Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Suryadevara Naga Vamsi"
Lucky Baskhar (2024)



చిత్రం: లక్కీ భాస్కర్ (2024)
సంగీతం: జివి ప్రకాష్ కుమార్
నటీనటులు: దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి
దర్శకత్వం: అట్లూరి వెంకీ
నిర్మాత: సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య
విడుదల తేది: 31.10. 2024



Songs List:



శ్రీమతి గారు పాట సాహిత్యం

 
చిత్రం: లక్కీ భాస్కర్ (2024)
సంగీతం: జివి ప్రకాష్ కుమార్
సాహిత్యం: శ్రీమణి
గానం: విషాల్ మిశ్రా, శ్వేతా మోహన్ 

కోపాలు చాలండి శ్రీమతి గారు
కొంచెం కూల్ అవ్వండి మేడమ్ గారు
చామంతి నవ్వే విసిరే మీరు
కసిరేస్తూ ఉన్నా బావున్నారు
సరదాగా సాగే.. సమయంలోన మరిచిపోతే బాధ కబురు
వద్దు అంటూ ఆపేదెవరు

కోపాలు చాలండి శ్రీమతి గారు
కొంచెం కూల్ అవ్వండి మేడమ్ గారు

పలుకే నీది.. ఓ వెన్నె పూస
అలకే ఆపే మనసా
మౌనం తోటి మాట్లాడే భాష.. అంటే నీకే అలుసా
ఈ అలలా గట్టు.. ఆ పూల చెట్టు.. నిన్ను చల్లబడవే అంటున్నాయే
ఏం జరగనట్టు నీవ్వు కరిగినట్టు.. నే కరగనంటూ చెబుతున్నాలే
నీతో వాదులాడి.. గెలువలేనే వన్నెలాడి
సరసాలు చాలండి ఓ శ్రీవారు.. ఆఖరికి నెగ్గేది మీ మగవారు

హాయే పంచే ఈ చల్లగాలి.. మళ్లీ మళ్లీ రాదే
నీతో ఉంటే ఏ హాయికైనా.. నాకే లోటేం లేదే

అదుగో ఆ మాటే.. ఆంటోంది పూటే.. సంతోషమంటే మనమేనని
ఇదిగో ఈ ఆటే.. ఆడే అలవాటే మానేయవేంటో కావాలని
నువ్వే.. ఉంటే చాల్లే.. మరిచిపోనా ఓనమాలే

బావుంది.. బావుంది.. ఓ శ్రీవారు
గారాబం మెచ్చిందే శ్రీమతి గారు



లక్కీ భాస్కర్ పాట సాహిత్యం

 
చిత్రం: లక్కీ బాస్కర్ (2024)
సంగీతం: జివి ప్రకాష్ కుమార్
సాహిత్యం: ‘సరస్వతీ పుత్ర’ రామజోగయ్య శాస్త్రి
గానం: ఉషా ఉతుప్

షబాషు సోదర కాలర్ ఎత్తి తిరగర
కరెన్సీ దేవి నిను వరించేరా
తమాష చూడరా నీ గ్రహాలు సర సరా
అదృష్టరేఖ పైనే కదిలెరా
నిన్ను ఆపేవాడే లేడే
నీదైన కాలం నీదే
మొదలురా మొదలురా మొదలురా…..

యు  లక్కీ భాస్కర్ యు లక్కీ భాస్కర్
యు లక్కీ భాస్కర్ యు లక్కీ భాస్కర్

శక్తి నీదిర యుక్తి నీదిర
కోటి విద్యలేవైనా కూటి కోసమేలేరా
లెగర నరవర మెదడుకే పదును పెట్టరా
దిగర ధీవర లాకెర్లు కొల్లగొట్టరా
ఎగుడుదిగుడుగా ఇన్నాళ్ల రొస్టు చాలుర
బెరుకునోదలరా మారాజులాగ బతకరా
మబ్బుల్లో తేలే చోర డబ్బుల్తో నాట్యం చేయరా
గల గల గల గల గల గల

యు లక్కీ భాస్కర్ యు లక్కీ భాస్కర్
యు లక్కీ భాస్కర్ యు లక్కీ భాస్కర్

గీత దాటర రాత మార్చరా
సగటు మానవా సైరా నగదు పోగు చేసేయరా
మనను నమ్మిన నలుగురి మంచి కొరకెర
మంచి చెడునల మనసులోనే దాచర
మెతుకు పరుగులు ఈ పైన నీకు లేవురా
బతుకు బరువుని దించేసి కాస్త నవ్వరా
ఆర్చేది వారా వీర నీ యుద్ధం నీదేలేరా
చెగువరా చెగువరా చెగువరా

యు లక్కీ భాస్కర్ యు లక్కీ భాస్కర్
యు లక్కీ భాస్కర్ యు లక్కీ భాస్కర్




నిజామా కలా పాట సాహిత్యం

 
చిత్రం: లక్కీ బాస్కర్ (2024)
సంగీతం: జివి ప్రకాష్ కుమార్
సాహిత్యం: శ్రీమణి
గానం: కృష్ణ తేజస్వి 

నిజామా కలా

Palli Balakrishna Wednesday, November 13, 2024
DJ Tillu 2 (2023)



చిత్రం: DJ Tillu 2 (2023)
సంగీతం: రామ్ మిరియాల  
నటీనటులు: సిద్దు, అనుపమ పరమేశ్వరన్ 
దర్శకత్వం: మల్లిక్ రామ్
నిర్మాత: సూర్యదేవర నాగ వంశీ 
విడుదల తేది: 15.09.2023



Songs List:

Palli Balakrishna Thursday, August 3, 2023
DJ Tillu (2022)



చిత్రం: DJ Tillu (2022)
సంగీతం: శ్రీ చరణ్ పాకాల, రామ్ మిరియాల
నటీనటులు: సిద్దు జొన్నలగడ్డ, నేహా శెట్టి
దర్శకత్వం: విమల్ కృష్ణ
నిర్మాత: సూర్యదేవర నాగవంశి
విడుదల తేది: 2022



Songs List:



టిల్లు అన్న డీజే పెడితే పాట సాహిత్యం

 
చిత్రం: DJ Tillu (2022)
సంగీతం: రామ్ మిరియాల
సాహిత్యం: కాసర్ల శ్యామ్
గానం: రామ్ మిరియాల

లాలగూడ అంబరుపేట
మల్లేపల్లి మలక్ పేట
టిల్లు అన్న డీజే పెడితే
టిల్ల టిల్ల ఆడాలా

మల్లేశన్న దావత్లా
బన్ను గాని బారత్లా
టిల్లు అన్న దిగిండంటే
డించక్ డించక్ దున్కాలా

డీజే టిల్లు పేరు
వీని స్టయిలే వేరు
సోకేమో హీరో తీరు
కొట్టేది తీనుమారు

డీజే టిల్లు కొట్టు కొట్టు
డీజే టిల్లు కొట్టు
బేసు జర పెంచి కొట్టు
బాక్సులు పలిగేటట్టు

డీజే టిల్లు పేరు
వీని సౌండే వేరు
కట్ జేసి కొట్టిండంటే
దద్దరిల్లు డాన్సు ఫ్లోరు

డీజే టిల్లు కొట్టు కొట్టు
డీజే టిల్లు కొట్టు
డీజే టిల్లు కొట్టు
కొట్టకుంటే నామీదొట్టు

అరె, చమ్కీ షర్టు - ఆహ
వీని గుంగురు జుట్టు - ఒహో
అట్లా ఎల్లిండంటే సార్లే సలాం కొట్టు

ఏ, గల్లీ సుట్టూ - ఆహ
అత్తరే జల్లినట్టు - ఒహో
మస్తుగా నవ్విండంటే
పోరిలా దిల్లు ఫట్టు - అది

అన్న ఫోటో పెట్టుకొని
జిమ్ము సెంటర్లన్నీ
పోటీ పడి పడీ పబ్లిసిటి జేత్తయే
వీని హవా జూత్తే పోరాలల్ల శివాలే
కార్పొరేటర్కైనా డైరెక్టుగా ఫోన్ కొడతాడే - ఓ

డీజే టిల్లు పేరు
వీని స్టయిలే వేరు
సోకేమో హీరో తీరు
కొట్టేది తీనుమారు

డీజే టిల్లు కొట్టు కొట్టు
డీజే టిల్లు కొట్టు
బేసు జర పెంచి కొట్టు
బాక్సులు పలిగేటట్టు

డీజే టిల్లు పేరు
వీని సౌండే వేరు
కట్ జేసి కొట్టిండంటే
దద్దరిల్లు డాన్సు ఫ్లోరు

డీజే టిల్లు కొట్టు కొట్టు
డీజే టిల్లు కొట్టు
డీజే టిల్లు కొట్టు
కొట్టకుంటే నామీదొట్టు





పటాసు పిల్ల పాట సాహిత్యం

 
చిత్రం: DJ Tillu (2022)
సంగీతం: శ్రీ చరణ్ పాకాల
సాహిత్యం: కిట్టు విస్స ప్రగడ
గానం: అనిరుధ్ రవిచంద్రన్

రాజా రాజా ఐటమ్ రాజా
రోజా రోజా క్రేజీ రోజా
లేజీ లేజీ గుండెల్లోనా
డీజే డీజే కొట్టేసిందా

మైండే అటు ఇటు అని ఊగిందిగా
గుండే తెగ ఎగబడి ఆడిందిగా
లైఫే తికమకపడి సింగల్ స్టెప్పేసి మారిందిగా

పటాసు పిల్ల పటాసు పిల్ల
పటాసు పిల్ల తాకగా
పటాసు పిల్ల పటాసు పిల్ల
పటాసు పిల్ల దిల్లంతా థిల్లాన

పటాసు పిల్ల పటాసు పిల్ల
పటాసు పిల్ల సూటిగా
పటాసు పిల్ల పటాసు పిల్ల
పటాసు పిల్ల టెంటేసి కూసుందా

కలిసే నడిచే దారుల్లో
రంగే చేరే నీడల్లో
జాతరలోన పులి వేషంలాగ
నడుం చూసే వేళా నరం ఆనేసిందే
మనసే కాలే జారెనే

రాజా రాజా ఐటమ్ రాజా
రోజా రోజా క్రేజీ రోజా
పైటే అటు ఇటు అని ఊగిందిగా
లైఫే తికమకపడి సింగల్ స్టెప్పేసి మారిందిగా

పటాసు పిల్ల పటాసు పిల్ల
పటాసు పిల్ల తాకగా
పటాసు పిల్ల పటాసు పిల్ల
పటాసు పిల్ల దిల్లంతా థిల్లాన

పటాసు పిల్ల పటాసు పిల్ల
పటాసు పిల్ల సూటిగా
పటాసు పిల్ల పటాసు పిల్ల
పటాసు పిల్ల టెంటేసి కూసుందా




నువ్వలా వెన్నెలా (Male) పాట సాహిత్యం

 
చిత్రం: DJ Tillu (2022)
సంగీతం: శ్రీ చరణ్ పాకాల
సాహిత్యం: రవికాంత్ పేరేపు
గానం: సిద్దు జొన్నలగడ్డ

నీ కనులను చూశానే
ఓ నిమిషం లోకం మరిచానే

నా కలలో నిలిచావే
నా మనసుకు శ్వాసై పోయావే

నీ పరిచయమే ప్రేమే కోరే
పరిచయమే నా ప్రతి అణువు
నీ పేరేలే పరవశమే

నువ్వలా వెన్నెలా
నీ నవ్విలా వినబడుతూ వీణలా
నీ చూపిలా వరముగా
ఓ ప్రేమను నింపావే కన్నులా

నువ్వలా వెన్నెలా
నీ నవ్విలా వినబడుతూ వీణలా
నీ చూపిలా వరముగా
ఓ ప్రేమను నింపావే కన్నులా





నువ్వలా వెన్నెలా (Female) పాట సాహిత్యం

 
చిత్రం: DJ Tillu (2022)
సంగీతం: శ్రీ చరణ్ పాకాల
సాహిత్యం: రవికాంత్ పేరేపు
గానం: యామిని గంటసాల 

నీ కనులను చూశానే
ఓ నిమిషం లోకం మరిచానే

నా కలలో నిలిచావే
నా మనసుకు శ్వాసై పోయావే

నీ పరిచయమే ప్రేమే కోరే
పరిచయమే నా ప్రతి అణువు
నీ పేరేలే పరవశమే

నువ్వలా వెన్నెలా
నీ నవ్విలా వినబడుతూ వీణలా
నీ చూపిలా వరములా
ఓ ప్రేమను నింపావే కన్నులా

నువ్వలా వెన్నెలా
నీ నవ్విలా వినబడుతూ వీణలా
నీ చూపిలా వరములా
ఓ ప్రేమను నింపావే కన్నులా

Palli Balakrishna Sunday, February 13, 2022
Varudu Kaavalenu (2021)



చిత్రం: వరుడు కావలెను (2021)
సంగీతం: విశాల్ చంద్రేఖర్
నటీనటులు: నాగ శౌర్య , రీతు వర్మ, నదియా
దర్శకత్వం: లక్ష్మీ సౌజన్య
నిర్మాత: సూర్య దేవర నాగవంశీ
విడుదల తేది: 29.10.2021



Songs List:



కోల కళ్ళే ఇలా పాట సాహిత్యం

 
చిత్రం: వరుడు కావలెను (2021)
సంగీతం: విశాల్ చంద్రేఖర్
సాహిత్యం: రాంబాబు గోసాల
గానం: సిద్ శ్రీరామ్

చూపులే నా గుండె అంచుల్లో
కుంచెలా నీదే బొమ్మ గీస్తున్నాయే
పువ్వులా నా ఊహల గుమ్మంలో
తోరణమవుతూ నువ్వే నిలుచున్నావే

కొంచమైనా ఇష్టమేనా అడుగుతుందే
మౌనంగా నా ఊపిరే
దూరమున్నా చేరువవుతూ
చెప్పుకుందే నాలోని ఈ తొందరే

కోల కళ్ళే ఇలా గుండె గిల్లే ఎలా
నీలి మబ్బుల్లో నేనే తేలేంతలా
కొంటె నవ్వే ఇలా చంపుతుంటే ఎలా
కొత్త రంగుల్లో ప్రాణమే తడిసేంతలా

మళ్ళి మళ్ళి రావే
పూల జల్లు తేవే

నువ్వెల్లే దారులలో
చిరుగాలికి పరిమళమే
అది నన్నే కమ్మేస్తూ ఉందే

నా కంటి రెప్పలలో
కునుకులకిక కలవరమే
ఇది నన్నే వేధిస్తూ ఉందే

నిశినిలా విసురుతూ శశి నువ్వై మెరవగా
మనసులో పదనిసే ముసుగే తీసెనా
ఇరువురం ఒకరిగా జతపడే తీరుగా
మన కదే మలుపులే కోరేనా

కోల కళ్ళే ఇలా గుండె గిల్లే ఎలా
నీలి మబ్బుల్లో నేనే తేలేంతలా
కొంటె నవ్వే ఇలా చంపుతుంటే ఎలా
కొత్త రంగుల్లో ప్రాణమే తడిసేంతలా

మళ్ళి మళ్ళి రావే
పూల జల్లు తేవే

చూపులే నా గుండె అంచుల్లో
కుంచెలా నీదే బొమ్మ గీస్తున్నాయే

నాన నానా నానా... హ్మ హ్ హ్మమ్మా
నాన నాననా నాన నానా నా

నాన నానా నానా... హ్మహ్ హ్ హ్మ
నాన నానా నా నాన నానా నా

మళ్ళి మళ్ళి రావే





దిగు దిగు దిగు నాగ పాట సాహిత్యం

 
చిత్రం: వరుడు కావలెను (2021)
సంగీతం: ఎస్.ఎస్.థమన్ 
సాహిత్యం: అనంత శ్రీరాం
గానం: శ్రేయా ఘోషాల్

దిగు దిగు దిగు నా… హోయ్ హోయ్
దిగు దిగు దిగు నా… హోయ్ హోయ్
దిగు దిగు దిగు దిగు దిగు దిగు
హోయ్ హోయ్ హోయ్ హోయ్

దిగు దిగు దిగు నాగ నగో నా
దివ్యా సుందర నాగో నాగ
దిగు దిగు దిగు నాగ నగో నా
దివ్యా సుందర నాగో నాగ, నాగ నాగ

నాగేటి సాలకాడ నాకేట్టి పనిరో
నాపగడ్డి సేలకాడ నాకేట్టి పనిరో
నాగేటి సాలకాడ నాకేట్టి పనిరో
నాపగడ్డి సేలకాడ నాకేట్టి పనిరో
సంధాల సంతగాడ నాకేట్టి పనిరో
సాకిరేవు తగువు కాడ నాకేట్టి పనిరో
ఇరగబెట్టి మరగబెట్టి
మిగలబెట్టి తగలబెట్టి ఎలకపెట్టిన
నీ ఎవ్వారం చాలురో

కొంపాకొచ్చి పోరోయ్… కోడెనాగ
కొంపా ముంచుతాందోయ్ ఈడు బాగా
కొంపాకొచ్చి పోరోయ్… కోడెనాగ
కొంపా ముంచుతాందోయ్ ఈడు బాగా
సెంపా గిల్లి పోరోయ్ సెట్టినాగా
సంపుతాంది పైటే పడగలాగ

దిగు దిగు దిగు నాగ నగో నా
దివ్యా సుందర నాగో నాగ
దిగు దిగు దిగు నాగ నగో నా
దివ్యా సుందర నాగో నాగ
హోయ్ హోయ్ హోయ్ హోయ్
ననన్న నాగె నాగ నాగా… ననన్న నాగె నాగ నాగా
ననన్న నాగె నాగ నాగా… ననన్న నాగె నాగ నాగా

ఊరి మీది గొడవలన్ని… నెత్తి మీదికెత్తుకుంటవ్
గొడుగు తోటి పొయ్యే దాన్ని… గుడిసె దాకా తెచ్చుకుంటవ్
ఊరి మీది గొడవలన్ని… నెత్తి మీదికెత్తుకుంటవ్
గొడుగు తోటి పొయ్యే దాన్ని… గుడిసె దాకా తెచ్చుకుంటవ్
అలకతోనే ఇల్లు అలికితేనే గాని… ఈ దిక్కు సూడవ్
పైసాక్కి పనికిరాని… కానీక్కి కలిసిరాని
కన్నె మోజు తీర్చలేని… సున్నాలు సాలురో

కొంపాకొచ్చి పోరోయ్… కోడెనాగ
కొంపా ముంచుతాందోయ్ ఈడు బాగా
గంప దించి రారోయ్ గడ్డునాగా
గంపేడాశ నాలో రంపమేగా

దిగు దిగు దిగు నాగ నగో నా
దివ్యా సుందర నాగో నాగ
దిగు దిగు దిగు నాగ నగో నా
దివ్యా సుందర నాగో నాగ
నాగో నాగ నాగో నాగ




మనసులోనే నిలిచిపోకే… పాట సాహిత్యం

 
చిత్రం: వరుడు కావలెను (2021)
సంగీతం:  విశాల్ చంద్రేఖర్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: చిన్మయి శ్రీపాద

పల్లవి:
మనసులోనే నిలిచిపోకే… మైమరపుల మధురిమా
పెదవి దాటి వెలికి రాక… బెదురెందుకె హృదయమా
మనసులోనే నిలిచిపోకే… మైమరపుల మధురిమా
పెదవి దాటి వెలికి రాక… బెదురెందుకె హృదయమా

చరణం: 1
ఎన్నిన్నాళ్ళిలా ఈ దోబూచుల సంశయం
అన్ని వైపులా వెనుతరిమే ఈ సంబరం
అదును చూసి అడగదేమి… లేనిపోని బిడియమా
ఊహలోనే ఊయలూపి… జారిపోకే సమయమా
తడబడే తలపుల తపన… ఇదని తెలపకా

మనసులోనే నిలిచిపోకే… మైమరపుల మధురిమా
పెదవి దాటి వెలికి రాక… బెదురెందుకె హృదయమా
మనసులోనే నిలిచిపోకే… మైమరపుల మధురిమా
పెదవి దాటి వెలికి రాక… బెదురెందుకె హృదయమా

చరణం: 2
రా ప్రియా శశివదనా… అని ఏ పిలుపు వినబడెనా
తనపై ఇది వలనా… ఏదో భ్రమలో ఉన్నానా
చిటికే చెవిబడి తృటిలో మతి చెడి
నానా యాతన మెలిపెడుతుండగా

గరినిసాసా గరినిసాసా నిస నిస నిన పదనిస
గరినిసాసా గరినిసాసా మా మా మమగమాప
గరినిసాసా గరినిసాసా నిస నిస నిన పదనిస
గరినిసాసా గరినిసాసా మా మా మపనిదపమా
నా ప్రతి అణువణువు
సుమమై విరిసే తొలి ఋతువు
ఇకపై నా ప్రతి చూపు… తనకై వేచే నవ వధువు
చెలిమే బలపడి రుణమై ముడిపడే
రాగాలాపన మొదలవుతుండగా

మనసులోనే నిలిచిపోకే… మైమరపుల మధురిమా
పెదవి దాటి వెలికి రాక… బెదురెందుకె హృదయమా
మనసులోనే నిలిచిపోకే… మైమరపుల మధురిమా
పెదవి దాటి వెలికి రాక… బెదురెందుకె హృదయమా




వడ్డానం చుట్టేసి పాట సాహిత్యం

 
చిత్రం: వరుడు కావలెను (2021)
సంగీతం:  ఎస్.ఎస్.థమన్ 
సాహిత్యం: రఘురాం
గానం: గీతా మాధురి, ML గాయత్రి, అతిధి భావరాజు , శృతి రంజని, శ్రీకృష్ణ

వడ్డానం చుట్టేసి వచ్చారే భామలు
వయ్యారం చిందేసే అందాల బొమ్మలు
వడ్డానం చుట్టేసి వచ్చారే భామలు
క్యా కరే క్యా కరే… క్యా కరే

పరికిణీలో పడుచును చూస్తే… పందిరంతా జాతరే
అయ్యో రామ..!
క్యా కరే క్యా కరే (క్యా కరే)
కాలి గజ్జల సవ్వడి వింటే
సందె వేళన సందడే… మస్తు మస్తుగా దేత్తడే
దేత్తడే దేత్తడే

దోర సిగ్గులన్ని బుగ్గ మీద ఇల్లా
పిల్లి మొగ్గలేస్తూ పాడుతుంటే అల్లా
వేల రంగులొచ్చి వాలినట్టు
వాకిలి అంతా పండగలా మెరిసిందిలా

వడ్డానం చుట్టేసి వచ్చారే భామలు
వయ్యారం చిందేసే అందాల బొమ్మలు
వడ్డానం చుట్టేసి వచ్చారే భామలు
క్యా కరే క్యా కరే… క్యా కరే
దేత్తడే దేత్తడే


సారీలో ఓ సెల్ఫీ కొడదామా
లేటు ఎందుకు రామరి
ఇంస్టాగ్రామ్ స్టోరీ కోసం
క్రేజీ ఎందుకే సుందరి

అరె, ఆనందమానందం… ఇవ్వాళ మా సొంతం
గారంగా మాట్లాడుదాం
అబ, పేరంటం గోరింటం అంటూ మీ వీరంగం
ఎట్టాగ భరించడం

చూసుకోరా కాస్త నువ్వు కొత్త ట్రెండు
ఇంక పెంచుకోరా ఫుల్లు డీజే సౌండు
స్టెప్పు మీద స్టెప్పులెన్నో వేసి
చెలరేగాలి నిలబడలేమే
వాట్ టూ డు? వాట్ టూ డు?

వడ్డానం చుట్టేసి వచ్చారే భామలు
వయ్యారం చిందేసే అందాల బొమ్మలు
వడ్డానం చుట్టేసి వచ్చారే భామలు

పరికిణీలో పడుచును చూస్తే
పందిరంతా జాతరే
అయ్యో రామ..!
క్యా కరే క్యా కరే (క్యా కరే)

కాలి గజ్జల సవ్వడి వింటే
సందె వేళన సందడే
మస్తు మస్తుగా దేత్తడే, దేత్తడే దేత్తడే

తారంగం తారంగం
ఆనందాల ఆరంభం
పలికిందిలే మేళం
డుండుం డుం పి పి డుండుం

తారంగం తారంగం
పయనాలే ప్రారంభం
సరికొత్త సారంగం
పి పి పి ట ట డుండుం



వాట్ టు డూ… పాట సాహిత్యం

 
చిత్రం: వరుడు కావలెను (2021)
సంగీతం:  విశాల్ చంద్రేఖర్
సాహిత్యం: లక్ష్మీ ప్రియాంక 
గానం: అమల చేబోలు

వాట్ టు డూ… అరె, ఓ పరమేశా
రోలర్ కోస్టర్ రైడాయెనే
బాసు చేతిలో బొమ్మల లాగ
లైఫ్ మొత్తం మాటాయెనే

అయ్యబాబోయ్… ఏం చెప్పను బ్రదరు
సీరియల్ ల సోది గురు
అందాల రాకాసికి పొగరు
టాప్ టు బాటమ్ ఫుల్లు గురు

అరేరే కథలో కలలో అసలు సిసలు
పిల్లనూ తనులే తెలుసుకో
అయ్యయ్యో ఒకటో రెండో
కాదు కాదే రోజు గొడవే లైఫ్ లో

ఓ గాడు… డోంట్ బీ సో హార్డు
లైఫ్ ఈస్ సో బ్యాడు
వై ఈజ్ షీ సో బ్యాడు… వాట్ టు డూ
ఓ గాడు డోంట్ బీ సో హార్డు
లైఫ్ ఈస్ సో బ్యాడు
వై ఈజ్ షీ సో బ్యాడు… వాట్ టు డూ

అంతుపట్టరు ఈ పిల్లెంటో
ఎవరికి ఏ పూట
అంతు చిక్కని ప్రశ్నై
చంపేస్తుంటే, ఓ తంటా

అందాల బొమ్మలేరా
అంతకు మించి తిక్కలేరా
రాకాసి తానురా
ఫైరు బ్రాండ్ రా మొండిది తానురా

అరేరే కథలో కలలో అసలు సిసలు
పిల్లనూ తనులే తెలుసుకో
అయ్యయ్యో ఒకటో రెండో
కాదు కాదే రోజు గొడవే లైఫ్ లో



చెంగున చెంగున పాట సాహిత్యం

 
చిత్రం: వరుడు కావలెను (2021)
సంగీతం:   విశాల్ చంద్రేఖర్
సాహిత్యం: శ్రీమణి
గానం: సింధూరి

చెంగున చెంగున
నల్లని కనుల రంగుల వాన
చిరు చిరు నవ్వుల మువ్వలు
చిందులు చిందెను పెదవుల పైన

ఎర్రని సిగ్గుల మొగ్గలు
మగ్గెను బుగ్గలలోన
ముసిరిన తెరలు తొలిగి
వెలుగు కురిసె వెన్నెలతోన

మళ్ళీ పసిపాపై పోతున్నా, ఆ ఆ నా
తుళ్ళి తుళ్లింతలతో తెల్లాన
వెల్లే ప్రతి అడుగు నీవైపేనా
మళ్ళీ ప్రతి మలుపు నిను చూపేనా

ప్రాయమంత చేదేననుకున్నా, ఆ ఆ
ప్రాణమొచ్చి పువ్వులు పూస్తున్నా, ఆ ఆ
నాకు తగ్గ వరుడేడనుకున్నా, ఆ ఆ
అంతకంటే ఘనుడిని చూస్తున్నా, ఆ ఆ

నా ఇన్ని నాళ్ళ మౌనమంతా
పెదవంచు దాటుతుంటే
తరికిట తకధిమి నేడిక నాలోనా

ఎలాగ ఇప్పుడు మలుపు తిరుగును
ప్రయాణమన్నది చెప్పగలమా
ఎలాగ ఎవ్వరు పరిచయాలే
ఏ తీరుగ మారునో చెప్పగలమా
మేఘం నీది కడలి ఆవిరిదే కాదా
కురిసే వానై తిరిగి రాదా, ఆ ఆ
నాలో మెరిసే మెరుపు మరి నీదే కాదా
మళ్ళీ నిన్నే చేరమంటోందా

ప్రశ్నలు ఎన్నో
నా మనసు కాగితాలు
బదులిలా సులువుగా దొరికెను నీలోనా

ఎలాగ ఇప్పుడు మలుపు తిరుగును
ప్రయాణమన్నది చెప్పగలమా
ఎలాగ ఎవ్వరు పరిచయాలే
ఏ తీరుగ మారునో చెప్పగలమా

Palli Balakrishna Thursday, October 28, 2021
Rang De (2021)



Movie Details



Songs List:



రంగులే పాట సాహిత్యం

 
చిత్రం: రంగ్ దే (2021)
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
సాహిత్యం: శ్రీమణి
గానం: శ్వేతా మూహన్ 

రంగులే 



ఊరంతా వెన్నెలా పాట సాహిత్యం

 
చిత్రం: రంగ్ దే (2021)
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
సాహిత్యం: శ్రీమణి
గానం: మంగ్లీ

ఓం గణేశాయ నమః
ఏకదంతాయ నమః
ఓం గణేశాయ నమః
ఏకదంతాయ నమః

ఊరంతా వెన్నెలా మనసంతా చీకటి
రాలిందా నిన్నలా రేపటి కల ఒకటి
జగమంతా వేడుక మనసంతా వేధన
పిలిచిందా నిన్నిలా అడగని మలుపొకటి
మదికే ముసుగే తొడిగే అడుగే ఎటుకో నడకే
ఇది ఓ కంట కన్నీరు ఓ కంట చిరునవ్వు

ఊరంతా వెన్నెలా మనసంతా చీకటి
రాలిందా నిన్నలా రేపటి కల ఒకటి

ఓం గణేశాయ నమః
ఏకదంతాయ నమః

ఎవరికీ చెప్పవే ఎవరినీ అడగవే
మనసులో ప్రేమకే మాటలే నేర్పవే
చూపుకందని మచ్చని కూడా
చందమామలో చూపిస్తూ
చూపవలసిన ప్రేమను మాత్రం
గుండె లోపలే దాచేస్తూ
ఎన్నో రంగులున్నా బాధ రంగే బతుకులో ఒలికిస్తూ

ఊరంతా వెన్నెలా మనసంతా చీకటి
రాలిందా నిన్నలా రేపటి కల ఒకటి

ఎవరితో పయనమో ఎవరికై గమనమో
ఎరుగని పరుగులో ప్రశ్నవో బదులువో
ఎన్ని కలలుగని ఏమిటి లాభం
కలలు కనులనే వెలివేస్తే
ఎన్ని కథలు విని ఏమిటి సౌఖ్యం
సొంత కథను మది వదిలేస్తే
చుట్టూ ఇన్ని సంతోషాలు కప్పేస్తుంటే నీ కన్నీళ్ళను

ఊరంతా వెన్నెలా మనసంతా చీకటి
రాలిందా నిన్నలా రేపటి కల ఒకటి

ఓం గణేశాయ నమః
ఏకదంతాయ నమః




చూసి నేర్చుకో కు పాట సాహిత్యం

 
చిత్రం: రంగ్ దే (2021)
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
సాహిత్యం: శ్రీమణి
గానం: సాగర్

పొద్దున్నే లేవడాన్ని కోడ్ని చూసి నేర్చుకో
అంటారు కోడ్ని కోసే పెద్దలెందుకో
శుభ్రంగ ఉండటాన్ని వాడ్ని చూసి నేర్చుకో
కంపేరు చేయడాన్ని ఆపరెందుకో
ఫస్ట్ ర్యాంకు కొట్టడాన్ని వీడ్ని చూసి నేర్చుకో
ఫస్ట్ క్లాస్ నుంచి ఈ టార్చరెందుకో
టైం కొచ్చి పోయే పిల్లగాన్ని చూసి నేర్చుకో
పంక్చువాలిటీ లేని ఈ పంచ్ లెందుకో

ఆడ్ని చూసి ఈడ్ని చూసి నేర్చుకుంటూ పోతూ
ఉంటే జిరాక్స్ లాగ జీవితాలు మారవా సో 
చూసి నేర్చుకో కు ఎవడ్ని చూసి నేర్చుకో కు
లెక్క చెయ్యమా కు ఎవడ్ని లెక్క చెయ్యమా కు

సన్ లైట్ ని చూసి నేర్చుకొని ఉంటే
ఫుల్ మూన్ కూల్ గా ఉండే వాడా
క్లాసుమేట్ ని చూసి నేర్చుకుని ఉంటే
ఐన్ స్టీన్ సైంటిస్టు అయ్యేవాడా

మంకీలనుంచే మనిషి పుట్టకంటారు 
మరి మంకీల ఉంటే తట్టుకోరు ఎందుకో
డే అండ్ నైట్ హార్డ్ వర్క్ చేస్తుంది మరి
డాంకీ ని చూసి నేర్చుకోరు ఎందుకో

వాడి లాగ వీడి లాగ ఉండటాన్ని
కాపీ చేసి, పేస్ట్ చేస్తే.... లైఫ్ వేస్ట్ అవ్వదా - సో 

చూసి నేర్చుకో కు, కో కు...
ఎవన్ని చూసి నేర్చుకోకు, కో కు
లెక్క చెయ్యమా కు, మాకు...
ఎవన్ని లెక్క చెయ్యమా కు, మాకు

జింక లాగే నేను క్యూట్ గా ఉండాలి అంటూ
సింహం జూలే ట్రిమ్ చేస్తుందా
ఫిష్ లాగే నేనూ ఈత కొట్టాలి అంటూ
ఎలిఫెంట్ స్విమ్ సూట్ వేసేస్తుందా

ఓన్ స్టైల్ మార్చుకోవు ఆనిమల్స్ ఎప్పుడూ
వాటి క్లారిటీ మనకు లేదు ఎందుకో
కంక్లూషన్ ఏంటి అంటే కన్ఫ్యూస్ వద్దురో
నీకు లాగే నువ్వు ఉంటే దిగులు దేనికో

వాడి లాగో వీడి లాగో సిగ్నేచర్ ఇచ్చుకుంటే
ఫ్యూచరే ఫోర్జరీ అవ్వదా... సో
చూసి నేర్చుకో కు, ఎవన్ని చూసి నేర్చుకో కు
లెక్క చెయ్యమా కు, ఎవన్ని లెక్క చెయ్యమా కు
చూసి నేర్చుకో కు,




నా కనులు ఎపుడూ పాట సాహిత్యం

 
చిత్రం: రంగ్ దే (2021)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: శ్రీమణి
గానం: సిద్ శ్రీరామ్

నా కనులు ఎపుడూ కననె కనని
పెదవులెపుడూ అననె అనని
హృదయమెపుడూ విననె విననీ
మాయలో తేలుతున్నా

నా మనసు తలుపే తెరచి తెరచి
వెలుగు తెరలే పరచి పరచి
కలలు నిజమై ఎదుట నిలిచి
పిలిచెనే ఈ క్షణాన
చేదుపై తీపిలా రేయిపై రంగులా
నేలపై నింగిలా
గుప్పెడు గుండెకు పండుగ ఈ వేళా

నా కనులు ఎపుడూ కననె కనని
పెదవులెపుడూ అననె అనని
హృదయమెపుడూ విననె విననీ
మాయలో తేలుతున్నా

నామనసు తలుపే తెరచి తెరచి
వెలుగు తెరలే పరచి పరచి
కలలు నిజమై ఎదుట నిలిచి
పిలిచెనే ఈ క్షణాన

ఎపుడూ లేని ఈ సంతోషాన్ని
దాచాలంటే మది చాలో లేదో
ఎపుడో రాని ఈ ఆనందాన్ని
పొందే హక్కే నాకుందో లేదో

నా అనేలా నాదనేలా ఓ ప్రపంచం
నాకివాళ సొంతమై అందేనే
గుప్పెడు గుండెకు పండుగ ఈ వేళ

నా కనులు ఎపుడూ కననె కనని
పెదవులెపుడూ అననె అనని
హృదయమెపుడూ విననె విననీ
మాయలో తేలుతున్నా

నన్నే నేనే కలిసానో ఏమో
నాకే నేనే తెలిసానో ఏమో
నీలో నన్నే చూశానో ఏమో
నాలా నేనే మారానో ఏమో
నా గతంలో నీ కథెంతో
నీ గతంలో నా కథంతే
ఓ క్షణం పెంచిన
గుప్పెడు గుండెకు పండుగ ఆవేళా

నా కనులు ఎపుడూ కననె కనని
పెదవులెపుడూ అననె అనని
హృదయమెపుడూ విననె విననీ
మాయలో తేలుతున్నా

నా మనసు తలుపే తెరచి తెరచి
వెలుగు తెరలే పరచి పరచి
కలలు నిజమై ఎదుట నిలిచి
పిలిచెనే ఈ క్షణాన



బస్టాండే బస్టాండే పాట సాహిత్యం

 
చిత్రం: రంగ్ దే (2021)
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
సాహిత్యం: శ్రీమణి
గానం: సాగర్

బస్టాండే బస్టాండే ఇక బతుకే బస్టాండే
బస్టాండే బస్టాండే ఇక బతుకే బస్టాండే

ఊ - సింపుల్గుండె లైఫు
ఊ - టెంపుల్ రన్ లా మారే,
ఊ - ఈ రంగురంగు లోకం
ఊ - చీకట్లోకి జారే

ఊ - లవ్ లేకుండ కలలే
ఊ - లైఫే లేనిదాయే, హ్మ
ఊ - స్మైలీ లాంటి పేసే
ఊ -  స్మైలే లేనిదాయే

నీళ్ళు లేని బావిలోన కప్పలాగ తేలిపోయే
జాలరేదో గాలమేస్తే చేపలాగ దొరికిపోయే
తీసుకున్న గొయ్యిలోన కాలుకాస్త జారిపోయే

బస్టాండే బస్టాండే  ఇక బతుకే బస్టాండే
బస్టాండే బస్టాండే ఇక బతుకే బస్టాండే
అబ్సకాండే అబ్సకాండే సంతోషం అబ్సకాండే
అబ్సకాండే అబ్సకాండే సంతోషం అబ్సకాండే

ఊ - సింపుల్గుండె లైఫు
ఊ - టెంపుల్ రన్ లా మారే
ఊ - ఈ రంగురంగు లోకం
ఊ -  చీకట్లోకి జారే

సలసల కాగు నీట్లో
వేళ్ళే పెట్టినానురో
కారమంటుకున్న చేత్తో
కళ్ళే నలిపినానురో

ఊ - ఎవరులేని చోట
ఊ - గావుకేకైంది లైఫే
ఊ - ఫ్రెండులా ఉండే ఫేటే
ఊ - ఫుట్ బాల్ ఆడే నాతోటే

బస్టాండే బస్టాండే  ఇక బతుకే బస్టాండే
బస్టాండే బస్టాండే ఇక బతుకే బస్టాండే
అబ్సకాండే అబ్సకాండే సంతోషం అబ్సకాండే
అబ్సకాండే అబ్సకాండే సంతోషం అబ్సకాండే

స్లేటే పక్కనుంటదే
కానీ చాక్ పీస్ చిక్కనంటదే, యే
ప్లేట్ లో ఫుడ్డు ఉంటదే
కానీ నోటికి తాళముంటదే

ఊ - లైటు స్విచ్చెయ్యగానే
ఊ - బల్బ్ మాడిపోయినట్టు
ఊ - లైఫు స్టార్టవ్వగానే
ఊ - నా ఫ్యూచర్ పంక్చరయ్యనే

బస్టాండే బస్టాండే ఇక బతుకే బస్టాండే
బస్టాండే బస్టాండే ఇక బతుకే బస్టాండే
అబ్సకాండే అబ్సకాండే సంతోషం అబ్సకాండే
అబ్సకాండే అబ్సకాండే సంతోషం అబ్సకాండే



ఏమిటో ఇది పాట సాహిత్యం

 
చిత్రం: రంగ్ దే (2021)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: శ్రీమణి
గానం: కపిల్ కపిలన్, హరిప్రియ

ఏమిటో ఇది వివరించలేనిది
మది ఆగమన్నది తనువగానన్నది
భాష లేని ఊసులాట సాగుతున్నది
అందుకే ఈ మౌనమే భాష అయినది
కోరుకోని కోరికేదో తీరుతున్నది

ఏమిటో ఇది వివరించలేనిది
మది ఆగమన్నది తనువగానన్నది

అలలా నా మనసు తేలుతుందే...
వలలా నువు నన్ను అల్లుతుంటే...
కలలా చేజారిపోకముందే...
శిలలా సమయాన్ని నిలపమందే...

నడక మరిచి నీ అడుగు ఒడిన
నా అడుగు ఆగుతుందే
నడక నేర్చి నీ పెదవి పైన
నా పెదవి కదులుతుందే
ఆపలేని ఆట ఏదో సాగుతున్నదీ ఓ ఓ ఓ

ఏమిటో ఇది వివరించలేనిది
మది ఆగమన్నది తనువగానన్నది

మెరిసే ఒక కొత్త వెలుగు నాలో....
కలిపే ఒక కొత్త నిన్ను నాలో...
నేనే ఉన్నంత వరకు నీతో....
నిన్నే చిరునవ్వు విడవదనుకో...

చినుకు పిలుపు విని నెమలి పింఛమున
రంగులెగసినట్టు
వలపు పిలుపు విని చిన్ని మనసు చిందేసే
ఆగనంటూ
కోరుకున్న కాలమేదో చేరుతున్నది ఓ ఓ ఓ

ఏమిటో ఇది వివరించలేనిది
మది ఆగమన్నది తనువగానన్నది

Palli Balakrishna Sunday, March 7, 2021
Bheeshma (2020)



చిత్రం: భీష్మ (2021)
సంగీతం: మహతి స్వర సాగర్
నటీనటులు: నితిన్, రష్మిక మండన్న
దర్శకత్వం: వెంకీ కుడుముల
నిర్మాత: సూర్యదేవర నాగ వంశీ
విడుదల తేది: 21.02.2020



Songs List:



సింగిలే ఐ యామ్‌ రెడీ టూ మింగిలే పాట సాహిత్యం

 
చిత్రం: భీష్మ (2021)
సంగీతం: మహతి స్వర సాగర్
సాహిత్యం: శ్రీమణి
గానం: అనురాగ్ కులకర్ణి

హై క్లాసు నుంచి లోక్లాసు దాకా నా క్రష్ లే 
వందల్లో ఉన్నారులే ఒక్కళ్లు సెట్ అవ్వలే
కిస్సింగ్ కోసం హగ్గింగ్ కోసం వెయిటింగ్‌లే
పాపెనకే జాగింగ్‌లే.. లైఫంతా బెగ్గింగులే  

ఎన్నాళ్లీలా ఈ ఒంటరి బతుకే నాకిలా.. 
బాయ్​ ఫ్రెండ్​లా నన్ను మార్చదే  ఏ పిల్లా.. 
ఏం చేసినా నా స్టేటస్ సింగిల్ మారలా.. 
నా వైపు ఇలా చూడదు ఏ సిండ్రెల్లా 

ఓయ్ సింగిలే ఐ యామ్‌ రెడీ టూ మింగిలే
లైఫ్‌కు లేవే రంగులే నువ్ పడవా.. పాప
ఓయ్ జంటలే నా కంట పడితే మెంటలే 
ఒల్లంత జెలసీ మంటలే చల్లార్చేయ్ పాప

ఓ ప్రెటీ ప్రెటీ గర్ల్ ఓ నాననాన
యూ అర్ సో బ్యూటిఫుల్ ఓ నాననాన
మా మా మా సాస్సి గర్ల్ ఓ నాననాన
యూ మేక్ మై లైఫ్ బ్యూటిఫుల్ ఓ...

ఓ ప్రెటీ ప్రెటీ గర్ల్ ఓ నాననాన
యూ అర్ సో బ్యూటిఫుల్ ఓ నాననాన
మా మా మా సాస్సి గర్ల్ ఓ నాననాన
యూ మేక్ మై లైఫ్ బ్యూటిఫుల్ ఓ…

ఎందుకో ఏమో వంటరై ఉన్నాను ఇలా
ఏదురు పడదేమో అందాల దేవత
జాలి చూపేనా కాలమే నాపై ఇలా
ఏమీ తలరాతో నా కర్మ కాలిందిలా 

అయాయూ 
ఓయ్ సింగిలే ఐ యామ్‌ రెడీ టూ మింగిలే
లైఫ్‌కు లేవే రంగులే నువ్ పడవా.. పాప
ఓయ్ జంటలే నా కంట పడితే మెంటలే 
ఒల్లంత జెలసీ మంటలే  చల్లార్చేయ్ పాప






వాట్ ఏ వాట్ ఏ వాట్ ఏ బ్యూటీ పాట సాహిత్యం

 
చిత్రం: భీష్మ (2021)
సంగీతం: మహతి స్వర సాగర్
సాహిత్యం: కాసర్ల శ్యామ్
గానం: ధనుంజయ, అమల చేబోలు

ఏ వాట్ ఏ వాట్ ఏ వాట్ ఏ బ్యూటీ
నువ్వు యాడ ఉంటే ఆన్నే ఊటీ

ఏ వాట్ ఏ వాట్ ఏ వాట్ ఏ బ్యూటీ
నువ్వు యాడ ఉంటే ఆన్నే ఊటీ

తిప్పూతుంటే నడుమే నాటి
నా కండ్లే చేసె కంత్రీ డ్యూటి

నువ్వు దగ్గరి కొస్తాంటే …. సల్లగ సలి పెడతాందే..
దూరమెల్లి పోతంటే… మస్త్ ఉడక పోస్తుందే.. దే..

టైటు హగ్గిచ్చి… టాటూలా అంటుకోరాదే

ట్వింకిల్ ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టారూ
అమ్మ అయ్య ఇంట్లో ఎవరూ లేరు..దేసి

ట్వింకిల్ ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్
తెరిచుంచెయ్వే పోరి ఫ్రంటు డోరు

సూడకె సిట్టి… మంటలు పుట్టి..
ఫైర్ ఇంజిన్ తిరుగుతందే గంటలు కొట్టి

రైల్ ఇంజిన్ లా కూతలు పెట్టీ
టైమంతా గడిపెయ్యకు మాటల తోటి

ఎండల్లో నువ్ తిరగొద్దే సూర్యునికే చమటట్టిద్దే
ఇంతందాన్నే దాచొద్దే… ఇ
న్కమ్ ట్యాక్స్ రైడైపోద్దే

ట్వింకిల్ ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టారూ
అమ్మ అయ్య ఇంట్లో ఎవరూ లేరు..దేసి

ట్వింకిల్ ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్
తెరిచుంచెయ్వే పోరి ఫ్రంటు డోరు

ఆ… నువ్ కూసున్న ఏ సీటైనా
స్వర్గానికి డైరెక్ట్ గా అది ఫ్లైటెనా
ఇన్నాల్లుగా సింగిల్‌గున్నా…
నీ ఫోటోకే… నేను ఫ్రేమై పోనా
నువ్ కాలు మోపిన చోటే.. 
ఈ భూమికి బ్యూటీ స్పాటే

ఫారన్లో నువ్ పుట్టుంటే.. తెల్లోలంతా డక్కౌటే

ట్వింకిల్ ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టారూ
అమ్మ అయ్య ఇంట్లో ఎవరూ లేరు..దేసి

ట్వింకిల్ ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్
తెరిచుంచెయ్వే పోరి ఫ్రంటు డోరు




సరా సరి గుండెల్లో దించావే పాట సాహిత్యం

 
చిత్రం: భీష్మ (2021)
సంగీతం: మహతి స్వర సాగర్
సాహిత్యం: శ్రీమణి
గానం: అనురాగ్ కులకర్ణి

నా కలలే.. నీ రూపం లో
ఎదురయ్యే నిజామా మాయ..
ఏవేవో ఊహలు నాలో మొదలయ్యే…

నా మనసే నింగిని దాటి ఎగిరెనులే
నిజమా మాయా… ఈ క్షణమే
అద్భుతమేదో జరిగెనులే..

ఏదో ఏదో చెప్పాలనిపిస్తుందే
నువ్వే నువ్వే కావాలనిపిస్తుందే
ఇంకా ఏదో అడగాలనిపిస్తుందే
నీతో రోజూ ఉండాలనిపిస్తుందే

ఓ.. నాలోనే నవ్వుకుంటున్నా
నాతోనే ఉండనంటున్న
నాకే నే కొత్తగా ఉన్నా నీ వల్లే… నీ వల్లే

ఓ.. నీ వెంటే నీడనౌతానే
నువ్వుండే జాడనౌతానే
నువ్వుంటే చాలనిపించే
మాయేదో చాల్లేవే

సరా సరి గుండెల్లో దించావే
మరీ మరీ మైకంలో ముంచావే… ఓ.
అయినా సరే ఈ భాద బాగుందే

అనుకోనిదే  మనిరువురి పరిచయం
ఓహో జతపడమని మనకిలా రాసుందే
మతి చెడి ఇలా.. నీ వెనకే తిరగడం

హుమ్.. అలవాటుగా నాకెలా మారిందే
ఆగలేని తొందరేదో  నన్ను తోసే నీ వైపిలా
ఆపలేని వేగమేదో నాలోపలా

ఇంత కాలం నాకు నాతో
ఇంత గొడవే రాలేదిలా
నిన్ను కలిసే రోజు వరకు
ఏ రోజిలా.. లేనే ఇలా..

సరా సరి గుండెల్లో దించావే
మరీ మరీ మైకంలో ముంచావే… ఓ.
అయినా సరే ఈ భాద బాగుందే





నీ నవ్వేమో సూపర్ క్యూటే పాట సాహిత్యం

 
చిత్రం: భీష్మ (2021)
సంగీతం: మహతి స్వర సాగర్
సాహిత్యం: శ్రీమణి
గానం: నకాష్ అజీజ్

హో ఆయ్ ఆయ్ యె
హో ఆయ్ ఆయ్ యె హో

నీ నవ్వేమో సూపర్ క్యూటే
నీ వైట్ చున్నీ సూపర్ క్యూటే
ఓ లుక్కు తోటి పెంచావే నాలో హార్ట్ బీటే
నీ నడకెంతో సూపర్ క్యూటే
నీ అవుట్ లుక్కే సూపర్ క్యూటే
నా కళ్ళకే నువ్వు మిస్ వరల్డ్ కన్నా అప్డేటే

సునామి లాగా పిల్ల అందాలె ఇళ్ల
ఆళ్లేస్తే ఎల్లా నా దిళ్లు ఫట్టే
ఓరచూపు వాల పడేస్తే
అలా పడుంటా నీలా.. నీ కాలి వెంటే
నువ్వు ఒప్పుకుంటే పిల్ల
నువ్వు నేనిల్లా లవ్వాడేసిల్లా నా లైఫ్ సెట్టే
ఆ కస్సుమంటే ఎల్లా..
కోపంలో కూడా అంత అందమేంటే
నా మాటే వినవేంటే

హో ఆయ్ ఆయ్ యె
మన జంటే సూపర్ క్యూటే

హో ఆయ్ ఆయ్ యె
హో ఆయ్ ఆయ్ యె

నీ కోసం ఎంత చేసిన
నా లైఫె రాసి ఇచ్చినా
కాస్తయినా కనికరించవే ఓ పిసినారి..
నువ్వెంతో వెతికి చూసినా,
లోకాలు జల్లెడేసిన
నాలాంటి వాడే దొరకడే ఓ సుకుమారి..

నీతో ఉండే ఫీలింగే సూపరే
నాతో కొంచెం ప్లేయింగే ఆపెయ్యవే
నాటి బ్యూటీ టార్చరే పెట్టకే 
ఇలా మన ఫ్యూచర్ని సెట్ చెయ్యవే..
నా మాటే వినవేంటే
మన జంటే సూపర్ క్యూటే




హే చూశా నేను నీ వైపు పాట సాహిత్యం

 
చిత్రం: భీష్మ (2021)
సంగీతం: మహతి స్వర సాగర్
సాహిత్యం: కృష్ణ చైతన్య
గానం: సంజనా కల్మంజి

హే చూశా నేను నీ వైపు
నువ్వు నన్నే చూడనంత సేపు
దోబుచులాటేదో నీతో బాగుందిరా
నా ఇష్టం దాచుకుంది చూపు
నా కోపం పెంకి కాసేపు
అంతులేని ఆశేదో ఎదలో దాగుందిరా

అలిగిన అడిగినా నీ దానిని
మురుసినా మెరిసినా నీ వల్లనే
తలచినా తరిమినా నీ ధ్యాసనే .. ఓహో.. ఓహో

గుప్పెడు గుండెలో అవుతోందని
నువ్వనీ నవ్వుతున్నా ముందరే.. 
అందుకే ఇంతగా ఈ అల్లరి .. ఓహో.. ఓహో

హా.. నా కోసం ఆరాటం ముద్దుగానే ఉంది చాలా
ఓ కొత్త మొహమాటం దీల కానీ ఈవేళ..

హా.. వెంటపడినది కంటపడనుగా
విచిత్రమో వింత వైఖరి..
సొంతవారితో ప్రయాణమా

అలిగిన అడిగినా నీ దానిని
మురుసినా మెరిసినా నీ వల్లనే
తలచినా తరిమినా నీ ధ్యాసనే .. ఓహో.. ఓహో

గుప్పెడు గుండెలో అవుతోందని
నువ్వనీ నవ్వుతున్నా ముందరే.. 
అందుకే ఇంతగా ఈ అల్లరి .. ఓహో.. ఓహో

Palli Balakrishna Saturday, January 23, 2021
Ranarangam (2019)




చిత్రం: రణరంగం (2019)
సంగీతం: ప్రశాంత్ పిళ్ళై, Karthik Rodriguez, సున్నీ MR
నటీనటులు: శర్వానంద్, కాజల్ అగర్వాల్, కళ్యాణి ప్రియదర్శిన్
దర్శకత్వం: సుదీర్ వర్మ
నిర్మాత: సూర్య దేవర నాగ వంశీ
విడుదల తేది: 02.08.2019



Songs List:



సీత కళ్యాన వైభోగమే పాట సాహిత్యం

 
చిత్రం: రణరంగం (2019)
సంగీతం: ప్రశాంత్ పిళ్ళై
సాహిత్యం: బాలాజీ 
గానం: శ్రీహరి .కె

పవనజ స్తుతి పాత్ర ఆ..
పావన చరిత్ర ఆ..
ప్రతి సోమమర నేత్ర ఆ..
రమనీయ గాత్ర ఆ..
సీత కళ్యాన వైభోగమే
రామ కళ్యాన వైభోగమే

శుభం అనేల అక్షింతలు
అలా దీవెనలతో
అటు ఇటు జనం హడావిడి తనం
తుళ్ళింతల ఈ పెల్లి లోగిల్లలొ
పదండని బందువులొకటై
సన్నయిల సందడి మొదలై
తధాస్తని ముడులు వేసెయ్
హెయ్ హెయ్.....

సీత కళ్యాన వైభోగమే
రామ కళ్యాన వైభోగమే

దూరం తరుగుతుంటె
గారం పెరుగుతుంటె
వనికె చేతులకు గాజుల
చప్పుడు చప్పున ఆపుకొని
గడేయక మరిచిన తలుపె
వెయండని సైగలు తెలిపె
క్షనాలిక కరిగిపోవా

సీత కళ్యాన వైభోగమే
రామ కళ్యాన వైభోగమే




పిల్ల పిక్చర్ పర్ఫెక్ట్ పాట సాహిత్యం

 
చిత్రం: రణరంగం (2019)
సంగీతం: సున్నీ MR
సాహిత్యం: కృష్ణ చైతన్య
గానం: నిఖితాగాంధీ 

అడుగె నాతొ అడుగై
యేదైన నన్నే అడిగై
ఆ వానకి నువ్వె గొడుగై నాతో అడుగై
పొగిడై నన్ను పొగిడై
నీ అంతెనె పొడుగై
అయ్ తేలానె కవ్వింతై నాతొ అడుగై

నేనెవరు అని జర తెలుసుకొని
పలువిదములుగ నా వద్దకుర
సాగర తీరం సాయం సమయం
నేనెవరు అని నా వద్దకు రా

పిల్ల పిక్చర్ పర్ఫెక్ట్
పిల్ల పిక్చర్ పర్ఫెక్ట్
పిల్ల పిక్చర్ పర్ఫెక్ట్

వేలా పాల లేని వేలాకోలాలన్ని
ఊగెనుగా మరి తూగెనుగా
నీల నాల లేని యెంతొ కొంత మంది
కలిసానుగా మాట కలిపెనుగా

నేనెవరు అని జర తెలుసుకొని
పలువిదములుగ నా వద్దకుర
సాగర తీరం సాయం సమయం
నేనెవరు అని నా వద్దకు రా

పిల్ల పిక్చర్ పర్ఫెక్ట్
పిల్ల పిక్చర్ పర్ఫెక్ట్
పిల్ల పిక్చర్ పర్ఫెక్ట్

కలే కల కలాములా
కథే ఇక మోదలవని గమనికల
ప్రాయం పంతం మోహం మంత్రం ఏకం అయ్యిందా
కూడికలైన కోరికలైన కనులకు విందేగా

పిల్ల దేశం మారినా కొంచం వేషం మారినా
ఆడ పిల్లే మారేనా
కొంచం మాటె కలపనా కాలం నీథొ గడపన
అడుగె నీతొ సాగనా

పిల్ల పిక్చర్ పర్ఫెక్ట్
పిల్ల పిక్చర్ పర్ఫెక్ట్
పిల్ల పిక్చర్ పర్ఫెక్ట్




కన్నుకొట్టి పాట సాహిత్యం

 
చిత్రం: రణరంగం (2019)
సంగీతం: Karthik Rodriguez
సాహిత్యం: కృష్ణ చైతన్య
గానం: Karthik Rodriguez

కన్నుకొట్టి చూసేనంట సుందరి
సుందర్ సుందరి
మనసు మీటి వెల్లేనంట మనోహరి
మనోహరి మనోహరి

కన్నుకొట్టి చూసేనంట సుందరి
మనసు మెటి వెల్లేనంట మనోహరి
ఆ లేత కళ్ళల్లొ మునిగిపోయానేమో సుందరి
నీ చూపు సూదల్లె గుచ్చుకుందొ ఏమో మనోహరి

కన్నుకొట్టి చూసేనంట సుందరి
మనసు మీటి వెల్లేనంట మనోహరి

ల ల ల ల లా ల ల లా

You Are My Groove
You Are My Kick
You Are My Snare
And You Are My Song
You Are My Green
You Are My Blue
You Are My Peace
And You Are My Pain
You Are My Breath
You Are My Smile
You Are My Cry
An You Are My Die
You Are My Soul
You Are My Feel
You Are My Heel
And You Are My Love

వింతవొ నియంతవొ
నువ్వెవరైన నిన్నునే వరించనా
తట్టుకొ ఆకట్టుకొ
అంటోంది మనసు
రేయిలొ స్మరించనా
మొదటి సారి అద్దంలొ
నన్నైతె చూసుకున్న
నీకు నేను నచ్చానొ లేదొ అని
మట్టి పైన పడేటి
ముత్యాల వెండి వాన
ఇంకిపోద నాలోకి నీల ఇలా హలా

కన్నుకొట్టి చూసేనంట
మనసు మీటి వెల్లేనంట
కన్నుకొట్టి చూసేనంట సుందరి
మనసు మీటి వెల్లేనంట మనోహరి



ఎవరో ఎవరో పాట సాహిత్యం

 
చిత్రం: రణరంగం (2019)
సంగీతం: ప్రశాంత్ పిళ్ళై
సాహిత్యం: కృష్ణ చైతన్య
గానం: ప్రీతి పిళ్ళై

ఎవరో ఎవరో నువ్వెవ్వరో
ఎవరో ఎవరో నీకెవ్వెవ్వరో
కురిసే చినుకంది నువ్వెవరో
వాలే పొద్దేమో నీకెవ్వెవ్వరో

పులకింతెవ్వరో పలికిందెవ్వరో
నీ జత ఎవరో ఎవరో ఎవ్వరో 

అడుగై నడిచేదెవ్వరో
ఓ వెలుగై నవ్వింది ఎవ్వరో
కాలం మనదే అలా
కారణమే ఉందలా
ఏకాంతమో నిశ్చాబ్ధమో
ఈ వేళలో ఎవ్వరో

పులకింతెవ్వరో పలికిందెవ్వరో
నీ జత ఎవరో ఎవరో ఎవ్వరో 

ఎవరో ఎవరో నువ్వెవ్వరో
ఎవరో ఎవరో నీకెవ్వెవ్వరో
కురిసే చినుకంది నువ్వెవరో
వాలే పొద్దేమో నీకెవ్వెవ్వరో

పదములుగా అడుగే వేసిందెవరో
పరుగులుగా ఆ గధి లేఖల ఎవరో
నును వెచ్చని వెన్నెలలో
చనువిచ్చిన చెలిమమెవరో
తొలి వేకువ జాములను
నీకై మరి మెరిసిందెవరో
వెలుగెవరో వేధంలా రా నిలిచేదెవరో

పులకింతెవ్వరో పలికిందెవ్వరో
నీ జత ఎవరో ఎవరో ఎవ్వరో 



కుమ్మెయ్ రా పాట సాహిత్యం

 
చిత్రం: రణరంగం (2019)
సంగీతం: Karthik Rodriguez
సాహిత్యం: కృష్ణ చైతన్య
గానం: Karthik Rodriguez

మామ ప్రేమరా పెద్ద బాల శిక్ష రా
మొదటి రెండు పేజీలు అర్దమవదు రా
బావ వేమన విడమరచి చెప్పెరా
తినగ తినగ వేప కూడ తియ్యనవును రా
ధమ్ముంటె చెప్పెయ్ రా
నో అందా గోవిందా

పద పద పదమని అనదే
అలకల చిలకే ఇది లే
మొరవిని మనసే ఇవ్వే
మగువా తియ్యకు పరువే
ఓ సారి చింతామని
వీలేశావే రా రమ్మని
నీ చూపే విసిరెయ్ మని
మొక్కానే ఆ పైవాడిని
దండాలే పెట్టెయ్ రా
దమ్ముంటె చెప్పెయ్ రా

కూసేటి రైలింజన్ లా
వచ్చింది వీధిలోకిలా
మచ్చేమొ నడుముపై అలా
మత్తెక్కె ఇప్ప సారలా
ఓ సారి చింతామని
ఓ సారి చింతామని
వీలేశావే రా రమ్మని
నీ చూపే విసిరెయ్ మని
మొక్కానే ఆ పైవాడిని
కుమ్మెయ్ రా కమ్మెయ్ రా
దమ్ముంటె చెప్పెయ్ రా

Palli Balakrishna Saturday, July 13, 2019

Most Recent

Default