-->
Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Niharika Konidela"



చిత్రం: రాకాస (2026) 
సంగీతం: అనుదీప్ దేవ్ 
సాహిత్యం: రఘురాం 
గానం: బెన్నీ దయాల్ 
నటీనటులు: సంగ్గేత్ శోబన్ 
దర్శకత్వం: మానస శర్మ 
నిర్మాత: నిహారిక కోనేదల 
విడుదల తేది: 03.04.2026



Songs List:



రపప్పా రపప్పా పాట సాహిత్యం

 
చిత్రం: రాకాస (2026) 
సంగీతం: అనుదీప్ దేవ్ 
సాహిత్యం: రఘురాం 
గానం: రామ్ మిర్యాల  

నీ కోసం వేసుకొస్తే కుర్తా
వాడ్ని తెచ్చి అంటావ్ ఎంటే భర్తా
నిజంగా నాకన్నా వర్తా

నేనెట్ట పోయినా నీకు చాల్తా
నా ఈ ఖర్మకి నువ్వే కర్తా
ఈ టాలెంట్ అంతా బై బర్తా

అరే సడన్గా ట్విస్ట్ ఇచ్చి
క్షణంలో హ్యాండిచ్చి
నన్నిట్టా ఒగ్గేసి ఎట్టా పోయావే

నీ బాబే స్కెచేసి ఎవడ్నో తెచ్చేసి
నన్నే సైడ్ చేసేస్తే నువ్వేం చేసావే

బ్రదర్స్
నేను గుండెలు బాదుకుంటాను
మీరు డప్పులు బాదండి

రపప్పా రపప్పా
రపప్పా రపప్పా
రపప్పా రపప్పా రపప్పా

రపప్పా రపప్పా
రప ప ప ప రపప్పా
రపప్పా రపప్పా రపప్పా

ఓ గిఫ్టులు ఎన్నో తెచ్చా
లిఫ్టులు ఎన్నో ...



పదే పదే ప్రాణం పాట సాహిత్యం

 
చిత్రం: రాకాస (2026) 
సంగీతం: అనుదీప్ దేవ్ 
సాహిత్యం: కిట్టు విస్సప్రగడ
గానం: సింధుజ శ్రీనివాసన్ 


పదే పదే ప్రాణం నిన్నే కోరగా
కలే నిజం కాదా నిన్నే చేరగా
ఒకే ఒక ఆశ నువ్వే చాలు గా
ప్రపంచమే లేదే
ప్రతీ క్షణం నువ్వే నా కథ

అలా అలా దారి నీ వైపుగా మారి
సరాసరి నిన్నే చేరనా?
మరీ మరీ నీతో ఉండాలని కోరి
మనస్సునే రాసి ఇవ్వనా

కళ్ళు మూస్తూ ఉన్నా నిన్నే చూస్తున్నా
నీ కన్నుల్లో నన్నే వెతకనా?
దాచుకోలేనంత ప్రేమ నా పైన
నువ్వే కురిపించాలని కోరనా?

చేతిలోన గీత లాగ నిన్ను
నేనేమార్చుకున్నా
గాలి కూడా తాకకుండా
నిన్ను నాలో దాచనా

చిరు చిరు చిరు నవ్వులు కురిసే
పెదవులు నీ పేరే పలికే
ప్రతి అడుగిక నీ వెనకాలే
చిట్టి గుండె...




స్నేక్ డాన్స్ పాట సాహిత్యం

 
చిత్రం: రాకాస (2026) 
సంగీతం: అనుదీప్ దేవ్ 
సాహిత్యం: రఘురాం 
గానం: బెన్నీ దయాల్

మన బాలుగానికి బ్రేక్ డాన్స్ రావట్లే
యేహే వీరూగానికి వీణ స్టెప్పు పలకట్లే
మన సీనుగానికి కూచిపూడి టచేలే
ఈ రాజూగానికి తీన్మార్ తెలియట్లే

ఏ క్లాసికల్ డాన్స్ ఏ రాదు
బేసికల్లి గ్రేస్ ఏ లేదు
సాల్సా సాంబా రానే రాదు

మనకింకా సెట్ అయ్యే సాంగ్ ఏ లేదా
మన గ్యాంగ్ మొత్తం కలిసి ఆడే డాన్స్ ఏ లేదా

అదేంటి బావ అట్టంటావ్ అంటే
ఓవరాల్‌గా మన సెట్ అయ్యే డాన్స్ ఏ లేదంటావా
భలే ఒడివే ఎందుకు లేదు

ఇట్స్ ఏ స్నేక్ స్నేక్ స్నేక్ డాన్స్
దుబాయ్ షేక్ షేక్ షేక్ డాన్స్
ఇట్స్ ఏ స్నేక్ స్నేక్ స్నేక్ డాన్స్
ఫుల్ బాడీ షేక్ షేక్ డాన్...



Palli Balakrishna Sunday, April 5, 2026







చిత్రం: సూర్యకాంతం (2019)
సంగీతం: కె. రోబిన్
సాహిత్యం: కృష్ణ కాంత్
గానం: సిద్ శ్రీరామ్
నటీనటులు: నీహారిక కొణిదెల, రాహుల్ విజయ్
దర్శకత్వం: ప్రణీత్ బ్రహ్మానందపల్లె
నిర్మాతలు: సందీప్ ఎర్రం రెడ్డి, సృజన్ ఎరబోలు
విడుదల తేది: 29.03.2019

ఇంతేనా ఇంతేనా 
ప్రేమంటే ఇంతేనా
పడినదాకా తెలియదే
ఇంతేనా ఇంతేనా 
నీకైనా ఇంతేనా
మనసు లోలో నిలువదే

నిదురలేదు కుదురులేదు
నిమిషమైనా నాకే 
కదలలేను వదలలేను
మాయా నీదేనా
మాటలైనా రానేరావు
పెదవిదాటే పైకే 
పక్కనున్న వెతుకుతున్నా 
నేను నిన్నేనా

ప్రేమ ఆకాశం సరిపోయేనా దేహం
నీతో సావాసం నను చేసేనా మాయం
తారలన్ని రాలిపోయే కన్నులై వెలిగే
దూరమంతా తీరిపోయే 
మనసు తనువులు తాకితే

ఎదురుచూడని స్నేహమే 
ఎదురువచ్చిన వేళలో
ఎవరు చూడని వైపుకే 
వెతికి వచ్చిన తోడువో
గుండెలో మాట చెప్పలేకున్నా
ఆ మాయలో నేనున్నా
ఎంత చూస్తున్నా చాలలేదమ్మా
నా కళ్లలో దాగిపోవా

ఇంతేనా ఇంతేనా 
ప్రేమంటే ఇంతేనా
పడినదాకా తెలియదే
ఇంతేనా ఇంతేనా 
నీకైనా ఇంతేనా
మనసు లోలో నిలువదే

నిదురలేదు కుదురులేదు
నిమిషమైనా నాకే 
కదలలేను వదలలేను
మాయా నీదేనా
మాటలైనా రానేరావు
పెదవిటదాటే పైకే 
పక్కనున్నా వెతుకుతున్నా 
నేను నిన్నేనా

ప్రేమ ఆకాశం 
సరిపోయేనా దేహం
నీతో సావాసం 
నను చేసేనా మాయం
తారలన్ని రాలిపోయే 
కన్నులై వెలిగే
దూరమంతా తీరిపోయే 
మనసు తనువులు తాకితే





Palli Balakrishna Thursday, May 16, 2019

చిత్రం: హ్యాపీ వెడ్డింగ్ (2018)
సంగీతం: శక్తికాంత్ కార్తీక్
బాక్ గ్రౌండ్ మ్యూజిక్: ఎస్.ఎస్.థమన్ 
సాహిత్యం: సిరివెన్నెల
గానం: హేమచంద్ర, శ్రావణభార్గవి
నటీనటులు: సుమంత్ అశ్విన్, నిహారిక కొణిదెల
దర్శకత్వం: లక్ష్మణ్ కార్య
నిర్మాత: ఎమ్.సుమంత్ రాజు
విడుదల తేది: 28.07.2018


ఓఓ..ఓఓ.. కాదని నువ్వంటున్నదీ
అవునని వినిపిస్తున్నది నిజమేనా

కాదని నువ్వంటున్నదీ
అవునని వినిపిస్తున్నది.. నిజమేనా.. ఓ..

ఏమో.. ఏమన్నానో
ఏమో.. ఏంవిన్నావో

ఏం కావాలంటున్నదీ
అటు ఇటు ఊగే నీ మది.. తెలిసేనా
ఏం కావాలంటున్నదీ
అటు ఇటు ఊగే నీ మది.. తెలిసేనా..

ఏమో.. ఎం కావాలో
తనకీ.. తెలుసో లేదో
ఏమో.. ఎం కావాలో
తనకీ.. తెలుసో లేదో

కోరే.. వరమేదో.. మునుముందే నిలుచుందే
ఇంకా.. కలలేనా.. కనుపాపా
చేరే దరియేదో.. రమ్మంటూ ఎదురైతే
చూస్తూ.. నిలుచోదే తెరచాపా
పారాడే పసిపాపవా.. ప్రాయం రాలేదా
అడుగేస్తే పడిపోతావా.. పడవే ముందడుగా

ముందూ వెనక  చూడకా.. పడిపోమంటావా
నువ్వు చూపిందే తోవంటూ.. తరిమే దుందుడుకా

ఏమో.. ఎం కావాలో
తనకీ.. తెలుసో లేదో
ఏమో.. ఎం కావాలో
తనకీ.. తెలుసో లేదో

నీలో.. నీతోనే.. దోబూచి దొంగాట
నీకే.. నువ్వు దొరికేదెపుడంటా

ఆటో వేటో తేలనీ మన ఈ చెలగాట
ఆలోచిద్దాం అందాక.. తప్పేం లేదంటా

కవ్వించే కయ్యాలతో.. నెగ్గదు చెలిమాటా
ఓటమినే గెలుపంటుంది.. మనసుల ముద్దాటా

అవునా.. అంతేనేమో
అయినా.. ఇంతేనేమో
అవునా.. అంతేనేమో
అయినా.. ఇంతేనేమో

ఓ.. కాదని నువ్వంటున్నదీ
అవునని వినిపిస్తున్నది.. నిజమేనా.. ఓ..
ఓ.. ఎం కావాలంటున్నదీ
అటు ఇటు ఊగే నీ మది.. తెలిసేనా.. ఓఓ..

ఏమో.. ఏమో.. ఏమన్నానో.. ఏమన్నావో
ఏమో.. ఏమో.. ఎం విన్నావో.. ఎం విన్నానో
ఏమో.. ఏమన్నానో
ఏమో.. ఎం విన్నావో.. ఏమో

Palli Balakrishna Friday, February 1, 2019


చిత్రం: ఒక మనసు (2016)
సంగితం: సునీల్ కశ్యప్
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: హేమచంద్ర, ప్రణవి
నటీనటులు: నగచౌర్య , నిహారిక కొణిదల
దర్శకత్వం: రామరాజ్ వి. గొట్టిముక్కల
నిర్మాతలు: మధురా శ్రీదర్ రెడ్డి, డా౹౹ కృష్ణ భట్ట , ఏ. అభినయ్
విడుదల తేది: 24.06.2016

ఏమిటో ఈ క్షణం గుండెలో సంబరం
ఒకటిగా మారగా ఇద్దరం
గాలిలో తేలటం.. ప్రేమలో మునగటం
ఎంత బాగుందిలే పరవశం

నా మనసున తొలకరి వానలు కురిసినవే
నా పెదవికి నవ్వుల పువ్వులు పూసినవే
నా కనులలో రంగుల తారలు మెరిసినవే
నా అల్లరి ఆశలు అలలుగ ఉరికినవే
 
ఏమిటో ఈ క్షణం గుండెలో సంబరం
ఒకటిగా మారగా ఇద్దరం
గాలిలో తేలటం.. ప్రేమలో మునగటం
ఎంత బాగుందిలే పరవశం

నేల మొత్తం వాన విల్లై వూగుతోందీ వింతగా
వీధులన్నీ వెన్నెలల్లే వెలిగిపోయే ఎంత బాగా
ఓ చల్లనిగాలే రోజూ నిలువెల్లా తాకినా
హా ఈరోజే మరి నన్నూ గిలి గిలిగా గిల్లెనా
నీ జతే ఉండగా.. పూటకో పండగా.. గుండెకే వచ్చిపోదా..
నా ఎదురుగ జరిగే సంగతులేవైనా
అది నీ వలనే అని గమనిస్తూ ఉన్నా
నా లోపల జరిగే వేడుక ఏదైనా
ఇక జంటగా నీతో జరపాలంటున్నా

నేను అంటే నేను కాదే నీకు ఇంకో పేరులే
నువ్వు అంటే నువ్వు కాదే నాకు ఇంకో అర్థమేలే
చూపులు కలిసిన తరుణం మహబాగా ఉందిలే
మనసుకి పట్టిన వ్యసనం అది నువ్వే అందిలే
గట్టిగా హత్తుకో.. ముద్దులే పెట్టుకో.. నన్నిలా కప్పుకోరా..
నేనున్నది అన్నది గురుతుకి రాకుండా
నా వెన్నెల వేకువ అన్నీ నువ్వైపో
ఈ లోకం కంటికి ఎదురే పడకుండా
నా లోకం మైకం అన్నీ నువ్వైపో

ఏమిటో ఈ క్షణం గుండెలో సంబరం
ఒకటిగా మారగా ఇద్దరం
గాలిలో తేలటం.. ప్రేమలో మునగటం
ఎంత బాగుందిలే పరవశం

Palli Balakrishna Monday, August 7, 2017

Most Recent

Default