Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Sudhakar Cherukuri"
Dasara (2023)



చిత్రం: దసరా (2023)
సంగీతం: సంతోష్ నారాయణ్ 
నటీనటులు: నాని , కీర్తి సురేష్ 
దర్శకత్వం: శ్రీకాంత్ ఓదెల
నిర్మాత: సుధాకర్ చెరుకూరి 
విడుదల తేది: 30.03.2023



Songs List:



ధూం ధాం దోస్తాన్ పాట సాహిత్యం

 
చిత్రం: దసరా (2023)
సంగీతం: సంతోష్ నారాయణ్ 
సాహిత్యం: కాసర్ల శ్యామ్
గానం: రాహుల్ సిప్లిగంజ్, గొట్టే కనకవ్వ

ఉంటే వైకుంఠం లేకుంటే ఊకుంటం
అంత లావైతే గుంజుకుంటం తింటం పంటం
ఐతై ఐతై ఐతై ఐతై బద్దల్ బాషింగాలైతై

అరె ఏం కొడుతుర్ర బై ఊకోర్రి
నీ యవ్వ మా మావగాడు శెప్పుడు సరే మీరు కొట్టుడు సరే
అరె ఓ నైంటి ఈల్లకు ఇంకో నైంటి పోయ్రా
ఎట్ల కొట్టరో సూత్త నీ యవ్వ్

పవ్వగొట్టు పవ్వగొట్టు
బోటికూర దానంచుకు వెట్టు
బ్యాండు గొట్టు బ్యాండు గొట్టు
వాడకట్టు లేసూగేటట్టు

గుద్దితే సూస్కో ఓ అద్ధశేరు
గజ్జల గుర్రం ఈ సిల్కుబారు
ఇచ్చి పడేద్దాం
చల్ కుచ్చి పడేద్దాం
ఎవ్వడడ్డమొత్తడో జూద్దాం బాంచెత్

ధూం ధాం దోస్తాన్ ఇరగమరగ చేద్దాం
ధూం ధాం దోస్తాన్ ఇరగమరగ చేద్దాం
ధూం ధాం దోస్తాన్ ఇరగమరగ చేద్దాం
ధూం ధాం దోస్తాన్ ఇరగమరగ చేద్దాం

టెక్క టెకం టెక్క టెకం
టెక్క టెకం టిటక్ టిటక్
డింక టకం డింక టకం
డుర్ర డుర్ర డుర్ర

కంట్రోల్ బియ్యం కారం మెతుకుల్
సుట్టూర దోస్తుల్ గివ్వే మా ఆస్తుల్
జమ్మిని బొగ్గును బంగారమే అంటం
బంగారంలాంటి మనుషుల్లో ఉంటం

డొక్కలు నింపే ఊరే మా అవ్వ
జేబులు నింపే రైలే మా అయ్య
బర్ల మోత ఆ శెర్ల ఈత
ఇగ కోడి కూత మాకేం ఎరుక బాంచెత్

ధూం ధాం దోస్తాన్ ఇరగమరగ చేద్దాం
ధూం ధాం దోస్తాన్ ఇరగమరగ చేద్దాం
ధూం ధాం దోస్తాన్ ఇరగమరగ చేద్దాం
ధూం ధాం దోస్తాన్ ఇరగమరగ చేద్దాం

ధూం ధాం అరె ధూం ధాం
భలె భలె భలె భలె భలె
హ హు హా హే

సిత్తూ సిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ
బంగారి బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన
రాగి బిందె తీస్క రమణి నీళ్ళకు బోతే
రాములోరెరాయేనమ్మో ఈ వాడలోన

తీట లెక్కల్ జేస్తేనే జోరు
ఘాటుగా ఉండాలిరా బతుకు తీరు
నల్లీ బొక్కల్ జూత్తే ఉషారు
ఏం తింటవ్రా ఉప్పు లేని పప్పు శారు

గోశి గొంగడి మా కట్టుబొట్టు
ఎట్లైతే గట్లైతది సూస్కుందాం పట్టు
అంబలి గట్క మాది రాచ పుటక
పూట పూట మాకే దసరా బాంచెత్

ధూం ధాం దోస్తాన్ ఇరగమరగ చేద్దాం
ధూం ధాం దోస్తాన్ ఇరగమరగ చేద్దాం
ధూం ధాం దోస్తాన్ ఇరగమరగ చేద్దాం
ధూం ధాం దోస్తాన్ ఇరగమరగ చేద్దాం

ధూం ధాం అరె ధూం ధాం
భలె భలె భలె భలె భలె
హు హా హు హే



ఓరి వారి నీది గాదురా పోరి పాట సాహిత్యం

 
చిత్రం: దసరా (2023)
సంగీతం: సంతోష్ నారాయణ్ 
సాహిత్యం: శ్రీమణి
గానం: సంతోష్ నారాయణ్ 

ఓరి వారి నీది గాదురా పోరి
ఇడిసెయ్ రా ఇంగ ఒడిసెను దారి
ఓపారి అవ్వ ఒడిలో దూరి
మరిసెయ్ రా సిన్న మొల్లిగా మారి

బాల్యమే గొప్పది బాధ మర్షిపోతది
చందమామ రాదనే నిజము నమ్మనంటది
చిన్న పల్లీపట్టీకె ఏడుపాపి చూస్తది
కోడె ఈడు సెడ్డది నిజాన్ని కోడై కూస్తది

ఓరి వారి నీది గాదురా పోరి
బజ్జోరా సంటి బిడ్డగా మారి

హో హో హో హో హో హోహో
హో హో ఓహో హోహో హో
హో హో హో హో హో హోహో
హో హో ఓహో హోహో హో

ప్రేమ నాలో దాచిన
చిన్న బొడ్డెమ్మగానే గావురంగా
నిన్ను నేనే వద్దనీ
గిరిగీసుకున్న గింత దెల్వకుంటా

రగిలి నా వేదనే దీపమోలే వెట్టినా
పేర్చినా బతుకమ్మనే
కన్నీళ్ళలో సాగదోలిన ఇడిచేసి వదిలేశిన

రెక్కలిరిగినట్టి ఈగ
సుడిగాలిలో చిక్కినట్టు
దిక్కు మొక్కు లేని కన్ను
ఎక్కి ఎక్కి ఎడ్శినట్టు

నీకు దగ్గరవ్వలేక
దూరమయ్యే దారిలేక
చితికిపోయే నా బతుకిలా
గుండె పుండు మీద
గొడ్డు కారమద్ది గుద్దుతుంటే
గుక్కపట్టి ఏడవలేని జన్మా

ఓ ఓఓ ఓ ఓఓ ఓ
ఊ ఊ ఊ ఊ ఊ ఊ ఊ
హో హో హో హో హో హోహో
హో హో ఓహో హోహో హో



చమ్కీల అంగీలేసి పాట సాహిత్యం

 
చిత్రం: దసరా (2023)
సంగీతం: సంతోష్ నారాయణ్ 
సాహిత్యం: కాసర్ల శ్యామ్
గానం: ధీ, రామ్ మిరియాల 

చమ్కీల అంగీలేసి ఓ వదినే
చాకు లెక్కుండేటోడే ఓ వదినే
కండ్లకు ఐనా బెట్టి
కత్తోలే కన్నెట్ల కొడ్తుండెనే

సినిగిన బనీనేసి ఓ వదినే
నట్టింట్ల కూసుంటడే ఓ వదినే
మాసిన లుంగీ ఏసి ఎప్పుడు
మంచంలనే పంటడే

హే పెండ్లైన కొత్తల అత్తర్లు పూసిన్నే
నీ సీర సింగులువట్టి ఎనకెనక తిరిగిన్నే
ముద్దులిస్తుండే పూలు తెస్తుండే
శెక్కర లెక్క నీ మాటలుంటుండే
మారే నీ తీరు పెరిగే నీ నోరు
మందుకలవాటైతినే

కడుపులో ఇంత వోసి ఓ వదినే
కొడ్తడే బండకేసి ఓ వదినే
అమాస పున్నానికో అట్లట్లా
అక్కరకు పక్కకొత్తాడే

చమ్కీల అంగీలోడే
నాకు జుమ్కీలు అన్న తేడే

వీడు వంటింట్ల నేనుంటే
సాటుంగ వత్తుండె
వంకర నడుము గిచ్చుతుండే
నేడు ఎంత సింగారించిన
వంకలు పెడుతుండే
తైతక్కలాడకంటుండే

కంట నీరన్న వెట్టకుండా
సంటి బిడ్డ లెక్క నిన్ను
అలుగుతుంటే బుదరగియ్యలేదా

నువ్వు సీటికి మాటికి
గింతదాన్ని గంత జేసి
ఇజ్జతంత బజార్లేస్తలేవా

ఏం గాలి సోకేనో ఓ ఓ
వీన్నెత్తి తిరిగెనో ఓ ఓ
పాతబడ్డనేమో శాతనైతలేదో
ఉల్టా నన్నిట్ల మందీ ముంగట్ల
బదనాం జేత్తడే

చమ్కీల అంగీలేసి ఓ వదినే
చాకు లెక్కుండేటోడే ఓ వదినే
కండ్లకు ఐనా బెట్టి
కత్తోలే కన్నెట్ల కొడ్తుండెనే

నోరిడిసి అడగదుర బామ్మర్ది
శెప్పింది చెయ్యదుర బామ్మర్ది
పక్కింట్లో కూసుంటది
నా మీద శాడీలు జెప్తుంటది

నా గొంతు కోసిర్రంటూ బామ్మర్ది
శోకాలు వెడ్తుంటది బామ్మర్ది
ముచ్చట్లు జెప్పబోతే మీ అక్క
మూతంతా తిప్పుతుంటది

శీకట్ల ఉన్నా వాకిట్ల ఉన్నా
కంటికి రెప్పోలే కాస్తడు మొగడు
ఎంత లొల్లైనా నువ్వెంట ఉంటె
ఎదురు నిలిశి వాడు గెలిశి వస్తాడు

గోసల్ని జూస్తా ఉన్నా
ఏదైనా గుండెల్ల దాస్తాడులే
నీ బొట్టు నీ గాజులే ఎంతైనా
వాని పంచ పాణాలులే

Palli Balakrishna Monday, March 20, 2023
Ramarao on Duty (2022)



చిత్రం: రామారావు (On Duty) (2022)
సంగీతం: మహతి స్వర సాగర్ 
నటీనటులు: రవితేజా, రాజిష విజయన్ , దివ్యన్ష కౌషిక్
దర్శకత్వం: శరత్ మండవ 
నిర్మాత: సుధాకర్ చెరుకూరి 
విడుదల తేది: 17.06.2022



Songs List:



బుల్ బుల్ తరంగ్ పాట సాహిత్యం

 
చిత్రం: రామారావు (On Duty) (2022)
సంగీతం:  మహతి స్వర సాగర్ 
సాహిత్యం: రాకేందు మౌళి
గానం: సిద్ శ్రీరాం

ఓ ఓ ఓ ఓహో హో ఓ ఓ ఓ
తూలే గిరగిరమని బుర్రే ఇట్టా
తేలిందే నెలవంతా అడుగుల వెంటా
ఓ ఓ ఓ ఓహో హో ఓ ఓ ఓ

బుల్ బుల్ తరంగ్ బుల్ బుల్ తరంగ్
లోకం ఊగే గుండె
లబ్ డబ్బు మాని నీపేరై మోగే
ఏదేదో భాషల్లో… నవ్వే వాగే పిల్లా
అల్లాడి నీవైపు మనసే లాగే

నింగే రంగుల్ని వానై చల్లే
ఉబ్బి తబ్బిబ్బై మబ్బే
గాలే గంజాయి వాసనలే వీచే
మత్తే చిత్తయ్యే ముద్దిచ్చినావే

తూలే గిరగిరమని బుర్రే ఇట్టా
తేలిందే నెలవంతా అడుగుల వెంటా
కాలే పెదవులపై ముద్దుల చిట్టా
వాలిందే ఎద గూటిన పాలపిట్ట

అద్దానికి ఈ రాయికి
ఓ వింత ప్రేమ మొదలయ్యే
అద్దం అలా రాయినే ఇలా
తాకంగా రాయి పగిలెనే

పాతాళమా ఇది ఆకాశమా
నీ ప్రేమలో పడుతూనే ఎగిరా
నా బుజ్జి బంగారం నాప్రేమ నీతోనే
బ్రతుకంతా చెరి సగమై బ్రతికేద్దామా

తూలే గిరగిరమని బుర్రే ఇట్టా
తేలిందే నెలవంతా అడుగుల వెంటా
కాలే పెదవులపై ముద్దుల చిట్టా
వాలిందే ఎద గూటిన పాలపిట్ట

బుల్ బుల్ తరంగ్ బుల్ బుల్ తరంగ్
లోకం ఊగే గుండె
లబ్ డబ్బు మాని నీపేరై మోగే
ఏదేదో భాషల్లో… నవ్వే వాగే పిల్లా
అల్లాడి నీవైపు మనసే లాగే




సొట్టల బుగ్గల్లో పాట సాహిత్యం

 
చిత్రం: రామారావు (On Duty) (2022)
సంగీతం:  మహతి స్వర సాగర్ 
సాహిత్యం: కళ్యాణ్ చక్రవర్తి 
గానం: హరిప్రియ, నకుల్ అభయంకర్

నేనేనా నేనేనా నిన్న మొన్న
ఉన్నది మరి నేనేనా
నిన్నేనా నిన్నేనా ఇన్నాళ్ళుగా
చూస్తున్నది నిన్నేనా

ఆ, మీసాల ఆసామివేరా
మీటితే నవ్వుల నగార
పొంగని బంగారం నా కొంగున ముడివేరా

మాయగా ఉన్నాదిలేరా
మాయనీ నీ ప్రేమ పహారా
నీతోటి ఏకాంతాలే చాలని నిడివేరా

సొట్టల బుగ్గల్లో రాసుకుపోయావే నన్నే నీ పేరా

రాసానుగా రాసానుగా
నిన్ను నన్ను చేర
ఈ సరదా ఈ సరదా
ఎపుడో మన పేరా

గుమ్మోడిని చెబుతారా
నిన్నిదిగా వలచారా
నను నీలో మనసారా కలిపేశారా

చిగురించా నలుసారా
నీ పోలికే నను చేరా
అది నీలో చూస్తుంటే బాగుందిరా

చాటుగా ఇన్నాళ్లనుంచి
దాచినా ఈ మాటలన్నీ
చెప్పనీ నీకే నన్నే
మోమాటాన్నే దాటి ఈ వేళ

సొట్టల బుగ్గల్లో రాసుకుపోతారా
నన్నే నీ పేరా

రాసానుగా రాసానుగా
నిన్ను నన్ను చేర
ఈ సరదా ఈ సరదా
ఎపుడో మన పేరా

గురువాత అనకుండా
దరువేది పడకుండా
కురులై నే కురిశారా నీ ఎదపైన

ఎదరాలి పొడులంతా
ఎదురయ్యి పరిచార
దరి చేరి దరిమిళనే నీకందించారా

ఎవరు రాలేనంత దగ్గరై
ఉంటె నీ చెంత చాలుగా
చెంపకు చారెడు కన్నుల
కాటుక నీకే అంటేలా

హ చిక్కని చీకట్లో
చిక్కని వయ్యారం చిక్కించుకోరా
రాసానుగా రాసానుగా నిన్ను నన్ను చేర
ఈ సరదా ఈ సరదా ఎపుడో మన పేరా




నా పేరు సీసా.. పాట సాహిత్యం

 
చిత్రం: రామారావు (On Duty) (2022)
సంగీతం:  మహతి స్వర సాగర్ 
సాహిత్యం: చంద్రబోస్ 
గానం: సామ్ CS

అహ్హ హ్హా హ్హా హాహ
ఏం పేరు నీది పాప?
సీసా..!, ఆ..!!
అవును, సీసా.
సీ అంటే సీకాకుళం
సా అంటే సారంగి

నా పేరు సీసా
టుంబ టుంబటకు
టుంబ టుంబటకు
టుంబ టుంబటకు టుం టుం టుం
టుంబ టుంబటకు
టుంబ టుంబటకు
టుంబ టుంబటకు టుం టుం టుం

నా పేరు సీసా… నా పేరు సీసా
నా పేరు సీసా… నా పేరు సీసా, సీసా

ఒకరికి నే తేనె సీసా
ఒకరికి నే కల్లు సీసా
ఒకరికి నే మసాలా సీసా
ఇంకొకరికి రసాల సీసా

అందరికి అందరికి
అందరికి అందిస్తాను
స్వర్గానికి వీసా

నా పేరు సీసా… నా పేరు సీసా
నా పేరు సీసా… నా పేరు సీసా

టుంబ టుంబటకు
టుంబ టుంబటకు
టుంబ టుంబటకు టుం టుం టుం
టుంబ టుంబటకు
టుంబ టుంబటకు
టుంబ టుంబటకు టుం టుం టుం

ముట్టుకోకుండా… (టుంబ టుంబటకు)
ముద్దు పెట్టేస్తా..!
కనీసం పట్టుకోకుండా… (టుంబ టుంబటకు)
కౌగిలించేస్తా..!

చెంతకి రాకుండా చెమటలు పట్టిస్తా
కనీసం పక్కకి రాకుండా పండగ జరిపిస్తా
ఉన్నా చోటునే ఉంటా, హా ఆఆ హా ఆఆ హా ఆఆ
హా ఆఆ ఆఆ ఆ

ఉన్నా చోటునే ఉంటా
నీలో ఊపు ఉడుకు పుట్టిస్తా
(ఎట్టా ఎట్టా ఎట్టా)
ఉన్నా చోటునే ఉంటా
నీలో ఊపు ఉడుకు పుట్టిస్తా

నేను కాదు… నా ఫోటో చాలు
నేను కాదు నా ఫోటో చాలు
తిరుస్తుంది మీ ఆశ

నా పేరు సీసా… నా పేరు సీసా, సీసా
ఒకరికి నే నీటి సీసా
ఒకరికి నే సెంటు సీసా
ఒకరికి నే సోడా సీసా
ఇంకొకరికి సెలైను సీసా

అందరికి అందరికి
అందరికి అందిస్తాను
స్వర్గానికి వీసా

నా పేరు సీసా… నా పేరు సీసా
నా పేరు సీసా, సీసా… నా పేరు సీసా

టుంబ టుంబటకు
టుంబ టుంబటకు
టుంబ టుంబటకు టుం టుం టుం
టుంబ టుంబటకు
టుంబ టుంబటకు
టుంబ టుంబటకు టుం టుం టుం

టుంబ టుంబటక హా
టుంబ టుంబటక, హా




కింగ్ అఫ్ ద క్రౌడ్ పాట సాహిత్యం

 
చిత్రం: రామారావు (On Duty) (2022)
సంగీతం:  సామ్ CS
సాహిత్యం: శరత్ మండవ 
గానం: లవిత లోబో 

హి ఈజ్ ఎ మాస్టర్ ఆర్ ఏ సర్వెంట్
ఆర్ ద కింగ్ అఫ్ ద క్రౌడ్
ఇట్స్ నాట్ ఈజీ టు క్రష్
లీడర్ ఆఫ్ ద ప్యాక్

సిన్సియర్ దో డీవియస్
హిస్ సోల్ సో బ్రేవ్ అండ్ ప్యూర్
డజ్ హీ ఒబె
డజ్ హీ వయోలెట్
వన్ షల్ నెవెర్ నో

డాడ్జింగ్ ద డ్యూటీస్
డోంట్ గో వెల్ విత్ హిం
కింగ్ ఆఫ్ ద క్రౌడ్
లీడర్ ఆఫ్ ద ప్యాక్
గన్స్ షాట్స్ ఆఫ్ ఫైర్
అండ్ ద కంట్రీస్ హిస్ మదర్
అండ్ నౌ లైక్ హిమ్ నో అదర్
హీ ఈజ్ నెవర్ నెవర్
నెవర్ గొన్నా టైర్

లా ఒప్ప్రెస్సెస్స్ దట్ ట్రిక్స్ ది క్రౌడ్
బట్ ద రిచ్ ఆర్ ఫ్రీ ఫ్రమ్ ఇట్ ఆల్
ఫర్ హిమ్ ఇట్ ఈజ్ ఈక్వాలిటీ
హిజ్ నేషన్ అబోవ్ ఇట్ ఆల్

హి’స్ నాట్ జస్ట్ ఏ రెబెల్
బట్ సన్ అఫ్ ద ల్యాండ్
ప్లేయింగ్ విత్ ఫైర్
హు ఈస్ ద స్లిక్

డాడ్జింగ్ ద డ్యూటీస్
డోంట్ గో వెల్ విత్ హిం
హి ఈజ్ కింగ్ ఆఫ్ ద క్రౌడ్
హి ఈజ్ లీడర్ లీడర్
లీడర్ ఆఫ్ ద ప్యాక్

Palli Balakrishna Monday, July 11, 2022
Virata Parvam (2022)



చిత్రం: విరాట పర్వం (2022)
సంగీతం: సురేష్ బొబ్బిలి
నటీనటులు: రాణా దగ్గుబాటి, సాయి పల్లవి, నవీన్ చంద్ర, ప్రియమణి, నివేథా పేతురాజ్, నందితా దాస్
దర్శకత్వం: వేణు ఊడుగుల
నిర్మాతలు: డి. సురేశ్ బాబు,  సుధాకర్ చెరుకూరి, శ్రీకాంత్ చుండి
విడుదల తేది: 2022



Songs List:



కోలు కోలో కోలోయమ్మ పాట సాహిత్యం

 
చిత్రం: విరాట పర్వం (2022)
సంగీతం: సురేష్ బొబ్బిలి
సాహిత్యం: చంద్రబోస్
గానం: దివ్య మాలిక, సురేష్ బొబ్బిలి

కోలు కోలో కోలోయమ్మ
కొమ్మా చివరన పూలు పూసే, కోలో
పువ్వులాంటి సిన్నదేమో
మొగ్గయింది సిగ్గుతోటి కోలోయమ్మ

కోలు కోలమ్మ కోలో కోలో నా సామి
మనసే మేలుకొని చూసే 
కలలో నిండిన వాడే
కనులా ముందర ఉంటే
నూరేళ్ళు నిదుర రాదులే

కోలు కోలమ్మ కోలో కోలో నా సామి
మనసే మేలుకొని చూసే
కలలో నిండిన వాడే
కనులా ముందర ఉంటే
నూరేళ్ళు నిదుర రాదులే

హే పిల్లగాడి మాటలన్ని
గాజులల్లే మార్చుకుంట
కాలి ధూళి బొట్టు పెట్టుకుంటా

కుర్రగాడి చూపులన్ని
కొప్పులోన ముడుచుకుంట
అల్లరంత నల్లపూసలంటా

వాడి గూర్చి ఆలోచనే
వాడిపోని ఆరాధనే
తాళి లాగ మెళ్ళో వాలదా

కోలు కోలమ్మ కోలో కోలో నా సామి
మనసే మేలుకొని చూసే
కలలో నిండిన వాడే
కనులా ముందర ఉంటే
నూరేళ్ళు నిదుర రాదులే

పాదమేమో వాడిదంట
పయనమేమో నాది అంట
వాడి పెదవి తోటి నవ్వుతుంటా

అక్షరాలు వాడివంట
అర్థమంత నేను అంట
వాడి గొంతు తోటి పలుకుతుంటా

ప్రాణమంతా వాడేనంటా
ప్రాయమంతా వాడేనంటా
వాడి ప్రేమై నేనే బ్రతకనా

కోలు కోలమ్మ కోలో కోలో నా సామి
మనసే మేలుకొని చూసే
కలలో నిండిన వాడే
కనులా ముందర ఉంటే
నూరేళ్ళు నిదుర రాదులే




వీర తెలంగాణ పాట సాహిత్యం

 
చిత్రం: విరాట పర్వం (2022)
సంగీతం: సురేష్ బొబ్బిలి
సాహిత్యం: చంద్రబోస్
గానం: హేమచంద్ర 

వీర తెలంగాణ




నగాదారిలో పాట సాహిత్యం

 
చిత్రం: విరాట పర్వం (2022)
సంగీతం: సురేష్ బొబ్బిలి
సాహిత్యం: ద్యావారి నరేందర్ రెడ్డి, సేనాపతి భరద్వాజ్ పాత్రుడు 
గానం: వరం 

నిప్పూ ఉంది… నీరూ ఉంది నగాదారిలో
చివరికి నెగ్గేదేది తగ్గేదేది నగాదారిలో
పారే ఏరు దూకిందంట నగాదారిలో
రగిలే అగ్గికొండ సల్లారింది నగాదారిలో

కాలం ప్రేమ కథకి
తన చెయ్యందించి
నేడు తానే దగ్గరుండి
నడిపిస్తా ఉంది చూడు
నీ తోడే పొంది జన్మే నాది
ధన్యమాయెరో, ఓ

నిప్పూ ఉంది… నీరూ ఉంది నగాదారిలో
చివరికి నెగ్గేదేది తగ్గేదేది నగాదారిలో
పారే ఏరు దూకిందంట నగాదారిలో
రగిలే అగ్గికొండ సల్లారింది నగాదారిలో

ఇంతదాకా పుట్టలేదుగా
ప్రేమ కన్నా గొప్ప విప్లవం
పోల్చి చూస్తే అర్దమవ్వదా
సత్యం అన్నది

కోరుకున్న బతుకు బాటలో
నన్ను చూసి నిందలేసినా
బంధనాలు తెంచివేసినా
నిన్నే చేరగా

ఆడవే ఆడిందిలే నీవే వశమై
కలతే తీరిందిలే కలయే నిజమై
హృదయం మురిసిందిలే చెలిమే వరమై
నడకే సాగిందిలే బాటే ఎరుపై

నిప్పూ ఉంది… నీరూ ఉంది నగాదారిలో
చివరికి నెగ్గేదేది తగ్గేదేది నగాదారిలో
పారే ఏరు దూకిందంట నగాదారిలో
రగిలే అగ్గికొండ సల్లారింది నగాదారిలో




చలో చలో పాట సాహిత్యం

 
చిత్రం: విరాట పర్వం (2022)
సంగీతం: సురేష్ బొబ్బిలి
సాహిత్యం: జిలుకర శ్రీనివాస్ 
గానం: సురేష్ బొబ్బిలి

మారదులే ఈ దోపిడీ దొంగల రాజ్యం, మారదులే
రౌద్రపు శత్రువు దాడిని
ఎదురించే పోరాటం మనదే

చలో చలో చలో చలో
చలో చలో చలో చల్ పరిగెత్తు
అడుగే పిడుగై రాలేలాగా
గుండెల దమ్ముని చూపించు

చలో చలో చలో చలో
ఏ, చలో చలో చలో
శ్రీకాకుళంలో రాలిన పువ్వులను
గుండెకు అద్ది నినదిద్దాం

సిరిగల భూములు చర విడిపించి
నిరుపేదలకు పంచేద్దాం
చలో చలో చలో
చలో చలో చలో

దొరోడి తలుపుకు తాళంలా
ఘడీల ముంగట కుక్కల్లా
ఎన్నాళ్లు ఇంకెన్నాళ్లు
మన బతుకులు మారేదెన్నాళ్ళు

ఆడబిడ్డ రక్షణకై పోరాటం
దళితుడి ఆత్మగౌరవంకై పోరాటం
పేదోడి ఆకలి ముద్దకై పోరాటం
రైతు నాగలి సాలుకై పోరాటం
హ, ఎన్నాళ్ళు… ఇంకెన్నాళ్లు

చలో చలో చలో చలో
ఏ, చలో చలో చలో
చలో చలో చలో చలో
చలో చలో చలో

కనబడలేదా తుక్కిట జాబిలి
వినబడలేదా వేదనాగ్ని రవళి

అమరుల రక్తం
పాతులు గట్టే పాటలు గట్టే
ఎర్రని మల్లెలు నింగిన వెలిగే
వసంత మేఘం మరింత గర్జనై
ఆఖరి సమరం అన్నార్తుల విజయం

ఇదిగో ఇదిగో అరుణ పతాకం
అజేయ గీతం టెన్ టు ఫైవ్
అదిగో అదిగో అదిగో
అదిగో ఎర్రని కిరణం

అదిగో ఉద్యమ నెల బాలుడు
అదిగో ఉద్యమ నెల బాలుడు
అదిగో ఉద్యమ నెల బాలుడు

Palli Balakrishna Tuesday, June 28, 2022
Aadavallu Meeku Johaarlu (2022)



చిత్రం: ఆడవాళ్ళు మీకు జోహార్లు (2022)
సంగీతం: దేవీశ్రీప్రసాద్
నటీనటులు: శర్వానంద్, రస్మిక మందన్న
దర్శకత్వం: తిరుమల కిషోర్
నిర్మాత: సుధాకర్ చెరుకూరి
విడుదల తేది: 25.02.2022



Songs List:



ఆడాళ్ళు మీకు జోహార్లు పాట సాహిత్యం

 
చిత్రం: ఆడవాళ్ళు మీకు జోహార్లు (2022)
సంగీతం: దేవీశ్రీప్రసాద్
సాహిత్యం: శ్రీమణి
గానం: దేవీశ్రీప్రసాద్

హే లక్ష్మమ్మో పద్మమ్మో
శాంతమ్మో శారదమ్మో
గౌరమ్మో కృష్ణమ్మో
నా బాధే వినవమ్మో

ఈ గోలే ఏందమ్మో
ఈగోలే చాలమ్మో
ఓలమ్మో ప్లీజమ్మో
నా బతుకే బుగ్గయ్యేనమ్మో

నీ మొగుడేమన్నా మహేష్ బాబా
పోనీ అందానికేమైనా బాబా
చైలా..! కాపురం చైలా
కన్లా..! ఇద్దర్ని కన్లా

పోనీ నువ్వేమన్నా కత్రీనా కైఫా
నీ చూపేమన్నా గుచ్చే నైఫా
కానీ, చైలా..! కాపురం చైలా
మీరు కన్లా..! ముగ్గుర్ని కన్లా

మీరేమో మొగుళ్ళు సాయంత్రం తెచ్చేటి
పూలన్నీ జళ్ళోన ముడిసేత్తారా
నాకేమో ఏ పూలు లేకుండా సేసేసి
ఫూల్లాగ మడిసెత్తారా..?

ప్రతి మొగాడి విజయం వెనక
ఆడది ఉంటది అంటారు
కానీ నా విజయాన్ని
చెడగొట్టడానికి ఎందరు ఆడాల్లో

ఆడాళ్ళు మీకు జోహార్లు
ఆడాళ్ళు మీకు జోహార్లు

సినిమాకెళ్తే నా ఏజ్ ఫ్రెండు
పెళ్ళాన్ని తీసుకురాడా
వాడు నన్నే చూసి
సెల్లమ్మేదని అనడా, మరి అనడా

సాయంత్రమైతే సందు శివర
పువ్వుల కొట్టు సుబ్బన్న
మల్లెలు తీసుకెళ్ళి సెల్లెలుకిమ్మని
వెయ్ డా, జోకులు వెయ్ డా

మీరేమో మీ మొగుడు ఏ పనికి వెళ్తున్నా
సిరునవ్వులొలికించి ఎదురొత్తారా
నాకేమో ఎదురొచ్చే అవకాశం ఏ పిల్లకి
ఇవ్వనియ్యకుండా ఆపెత్తారా

ఎదురింట్లోన ఎంకయ్య తాతకి
ఇద్దరు పెళ్ళాలు
అరె, లేనే లేదు నా తలరాతకి
సింగిలు ఇల్లాలు

ఆడాళ్ళు మీకు జోహార్లు
ఆడాళ్ళు మీకు జోహార్లు

ముద్దులతోటి నిద్దుర లేపే
పెళ్ళాం కావాలని ఉండదా
డిన్నరు పెట్టి డ్రీమ్స్ లోకి
నెట్టే డ్రీమ్ గర్ల్ నాకు కావాలని పించదా

తన ఒళ్ళో వాలి ఓటీటి చూడాలి
అని నాక్కుడా ఉండదా
ఆకలి వేస్తే తనకో ఆమ్లెట్
వేయాలనిపించదా, నాకనిపించదా

మీరేమో మీ మొగుడు పండక్కి
కొని తెచ్చే చీరల్ని చుట్టేసి తిరిగేత్తారా
నేనేమో ఓ పట్టు సీరైనా కొనకుండా
నా పెళ్లి హాంఫట్టు సేసేత్తారా

అరె గంతకి తగ్గ బొంతని సామెత
మీరే సెబుతారే..!!
నా రేంజికి తగ్గా పిల్లని తెస్తే
ఓకే చెప్పరే..!!

ఆడాళ్ళు మీకు జోహార్లు
ఆడాళ్ళు మీకు జోహార్లు, హ




ఓ మై ఆద్యా పాట సాహిత్యం

 
చిత్రం: ఆడవాళ్ళు మీకు జోహార్లు (2022)
సంగీతం: దేవీశ్రీప్రసాద్
సాహిత్యం: శ్రీమణి
గానం: యాజిన్ నిజార్

ఓ మై ఆద్యా
నువ్ పక్కన ఉంటే 
కారైనా గిటారై మోగెనే
ఓ మన మధ్య
డిస్టెన్సే తగ్గి గేరైనా 
ప్యారంటూ పలికేనే

ఓ ఓ ఓ - తేరే జైస కోయి నహీ
ఓ ఓ ఓ - మేరే జైసా దివానా నహీ
ఓ ఓ ఓ - రూటే గీసా ప్రయాణానికి
నువ్వు నేను మాత్రం ఉండే చోటుకీ

ఓ మై ఆద్యా
నువ్ పక్కన ఉంటే
కారైనా గిటారై మోగెనే
ఓ మన మధ్య
డిస్టెన్సే తగ్గి గేరైనా
ప్యారంటూ పలికేనే

గూగుల్ మ్యాపుకే దొరకని చోటుకే
నడవని బండినే మనతో
వీక్ డే సాటర్డే‌ బేధమే తెలియని
ప్లేసునే వెతకని నీతో

సరదాగా షికారు అంటూ
కొలంబసే కదిలాడే
ఈ దేశం ఆ దేశం అంటూ
ఎన్నో కనిపెట్టాడే
కనుగొందాం మనమీ జర్నీలో
ఓ లవ్ దేశం..!!

ఓ మై ఆద్యా
నువ్ పక్కన ఉంటే
కారైనా గిటారై మోగెనే
ఓ మన మధ్య
డిస్టెన్సే తగ్గి గేరైనా
ప్యారంటూ పలికేనే

వేమన పద్యమే, షేక్స్పియర్ కావ్యమే
నువ్వు ఏం చెప్పిన కవితే
లాస్ట్ బాల్ సిక్సరే, షూర్ షాట్ హిట్టురే
నువ్వు ఏం చేసిన గెలుపే

అందగా ఉంటావంటూ ఎవరెవరో అంటారే
అందంపై రాసిన హైకూ లెన్నెన్నో చదివాలె
అసలందం ఇవాళ చూసానే అది నీ నవ్వే

ఓ మై ఆద్యా
నువ్ పక్కన ఉంటే
కారైనా గిటారై మోగెనే
ఓ మన మధ్య
డిస్టెన్సే తగ్గి గేరైనా
ప్యారంటూ పలికేనే



ఆసమ్ పాట సాహిత్యం

 
చిత్రం: ఆడవాళ్ళు మీకు జోహార్లు (2022)
సంగీతం: దేవీశ్రీప్రసాద్
సాహిత్యం: శ్రీమణి
గానం: సాగర్ 

ఎన్ని ఎన్ని ఎన్ని ఎన్ని మాటలాడుకున్నా
ఇంక కొన్ని మిగిలిపోవడం, ఆసమ్
ఎంత ఎంత ఎంత… ఎంత దూరమున్న
నువ్వు పక్కనున్న ఫీలింగ్ కలగడం, ఆసమ్

బాగున్నావా అని నువ్వడిగావా
నా బాధలన్నీ పారిపోవడం, ఆసమ్
భోంచేశావా అని ఓ మాటన్నావా
నా ఆకలే మాయమవ్వడం, ఆసమ్

ఎన్ని ఎన్ని ఎన్ని ఎన్ని మాటలాడుకున్నా
ఇంక కొన్ని మిగిలిపోవడం, ఆసమ్
ఎంత ఎంత ఎంత… ఎంత దూరమున్న
నువ్వు పక్కనున్న ఫీలింగ్ కలగడం, ఆసమ్

ఇంత కాలము… ఇన్ని రాత్రులు
ఎలాగ నువ్వల్లే కబుర్లే లేక
కాలం వ్యర్థమాయనే

ఇన్ని రోజులు… రెండు కళ్ళలో
ఇలాగ కలల్నే కథల్నే
చూసే వీలే లేకపోయెనే

నువ్వు నన్ను కలవమన్న
చోటు ఎక్కడున్నా
ఓ గంట ముందే నేను రావడం, ఆసమ్

ఇంటి వరకు సాగనంపి
వీడుకోలు అన్న వెంటనే
ఫోన్లో కలవడం, ఆసమ్

నాకెంత నచ్చినా… నీ ఇంత నచ్చని
దేన్నైనా ఛీ అంటూ… ఛా అంటూ
నీతోటి ఏవోటి తిట్లు కల్పనా

ఏ పనొచ్చినా… మా అమ్మే చెప్పినా
నాతోటి నీకేదో పనుంది అన్నానో
నీవైపే పరుగు తియ్యనా

నీకు ఇష్టమైంది ఏదో నువ్వు చెప్పగానే
నా ఇష్టమే మారిపోవడం, ఆసమ్
తాజ్ మహల్ అందం అంటూ
నువ్వు పొగుడుతుంటే
షాజహాన్ ని నేనే అవ్వడం, ఆసమ్

మేల్కొన్నావా అని నువ్వు అడిగావా
నా నిద్ధరే సారీ చెప్పడం, ఆసమ్
తెల్లారిపోయిందా అని ఫోనే పెట్టావా
ఆ సూర్యుడంటే ఒళ్ళు మండడం, ఆసమ్





మాంగల్యం పాట సాహిత్యం

 
చిత్రం: ఆడవాళ్ళు మీకు జోహార్లు (2022)
సంగీతం: దేవీశ్రీప్రసాద్
సాహిత్యం: దేవీశ్రీప్రసాద్
గానం: జేస్ప్రీత్ జస్జ్

ఓం శత ఓం
శత శత ఓం ఓం
శత ఓం శత శత ఓం

మాంగల్యం తంతునానేనా
మన లైఫులో ఇది జరుగునా
మమజీవన హేతునా అంటూ
మన జీవితమే సాగునా
కంఠే భద్నామి సుభగే
ఈ సౌండే పడునా మనకే
త్వం జీవ శరదాం శతం
ఇట్ట పోతూ ఉంటే మన కదే ఖతం

మాంగల్యం తంతునానేనా
మన లైఫులో ఇది జరుగునా
మమజీవన హేతునా అంటూ
మన జీవితమే సాగునా
కంఠే భద్నామి సుభగే
ఈ సౌండే పడునా మనకే
త్వం జీవ శరదాం శతం
ఇట్ట పోతూ ఉంటే మన కదే ఖతం

మూడు ముళ్ళు వెయ్యనివ్వకుండా
నా గూడు మొత్తం కూల్చేసినారు
ఏడడుగులు నడవనివ్వకుండా
ఏడు చెరువుల నీళ్ళు తాగిస్తున్నారు

రింగులో ఫింగర్ పెట్టనివ్వకుండా
నా లైఫులో ఫింగర్స్ పెట్టేస్తున్నారు
అరుంధతి నక్షత్రం బదులు
చుక్కలు చూపిస్తున్నారు

మాంగల్యం తంతునానేనా
మన లైఫులో ఇది జరుగునా
మమజీవన హేతునా అంటూ
మన జీవితమే సాగునా

ఓం శత ఓం
శత శత ఓం ఓం
శత ఓం శత శత ఓం ఓం
ఓం శత ఓం
శత శత ఓం ఓం
శత ఓం శత శత ఓం

జీలకర్ర బెల్లం బదులు
నా నెత్తి మీద టోపీ పెట్టారు
దిష్టి చుక్కే బుగ్గనెట్టకుండా
నన్ను దిష్టిబొమ్మల్లె మార్చేసినారు

ఫస్ట్ నైటే నాకు లేకుండా
ఫ్రస్ట్రేషన్ నైట్సు గిఫ్టుగిచ్చారు
హనీమూన్ కెళ్ళి డ్యూయెట్ పాడకుండా
ఫుల్ మూన్లో సోలోగా పడుకోబెట్టారు

మాంగల్యం తంతునానేనా
మన లైఫులో ఇది జరుగునా
మమజీవన హేతునా అంటూ
మన జీవితమే సాగునా

కంఠే భద్నామి సుభగే
ఈ సౌండే పడునా మనకే
త్వం జీవ శరదాం శతం
ఇట్ట పోతూ ఉంటే మన కదే ఖతం




కలగా కలగా పాట సాహిత్యం

 
చిత్రం: ఆడవాళ్ళు మీకు జోహార్లు (2022)
సంగీతం: దేవీశ్రీప్రసాద్
సాహిత్యం: శ్రీమణి 
గానం: మహాలింగం 

కలగా కలగా
కలగా మిగిలే కధలెన్నో
అటువైపే అడుగేస్తుందా
ఈ కథ కూడా

అనగా అనగా
అనగనగ పయనాలెన్నో
వాటన్నిటి మధ్య
నలగని ప్రేముంటుందా

ఏ దరో చేరాలని
మొదలైన ఈ ప్రయాణమే
ఏ ధరి దరిచేరక ఏ వైపు సాగునో

కలగా కలగా
కలగా మిగిలే కధలెన్నో
అటువైపే అడుగేస్తుందా
ఈ కథ కూడా

అనగా అనగా
అనగనగ పయనాలెన్నో
వాటన్నిటి మధ్య
నలగని ప్రేముంటుందా

ఏ గుండెది ఏ భారమో
ఈ మనసుకే తెలిసేదెలా
ఏ కన్నుది ఏ శోఖమో
ఈ చూపుతో చూసేదెలా

తెలియదు ఏ పదాలు
రెండు ముడిపడునో
ఏ క్షణాన విడిపోవునో
తెలుపవు ఏ స్వరాలూ
తీపి పాటౌనో టెన్ టు ఫైవ్
వేధనల్లే వేధించునో

కలగా కలగా
కలగా మిగిలే కధలెన్నో
అటువైపే అడుగేస్తుందా
ఈ కథ కూడా

అనగా అనగా
అనగనగ పయనాలెన్నో
వాటన్నిటి మధ్య
నలగని ప్రేముంటుందా

Palli Balakrishna Monday, February 14, 2022
Run (2016)



చిత్రం: రన్ (2016)
సంగీతం: సాయి కార్తీక్
నటీనటులు: సందీప్ కిషన్, అనీషా ఆంబ్రోస్, బాబీ సింహా
దర్శకత్వం: అనీల్ కన్నెగంటి
నిర్మాతలు: చెరుకూరి సుధాకర్, కిశోర్ గరికపాటి, అజయ్ సుంకర 
విడుదల తేది: 23.03.2016







చిత్రం: రన్ (2016)
సంగీతం: కె. సాయి కార్తీక్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: యాజిన్ నిజార్

అమ్మాయో అమ్మాయో ఏమ్మాయో చేశావే
హై టెన్షన్ తీగల్లే దిల్లే టచ్ చేశావే
కాలి కింద భూమి బంతిలాగ మారే
చేతి వేళ్లపైన చందమామ వాలే
మబ్బంచుల్లో నడిచాలే
ప్రాణమంత వేల డైనమైట్లు పేలే
లోకమంత నాకు సొంతమైన ఫీలే
లెడ్ లైటల్లే వెలిగాలే

బుజ్జి బుజ్జి కొండ బుజ్జి బుజ్జి కొండ
గుండే లబ్ డబ్ సౌండ్ మార్చినావే
బుజ్జి బుజ్జి కొండ కంటిపాప నిండా
ప్రేమ రంగు లెన్నో దండ గుచ్చినావే

నా మనసుకు సెల్ఫీలా చెలియా జత కలిశావే
ఒక సెకనైనా జత విడిపోవే
నా కలలకు పోస్టర్ లా కన్నెదుటే నిలిచావే
మరు జన్మైనా  జతగా నీవే
వెయ్యి వోల్ట్ లవ్ షాక్ కొట్టి నట్టు
చైనా వాలు ఎక్కి చిందులేసినట్టు
ఎగరేస్తందే ని లవ్వే

హమ్ తేరే, దిల్ వాలే, మన లైఫే సినిమాలే
ఇంటర్వెల్ కే సూపర్ హిట్ లే
వెయిటింగ్ వరమేలే లైఫ్ టైమే రావాలే
వచ్చా గనుకే నిను పొందాలే
రెండు అక్షరాల కొత్త పండగల్లే
అల్లుకుంది నన్ను ప్రేమ కార్నివాలే
చిరునవ్వులతో సాల్సాలే


బుజ్జి బుజ్జి కొండ బుజ్జి బుజ్జి కొండ
గుండే లబ్ డబ్ సౌండ్ మార్చినావే
బుజ్జి బుజ్జి కొండ కంటిపాప నిండా
ప్రేమ రంగు లెన్నో దండ గుచ్చినావే



  

Palli Balakrishna Thursday, February 11, 2021

Most Recent

Default