Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Nuvvante Pichi Neekosam Sache"
Nuvvante Pichi Neekosam Sache (2019)



పాట : గుర్తుకొచ్చినప్పుడల్లా (2019)
సంగీతం: కళ్యాణ్
సాహిత్యం: లక్ష్మణ్
గానం: రాము


గుర్తుకొచ్చినప్పుడల్లా (నువ్వంటే పిచ్చే నీకోసం సచ్చే) పాట సాహిత్యం

 
పాట : గుర్తుకొచ్చినప్పుడల్లా (2019)
సంగీతం: కళ్యాణ్
సాహిత్యం: లక్ష్మణ్
గానం: రాము

గుర్తుకొచ్చినప్పుడల్లా... ఓ... ఓ...
గాయాలు చేశావు ఈ జన్మకు
భారాన్ని వేశావు నా జన్మకు
బంధాన్ని తెంపావు ఈ జన్మకు
మరుపంటు రావమ్మ ఏ జన్మకు

మారిపోయావే ఓ పిల్లా
మరచిపోయావే నన్నిల్లా

గుర్తుకొచ్చినప్పుడల్లా... ఓ... ఓ...
గుర్తుకొచ్చినప్పుడల్లా
గుండె లాగుతుంది ఓ పిల్లా
నువ్వు లేవన్న బాధ రావన్న బాధ
సంపుతుందే మల్లా

గుర్తుకొచ్చినప్పుడల్లా
గుండె లాగుతుంది ఓ పిల్లా
నువ్వు లేవన్న బాధ రావన్న బాధ
సంపుతుందే మల్లా

ఏం చేశానే నేనే నేరం
నేనేం చేశానే నీకే ద్రోహం
ఏం చేశానే నేనే నేరం
నేనేం చేశానే నీకే ద్రోహం

కాకపోవచ్చే నేను అందగాడిని
లేకపోవచ్చే నాకు ఆస్తిపాస్తులే
కాకపోవచ్చే నేను అందగాడిని
లేకపోవచ్చే నాకు ఆస్తిపాస్తులే

నువ్వంటే పిచ్చే నీకోసం సచ్చే
ప్రాణమే నాది కాదా...
ఊరంచు వాగుల్లో అలల నడుమ
నేనీదుతుండంగా ఈత
వాగంత పొంగొచ్చి నే కొట్టుకెళుతుంటే
నను చూసి పెట్టిన కూత

గుర్తుకొచ్చినప్పుడల్లా... ఓ... ఓ...
గుర్తుకొచ్చినప్పుడల్లా
గుండె లాగుతుంది ఓ పిల్లా
నువ్వు లేవన్న బాధ రావన్న బాధ
సంపుతుందే మల్లా

గుర్తుకొచ్చినప్పుడల్లా
గుండె లాగుతుంది ఓ పిల్లా
నువ్వు లేవన్న బాధ రావన్న బాధ
సంపుతుందే మల్లా

ఎందుకే అంతలా ప్రేమ చూపినావలా
అందుకే ఇంతలా నొప్పి గుండెలోపల
ఎందుకే అంతలా ప్రేమ చూపినావలా
అందుకే ఇంతలా నొప్పి గుండెలోపల
నిన్ను చూసినప్పుడే ఛీ అంటే పోవునే
బాధనే వుండపోవునే

నా పేరు నీ చేతిమీద చూసి
మీ నాన్న పెట్టంగ వాత
అమ్మా అనే అరుపే మరచి
నా పేరు వచ్చే నీ నోట

గుర్తుకొచ్చినప్పుడల్లా... ఓ... ఓ...
గుర్తుకొచ్చినప్పుడల్లా
గుండె లాగుతుంది ఓ పిల్లా
నువ్వు లేవన్న బాధ రావన్న బాధ
సంపుతుందే మల్లా

గుర్తుకొచ్చినప్పుడల్లా
గుండె లాగుతుంది ఓ పిల్లా
నువ్వు లేవన్న బాధ రావన్న బాధ
సంపుతుందే మల్లా

Palli Balakrishna Monday, March 14, 2022

Most Recent

Default