చిత్రం: ఫిదా (2017)
సంగీతం: శక్తికాంత్ కార్తీక్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: అరవింద్ శ్రీనివాస్, రేణుక
తనలో ఉన్నదేదో ఎదురుగానే ఉన్నది
అయినా మనసు దాన్ని పోల్చలేకున్నది
తానే వెతుకుతోందే దొరికినట్టే ఉన్నది
అయినా చెయ్యి చాసి అందుకోకున్నది
రమ్మంటున్నా... పొమ్మంటున్నా...
వస్తూ ఉన్నా... వచ్చేస్తున్నా...
ఏదో జరుగుతోంది ఎదలో అలజడి
ఏదో అడుగుతోంది ఎదరే నిలబడి
ఏదో జరుగుతోంది ఎదలో అలజడి
ఏదో అడుగుతోంది ఎదరే నిలబడి
గుండెలో ఇదేమిటో కొండంత ఈ భారం
ఉండనీదు ఊరికే ఏచోట ఈ నిమిషం
వింటున్నావా... నా మౌనాన్ని...
ఏమో ఏమో... చెబుతూ ఉంది...
ఏదో జరుగుతోంది ఎదలో అలజడి
ఏదో అడుగుతోంది ఎదరే నిలబడి
ఏదో జరుగుతోంది ఎదలో అలజడి
ఏదో అడుగుతోంది ఎదరే నిలబడి
కరిగిపోతూ ఉన్నది ఇన్నాళ్ల ఈ దూరం
కదలిపోను అన్నది కలలాంటి ఈ సత్యం
నా లోకంలో - నా లోకంలో
అన్నీ ఉన్నా - అన్నీ ఉన్నా
ఏదో లోపం నువ్వేనేమో
ఆ పై దూరం ఏం లేకున్నా
సందేహంలో ఉన్నానేమో
ఏదో జరుగుతోంది ఎదలో అలజడి
ఏదో అడుగుతోంది ఎదరే నిలబడి
తనలో ఉన్నదేదో ఎదురుగానే ఉన్నది
అయినా మనసు దాన్ని పోల్చలేకున్నది
ఏదో జరుగుతోంది ఎదలో అలజడి
ఏదో అడుగుతోంది ఎదరే నిలబడి
ఏదో జరుగుతోంది ఎదలో అలజడి
ఏదో అడుగుతోంది ఎదరే నిలబడి
Hey Pillagaada Song Lyrics in Telugu – Fidaa (2017)
'Hey Pillagaada' song from Fidaa (2017) movie is composed by Shakthikanth Karthick and sung by Sindhuri and Sinov Raj.
చిత్రం: ఫిదా (2017)
సంగీతం: శక్తికాంత్ కార్తీక్
సాహిత్యం: చైతన్య పింగళి
గానం: హేమచంద్ర
ఊసుపోదు ఊరుకోదు
ఉండనీదు వెళ్లనీదు
వింత ఖైదు నాకిలా ఏమిటో
సోయి లేదు సోలనీదు
వీడిపోదు చేరిరాదు
చింత పోదు నాకిలా ఏమిటో
ఊసుపోదు ఊరుకోదు
ఉండనీదు వెళ్లనీదు
వింత ఖైదు నాకిలా ఏమిటో
సోయి లేదు సోలనీదు
వీడిపోదు చేరిరాదు
చింత పోదు నాకిలా ఏమిటో
నా నుండి నా ప్రాణమే ఇలా జారుతోందే
తప్పేనా ఈ యాతన నీ వైపు రావాలనే
అలా ఉరుకుతోందే ఆగేదేనా అరె ఈ ఆలోచన
నీ తలపులే వదలవే నన్ను నిద్దురలోను
ఆ మరుపున తెలియక నన్నే వెతికినాను
వల్ల కాదు పాలుపోదు
ఆగనీదు సాగనీదు
వెంట రాదు నాకిలా ఏమిటో
వేళ కాదు వీలు లేదు
ఊహకాదు ఓర్చుకోదు
చంత లేదు నాకిలా ఏమిటో
నా నుండి నా ప్రాణమే ఇలా జారుతోంది
తప్పేనా ఈ యాతన నీ వైపు రావాలనే
అలా ఉరుకుతోందే ఆగేదేనా అరె ఈ ఆలోచన
నీ తలపులే వదలవే నన్ను నిద్దురలోను
ఆ మరుపున తెలియక నన్నే వెతికినాను
నా గుండెలో తొందరే నన్నే నిలువనీదే
ఏదోనాడు నీతో చెప్పేయనా
నీ పిలుపులులే కలలుగా నన్ను తరుముతాయే
ఆ కలవరం మెళకువై నన్నే అల్లుకుందే
నా గుండెలో తొందరే నన్నే నిలువనీదే
ఏదోనాడు నీతో చెప్పేయనా
నీ తలపులే వదలవే
నీ తలపులే వదలవే
ఊసుపోదు ఊరుకోదు
ఉండనీదు వెళ్లనీదు
వింత ఖైదు నాకిలా ఏమిటో
Hey Mister Song Lyrics in Telugu – Fidaa (2017)
'Hey Mister' song from Fidaa (2017) movie is composed by Shakthikanth Karthick and sung by Deepak.
చిత్రం: ఫిదా (2017)
సంగీతం: శక్తికాంత్ కార్తీక్
సాహిత్యం: వనమాలి
గానం: దీపక్
గుడ్ మార్నింగ్ హలో USA
చల్ వేగం నీ అడ్రస్ ఏ
చించేదం ఈ జర్నీ -ఏ దిల్సే
ఈ లైఫ్ ఏయ్ ఒక బోనస్ -ఏ
రోజు ఇక బిందాస్ -ఏ
డోన్ట్ మిస్ నీకొచ్చినా ఈ ఛాన్స్ -ఏ
నీ కలలతో సెల్ఫీలే దిగు
నిజం అవదా డౌట్ ఎందుకు
ఈ జిందగీ చేయి అందుకో
ఇక ఆగకోయ్ లెట్స్ గో గో గో
హే మిస్టర్ రా మిస్టర్
హే మిస్టర్ యో మిస్టర్
హే మిస్టర్ రా మిస్టర్
హే మిస్టర్ యో మిస్టర్
చల్ వె చల్ నువ్వు చోయిసెస్ -ఏయ్
కాలం ఇస్ నాట్ ఫర్ సేల్
డైలీ తప్పదులే ఈ రేస్ -ఏయ్
వన్ బై వన్ నువ్వు ఈరోజే పీల్చేయి
నీ ప్రతి ఆశే
నీలో ఇక రాదా ఆ జోష్ -ఏయ్
నీ కంటికో నువ్వే నచ్చేయి
నీ కోసమే రాదా మంచి
నువ్వు స్పీకరో ఆ చూపులతో
మస్తీ వాలో యా గో య గో
హే మిస్టర్ యో మిస్టర్
హే మిస్టర్ రా మిస్టర్
హే మిస్టర్ యో మిస్టర్
హే మిస్టర్ రా మిస్టర్
Fidaa Song Lyrics in Telugu – Fidaa (2017)
'Fidaa' song from Fidaa (2017) movie is composed by Shakthikanth Karthick and sung by Hemachandra and Malavika.
చిత్రం: ఫిదా (2017)
సంగీతం: శక్తికాంత్ కార్తీక్
సాహిత్యం: చైతన్య పింగళి
గానం: హేమచంద్ర, మాళవిక
ఓ ఫిదా...
ఎంత దూరమో ఇలా అంత చేరువే కదా
ఒక్కసారి తొంగిచూడవా
ఎన్ని దారులో అలా వాకిలాయేగ ఎద
ఒక్కసారి తొంగిచూడవా
మా వైపు వెన్నెలే మీకు వేకువౌనులే
ఒక నింగేలే మనకున్నది
నా కలల తోటలో మారని ఋతువులున్నవే
నువు వచ్చుండే చోటున్నదే
ఫిదా ఫిదా ఫిదా ఫిదా నీకే
పదే పదే ఒకే రొదే మాటే
ఫిదా ఫిదా ఫిదా ఫిదా నీకే హే...
ఎంత దూరమో ఇలా అంత చేరువే కదా
ఒక్కసారి తొంగిచూడవా
ఆకాశం గుప్పిట్లో చిక్కేదేనా
మేఘాలు హద్దుల్లో ఉండేవేనా
గుండెల్లో ఆగేవి కప్పేవేళ రెప్పల్లోన
ఆమాత్రం నేనేంటో అర్ధంకానా
నీ జడల పాయలో గుండె చిక్కుకున్నదే
మరి రమ్మన్నా రాకున్నదే
అడగాలి నిన్నని వద్దు ఆగిపొమ్మని
ఒక జంజాటం చంపేస్తోందే
గుండె తలుపు తట్టకు నిన్ను నాలో వెదకకు
మాటే తేలేలోన ఆపేస్తానా
బాదే దీనితోనే చెప్పేసేయన
నవ్వే దీని నుండి దాచేస్తాన దాచేస్తాన
మనసేయే మౌనంగా ఏడుస్తున్నా
నీ జడల పాయలో గుండె చిక్కుకుందే
మరి రమ్మన్నా రాకున్నదే
అడగాలి నిన్నని వద్దు ఆగిపొమ్మని
ఒక జంజాటం చంపేస్తోందే
ఎంత దూరమో ఇలా అంత చేరువే కదా
ఒక్కసారి తొంగిచూడవా
ఎన్ని దారులో అలా వాకిలాయేగ ఎద
ఒక్కసారి తొంగిచూడవా
మా వైపు వెన్నెలే మీకు వేకువౌనులే
ఒక నింగేలే మనకున్నది
నా కలల తోటలో మారని ఋతువులున్నవే
నువు వచ్చుండే చోటున్నదే
ఫిదా ఫిదా ఫిదా ఫిదా నీకే
పదే పదే ఒకే రొదే మాటే
ఫిదా ఫిదా ఫిదా ఫిదా నీకే హే...
ఓ ఫిదా ఫిదా ఫిదా ఫిదా నీకే నీకే
పదే పదే ఒకే రొదే మాటే
ఫిదా ఫిదా ఫిదా ఫిదా నీకే హే...
చిత్రం: సిద్దు ఫ్రమ్ సికాకుళం (2008)
సంగీతం: కె.యమ్. రాధాకృష్ణన్
సాహిత్యం: పెద్దాడ మూర్తి
గానం: గాయత్రి
పల్లవి:
తెల్లరిపోనీకు ఈ రేయిని
చేజారిపోనీకు ఈ హాయిని
మనసు కనక మనవి వినక
చలికి మరి దూరాన ఉంటే ఎలా
తెల్లరిపోనీకు ఈ రేయిని
చేజారిపోనీకు ఈ హాయిని
చరణం: 1
ఆ నింగి జాబిలమ్మ తొడుగానే ఉందిగా
చుక్కే నీదంటు పక్కే రమ్మంటే చూస్తావే అలా
తెల్లరిపోనీకు ఈ రేయిని
చేజారిపోనీకు ఈ హాయిని
చరణం: 2
ఏమంత లేనిదాన్ని కానిదాన్ని కానుగా
ఇలా చీ పో లు పై పై కోపాలు నాపై నీకిలా
తెల్లరిపోనీకు ఈ రేయిని
చేజారిపోనీకు ఈ హాయిని
మనసు కనక మనవి వినక
చలికి మరి దూరాన ఉంటే ఎలా
తెల్లరిపోనీకు ఈ రేయిని
చేజారిపోనీకు ఈ హాయిని
Sarasangi Rathanangi Song Lyrics in Telugu – Siddu From Srikakulam (2008)
'Sarasangi Rathanangi' song from Siddu From Srikakulam (2008) movie is composed by K. M. Radha Krishnan and sung by N. C. Karunya.
చిత్రం: ఆర్య-2 (2009)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: బాలాజి
గానం: కెకె
ఉప్పెనంత ఈ ప్రేమకీ గుప్పెడంత గుండె ఏమిటో
చెప్పలేని ఈ హాయికీ భాషే ఎందుకో
తీయనైన ఈ బాధకీ ఉప్పు నీరు కంట దేనికో
రెప్పపాటు దూరానికే విరహం ఎందుకో
ఓ నిన్ను చూసే ఈ కళ్ళకీ లోకమంత ఇంక ఎందుకో
రెండు అక్షరాల ప్రేమకీ ఇన్ని శిక్షలెందుకో
I Love You... నా ఊపిరి ఆగిపోయినా
I Love You... నా ప్రాణం పోయినా
I Love You... నా ఊపిరి ఆగిపోయినా
I Love You... నా ప్రాణం పోయినా
ఉప్పెనంత ఈ ప్రేమకీ గుప్పెడంత గుండె ఏమిటో
చెప్పలేని ఈ హాయికీ భాషే ఎందుకో
కనులలోకొస్తావు కలలు నరికేస్తావు
సెకనుకోసారైనా చంపేస్తావూ
మంచులా ఉంటావు మంట పెడుతుంటావు
వెంటపడి నా మనసు మసి చేస్తావూ
తీసుకుంటె నువ్వు ఊపిరీ పోసుకుంట ఆయువే చెలీ
గుచ్చుకోకు ముళ్ళులా మరీ గుండెల్లో సరా సరీ !
I Love You... నా ఊపిరి ఆగిపోయినా
I Love You... నా ప్రాణం పోయినా
ఉప్పెనంత ఈ ప్రేమకీ గుప్పెడంత గుండె ఏమిటో
చెప్పలేని ఈ హాయికీ భాషే ఎందుకో
చినుకులే నిను తాకీ మెరిసిపోతానంటే
మబ్బులే పోగేసి కాల్చెయ్యనా
చిలకలే నీ పలుకూ తిరిగి పలికాయంటే
తొలకరే లేకుండా పాతెయ్యనా
నిన్ను కోరి పూలు తాకితే నరుకుతాను పూలతోటనే
నిన్ను చూస్తే ఉన్న చోటనే తోడేస్తా ఆ కళ్ళనే !
I Love You... నా ఊపిరి ఆగిపోయినా
I Love You... నా ప్రాణం పోయినా
I Love You... నా ఊపిరి ఆగిపోయినా
I Love You... నా ప్రాణం పోయినా
ఉప్పెనంత ఈ ప్రేమకీ గుప్పెడంత గుండె ఏమిటో
చెప్పలేని ఈ హాయికీ భాషే ఎందుకో
Baby He Loves You Song Lyrics in Telugu – Arya 2 (2009)
'Baby He Loves You' song from Arya 2 (2009) movie is composed by Devi Sri Prasad and sung by Devi Sri Prasad.
చిత్రం: ఆర్య-2 (2009)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: చంద్రబోస్
గానం: దేవి శ్రీ ప్రసాద్
ఛ… వాడికి నా మీద ప్రేమే లేదు హి డసంట్ లవ్ మి యు నో
నో హి లవ్స్ యు, హి లవ్స్ యు సో మచ్
అవునా ఎంత? ఊ... ఎంతంటే
ఆ మొదటి సారి నువ్వు నన్ను చూసినప్పుడు కలిగినట్టి కోపమంత
మొదటి సారి నేను మాట్లాడినప్పుడు పెరిగినట్టి ద్వేషమంత
మొదటి సారి నీకు ముద్దు పెట్టినప్పుడు జరిగినట్టి దోషమంత
చివరిసారి నీకు నిజం చెప్పినపుడు తీరినట్టి భారమంత
ఓ... ఇంకా...
హో తెల్ల తెల్లవారి పల్లెటూరిలోన
అల్లుకున్న వెలుగంత
పిల్ల లేగదూడ నోటికంటుకున్న ఆవు పాల నురగంత
హో చల్ల బువ్వలోన నంజుకుంటు తిన్న ఆవకాయ కారమంత
పెళ్లి ఈడుకొచ్చి తుళ్ళి ఆడుతున్న ఆడపిల్ల కోరికంత
బేబీ హి లవ్స్ యు, లవ్స్ యు, లవ్స్ యు సో మచ్
బేబీ హి లవ్స్ యు, లవ్స్ యు, లవ్స్ యు సో మచ్
హే అందమైన నీ కాలి కింద తిరిగే నేలకున్న బరువంత
నీలి నీలి నీ కళ్ళలోన మెరిసే నింగికున్న వయసంత
చల్లనైన నీ శ్వాసలోన తోణికే గాలికున్న గతమంతా
చుర్రుమన్న నీ చూపులోన ఎగసే నిప్పులాంటి నిజమంత
బేబీ హి లవ్స్ యు, లవ్స్ యు, లవ్స్ యు సో మచ్
బేబీ హి లవ్స్ యు, లవ్స్ యు, లవ్స్ యు సో మచ్
హాయ్ పంటచేలలోని జీవమంత ఘంటసాల పాట భావమంత
పండగొచ్చినా పబ్బమోచ్చినా వంటశాలలోని వాసనంత
కుంభకర్ణుడి నిద్దరంత ఆంజనేయుడి ఆయువంత
కృష్ణ మూర్తిలో లీలలంత రామలాలి అంత
బేబీ హి లవ్స్ యు, లవ్స్ యు, లవ్స్ యు సో మచ్
బేబీ హి లవ్స్ యు, లవ్స్ యు, లవ్స్ యు సో మచ్
పచ్చి వేప పుల్ల చేదు అంత రచ్చబండ పైన వాధనంత
అర్ధమైన కాకపోయినా భక్తికొద్ది విన్న వేదమంత
ఏటి నీటిలోని జాబిలంత ఏట ఏట వచ్చే జాతరంత
ఏకపాత్రలో నాటకాలలో నాటు గోలలంత
బేబీ హి లవ్స్ యు, లవ్స్ యు, లవ్స్ యు సో మచ్
బేబీ హి లవ్స్ యు, లవ్స్ యు, లవ్స్ యు సో మచ్
అల్లరెక్కువైతే కన్నతల్లి వేసే మొట్టికాయ చనువంత
జల్లుపడ్డ వేళ పొంగి పొంగి పూసే మట్టిపూల విలువంత
హో బిక్కు బిక్కు మంటు పరీక్ష రాసే పిల్లగాడి బెదురంత
లక్షమందినైన సవాలు చేసే ఆటగాడి పొగరంత
బేబీ హి లవ్స్ యు, లవ్స్ యు, లవ్స్ యు సో మచ్
బేబి బేబీ హి లవ్స్ యు, లవ్స్ యు, లవ్స్ యు టూ మచ్
ఎంత దగ్గరైన నీకు నాకు మధ్య ఉన్న అంతులేని దూరమంత
ఎంత చేరువైన నువ్వు నేను కలిసి చేరలేని తీరమంత
ఎంత ఓర్చుకున నువ్వు నాకు చేసే జ్ఞాపకాల గాయమంత
ఎంత గాయమైన హాయిగానే మార్చే మా తీపి స్నేహమంత
బేబీ హి లవ్స్ యు, లవ్స్ యు, లవ్స్ యు సో మచ్
బేబీ హి లవ్స్ యు, లవ్స్ యు, ఐ లవ్ యు సో మచ్
Ringa Ringa Song Lyrics in Telugu – Arya 2 (2009)
'Ringa Ringa' song from Arya 2 (2009) movie is composed by Devi Sri Prasad and sung by Priya Himesh.
చిత్రం: ఆర్య-2 (2009)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: వనమాలి
గానం: కునల్ గంజువాలా, మేఘా
ఓ... ఓ... ఓ... ఓ...
ఓ... ఓ... ఓ... ఓ...
కరిగేలోగా ఈ క్షణం గడిపెయ్యాలి జీవితం
శిలగా మిగిలే నా హృదయం సాక్షిగా
కనులై పోయే సాగరం అలలై పొంగే జ్ఞాపకం
కలలే జారే కన్నీరే చేరగా
గడిచే నిమషం గాయమై ప్రతి గాయం ఓ గమ్యమై
ఆ గమ్యం నీ గురుతుగా నిలిచే నా ప్రేమా
కరిగేలోగా ఈ క్షణం గడిపెయ్యాలి జీవితం
శిలగా మిగిలే నా హృదయం సాక్షిగా
కనులై పోయే సాగరం అలలై పొంగే జ్ఞాపకం
కలలే జారే కన్నీరే చేరగా
ఓ... ఓ... ఓ... ఓ...
పరుగులు తీస్తూ అలసిన ఓ నది నేను
ఇరుతీరాల్లో దేనికి చేరువ కాను
నిదురను దాటి నడిచిన ఓ కల నేను
ఇరుకన్నుల్లో దేనికి సొంతం కాను
నా ప్రేమే నేస్తం అయ్యిందా ఓ
నా సగమేదో ప్రశ్నగ మారిందా ఓ
నేడీ బంధానికి పేరుందా ఓ
ఉంటే విడదీసే వీలుందా ఓ
కరిగేలోగా ఈ క్షణం గడిపెయ్యాలి జీవితం
శిలగా మిగిలే నా హృదయం సాక్షిగా
కనులై పోయే సాగరం అలలై పొంగే జ్ఞాపకం
కలలే జారే కన్నీరే చేరగా
హే... హే... హే... హే...
హే... హే... హే... హే... హే... హే
అడిగినవన్నీ కాదని పంచిస్తూనే
మరునిముషంలో అలిగే పసివాడివిలే
నీ పెదవులపై వాడని నవ్వుల పువ్వే
నువు పెంచవా నీ కన్నీటిని చల్లి
సాగే మీ జంటని చూస్తుంటే ఓ
నా బాధంతటి అందంగా ఉందే ఓ
ఈ క్షణమే నూరేళ్ళవుతానంటే ఓ
మరుజన్మే క్షణమైనా చాలంతే ఓ
కరిగేలోగా ఈ క్షణం గడిపెయ్యాలి జీవితం
శిలగా మిగిలే నా హృదయం సాక్షిగా
కనులై పోయే సాగరం అలలై పొంగే జ్ఞాపకం
కలలే జారే కన్నీరే చేరగా
గడిచే నిమషం గాయమై ప్రతి గాయం ఓ గమ్యమై
ఆ గమ్యం నీ గురుతుగా నిలిచే నా ప్రేమ
ఓ... ఓ... ఓ... ఓ...
ఓ... ఓ... ఓ... ఓ...
My Love Is Gone Song Lyrics in Telugu – Arya 2 (2009)
'My Love Is Gone' song from Arya 2 (2009) movie is composed by Devi Sri Prasad and sung by K. G. Ranjith.
చిత్రం: ఆర్య-2 (2009)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: చంద్రబోస్
గానం: కె. జి. రంజిత్
మై లవ్ ఈజ్ గాన్ మై లవ్ ఈజ్ గాన్
మై లవ్ ఈజ్ గాన్ మై లవ్ ఈజ్ గాన్
పోయే పోయే లవ్వే పోయే పోతే పోయిందే
ఇట్స్ గాన్ ఇట్స్ గాన్ ఇట్స్ గాన్ మై లవ్ ఈజ్ గాన్
పోయే పోయే లడికీ పోయే పోతే పోయిందే
ఇట్స్ గాన్ ఇట్స్ గాన్ ఇట్స్ గాన్ మై లవ్ ఈజ్ గాన్
వెలుగంతా ఆరిపోయే కథ మారిపోయే
ఇక చీకటెంత బాగుందే
గెలుపంతా జారిపోయే నన్ను వీడిపోయే
ఇక ఓటమెంత బాగుందే
మై లవ్ ఈజ్ గాన్ మై లవ్ ఈజ్ గాన్
మై లవ్ ఈజ్ గాన్ మై లవ్ ఈజ్ గాన్
ఏ గలాసు వదిలిపోతుందే గొలుస్సు విరిగిపోతుందే
గులాబి రాలిపోతుందే లవ్ పోతే పోయిందే
సరస్సు నిండిపోతుందే సోగస్సు కరిగిపోతుందే
మనిషి లైఫే పోతుందే లవ్ పోతే పోయిందే
తలనొప్పి పారిపోయే శ్రమ తీరిపోయే
ఇక శూన్యమెంత బాగుందే
మది నొప్పి ఆరిపోయే పెదవాగిపోయే
ఇక మౌనమెంత బాగుందే...
మై లవ్ ఈజ్ గాన్ మై లవ్ ఈజ్ గాన్
మై లవ్ ఈజ్ గాన్ మై లవ్ ఈజ్ గాన్
హానెస్టుగుండే పనిలేదే ది బెస్టుగుండే పనిలేదే
హాబిట్సు మార్చే పనిలేదే ఏం మార్చే పనిలేదే
కెమిస్ట్రి కలిసే పనిలేదే కెరియరు మలిచే పనిలేదే
కెరాఫ్ తెలిపే పనిలేదే కేరింగ్తో పనిలేదే
ప్రేమించి గెలిచినోళ్ళు షాది జరిగినోళ్ళు ఇళ్ళల్లోనా మిగులుతారే
లవ్ చేసి ఓడినోడు లోకాన్నేలుతాడు హిస్టరీలోన వెలుగుతాడే...
మై లవ్ ఈజ్ గాన్ మై లవ్ ఈజ్ గాన్
మై లవ్ ఈజ్ గాన్ మై లవ్ ఈజ్ గాన్
Karige Loga (D-Plugged) Song Lyrics in Telugu – Arya 2 (2009)
'Karige Loga (D-Plugged)' song from Arya 2 (2009) movie is composed by Devi Sri Prasad and sung by Sagar.
చిత్రం: ఆర్య-2 (2009)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: వనమాలి
గానం: సాగర్
కరిగేలోగా ఈ క్షణం గడిపెయ్యాలి జీవితం
శిలగా మిగిలే నా హృదయం సాక్షిగా
కనులై పోయే సాగరం అలలై పొంగే జ్ఞాపకం
కలలే జారే కన్నీరే చేరగా
గడిచే నిమషం గాయమై ప్రతి గాయం ఓ గమ్యమై
ఆ గమ్యం నీ గురుతుగా నిలిచే నా ప్రేమా
కరిగేలోగా ఈ క్షణం గడిపెయ్యాలి జీవితం
శిలగా మిగిలే నా హృదయం సాక్షిగా
కనులై పోయే సాగరం అలలై పొంగే జ్ఞాపకం
కలలే జారే కన్నీరే చేరగా
ఓ... ఓ... ఓ... ఓ...
పరుగులు తీస్తూ అలసిన ఓ నది నేను
ఇరుతీరాల్లో దేనికి చేరువ కాను
నిదురను దాటి నడిచిన ఓ కల నేను
ఇరుకన్నుల్లో దేనికి సొంతం కాను
నా ప్రేమే నేస్తం అయ్యిందా ఓ
నా సగమేదో ప్రశ్నగ మారిందా ఓ
నేడీ బంధానికి పేరుందా ఓ
ఉంటే విడదీసే వీలుందా ఓ
కరిగేలోగా ఈ క్షణం గడిపెయ్యాలి జీవితం
శిలగా మిగిలే నా హృదయం సాక్షిగా
కనులై పోయే సాగరం అలలై పొంగే జ్ఞాపకం
కలలే జారే కన్నీరే చేరగా
ఓ... ఓ... ఓ... ఓ...
Mr. Perfect (DSP Mix) Song Lyrics in Telugu – Arya 2 (2009)
'Mr. Perfect (DSP Mix)' song from Arya 2 (2009) movie is composed by Devi Sri Prasad and sung by Devi Sri Prasad.