Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Rajan-Nagendra"
Intinti Ramayanam (1979)



చిత్రం: ఇంటింటి రామాయణం (1979)
సంగీతం: రాజన్ - నాగేంద్ర
సాహిత్యం: ఆరుద్ర, వేటూరి, కొంపెల్ల శివరాం
గానం: యస్.పి.బాలు, పి.సుశీల, ఎస్.జానకి
నటీనటులు: చంద్రమోహన్, రంగనాథ్, జయసుధ, ప్రభ
దర్శకత్వం: పి.సాంబశివరావు
నిర్మాత: నడింపల్లి కృష్ణంరాజు
విడుదల తేది: 23.06.1979



Songs List:



ఇంటింటి రామాయణం వి పాట సాహిత్యం

 
చిత్రం: ఇంటింటి రామాయణం (1979)
సంగీతం: రాజన్ - నాగేంద్ర
సాహిత్యం: ఆరుద్ర
గానం: యస్.పి.బాలు, పి.సుశీల 

ఇంటింటి రామాయణం వింతైన ప్రేమాయణం
కలిసుంటే సల్లాపము విడిపోతే కల్లోలము
ఇంటింటి రామాయణం వింతైన ప్రేమాయణం
కలిసుంటే సల్లాపము విడిపోతే కల్లోలము
సీతమ్మ చిలకమ్మ రామయ్య గోరింక
వలపుల తలపుల సరాగం
ఇంటింటి రామాయణం వింతైన ప్రేమాయణం అహహ

చరణం: 1
నీవుంటే నందనవనము లేకుంటే అశోకవనము
నీవుంటే నందనవనము లేకుంటే అశోకవనము
నీవాడే ఊసులన్ని రతనాల రాశులే
నీవుంటే పూలబాట లేకుంటే రాళ్ళబాట
నీవుంటే పూలబాట లేకుంటే రాళ్ళబాట
నీతోటి ఆశలన్ని సరసాల పాటలు ముత్యాల మూటలు
అల్లల్లే ఎహే

ఇంటింటి రామాయణం వింతైన ప్రేమాయణం
కలిసుంటే సల్లాపము విడిపోతే కల్లోలము
చిలకమ్మ గోరింక
అ సిరిమల్లే అ పొదరినట
చిలకమ్మ గోరింక సిరిమల్లే పొదరింట నవ్వాలి నవ్వాలి
కలిసి కిలకిల నవ్వాలి
కలిసి కిలకిల నవ్వాలి
ఇంటింటి రామాయణం వింతైన ప్రేమాయణం

చరణం: 2
సరి అంచు చీరలు తెస్తా కవరింగు సరుకులు పెడతా
సరి అంచు చీరలు తెస్తా కవరింగు సరుకులు పెడతా
తెమ్మంటే మాయలేడి తేలేనే నిన్నొదిలి
ఓ ఓ ఓ ఓ ఒహొహొహొహొ హొయ్
మబ్బుల్లో నీళ్ళు చూసి ముంత ఒలకబోసుకోను
మబ్బుల్లో నీళ్ళు చూసి ముంత ఒలకబోసుకోను
కీచులాడుకున్న నువ్వు రోషమొచ్చి పోకురా కలిసి మెలిసి ఉండరా
ఇంటింటి రామాయణం వింతైన ప్రేమాయణం ఓయ్

చరణం: 3
ఇల్లేకద స్వర్గసీమ ఇద్దరిది చెరగని ప్రేమ
ఇల్లేకద స్వర్గసీమ ఇద్దరిది చెరగని ప్రేమ
కలతలేని కాపురాన కలలన్ని పండాలి
అహహహహ మోజున్న ఆలుమగలు కులకాలి రేయిపగలు
మోజున్న ఆలుమగలు కులకాలి రేయిపగలు
మన ఇద్దరి పొందికచూసి ఈ లోకం మెచ్చాలి దీవెనలే ఇవ్వాలి

ఇంటింటి రామాయణం వింతైన ప్రేమాయణం
కలిసుంటే సల్లాపము విడిపోతే కల్లోలము
సీతమ్మ చిలకమ్మ రామయ్య గోరింక
వలపుల తలపుల సరాగం
ఇంటింటి రామాయణం వింతైన ప్రేమాయణం
కలిసుంటే సల్లాపము విడిపోతే కల్లోలము
అహహ చిలకమ్మ గోరింక సిరిమల్లే పొదరింట నవ్వాలి నవ్వాలి
కలిసి కిలకిల నవ్వాలి
కలిసి కిలకిల నవ్వాలి
ఇంటింటి రామాయణం వింతైన ప్రేమాయణం
కలిసుంటే సల్లాపము విడిపోతే కల్లోలము
కలిసుంటే సల్లాపము విడిపోతే కల్లోలము




మల్లెలు పూసే వెన్నెల కాసే పాట సాహిత్యం

 
చిత్రం: ఇంటింటి రామాయణం (1979)
సంగీతం: రాజన్ - నాగేంద్ర
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, పి.సుశీల 

మల్లెలు పూసే వెన్నెల కాసే ఈ రేయి హాయిగా
మల్లెలు పూసే వెన్నెల కాసే ఈ రేయి హాయిగా
మల్లెలు పూసే వెన్నెల కాసే ఈ రేయి హాయిగా
మమతలు వేయిగ పెనవేయి నన్ను తీయగా
మల్లెలు పూసే వెన్నెల కాసే ఈ రేయి హాయిగ

ముసి ముసి నవ్వులలో గుస గుస లాడినవే
నా తొలి మొజులలో నీ విరజాజులై
ముసి ముసి నవ్వులలో గుస గుస లాడినవే
నా తొలి మోజులలో నీ విరజాజులై...
మిస మిస వన్నెలలో మిల మిల మన్నవిలె
ఈ బిగి కౌగిలిలో జాబిలి రాత్రులే
కాటుకలంటుకున్న కౌగిలింత లెంత వింతలే
మనసులు పాడే మంతనమాడే ఈ పూట జంటగా
మమతలు వేయిగ పెనవేయి నన్ను తీయగా

మల్లెలు పూసే వెన్నెల కాసే ఈ రేయి హాయిగా..హాహా..హాహా..ఆ
తొలకరి కోరికలే తొందర చేసినవే
ఈ విరి సెయ్యకే ఆవిరి తీరగా
తొలకరి కోరికలే తొందర చేసినవే
ఈ విరి సెయ్యకే ఆవిరి తీరగా
సొగసరి కానుకలే సొద పెడుతున్నవిలే
యే తెర చాటునో ఆ చెఱ వీడగా
అందిన పొందులోనె అందలేని విందులీయవె
కలలిక పండే కలయిక నేడే కావాలి వేడిగా
మమతలు వేయిగ పెనవేయి నన్ను తీయగా

మల్లెలు పూసే వెన్నెల కాసే ఈ రేయి హాయిగా
మమతలు వేయిగ పెనవేయి నన్ను తీయగా
మల్లెలు పూసే వెన్నెల కాసే ఈ రేయి హాయిగా



వీణ వేణువైన సరిగమ విన్నావా పాట సాహిత్యం

 
చిత్రం: ఇంటింటి రామాయణం (1979)
సంగీతం: రాజన్ - నాగేంద్ర
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, ఎస్.జానకి

పల్లవి:
వీణ వేణువైన సరిగమ విన్నావా
ఓ ఓ ఓ తీగ రాగమైన మధురిమ కన్నావా
తనువు తహతహలాడాల చెలరేగాల చెలి ఊగాల ఉయ్యాలలీవేళలో
వీణ వేణువైన సరిగమ విన్నావా
ఓ ఓ ఓ తీగ రాగమైన మధురిమ కన్నావా

చరణం: 1
ఊపిరి తగిలిన వేళ నే ఒంపులు తిరిగిన వేళ
నా వీణలో నీ వేణువే పలికే రాగమాల
ఆ ఆ ఆ ఆ లలలా ఆ ఆ
చూపులు రగిలిన వేళ ఆ చుక్కలు వెలిగిన వేళ
నా తనువున అణువణువున జరిగే రాసలీల ఆ ఆ
వీణ వేణువైన సరిగమ విన్నావా
ఓ ఓ ఓ తీగ రాగమైన మధురిమ కన్నావా

చరణం: 2
ఎదలో అందం ఎదుట ఎదుటే వలచిన వనిత
నీ రాకతో నా తోటలో వెలసే వన దేవత
ఆ ఆ ఆ ఆ లలలా ఆ ఆ
కదిలే అందం కవిత అది కౌగిలికొస్తే యువత
నా పాటలో నీ పల్లవే నవత నవ్య మమత ఆ ఆ

వీణ వేణువైన సరిగమ విన్నావా
ఓ ఓ ఓ తీగ రాగమైన మధురిమ కన్నావా
తనువు తహతహలాడాల చెలరేగాల చెలి ఊగాల ఉయ్యాలలీవేళలో
వీణ వేణువైన సరిగమ విన్నావా
ఓ ఓ ఓ తీగ రాగమైన మధురిమ కన్నావా




ఈ తరుణము..వలపే శరణము పాట సాహిత్యం

 
చిత్రం: ఇంటింటి రామాయణం (1979)
సంగీతం: రాజన్ - నాగేంద్ర
సాహిత్యం: కొంపెల్ల శివరాం
గానం: యస్.పి.బాలు, పి.సుశీల

పల్లవి:
ఏ..హే..హే హే..ఏ..
ఆ..హా..ఆ..హా..ఆహా..ఆ ఆ

ఈ తరుణము..వలపే శరణము
జగములే సగముగా..యుగములే క్షణముగా
మౌనంగ..సాగనీ..తనువంతా రేగనీ
మౌనంగ..సాగనీ..తనువంతా రేగనీ
ఈ తరుణము..వలపే శరణము
జగములే సగముగా..యుగములే క్షణముగా

చరణం: 1
అరవిరిసిన పూలలోనే..నీ అందం తూచనా
ఊరించే మోవిలోనే..తేనియలే దోచనా
కలసిన మన చూపుతోనే..కాలాన్నే ఆగనీ
బంధించే చేతులందూ..ఊయలనై ఊగనీ
నీ దోరనవ్వు విరజాజిపూవు పరువాలు రువ్వు పాలపొంగులో

ఈ తరుణము..వలపే శరణము
జగములే సగముగా..యుగములే క్షణముగా
మౌనంగ..సాగనీ..తనువంతా రేగనీ
మౌనంగ..సాగనీ..తనువంతా రేగనీ
ఈ తరుణము..వలపే శరణము
జగములే సగముగా..యుగములే క్షణముగా

చరణం: 2
ఉసిగొలిపే కొండగాలీ..వేడంత పంచనా
కవ్వించే పొంగులన్నీ..రవికై బిగియించనా
చిరుచెమటలు పోయువేళా..గుండెల్లో నిండిపో
గుండెల్లో నిండిపోయీ..ఊపిరివై ఉండిపో
ఈ కొండకోన అందాలలోన..సుధలొలకబోవుపూలబాటలో

ఈ తరుణము..వలపే శరణము
జగములే సగముగా..యుగములే క్షణముగా
మౌనంగ..సాగనీ..తనువంతా రేగనీ
మౌనంగ..సాగనీ..తనువంతా రేగనీ
ఈ తరుణము..వలపే శరణము
జగములే సగముగా..యుగములే క్షణముగా
లలలలా..లలలలా..లలలలా  




శ్రీ రామ నామమ్ము సర్వస్వం అని (హరికథ) పాట సాహిత్యం

 
చిత్రం: ఇంటింటి రామాయణం (1979)
సంగీతం: రాజన్ - నాగేంద్ర
సాహిత్యం: ఎమ్.వి.ఎల్,  కొంపెల్ల శివరాం
గానం: 

శ్రీ రామ నామమ్ము సర్వస్వం అని ....... (హరికథ)




ఉప్పూ కారం పాట సాహిత్యం

 
చిత్రం: ఇంటింటి రామాయణం (1979)
సంగీతం: రాజన్ - నాగేంద్ర
సాహిత్యం: వేటూరి
గానం: 

ఉప్పూ కారం 

Palli Balakrishna Wednesday, November 29, 2023
Sommokkadidhi Sokokadidhi (1978)



చిత్రం: సొమ్మొకడిది సోకొకడిది (1978)
సంగీతం: రాజన్-నాగేంద్ర
సాహిత్యం: వేటూరి సుందరరామమూర్తి (All)
గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల, యస్.జానకి
నటీనటులు: కమల్ హసన్, జయసుధ, రోజారమణి 
మాటలు: జంధ్యాల
దర్శకత్వం: సింగీతం శ్రీనివాసరావు 
నిర్మాత: బి.రాగ మనోహరి
విడుదల తేది: 05.01.1979



Songs List:



ఆకాశం నీ హద్దురా పాట సాహిత్యం

 
చిత్రం: సొమ్మొకడిది సోకొకడిది (1978)
సంగీతం: రాజన్-నాగేంద్ర
సాహిత్యం: వేటూరి సుందరరామమూర్తి 
గానం: యస్.పి.బాలు

ఆకాశం నీ హద్దురా 
అవకాశం వదలొదురా
పరువాల తొలిపొద్దులో
హమేషా తమాషా చెయ్యరా 

నేలవిడిచి సాములెన్నో చెయ్యరా 
మబ్బుల్లో మెరుపంతా నీదిరా 
నిలబడి తాగే నీళ్ళు చేదురా
పరుగెత్తయినా పాలు తాగరా 
బ్రతుకంటే బస్తీమే సవాల్రా 
ప్రపంచమే మాయా బజారురా....
గురి చూసి కొట్టాలిరా
సిరి చూసి పట్టాలిరా
నీ ఎత్తు ఎదగాలంటే
ఎత్తులో జిత్తులో వెయ్యరా...

నుదుటి రాత నువ్వు మార్చి రాయరా 
నూరేళ్ళ అనుభవాలు నీవిరా
అనుకున్నది పొందడమే నీతిరా 
మనకున్నది పెంచడమే ఖ్యాతిరా 
మనిషి జన్మ మరువలేని ఛాన్సురా 
ఈ రేసులో జాక్పాట్ కొట్టాలిరా
సుడిలోకి దూకాలిరా
కడదాకా ఈదాలిరా
నీ ఒడ్డు చేరాలంటే
తడాకా మజాకా చూపాలిరా




ఓ బాలరాజా ప్రేమే ఎరుగవా పాట సాహిత్యం

 
చిత్రం: సొమ్మొకడిది సోకొకడిది (1978)
సంగీతం: రాజన్-నాగేంద్ర
సాహిత్యం: వేటూరి సుందరరామమూర్తి 
గానం: పి.సుశీల

ఓ బాలరాజా ప్రేమే ఎరుగవా
అందమైన ఆడపిల్ల చెంతచేరి సందెవేళ
అడగలేక అడగరాని దడుగుతుంటే జాలిలేదా బాలరాజా

మల్లెపువ్వు ఎర్రగుంటది - ఎన్నెలైన ఎండగుంటది 
వయసువచ్చి వొళ్ళు చేస్తది వగలు రేపి ఏడిపిస్తది 
నాడి చూస్తావో రాజా - నాటు మందే వేస్తావో 
నీటుగాడా ఘాటు ప్రేమ - థాటి చూస్తావో

పొద్దుటేళ నిద్దరొస్తది  కొత్త బరువు కోక కొస్తది 
రాతిరేళ జాతరౌతది - లేత సొగసు కోత కొస్తది 
మాత్ర వేస్తావో వాటు మంత్ర మేస్తావో 
మోజుతీరే ఫీజుయిస్తే పుచ్చుకుంటావో




అబ్బో నేరేడు పళ్ళు పాట సాహిత్యం

 
చిత్రం: సొమ్మొకడిది సోకొకడిది (1978)
సంగీతం: రాజన్-నాగేంద్ర
సాహిత్యం: వేటూరి సుందరరామమూర్తి 
గానం: యస్.పి.బాలు,  యస్.జానకి

అబ్బో నేరేడు పళ్ళు అబ్బాయి కళ్ళు 
అల్లో నేరేడు పళ్ళు 
పులుపెక్కే పోకళ్ళు కైపెక్కే ఆ కళ్ళు 
లేలేత కొబ్బరి నీళ్ళు

ఆమ్మో గులాబి ముళ్ళు అమ్మాయి కళ్ళు గుచ్చే గులాబీ ముళ్ళు 
ఎరుపెక్కే చెక్కిళ్ళు ఎదలోన ఎక్కిళ్ళు
కోరేది కొబ్బరి నీళ్ళు

ఆ గిరజాల సరదాలు చూస్తుంటే అబ్బా
విరజాజి విరబూసి పోతుంటే
నూనూగు మీసాలు చేస్తున్న మోసాలు
నే తాళ లేనమ్మో ఈ రోజు - నే సైపలేనమ్మో ఆ పోజు

పగటిచుక్క అమ్మాయి - వగలమారి సన్నాయి 
మోహాలు దాహాలు - నాలో చెలరేగుతున్నాయి
ఆ జడ పొడుగు మెడనునుపు చూస్తుంటే
నా అడుగడుగు నీ వెనకే పడుతుంటే
నీలోని అందాలు వేస్తున్న బంధాలు
నే నోపలేనమ్మ ఈరోజు - నే నాపలేవమ్మ ఆ మోజు
పదును చూపు అబ్బాయి పగలుచుక్క రాదోయి
మూడు ముళ్ళూ పడేదాకా కాస్త నువ్వు ఆగవోయి




ఆ పొన్ననీడలో పాట సాహిత్యం

 
చిత్రం: సొమ్మొకడిది సోకొకడిది (1978)
సంగీతం: రాజన్-నాగేంద్ర
సాహిత్యం: వేటూరి సుందరరామమూర్తి 
గానం: యస్.పి.బాలు,  పి.సుశీల

ఆ పొన్ననీడలో ఈ కన్నెవాడలో వున్నా వేచివున్నా 
కదలి రావేలనే నా అన్నులమిన్న....
వ్రేపల్లె వాడలో గోపమ్మ నీడలో వెన్న దోచుకున్నా 
కథలు విన్నానులేరా అల్లరికన్న....

రాధమ్మ మనసు రాగాలు తెలుసు 
అది తీపికోపాల వయసు
కన్నయ్య వయసు గారాలు తెలుసు 
అది మాయ మర్మాల మనసు
అల్లరి ముద్దు హద్దులు వద్దు 
ఇద్దరమంటే ముద్దుకు ముద్దు 
పదహారు వేల సవతులు వద్దు 
ఆ పదహారు వేల సంకెళ్ళు వద్దు.... 

ఈ రాసలీల నీ ప్రేమగోల 
ఎవరెనా చూసారీ వేళ
నీ మేనులోన నా ప్రేమవీణ 
సరిగమలే వింటా నీవేళ
వేసవి చూపు వెన్నెలకాపు 
ఆశలు రేపు బాసలు ఆపు
కలహాలు పెంచే కౌగిలి ముద్దు
ఈ కలషాలు పెంచే కవ్వింత ముద్దు....




తొలి వలపు తొందరలు పాట సాహిత్యం

 
చిత్రం: సొమ్మొకడిది సోకొకడిది (1978)
సంగీతం: రాజన్-నాగేంద్ర
సాహిత్యం: వేటూరి సుందరరామమూర్తి 
గానం: యస్.పి.బాలు,  యస్.జానకి

తొలి వలపు తొందరలు
ఉసిగొలిపే తెమ్మెరలు
చెలితో నేను చలితో నీవు
చేసే అల్లరులు

పిలిచే నీ కళ్ళు.. తెలిపే ఆకళ్ళు
కరగాలి కౌగిళ్ళలో
వలపించే వళ్ళు.. వలచే పరవళ్ళు
కదిలే పొదరిళ్ళలో  
తెరతీసే కళ్ళు.. తెరిచే వాకిళ్ళు
కలవాలి సందిళ్ళలో
పూసే చెక్కిళ్ళు.. మూసే గుప్పిళ్ళు
బిగిసే సంకెళ్ళలో
నీలో అందాలు.. నేనే పొందాలి
నాకే చెందాలిలే

కురిసే ఈ వాన.. తడిసే నాలోనా
రేపిందిలే తపన
పలికే పరువాన.. వలపే విరివాన
నీవే ఆలాపనా
వణికే నీ మేన.. సణిగే నా వీణ..
పలికిందిలే మోహన
విరిసే నా నవ్వు.. విరజాజీ పువ్వు
సిగలో నేనుంచనా
నీలో రాగాలు.. నాలో రేగాలి
నేనే ఊగాలిలే

Palli Balakrishna Thursday, October 26, 2023
Madanakamaraja Katha (1962)



చిత్రం: మదనకామరాజు కథ (1962)
సంగీతం: రాజన్-నాగేంద్ర
నటీనటులు: కాంతారావు,కృష్ణకుమారి, హరనాథ్, రాజశ్రీ
నిర్మాత, దర్శకత్వం: బి.విఠలాచార్య
విడుదల తేది: 09.11.1962



Songs List:



జనని బద్రకరాల కాళి పాట సాహిత్యం

 
చిత్రం: మదనకామరాజు కథ (1962)
సంగీతం: రాజన్-నాగేంద్ర
సాహిత్యం: జి. కృష్ణమూర్తి 
గానం: పి. సుశీల 

జనని బద్రకరాల కాళి



నా కోటి స్వప్నాలు పాట సాహిత్యం

 
చిత్రం: మదనకామరాజు కథ (1962)
సంగీతం: రాజన్-నాగేంద్ర
సాహిత్యం: జి. కృష్ణమూర్తి 
గానం: పి. బి. శ్రీనివాస్

నా కోటి స్వప్నాలు 



చిక్కును విప్పవే చినదానా పాట సాహిత్యం

 
చిత్రం: మదనకామరాజు కథ (1962)
సంగీతం: రాజన్-నాగేంద్ర
సాహిత్యం: జి. కృష్ణమూర్తి 
గానం: జిక్కీ , నాగేంద్ర 

చిక్కును విప్పవే చినదానా




ప్రేమతో సరి అయినది భూమిలో ఏమున్నది పాట సాహిత్యం

 
చిత్రం: మదనకామరాజు కథ (1962)
సంగీతం: రాజన్-నాగేంద్ర
సాహిత్యం: జి. కృష్ణమూర్తి 
గానం: పి. సుశీల 

ప్రేమతో సరి అయినది భూమిలో ఏమున్నది 



ఓ ప్రియతమా రావా పాట సాహిత్యం

 
చిత్రం: మదనకామరాజు కథ (1962)
సంగీతం: రాజన్-నాగేంద్ర
సాహిత్యం: జి. కృష్ణమూర్తి 
గానం: పి. సుశీల 

ఓ ప్రియతమా రావా 



నీలి మేఘ మాలవో... నీలాల తారవో (Male) పాట సాహిత్యం

 
చిత్రం: మదనకామరాజు కథ (1962)
సంగీతం: రాజన్-నాగేంద్ర
సాహిత్యం: జి. కృష్ణమూర్తి 
గానం: పి. బి. శ్రీనివాస్,

నీలి మేఘ మాలవో... నీలాల తారవో





నీలి మేఘ మాలవో... నీలాల తారవో (Duet) పాట సాహిత్యం

 
చిత్రం: మదనకామరాజు కథ (1962)
సంగీతం: రాజన్-నాగేంద్ర
సాహిత్యం: జి. కృష్ణమూర్తి 
గానం: పి. బి. శ్రీనివాస్, పి. సుశీల 

పల్లవి:
నీలి మేఘ మాలవో... నీలాల తారవో
నీ సోయగాలతో...మదినీ దోచిపోదువో..ఓ ఓ ఓ..
నీలి మేఘ మాలనో...నీలాల తారనో
నా సోయగాలతో...మదినీ ఈ ఈ దోచిపోతినో..ఓ ఓ ఓ..

నీలి మేఘ మాలనో...

చరణం: 1
నీ రాక కోసమే చెలి... నే వేచియుంటినే...
ఆరాటమేలనో ప్రియా... నే చెంత నుంటినే...
ఆనంద మధుర గీతములా.. ఆలపింతమా ఆ ఆ ఆ ...
నీలి మేఘ మాలనో....

చరణం: 2
చివురించు వలపు తీవెల... విరి పూలు పూయగా...
చిరునవ్వు విరుపు లోపల... హరివిల్లు విరియదా...
నెలవంక నావలోన మనము కలసిపోదమా ఆ ఆ ఆ ...

నీలి మేఘ మాలవో...

చరణం: 3
మనలోని కలత మాయమై... మన ఆశ తీరెగా...
అనురాగ రాగమే ఇక...మన రాగమాయెగా....
మనసార ప్రేమ మాధురుల సాగి పోదమా ఆ ఆ ఆ ...
నీలి మేఘ మాలనో... నీలాల తారనో...
నీ సోయగాలతో... మదినీ దోచి పోదువో...





తేలిపోదామా పాట సాహిత్యం

 
చిత్రం: మదనకామరాజు కథ (1962)
సంగీతం: రాజన్-నాగేంద్ర
సాహిత్యం: జి. కృష్ణమూర్తి 
గానం: పి. బి. శ్రీనివాస్, పి. సుశీల 

తేలిపోదామా 

Palli Balakrishna Sunday, July 17, 2022
Kotikokadu (1983)



చిత్రం: కోటి కొక్కడు (1983)
సంగీతం: రాజన్-నాగేంద్ర 
సాహిత్యం: వేటూరి (All)
గానం: యస్.పి. బాలు, పి. సుశీల, పి. యస్. ప్రకాష్ 
నటీనటులు: కృష్ణంరాజు, మురళీమహన్, జయసుధ 
మాటలు: కాశీ విశ్వనాథ్ 
దర్శకత్వం: కొమ్మినేని 
నిర్మాత: జి. సత్యన్నారాయణ రాజు 
విడుదల తేది: 11.08.1983



Songs List:



గుడు గుడు గుంచం పాట సాహిత్యం

 
చిత్రం: కోటి కొక్కడు (1983)
సంగీతం: రాజన్-నాగేంద్ర 
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.పి. బాలు, పి. సుశీల

గుడు గుడు గుంచం



వేడి వేడి జీడిపప్పు పాట సాహిత్యం

 
చిత్రం: కోటి కొక్కడు (1983)
సంగీతం: రాజన్-నాగేంద్ర 
సాహిత్యం: వేటూరి 
గానం: పి. సుశీల, పి. యస్. ప్రకాష్ 

వేడి వేడి జీడిపప్పు 



అణువణువున హృదయం పాట సాహిత్యం

 
చిత్రం: కోటి కొక్కడు (1983)
సంగీతం: రాజన్-నాగేంద్ర 
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.పి. బాలు, పి. సుశీల

అణువణువున హృదయం 




ఒసిబిస ఒసిబిస వయ్యారం పాట సాహిత్యం

 
చిత్రం: కోటి కొక్కడు (1983)
సంగీతం: రాజన్-నాగేంద్ర 
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.పి. బాలు, పి. సుశీల

ఒసిబిస ఒసిబిస వయ్యారం 




ఎవరికి చెప్పను నాలో పాట సాహిత్యం

 
చిత్రం: కోటి కొక్కడు (1983)
సంగీతం: రాజన్-నాగేంద్ర 
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.పి. బాలు

ఎవరికి చెప్పను నాలో 

Palli Balakrishna Saturday, July 9, 2022
Nagamalli (1980)



చిత్రం: నాగమల్లి (1980)
సంగీతం: రాజన్-నాగేంద్ర
నటీనటులు: చంద్రమోహన్, దీప, మేనక 
దర్శకత్వం: దేవదాస్ కనకాల
నిర్మాత: భాస్కర వర్మ 
విడుదల తేది: 1980



Songs List:



మల్లీ మల్లీ..నా నాగ మల్లీ పాట సాహిత్యం

 
చిత్రం: నాగమల్లి (1980)
సంగీతం: రాజన్-నాగేంద్ర
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి. బాలు, పి.సుశీల 

పల్లవి: 
మల్లీ మల్లీ..నా నాగ మల్లీ
మదిలో మెదిలే అనురాగ వల్లీ..
మదిలో మెదిలే అనురాగ వల్లీ..

చరణం: 1
ఆషాఢ మాసాన మిల మిలమన్నా
మెరుపే చూసి నీవనుకున్నా
కార్తీక దీపాల కాంతులలోనా
కళలే చూసి నీవనుకున్నా
ఆరారు రుతువుల ఆలాపనగా
కనులే తెరచి నే కలలే కన్నా
కాల మేఘములు..కామ దాహములు..
కరిగినా మధుర గీతం
నిను నను కల్పిన నిముషము 
వలపున యుగయుగాల సంగీతం..
తనువు నీ వేణువే... మనసు నీ రాగమే..
మల్లి నీ కోసమే

చరణం: 2
మధుమాసంలో కుహు కుహుమన్నా
పిలుపే విని నీ కబురనుకున్నా
వైశాఖ మాసాన వేసవిలోనా
వడగాలులు నీ ఉసురనుకున్నా
ఇన్నాళ్ళ కన్నీళ్ళ ఆవేదనగా
నను నే మరచీ నీ కౌగిట ఉన్నా
మదమరాళి నీ పద నివాళికై 
తలలువాల్చి తరియించగా
వనమయూరములు నీ వయారములు 
వగలు నేర్చి నటియించగా
గగనసీమ నీ జఘనమై... 
చందమామ నీ వదనమై..
సిరులు మువ్వలై... 
గిరులు నవ్వులై... 
ఝరులు నడకలై..
అల్లన మెల్లన పిల్లన గ్రోవికి
ఆరవ ప్రాణము నీవుగా
కదలిరా శిల్పమై 
సంగీతమై నాట్యమై
కదలిరా శిల్పమై... సంగీతమై..నాట్యమై
కలసిపో నీవుగా... నేను నీ మేనుగా
నీవే... నేనుగా.......




నాగమల్లివో తీగ మల్లివో పాట సాహిత్యం

 
చిత్రం: నాగమల్లి (1980)
సంగీతం: రాజన్-నాగేంద్ర
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి. బాలు, పి.సుశీల

పల్లవి:
నాగమల్లివో తీగ మల్లివో నీవే రాజకుమారి
నాగమల్లివో తీగ మల్లివో నీవే రాజకుమారి
నవ్వులో యవ్వనం పువ్వులై విరియగా
ఏదీ ఇంకొక సారి నవ్వవే చంద్ర చకోరీ

నాగ మల్లినో తీగ మల్లినో నీదే రాజకుమారి
నాగ మల్లినో తీగ మల్లినో నీదే రాజకుమారి
రాకతో జీవనం రాగమై పలుకగా
ఏదీ ఇంకొక సారి ముద్దుల మోహన మురళి
నాగ మల్లినో తీగ మల్లినో నీదే రాజకుమారి

చరణం: 1
వీణల్లే పాడు జాణల్లే ఆడు
రసధునివై నీవు నా లోనా
ఊగాలి రాగ డోలా

నీలో నాదాలు ఎన్నో విన్నాను
పరువపు వేణువులీవెళా
నువ్వేనా రాసలీల
నేను వేణువై నిను వరింపగా
అలిగిన అందెల సందడిలో

నాగ మల్లినో తీగ మల్లినో నీదే రాజకుమారి
నాగమల్లివో తీగ మల్లివో నీవే రాజకుమారి
రాకతో జీవనం రాగమై పలుకగా
ఏదీ ఇంకొక సారి ముద్దుల మోహన మురళి

నాగమల్లివో తీగ మల్లివో నీవే రాజకుమారి

చరణం: 2
నువ్వే నా ఈడు నవ్వే నా తోడు
కలిసిన కాపుర మీవేళ
కావాలి నవ్య హేల

నీలో అందాలు ఎన్నో గ్రంధాలు
చదివిన వాడను ఈ వేళా
నువ్వే నా కావ్య మాలా
పువ్వు పువ్వున పులకరింతలే
విరిసెను మన చిరు నవ్వులలో

నాగమల్లివో తీగ మల్లివో నీవే రాజకుమారి
నాగ మల్లినో తీగ మల్లినో నీదే రాజకుమారి
ఓ... నవ్వులో యవ్వనం పువ్వులై విరియగా
ఏదీ ఇంకొక సారి నవ్వవే చంద్ర చకోరీ

నాగ మల్లినో తీగ మల్లినో నీదే రాజకుమారి
నీవే రాజకుమారీ... నీదే రాజకుమారీ...
నీవే రాజకుమారీ... నీదే రాజకుమారీ...





నిదరోయి నదులన్ని పాట సాహిత్యం

 
చిత్రం: నాగమల్లి (1980)
సంగీతం: రాజన్-నాగేంద్ర
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి. బాలు, పి.సుశీల

నిదరోయి నదులన్ని 




రాగం తీసే కోయిలా.. పాట సాహిత్యం

 
చిత్రం: నాగమల్లి (1980)
సంగీతం: రాజన్-నాగేంద్ర
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి. బాలు, పి.సుశీల

రాగం తీసే కోయిలా.. కోయకు గుండెలు తీయగా
రాతిరి.. వేళలా.. రగిలే ఎండలా
బాసలెన్నొ చేసుకున్న ఆశే మాయెగా
బాసలెన్నొ చేసుకున్న ఆశే మాయెగా
పిలవని.. పిలుపుగా ..రాకే నీవిలా
రాగం తీసే కోయిలా.. కోయకు గుండెలు తీయగా
రాతిరి.. వేళలా.. రగిలే ఎండలా

చరణం: 1
జంటని ఎడబాసినా.. ఒంటరి నా బ్రతుకునా
మల్లెల సిరివెన్నెల.. మంటలు రేపగా...
వయసుల నులి వెచ్చని.. వలపుల మనసిచ్చిన
నా చెలి చలి వేణువై.. వేదనలూదగా...
తొలకరీ పాటలే.. తోటలో పాడకే.. పదే పదే పదే పదాలుగా
రాగం తీసే కోయిలా.. కోయకు గుండెలు తీయగా
రాతిరి.. వేళలా.. రగిలే ఎండలా

చరణం: 2
పగిలిన నా హృదయమే.. రగిలెనే ఒక రాగమై
అడవిలో వినిపించిన.. ఆమని పాటగా...
అందమే నా నేరమా.. పరువమే నా పాపమా
ఆదుకోమని చెప్పవే.. ఆఖరి మాటగా...
గుండెలో మురళిని.. గొంతులో ఊదకే.. పదే పదే పదే పదాలుగా...
రాగం తీసే కోయిలా.. కోయకు గుండెలు తీయగా
రాతిరి.. వేళలా.. రగిలే ఎండలా




వావిలపువ్వు వామన గుంట పాట సాహిత్యం

 
చిత్రం: నాగమల్లి (1980)
సంగీతం: రాజన్-నాగేంద్ర
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి. బాలు, పి.సుశీల

వావిలపువ్వు వామన గుంట వరసో వరస




మల్లెపూలు పెట్టకుండ పాట సాహిత్యం

 
చిత్రం: నాగమల్లి (1980)
సంగీతం: రాజన్-నాగేంద్ర
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి. బాలు, పి.సుశీల

మల్లెపూలు పెట్టకుండ





లాహిరిలో లకుముకి పాట సాహిత్యం

 
చిత్రం: నాగమల్లి (1980)
సంగీతం: రాజన్-నాగేంద్ర
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి. బాలు, పి.సుశీల

లాహిరిలో లకుముకి

Palli Balakrishna Sunday, June 26, 2022
Rowdy Police (1987)



చిత్రం: రౌడీ పోలీస్ (1987)
సంగీతం: రాజన్-నాగేంద్ర
నటీనటులు: భానుచందర్, రాధిక
దర్శకత్వం: మౌళి
నిర్మాత: జి.వి. జి. రాజు
విడుదల తేది: 1987

Palli Balakrishna Wednesday, August 25, 2021
Raga Leela (1987)





చిత్రం: రాగలీల (1987)
సంగీతం: రాజన్ - నాగేంద్ర 
సాహిత్యం: వేటూరి
నటీనటులు: రఘు, సుమలత, తులసి 
చీఫ్ అసోసియేట్ డైరెక్టర్: ఈ.వి.వి.సత్యన్నారాయణ 
దర్శకత్వం: జంధ్యాల
నిర్మాత: జంధ్యాల, జయకృష్ణ 
విడుదల తేది: 03.07.1987

(సెన్సార్ కారణంగా రాసలీల ను రాగలీల గా మార్చారు )

Palli Balakrishna Sunday, August 8, 2021

Most Recent

Default