Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Sneha"
Nee Sukhame Ne Koruthunna (2008)


చిత్రం: నీ సుఖమే నే కోరుకున్నా (2008)
సంగీతం: మాదవపెద్ది సురేష్
సాహిత్యం:
గానం:
నటీనటులు: రాజా ఎబుల్, స్నేహ
దర్శకత్వం: గిరిబాబు
నిర్మాత: గిరిబాబు
విడుదల తేది: 22.02.2008


Palli Balakrishna Tuesday, March 26, 2019
Sankranti (2005)




చిత్రం: సంక్రాంతి (2005)
సంగీతం: ఎస్.ఎ. రాజ్ కుమార్
నటీనటులు: వెంకటేష్ , శ్రీకాంత్ , శివబాలజి, శర్వానంద్, ఆర్తి అగర్వాల్, స్నేహ, సంగీత, 
దర్శకత్వం: ముప్పలనేని శివ
నిర్మాత: ఆర్. బి.చౌదరి
విడుదల తేది: 18.02.2005



Songs List:



ఎలా వచ్చెనమ్మా గులాబీల వాన పాట సాహిత్యం

 
చిత్రం: సంక్రాంతి (2005)
సంగీతం: ఎస్.ఎ. రాజ్ కుమార్
సాహిత్యం: ఇ. యస్.మూర్తి
గానం: ఉదిత్ నారాయణ్, సదన సర్గం 

ఎలా వచ్చెనమ్మా గులాబీల వాన 





అందాల శ్రీమతికి పాట సాహిత్యం

 
చిత్రం: సంక్రాంతి (2005)
సంగీతం: ఎస్.ఎ. రాజ్ కుమార్
సాహిత్యం: ఇ. యస్.మూర్తి
గానం: హరిహరన్, శ్రేయా ఘోషల్

అందాల శ్రీమతికి చెప్పలేని అలకంట
అందాల శ్రీమతికి చెప్పలేని అలకంట
మనసార లాలిస్తే చంటిపాప తానంట
శ్రీవారికి ఈ సరసాలు పన్నిటితో జలకాలు
నీ చూపులో మురిపాలు నీతో ఇలా జగడాలు
ఏనాడు సరదాకైన నొప్పించరా మీరు
నీ నవ్వే తేనే జల్లులే మీరుంటే స్వర్గమేనులే

అందాల శ్రీమతికి చెప్పలేని అలకంట
మనసార లాలిస్తే చంటిపాప తానంట

చిరుగాలికి ఏదో పాపం సందేహం
మనవెంటే ఉంటూ మన కబుర్లు వింటుంది
ఏంటో ఈ కాలం నిలబడదే నిమషం
నీవెళ్లి రానా అని పరుగులు తీస్తోంది
వినలేదా మల్లెలు కోసం పలికే ఆ తుమ్మెద రాగం
వింటుంటే తెలియని దాహం మొదలైంది ఇపుడే కొంచం
అదే సుమా నీకు నాకు వేసెను తియ్యని బంధం
ఆ కథలే మరిచిపోనులే ఊరించే జ్ఞాపకాలులే

అందాల శ్రీమతికి చెప్పలేని అలకంట
మనసార లాలిస్తే చంటిపాప తానంట

పొద్దెరగని ప్రణయం కోరింది హృదయం
నీ లేత పెదవే ఉసికొలిపే ఈ సమయం
హద్దెరగని సరసం తగదన్నది ప్రాయం
శృతి మించిపోతే రుచిలేనిది శృంగారం
విరజాజుల పరుగులకైనా కరునిస్తావని అనుకున్నా
అలకన్నది క్షణమైనా మురిపిస్తే వశమై పోనా
వేల వేల చుక్కల్లోన జాబిల్లివి నువ్వేనమ్మా
జాబిలికే వెలుగు సూర్యుడే
నువు లేని బ్రతుకు శూన్యమే

అందాల శ్రీమతికి చెప్పలేని అలకంట
అందాల శ్రీమతికి చెప్పలేని అలకంట
మనసార లాలిస్తే చంటిపాప తానంట
శ్రీవారికి ఈ సరసాలు పన్నిటితో జలకాలు
నీ చూపులో మురిపాలు నీతో ఇలా జగడాలు
ఏనాడు సరదాకైన నొప్పించరా మీరు




అడే పాడే పాట సాహిత్యం

 
చిత్రం: సంక్రాంతి (2005)
సంగీతం: ఎస్.ఎ. రాజ్ కుమార్
సాహిత్యం: పోతుల రవికిరణ్ 
గానం: కార్తీక్, చిత్ర 


అడే పాడే 



ఆశ ఆశగా పాట సాహిత్యం

 
చిత్రం: సంక్రాంతి (2005)
సంగీతం: ఎస్.ఎ. రాజ్ కుమార్
సాహిత్యం: సిరివెన్నెల 
గానం: యస్.పి.బాలు 


ఆశ ఆశగా 



చిలక చందన పట్టు చీరే కట్టిందోయ్ పాట సాహిత్యం

 
చిత్రం: సంక్రాంతి (2005)
సంగీతం: ఎస్.ఎ. రాజ్ కుమార్
సాహిత్యం: భాస్కరభట్ల రవికుమార్
గానం: శంకర్ మహదేవన్ , సుజాత

చిలక చందన పట్టు చీరే కట్టిందోయ్ 
చిలిపి చెక్కిలి మీద సిగ్గే పుట్టిందోయ్ 
చిలక చందన పట్టు చీరే కట్టిందోయ్
చిలిపి చెక్కిలి మీద సిగ్గే పుట్టిందోయ్ 
వద్దు వద్దయో ఆ దూకుడోద్దయో 
నా బుజ్జి కన్నయో ఇది లేత ఒళ్ళయో 
అయితే ఎక్కు మరీ పందిరి మంచం 
త్వరగా ఇచ్చుకో ముద్దుల లంచం - హేయ్ 
అయితే ఎక్కు మరీ పందిరి మంచం 
త్వరగా ఇచ్చుకో ముద్దుల లంచం 

చిలక చందన పట్టు చీరే కట్టిందోయ్ 
చిలిపి చెక్కిలి మీద సిగ్గే పుట్టిందోయ్ 

మోజు పిట్ట కన్నె కొట్టు మోజు తీరా ముద్దె పెట్టు 
చెమ్మచెక్క ఆటాడిస్తాలే 
మాటలింక కట్టే పెట్టు కాట్టేస్తే కందేటట్టు 
వేటగాడి ఊపే చూస్తాలే 
దేదె చుమ్మా బెంగాలీ బొమ్మ ఏకంగా అల్లడిస్తాలే 
రా రా రాజా నేనే నీ రోజా ఉ అంటే వొళ్ళోకోస్తాలే... 
అయితే ఎక్కు మరి పందిరి మంచం 
తీరుస్తానులే తిమ్మిరి కొంచం హొయ్ 
అయితే ఎక్కు మరి పందిరి మంచం 
తీరుస్తానులే తిమ్మిరి కొంచం 

హేయ్... చిలక చందన పట్టు చీరే కట్టిందోయ్ 
చిలిపి చెక్కిలి మీద సిగ్గే పుట్టిందోయ్ 

హే ప ప ప పాలపిట్టా పైటే పట్టు వద్దంటే నీమీదోట్టు
వరసంగా పిండే ఇస్తాలే లే లే
గిలి గిలిగా విన్నెటట్టు కౌగిట్లో జున్నే పెట్టు 
జజ్జన్నక జమ ఇస్తాలే 
హె.హె తయ్య రయ్య అరే తస్సదియ్య 
వాటంగా ఒళ్ళొకోస్తాలే... 
హే... రావే పిల్ల నా తుగో జిల్లా 
వయ్యారం తాళం తీస్తాలే 
అయితే ఎక్కు మరి పందిరి మంచం 
సిద్ధంగుందిలే గుడుగుడు గుంజం హోయ్... 
అయితే ఎక్కు మరి పందిరి మంచం 
సిద్ధంగుందిలే గుడుగుడు గుంజం 

హేయ్... చిలక చందన పట్టు చీరే కట్టిందోయ్ 
చిలిపి చెక్కిలి మీద సిగ్గే పుట్టిందోయ్ 
వద్దు వద్దయో ఆ దూకుడోద్దయో 
నా బుజ్జి కన్నయో ఇది లేత ఒళ్ళయో 
అయితే ఎక్కు మరీ పందిరి మంచం 
త్వరగా ఇచ్చుకో ముద్దుల లంచం హొయ్ 
అయితే ఎక్కు మరీ పందిరి మంచం 
త్వరగా ఇచ్చుకో ముద్దుల లంచం




డోలి డోలి పాట సాహిత్యం

 
చిత్రం: సంక్రాంతి (2005)
సంగీతం: ఎస్.ఎ. రాజ్ కుమార్
సాహిత్యం: ఇ. యస్.మూర్తి
గానం: శంకర్ మహదేవన్, ఎస్.ఎ. రాజ్ కుమార్, చిత్ర, కల్పన 

డోలి డోలి



(పెళ్లి పాట - I) పాట సాహిత్యం

 
చిత్రం: సంక్రాంతి (2005)
సంగీతం: ఎస్.ఎ. రాజ్ కుమార్
సాహిత్యం: ఇ. యస్.మూర్తి
గానం: పార్థసారథి, మురళి

పెళ్లి పాట - I




చక్కని మా అన్నయ్యకు (పెళ్లి పాట - II) పాట సాహిత్యం

 
చిత్రం: సంక్రాంతి (2005)
సంగీతం: ఎస్.ఎ. రాజ్ కుమార్
సాహిత్యం: ఇ. యస్.మూర్తి
గానం: పార్థసారథి, మురళి

చక్కని మా అన్నయ్యకు చిక్కిన ఈ చిలకమ్మ 
వచ్చింది ఇంటికి తన జంట గూటికి 
చిరినవ్వే సిరులంటూ సుగుణాలే నగలంటూ 
నిలుచుంది వాకిట ఈ మందార మాలిక 
సిరివెన్నెలంటి చెలిమిని బాగుపంచగా 
నెలవంక ఇలకు చేయనా చిన్న వదినగా 
పొంగే ఆనందం తెచ్చే సంతోషం 
మాలోగిలి నిండెనే 
వధువే బంగారం వరుడే తనసర్వం 
ఇది నూరేళ్ళ బంధమే

Palli Balakrishna Monday, March 19, 2018
Radha Gopalam (2005)



చిత్రం: రాధా గోపాలం (2005)
సంగీతం: మణిశర్మ
నటీనటులు: శ్రీకాంత్, స్నేహ, సునీల్, కె.విశ్వనాధ్ 
కథ, స్క్రీన్ ప్లే, మాటలు (డైలాగ్స్): ముళ్ళపూడి వెంకట రమణ
దర్శకత్వం: బాపు
అసిస్టెంట్ డైరెక్టర్: నాని (హీరో)
నిర్మాతలు: కె.అనిల్ కుమార్, కె.నాగేంద్ర బాబు
బ్యానర్స్: అంజనా ప్రొడక్షన్స్ , శ్రీ క్రియేషన్స్
విడుదల తేది: 29.04.2005



Songs List:



శతమానం భవతి పాట సాహిత్యం

 
చిత్రం: రాధా గోపాలం (2005)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.పి.బాలు, చిత్ర 

శతమానం భవతి 



నీ వాలు జడ పాట సాహిత్యం

 
చిత్రం: రాధా గోపాలం (2005)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: జొన్నవిత్తుల 
గానం: యస్.పి.బాలు, సునీత ఉపద్రష్ట

పల్లవి:
చందమామ లాంటి మోము
నువ్వు పూవ్వు లాంటి ముక్కు
దొండ పండు లాంటి పెదవి
కలువపూల వంటి కళ్ళు
జామపండులాంటి బుగ్గ
బెల్ల ముక్క లాంటి గడ్డం
వలపు శంఖమంటి కంఠం
ఇంకా ఇంకా ఎన్నో ఎన్నో
యవ్వనాల నవనిధులు
కవ్వించి ఊరించి చంపేవన్నీ
ముందు వైపునే ఉంటే నువ్వొక్కదానివే
వెనకనెందుకు ఉన్నావే జడా?

ఆ...ఆ బుగ్గలు సాగదీస్తావ్
ముక్కుని పిండుతావ్
పెదవులు జుర్రుకుంటావ్
గడ్డాన్ని కొరుకుతావ్
ముద్దులు గుద్దులు గిచ్చుళ్లు నొక్కుళ్లు
అదేమిటంటే ఆరళ్లు గీరళ్ళు
శృంగారం పేరుతో గింగిరాలు తిప్పుతావనే
ఇలా.. వెనకాల ఉన్నా
నీ పక్క చూపులు వెనక చూపులు ఎంచక్క కనిపెడుతున్నా
అవసరమైతే పని పడుతున్నా

ఓ వాలు జడా మల్లెపూల జడా
ఓ పాము జడా సత్యభామ జడా
నువలిగితే...నాకు దడా
ఓ పట్టు జడా రసపట్టు జడా
బుసకొట్టు జడా నసపెట్టు జడా
ఇప్పుడేందుకే ఈ రగడా....

ఓ వాలు జడా మల్లెపూల జడా
ఓ పాము జడా సత్యభామ జడా

చరణం: 1
వీపుకి మెడకి భుజములకి తగు అందం తెచ్చే జడా
ఈ తగవులేలనే జడా
కులుకుల నడుముకి వెనకన తిరుగుతు కళకళలాడే జడా
నను కనికరించవే జడా
పిరుదుల బిరుదుల జడగంటలతో జగతికి చాటే జడా
నా పొరపాటేమే జడా
అత్తరి ఇత్తర అనుమానాల తత్తర బిత్తర జడా
ఎద కత్తిరించకే జడా..ఆ ..ఆ

కనికట్టు జడా కనిపెట్టు జడా
పనిపట్టు జడా..ఆ..పనిపెట్టు జడా
నిను విడువని ప్రేమికుడా....

చరణం: 2
వడిసేలల్లే తిప్పితే జడా గుండెలోన దడదడా
ఏ గుబులు రేపకే జడా
నడుము తిప్పుడూ నాగస్వరానికి నాగుపామువే జడా
నగుమోము చూపవే జడా
జెడ కోలాటం సరసమె కానీ జగడము కాదే జడా
నను సరసకు రానీ జడా
జెడని దువ్వని పొగడని మొగుడు జఢపదార్ధమే జడా
నిను దువ్వనీయవే జడా...ఆ..ఆ

కనువిందు జడా నను పొందు జడా
సరసాల జడా ఇక చాలు జడా
ఏనాటికి నీవాడా....జజడాం జగడ జఝడాం...




ఆగడాలు పాగడాలు పాట సాహిత్యం

 
చిత్రం: రాధా గోపాలం (2005)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: జొన్నవిత్తుల 
గానం: యస్.పి.బాలు, కల్పన

ఆగడాలు పాగడాలు జగడాలు
కోపాలు తాపాలు లేనిపోని పంతాలు
ఒక్కసారి సోరి చెపితే మల్లీ అంతా మామూలే
ఒక్కసారి సోరి చెపితే మల్లీ అంతా మామూలే

ఆగడాలు పాగడాలు జగడాలు
కోపాలు తాపాలు లేనిపోని పంతాలు

చరణం: 1
భార్య వేచి ఉండడాలు మొగుడు రాకవోపడాలు
కోపగించు కోవడాలు కారణాలు చెప్పటాలు
గొంతుచించు కోవటాలు సమర్ధించు వాదాలు
గోడవపెంచుకోవడాలు గోల చేసుకోవడాలు
అరవడాలు ఉరమడాలు కసరడాలు విసరడాలు
చిలిపి చిలికి గాలి వానల ఆవడలు
వాయుగుండం పడటాలు పొంపుదుండం ఆవడాలు
తెల్లవారుజామునే తీరని తాకడాలు
సోరిలు చెప్పటాలు సరే అనుకోవటాలు
అసలు ఏం జరగనట్టు తెల్లారిపోవడలు

చరణం: 2
ఫోను ఏదో రావడాలు  నవ్వుతూ మాట్లాడడాలు
అనుమానం రావడాలు తిరుగుటం అవడాలు
ఆరాలు తీయడాలు కారాలే నూరడాలు
ఏనాటికావాదాలు ఏకరువులు పెట్టడాలు
తిట్టడాలు నెట్టడాలు ఒకరినొకరు కట్టడాలు
రోజు రోజు మాటలాగిపోవడాలు
తిక్క తిక్కగా ఉండడాలు పక్క మంది చేయటాలు
బ్రహ్మయ్య ఉండటాలు మన్మధుని తిట్టడాలు
సోరి అని అనుకోవటాలు సర్దిచెప్పుకోవటాలు

చరణం: 3
చీరకట్టుకోవడాలు తెమరకుండపోవడాలు
మొగుడు ముట్టుకోవడాలు టైందాటిపోవడాలు
రైలు వెళ్లిపోవడాలు రోడ్ మీద ఎగరడాలు
తెల్లముఖం వేయడాలు ఇంటిముఖం పట్టడాలు
గంటసేపు తిప్పడాలు కంటినీళ్లు కార్చడాలు
అలగడాలు తలగడాలు తలవాదాలు
అర్ధరాత్రి దాటడాలు భద్రకాళి అవడాలు
నిద్రమానుకోవడాలు నిప్పుమీద చిమడాలు
సారీలు చెప్పడాలు చల్లబడి పోవడాలు
గుద్దులాట నవ్వులాటై ముద్దులాట ఆడుకోవడాలు

ఆగడాలు పాగడాలు జగడాలు
ఐ యామ్ సారీ...
కోపాలు తాపాలు లేనిపోని పంతాలు
ఐ యామ్ సారీ.. ఐ యామ్ సారీ..
ఒక్కసారి సోరి చెపితే మల్లీ అంతా మామూలే
ఐ యామ్ సారీ సారీ...
ఒక్కసారి సోరి చెపితే మల్లీ అంతా మామూలే
ఐ యామ్ సో సారీ...





మా ముద్దు రాధమ్మ పాట సాహిత్యం

 
చిత్రం: రాధా గోపాలం (2005)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.పి.బాలు, సునీత ఉపద్రష్ట

పల్లవి:
మా ముద్దు రాధమ్మ రాగాలే
శ్రీమువ్వ గోపాల గీతాలు
ఆ చేయి ఈ చేయి తాళాలూ
అనురాగాలలో గట్టి మేళాలూ...

మా ముద్దు రాధమ్మ రాగాలే
శ్రీ మువ్వ గోపాల గీతాలు
ఆ చేయి ఈ చేయి తాళాలూ
అనురాగాలలో గట్టి మేళాలూ

మా ముద్దు రాధమ్మ రాగాలే...

చరణం: 1
నువ్వందం నీ నవ్వందం
తల్లో మల్లె పువ్వందం
కట్టందం నీ బొట్టందం
నువు తిట్టే తిట్టే మకరందం

సూరీడు చుట్టూ భూగోళం
రాధమ్మ చుట్టూ గోపాళం
సూరీడు చుట్టూ భూగోళం...
రాధమ్మ చుట్టూ గోపాళం...

నడుము ఆడితే కధాకళి
జడే ఆడితే కూచిపూడి
నువ్వే ఆడితే ఫలానా తతిమ్మాది తిల్లానా

మా ముద్దు రాధమ్మ రాగాలే
శ్రీ మువ్వ గోపాల గీతాలు
ఆ చేయి ఈ చేయి తాళాలూ
అనురాగాలలో గట్టి మేళాలూ

చరణం: 2
కూరలు తరిగే కూరిమి ఇష్టం
చేతులు తెగితే మూతులకిష్టం
ముద్దలు కలిపి పెడితే ఇష్టం
ముద్దులదాకా వెడితే...

వలచిన వారి పరాకు అందం
గెలిచిన సతిపై చిరాకు అందం
కొపతాపముల కోలాటంలో మనసు ఒక్కటే మంగల్యం
కస్సుబుస్సుల కామాటంలో కౌగిలిగింతే కళ్యాణం

ఓడలు జరిపే ముచ్చట గనరే వనితలార మీరూ
ఓటమి గెలుపుల ఆటుపోటుల ఆలుమగల సంసార జలధిలో
ఓడలు జరిపే ముచ్చట గనరే వనితలార నేడూ...



తొలి కోడి కూసేను పాట సాహిత్యం

 
చిత్రం: రాధా గోపాలం (2005)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: ముళ్ళపూడి వెంకట రమణ
గానం: మురళీధర్, చిత్ర 

పల్లవి:
తొలికోడి కూసేను తెలవార వచ్చేను
మరుకేళి చాలించి నిదురపో
తొలికోడి కూసేను తెలవార వచ్చేను
మరుకేళి చాలించి నిదురపో
నాదు మొరకాస్త ఆలించి నిదురపో
అందగాడా నిదురపో చందురూడా నిదురపో
అందగాడా నిదురపో చందురూడా నిదురపో
తొలికోడి కూసేను తెలవార వచ్చేను
మరుకేళి చాలించి నిదురపో

చరణం: 1
ఇల్లంతా కడగాలి కళ్లాపి చల్లాలి
ముగ్గులు పెట్టాలి గోపాలుడా
కాఫీలు కలపాలి టిఫినీలు చెయ్యాలి
చెంగు విడిచిపెట్టు గోపాలుడా
చెంగు విడిచిపెట్టి సెలవిచ్చి పంపితే
మాపటేళకు మళ్లీ వస్తాను
తెల్లచీర కట్టి మల్లెపూలు పెట్టి
గుమ్ము గుమ్మను కౌగిలిస్తాను
గుండెలో వలపంతా గుమ్మరిస్తాను
చెంగు వదలర సామి గోపాలుడా
సరుసుడ నా సామి గోపాలుడా

తొలికోడి కూసేను తెలవార వచ్చేను
మరుకేళి చాలించి నిదురపో
తొలికోడి కూసేను తెలవార వచ్చేను
మరుకేళి చాలించి నిదురపో

చరణం: 2
సుప్పనాతి సూరీడొచ్చెను
వెన్నెలంతా ఎర్రాబారెను
మల్లెలన్నీ నల్లాబోయెను కలువకన్నియ
కందీపోయెను కమిలిపోయెను కానుకో
కంటినిండా నిదురకోసం
కాచి ఉన్నది చూసుకో రసికరాజ నిదురపో
ధిక్తన ధిక్తన ధిక్తన ధిన ధిక్తన ధిక్తన ధిక్తన
మూడు జాములు తిరగాలేదు
నాలుగోది పొడవాలేదు
తొందరెందుకు సూరీడా ఎందుకొస్తివి సూరీడా
నిన్నెవరు పిలిచారు సూరీడా
నీకిక్కడేమి పని సూరీడా
నీకెప్పుడేమి పని సూరీడా...
పోరా పోరా సూరీడా రారా రారా సూరీడా
పోరా పోరా...





గ్రహణం పట్టని పాట సాహిత్యం

 
చిత్రం: రాధా గోపాలం (2005)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: జొన్నవిత్తుల 
గానం: యస్.పి.బాలు

గ్రహణం పట్టని 

Palli Balakrishna Thursday, February 22, 2018
Rajanna (2011)


చిత్రం: రాజన్న (2011)
సంగీతం: యమ్.యమ్. కీరవాణి
సాహిత్యం: మెట్టపల్లి సుందర్
గానం: మెట్టపల్లి సుందర్  ,చైత్ర
నటీనటులు: నాగార్జున, స్నేహా, బేబీ అన్ని , శ్వేతా మీనన్
దర్శకత్వం: వి. విజయేంద్ర ప్రసాద్
నిర్మాత: నాగార్జున అక్కినేని
విడుదల తేది: 22.12.2011

కాలి గజ్జె ఘల్లుమంటె పల్లె తల్లి
మెలుకుంతదో మా అమ్మలార అక్కలారా
డోలు డప్పు ఘొల్లుమంటె
వూరు వాడ లేచివస్తదో మా అన్నలర తమ్ములరా
కాలి గజ్జె ఘల్లుమంటె పల్లె తల్లి
మెలుకుంతదో మా అమ్మలార అక్కలారా
డోలు డప్పు ఘొల్లుమంటె
వూరు వాడ లేచివస్తదో మా అన్నలర తమ్ములరా

గొంతెత్తి పాడుతుంటె లెలెస్సొ హైలెస్స
తేనలూరి పాడతాయి లెలెస్సొ హైలెస్స
గొంతెత్తి పాడుతుంటె లెలెస్సొ హైలెస్స
తేనలూరి పాడతాయి లెలెస్సొ హైలెస్స
అడవిలోన జీవరాసులన్ని
గూడు వదిలి వచ్చి ఆటలాడి అలసిపొతాయో

కాలి గజ్జె ఘల్లుమంటె పల్లె తల్లి
మెలుకుంతదో మా అమ్మలార అక్కలారా
డోలు డప్పు ఘొల్లుమంటె
వూరు వాడ లేచివస్తదో మా అన్నలర తమ్ములరా
కాలి గజ్జె ఘల్లుమంటె పల్లె తల్లి
మెలుకుంతదో మా అమ్మలార అక్కలారా
డోలు డప్పు ఘొల్లుమంటె
వూరు వాడ లేచివస్తదో మా అన్నలర తమ్ములరా


******  ******  ******


చిత్రం: రాజన్న (2011)
సంగీతం: యమ్.యమ్. కీరవాణి
సాహిత్యం: శివశక్తి దత్తా
గానం: యమ్.యమ్. కీరవాణి , కైలాష్ కెహర్

కరకురాతి గుండెల్లొ రగులుకున్న మంటల్లో
కాలి మసైపోయెనమ్మ నీ గూడు
కడుపున కనకున్నా కంటికి రెప్పల్లే
కాచుకున్న వాడిప్పుడు లేడు
రాబందుల రాజ్యం లో
రాకాసుల మూకల్లో
ఎలా ఎలా ఈడ బతకగలవమ్మా
ఎగిరిపోవె ఏడికైన కోయిలమ్మా
ఎలా ఎలా ఈడ బతకగలవమ్మా
ఎగిరిపోవె ఏడికైన కోయిలమ్మా


గుండెల పెనవేసుకున్న అనుబంధాలూ
ఆకలినే మరిపించే ఆటపాటలూ
మరచిపోయి తీరాలమ్మా
నువ్వు మరచిపోయి తీరాలమ్మా
చెయ్యాలని మనసున్న చెతకాని వల్లమూ
పెట్టాలని ఉన్నా నిరుపేద వల్లం
ఈ మట్టి లోన ఏకమైన మీ అమ్మా నాన్నలా
చల్లని దీవెనలే నీకు శ్రీ రామ రక్షగా
ఎగిరిపోవె ఏడికైన కోయిలమ్మా...
మన వాడకి మరి రాకమ్మ మల్లమా...


******  ******  ******


చిత్రం: రాజన్న (2011)
సంగీతం: యమ్.యమ్. కీరవాణి
సాహిత్యం: శివశక్తి దత్తా
గానం: సంజీవ్ చిమ్మల్గి , కాలభైరవ

గిజిగాడు తన గూడు వదిలీ రాకున్నాడు సూరీడు రాలేదనీ
కొలనీలో కమలాలు తలదించుకున్నాయి పొద్దు పొడవలేదనీ

గిజిగాడు తన గూడు వదిలీ రాకున్నాడు సూరీడు రాలేదనీ
కొలనీలో కమలాలు తలదించుకున్నాయి పొద్దు పొడవలేదనీ

గారాల మల్లమ్మ కల్లే తెరవకుంది తెలవారలేదే అనీ
నువ్వైనా చెప్పన్నా సూరీడుకి రాజన్నా ఎండెక్కె లేలెమ్మనీ
కొండెక్కె తన ఏడు గుర్రాల బడెక్కి పిండక్కి రారమ్మనీ
బతుకమ్మ పిండక్కి రారమ్మనీ
పిండక్కి రారమ్మనీ బతుకమ్మ పిండక్కి రారమ్మనీ

నడిమింట సూరీడు నిప్పులు చెరిగేడు పసికిందు పడుకుందనీ
నడిమింట సూరీడు నిప్పులు చెరిగేడు పసికిందు పడుకుందనీ
నువ్వైనా చెప్పన్నా సూరీడుకి రాజన్నా మబ్బు చటుకు పొమ్మనీ
నా బిడ్డకి రవ్వంత నీడిమ్మనీ
కంటికి రెప్పల్లే కాచుకున్నా గాని నీ వైపే నా తల్లి చూపూ
నువ్వైనా చెప్పన్నా మల్లమ్మకి రాజన్నా
ఇలు దాటి పోవొద్దనీ దయచేసి నీ దరికి రావద్దనీ
ఇలు దాటి పోవొద్దనీ దయచేసి నీ దరికి రావద్దనీ


******  ******  ******


చిత్రం: రాజన్న (2011)
సంగీతం: యమ్.యమ్. కీరవాణి
సాహిత్యం: శివశక్తి దత్తా
గానం: మాళవిక

అమా...ఆ..ఆ...అవనీ..
అమ్మా అవనీ నేలతల్లీ అనీ
ఎన్ని సార్లు పిలిచినా తనివితీరదెందుకనీ
అమ్మా అవనీ నేలతల్లీ అనీ
ఎన్ని సార్లు పిలిచినా తనివితీరదెందుకనీ
అమ్మా అవనీ నేలతల్లీ అనీ
ఎన్ని సార్లు పిలిచినా తనివితీరదెందుకనీ
కనిపెంచిన వొడిలోనే కన్ను మూయానీ
మల్లీ ఈ గుడిలోనే కల్లు తెరవనీ
అమ్మా అవనీ నేలతల్లీ అనీ
ఎన్ని సార్లు పిలిచినా తనివితీరదెందుకనీ

తల్లి నిను తాకితేనె తనువు పులకరిస్తుందీ
నీ యదపై వాలితేనె మేను పరవసిస్తుందీ
తేట తెలుగు జానా కోటి రతనాల వీణా
నీ పదములన నువి నాకు స్వర్గం కన్న మిన్న
అమ్మా అవనీ నేలతల్లీ అనీ
ఎన్ని సార్లు పిలిచినా తనివితీరదెందుకనీ
అమ్మా అవనీ...

నీ బిడ్డల సౌర్య ధైర్య సాహస గాదలు వింటే
నరనరాలలో రక్తం పొంగి పొరలుతుందీ

రిగగ రిగగ రిగ రిగగ రిగగ రిగ
రిగగ రిగగ రిగ రిగ రిస దప దస
రిగగా రిపపప గదదద పదదద
సద సద పగ పగ సద సద సద సద
పద సద పద సద పద సద పద సద
సస సస సస సస రిరి
సస సస సస సస గగ
రిగ రిస రిగ రిస .. రిగ రిస రిగ రిస
సరి సరి గ రిస గ రిస గ రిస
రిగ రిగ ప .. గరి సద ప
గప పద దస సరి గరి సద
పద దస సరి రిగ మగ రిస
రి గ మా రిస దప దస రిగ ప
సరి గప దస రిగ పా...
దప గరి సరి సద.. వీర మాతవమ్మ
రణ ధీర చరితవమ్మ
పుణ్య భూమివమ్మ .. నువు దన్య చరితవమ్మ
తల్లి కొరకు చేసె ఆ త్యాగమెంతదైన
దేహమైన ప్రాణమైన కొంచమే కదమ్మ
అది మించిన నాదన్నది నీకీ గలదేదమ్మ

అమ్మా అవనీ నేలతల్లీ అనీ
ఎన్ని సార్లు పిలిచినా తనివితీరదెందుకనీ
అమ్మా అవనీ.......

Palli Balakrishna Monday, December 4, 2017
Evandoi Srivaru (2006)



చిత్రం: ఏవండోయ్ శ్రీవారు (2006)
సంగీతం: శ్రీకాంత్ దేవా
నటీనటులు: శ్రీకాంత్ , స్నేహా , నిఖిత
దర్శకత్వం: ఇ. సత్తిబాబు
నిర్మాత: యమ్.దశరథ రాజు
విడుదల తేది: 15.95.2006



Songs List:



అడిగా బ్రహ్మని పాట సాహిత్యం

 
చిత్రం: ఏవండోయ్ శ్రీవారు (2006)
సంగీతం: శ్రీకాంత్ దేవా
సాహిత్యం: అనంత శ్రీరాం 
గానం: చిత్ర , కార్తిక్ 

పల్లవి:
అడిగా బ్రహ్మని నిన్నిమ్మని నా తోడుగా
నిన్నటి నిదురలోని కలలలోన
అటులే కమ్మను ఆ కమ్మని ఆ మాటలే
ఋజువై నిన్ను నేను కలుపుకున్నా
నూరేళ్లు నిన్ను విడననీ హాయ్
ఈ రేయి నేను కలగని
కలలో బ్రహ్మ పలుకులే తెలుసా నీకు నిజమనీ
నిజమే నిజమే నాక్కూడా తెలుసులే

అడిగా బ్రహ్మని నిన్నిమ్మని నా తోడుగా
నిన్నటి నిదురలోని కలలలోన

చరణం: 1
మునుపటి జన్మలతో ముడిపడు పుణ్యములే
నీ నీడ నిన్ను చేర్చనీ బతుకే నిండు పున్నమి
నా కంటిపాప నీవే నీ కంటి రెప్ప నేనే
ఏ నలుసులింక నేడు నిన్ను తాకలేవులే
కలిసిన మనసులలో కలతలు ఉండవులే
జతపడు హృదయములే జగములే మరుచునులే
నిజముగా కలకాదుగా 
నిజమే నిజమే కలలాంటి నిజమిదే

అడిగా బ్రహ్మని నిన్నిమ్మని నా తోడుగా
నిన్నటి నిదురలోని కలలలోన

చరణం: 2
చిరు చిరు సరసాలు మురిసిన సరదాలకు
కొరతలు లేని కాపురం తెలియదు వేరుకావటం
నేనాడుకున్న పేరే ఏనాటికైన ఎదిగి
మన కొడుకులా రేపు మన కడుపు పండులే
గడిచిన గతమంత చేదుగా మిగిలేనే
కలిగిన చేదంతా తొలగునే ఇకపైన
నిజముగా ఇది జరుగునా
నిజమే నిజమే నీ ఆశ తీరునే

అడిగా బ్రహ్మని నిన్నిమ్మని నా తోడుగా
నిన్నటి నిదురలోని కలలలోన
అటులే కమ్మను ఆ కమ్మని ఆ మాటలే
ఋజువై నిన్ను నేను కలుపుకున్నా
నూరేళ్లు నిన్ను విడననీ హాయ్
ఈ రేయి నేను కలగని
కలలో బ్రహ్మ పలుకులే తెలుసా నీకు నిజమనీ
నిజమే నిజమే నాక్కూడా తెలుసులే




అయ్యయ్యో అయ్యయ్యో పాట సాహిత్యం

 
చిత్రం: ఏవండోయ్ శ్రీవారు (2006)
సంగీతం: శ్రీకాంత్ దేవా
సాహిత్యం: అనంత శ్రీరాం 
గానం: రంజిత్, పాప్ షాలిని

అయ్యయ్యో అయ్యయ్యో 



ఇప్పుడే నీమీద పాట సాహిత్యం

 
చిత్రం: ఏవండోయ్ శ్రీవారు (2006)
సంగీతం: శ్రీకాంత్ దేవా
సాహిత్యం: అనంత శ్రీరాం 
గానం: కార్తీక్, సుజాత మోహన్ 

ఇప్పుడే నీమీద 




అందాలు అందాలు పాట సాహిత్యం

 
చిత్రం: ఏవండోయ్ శ్రీవారు (2006)
సంగీతం: శ్రీకాంత్ దేవా
సాహిత్యం: అనంత శ్రీరాం 
గానం: సుజాత మోహన్ , మల్లికార్జున్ 

 అందాలు అందాలు




వినాయక పాట సాహిత్యం

 
చిత్రం: ఏవండోయ్ శ్రీవారు (2006)
సంగీతం: శ్రీకాంత్ దేవా
సాహిత్యం: అనంత శ్రీరాం 
గానం: గంగ, టిప్పు 

వినాయక 




కలయో వైష్ణవమాయో పాట సాహిత్యం

 
చిత్రం: ఏవండోయ్ శ్రీవారు (2006)
సంగీతం: శ్రీకాంత్ దేవా
సాహిత్యం: అనంత శ్రీరాం 
గానం: కల్పన, ప్రసన్న 

కలయో వైష్ణవమాయో 

Palli Balakrishna Wednesday, November 29, 2017
Madhumasam (2007)


చిత్రం: మధుమాసం (2007)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: వేటూరి
గానం: రంజిత్ , రీటా
నటీనటులు: సుమంత్, స్నేహ , పార్వతి మెల్టన్
దర్శకత్వం: చంద్ర సిద్దార్ధ
నిర్మాత: డి.రామానాయుడు
విడుదల తేది: 09.02.2007

పల్లవి:
వసంతం వాయిదా పడైనా రాదుగా
కనీసం కమ్మగా కలైనా కావుగా
ఈ కాంత కోకిలా వలచినా పిలిచినా ప్రియతమా
వసంతం వాయిదా పడైనా రాదుగా

చరణం: 1
విరజాజి పూలే విరహాన రాలే
మలిసందే వేళే తెలవారి పోయే
పొడి ఇసుక దారులలో
మన అడుగు జాడలలో
గతము తలచి కలిసి నడిచి
వలపు కలయిక కలా
నిదుట నిలచి ఎదను తెరచి
క్షణము దొరకవు కదా

వసంతం వాయిదా పడైనా రాదుగా
కనీసం కమ్మగా కలైనా కావుగా

చరణం: 2
బస్తీల నిండా బృందావనాలే
ముస్తాబు మీద హస్తాక్షరాలే
ఎదురసలు చూడనిది
మనము అనుకోనిదిది
మనసు అలుపు మమత అలుకు
జతను కలిపెను కదా
ఎవరికెవరు ఒకరికొకరు
ఇపుడె తెలిసెను కదా

వసంతం వాయిదా పడైనా రాదుగా
కనీసం కమ్మగా కలైనా కావుగా
ఈ కాంత కోకిలా వలచినా పిలిచినా ప్రియతమా
వసంతం వాయిదా పడైనా రాదుగా

Palli Balakrishna Wednesday, November 22, 2017
Hanuman Junction (2001)



చిత్రం: హనుమాన్ జంక్షన్ (2001)
సంగీతం: సురేష్ పీటర్స్
నటీనటులు: జగపతిబాబు, అర్జున్ షార్జా , వేణు తొట్టెంపూడి, స్నేహ, లయ
దర్శకత్వం: యమ్.రాజా
నిర్మాత: యమ్. వి.లక్ష్మీ
విడుదల తేది: 21.12.2001



Songs List:



కోనసీమలో ఓ కోయిల పాట సాహిత్యం

 
చిత్రం: హనుమాన్ జంక్షన్ (2001)
సంగీతం: సురేష్ పీటర్స్
సాహిత్యం: వేటూరి
గానం: శ్రీనివాస్, చిత్ర

కోనసీమలో ఓ కోయిల





ఒక చిన్ని లేడి కూన పాట సాహిత్యం

 
చిత్రం: హనుమాన్ జంక్షన్ (2001)
సంగీతం: సురేష్ పీటర్స్
సాహిత్యం: చంద్రబోస్
గానం: సుజాత మోహన్, శ్రీరామ్ , సురేష్ పీటర్స్

ఒక చిన్ని లేడి కూన సింహాల బోనులోన
చేరింది దారిలేక దరియేది కానరాక

సితారందుకొని శృతే పెంచుకొని 
జమక్ జమక్ మని మీటవే సరిగమ
గిటారందుకొని గళం తిప్పుకుని 
ఝలక్ ఝలక్ మని పాడవే పదనిస

ఒక చిన్ని లేడి కూన సింహాల బోనులోన
చేరింది దారిలేక దరియేది కానరాక
శోకాలు గుండెలోన రాగాలు గొంతులోన
చీకట్లు కమ్ముకున్న చిరునవ్వు మోముపైన
పాడింది లేడికూన తనపాట అల్లరైన
ఆడింది సంబరాన తనబాట ముళ్ళదైన

సితారందుకొని శృతే పెంచుకొని 
జమక్ జమక్ మని మీటవే సరిగమ
గిటారందుకొని గళం తిప్పుకుని 
ఝలక్ ఝలక్ మని పాడవే పదనిస

కిల కిల కోకిల కాకుల నడుమున కూతలు మార్చదుగా
గల గల వాగులు రాళ్లను తాకిన పరుగులు ఆపవుగా
సుడిగాలి చుట్టూ ముడుతున్నా 
మరుమల్లెలు వాసన మారేనా
మెచ్చేవాళ్ళు గుచ్చేవాళ్ళు అంతా చూస్తున్నా
ఉత్సహంగా వచ్చిందేదో ఆలాపిస్తున్నా

ఒక చిన్ని లేడి కూన సింహాల బోనులోన
చేరింది దారిలేక దరియేది కానరాక

సితారందుకొని శృతే పెంచుకొని 
జమక్ జమక్ మని మీటవే సరిగమ
గిటారందుకొని గళం తిప్పుకుని 
ఝలక్ ఝలక్ మని పాడవే పదనిస

తళ తళ తారక రాత్రికి భయపడి మెరవక మానదుగా
తళుకుల తామర బురదకు భయపడి విరియక మానదుగా
నిలువెల్లా జల్లే పడుతున్నా నెమలీకలు రంగే మారేనా
పంజాలేవో పైపైకొచ్చి అల్లరిచేస్తున్నా
సంతోషంగా సంగీతాన్నే అందించేస్తున్నా

ఒక చిన్ని లేడి కూన సింహాల బోనులోన
చేరింది దారిలేక దరియేది కానరాక
శోకాలు గుండెలోన రాగాలు గొంతులోన
చీకట్లు కమ్ముకున్న చిరునవ్వు మోముపైన
పాడింది లేడికూన తనపాట అల్లరైన
ఆడింది సంబరాన తనబాట ముళ్ళదైన

సితారందుకొని శృతే పెంచుకొని 
జమక్ జమక్ మని మీటవే సరిగమ
గిటారందుకొని గళం తిప్పుకుని 
ఝలక్ ఝలక్ మని పాడవే పదనిస




గోల్మాల్ గోల్మాల్ పాట సాహిత్యం

 
చిత్రం: హనుమాన్ జంక్షన్ (2001)
సంగీతం: సురేష్ పీటర్స్
సాహిత్యం: వేటూరి
గానం: చిత్ర, మనో, ఎమ్. జి. శ్రీకర్


గోల్మాల్  గోల్మాల్




ఓ ప్రేమ ప్రేమా పాట సాహిత్యం

 

చిత్రం: హనుమాన్ జంక్షన్ (2001)
సంగీతం: సురేష్ పీటర్స్
సాహిత్యం: చంద్రబోస్
గానం: సురేష్ పీటర్స్


ఓ ప్రేమ ప్రేమా



కుషి కుషిగా పాట సాహిత్యం

 
చిత్రం: హనుమాన్ జంక్షన్ (2001)
సంగీతం: సురేష్ పీటర్స్
సాహిత్యం: వేటూరి
గానం: శంకర్ మహదేవన్, స్వర్ణలత

కుషి కుషిగా

Palli Balakrishna Sunday, November 19, 2017

Most Recent

Default