-->
Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "V. Anand Prasad"



చిత్రం: చెక్ (2021)
సంగీతం: కళ్యాణి మాలిక్
నటీనటులు: నితిన్, రకుల్ ప్రీత్ సింగ్ , ప్రియా ప్రకాష్ వేరియర్
దర్శకత్వం: చంద్రశేఖర్ యేలేటి
నిర్మాత: వి.ఆనంద్ ప్రసాద్ 
విడుదల తేది: 26.02.2021



Songs List:



నిన్ను చూడకుండ పాట సాహిత్యం

 
చిత్రం: చెక్ (2021)
సంగీతం: కళ్యాణి మాలిక్
సాహిత్యం: శ్రీమణి
గానం: హరి చరణ్, శక్తి శ్రీ గోపాలన్

పల్లవి:
నిన్ను చూడకుండ ఉండలేక పోతున్నాను
నిన్ను చూడకుండ ఉండలేక పోతున్నాను
మార్నింగ్ అవ్వకముందే వెలుగులతో వచ్చేస్తాను
ఫుల్ మూన్ లేకుండానే వెన్నెల్లో ముంచేస్తాను
అడ్డులకింక చెక్ చెక్
హద్దులకింకా చెక్ చెక్
స్టాపే లేని లోకం లోన

నిన్ను చూడకుండ ఉండలేక పోతున్నాను
నిన్ను చూడకుండ ఉండలేక పోతున్నాను

చరణం: 1
తేది మారని సమయం ఆగని
రోజేదో పుట్టించనా
నిన్నే చూడని నిమిషం ఉండని
చోటేదో సృష్టించన
కనురెప్పలే మూసుంచినా తీసుంచినా
నా కళ్ళకే ఏ గంతలో వేసుంచినా

చరణం: 2
చూపే ఓ కలిపి మౌనం ఇంకొలిపి
ఎన్నెన్ని భాషలో
నడిచే కోణమే నిలిచే వైనమో
ఎన్నెన్ని వరసలో
ఏ భాషలో నే పలికినా పలికించినా
ప్రతి మాటలో నీ పేరునే
వినిపించనా

నిన్ను చూడకుండ ఉండలేక పోతున్నాను
మార్నింగ్ అవ్వకముందే వెలుగులతో వచ్చేస్తాను
ఫుల్ మూన్ లేకుండానే వెలుగుల్లో ముంచేస్తాను
అడ్డులకింక చెక్ చెక్
హద్దులకింకా చెక్ చెక్
స్టాపే లేని లోకం లోన

నిన్ను చూడకుండ ఉండలేక పోతున్నాను
నిన్ను చూడకుండ ఉండలేక పోతున్నాను


Palli Balakrishna Wednesday, February 17, 2021



చిత్రం: శౌర్యం (2008)
సంగీతం: మణిశర్మ
నటీనటులు: గోపిచంద్ , అనుష్క , పూనమ్ కౌర్
మాటలు ( డైలాగ్స్ ): యమ్. రత్నం
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: సిరుతై శివ
నిర్మాత: వి. ఆనంద ప్రసాద్
సినిమాటోగ్రాఫీ: వెట్రీ
ఎడిటర్: మార్తాండ్ కె.వెంకటేష్
బ్యానర్: భవ్య క్రియేషన్స్
విడుదల తేది: 25.09.2008


చిత్రం:  శౌర్యం (2008)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: దీపు , మాళవిక

బుగ్గల్లోన భూకంపం ఒళ్ళంతా చలి రంపం
బుగ్గల్లోన భూకంపం ఒళ్ళంతా చలి రంపం
నువ్వు తాకితే తీగ లాగితే
నరనరాన్నిలా వీణ మీటితే
మరుడా మన్మధ గురుడా
మొదలయ్యిందేదో తేడా
నా తలపుల్లోన తలగడ పైన నీదేరా నీడ

బుగ్గల్లోన భూకంపం ఒళ్ళంతా చలి రంపం

నీలాగుండే మగవాడే నాక్కావాలంటూ కలగన్నా
తీరా నువ్వే ఎదురొస్తున్నా ఏంటో కంగారవుతున్నా
గిచ్చాయండి గిలిగింతయ్యే మాయాజాలం చూస్తూన్నా
రంగులు మారే బంగారంలా నీకే నిను చూపిస్తున్నా
అమ్మో నీ వల్లేనా  అమ్మాయైపోతున్నా
అందం అందిస్తాలే హైరానా పడుతున్నా
చెయ్యారా లాలిస్తూ నీ బిడియాన్ని పక్కకు నెడుతున్నా

కలిసేదాక నాలో ఉంది నువ్వేనంటూ  తెలియదుగా
కన్నులు మూసి గుండెల్లోకి ఎపుడొచ్చావో అల్లరిగా
ఇదిగో చూడు వచ్చానంటూ ప్రేమే నీకు చెప్పదుగా
తనకై తాను కనిపించందే ఏ మనసు గుర్తించదుగా
అంటే నేనిన్నాళ్లు నాలో నిన్ను మోసానా
నువ్వేంటో తెలియందే నీతో గడిపేశానా
నువునేను పుట్టక ముందే ఈ బంధం కలిసిందే మైనా

బుగ్గల్లోన భూకంపం ఒళ్ళంతా చలి రంపం
నువ్వు తాకితే తీగ లాగితే
నరనరాన్నిలా వీణ మీటితే
మరుడా మన్మధ గురుడా
మొదలయ్యిందేదో తేడా
నా తలపుల్లోన తలగడ పైన నీదేరా నీడ




Palli Balakrishna Thursday, January 18, 2018
Wanted (2011) Telugu Songs Lyrics Album Cover

Wanted (2011) Telugu Songs Lyrics

MOVIE DETAILS
Movie : Wanted (2011)
Music : Chakri
Director : B. V. S. Ravi
Producer : V. Ananda Prasad
Actors : Gopichand
Actresses : Deeksha Seth
Release Date : 26 January 2011

Arakilo Pogaru Song Lyrics in Telugu – Wanted (2011)

'Arakilo Pogaru' song from Wanted (2011) movie is composed by Chakri and sung by Ranjith.

SONG INFORMATION
Movie : Wanted (2011)
Music : Chakri
Singers : Ranjith
చిత్రం: వాంటెడ్ (2011) సంగీతం: చక్రి సాహిత్యం: భాస్కరభట్ల గానం: రంజిత్ అరకిలో పోగరు

Yevo Pichhi Veshalu Song Lyrics in Telugu – Wanted (2011)

'Yevo Pichhi Veshalu' song from Wanted (2011) movie is composed by Chakri and sung by Javed Ali.

SONG INFORMATION
Movie : Wanted (2011)
Music : Chakri
Singers : Javed Ali
చిత్రం: వాంటెడ్ (2011) సంగీతం: చక్రి సాహిత్యం: భాస్కరభట్ల గానం: జావేద్ అలీ పల్లవి: ఎవో పిచ్చి వేషాలు, చిలిపి వేషాలు మనసు వేస్తోందిలే ఏంటో కా గుణింతాలు గుర్తుకే రావు మరచిపోయానులే ఏదో ఆలోచిస్తూనే ఏదో చేస్తున్నా ఏం చేస్తున్నా ఊహల్లో నిన్నే చూస్తున్నా అవునో కాదో నిజమే నేమో పడిపోయానా L O V E ‌లో లాయి లాయి లల్లల్లాయి నచ్చేసావే పావురాయి లాయి లాయి లల్లల్లాయి నీవల్లేగా ఇంత హాయి చరణం : 1 కంటి చూపుతో కత్తి గాటులే వంటినిండా పెట్టేశావు తెలుసా చిన్న నవ్వుతో చిట్టి గుండెనే బొంగరాలు తిప్పేశావు తెలుసా తేనె పట్టులా పట్టేసుకున్నావే కొండశిలువలా చుట్టేసుకున్నావే మాయో మాయో ఏంటో ఈ తికమక నేను ఏంటి, లవ్ లో ఏంటి, పడ్డం ఏంటి మాయో ఒక్కసారి నిన్ను చూసినందుకే కంటిపాప జన్మ ధన్యమే చరణం: 2 రంగు రంగుల చేపపిల్లలా తుళ్ళుతుంది మాయదారి మనసు బుజ్జగించినా జోలపాడినా అల్లరింక ఆపదని తెలుసూ బుట్టబొమ్మలా ముద్దొస్తూ ఉన్నావే చెట్టు కొమ్మలా నన్నూపేస్తున్నావే నాలో నువ్వే చేరి నన్నొదలవే నిన్న మొన్న లేదు గాని ఇవ్వాలేంటి ఇట్టా మాయ నీ పేరు చెప్పగానే ప్రాణవాయువే అందుతోంది కొత్త ఆశకి ఎవో పిచ్చి వేషాలు, చిలిపి వేషాలు మనసు వేస్తోందిలే ఏంటో కా గూడింతాలు గుర్తుకే రావు మరచిపోయానులే

Dil Mera Dhak Dhak Song Lyrics in Telugu – Wanted (2011)

'Dil Mera Dhak Dhak' song from Wanted (2011) movie is composed by Chakri and sung by Udit Narayan and Smita.

SONG INFORMATION
Movie : Wanted (2011)
Music : Chakri
Singers : Udit Narayan, Smita
చిత్రం: వాంటెడ్ (2011) సంగీతం: చక్రి సాహిత్యం: భాస్కరభట్ల గానం: ఉదిత్ నారాయణ్, స్మిత దిల్ మేరా ధక్ ధక్

Cheppana Cheppana Song Lyrics in Telugu – Wanted (2011)

'Cheppana Cheppana' song from Wanted (2011) movie is composed by Chakri and sung by Chakri and Kousalya.

SONG INFORMATION
Movie : Wanted (2011)
Music : Chakri
Singers : Chakri, Kousalya
చిత్రం: వాంటెడ్ (2011) సంగీతం: చక్రి సాహిత్యం: భాస్కరభట్ల గానం: చక్రి, కౌశల్య చెప్పనా చెప్పనా నా కన్నా ఇష్టం నువ్వని నువు లేక నేనే లేనని చెప్పనా చెప్పనా నా కనులకి స్వప్నం నువ్వని నాలో సగ భాగం నువ్వని మనసంటుంది నీతోడు కావాలని నీతో నిండు నూరేళ్లు సాగాలని ప్రాణమే నువ్వని చెప్పనా - చెప్పనా నా కనులకి స్వప్నం నువ్వని నువు లేక నేనే లేనని నీ చూపు నాపై ప్రసరించని నీ ఊహ నాలో ప్రవహించని గుండెలో కొత్తగా ఏమిటీ బరువని అడిగితే అన్నది నువ్వు నిండావని నా చేతి గీత నువ్వేనని నీ వల్లే రాత మారిందని దేవతే నువ్వని చెప్పనా చెప్పనా నా కన్నా ఇష్టం నువ్వని నువు లేక నేనే లేనని నీ నవ్వుల్లోన నది ఉందని మది అందులోన మునిగిందని నలుగురు ఎదురయి అడిగితే చెప్పని అరుదుగా దొరికిన కానుకే నువ్వని వదిలుండలేను నీ చేయిని దాచుంచలేను ఈ మాటని లోకమే నువ్వని చెప్పనా చెప్పనా నా కన్నా ఇష్టం నువ్వని నువు లేక నేనే లేనని చెప్పనా చెప్పనా నా కనులకి స్వప్నం నువ్వని నాలో సగ భాగం నువ్వని మనసంటుంది నీతోడు కావాలని నీతో నిండు నూరేళ్లు సాగాలని ప్రాణమే నువ్వని

A for Angel Song Lyrics in Telugu – Wanted (2011)

'A for Angel' song from Wanted (2011) movie is composed by Chakri and sung by Krishna Chaitanya and M. M. Sreelekha.

SONG INFORMATION
Movie : Wanted (2011)
Music : Chakri
చిత్రం: వాంటెడ్ (2011) సంగీతం: చక్రి సాహిత్యం: భాస్కరభట్ల గానం: కృష్ణ చైతన్య, ఎం. ఎం. శ్రీలేఖ A ఫర్ ఏంజెల్

Palli Balakrishna


చిత్రం: సౌఖ్యం (2015)
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం: భాస్కభట్ల , రామజోగయ్య శాస్త్రి
గానం: హరిహరన్
నటీనటులు: గోపిచంద్, రెజీనా కసండ్ర,
దర్శకత్వం: ఎ. యస్.రవికుమార్ చౌదరి
నిర్మాత: వి.ఆనంద్ ప్రసాద్
విడుదల తేది: 24.12.2015

నాకేం తోచదే తోచదే
నాకేం తోచదే
నిను చూడని క్షణము కలవని నిమిషం
నాకేం తోచదే
నిను తలవని సమయం ఏదైనా
నాకేం తోచదే
నీ ప్రేమలో గడపని ఎ పూటైనా
ఏ చోట నేనున్నా నీతోనే కలిసున్నా
నీ ధ్యాస నన్ను వీడదే
నాకేం తోచదే
నిను చూడని క్షణము కలవని నిమిషం
నాకేం తోచదే
నిను తలవని సమయం ఏదైనా

మీదటిగా ఏనాడో నిన్నెలా కలిశానో
మరిచి పోలేనే ఏనాడైనా
అక్కడే ఆ చోట ఆగి నిను చూస్తున్నా
నన్ను వీడి లోకం పరుగులైన
నువ్విలాగే నాకు దొరికేస్తావంటూ
ప్రేమగా తోడుగా నేను అనుకోలేదే
మల్లెల జల్లులా నువ్వే వస్తే
మనసు తేరుకోలేదే
తీపి దాహమేదో ఇంకా తీరదే

నాకేం తోచదే తోచదే
నాకేం తోచదే
నిను చూడని క్షణము కలవని నిమిషం
నాకేం తోచదే
నిను తలవని సమయం ఏదైనా

మనసే పేపర్ పై రంగుల క్రియవై
ప్రేమనే చిత్రం గీశావే
పగటికి చీకటకి గీతలే చేరిపావే
కలలకే ప్రాణం పోశావే
నువ్వు తోడులేనిదే ఏక్షణమైనా
నన్ను చేరగా దరి రానే రాదే
నా దారి ప్రతి పేజ్ పైన పేరే నీదే
కాలమంతా నాకు చెలియా నీ కథే

నాకేం తోచదే తోచదే
నాకేం తోచదే
నిను చూడని క్షణము కలవని నిమిషం
నాకేం తోచదే
నిను తలవని సమయం ఏదైనా

Palli Balakrishna Wednesday, December 27, 2017

చిత్రం: లౌక్యం (2014)
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం: చంద్రబోస్
గానం: సింహా , రనైనా రెడ్డి
నటీనటులు: గోపిచంద్ , రకూల్ ప్రీత్ సింగ్
దర్శకత్వం: శ్రీవాస్
నిర్మాత: వి.ఆనంద్ ప్రసాద్
విడుదల తేది: 26.09.2014

అరె సిల్లీ సిల్లీగా గల్లి కుర్రోళ్లు
నా వెంట పడ్డారురా
అరె సీటి కొట్టి సిందులు వేసి
గోల గోల చేసారురో
హేయ్ బ్లాక్ అండ్ వ్హైటు సారీ లో ఉంటే
నా చుట్టు చేరారురో
హేయ్ కలరే కొట్టి కంగారు పెట్టి
రంగు రంగు చేసారురో
నిజంగానే నాకెన్నడు మజా రాలే
ప్రతి వాడు పెంచాడులే పరేషానే
ఆ చంటి ఆ బంటి ఆ కిట్టు ఆ బిట్టు
హా ఎంత మంది వెంట పడిన కొంచెమైన నచ్చలేదు..
కాని మీరు మాత్రం

సుర్రు సూపరో సు సు సు సూపరో సుర్రు సూపరో
హేయ్ సుర్రు సూపరో సు సు సు సూపరో సుర్రు సూపరో

అల్లి బిల్లి మసక్కలి నీ సొగసే సూపరే
హేయ్ గల్లి గల్లి లొల్లి లొల్లి చేసేద్దాం పదారే

హో హో హో హో ఐస్ క్రీము కే నన్నే అక్కంటారు
అరే ఎందరో ఎందరో పురుషులు
అయిస్కాంతంకే నన్నే చెల్లంటారు
అరే ఎందరో ఎందరో సరసులు..
అరెరే మసాలా కే మరదలు నువ్వే
కారానికి కూతురు నువ్వే
అది మాకు నీకు నీకు మాకు
సింక్ అయ్యి లింక్ అయిపోతే..

సుర్రు సూపరో సు సు సు సూపరో సుర్రు సూపరో
హేయ్ సుర్రు సూపరో సు సు సు సూపరో సుర్రు సూపరో

హోయ్ హో హో హో హో హో హో ఘాగ్ర ఛోళే మనం ఏసామంటే
జనం గోలలే గోలలే ఈలలే ఈలలే
స్కిన్ టైటులో మనం ఎంట్రీ ఇస్తే
జనం సైగలే సైగలే సైగలే
అరెరే మిడ్డీలో నువ్వే అడ్డొస్తే
గుండె హెడ్‌లైటే పగిలిందిలే..
అరె మదిలో నుంచి గదిలోకొస్తే
గదికే లాకే పడితే..

సుర్రు సూపరో సు సు సు సూపరో సుర్రు సూపరో
హేయ్ సుర్రు సూపరో సు సు సు సూపరో సుర్రు సూపరో



*********  *********  *********


చిత్రం: లౌక్యం (2014)
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం: అనంత్ శ్రీరామ్
గానం: విజయ్ ప్రకాష్ , మోహన భోగరాజ్

నానా నాన నాన నానానా నానానా
నానా నాన నాన నానానా నానానా
నననననన నననననననన
హో నిన్ను చూడగానే నాకేదో అయ్యిందే
ఉన్నట్టుండి ప్రాణం నీ వైపే లాగిందే
నిన్ను చూడగానె నాకేదో అయ్యిందే ఆహా..
ఉన్నట్టుండి ప్రాణం నీ వైపే లాగిందే ఆ..
ఎపుడైతే నువ్వలా కనిపించావో ఇలా
మొదలైంది ఈ గుండెలో67 న గోల
ఎదురుగా నువ్వేలే వెనకనా నువ్వేలే
పక్కన నువ్వేలే నా చుట్టూ నువ్వేలే
హో.. నిన్ను చూడగానె నాకేదో అయ్యిందే ఆహా..
ఉన్నట్టుండి ప్రాణం నీ వైపే లాగిందే ఆ..
నననననన నననననననన

ఓహ్ చూపులో సూదున్నాదే కళ్లలో మందున్నాదే
సూది మందేదో ఇచ్చావే
హో నవ్వుతోనే నువ్వు గాలాలు వేస్తే
చేపలాగా చిక్కినాదే మది
బాపురే నీ రంగు బంగారం కదే
గుర్తుకొస్తున్నాదె తెల్లార్లూ అదే..
ఎలా నీకు దూరంగా నేనుండనే..
ఎదురుగా నువ్వేలే వెనకనా నువ్వేలే
పక్కన నువ్వేలే నా చుట్టూ నువ్వేలే
హో.. నిన్ను చూడగానె నాకేదో అయ్యిందే
ఉన్నట్టుండి ప్రాణం నీ వైపే లాగిందే

హో హో హో.. ఎందరో ఎదురయ్యారే ఒక్కరూ నీలా లేరే
నిన్ను మించే అందం నీదే
హో.. చేతికందే లాగ నువ్వుండి ఉంటే
ఎంతకందేవోనె ఆ చెంపలు
ఆగలేనే నేను నిన్నే చేరాకా
ఖచ్చితంగా ఉండలేనే వేరుగా
ఎలా నిన్ను పొందాలో ఏమో మరి
ఎదురుగా నువ్వెలె వెనకన నువ్వెలె
పక్కన నువ్వెలె నా చుత్తు నువ్వెలె
ఎదురుగా నువ్వేలే వెనకనా నువ్వేలే
పక్కన నువ్వేలే నా చుట్టూ నువ్వేలే
హో.. నిన్ను చూడగానె నాకేదో అయ్యిందే
ఉన్నట్టుండి ప్రాణం నీ వైపే లాగిందే
నానా నాన నాన నానానా నానానా
నానా నాన నాన నానానా నానానా


*********  *********  *********


చిత్రం: లౌక్యం (2014)
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం: శ్రీమణి
గానం: జస్ప్రీత్ జస్జ్ , సాహితి

పింక్ లిప్స్.. పింక్ లిప్స్..
పింక్ లిప్స్ అమ్మాయివే.. బ్లాక్ ఐస్ బుజ్జాయివే
స్వీటుగా పెదాలతో హాటుగా టచ్ ఇయ్యవే
కత్తిలాంటబ్బాయివే లౌక్యమే ఉన్నోడివే
క్లెవరుగా నన్నే నువ్వే లవరులా మార్చేసావే
బ్యాగు సర్దుకోవే నువ్వు గాగుల్సు పెట్టుకోవే
వెయ్యి కళ్ళకైన దక్కకుండ నక్కి నక్కి రా నువ్వే
హేయ్ డుర్రుమంటు బైకు ఎక్కి లవ్వు రైడు చేద్దామే
హేయ్ గర్రుమంటు మైకు పట్టి ప్రేమ పాట పాడుదామే

పింక్ లిప్స్.. పింక్ లిప్స్..
ఎన్నో కొత్త ఫీలింగ్సే ఏవో కలల ఫ్రేమింగ్సే
కళ్ళల్లోన చిక్కుకొని సెటిల్ అయిపోయాయే
ఒ చెలియా చిలిపి డ్రీమింగ్సే లవ్వు స్ట్రీమింగ్సే
ప్రతి చోట మననే చూసాయే చూసాయే
మన లవ్వు మ్యాటరు బ్రేక్ ద రూల్స్ అవ్వనీ
మన ప్యారు మీటరు బ్రేకింగ్ న్యూస్ అవ్వనీ
హేయ్ చానెల్సు రెచ్చిపోనీ వాలు పోస్టర్లు వేసుకొనీ
ఫేసుబుక్కు లోన గూగుల్ లోన నువ్వు నేను జంటనీ..
డుర్రుమంటు బైకు ఎక్కి లవ్వు రైడు చేద్దామే
హేయ్ గర్రుమంటు మైకు పట్టి ప్రేమ పాట పాడుదామే

నీతో వేడిగా సల్సా దిల్ సే జోరుగా జల్సా
ఒక క్షణం నిన్ను విడి ఉండనిదీ వరుసా వరుసా..
ఓహ్ మెల్లగా రెక్కలెగరేసా మతి పోయి చూసా
మైకం లో ఉన్నాలే బహుషా..
మన హార్టు బీటులో ఉంది లవ్వు సింఫొనీ
మన పల్సు రేటులే కొత్త గిటారులే
గాల్లోన ఈదినట్టు నేను నీళ్ళల్లొ ఎగిరినట్టు
కొత్త యూనివర్సులోన అడుగు పెట్టినట్టు ఉందిలే..
డుర్రుమంటు బైకు ఎక్కి లవ్వు రైడు చేద్దామే
హేయ్ గర్రుమంటు మైకు పట్టి ప్రేమ పాట పాడుదామే
ఓహ్ పింక్ లిప్స్ ఓహ్ పింక్ లిప్స్ ఓహ్ పింక్ లిప్స్ అమ్మాయివే
బ్లాక్ ఐస్ బుజ్జాయివే..
డుర్రుమంటు బైకు ఎక్కి లవ్వు రైడుకెళ్దామే ఎ.. ఎ.. ఎ.. ఎ..


*********  *********  *********


చిత్రం: లౌక్యం (2014)
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: ధనుంజయ , రమ్యా బెహ్రా

ఓ సావరియా.. సావరియా.. హా

సూడు సూడు సూడు సూడు సూడు సూడు
ఇటు సూడు సూడు సూడు సూడు సూడు
పెట్టుకొని ప్రేమ రంగు కళ్ళ జోడు
అరె నాలో ఉన్న ప్రేమికుడ్ని సూడు
చిన్నదాన చినదానా సన్నజాజి చినదాన
నిన్ను నువ్వే చూసుకోవే నాలోనా.. హా
చిన్నదాన చినదానా ఊపిరల్లే ఉన్నదానా
నీ సక్కనోడై పక్కనుండే కలగన్నా
వెలుగే వద్దన్నా ఆ సూర్యున్ని పొమ్మన్నా
నీతో నేనున్నా వెన్నెలింకెందుకంటున్నా
సావరియా.. సావరియా..
సీతాకోకల్లే యెదపైన వాలావే చెలియా..
సూడు సూడు సూడు సూడు సూడు సూడు
ఇటు సూడు సూడు సూడు సూడు సూడు
పెట్టుకొని ప్రేమ రంగు కళ్ళ జోడు
అరె నాలో ఉన్న ప్రేమికుడ్ని సూడు

ఓ.. ఓ.... సందెపొద్దు సమయాన సన్న నడుము పైపైన
నీ చేయి తడిమే రోజు కోసం చూస్తున్న
అరెరే పిల్లా నీలాగ నేనున్నా
అదిరే వేడి లోలోనె దాస్తున్నా
కంటి సైగై కానా కౌగిలింతై రానా
కానుకిస్తే కాదంటానా... హా
సావరియా.. సావరియా..
సీతాకోకల్లే యెదపైన వాలావే చెలియా..
సూడు సూడు సూడు సూడు సూడు సూడు
ఇటు సూడు సూడు సూడు సూడు సూడు

ఓ.. ఓ.... సోకుముక్కే నేనంట నీ వెంట వెంటే జన్మంతా
అంటుకట్టి అంటిపెట్టి నేనుంటా
అమ్మడూ.. నేనే నీ చేతి గీతంటా
విడిపోనంటా వందేళ్ల చివరంటా
పల్లకి తెమ్మంటా పండగే చెయ్యమంటా
తీర్చుకుంటా నీ ముచ్చటా.. హా
సావరియా.. సావరియా..
సీతాకోకల్లే యెదపైన వాలావే చెలియా..
సూడు సూడు సూడు సూడు సూడు సూడు
ఇటు సూడు సూడు సూడు సూడు సూడు
పెట్టుకొని ప్రేమ రంగు కళ్ళ జోడు
అరె నాలో ఉన్న ప్రేమికుడ్ని సూడు


*********  *********  *********


చిత్రం: లౌక్యం (2014)
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం: అనూప్ రూబెన్స్ , స్వీకర్
గానం: రాజహాసన్ , స్వీకర్

తేరి బ్యూటిఫుల్ ఆంఖే దేఖ్ కే
నా గుండె జారి పోయిందే..
తేరి కలర్‌ఫుల్ లిప్స్ దేఖ్ కే
నా పల్సే డబుల్ అయిపోయిందే
తేరి మీఠి మీఠి బాతే వింటే
మనసే జిల్ జిల్ అంటుందే
తేరి క్యూటీ క్యూటీ చేతలు చూస్తే
తనువే తకధిం అవుతుందే
ఓ పిల్లా పిల్లా ఇక హల్లా గుల్లా
నా బతుకే చేయకు రసగుల్లా.. అయ్యయ్యయ్యయ్య
ఓ వయ్యారీ.. ఓ వయ్యారీ ఓ వయ్యారి
నా దిల్ అంత నువ్వే వయ్యారి
ఓ వయ్యారీ ఓ వయ్యారి నా దిల్ అంత నువ్వే వయ్యారి
తేరి బ్యూటిఫుల్ ఆంఖే దేఖ్ కే
నా గుండె జారి పోయిందే..

హేయ్ చోరి చోరి కళ్ళే కదిపి
చుప్కె చుప్కె మనసుని కుదిపి
థోడ థోడ తయారు అయిపోవే
జబ్ జబ్ హై దిల్ మే ఆకలి
తబ్ తు హై మేరీ స్ట్రాబెరి
ఆజ మేరి బాహో మే దూరీ...
ఓ వయ్యారీ.. ఓ వయ్యారీ ఓ వయ్యారి
నా దిల్ అంత నువ్వే వయ్యారి
ఓ వయ్యారీ ఓ వయ్యారి నా దిల్ అంత నువ్వే వయ్యారి
తేరి బ్యూటిఫుల్ ఆంఖే దేఖ్ కే
తేరి బ్యూటిఫుల్ ఆంఖే దేఖ్ కే..

ఓయ్ ఓయ్ ఓయ్ ఓయ్ ఓయ్
తు హై మేరి కలల యాక్టర్
మైన్ హున్ తేరా మనసుకి డాక్టర్
జర్ర ఆకే మందులు తీసుకోవే సగమపగమ
ఈ బోరు బోరు లైఫు ని ఇక స్పైసీగా మార్చెయ్యవే
జల్ది వచ్చేయి పోదామే పోరీ....
ఓ వయ్యారీ ఓ వయ్యారి నా దిల్ అంత నువ్వే వయ్యారి
ఓ వయ్యారీ ఓ వయ్యారి నా దిల్ అంత నువ్వే వయ్యారి
తేరి బ్యూటిఫుల్ ఆంఖే దేఖ్ కే
నా గుండె జారి పోయిందే..

Palli Balakrishna Saturday, September 16, 2017

Most Recent

Default