చిత్రం: రన్ (2016)
సంగీతం: సాయి కార్తీక్
నటీనటులు: సందీప్ కిషన్, అనీషా ఆంబ్రోస్, బాబీ సింహా
దర్శకత్వం: అనీల్ కన్నెగంటి
నిర్మాతలు: చెరుకూరి సుధాకర్, కిశోర్ గరికపాటి, అజయ్ సుంకర
విడుదల తేది: 23.03.2016
చిత్రం: రన్ (2016)
సంగీతం: కె. సాయి కార్తీక్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: యాజిన్ నిజార్
అమ్మాయో అమ్మాయో ఏమ్మాయో చేశావే
హై టెన్షన్ తీగల్లే దిల్లే టచ్ చేశావే
కాలి కింద భూమి బంతిలాగ మారే
చేతి వేళ్లపైన చందమామ వాలే
మబ్బంచుల్లో నడిచాలే
ప్రాణమంత వేల డైనమైట్లు పేలే
లోకమంత నాకు సొంతమైన ఫీలే
లెడ్ లైటల్లే వెలిగాలే
బుజ్జి బుజ్జి కొండ బుజ్జి బుజ్జి కొండ
గుండే లబ్ డబ్ సౌండ్ మార్చినావే
బుజ్జి బుజ్జి కొండ కంటిపాప నిండా
ప్రేమ రంగు లెన్నో దండ గుచ్చినావే
నా మనసుకు సెల్ఫీలా చెలియా జత కలిశావే
ఒక సెకనైనా జత విడిపోవే
నా కలలకు పోస్టర్ లా కన్నెదుటే నిలిచావే
మరు జన్మైనా జతగా నీవే
వెయ్యి వోల్ట్ లవ్ షాక్ కొట్టి నట్టు
చైనా వాలు ఎక్కి చిందులేసినట్టు
ఎగరేస్తందే ని లవ్వే
హమ్ తేరే, దిల్ వాలే, మన లైఫే సినిమాలే
ఇంటర్వెల్ కే సూపర్ హిట్ లే
వెయిటింగ్ వరమేలే లైఫ్ టైమే రావాలే
వచ్చా గనుకే నిను పొందాలే
రెండు అక్షరాల కొత్త పండగల్లే
అల్లుకుంది నన్ను ప్రేమ కార్నివాలే
చిరునవ్వులతో సాల్సాలే
బుజ్జి బుజ్జి కొండ బుజ్జి బుజ్జి కొండ
గుండే లబ్ డబ్ సౌండ్ మార్చినావే
బుజ్జి బుజ్జి కొండ కంటిపాప నిండా
ప్రేమ రంగు లెన్నో దండ గుచ్చినావే
2016
,
Ajay Sunkara
,
Anil Kanneganti
,
Anisha Ambrose
,
Bobby Simha
,
Kishore Garikipati
,
Run
,
Sai Karthik
,
Sudhakar Cherukuri
,
Sundeep Kishan
Run (2016)
Palli Balakrishna
Thursday, February 11, 2021