చిత్రం: అహం రీబూట్ (2024) సంగీతం: శ్రీరామ్ మద్దూరి నటీనటులు: సుమంత్ దర్శకత్వం: ప్రశాంత్ సాగర్ అట్లూరి నిర్మాత: రఘువీర్ గొరిపర్తి విడుదల తేది: 30.06.2024
Aham Reboot (2024)
Palli Balakrishna
Thursday, April 30, 2026
చిత్రం: అనగనగా (2025) సంగీతం: చందు రవి నటీనటులు: సుమంత్, కాజల్ చౌదరి దర్శకత్వం: సన్నీకుమార్ నిర్మాతలు: రాకేష్ రెడ్డి గడ్డం, రుద్ర మాదిరెడ్డి విడుదల తేది: 15.05.2025
Anaganaga (2025)
Palli Balakrishna
చిత్రం: సార్ (2023) సంగీతం: జి.వి.ప్రకాష్ కుమార్ నటీనటులు: ధనుష్, సంయుక్త మీనన్, సుమంత్ (Cameo appearance) దర్శకత్వం: వెంకి అట్లూరి నిర్మాత: సూర్యదేవర నాగ వంశి విడుదల తేది: 17.02.2023
Songs List:
మాస్టారు మాస్టారు పాట సాహిత్యం
చిత్రం: సార్ (2023) సంగీతం: జి.వి.ప్రకాష్ కుమార్ సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి గానం: శ్వేతా మోహన్ శీతాకాలం మనసు నీ మనసున చోటడిగిందే సీతకుమల్లె నీతో అడుగేసే మాటడిగిందే నీకు నువ్వే గుండెలోనే అన్నదంతా విన్నాలే అంతకన్నా ముందుగానే ఎందుకో అవునన్నాలే ఇంకపైన నీకు నాకు ప్రేమ పాటాలే మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు అచ్ఛం నే కలగన్నట్టే నా పక్కన నిలిచారు మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు అచ్ఛం నే కలగన్నట్టే నా పక్కన నిలిచారు ఏవైపు పోనీవే నన్ను కాస్తైనా ఏకంగా కనుపాప మొత్తం నువ్వేనా ఇష్టంగా ఏ చోట నువ్వేం చేస్తున్నా చూస్తున్నా వందేసి మార్కులు వేస్తున్నా గుండెపై అలా నల్లపూసలా వంద ఏళ్ళు అందంగా నిను మొయ్యాలంటున్నా ఒంటి పేరుతో ఇంటి పేరుగా జంటగా నిను రాయాలంటున్నా మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు అచ్ఛం నే కలగన్నట్టే నా పక్కన నిలిచారు మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు అచ్ఛం నే కలగన్నట్టే నా పక్కన నిలిచారు శీతాకాలం మనసు నీ మనసున చోటడిగిందే సీతకుమల్లె నీతో అడుగేసే మాటడిగిందే నీకు నువ్వే గుండెలోనే అన్నదంతా విన్నాలే అంతకన్నా ముందుగానే ఎందుకో అవునన్నాలే ఇంకపైన నీకు నాకు ప్రేమ పాటాలే అచ్ఛం నే కలగన్నట్టే నా పక్కన నిలిచారు మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు
Sir (2023)
Palli Balakrishna
Monday, March 20, 2023
చిత్రం : సీతా రామం (2022) సంగీతం: విశాల్ చందసేఖర్ నటినటులు:దుల్కర్ సాల్మన్, రష్మిక మందన్న, మృణాల్ ఠాకూర్ దర్శకత్వం: హను రాఘవపూడి నిర్మాత: అశ్వని దత్ విడుదల తేది: 05.08.2022
Songs List:
ఓ సీతా వదలనిక పాట సాహిత్యం
చిత్రం : సీతా రామం (2022) సంగీతం: విశాల్ చందసేఖర్ సాహిత్యం: అనంత శ్రీరాం గానం: యస్.పి.బి.చరణ్ , రమ్యా బెహ్రా ఓ సీతా వదలనిక తోడౌతా రోజంతా వెలుగులిడు నీడౌతా దారై నడిపే చేతి గీత చేయి విడువక సాగుతా తీరం తెలిపెనే నుదుటి రాత నుదుట తిలకమై వాలుతా కనులలో మెరుపులా తారాడే కలని నేనౌతా హే రామా ఒకరికొకరౌతామా కాలంతో కలిసి అడుగేస్తామా రేపేం జరుగునో రాయగలమా రాసే కలములా మారుమా జంట జన్మనే గీయగలమా గీసే కుంచెనే చూపుమా మెరుపులో ఉరుములో దాగుంది నిజము చూడమ్మా ఓ సీతా వదలనిక తోడౌతా హే రామా ఒకరికొకరౌతామా నేరుగా పైకి తెలుపని పలుకులన్నీ నీ చూపులే నేలపై వాలుతున్నవి అడుగు అడుగున పువ్వులై ఓ వైపేమో ఓపలేని మైకం లాగుతోంది మరోవైపు లోకం ఏమి తోచని సమయంలో ఏది తేల్చని హృదయమో ఏమో బిడియమో నియమమో నన్నాపే గొలుసు పేరేమో నిదుర లేపడుగు ఒక్క నీ పేరే కలవరిస్తానులే నిండు నూరేళ్ల కొలువనే తెలిసి జాగు చేస్తావులే ఎపుడు లేదే ఏదో వింత బాధే వంత పాడే క్షణం ఎదురాయే కలిసొస్తావా ఓ కాలమా కలలు కునుకులా కలుపుమా కొలిచే మనిషితో కొలువు ఉండేలా నీ మాయ చూపమ్మా హాయ్ రామా రామా ఒకరికొకరౌతామా కాలంతో కలిసి అడుగేస్తామా దారై నడిపే చేతి గీత చేయి విడువక సాగుతా తీరం తెలిపెనే నుదుటి రాత నుదుట తిలకమై వాలుతా కనులలో మెరుపులా తారాడే కలని నేనౌతా
ఇంతందం దారి మల్లిందా పాట సాహిత్యం
చిత్రం : సీతా రామం (2022) సంగీతం: విశాల్ చందసేఖర్ సాహిత్యం: కృష్ణ కాంత్ గానం: యస్.పి.బి.చరణ్ ఇంతందం దారి మల్లిందా భూమిపైకే చేరుకున్నదా లేకుంటే చెక్కి ఉంటారా అచ్చు నీలా శిల్ప సంపదా జగత్తు చూడనీ మహత్తు నీదేలే నీ నవ్వు తాకి తరించె తపస్సీలా నిశీదులన్నీ తలొంచే తుషారాణివా విసుక్కునె వెళ్ళాడు చందమామయే నువ్వుంటే నా పనేంటనే ఈ నేలకే దిగేను కోటి తారలే నీకంత వెన్నెలేంటనే నీదే వేలు తాకి నేలే ఇంచు పైకి తేలే వింత వైఖరీ వీడే వీలు లేని ఏదో మాయలోకి లాగే పిల్ల తెంపరీ నదిలా దూకేటి నీ పైట సహజగుణం పులిలా దాగుంది వేటాడే పడుచుతనం దాసోహమంది నా ప్రపంచమే అదంత నీ దయే విసుక్కునె వెళ్ళాడు చందమామయే నువ్వుంటే నా పనేంటనే ఈ నేలకే దిగేను కోటి తారలే నీకంత వెన్నెలేంటనే చిలకే కోక కట్టి నిన్నే చుట్టుముట్టి సీతాకోకలాయేనా..! విల్లే ఎక్కుపెట్టి మెల్లో తాళి కట్టి మరలా రాముడవ్వనా అందం నీ ఇంట చేస్తోందా ఊడిగమే యుద్ధం చాటింది నీపైన ఈ జగమే దాసోహమంది నా ప్రపంచమే అదంత నీ దయే విసుక్కునె వెళ్ళాడు చందమామయే నువ్వుంటే నా పనేంటనే ఈ నేలకే దిగేను కోటి తారలే నీకంత వెన్నెలేంటనే
కానున్న కళ్యాణం ఏమన్నది పాట సాహిత్యం
చిత్రం : సీతా రామం (2022) సంగీతం: విశాల్ చందసేఖర్ సాహిత్యం: సిరివెన్నెల గానం: అనురాగ్ కులకర్ణి, సింధూరి. S ఆఆ ఆఆఆ ఆఆ ఆ ఆ ఆఆ కానున్న కళ్యాణం ఏమన్నది స్వయంవరం మనోహరం రానున్న వైభోగం ఎటువంటిది ప్రతి క్షణం మరో వరం విడువని ముడి ఇది కదా ముగింపులేని గాధగా తరముల పాటుగా... తరగని పాటగా ప్రతి జత సాక్షిగా... ప్రణయమునేలగా సదా కన్నుల్లోని కలలు అన్ని కరిగిపోని కలలుగా... కళ్ళముందు పారాడగా... (2) చుట్టు ఎవరూ ఉండరుగా కిట్టని చూపులుగా చుట్టాలంటూ కొందరుండాలిగా దిక్కులు ఉన్నవిగా గట్టిమేలమంటూ ఉండగా గుండెలోని సందడి చాలదా పెళ్లి పెద్దలెవరు మనకి మనసులే కదా అవా..! సరే..!! కన్నుల్లోని కలలు అన్ని కరిగిపోని కలలుగా... కళ్ళముందు పారాడగా.... (2) తగు తరుణం ఇది కదా మదికి తెలుసుగా తదుపరి మరి ఏమిటటా తమరి చొరవట..! బిడియమిదేంటి కొత్తగా తరుణికి తెగువ తగదుగా పలకని పెదవి వెనక పిలువు పోల్చుకో సరే మరి.! కన్నుల్లోని కలలు అన్ని కరిగిపోని కలలుగా... కళ్ళముందు పారాడగా... (2)
ఓ ప్రేమా పాట సాహిత్యం
చిత్రం : సీతా రామం (2022) సంగీతం: విశాల్ చందసేఖర్ సాహిత్యం: కృష్ణకాంత్ గానం: కపిల్ కపిలన్, చిన్మయి శ్రీపాద వస్తా… నే వెంటనే ఉంటా… నీ వెంటనే ముద్దంటిన చెంపపై తడి ఆరనే లేదులే మాటొకటి చెప్పెంతలో పయనాలు మొదలాయెనే ఓ ప్రేమా.. - ఓ ప్రేమా అవసరమా... - అవసరమా మాయే నీ...- మాయే నీ చిరునామా... - చిరునామా మనసంతా నీవే ప్రియా విరహాన్ని చంపేదెలా అంతరిక్షం అంచుదాక ప్రేమ తాకిందిగా నీతో ఙ్ఞాపకాలే ఈ మంచుల అవి కరగవే ఈ నీ పరిమళాలే గుండెలో నిండెలే ఓ ప్రేమా.. - ఓ ప్రేమా అవసరమా... - అవసరమా మాయే నీ...- మాయే నీ చిరునామా... - చిరునామా ఇటు చూడవా ప్రియతమా ఎడబాటు అనుకోకుమా కాలికిందే చిక్కుకుందీ చూడు నా ప్రాణమే దూరం ఆవిరాయే నీ వెచ్చనీ నిశ్వాసలో నిదురే చెదిరేలోపే తిరిగిరా స్వప్నమా ఓ ప్రేమా.. - ఓ ప్రేమా అవసరమా... - అవసరమా మాయే నీ...- మాయే నీ చిరునామా... - చిరునామా
2022
,
Dulquer Salmaan
,
Hanu Raghavapudi
,
Mrunal Thakur
,
Rashmika Mandanna
,
Sita Ramam
,
Sumanth
,
Vishal Chandrasekhar
Sita Ramam (2022)
Palli Balakrishna
Tuesday, August 2, 2022
చిత్రం: మళ్ళీ మొదలైంది (2021) సంగీతం:అనూప్ రూబెన్స్ నటినటులు: సుమంత్ , నయన గంగూలీ దర్శకత్వం: టి.జి.కీర్తి కుమార్ నిర్మాత: కె.రాజశేఖర్ రెడ్డి విడుదల తేది: 17.11.2021
Songs List:
ఏంటో ఏమో జీవితం పాట సాహిత్యం
చిత్రం: మళ్ళీ మొదలైంది (2021) సంగీతం:అనూప్ రూబెన్స్ సాహిత్యం: కృష్ణ చైతన్య గానం: సాయి చరణ్ ఆ ఏంటో, ఆ ఏమో ఆ ఏంటో ఏమో జీవితం ఎందుకిలా చేస్తాదో జీవితం అరె..! ఏంటో ఏమో జీవితం ఎందుకిలా చేస్తాదో జీవితం ఏ సూడబోతే తెల్లగున్న కాగితం ఏ రాసుకున్న చెరిగిపోదు నీ గతం ఏ నిన్ను చూసి నవ్వేస్తు… నీ సరద తీరుస్తూ ఎవ్వడిని వదిలి పెట్టదూ ఏ అటో ఇటో ఎటో ఎటో… సాగుతున్న జీవితం సరాసరి సవాలుగా మారేనా అరె..! చిన్న పెద్ద ఊరు వాడా… నవ్వనే నవ్వగా పెళ్ళే పెటాకులై పోయే దేవుడా ఏ చిక్కులో పడ్డావు… చిక్కు ముడివయ్యావు వేగు చుక్కల నువ్వు… అట్ట ఎట్టా మిగిలావు సీతలేని ఓ రామ… ఎందుకో ఈ డ్రామా లంక తగలెట్టాక… ఏమైందో భామ గ్లాసు బాసు దేవదాసు… సోలో లైఫే సూపర్ బాసు చేతులు రెండూ కాలే దాకా… ఆకులు నువ్వే పట్టవయ్యో సుడిగుండం దాటేదేట్టా, హా ఏ అటో ఇటో ఎటో ఎటో… సాగుతున్న జీవితం సరాసరి సవాలుగా మారేనా అరె..! చిన్న పెద్ద ఊరు వాడా… నవ్వనే నవ్వగా పెళ్ళే పెటాకులై పోయే దేవుడా ఏ వంటలో నల భీమా… చెయ్యలేదా భీమా పెళ్లి రుచి తెలిసిందా… చేదు కారం తగిలాయ మంట ముందు పెట్టాకే… పెళ్లి చేస్తారయ్యా మంట కింద పెట్టేదే… పెళ్లి పెళ్లాం ప్రేమ మగువ తగువా కలిసొచ్చాక… సులువా విలువ పోయేదాకా పిల్లే నిన్ను ఒగ్గేశాక… తట్టా బుట్టా సర్దేశాక సొంతూరే ఎల్లకు బ్రదరూ ఏ అటో ఇటో ఎటో ఎటో… సాగుతున్న జీవితం సరాసరి సవాలుగా మారేనా అరె..! చిన్న పెద్ద ఊరు వాడా… నవ్వనే నవ్వగా పెళ్ళే పెటాకులై పోయే దేవుడా
అలోన్ అలోన్ పాట సాహిత్యం
చిత్రం: మళ్ళీ మొదలైంది (2021) సంగీతం:అనూప్ రూబెన్స్ సాహిత్యం: కృష్ణ చైతన్య గానం: సిద్ శ్రీరాం , అనూప్ రూబెన్స్ కనులకు తెలియని ఓ కలలా… వెళిపోయావే నువ్వు ఎలా మిగిలానే నే ఓ శిలలా, అలోన్ అలోన్ అలోన్… అలోన్ అలోన్ ఐ యామ్ లోన్లీ… ఐ యామ్ సో లోన్లీ అలోన్ అలోన్… అలోన్ అలోన్ ఐ యామ్ లోన్లీ… ఐ యామ్ సో లోన్లీ, యాయి యే కనులకు తెలియని ఓ కలలా వెళిపోయావే నువ్వు ఎలా మిగిలానే నే ఓ శిలలా, అలోన్ విడివిడి అడుగులు పడెను ఎలా కలవని జంటల ఓ కధలా ఒంటరి మనసులో ఓ వ్యధలా, అలోన్ ఓ ఆ ఆ, వదిలెళ్ళిపోకే నన్నూ… వదులుకోలేనే నిన్నూ మన గతములోనే ఉన్నాను… ఓ చెలీ ఓ చెలీ అలోన్ అలోన్ (అలోన్)… అలోన్ అలోన్ (అలోన్) అలోన్ అలోన్, ఐ యామ్ లోన్లీ… ఐ యామ్ సో లోన్లీ తలచావా చెలి నువ్వు అలా పొలమారిందే ఎందుకిలా వేరెవరూ నాకేమి ఇలా, అలోన్ చిరునవ్వులకే సంకెళ్ళా వెళిపోయావే ప్రియురాలా గతమే నువ్వని మరవాలా, అలోన్ వదిలెళ్ళిపోకే నన్నూ… వదులుకోలేనే నిన్నూ మన గతములోనే ఉన్నాను ఓ చెలీ (ఓ చెలీ)… ఓ చెలీ (ఓ చెలీ) వదిలెళ్ళిపోకే నన్నూ… వదులుకోలేనే నిన్నూ మన గతములోనే ఉన్నాను ఓ ఓ చెలీ (ఓ చెలీ)… ఓ చెలీ (ఓ చెలీ) అలోన్ అలోన్
Malli Modalaindi (2021)
Palli Balakrishna
Monday, November 1, 2021
చిత్రం: కపటదారి (2021) సంగీతం: సిమోన్ కె. కింగ్ నటీనటులు: సుమంత్, నాజర్, శ్వేత నందిత దర్శకత్వం: ప్రదీప్ కృష్ణ మూర్తి నిర్మాతలు: జి. ధనుంజయన్, లలిత ధనుంజయన్ విడుదల తేది: 26.02.2021
Songs List:
కపటదారి పాట సాహిత్యం
చిత్రం: కపటదారి (2021) సంగీతం: సిమోన్ కె. కింగ్ సాహిత్యం: భాషా శ్రీ గానం: నిరంజ్ సురేష్ కపటదారి
కలలో కనుపాపే పాట సాహిత్యం
చిత్రం: కపటదారి (2021) సంగీతం: సిమోన్ కె. కింగ్ సాహిత్యం: వనమాలి గానం: ప్రదీప్ కుమార్ కలలో కనుపాపే ఎదురుగ నీ రూపం నిలిపిందే కదిలే ఆ గురుతే కనుమరుగై గతమేదో తోడిందే అలలుగా నీ ఊహలే నను తాకుతూ నా గుండెనే తొలిచాయిలే మనసున నీ జ్ఞాపకం నను కాల్చుతూ నాతో నీడై సాగేలే కలలో కనుపాపే ఎదురుగా నీ రూపం నిలిపిందే కదిలే ఆ గురుతే కనుమరుగై గతమేదో తోడిందే అలలుగా నీ ఊహలే నను తాకుతూ నా గుండెనే తొలిచాయిలే మనసున నీ జ్ఞాపకం నను కాల్చుతూ నాతో నీడై సాగేలే నిలపద నా ఆకాశం నీ నవ్వుల నక్షత్రం, ఎదుటే ఎపుడూ వెనకటి నా ఆనందం మరలద ఇక నా కోసం, జతగా ఇపుడూ నా నిజం కలగా ఈనాడిలా కథగా మార్చేస్తుంటే మౌనంగానే నమ్మే తీరాలా ఈ వేళా కలలో కనుపాపే ఎదురుగా నీ రూపం నిలిపిందే కదిలే ఆ గురుతే కనుమరుగై గతమేదో తోడిందే నడిచిన నా ప్రతి అడుగు వెతికెనులే నీ కొరకు, నిదురే మరిచి నిను విడువక నీ ఒడిలో గడిపిన నా ప్రతి నిమిషం రాదా తిరిగి ఆయువే అలసి నా ఆశలే ముగిసి నీవేలేని నా లోకంలో నేనేమౌతానో ఈ వేళా కలలో కనుపాపే ఎదురుగా నీ రూపం నిలిపిందే కదిలే ఆ గురుతే కనుమరుగై గతమేదో తోడిందే అలలుగా నీ ఊహలే నను తాకుతూ, నా గుండెనే తొలిచాయిలే మనసున నీ జ్ఞాపకం నను కాల్చుతూ, నాతో నీడై సాగేలే
హే హయక్కి హయక్కి పాట సాహిత్యం
చిత్రం: కపటదారి (2021) సంగీతం: సిమోన్ కె. కింగ్ సాహిత్యం: వనమాలి గానం: సన మోయిదుట్టి చెలరేగే చీకటిలో నను కాల్చే వ్యధ తీర్చే జత నీవే కదా మరల మరల తనువు కోరే సరదా Hop up in this club with some models… models Sit in VIP poppin bottles… bottles We aint slow in down We full throttle we just do it Big homie we just so colossal You just break it now Baby girl you know to work it Bounce it to the sides and i love the way you twerk it Shake it now break it exoyic like teriyaki Spin it disc jockey I’m dance in with this hayakki హే హయక్కి హయక్కి పట్టూ పట్టూ పట్టూ నా పైకి పాకి నన్ను చుట్టు ముట్టు హే హాయక్కి హాయక్కి పట్టూ పట్టూ పట్టూ నా పైకి పాకి నన్ను చుట్టు ముట్టు నా పోగరెంతో నువ్ పసిగట్టు నీ దెయ్యం వదిలలిస్తా ఈ పరువాన్నే ఓ పని పట్టు నా దేహం అరువిస్తా I love it the way you shake it around Girl you make me psycho Keep what you do in dont ever stop it babe Make my mind blow cant make my mind blow Cant get you out cant cant cant Get you out of my mind when the night is done Let me take control Inni inni hayakki Inni inni hayakki హే హయక్కి హయక్కి పట్టూ పట్టూ పట్టూ నా పైకి పాకి నన్ను చుట్టు ముట్టు హే హాయక్కి హాయక్కి పట్టూ పట్టూ పట్టూ నా పైకి పాకి నన్ను చుట్టు ముట్టు Hayaki on the floor Yalla yalla Inni inni hayakki Valla haabee bee Valla haabee bee Valla haabee bee Inni inni hayakki ఓ నా ఒళ్లోకొచ్చి మన్మధుడే పొనంటున్నాడే ఆ ఇంద్రుడేమో శ్వర్గమంటే చీ కొట్టేశాడే నా అందాలన్నీ కొల్లగొట్టి వెళ్ళాలని గుమిగూడి గుమిగూడి పోదా లోకమే నా శిల్పం చెక్కి చూడు సరదాగా ఆ బ్రహ్మే నీకు సలాం చేస్తాడే నా బొమ్మే గీసి చూడు అలవోకగ పికాసో పుట్టాడ నీ కళ్లే పట్టాడ హయక్కి బేబీ హయక్కి బేబీ నా సొగసుకు దాసోహం ఎందరెందరో హయక్కి బేబీ హయక్కి బేబీ నే ఓరకంట చూసాన చిత్తు చిత్తురో ఎట్టా సోకిందే నీ గాలిట్టా బెట్టే ఏందంట వొళ్ళో వాలిట్టా కూసే ఓ పిట్టా ఇచ్చేయ్యిట్టా మా వాటా పరిచే నీ పైట ఇన్ని ఇన్ని హైకి ఓ యః హే హయక్కి హయక్కి పట్టూ పట్టూ పట్టూ నా పైకి పాకి నన్ను చుట్టు ముట్టు హే హయక్కి హయక్కి పట్టూ పట్టూ పట్టూ నా పైకి పాకి నన్ను చుట్టు ముట్టు
Theme of Kapatadhaari పాట సాహిత్యం
చిత్రం: కపటదారి (2021) సంగీతం: సిమోన్ కె. కింగ్ సాహిత్యం: సైమన్ కె.కింగ్ గానం: సైమన్ కె.కింగ్ Theme of Kapatadhaari
# పాట సాహిత్యం
చిత్రం: కపటదారి (2021) సంగీతం: సిమోన్ కె. కింగ్ సాహిత్యం: గానం: శబ్దమే
2021
,
G. Dhananjayan
,
Kapatadhaari
,
Lalitha Dhananjayan
,
Nandita Swetha
,
Pradeep Krishnamoorthy
,
Simon K. King
,
Sumanth
Kapatadhaari (2021)
Palli Balakrishna
Monday, March 15, 2021
చిత్రం: అనగనగా ఒక రౌడీ (2022) సంగీతం: మార్క్ కె.రాబిన్ నటీనటులు: సుమంత్ దర్శకత్వం: మను యజ్ఞా నిర్మాత: గార్లపాటి రమేష్, డా.టి.ఎస్. వినీత్ భట్ విడుదల తేది: 2022
Anaganaga Oka Rowdy (2022)
Palli Balakrishna
Saturday, February 13, 2021






