-->
Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Nari Nari Naduma Murari"



చిత్రం: నారి నారి నడుమ మురారి (2026)
సంగీతం: విశాల్ చంద్రశేఖర్
నటీనటులు: శర్వానంద్, సాక్షి వైద్య, సంయుక్త మీనన్, శ్రీవిష్ణు (Cameo appearance)
దర్శకత్వం: రామ్ అబ్బరాజు 
నిర్మాతలు: అనీల్ సుంకర, రామబ్రహ్మం సుంకర 
విడుదల తేది: 14.01.2026



Songs List:



దర్శనమే పాట సాహిత్యం

 
చిత్రం: నారి నారి నడుమ మురారి (2026)
సంగీతం: విశాల్ చంద్రశేఖర్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి 
గానం: యాజిన్ నజీర్ 

దర్శనమే మధురక్షణమే
నీవు నేను ఇక మనమే
మనసున మోగే మంగళ నాదస్వరమే

నాదాకా నిన్ను నడిపింది ప్రేమే
నువ్విల జతగా నడిచే
ప్రతి అడుగు పూల వనమే

నీతో పరిచయమే
పరిచయమే ప్రియ వరమే
ఇక నీతో ప్రతి నిమిషం
పరవశమే నాకు

నీతో పరిచయమే
పరిచయమే ప్రియ వరమే
ఇక నీతో ప్రతి నిమిషం
పరవశమే నాకు

నీ పెదాలకు మెరుపైన ఎరుపు నేనే
నీ పాదాలకు సిరి సిరి మువ్వనైన నేనే
నీ నీలి ముంగురుల ఉయ్యాలలూగానే
నీ వేలి ఉంగారమై వెయ్యేళ్లు నావేనే



భల్లే భల్లే పాట సాహిత్యం

 
చిత్రం: నారి నారి నడుమ మురారి (2026)
సంగీతం: విశాల్ చంద్రశేఖర్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి 
గానం: హరిచరణ్ 

అమ్మాయి అచ్చు తెలుగు సాంప్రదాయ సుందరి
సౌభాగ్య లక్ష్మి పోలిక
అబ్బాయి మాటకారి మోహనాంగుడే మరి

తానన్న చోట వేదిక
చూసేటి కళ్లకెంత చూడ ముచ్చట
ముద్దైనా జంట వీరు
ప్రేమన్న ఊహ కూడా లేదు ఇచ్చట
ఉందల్లా స్నేహమేనట

జత గువ్వలై రివ్వ రివ్వున
కొస సాగింది ఇద్దరి పరిచయం

భల్లే భల్లే భల్లే భలే బాగుందిలే
ఈ రెండు మనసుల కూడిక
మాయ చేసిందిలే మంత్రం వేసిందిలే
మలయాజ కేరళ వేదిక

ఒ మాట చాలదా తియ్యగా తియ్యగా
ఏకాంతమే దరి రాదు కదా
మోహాటమేదిలే కాస్త చనువుగా
మనసు మనసును ఆకర్షించగా

ఏ రుచి అభిరుచి ఏమి కలిసెనో
కొబ్బరి గాలుల వాలుగా
ఏమది ఎదురుగా ఏమీ చరినో
సమయాలు వేళలయి సరదాలుగా

భల్లే భల్లే భల్లే భలే బాగుందిలే
ఈ రెండు మనసుల కూడిక
మాయ చేసిందిలే మంత్రం వేసిందిలే
మలయాజ కేరళ వేదిక

గడియారం చూపుకొని కాలక్షేపమే
గడియైన విడిపోనే పోదట
జరిగింది అందమైన ఇంద్రజాలమే
దైవికమైన అనుబంధమేనట

నిన్నలో కలిసిన వారి వెరిక
వారే వీరినారు
ఎవరు ఎవరో పోల్చలేమిక
అంతగా ఒకటైపోయారు

భల్లే భల్లే భల్లే భలే బాగుందిలే
ఈ రెండు మనసుల కూడిక
మాయ చేసిందిలే మంత్రం వేసిందిలే
మలయాజ కేరళ వేదిక

భల్లే భల్లే భల్లే భలే బాగుందిలే
భల్లే భల్లే భల్లే భలే బాగుందిలే
భల్లే భల్లే భల్లే భలే బాగుందిలే
భల్లే భల్లే భల్లే భలే బాగుందిలే




ఆ నారి ఈ నారి పాట సాహిత్యం

 
చిత్రం: నారి నారి నడుమ మురారి (2026)
సంగీతం: విశాల్ చంద్రశేఖర్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి 
గానం: అరవింద్ అన్నేస్ట్ 

ఆ నారి ఈ నారి 




Be Carefull మగరాజులు పాట సాహిత్యం

 
చిత్రం: నారి నారి నడుమ మురారి (2026)
సంగీతం: విశాల్ చంద్రశేఖర్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి 
గానం: రామ్ మిర్యాల 

Be Carefull  మగరాజులు 

Palli Balakrishna Monday, April 6, 2026



చిత్రం: నారీ నారీ నడుమ మురారి (1990)
సంగీతం: కె.వి.మహదేవన్
నటీనటులు: బాలక్రిష్ణ, నిరోషా, శోభన
దర్శకత్వం: ఏ.కోదండ రామిరెడ్డి
నిర్మాత: కె.మురారి
విడుదల తేది: 25.04.1990



Songs List:



ఇరువురు భామల పాట సాహిత్యం

 
చిత్రం: నారీ నారీ నడుమ మురారి (1990)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, పి.సుశీల

ద్వాపరమంతా సవతుల సంతా
జ్ఞాపకముందా గోపాలా
కలియుగమందూ ఇద్దరి ముందూ
శిలవయ్యావే స్త్రీలోల
కాపురాన ఆపదలని ఈదిన శౌరీ
ఏదీ నాకూ చూపవా ఒక దారీ
నారీ నారీ నడుమ మురారీ
నారీ నారీ నడుమ మురారీ

ఇరువురు భామల కౌగిళిలో స్వామి
ఇరుకున పడి నీవు నలిగితివా
ఇరువురు భామల కౌగిళిలో స్వామి
ఇరుకున పడి నీవు నలిగితివా
వలపుల వానల జల్లులలో స్వామీ
తలమునకలుగా తడిసితివా
చిరుబురులాడేటి శ్రీదేవి 
నీ శిరసును వంచిన కథ కన్నా
రుసరుసలాడేటి భూదేవి నీ
పరువును తీసినా కథ విన్నా

గోవిందా... గోవిందా... గోవిందా...
సాగిందా జోడు మధ్యల సంగీతం
బాగుందా భామలిద్దరి భాగోతం

ఇంటిలోన పోరంటే ఇంతింత కాదయా
అన్నాడు ఆ యోగి వేమనా
నా తరమా భవసాగర మీదనూ
అన్నాడు కంచెర్ల గోపన్న
పరమేశా గంగ విడుము పార్వతి చాలున్
ఆ మాటను విని ముంచకు స్వామీ గంగన్
ఇంతులిద్దరైనప్పుడు ఇంతే గతిలే
సవతుల సంగ్రామంలో పతులది వెనకడుగే
ఇంతులిద్దరైనప్పుడు ఇంతే గతిలే
సవతుల సంగ్రామంలో పతులది వెనకడుగే

ఇరువురు భామల కౌగిళిలో స్వామి
ఇరుకున పడి నీవు నలిగితివా

భామ కాలు తాకిందా కృష్ణుడే గోవిందా
అన్నాడు ఆ నందితిమ్మనా
ఒక మాట ఒక బాణము ఒక సీత నాదని
అన్నాడు సాకేత రామన్న
ఎధునాథా భామ విడుము రుక్మిణి చాలున్
రఘునాథా సీతను గొని విడు శూర్పనఖన్
రాసలీలలాడాలని నాకు లేదులే
భయభక్తులు ఉన్న భామ ఒకతే చాలులే
రాసలీలలాడాలని నాకు లేదులే
భయభక్తులు ఉన్న భామ ఒకతే చాలులే

ఇరువురు భామల కౌగిళిలో స్వామి
ఇరుకున పడి నీవు నలిగితివా
వలపుల వానల జల్లులలో స్వామీ
తలమునకలుగా తడిసితివా
గోవిందా... గోవిందా... గోవిందా...





ఏం వానో తడుముతున్నదీ పాట సాహిత్యం

 
చిత్రం: నారీ నారీ నడుమ మురారి (1990)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: సిరివెన్నెల 
గానం: యస్.పి.బాలు, పి.సుశీల

పల్లవి:
ఏం వానో తడుముతున్నదీ
ఇది ఏం గాలో తరుముతున్నదీ
చాటు మాటు దాటి అవీ ఇవీ చూసేస్తోందే

ఏం వానో ఉరుకుతున్నదీ
ఇది ఏం గోలో ఉరుముతున్నదీ
ఆట పాట చూపీ అటూ ఇటూ లాగేస్తోందే

ఏం వానో తడుముతున్నదీ
ఇది ఏం గాలో తరుముతున్నదీ
ఆ...

చరణం: 1
చినుకు పడు క్షణమేదో చిలిపి సడి చేసిందీ
ఉలికిపడి తలపేదో కలల గడి తీసిందీ
వానమ్మా వాటేస్తుంటే మేనంతా మీటేస్తుంటే
ఇన్నాళ్ళూ ఆ..ఆ..
ఓరగ దాగెను వయ్యారం ఓగున పాడెను శృంగారం
ఏ గాలి కొట్టిందొ నీ దారి పట్టింది

ఏం వానో ఉరుకుతున్నదీ
ఇది ఏం గాలో తరుముతున్నదీ
ఆ...

చరణం: 2
మనకు గల వరసేదో తెలిసి ఎద వలచిందో
మునుపు గల ముడి ఏదో బిగిసి జత కలిపిందో
ఏమైందో ఏమోనమ్మా
ఏనాడో రాసుందమ్మా
ఇన్నాళ్ళూ ఆ.. ఆ..
ఉడుకున ఉడికిన బిడియాలు ఒడుపుగ ఒలికెను చెలికాడు
నా చూపు నచ్చిందొ నాజూకు ఇచ్చింది

ఏం వానో తడుముతున్నదీ
ఇది ఏం గాలో తరుముతున్నదీ
చాటు మాటు దాటి అవీ ఇవీ చూసేస్తోందే

ఏం వానో తడుముతున్నదీ
ఇది ఏం గాలో తరుముతున్నదీ
హ్మ్...




మనసులోని మర్మమును తెలుసుకో పాట సాహిత్యం

 
చిత్రం: నారీ నారీ నడుమ మురారి (1990)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: త్యాగరాజ స్వామి 
గానం: యస్.పి.బాలు, పి.సుశీల

మనసులోని మర్మమును తెలుసుకో
నా మనసులోని మర్మమును తెలుసుకో...
మాన రక్షకా మరకతాంగ
మాన రక్షకా మరకతాంగ

నా మనసులోని మర్మమును తెలుసుకో
నా మనసులోని మర్మమును తెలుసుకో...
మదనకీలగ మరిగిపోక
మదనకీలగ మరిగిపోక
నా మనసులోని మర్మమును తెలుసుకో

ఇనకులాబ్ద నీవే గాని వేరెవరూ లేరు 
దిక్కెవరూ లేరు ఆనంద హృదయా
మనసులోని మర్మమును తెలుసుకో
అనువుగాని ఏకాంతాన ఏ కాంతకైనా
ఆకాంక్ష తగున రాకేందు వదనా
మనసులోని మర్మమును తెలుసుకో

మునుపు ప్రేమ గల దొరవై 
సదా తనువు నేలినది గొప్ప కాదయా...
మదని ప్రేమకథ మొదలై 
ఇలా అదుపు దాటినది ఆదుకోవయా...

కనికరమ్ముతో ఈవేళ - ఊ ఊ ఊ
కనికరమ్ముతో ఈవేళ నా కరముబట్టు - హా
త్యాగరాజ వినుతా

మనసులోని మర్మమును తెలుసుకో
నా మనసులోని మర్మమును తెలుసుకో

మరుల వెల్లువల వడినై
ఇలా దరులు  దాటితిని నిన్ను చేరగా...
మసక వెన్నెలలు ఎదురై
ఇలా తెగువ కూడదని మందలించవా

కలత ఎందుకిక ఈ వేళ.. ఆ ఆ ఆ
కలవరమ్ముతో ఈవేళ నా కరము వణికే - ఆ ఆ
ఆగడాల వనితా...

మనసులోని మర్మమును తెలుసుకో
మదనకీలగ మరిగిపోక
మాన రక్షకా మరకతాంగ
నా మనసులోని మర్మమును తెలుసుకో





వయసు సొగసు పాట సాహిత్యం

 
చిత్రం: నారీ నారీ నడుమ మురారి (1990)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: సిరివెన్నెల 
గానం: యస్.పి.బాలు, పి.సుశీల

వయసు సొగసు 



పెళ్ళంటూనే వేడెక్కిందే గాలీ పాట సాహిత్యం

 
చిత్రం: నారీ నారీ నడుమ మురారి (1990)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: సిరివెన్నెల 
గానం: యస్.పి.బాలు, పి.సుశీల

పెళ్ళంటూనే వేడెక్కిందే గా...లీ
మళ్ళీ వింటే ఏమౌతుందో చూడాలీ
పెళ్ళంటూనే వేడెక్కిందే గా...లీ
మళ్ళీ వింటే ఏమౌతుందో చూడాలీ

ఏదీ ఆ మాటే చెప్పు ఇంకోసారి
ఏదీ ఆ మాటే చెప్పు ఇంకోసారి
ముంచుకొస్తోంది ముహూర్తాల వేళా..
కంచె దాటింది ఆత్రాల గోలా...

పెళ్ళంటూనే వేడెక్కిందే గాలీ
మళ్ళీ వింటే ఏమౌతుందో చూడాలీ
ఆ... ఏదీ ఆ మాటే చెప్పు ఇంకోసారి
మ్మ్... ఏదీ ఆ మాటే చెప్పు ఇంకోసారి

చరణం: 1
తరిమే తరుణంతో పరువం తడబడుతోంది
కులికే చెలితాపం కుదురుగ నిలబడనంది
తరిమే తరుణంతో పరువం తడబడుతోంది
కులికే చెలితాపం కుదురుగ నిలబడనంది

మనసే నీకోసం... ఏటికి ఎదురీదింది
మురిపెం తీరందే... నిదురను వెలివేస్తుంది
చెలరేగే చెలి వేగం ఉక్కిరి బిక్కిరి చేస్తోంది
ఆ... ముడులేసే మనువైతే మక్కువ మత్తుగ దిగుతుంది

ఆ... ఏదీ ఆ మాటే చెప్పు ఇంకోసారి
ఆ... ఏదీ ఆ మాటే చెప్పు ఇంకోసారి

ముంచుకొస్తోంది ముహూర్తాల వేళా..
కంచె దాటింది ఆత్రాల గోలా...

పెళ్ళంటూనే వేడెక్కిందే గాలీ
మళ్ళీ వింటే ఏమౌతుందో చూడాలీ
ఆ... ఏదీ ఆ మాటే చెప్పు ఇంకోసారి
ఆ... ఏదీ ఆ మాటే చెప్పు ఇంకోసారి

చరణం: 2
సాయం రమ్మంటూ ప్రాయం కబురంపింది
బిగిసే బంధంలో బందీ కమ్మంటోంది
సాయం రమ్మంటూ ప్రాయం కబురంపింది
బిగిసే బంధంలో బందీ కమ్మంటోంది

వీచే ప్రతిగాలీ... వయసును వేధిస్తోంది
జతగా నువ్వుంటే... పైటకు పరువుంటుంది
మితిమీరె మొగమాటం అల్లరి అల్లిక అడిగింది
ఆ... మదిలోని మమకారం మల్లెల పల్లకి తెమ్మంది

ఆ.....

ముంచుకొస్తోంది ముహూర్తాల వేళా..
కంచె దాటింది ఆత్రాల గోలా...
పెళ్ళంటూనే వేడెక్కిందే గా...లీ
మళ్ళీ వింటే ఏమౌతుందో చూడాలీ
ఆ... ఏదీ ఆ మాటే చెప్పు ఇంకోసారి
ఆ... ఏదీ ఆ మాటే చెప్పు ఇంకోసారి




దుత్తలాగున్నావే పాట సాహిత్యం

 
చిత్రం: నారీ నారీ నడుమ మురారి (1990)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు

దుత్తలాగున్నావే


Palli Balakrishna Monday, July 24, 2017

Most Recent

Default