Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Game Changer (2025)




చిత్రం: Game Changer (2025)
సంగీతం: S. థమన్
సాహిత్యం: అనంత శ్రీరామ్
గానం: ధలర్ మెహంది, సునిధి చౌహాన్
నటీనటులు: రామ్ చరణ్, కైరా అద్వాని, అంజలి
దర్శకత్వం: యస్.శంకర్ 
నిర్మాత: దిల్ రాజు 
విడుదల తేది: 10.01.2025



Songs List:



జరగండి జరగండి పాట సాహిత్యం

 
చిత్రం: Game Changer (2025)
సంగీతం: S. థమన్
సాహిత్యం: అనంత శ్రీరామ్
గానం: ధలర్ మెహంది, సునిధి చౌహాన్

ముప్పావ్‍లా పెళ్ళన్నాడే
మురిపాల సిన్నోడే
ముద్దే ముందిమ్మన్నాడే
మంత్రాలు మర్నాడే

గుమ్స్ గుంతాక్స్ చిక్స్

జరగండి జరగండి జరగండీ
జాబిలమ్మ జాకెటేసుకొచ్చెనండీ
జరగండి జరగండి జరగండీ
ప్యారడైజ్ పావడేసుకొచ్చెనండీ

సిక్సర్ ప్యాకులో యముడండీ
సిస్టం తప్పితే మొగుడండీ
థండర్ స్టార్ములా టిండర్ సీమనే
చుడతది వీడి గారడీ

జరగండి జరగండి జరగండీ
మార్సు నుంచి మాసు పీసు వచ్చెనండీ
పిల్లగాడు సూడె పిచ్చి లేపుతాడే
కుర్రగాడు సూడె కుచ్చు లాగుతాడే

ఎయ్ జరగండి జరగండి జరగండీ
స్టారులొక్కటైన స్టారు వచ్చెనండీ

ముప్పావ్‍లా పెళ్ళన్నాడే
మురిపాల సిన్నోడే
ముద్దే ముందిమ్మన్నాడే
మంత్రాలు మర్నాడే

హస్కు బుస్కు లస్కండి
మరో ఎలన్ మస్కండి
జస్క మస్క రస్కండి రిస్కేనండి

సిల్కు షర్టు హల్కండి
రెండు కళ్ళ జల్కండి
బెల్లు బటన్ నొక్కండి
సప్రైజ్ చేయ్యండి

గుమ్స్ గుంతాక్స్ చిక్స్
గుమ్స్ గుంతాక్స్ చిక్స్

పాలబుగ్గపై తెల్లవారులు
పబ్జీలాడే పిల్లడే
పూలపక్కపై మూడు పూటలు
సర్జికల్ స్ట్రైక్ చేస్తడే

పిల్లో ఎక్కడో
ఏయ్ ఓయ్ ఓయ్ ఓయ్
పిల్లో ఎక్కడో ఉంటూనే
కల్లో డ్రోన్ ఎటాక్ చేస్తావే

సూపర్ సోనికో హైపర్ సోనికో
సరిపడ వీడి స్పీడుకే

జరగండి జరగండి జరగండీ
గూగులెతికిన గుమ్స్ వచ్చెనండీ
ఓయ్ జరగండి జరగండి జరగండీ
పువ్వులొక్కటైన పువ్వు వచ్చెనండీ

సిక్సర్ ప్యాకులో యముడండీ
సిస్టం తప్పితే మొగుడండీ
థండర్ స్టార్ములా టిండర్ సీమనే
చుడతది వీడి గారడీ

జరగండి జరగండి జరగండీ
కిస్సుల కలాష్నికోవ్ వచ్చెనండీ
పిల్లగాడు సూడె పిచ్చి లేపుతాడే
కుర్రగాడు సూడె కుచ్చు లాగుతాడే

జరగండి జరగండి జరగండీ
దుమ్ములేపు గుంతకాసు వచ్చెనండీ



రా మచ్చ మచ్చ రా పాట సాహిత్యం

 
చిత్రం: Game Changer (2025)
సంగీతం: S. థమన్
సాహిత్యం: అనంత శ్రీరామ్
గానం: నకాష్ అజీజ్

కళ్లజోడు తీస్తే నీలాంటి వాడ్నే
షర్ట్ పైకి పెడితే నీలాంటి వాడ్నే

టక్కు టై తీస్తే నీలాంటి వాడ్నే
నాటు బీటు వింటే నీలాంటి వాడ్నే

కన్న ఊళ్ళో కాలెట్టానంటే
నేనైనా నేనైనా నీలాంటోడ్నే
మాటలన్నీ చేతల్లో పెడితే
మీరైనా నాలాంటోళ్లే ఏ ఏ

రా మచ్చ మచ్చ రా
రా మచ్చ మచ్చ రా
ఈ కచ్చా పచ్చాకే
రాడ్ ఇచ్చాలొచ్చెయ్ రా

రా మచ్చ మచ్చ రా
రా మచ్చ మచ్చ రా
నువ్వొచ్చావంటే రచ్చ రచ్చ ర్యాంపే రా

రా మచ్చ మచ్చ రా
రా మచ్చ మచ్చ రా
ఈ కచ్చా పచ్చాకే
రాడ్ ఇచ్చాలొచ్చెయ్ రా

రా మచ్చ మచ్చ రా
రా మచ్చ మచ్చ రా
నువ్వొచ్చావంటే రచ్చ రచ్చ ర్యాంపే రా

నిక్కరు జేబు లోపల
చిల్లర కాసు గల్ గలా
చక్కగ మోగుతుందిక మ్యూజిక్కులా

వీణ స్టెప్పు వేస్తేనీ
విజిల్ సౌండు దడ దడా
నక్కిన దండి గుండెలో ఏదో మూలా

పోచమ్మ జాతర్లో తప్పెట గుళ్లు
అరె సంక్రాంతి ఇళ్లల్లో పందెం కోళ్లు
సూరమ్మ బడ్డిలో తీయటి జీడ్లు
గుర్తుకొస్తాయీ భూమ్మీద ఉన్నన్నాళ్లు

ఫ్లాష్‌బ్యాక్ నొక్కానంటే
నేనైనా నేనైనా నీలాంటోడ్నే
ఫ్లాష్ ఫార్వర్డ్ కొట్టారనంటే
మీరైనా నాలాంటోళ్లే ఏ ఏ

రా మచ్చ మచ్చ రా
రా మచ్చ మచ్చ రా
ఈ కచ్చా పచ్చాకే
రాడ్ ఇచ్చాలొచ్చెయ్ రా

రా మచ్చ మచ్చ రా
రా మచ్చ మచ్చ రా
నువ్వొచ్చావంటే రచ్చ రచ్చ ర్యాంపే రా

రా మచ్చ మచ్చ రా
రా మచ్చ మచ్చ రా
ఈ కచ్చా పచ్చాకే
రాడ్ ఇచ్చాలొచ్చెయ్ రా

రా మచ్చ మచ్చ రా
రా మచ్చ మచ్చ రా
నువ్వొచ్చావంటే రచ్చ రచ్చ ర్యాంపే రా




నానా హైరానా పాట సాహిత్యం

 
చిత్రం: Game Changer (2025)
సంగీతం: S. థమన్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి 
గానం: కార్తిక్, శ్రేయా ఘోషాల్ 


నాదిర్ దిన్నా...  నాదిర్ దిన్నా
నాదిర్ దిన్నా... నాదిర్ దిన్నా
నాదిర్ దిన్నా... థిల్లానా దిన్నా
నాదిర్ దిన్నా... నాదిర్ దిన్నా
నాదిర్ దిన్నా... నాదిర్ దిన్నా
నాదిర్ దిన్నా... థిల్లానా దిన్నా

నానా హైరానా... ప్రియమైన హైరానా
మొదలాయే నాలోనా... లలనా నీ వలనా

నానా హైరానా… అరుదైన హైరానా
నెమలీకల పులకింతై... నా చెంపలు నిమిరేనా

దానాదీనా ఈవేళ నీలోన నాలోన
కనివినని కలవరమే సుమశరమా

వందింతలయ్యే నా అందం
నువ్వు నా పక్కన ఉంటే
వజ్రంల వెలిగా ఇంకొంచెం
నువ్వు నా పక్కన ఉంటే

వెయ్యింతలయ్యే నా సుగుణం
నువ్వు నా పక్కన ఉంటే
మంచోన్నవుతున్నా మరికొంచెం
నువ్వు నా పక్కన ఉంటే

కోరస్: నాదిర్ దిన్నా... నాదిర్ దిన్నా
నాదిర్ దిన్నా… నాదిర్ దిన్నా
నాదిర్ దిన్నా… థిల్లానా దిన్నా
నాదిర్ దిన్నా… నాదిర్ దిన్నా
నాదిర్ దిన్నా… నాదిర్ దిన్నా
నాదిర్ దిన్నా… థిల్లానా దిన్నా

ఎపుడు లేనే లేని వింతలు
ఇపుడే చూస్తున్నా…
గగనాలన్ని పూలగొడుగులు
భువనాలన్నీ పాల మడుగులు

కదిలే రంగుల భంగిమలై
కనువిందాయెను పవనములు

ఎవరు లేనే లేని దీవులు నీకు నాకేనా

రోమాలన్ని నేడు
మన ప్రేమకు జెండాలాయే
ఏమ్మాయో మరి ఏమో
నరనరము నైలు నదాయే

తనువేలేని ప్రాణాలు తారాడే ప్రేమల్లో
అనగనగా సమయములో తొలి కథగా

వందింతలయ్యే నా అందం
నువ్వు నా పక్కన ఉంటే
వజ్రంల వెలిగా ఇంకొంచెం
నువ్వు నా పక్కన ఉంటే...

వెయ్యింతలయ్యే నా సుగుణం
నువ్వు నా పక్కన ఉంటే
మంచోన్నవుతున్నా మరికొంచెం
నువ్వు నా పక్కన ఉంటే

కోరస్: 
నాదిర్ దిన్నా...  నాదిర్ దిన్నా
నాదిర్ దిన్నా... నాదిర్ దిన్నా
నాదిర్ దిన్నా... థిల్లానా దిన్నా
నాదిర్ దిన్నా... నాదిర్ దిన్నా
నాదిర్ దిన్నా... నాదిర్ దిన్నా
నాదిర్ దిన్నా... థిల్లానా దిన్నా




ధోప్ ధోప్ పాట సాహిత్యం

 
చిత్రం: Game Changer (2025)
సంగీతం: S. థమన్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి 
గానం: థమన్, రోషిణి JKV, పృద్వీ, శ్రుతి రంజిని మోదుముడి

ధోప్ ధోప్... ధోప్ ధోప్

వాక్క వక వక వక వాట్ సే ధోప్
లాక లక లక లక లెట్స్ సే ధోప్
హ్యాపీ హ్యాపీ లైఫుకు మైక్రో మంత్ర ధోప్

లవుడ్ వన్స్ అప్సెట్ అయ్యే ఆర్గుమెంట్ ధోప్
ఆల్వేస్ నువ్వే లూజర్ అయ్యే ఆంగెర్ ధోప్
ఎంతలాంటి స్ట్రెస్సుకు
ఇన్స్టాంట్ సొల్యూషన్ ధోప్…

డోంట్ వర్రీ… డోంట్ వర్రీ
ఎనఫ్ ఆఫ్ ఇంజూరీ
నెగటివ్ వైబ్ కి చెప్పెయ్ ధోప్
బేకరీ బేకరీ… అయ్యయ్యో కెలొరీ
టెడ్డి బేర్ టమ్మీకి చెప్పెయ్ ధోప్

చాటరీ బ్రౌసరి టైం అంతా రాబరీ
చేసే సెల్ ఫోన్ కు చెప్పెయ్ ధోప్
డిస్టర్బింగ్ మెమరీ ఈగో అండ్ జెలసీ
ఓవర్ థింక్ హింసకు జస్ట్ సే ధోప్

If You’re Coming You’re Coming
Everybody Dhop
When You’re With Me You’re With Me
Everything Is Dhop
If You Look At Me Look At Me
Stress Anthaa Dhop
When You Smile At Me Myself-eh Dhop

మన మీటింగుకు మన మీటింగుకు… Interval Dhop
మన టచింగ్ కు మన టచింగ్ కు… Hesitation Dhop
మన లిప్పుకు లిప్పుకు… Distance-u Dhop
నా విలన్ నీ డ్రెస్సుకు Dhop

లా ల ల ధోప్...

వాక్క వక వక వక వాట్ సే ధోప్
లాక లక లక లక లెట్స్ సే ధోప్
హ్యాపీ హ్యాపీ లైఫుకు మైక్రో మంత్ర ధోప్




అలికి పూసిన అరుగు మీన పాట సాహిత్యం

 
చిత్రం: Game Changer (2025)
సంగీతం: S. థమన్
సాహిత్యం: కాసర్ల శ్యామ్
గానం: థమన్, రోషిణి JKV

అలికి పూసిన అరుగు మీన
కలికి సుందరినై కూసుంటే
పలకరించావేందీ ఓ దొరా..?
సిలక ముక్కు సిన్నీ నా దొరా

ఎతికి చూస్తే ఏడూళ్ళైనా
నీలాంటోడు ఇక దొరికేనా..?
ఎందుకింత ఉలుకూ ఓ దొరా
ఎండి బంగారాల నా దొరా

సైకోలెక్కి సందమామ
సిక్కోలంతా ఎన్నెల పంచి
సిన్నబోయి వచ్చావేంది..?
నీలో ఉన్న మచ్చను తలచి
కొండ నిండ వెలుగే నీదిరా

మనసు మీద మన్నేయకురా
నిమ్మలముండు దొర
నా గుండె మీద వాలిపోరా
ఊపిరి పోస్తా దొరా

మనసు మీద మన్నేయకురా
నిమ్మలముండు దొర
నా గుండెలోన తప్పెట గుళ్ల
సప్పుడు నువ్వే దొరా

అలికి పూసిన అరుగు మీన
కలికి సుందరినై కూసుంటే
పలకరించావేందీ ఓ దొరా
సిలక ముక్కు సిన్నీ నా దొరా

గుట్ట గుట్ట తిరిగే ఓ గువ్వ
నీకు దిష్టి పూసలాంటిది సిరిమువ్వ
ఓయ్ రాజా… నెల రాజా, ఆ ఆ
ఎంత కట్టమైన గాని నీ తోవ
నన్ను రెక్కలల్లో సుట్టుకోవా

సింతపూలా ఒంటి నిండా
సిటికెడంత పసుపు గుండా
సిన్నదాని సెంపల నిండా
ఎర్ర ఎర్ర కారంగుండా
వన్నెలన్నీ నీవే సూర్యుడా, ఆ ఆ

మనసు మీద మన్నేయకురా
నిమ్మలముండు దొర
నా గుండె మీద వాలిపోరా
ఊపిరి పోస్తా దొరా…


మనసు మీద మన్నేయకురా
నిమ్మలముండు దొర
నా గుండెలోన తప్పెట గుళ్ల
సప్పుడు నువ్వే దొరా




కొండ దేవరా...పాట సాహిత్యం

 
చిత్రం: Game Changer (2025)
సంగీతం: S. థమన్
సాహిత్యం: కాసర్ల శ్యామ్
గానం: థమన్, శ్రావణ భార్గవి

నెత్తురంత ఉడుకుతున్న
ఊరువాడ జాతర...
వాడు మీద పడ్డడంటే
ఊచ ఊచకోతర...
కొండ దేవర… కొండ దేవర

ఎత్తుకెళ్ళ వచ్చినోళ్ల దండు
ఉప్పు పాతర…
తన్ని తన్ని దుండగుల్ని
తరుముదాము పొలిమేర
కొండ దేవర... కొండ దేవర

కొండ దేవరా... కొండ దేవరా
కొండ దేవరా... నేల గాలి మాది
కొండ దేవరా... మట్టి తల్లి మాది
కొండ దేవరా... నీరు నిప్పు మాది
కొండ దేవరా... కొండ కోన మాది

ఎర్ర ఎర్ర సూర్యున్నేమో
బొట్టునాల దిద్ది
వెలుగు నింపినావు బతుకునా
నల్ల నల్ల మబ్బులోన ఎండి ఎన్నెలద్ది
ఊయలూపినావు జోలనా...

హే, మా నిన్న మొన్న
మనమంటే, నువ్వే
వేయి కన్నులున్న... బలగం నువ్వే
నువ్ ఉంటావమ్మా... ఇయ్యాల, రేపు

మా వెన్నుదన్ను మార్గం చూపే
హే, పాడు కళ్ళు సూడు
తల్లి గుండె తప్ప ఈడకొచ్చినాయిరా
హే, ఎల్లగొట్టుదాము విల్లు ఎత్తినాము
బెల్లుమంటు దూకదా..?

కొండ దేవరా... కొండ దేవరా
కొండ దేవరా... కొండ దేవరా
కొండ దేవరా... నేల గాలి మాది
కొండ దేవరా... మట్టి తల్లి మాది

కొండ దేవరా... అండ నీవురా
కొండ దేవరా, ఆ ఆ... గుండె నీదిరా
కొండ దేవరా... అండ నీవురా
కొండ దేవరా, ఆ ఆ... గుండె నీదిరా



No comments

Most Recent

Default