-->
Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Neha Shetty"



చిత్రం: డ్యూడ్ (2025)
సంగీతం: సాయి అభ్యంకర్ 
నటీనటులు: ప్రదీప్ రంగనాథన్ , మమితా బైజు 
దర్శకత్వం: కీర్తిశ్వరన్
నిర్మాతలు: నవీన్ యెర్నేని వై. రవిశంకర్ 
విడుదల తేది:  17.10.2025



Songs List:



బూమ్‌ బూమ్‌ పాట సాహిత్యం

 
చిత్రం: డ్యూడ్ (2025)
సంగీతం: సాయి అభ్యంకర్ 
సాహిత్యం: శనాపతి భరద్వాజ పాత్రుడు 
గానం:  సాయి అభ్యంకర్ , దీప్తి సురేష్, బెభూమిక

అలల్లే అలల్లే
స్వాగ్‌ తో కదిలే పొగరే నువ్వు డ్యూడ్‌
ఎవర్రా ఎవర్రా
ఎగబడు కథరా
తమరే కదా డ్యూడ్‌

డ్యూడ్‌-ఊ నువ్వు
టెన్‌ థౌజండ్‌ ఆర తో ఉంటూ
అడ్డొచ్చే నీ చిక్కులకు చెప్పేవా చెక్‌-ఊ
ఎప్పటికీ తగ్గదనిదా కిక్‌-ఊ

డ్యూడ్‌-ఊ
నిన్ను మించిన డ్యూడ్‌
నేడు లేడు, అసలు రాడు, జస్ట్‌ అనదర్‌ పర్సన్‌ కై చూడు,
కనపడదే హిస్టరీ లో వాడు

బూమ్‌ బూమ్‌ బూమ్‌
సౌండ్‌ అయ్యో
నీ పవర్‌-ఊ

భూగోళం గుండెల్లో
ఫుల్‌ శివర్‌-ఊ

ఎన్నెన్నైనా టెల్‌-ఊ,
నీ పై నెగ్గే వారే నిల్‌-ఊ,
రాజాధి రాజైన
రా వర్షన్‌ రావణ…

బూమ్‌ బూమ్‌ బూమ్‌
సౌండ్‌ అయ్యో
నీ పవర్‌-ఊ

భూగోళం గుండెల్లో
ఫుల్‌ శివర్‌-ఊ
ఎన్నెన్నైనా టెల్‌-ఊ,
నీ పై నెగ్గే వారే నిల్‌-ఊ,
రాజాధి రాజైన
రా వర్షన్‌ రావణ…

అంతు లేని ప్రేమను
లోపల దాచుకునే
తంతు తెలనిదా!!!
గొంతు దాటి వెల్లకా ఆగిన ప్రేమను ఆపినదేవరట నేననా!!
నా మాటున బాధకు
మాటల క్యూర్‌-ఊ వా!
కన్ను కన్న కలలకు ఆక్సిజన్‌-ఊ స్టోర్‌-ఊ వా!
చెరువా చెరువా
అవుతున్న స్టార్‌-ఊ వా,
నా జత కాగలవా!! నా జత కాగలవా!!
నా మనసును నడిపిన తొలితొలి వెలుగువా!!!
తలపును తడిపిన తొలకరి చినుకువా!!
విరిసిన పెదవుల చిరు చిరు నగవుకు నీవే కారణమా!!

బూమ్‌ బూమ్‌ బూమ్‌
సౌండ్‌ అయ్యో
నీ పవర్‌-ఊ
భూగోళం గుండెల్లో
ఫుల్‌ శివర్‌-ఊ
ఎన్నెన్నైనా టెల్‌-ఊ,
నీ పై నెగ్గే వారే నిల్‌-ఊ,
రాజాధి రాజైన
రా వర్షన్‌ రావణ…

రే డమ్మీ పటాసా
నా చూర చూరా టెన్‌ థౌజండ్‌ వాలా హే
పెట్రేగే పప్పెట్‌టా
ఓ ఎగరకు
చల్‌ తు కౌన్‌ హై సాలా

ఐ’మ్‌ జస్ట్‌ చిల్లిన్‌ ఆయా కూల్‌ ఆహ్‌!
ఆయా హూ ప్రాపర్‌ స్టైల్‌ లా
లేద్రా జాలి,
నీ పాత్ర నేతితో క్లోజ్‌
బేటా, డౌట్‌-ఆహ్‌
ఇది యమ పోజ్‌

అలల్లే అలల్లే
బూమ్‌ బూమ్‌ బూమ్‌
సౌండ్‌ అయ్యో నీ పవర్‌-ఊ
భూగోళం గుండెల్లో ఫుల్‌ శివర్‌-ఊ
ఎన్నెన్నైనా టెల్‌-ఊ,
నీ పై నెగ్గే వారే నిల్‌-ఊ,
రాజాధి రాజైన
రా వర్షన్‌ రావణ…




సింగారి పాట సాహిత్యం

 
చిత్రం: డ్యూడ్ (2025)
సంగీతం: సాయి అభ్యంకర్ 
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి 
గానం: సాయి అభ్యంకర్ 

సింగారి సిన్నదానా
నీ ఇంటి దారిలోనా
పసోడై పాడుకోనా రింగా రింగా
బిరానా చేరుకోనా
నీ ముందు నిల్చుకోనా
చేయ్యేసి ఎత్తుకోనా బంగారంగా

అత్తర్లు పూసుకున్నా
పౌడర్లు రాసుకున్నా
ఊరేగి వస్తా ఉన్నా
నీ కోసమే కన్నా

ఎట్టాగో తట్టుకున్నా
లగ్గమే పెట్టుకున్నా
ఇంకాపైనా ఆగలేనన్నా

నువ్వలా రాసుకునే చందనమై
దిద్ధుకునే కుంకుమనై
ఉంటానే నీతోనే
ఇష్టంగా ఉంచుకోవే

గోరుముద్దలు పెట్టుకుంటా
తేనె ముద్దులు పుచ్చుకుంటా
రాతిరీ పగలో నా రాణి నువ్వేలే

సింగారి సిన్నదానా
నీ ఇంటి దారిలోనా
పసోడై పాడుకోనా రింగా రింగా
బిరానా చేరుకోనా
నీ ముందు నిల్చుకోనా
చేయ్యేసి ఎత్తుకోనా బంగారంగా

హే సన్నా సన్నా నడుమున
నున్నా నున్నా నునుపున
ధిన్నా ధిన్నా ధరువునై తాకనా

కంటి రెప్ప వాలే చూపున
సిగ్గే నిన్ను ఆపినా
కితా కితా కిట్టేయ్యనై దూకనా

మాయధారి మనసులోనా
మల్లయుద్ధం జరిగెన
పిల్ల పొరి పక్కన చేరే
అల్లరాసే పెరిగెనే
వేసవిలో ఏసీలు కోరే
కోరికేదో కలిగెనే
చెప్పలేని అల్లజడులే
మగాడినై యెట్ట బయటపడనే..

తల కింద ఉండని దిండుతో
కాళ్లు రెండూ కబడ్డీ ఆడెనే
కొక్కొరొక్కో బాడీలో కోడి
వేడెక్కి పాడెనే…

సింగారి సిన్నదానా
నీ ఇంటి దారిలోనా
పసోడై పాడుకోనా రింగా రింగా
బిరానా చేరుకోనా
నీ ముందు నిల్చుకోనా
చేయ్యేసి ఎత్తుకోనా బంగారంగా

నువ్వలా రాసుకునే చందనమై
దిద్ధుకునే కుంకుమనై
ఉంటానే నీతోనే
ఇష్టంగా ఉంచుకోవే

గోరుముద్దలు పెట్టుకుంటా
తేనె ముద్దులు పుచ్చుకుంటా
రాతిరీ పగలో నా రాణి నువ్వేలే

హే రింగా రింగా రింగా
హే తంగా తంగా తంగా
హే రింగా రింగా రింగా
హే తంగా తంగా తంగా తంగా రింగా రింగా రింగా
హే తంగా తంగా తంగా
హే రింగా రింగా రింగా
హే తంగా తంగా తంగా తంగా



బాగుండు పో పాట సాహిత్యం

 
చిత్రం: డ్యూడ్ (2025)
సంగీతం: సాయి అభ్యంకర్ 
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి 
గానం: సంజిత్ హెగ్డే 

నీ ఇష్టం సర్లే కానీ
ఇచ్చేశా నిన్నే నీకే
ఆనందంగా బతకవే పో..
తీరేదే కాదే నా ప్రేమ
ఆరిపోని వెన్నెలే మారిపోనే పొదులే

నీ ఇష్టం సర్లే కానీ
ఇచ్చేశా నిన్నే నీకే
ఆనందంగా బతకవే పో..
ఈ భారం పోయేదే కాదే
అయినా చెలీ సెలవంటున్నానే

ఏ రేపు నీ చూపు నావైపు రాకున్నా వెయ్యేళ్ళు బాగుండుపో
ఏకాకి లోకనా ఎలాగా నేనున్నా నువ్వైనా బాగుండుపో

గాయమే కానీవే
గుండెలే పెరికేసానే
నిన్ను నీకిచ్చేసానే నవ్వుతూనే
ఎవ్వరినీ ఏమంటానే
నేరమే నాదంటానే
శిక్షగా చివరంటానే
శూన్యమై మిగిలుంటానే

వేరొకరి చేతుల్లో
నీ చెయ్యి చూస్తున్నానే
బరువుగా నిట్టూర్చా బాధలోనే
నిన్న నీ కన్నుల్లోనే
కాటుకై ఉన్నది నేనే
నా కంటి నీళ్లతో నన్నే
నేడిలా చేరిపేసావే

ఏ రేపు నీ చూపు నావైపు రాకున్నా వెయ్యేళ్ళు బాగుండుపో
ఏకాకి లోకనా ఎలాగా నేనున్నా నువ్వైనా బాగుండుపో

ఇంకెవరితోనో నీ జంట
నువ్వులేని నాకు ఎదమంట
ముక్కలైన నాకు దిక్కు తోచదంట
అయినా వెళ్ళిపో

నన్ను దాటి పోవే పొమ్మంటా
మళ్లీ ఇటు రానే వద్దంటా
అంతులేని ప్రేమ అక్షతలు వేసి
దీవించలే పో





నీ గుండె లోనా పాట సాహిత్యం

 
చిత్రం: డ్యూడ్ (2025)
సంగీతం: సాయి అభ్యంకర్ 
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి 
గానం: జోనితా గాంధీ

నీ గుండెలోన లోలోన ఏ ములైన నే లేనా
లేనే లేనా?… నే లేనే లేనా?..
నా నువ్వేనా ఇది నువ్వేనా ప్రేమే లేదా నాపైనా
ఏమి కానా ?… నీకేమి కానా ?..

కంటి రెప్ప వాకిలిలో…
కాలమంతా వేచి ఉంటా…
నువ్వు లేని నీ కలతో…
జ్ఞాపకాలు పంచుకుంటా…

లేదు లేదు నీ దారే నీదని
కాదు కాదని కదిలావే
ఎంత వేదనై నేనున్నానో చూడవే…

లేదు లేదు నీ దారే నీదని
కాదు కాదని కదిలావే
ఎంత వేదనై నేనున్నానో చూడవే…

నీ గుండెలోన లోలోన ఏ ములైన నే లేనా
లేనే లేనా?… నే లేనే లేనా?..

ఏ శాపం తగిలిందో..
చేడు చూపై కసిరిందో..
ఎడబాటే రాసిందా కవ్వించే కాలం
ఏ రేపు మాపుల్లో నీ మనసే మారేనా!!
ఈ చోటే నేనుంటా నా నిన్ను చేరగా

కంటి రెప్ప వాకిలిలో…
కాలమంతా వేచి ఉంటా…
నువ్వు లేని నీ కలతో…
జ్ఞాపకాలు పంచుకుంటా…

లేదు లేదు నీ దారే నీదని
కాదు కాదని కదిలావే
ఎంత వేదనై నేనున్నానో చూడవే…

లేదు లేదు నీ దారే నీదని
కాదు కాదని కదిలావే
ఎంత వేదనై నేనున్నానో చూడవే…

జీవితం నీదిలే…
నిర్ణయం నీదిలే…
పూలు రాలేదని గాలి అల ఆగదులే
మబ్బులే మూసినా నువ్వు నా వెన్నెలే
ఎవ్వరి కలకెవ్వరు హామీ, నా తోడు కనతడు లే ..

Palli Balakrishna Tuesday, April 7, 2026



చిత్రం: బెదురులంక (2023)
సంగీతం: మణిశర్మ 
నటీనటులు: కార్తికేయ, నేహ శెట్టి 
దర్శకత్వం: క్లాక్స్
నిర్మాత: రవిచంద్ర బెనర్జి ముప్పనేని 
విడుదల తేది: 25.08.2023



Songs List:



వెన్నెల్లో ఆడపిల్లా పాట సాహిత్యం

 
చిత్రం: బెదురులంక (2023)
సంగీతం: మణిశర్మ 
సాహిత్యం: కిట్టు విస్సప్రగడ
గానం: హారిక నారాయణ్ , JV సుధాన్స్

వెన్నెల్లో ఆడపిల్లా
కవ్వించే కన్నెపిల్లా
కోపంగా చూస్తే ఎల్లా
క్షణంలో అగ్గిపుల్లా

చాలు చాల్లే గాలిమాటలాపు
పనేమి లేదుగాని నీకు
పలకరించే వెన్నెల్లో ఓ జాబిలమ్మా
పులకరించే కబుర్లు విందామురామ్మా

ఈ వేళ కాని వేళా
నీ దారి మారిపోదా
నిజాయితీగా ఉన్న
మగాడ్ని నమ్మరాదా
నా నీడ కూడా
నిన్ను తాకి ఉలికిపడెనుగా

వెన్నెల్లో ఆడపిల్లా
కవ్వించే కన్నెపిల్లా
కోపంగా చూస్తే ఎల్లా
క్షణంలో అగ్గిపుల్లా ఓ ఓ

దాయి దాయి అంటూ
నను పిలిచిందే కలా
ఇంత రాతిరేలా
నలుగురు చూస్తే ఎలా

ప్రపంచానికేం వేరే పని లేదుగా
మన పనేదో మనదే కదా
ఇదే మాట నానుంచి రాలేదుగా
మగువపైనే నిందేయగా
జోలాలిగా… సమయం కాదుగా
నిదుర ఈపూట దరిచేరునా

వెన్నెల్లో ఆడపిల్లా
వెన్నెల్లో ఆడపిల్లా

రేయి దాచుకున్న మెరుపుల జాబిల్లినీ
దొంగచాటుగానే నేలకు తెచ్చేదెలా
అరే నువ్వు ముందుంటే నిను చూడగా
చందమామే ఓడేనుగా

ఇలా కారుకూతల్ని చెబితే ఎలా
మనసు నీకే రాసివ్వనా
నీ వైపుగా…. కధ మారిందిగా
వెలుగు నీడల్లే నీ నా జత

వెన్నెల్లో ఆడపిల్లా
వెన్నెల్లో ఆడపిల్లా



Solluda Siva పాట సాహిత్యం

 
చిత్రం: బెదురులంక (2023)
సంగీతం: మణిశర్మ 
సాహిత్యం: కృష్ణ చైతన్య 
గానం: అనురాగ్ కులకర్ణి, రోల్ రైడ, పృద్వి చంద్ర 

భోగమంత ఇడువనే ఇడువవు
వింతగుందిరా
నువ్వేవడివి సొల్లుడా సివా
నువ్వేవడివి సొల్లుడా సివా

లోకమన్న లెక్కలకు అందవు
గొప్పగుందిరా
నువ్వేవడివి సొల్లుడా సివా
నువ్వేవడివి సొల్లుడా సివా

హోయ్ శివ బాధలే లేవా ఏంటి
శివ పైకి నువ్వు చూపవా ఏంటి
శివ భయమంటూ లేదా ఏంటి
శివ శివశివ శివశివ
శివ శివ శివ శివ

ఆడు ఈడు ఎవడు
పోటీ కాదంటాను
పొలుస్తూనే బతకద్దంటాను
ఉంటె ఉన్నన్నాళ్లు
నచ్చిన పని చేస్తాను
చస్తూ బ్రతికితే శాపం అంటాను

ఐ డోంట్ కేర్ ఎ డక్
ఐ డోంట్ కేర్ ఎ డక్
ఐ డోంట్ కేర్ ఎ డక్
ఐ డోంట్ కేర్ ఎ డక్

వచ్చిందనుకో కోపం
చూపించెయ్ నీ కోసం
మొయ్యనే మొయ్యకు
దాచే ఏం చేస్తాం

కలిగే నీ ఆనందం
కాసేపేగా నేస్తం
చివరికి ఏది కాదే నీ సొంతం

రానే రావు, ఇయ్యే ఇయ్యే ఇయ్యే
రాతిరి కలలే యే యా
చెయ్యని పనులే, ఇయ్యే ఇయ్యే ఇయ్యే
లేవో ఏంటో ఓ ఓ ఓ

ఐ డోంట్ కేర్ ఎ డక్
ఐ డోంట్ కేర్ ఎ డక్




దొంగాడే దొరగాడు పాట సాహిత్యం

 
చిత్రం: బెదురులంక (2023)
సంగీతం: మణిశర్మ 
సాహిత్యం: కిట్టు విస్సప్రగడ
గానం: సాహితి చాగంటి 

దొంగాడే దొరగాడు 




చిత్తడి చిత్తడి పాట సాహిత్యం

 
చిత్రం: బెదురులంక (2023)
సంగీతం: మణిశర్మ 
సాహిత్యం: కిట్టు విస్సప్రగడ
గానం: మణిశర్మ , శంకర్ బాబు 

చిత్తడి చిత్తడి 



కొట్టర డప్పు పాట సాహిత్యం

 
చిత్రం: బెదురులంక (2023)
సంగీతం: మణిశర్మ 
సాహిత్యం: క్లాక్స్
గానం: ప్రుద్విచంద్ర, సురేష్ 

ఓరబ్బో, ఓర్నాయ్నా
ఇదేంట్రో ఈ మాయా

ఆయ్ బాబోయ్, ఆగలేంరోయ్
వచ్చేయండ్రో, వెయిటింగ్ ఇక్కడా

ఓరబ్బో, ఓర్నాయ్నా
ఇదేంట్రో ఈ మాయా

ఆయ్ బాబోయ్, ఆగలేంరోయ్
వచ్చేయండ్రో, వెయిటింగ్ ఇక్కడా

Palli Balakrishna Sunday, October 8, 2023



చిత్రం: గ్యాంగ్ ఆఫ్ గోదావరి (2023)
సంగీతం: యావన్ శంకర్ రాజా 
నటీనటులు: విశ్వక్ సేన్, నేహ శెట్టి , అంజలి 
దర్శకత్వం: కృష్ణ చైతన్య 
నిర్మాత: సూర్యదేవర నాగ వంశి, సాయి సౌజన్య 
విడుదల తేది: 08.12.2023



Songs List:



సుట్టంలా సూసి పాట సాహిత్యం

 
చిత్రం: గ్యాంగ్ ఆఫ్ గోదావరి (2023)
సంగీతం: యావన్ శంకర్ రాజా 
సాహిత్యం: శ్రీ హర్ష 
గానం: అనురాగ్ కులకర్ణి 

అద్దాల ఓణిలా ఆకాశవాణిలా
గోదారి గట్టుపై మెరిసావు మణిలా
పెద్ధింటి దానిలా బంగారు గనిలా
సూత్తానే నిన్నిలా నా రెండు కన్నులా

కల ఉన్న కళ్ళకే, కాటుకే ఏలా?
మా వీధి వీధంతా దిష్టి కొట్టేలా
సన్నాయి మోతలా సందేళ పాటలా
సందల్లే తెచ్చావే నీలా

సుట్టంలా సూసి పోతలా
సుట్టేసుకోవే సీరలా
సక్కాని సంటివాడిలా
మ్ మ్ సేత్తానే నువ్ సెప్పిందలా

ఏ ఉత్తరాలు రాయలేను
నీకు తెలిసేలా
నా లచ్చనాలనన్ని
పూసగుచ్చేలా

ఏమౌతానంటే ఏది సెప్పలేను వరుసలా
నీ పక్కనుండిపోతే సాలులే ఇలా
సొట్టు గిన్నె మీద సుత్తి పెట్టి కొట్టినట్టుగా
సుమారు కొట్టుకుందే గుండె గట్టిగా
గంటకొక్కసారి గంట కొట్టే గడియారమై
నిన్నే తలిసేలా..!

సుట్టంలా సూసి పోతలా
సుట్టేసుకోవే సీరలా
సక్కాని సంటివాడిలా
సేత్తానే నువ్ సెప్పిందలా

అద్దాల ఓణిలా ఆకాశవాణిలా
గోదారి గట్టుపై మెరిసావు మణిలా
పెద్ధింటి దానిలా బంగారు గనిలా
సూత్తానే నిన్నిలా నా రెండు కన్నులా

కల ఉన్న కళ్ళకే, కాటుకే ఏలా?
మా వీధి వీధంతా దిష్టి కొట్టేలా
సన్నాయి మోతలా సందేళ పాటలా
సందల్లే తెచ్చావే నీలా

సుట్టంలా సూసి పోతలా
సుట్టేసుకోవే సీరలా
సక్కాని సంటివాడిలా
సేత్తానే నువ్ సెప్పిందలా

Palli Balakrishna



చిత్రం: DJ Tillu (2022)
సంగీతం: శ్రీ చరణ్ పాకాల, రామ్ మిరియాల
నటీనటులు: సిద్దు జొన్నలగడ్డ, నేహా శెట్టి
దర్శకత్వం: విమల్ కృష్ణ
నిర్మాత: సూర్యదేవర నాగవంశి
విడుదల తేది: 2022



Songs List:



టిల్లు అన్న డీజే పెడితే పాట సాహిత్యం

 
చిత్రం: DJ Tillu (2022)
సంగీతం: రామ్ మిరియాల
సాహిత్యం: కాసర్ల శ్యామ్
గానం: రామ్ మిరియాల

లాలగూడ అంబరుపేట
మల్లేపల్లి మలక్ పేట
టిల్లు అన్న డీజే పెడితే
టిల్ల టిల్ల ఆడాలా

మల్లేశన్న దావత్లా
బన్ను గాని బారత్లా
టిల్లు అన్న దిగిండంటే
డించక్ డించక్ దున్కాలా

డీజే టిల్లు పేరు
వీని స్టయిలే వేరు
సోకేమో హీరో తీరు
కొట్టేది తీనుమారు

డీజే టిల్లు కొట్టు కొట్టు
డీజే టిల్లు కొట్టు
బేసు జర పెంచి కొట్టు
బాక్సులు పలిగేటట్టు

డీజే టిల్లు పేరు
వీని సౌండే వేరు
కట్ జేసి కొట్టిండంటే
దద్దరిల్లు డాన్సు ఫ్లోరు

డీజే టిల్లు కొట్టు కొట్టు
డీజే టిల్లు కొట్టు
డీజే టిల్లు కొట్టు
కొట్టకుంటే నామీదొట్టు

అరె, చమ్కీ షర్టు - ఆహ
వీని గుంగురు జుట్టు - ఒహో
అట్లా ఎల్లిండంటే సార్లే సలాం కొట్టు

ఏ, గల్లీ సుట్టూ - ఆహ
అత్తరే జల్లినట్టు - ఒహో
మస్తుగా నవ్విండంటే
పోరిలా దిల్లు ఫట్టు - అది

అన్న ఫోటో పెట్టుకొని
జిమ్ము సెంటర్లన్నీ
పోటీ పడి పడీ పబ్లిసిటి జేత్తయే
వీని హవా జూత్తే పోరాలల్ల శివాలే
కార్పొరేటర్కైనా డైరెక్టుగా ఫోన్ కొడతాడే - ఓ

డీజే టిల్లు పేరు
వీని స్టయిలే వేరు
సోకేమో హీరో తీరు
కొట్టేది తీనుమారు

డీజే టిల్లు కొట్టు కొట్టు
డీజే టిల్లు కొట్టు
బేసు జర పెంచి కొట్టు
బాక్సులు పలిగేటట్టు

డీజే టిల్లు పేరు
వీని సౌండే వేరు
కట్ జేసి కొట్టిండంటే
దద్దరిల్లు డాన్సు ఫ్లోరు

డీజే టిల్లు కొట్టు కొట్టు
డీజే టిల్లు కొట్టు
డీజే టిల్లు కొట్టు
కొట్టకుంటే నామీదొట్టు





పటాసు పిల్ల పాట సాహిత్యం

 
చిత్రం: DJ Tillu (2022)
సంగీతం: శ్రీ చరణ్ పాకాల
సాహిత్యం: కిట్టు విస్స ప్రగడ
గానం: అనిరుధ్ రవిచంద్రన్

రాజా రాజా ఐటమ్ రాజా
రోజా రోజా క్రేజీ రోజా
లేజీ లేజీ గుండెల్లోనా
డీజే డీజే కొట్టేసిందా

మైండే అటు ఇటు అని ఊగిందిగా
గుండే తెగ ఎగబడి ఆడిందిగా
లైఫే తికమకపడి సింగల్ స్టెప్పేసి మారిందిగా

పటాసు పిల్ల పటాసు పిల్ల
పటాసు పిల్ల తాకగా
పటాసు పిల్ల పటాసు పిల్ల
పటాసు పిల్ల దిల్లంతా థిల్లాన

పటాసు పిల్ల పటాసు పిల్ల
పటాసు పిల్ల సూటిగా
పటాసు పిల్ల పటాసు పిల్ల
పటాసు పిల్ల టెంటేసి కూసుందా

కలిసే నడిచే దారుల్లో
రంగే చేరే నీడల్లో
జాతరలోన పులి వేషంలాగ
నడుం చూసే వేళా నరం ఆనేసిందే
మనసే కాలే జారెనే

రాజా రాజా ఐటమ్ రాజా
రోజా రోజా క్రేజీ రోజా
పైటే అటు ఇటు అని ఊగిందిగా
లైఫే తికమకపడి సింగల్ స్టెప్పేసి మారిందిగా

పటాసు పిల్ల పటాసు పిల్ల
పటాసు పిల్ల తాకగా
పటాసు పిల్ల పటాసు పిల్ల
పటాసు పిల్ల దిల్లంతా థిల్లాన

పటాసు పిల్ల పటాసు పిల్ల
పటాసు పిల్ల సూటిగా
పటాసు పిల్ల పటాసు పిల్ల
పటాసు పిల్ల టెంటేసి కూసుందా




నువ్వలా వెన్నెలా (Male) పాట సాహిత్యం

 
చిత్రం: DJ Tillu (2022)
సంగీతం: శ్రీ చరణ్ పాకాల
సాహిత్యం: రవికాంత్ పేరేపు
గానం: సిద్దు జొన్నలగడ్డ

నీ కనులను చూశానే
ఓ నిమిషం లోకం మరిచానే

నా కలలో నిలిచావే
నా మనసుకు శ్వాసై పోయావే

నీ పరిచయమే ప్రేమే కోరే
పరిచయమే నా ప్రతి అణువు
నీ పేరేలే పరవశమే

నువ్వలా వెన్నెలా
నీ నవ్విలా వినబడుతూ వీణలా
నీ చూపిలా వరముగా
ఓ ప్రేమను నింపావే కన్నులా

నువ్వలా వెన్నెలా
నీ నవ్విలా వినబడుతూ వీణలా
నీ చూపిలా వరముగా
ఓ ప్రేమను నింపావే కన్నులా





నువ్వలా వెన్నెలా (Female) పాట సాహిత్యం

 
చిత్రం: DJ Tillu (2022)
సంగీతం: శ్రీ చరణ్ పాకాల
సాహిత్యం: రవికాంత్ పేరేపు
గానం: యామిని గంటసాల 

నీ కనులను చూశానే
ఓ నిమిషం లోకం మరిచానే

నా కలలో నిలిచావే
నా మనసుకు శ్వాసై పోయావే

నీ పరిచయమే ప్రేమే కోరే
పరిచయమే నా ప్రతి అణువు
నీ పేరేలే పరవశమే

నువ్వలా వెన్నెలా
నీ నవ్విలా వినబడుతూ వీణలా
నీ చూపిలా వరములా
ఓ ప్రేమను నింపావే కన్నులా

నువ్వలా వెన్నెలా
నీ నవ్విలా వినబడుతూ వీణలా
నీ చూపిలా వరములా
ఓ ప్రేమను నింపావే కన్నులా

Palli Balakrishna Sunday, February 13, 2022



చిత్రం: గల్లీ రౌడీ (2021)
సంగీతం: రామ్ మిరియాల
నటీనటులు: సందీప్ కిషన్, నేహా శెట్టి, బాబీసింహా, రాజేంద్రప్రసాద్
దర్శకత్వం: జి.నాగేశ్వర రెడ్డి
నిర్మాత: యమ్.వి.వి.సత్యనారాయణ
విడుదల తేది:17.09. 2021



Songs List:



పుట్టెనే ప్రేమా పాట సాహిత్యం

 
చిత్రం: గల్లీ రౌడీ (2021)
సంగీతం: రామ్ మిరియాల
సాహిత్యం: భాస్కరా భట్ల
గానం: రామ్ మిరియాల

పుట్టెనే ప్రేమా పడగొట్టెనే ప్రేమా
ఏం చేశావో ఏమో కదమ్మా...
ఇంతలో ప్రేమా అంతలో కోమా
అతలాకుతలం అవుతున్నానమ్మా
నీ పేరేంటో చెప్పు కొంచం ఒట్టేసుకుంట
నీ ఊరేంటో చెప్పు పెట్టె సర్దేసుకుంట
సెల్లు నెంబర్ని చెప్పు రింగు ఇచ్చేసుకుంట
మంచి డేటుంటే చెప్పు పెళ్లి చేసేసుకుంట

పుట్టెనే... పుట్టెనే...
పుట్టెనే ప్రేమా పడగొట్టెనే ప్రేమా
ఏం చేశావో ఏమో కదమ్మా
ఇంతలో ప్రేమా అంతలో కోమా
అతలాకుతలం అవుతున్నానమ్మా

కత్తులతో ఎప్పుడూ కల్లోలంగా ఉండే దారుల్లో
పువ్వులాగ మెరిసావే ఓ...
మగ పురుగులతో చిరాకుగా ఉండే జీవితంలో
ఆడవాసనిపుడే చూపావే
నీ క్యాస్ట్ ఏంటో చెప్పు నేను మార్చేసుకుంట
నీ టేస్ట్ ఏంటో చెప్పు నేను వంట నేర్చేసుకుంట
నువ్వు చెప్పేది చెప్పు నేను ఒప్పేసుకుంట
నాన్నకప్పుంటే చెప్పు నేను తీర్చేసుకుంట

పుట్టెనే.... పుట్టెనే...
పుట్టెనే ప్రేమా పడగొట్టేనే ప్రేమా
ఏం చేశావో ఏమో గదమ్మా

దోమ తెరలాగా ఉస్సూరని ఉండే నా లైఫు
వెండితెరచేసావే ఓ...
ఒక్క నవ్వుతోనే కుండీ లాంటి బుజ్జి గుండెలోన
ప్రేమవిత్తనాలే జల్లేసావే
నీ ఇష్టాలు జెప్పు లిస్టు రాసేసుకుంట
నీ కష్టాలు జెప్పు నెత్తిమీదేసుకుంట
ఏమి కావాలో జెప్పు గిఫ్టు ఇచ్చేసుకుంట
నువ్వు కాదంటే జెప్పు నేను ఉరేసుకుంట

పుట్టెనే... పుట్టెనే...
పుట్టెనే ప్రేమా పడగొట్టెనే ప్రేమా
ఏం చేశావో ఏమో గదమ్మా
ఇంతలో ప్రేమా అంతలో కోమా
అతలాకుతలం అవుతున్నానమ్మా





చాంగురే ఐటెం సాంగురే పాట సాహిత్యం

 
చిత్రం: గల్లీ రౌడీ (2021)
సంగీతం: సాయి కార్తీక్ 
సాహిత్యం: భాస్కరా భట్ల
గానం: మంగ్లీ, సాయి కార్తీక్ , దత్తు 

లాయ్ లబ్బ లల్లాయిలే, లాయ్
లాయ్ లబ్బ లల్లాయిలే
లాయ్ లబ్బ లల్లాయిలే, లాయ్
లాయ్ లాయ్ లబ్బ లల్లాయిలే

ఏ, చాంగురే చాంగురే ఐటమ్ సాంగురే
రాతిరంత పాడుకుంటే రాదు నిద్దరే
(నిద్దరే నిద్దరే నిద్దరే నిద్దరే నిద్దరే)

ఏ, ఎప్పుడంటె అప్పుడే… ఎక్కడంటె అక్కడే
నన్ను చూస్తే ఎవ్వడైనా పూలరంగడే
(రంగడే రంగడే రంగడే రంగడే రంగడే రంగడే)
హబబ్బా ఇంతందంతో ఎట్టా సచ్చేది
హబబ్బా మీ కుర్రాళ్ళని ఎట్టా ఆపేది

ధవళేశ్వరం ఆనకట్ట తెంచినట్టు
నాపై జనం దూకుతుంటరే
పిఠాపురం పీటసెక్క లాగ
నేను మహాదిట్టం అంటూ ఉంటరే

రాజాధిరాజా రౌడీ రాజా
మీసం తిప్పిన మార్తాండకేయ
రాజాధిరాజా రౌడీ రాజా
ఇరగదీద్దాం ఆయుధ పూజ

కత్తులకైనా అధరవులేరా… ఒంపులకైనా బెదరవులేరా
తాతకి తగ్గా మనవడివేరా… రా రాజా రాజా

నా నడుం మడతలిస్తిరి చేసేటోడు
కత్తిలాంటోడు నాకు దొరికినాడు
ఆ గాజువాక నుంచి మధురవాడ దాకా
నీ పేరు చెప్పగానే కెవ్వు కేక

ఏం చెప్పావే గ్రీకు సుందరీ
స్వర్గంలో వేస్కో మల్లె పందిరి
ఏ, అందరికన్నా పెద్ద కంతిరీ
తీర్చేస్తా నీ తిమ్మిరీ

హబబ్బా నీ ఘనకార్యం సూడాలని ఉందే
నీతో కొత్త యవహారం నడపాలని ఉందే
సీకాకుళం అడ్డరోడ్డు దాటగానే
సీతాఫలం బుట్టలిస్తనే
భీమునిపట్నం బీచ్ కాడ
సిత్తరాల సోకుల పొట్లం చేతికిస్తనే




విశాఖపట్నంలో రౌడీ గాడు పాట సాహిత్యం

 
చిత్రం: గల్లీ రౌడీ (2021)
సంగీతం: రామ్ మిరియాల
సాహిత్యం: భాస్కరా భట్ల
గానం: సాయిమాధవ్

పిల్ల పిల్ల పిల్ల పిల్ల కోసం
పిల్లగాడు వేసే కొత్త వేషం
ఇంతలోనే ఎంత అట్టహాసం
కదిలేను కదా… వీడి ప్రేమ కథ

చెయ్యలేదు వీడు ఒక్క యుద్ధం
చూడ లేడు వీడు కోడి రక్తం
రాడు పట్టినాడు ప్రేమ కోసం
ముదిరెను కదా వీడి ప్రేమ కథ
వీడేమో పడుచోడు… వీడెనక ముసలోల్లు
ఓఎల్ఎక్స్ పీసులతోటి ఏం సాధిస్తాడు

ముందెనకా చూడకుండా… ఫైటింగ్ కే దిగినాడు
ఈ కత్తుల కొట్లాటల్లో ఏమైపోతాడు

విశాఖపట్నంలో రౌడీ గాడు
షర్టు బటనిప్పాడు… ఓ మై గాడూ
విశాఖపట్నంలో రౌడీ గాడు
షర్టు బటనిప్పాడు… ఓ మై గాడూ

టిప్పు టాపుగా ఉండేటోడు… ఎంత రఫ్ గా అయిపోయాడు
రచ్చబండ మీద పంచాయితీ చేస్తున్నాడు
కీ బోర్డు మీదా మనసైనోడు… కీళ్లు విరవడం మొదలెట్టాడు
మౌసు పక్కనేటి మీసం తిప్పి… ధూకేశాడు

సెంటు కొట్టుకునే డీసెంటు పిల్లగాడే
బెల్టు పట్టుకొని సెటిల్‌మెంట్ చేస్తాడే
ప్యారు పుట్టగానే వీడు గేర్ మార్చినాడే
అమ్మో అమ్మో ఆగడే..!!

విశాఖపట్నంలో రౌడీ గాడు
షర్టు బటనిప్పాడు… ఓ మై గాడూ
విశాఖపట్నంలో రౌడీ గాడు
షర్టు బటనిప్పాడు… ఓ మై గాడూ, ఓ మై గాడూ





అడ్డంగా బుక్కైపోయా పాట సాహిత్యం

 
చిత్రం: గల్లీ రౌడీ (2021)
సంగీతం: రామ్ మిరియాల
సాహిత్యం: భాస్కరా భట్ల
గానం: సాయిమాధవ్

బట్ రైట్ నౌ… ఐ జస్ట్ వన బి ఫ్రీ
ఐ వన బి ఆల్ ఐ కెన్ బి

అడ్డంగా బుక్కైపోయా
విరిగిన అప్పడమైపోయా
ఘోరంగా ఎలకల నోటికి
దొరికిన పుస్తకమైపోయా
హే, హరహర మహాదేవ దేవా
విడుదల ఇక లేదా లేదా
మలమల మల ఎండల్లోన
పులుసే కారి పోతోందయ్యా

ఏంటో నా రాత రాత
ఈ మలుపున మోత మోత
వీడేమో యముడికి దూత
వదిలేస్తే నేనింటికి పోతా
పులిహోరే పులిహోరే

అడ్డంగా బుక్కైపోయా
విరిగిన అప్పడమైపోయా
ఏ, అచ్చంగా బ్లేడుకి దొరికిన
పెన్సిలు ముక్కను అయిపోయా

ఏ సరదా లేక లేకా… నిదరేమో రాక రాకా
పెడుతున్నా నే పొలికేక
బతికేస్తున్నా రేపటి దాకా
పెంచాలట బాడీ బాడీ
అవ్వాలట రౌడీ రౌడీ
ప్రాణాలే తోడి తోడి
ఆడేస్తున్నరు కబడ్డీ కబడ్డీ
పులిహోరే పులిహోరే
బట్ రైట్ నౌ… ఐ జస్ట్ వన బి ఫ్రీ
ఐ వన బి ఆల్ ఐ కెన్ బి




తల్లడిల్లిపోద పాట సాహిత్యం

 
Song Details

Palli Balakrishna Tuesday, May 18, 2021


చిత్రం: మెహబూబా (2018)
సంగీతం: సందీప్ చౌతా
సాహిత్యం: భాస్కరభట్ల రవికుమార్
గానం: ప్రాగ్యాదాస్ గుప్తా, సందీప్ బాత్రా
నటీనటులు: ఆకాష్ పూరి, నేహా శెట్టి, విషు రెడ్డి
దర్శకత్వం: పూరి జగన్నాథ్
నిర్మాత: పూరి జగన్నాథ్
విడుదల తేది: 11.05.2018

ఓ ప్రియా నా ప్రియా
ఓ ప్రియా నా ప్రియా

మెహబూబా... మెహబూబా...

ఓ ప్రియా నా ప్రియా
ఓ ప్రియా నా ప్రియా

మెహబూబా...

ప్రేమలో పడ్డామనే లోపల
కళ్ళకి కన్నీరెంతో కాపలా
నువ్వు దగ్గరుంటే ఏ యుద్ధమైనా
నిశ్శబ్దం ఇన్నాళ్లుగా
నువ్వు దూరమైతే నిశ్శబ్దమైన
ప్రతిరోజు యుద్ధం కాదా

మెహబూబా... మెహబూబా...

ఓ ప్రియా నా ప్రియా
ఓ ప్రియా నా ప్రియా

లేవులే ఏ గాలికి ఆంక్షలే
నింగికి లేనేలేవు ఎల్లలే
మన మట్టి మీద పగబట్టి
ఎవరు గీశారు సరిహద్దులు
ప్రేమంటే ఎంటో తెలిసుంటే వాళ్ళు
ఈ గీత గీసుండరు

మెహబూబా... మెహబూబా...

ఓ ప్రియా నా ప్రియా
ఓ ప్రియా నా ప్రియా

మెహబూబా... మెహబూబా...


Palli Balakrishna Wednesday, April 18, 2018

Most Recent

Default