవ్ యూ అంటే... ఇలా ఇవ్వు, ఇలా ఇవ్వు హో ప్రేమతో వచ్చానే స్నేహమే గెలిచానే స్నేహమూ ప్రేమ రెండు నావే... హో వెలుగుతో వచ్చానే నీడలా మారానే వెలుగు నీడల్లో తోడు నీవే గుండెలో నీవల్లే సవ్వడే పెరిగేనే గుండె తడి నువ్వయ్యావులే చిన్ని చిన్ని ఆశలు నాలో రేగెనే హు హూ చిరు చిరు ఊహలు ఎదలో ఊగెనే హు హూ హో... నేస్తమై వచ్చావే పుస్తలై నిలిచావే బహుమతిచ్చావే జీవితాన్నే... హో... ఇద్దరే ఉన్నామే ఒక్కరై అదితామే ముగ్గురైపోయె ముద్దులోనే ప్రేమనే పంచావే పాపలాచూసావే మన ప్రేమ పాపైందిలే... చిన్ని చిన్ని ఆశలు నాలో రేగెనే ఓహో చిరు చిరు ఊహలు ఎదలో ఊగెనే... హో చిన్ని చిన్ని చిన్ని చిన్ని చిన్ని ఆశలు నాలో రేగెనే చిరు చిరు చిరు చిరు చిరు చిందులు మనసే వేసెనే ఓ... చిట్టి చిట్టి చిట్టి చిట్టి చిట్టి ఊహలు ఎదలో ఊగెనే ఏంచెయ్యనూ... తొలిప్రేమ నువ్వేలే తుదివరకు నీతోనే ఈ మాట మాలో మోగెనే హే హే చిన్ని చిన్ని ఆశలు మాలో రేగెనే హొ హో చిరు చిరు ఊహలు ఎదలో ఊగెనే...

Kani Penchina Maa Ammake Song Lyrics in Telugu – Manam (2014)

'Kani Penchina Maa Ammake' song from Manam (2014) movie is composed by Anup Rubens and sung by Bharath.

SONG INFORMATION
Movie : Manam (2014)
Music : Anup Rubens
Lyricist : Chandrabose
Singers : Bharath
చిత్రం: మనం (2014) సంగీతం: అనూప్ రూబెన్స్ సాహిత్యం: చంద్రబోస్ గానం: మాస్టర్ భరత్ & కోరస్ నననాననా నననాననా నాన నాననా నననాననా నననాననా నాన నాననా ఓ... లలలల లలాల లలలల లలాల లలలల లలాల లాలలా కనిపెంచినా మా అమ్మకే అమ్మయ్యానుగా నడిపించినా మా నాన్నకే నాన్నయ్యానుగా ఒకరిది కన్ను ఒకరిది చూపూ ఇరువురి కలయిక కంటిచూపూ ఒకరిది మాటా ఒకరిది భావం ఇరువురి కధలిక కదిపిన కధ ఇది ప్రేమా ప్రేమా తిరిగొచ్చే తీయగా... ఇది ప్రేమా ప్రేమా ఎదురొచ్చే హాయిగా ఇది మనసును తడిమిన తడిపిన క్షణముకదా... నాననా నననా నాన నాననా నానా నాన నాననా నననా నాన నాననా నననా నాన హా... అ ఆ ఇ ఈ నేర్పిన అమ్మకు గురువును అవుతున్నా హా... అడుగులు నడకలు నేర్పిన నాన్నకు మార్గం అవుతున్నా పిల్లలువీల్లే అవుతుండగా ఆ అల్లరి నేనే చూస్తుండగా కన్నోలతో నేను చిన్నోడిలా కలగలిసిన ఎగసిన బిగిసిన కధ ఇది ప్రేమా ప్రేమా తిరిగొచ్చే తీయగా... ఇది ప్రేమా ప్రేమా ఎదురొచ్చే హాయిగా ఇది మనసును తడిమిన తడిపిన క్షణముకదా... అ అ కమ్మని బువ్వను కలిపిన చేతిని దేవత అంటున్నా కన్నుల నీటిని తుడిచిన వేలికి కోవెల కడుతున్నా జోలలు నాకే పాడారుగా ఆ జాలిని మరచిపోలేనుగా మీరూపినా ఆ ఊయల నా హృదయపు లయలళొ పదిలము కద ఇది ప్రేమా ప్రేమా తిరిగొచ్చే తీయగా... ఇది ప్రేమా ప్రేమా ఎదురొచ్చే హాయిగా ఇది మనసును తడిమిన తడిపిన క్షణముకదా... అ... అ... అ నననన ననాన నననన ననాన నననన ననాన నానా నానా నననన ననాన నననన ననాన నననన ననాన నానా నానా

Piyo Piyo Re Song Lyrics in Telugu – Manam (2014)

'Piyo Piyo Re' song from Manam (2014) movie is composed by Anup Rubens and sung by Benny Dayal, Jaspreet Jasz, Anup Rubens, Meghraj and Rahul.

SONG INFORMATION
Movie : Manam (2014)
Music : Anup Rubens
Lyricist : Anup Rubens
చిత్రం: మనం (2014) సంగీతం: అనూప్ రూబెన్స్ సాహిత్యం: అనూప్ రూబెన్స్ గానం: బెన్నీ దయాళ్, జస్ప్రీత్ జస్జ్, అనూప్ రూబెన్స్, మేఘ రాజ్, రాహుల్ టాటా టట్టట్టట్ట టట్టాట టట్టట్టా టాటా టట్టట్టట్ట ఎవ్రీబడీ... టాటా టట్టట్టట్ట టట్టాట టట్టట్టా టాటా టట్టట్టట్ట... బాటిల్ ఖోలో... ధీంతన ధీంతన  గ్లాసు తీసుకో... ధీంతన ధీంతన  ఫుల్లు నింపు... ధీంతన ధీంతన  కొట్టు డ్రింకు... ధీంతన ధీంతన  టాటా టట్టట్టట్ట టట్టాట టట్టట్టా కిక్కు వస్తది... ధీంతన ధీంతన మస్తి చేస్కో...ధీంతన ధీంతన  నైటు మొత్తం...ధీంతన ధీంతన  కింగు నువ్వే... ధీంతన ధీంతన సుక్కేసి చూసెయ్ రో ఆ సుక్కల్ని తాకెయ్ రో బాధల్ని దించెయ్ రో లైఫు ని నవ్వుల్తొ నింపెయ్ రో ఆ డ్రింకు డ్రింకు హెయ్... ఆ ఫుల్లుగ డ్రింకు హెయ్... ఏ రోజైనా ఏ టైం అయినా ఇది తాగుట నువ్వే కింగే రో పీయో పీయో రే అరె ఫుల్ టూ పీయో రే అరె పీయో పీయో రే అ ఫుల్ టూ నేను పుట్టాను... ఆ పీయో పీయో రే అరె ఫుల్ టూ పీయో రే అరె పీయో పీయో రే అ ఫుల్ టూ నేను పుట్టాను... నేను పుట్టాను లోకం మెచ్చింది నేను ఏడ్చాను లోకం నవ్వింది నేను నవ్వాను ఈ లోకం ఏడ్చింది నాకింకా లోకం తో పని ఏముందీ  డోంట్ కేర్... కేర్ కేర్ కేర్ కేర్... టాటా టట్టట్టట్ట టట్టాట టట్టట్టా  టాటా టట్టట్టట్ట హేయ్ బాటిల్ ఖోలో... ధీంతన ధీంతన  గ్లాసు తీసుకో... ధీంతన ధీంతన  ఫుల్లు నింపు...ధీంతన ధీంతన  హే కొట్టు డ్రింకు... ధీంతన ధీంతన పీయో పీయో రే అరె ఫుల్ టూ పీయో రే అరె పీయో పీయో రే అ ఫుల్ టూ నేను పుట్టాను... ఆ పీయో పీయో రే అరె ఫుల్ టూ పీయో రే అరె పీయో పీయో రే అ ఫుల్ టూ నేను పుట్టాను లోకం మెచ్చింది నేను ఏడ్చాను లోకం నవ్వింది నేను నవ్వాను ఈ లోకం ఏడ్చింది నాకింకా లోకం తో పని ఏముందీ డోంట్ కేర్... కేర్ కేర్ కేర్ కేర్... టాటా టట్టట్టట్ట టట్టాట టట్టట్టా టాటా టట్టట్టట్ట టాటా టట్టట్టట్ట

Edhi Prema Song Lyrics in Telugu – Manam (2014)

'Edhi Prema' song from Manam (2014) movie is composed by Anup Rubens and sung by Haricharan.

SONG INFORMATION
Movie : Manam (2014)
Music : Anup Rubens
Lyricist : Chandrabose
Singers : Haricharan
చిత్రం: మనం (2014) సంగీతం: అనూప్ రూబెన్స్ సాహిత్యం: చంద్రబోస్ గానం: హరిచరన్ నననాననా నననాననా నాన నాననా నననాననా నననాననా నాన నాననా ఓ... కనిపెంచినా మా అమ్మకే అమ్మయ్యానుగా నడిపించినా మా నాన్నకే నాన్నయ్యానుగా ఒకరిది కన్ను ఒకరిది చూపూ ఇరువురి కలయిక కంటిచూపూ ఒకరిది మాటా ఒకరిది భావం ఇరువురి కధలిక కదిపిన కధ ఇది ప్రేమా ప్రేమా తిరిగొచ్చే తీయగా... ఇది ప్రేమా ప్రేమా ఎదురొచ్చే హాయిగా ఇది మనసును తడిమిన తడిపిన క్షణముకదా... హా దీరనా దిరనా నాన దీరనా దీరనాన దీరనా దిరనా నాన దీరనా దీరనాన హా... అ ఆ ఇ ఈ నేర్పిన అమ్మకు గురువును అవుతున్నా ఓ... అడుగులు నడకలు నేర్పిన నాన్నకు మార్గం అవుతున్నా పిల్లలువీల్లే అవుతుండగా ఆ అల్లరి నేనే చూస్తుండగా కన్నోలతో నేను చిన్నోడిలా కలగలిసిన ఎగసిన బిగిసిన కధ ఇది ప్రేమా ప్రేమా తిరిగొచ్చే తీయగా... ఇది ప్రేమా ప్రేమా ఎదురొచ్చే హాయిగా ఇది మనసును తడిమిన తడిపిన క్షణముకదా... అ అ కమ్మని బువ్వను కలిపిన చేతిని దేవత అంటున్నా ఓ కన్నుల నీటిని తుడిచిన వేలికి కోవెల కడుతున్నా జోలలు నాకే పాడారుగా ఆ జాలిని మరచిపోలేనుగా మీరూపినా ఆ ఊయల నా హృదయపు లయలళొ పదిలము కద ఇది ప్రేమా ప్రేమా తిరిగొచ్చే తీయగా... ఇది ప్రేమా ప్రేమా ఎదురొచ్చే హాయిగా ఇది మనసును తడిమిన తడిపిన క్షణముకదా... అ... అ... అ...

Palli Balakrishna Sunday, July 16, 2017

Most Recent

Default