-->
Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Kathir"



చిత్రం: హృదయం (1991)
సంగీతం: ఇళయరాజా
నటీనటులు: మురళి, హీరా రాజగోపాల్
దర్శకత్వం: కథిర్
నిర్మాత: ఆర్.బాలకృష్ణన్
విడుదల తేది: 06.09.1991



Songs List:



ఏప్రిల్ మేలలో పాట సాహిత్యం

 
చిత్రం: హృదయం (1991)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: రాజశ్రీ
గానం: యస్.పి. బాలు

ఏప్రిల్ మేలలో పాపల్లేరురా కాంతి లేదురా 
ఈ ఉరు మోడురా వట్టి బీడురా బోరు బోరు రా 
ఇక చాలయా అరె పోవయా 
జూన్ జూలైలో ముద్దబంతులే విరిసెను విరిసెను 
తేనె జల్లులే కురిసెను కురిసెను పాలపొంగులే తెలిసెను తెలిసెను 
కన్నె చిలకలన్ని మనకు విందులు రా.. 

చరణం: 1 
కుర్తా మాక్సీల సల్వార్ కమీజుల ఆడపిల్లలే 
ఎక్కడ ఎక్కడని ఎదురు చూసెనే లేత కన్నులే 
పోలిస్ కాన్స్టెబుల్ కన్నె వగలకే గుటకలేసెనే 
పొలం గట్టున దిష్టిబొమ్మలా బిగిసిపోయెనే 
డ్రైవింగ్ హోటల్స్ ఈ ఊరి బీచ్ డల్ అయిపోయే చూడండి 
మల్లెపూవులే మాకే లేవని కలత పడితిమి మేమే 
ఇది న్యాయమా ఇంత ఘోరమా వెత తీరునా 

చరణం: 2 
కాలేజ్ చిలకలు కాన్వెంట్ కులుకులు సినిమాకెళ్ళితే 
టాక్సీ డ్రైవరు చొంగ కార్చుతూ మీటరేసెనే 
చిలిపి వేడుక చూచు వారిలో బులుపు రేపెనే 
కన్నె పిల్లలే రోడ్డు దాటుతూ వెక్కిరించిరే 
స్టెల్లా మేరీస్ క్వీన్ మేరీస్ రంగు రంగుల పూలవనం 
వొంపు సొంపులు కులికే వేళ ఎదను పొంగె ఆనందం 

ఇక పాటలే ఈ పూటలే భలే జోరులే... 





ఊసులాడే ఒక జాబిలట పాట సాహిత్యం

 
చిత్రం: హృదయం (1991)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: రాజశ్రీ
గానం: యస్.పి.బాలు

ఊసులాడే ఒక జాబిలట
సిరిమువ్వలుగా నను తాకెనట

ఊసులాడే ఒక జాబిలట
సిరిమువ్వలుగా నను తాకెనట
చూపులతో బాణమేసెనట
చెలి నా ఎదలో సెగ రేపెనట
మాటే వేదం తానే నా లోకం
ప్రేమే యోగం 

ఊసులాడే ఒక జాబిలట
సిరిమువ్వలుగా నను తాకెనట
చూపులతో బాణమేసెనట
చెలి నా ఎదలో సెగ రేపెనట

అందాలే చిందే చెలి రూపం నా కోసం
ఆనందం నిలిపేటి ధ్యానం చెలి ధ్యానం
అదే పేరు నేను జపించేను రోజు
ననే చూసే వేళ అలై పొంగుతాను
మౌనం సగమై మోహం సగమై
నేనే నాలో రగిలేను

ఊసులాడే ఒక జాబిలట
సిరిమువ్వలుగా నను తాకెనట
చూపులతో బాణమేసెనట
చెలి నా ఎదలో సెగ రేపెనట
మాటే వేదం తానే నా లోకం
ప్రేమే యోగం 

ఊసులాడే ఒక జాబిలట
సిరిమువ్వలుగా నను తాకెనట
చూపులతో బాణమేసెనట
చెలి నా ఎదలో సెగ రేపెనట

చరణం: 2
నాలో నువ్వు రేగే నీ పాట చెలి పాట
నీడల్లె సాగే నీ వెంట తన వెంట
స్వరాలై పొంగేనా వరాలే కోరేనా
ఇలా ఊహల్లోన సదా ఉండిపోనా
ఒకటై ఆడు ఒకటై పాడు పండగ నాకు ఏనాడో

ఊసులాడే ఒక జాబిలట
సిరిమువ్వలుగా నను తాకెనట
చూపులతో బాణమేసెనట
చెలి నా ఎదలో సెగ రేపెనట
మాటే వేదం తానే నా లోకం
ప్రేమే యోగం 

ఊసులాడే ఒక జాబిలట
సిరిమువ్వలుగా నను తాకెనట
చూపులతో బాణమేసెనట
చెలి నా ఎదలో సెగ రేపెనట




హృదయమా హృదయమా పాట సాహిత్యం

 
చిత్రం: హృదయం (1991)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: రాజశ్రీ
గానం: యస్.పి.బాలు, చిత్ర

హృదయమా హృదయమా నీ మౌనమెంత వేదన 
హృదయమా హృదయమా నీ విరహమెంత యాతన 
చందమామ లేని నింగి నేనులే 
తోడు లేని మోడునైతి నేడులే 

చరణం: 1 
మంచల్లె కరిగి నదిలాగ మారి 
నీ నీడగా సాగినానే 
నీ ధ్యాస నేనై ఈ లోకాన్ని మరిచి 
ఊహల్లో ఊరేగి విహరించానే 
నీ కంటి పిలుపే నా ప్రేమ లోకం(2) 
పుండు పగిలెనే ఎద శోకమాయెనే 
నీవు లేని బ్రతుకు నాకు ఏలనే... 

చరణం: 2 
నా జీవ రాగం చిరుగాలి నీకు 
ఈ వేళ వినిపించలేదా 
చెలి లేని బ్రతుకే శృతి లేని గీతం 
ఇక ఎందుకో నాకు ఈ నా జన్మ 
రగిలేటి సెగలే ఎదలోన మోసా(2) 
చెలిమి నేరమా నా ప్రేమ నేరమా 
నీవు లేని బ్రతుకు నాకు ఏలనే..




ఓ పిల్ల జాజి మల్లి రా  పాట సాహిత్యం

 
చిత్రం: హృదయం (1991)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: రాజశ్రీ
గానం: యస్.పి.బాలు

ఓ పిల్ల జాజి మల్లి రా 
ఓ బ్యూటీ అంటే బ్యూటీ రా 
వన్నెలు చిలికించి మగవాళ్ళను కవ్వించి 
మనసులు తేలించి మురిపించావులే నీకే జోహారే 

చరణం: 1 
లేటైనా వేచుంటే బస్సు దొరుకు 
ఒక కేడీ ప్రేమిస్తే కిస్ దొరకు 
ఆడవాళ్లే చిన్న చూపు బుస్సులకే 
చేదోడు మేముంటాం మిస్సులకే 
వెంటపడి మేమొస్తేనే మీకు రక్షణే 
చల్లని చూపు పడిందా మాకు మోక్షమే 
కలిసొస్తే అనురాగం కాదంటే అది శోకం 
నిన్ను యవ్వనమే పిలిచేనే వెన్నెలమ్మా రావే 

చరణం: 2 
పిల్లలనే నువ్వు కంటే పండుగలే 
పుస్తకాలు నువ్వు మోస్తే పాపములే 
పడక గది పాఠాలకు మేము రెడీ 
ఓ చిలకా నా మనసే నీకు బడి 
చెలిమి అందచందాలే దాచిపెట్టొద్దే 
నాలో ఆశ రేగించి రెచ్చగొట్టొద్దే 
మందారం మీ సొగసే 
పాశాణం మీ మనసే 
నును మీసమున్న మగవాళ్ళం 

నిను కొలిచాం రావే 



పూలతలే పూచెనమ్మా పాట సాహిత్యం

 
చిత్రం: హృదయం (1991)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: రాజశ్రీ
గానం: యస్.పి.బాలు

పూలతలే పూచెనమ్మా..తుమ్మెదలే పాడెనమ్మా
చెలరేగే గాలులకే..చిన్నారీ ఆ పూవులివే..రాలినవే 

నిను కన్నతల్లైన నువు కోరకుండా..
పీఠేసి బ్రతిమాలి వడ్డించదంట
నీ ఇంటిలో ఉన్న నీ అద్దమైనా
నీవెదుట నిలవందె నిను చూపదంటా
మనసున భావాలు ఎన్నెన్ని ఉన్నా
పెదవులు తెరవందే చేరవు బంధాలు
పిరికోళ్ళ ప్రేమలన్నీ మూగోళ్ళ పాటలులే
ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ

పూలతలే పూచెనమ్మా..తుమ్మెదలే పాడెనమ్మా
చెలరేగే గాలులకే..చిన్నారీ ఆ పూవులివే..రాలినవే 
పూలతలే పూచెనమ్మా..తుమ్మెదలే పాడెనమ్మా

ఎదలోన ఆశున్న నీకేది లాభం
అది నీటిపై రాత నీ బ్రతుకు శాపం
మది దాటిరాలేని నీలోని భావం
వర్షాలు ఈలేని ఆకాశ మేఘం

తెలిపేటి ధైర్యం కొందరికి రాదూ
ధైర్యం లేదంటె అనుకున్నది కాదూ
వెలిరాని ఆశలన్నీ మీటని వీణియలే

ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ
పూలతలే పూచెనమ్మా..తుమ్మెదలే పాడెనమ్మా
చెలరేగే గాలులకే..చిన్నారీ ఆ పూవులివే..రాలినవే 
పూలతలే పూచెనమ్మా..తుమ్మెదలే పాడెనమ్మా

Palli Balakrishna Tuesday, August 22, 2017
Premikula Roju (1999) Telugu Songs Lyrics Album Cover

Premikula Roju (1999) Telugu Songs Lyrics

MOVIE DETAILS
Movie : Premikula Roju (1999)
Music : A. R. Rahman
Director : Kathir
Producer : A. M. Rathnam
Actors : Kunal
Actresses : Sonali Bendre
Supporting Cast : Rambha
Release Date : 9 July 1999

Dhaandiya Song Lyrics in Telugu – Premikula Roju (1999)

'Dhaandiya' song from Premikula Roju (1999) movie is composed by A. R. Rahman and sung by M. G. Sreekumar, Unni Menon and Kavita Krishnamurthy.

SONG INFORMATION
Movie : Premikula Roju (1999)
Music : A. R. Rahman
చిత్రం: ప్రేమికుల రోజు (1999) సంగీతం: ఏ.ఆర్.రెహ్మాన్ సాహిత్యం: ఏ.ఎం.రత్నం, శివగణేష్ గానం: ఉన్ని మీనన్, శ్రీకుమార్, కవితా కృష్ణమూర్తి దాండియా ఆటలు ఆడ సరదా పాటలు పాడ  గుజరాత్ పడుచులు ఆడ ప్రియుడే చెలికై చూడ  చెలి కనిపించేనా కనుచాటుగ నాకు  తన ప్రేమ చెప్పేనా ఈనాడు  చెలి కనిపించేనా కనుచాటుగ నాకు  తన ప్రేమ చెప్పేనా ఈనాడు  తన జాడేమిటో తెలియలేక నాకు  గుండెల్లో గుబులు పుట్టేనా  తన జాడేమిటో తెలియలేక నాకు  గుండెల్లో గుబులు పుట్టేనా  దాండియా ఆటలు ఆడ సరదా పాటలు పాడ  గుజరాత్ పడుచులు ఆడ ప్రియుడే చెలికై చూడ  నిన్ను చూసి నన్ను నేను మరిచి  చెప్పలేదు మూగబోయి నిలిచి  మనసులోన దాగివున్న ఆ మాట తెలిసిందా  నిన్ను చూసి నాలో నేను మురిసి  అసలు మాట చెప్పకుండా దాచి  కళ్లతోటి సైగచేసి చెప్పాలే తెలిసిందా  ఓ..కాటుకల్లే నేను కనుల చేరుకుంటా  కాటుకల్లే నేను కనుల చేరుకుంటా  పూలవోలే విరిసీ నేను కురులనల్లుకుంటా  ఓ..కళ్లలోన కాటుక కరిగిపోవునంట  కురులలోన పువ్వులన్నీ వాడెపోవునంట  నీ ప్రేమ హృదయమే పొందేనా  తాళిబొట్టు నీకు నే కట్టేనా  ఈ మాట మాత్రమే నిజమైతే నా జన్మే ధన్యం  నా ప్రేమ - నీవేలే, నా ప్రేమ - నీవేలే... దాండియా ఆటలు ఆడ సరదా పాటలు పాడ గుజరాత్ పడుచులు ఆడ ప్రియుడే చెలికై చూడ  చెలి కనిపించేనా కనుచాటుగ నాకు తన ప్రేమ చెప్పేనా ఈనాడు చెలి కనిపించేనా కనుచాటుగ నాకు తన ప్రేమ చెప్పేనా ఈనాడు తన జాడేమిటో తెలియలేక నాకు గుండెల్లో గుబులు పుట్టేనా తన జాడేమిటో తెలియలేక నాకు గుండెల్లో గుబులు పుట్టేనా ప్రేమ చూపులో ఉంది మహత్వం ప్రేమ భాషలో ఉంది కవిత్వం  ప్రేమించుటలో ఉన్నది దైవత్వం దైవత్వం  ప్రేమ సృష్టికే మూలపురుషుడు  ప్రేమ జీవులకు పూజనీయుడు  ప్రేమలేనిదే ఏమౌనో ఈ లోకం భూలోకం  ఓ.. ఓ.. ఓ..నా మనససు నీలో దాచి ఉంచినాను  ఆ మనససు క్షేమేనా తెలుసుకొనుట వచ్చాను  ఓ..నీ మనసు పదిలంగా దాచి ఉంచినాను  నాకంటే నీ మనసే నా పంచప్రాణాలు  హృదయాలు రెండని అనలేవు ఇది నీదినాదని కనలేవు  ఈ మాటమత్రమే నిజమైతే నా జన్మే ధన్యం నా ప్రేమ - నీవేలే, నా ప్రేమ - నీవేలే  యువతీ యువకుల కలయిక కోసం  వచ్చెను నేడొక రాతిరి దాండియ అను ఒక రాతిరి  యువతీ యువకుల కలయిక కోసం  వచ్చెను నేడొక రాతిరి దాండియ అను ఒక రాతిరి  మీకు తోడు మేముంటాము నేస్తమా  జంకులేక ప్రేమించండి నేస్తమా  మీ వలన భువిలో ప్రేమలు వర్ధిల్లాలి..  మీ వలన భువిలో ప్రేమలు వర్ధిల్లాలి.. మీ వలన భువిలో ప్రేమలు వర్ధిల్లాలి.. మీ వలన భువిలో ప్రేమలు వర్ధిల్లాలి.. మీ వలన భువిలో ప్రేమలు వర్ధిల్లాలి.. మీ వలన భువిలో ప్రేమలు వర్ధిల్లాలి..

Vaalu Kannuladaana Song Lyrics in Telugu – Premikula Roju (1999)

'Vaalu Kannuladaana' song from Premikula Roju (1999) movie is composed by A. R. Rahman and sung by Unni Menon.

SONG INFORMATION
Movie : Premikula Roju (1999)
Music : A. R. Rahman
Singers : Unni Menon
చిత్రం: ప్రేమికుల రోజు (1999) సంగీతం: ఏ.ఆర్.రెహ్మాన్ సాహిత్యం: ఏ. ఎమ్.రత్నం, శివగణేష్ గానం: ఉన్నిమీనన్ వాలు కనులదానా… వాలు కనులదానా నీ విలువ చెప్పు మైనా నా ప్రాణమిచ్చుకోన నీ రూపు చూసి శిలను అయితినే ఓ నోట మాట రాక మూగబోతినే ఒక మాట రాక మూగబోతినే వాలు కనులదానా నీ విలువ చెప్పు మైనా నా ప్రాణమిచ్చుకోన నీ రూపు చూసి శిలను అయితినే ఓ మాట రాక ఒక మాట రాక మూగబోతినే ఒక మాట రాక మూగబోతినే చెలియా నిన్నే తలచి కనులా జడిలో తడిసి రేయి నాకు కనుల కునుకు లేకుండ పోయింది నీ ధ్యాసే అయ్యింది తలపు మరిగి రేయి పెరిగి ఒళ్ళంతా పొంగింది ఆహారం వద్దంది క్షణక్షణం నీ తలపుతో తనువు చిక్కి పోయెలే ప్రాణమిచ్చే ఓ ప్రణయమా నీకు సాటి ఏది ప్రియతమా నీ కీర్తి లోకాలు పలుక ఎల్లోరా శిల్పాలు ఉలుక అజంతా సిగ్గులు ఒలక చిలకా.. నీ కీర్తి లోకాలు పలుక ఎల్లోరా శిల్పాలు ఉలుక అజంతా సిగ్గులు ఒలికే రోజే నిను నేను చేరుకోనా వాలు కనులదానా నీ విలువ చెప్పు మైనా నా ప్రాణమిచ్చుకోన నీ రూపు చూసి శిలను అయితినే ఓ నోట మాట రాక.. నోట మాట రాక మూగబోతినే దైవం నిన్నే మలచి తనలో తానే మురిసి ఒంపు సొంపు తీర్చు నేర్పు నీ సొంతమయ్యింది నా కంట నిలిచింది ఘడియ ఘడియ ఒడిని కరగు రసవీణ నీ మేను మీటాలి నా మేను వడి వడిగా చేరుకో కౌగిలిలో కరిగిపో తనువు మాత్రమిక్కడున్నది నిన్ను ప్రాణమివ్వమన్నది జక్కన కాలం నాటి చెక్కిన శిల్పం ఒకటి కన్నెగా వచ్చిందంటా చెలియా.. జక్కన కాలం నాటి చెక్కిన శిల్పం ఒకటి కన్నెగా వచ్చిందంటా చెలియా.. నీ సొగసుకేది సాటి వాలు కనులదానా… వాలు కనులదానా నీ విలువ చెప్పు మైనా నా ప్రాణమిచ్చుకోన నీ రూపు చూసి శిలను అయితినే ఓ నోట మాట రాక మూగబోతినే ఒక మాట రాక మూగబోతినే

Prema Ane Song Lyrics in Telugu – Premikula Roju (1999)

'Prema Ane' song from Premikula Roju (1999) movie is composed by A. R. Rahman and sung by S. P. Balasubrahmanyam and Swarnalatha.

SONG INFORMATION
Movie : Premikula Roju (1999)
Music : A. R. Rahman
చిత్రం: ప్రేమికుల రోజు (1999) సంగీతం: ఏ.ఆర్.రెహమాన్ సాహిత్యం: ఏ. ఎమ్. రత్నం, శివ గణేష్ గానం: ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం , స్వర్ణలత ప్రేమ అనే పరీక్ష రాసి వేచి ఉన్న విద్యార్ధిని ప్రేమ అనే పరీక్ష రాసి వేచి ఉన్న విద్యార్ధిని ప్రేమ అనే పరీక్ష రాసి వేచి ఉన్న విద్యార్ధిని ప్రేమ అనే పరీక్ష రాసి వేచి ఉన్న విద్యార్ధిని నీ మనసు పలకపైన నా సంఖ్య చూసినపుడు నేనే నన్ను నమ్మలేదు నా కనుల నమ్మలేదు నమ్ము నమ్మూ నన్ను నమ్ము ప్రియుడా నాలో ప్రేమ ఎపుడూ నీకే సొంతం డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ ఆ... ఈ చేతికి గాజులు నేనే కదా నేడు గాజులు తోడిగే రోజే కదా ఈ చేతికి గాజులు నేనే కదా నేడు గాజులు తోడిగే రోజే కదా ఆ గాజులు తొడగగ సుఖముందిలే ఆ సుఖమే మళ్ళీ మళ్ళీ మది కోరిందిలే ఇవి చెక్కిళ్ళా పూల పరవళ్ళా ఈ చెక్కిలిపై నీ ఆనవాళ్ళా అహ నిన్నటి దాకా నేనొక హల్లుని నువ్వొచ్చాక అక్షరమైతిని ప్రేమ అనే పరీక్ష రాసి వేచి ఉన్న విద్యార్ధిని ప్రేమ అనే పరీక్ష రాసి వేచి ఉన్న విద్యార్ధిని డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ నీ ఒడిలో దొరికెను సుఖం సుఖం ఆ సుఖమున కందెను ముఖం ముఖం మనసిందుకు చేసెను తపం తపం ఆనందమే ఇక నేనేమై పోయినా అలుపెరుగదులే ఏ ప్రేమలోనా అల లాగవులే నీలి సంద్రానా ఇది జన్మ జన్మలకు వీడని బంధం విరహానికైనా దొరకని బంధం ప్రేమ అనే పరీక్ష రాసి వేచి ఉన్న విద్యార్ధిని ప్రేమ అనే పరీక్ష రాసి వేచి ఉన్న విద్యార్ధిని డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ ప్రేమ అనే పరీక్ష రాసి వేచి ఉన్న విద్యార్ధిని ప్రేమ అనే పరీక్ష రాసి వేచి ఉన్న విద్యార్ధిని డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ

Manasu Padi Song Lyrics in Telugu – Premikula Roju (1999)

'Manasu Padi' song from Premikula Roju (1999) movie is composed by A. R. Rahman and sung by Srinivas and M. G. Sreekumar.

SONG INFORMATION
Movie : Premikula Roju (1999)
Music : A. R. Rahman
చిత్రం: ప్రేమికుల రోజు (1999) సంగీతం: ఏ.ఆర్.రెహ్మాన్ సాహిత్యం: ఏ. ఎమ్. రత్నం, శివగణేష్ గానం: శ్రీనివాస్, ఎం. జి. శ్రీకుమార్ మనసుపడి మనసుపడి మన్మథుడు మనసుపడి  మనసుపడి మనసుపడి మన్మథుడు మనసుపడి  నీ కోసం పుట్టాడే వరుడుగా వచ్చాడే  నీ కోసం పుట్టాడే వరుడుగా వచ్చాడే  మనసుపడి మనసుపడి మరుమల్లె మనసుపడి  నీ కోసం పుట్టెనులే వధువుగా నిలిచెనులే  నీ కోసం పుట్టెనులే వధువుగా నిలిచెనులే  నా గుండెలే ఆటస్థలముగా ఎగిరెగిరి ఆటలు ఆడిన చిన్నారివి నీవే తల్లి  కళ్యాణవేళ ముస్తాబయ్యి పెళ్ళికొడుకుతో ముచ్చటలాడి  ఆనందమే జీవితమంటూ సాగు  గోరింటతో ముగ్గులు పెట్టీ మణికట్టుకు గాజులు తొడిగి  ఈ రోజా చేతికి రోజా పువ్వందించూ  గోరింటతో ముగ్గులు పెట్టీ మణికట్టుకు గాజులు తొడిగి  ఈ రోజా చేతికి రోజా పువ్వందించూ  నీ వరుడు రేపు వేంచేస్తాడు  తన ప్రేమ నీకు పంచిస్తాడు  నీ పెళ్ళి వేదికను నే వెయ్య  ఆ వరుడు చేయి నీ కందియ్య  నీ తండ్రి మది ఉయ్యాలలు ఊగా  ఆ... మనసులోని ప్రేమ నీకు చెప్పలేదు  చెప్పబోవునంతలోనా పెదవి మెదలలేదు  మనసులోని ప్రేమ నీకు చెప్పలేదు  చెప్పబోవునంతలోనా పెదవి మెదలలేదు  ఆదుకున్న దైవం ఆశ తీర్చ నేను  ఆశీస్సులు అందిస్తున్నా కంటనీరుతోను  నా కనులనిండుగా నీరూపం నిను తలుచుకొనడమే నా ధ్యేయం  నా కనులనిండుగా నీరూపం నిను తలుచుకొనడమే నా ధ్యేయం  నీ ఆనందమే నా సంతోషం నా ప్రేమే ధన్యం  కలకాలం వర్ధిల్లు వర్ధిల్లు కలకాలం.... మనసుపడి మనసుపడి మన్మథుడు మనసుపడి నీ కోసం పుట్టాడే వరుడుగా వచ్చాడే నీ కోసం పుట్టాడే వరుడుగా వచ్చాడే మనసుపడి మనసుపడి మరుమల్లె మనసుపడి నీ కోసం పుట్టెనులే వధువుగా నిలిచెనులే నీ కోసం పుట్టెనులే వధువుగా నిలిచెనులే కలువ కళ్ళకేమో కాటుకను తీర్చి  కారుమబ్బు కురులలోన మొగలిపూలు పేర్చి  కలువ కళ్ళకేమో కాటుకను తీర్చి  కారుమబ్బు కురులలోన మొగలిపూలు పేర్చి  విలువ కట్టలేని మణులు ఎన్నో దాల్చి  హంసలాగ వేదిక కొచ్చె చంద్రబింబ వదనం  మేలతాళం మ్రోగగా వధువునకు  తాళిబొట్టు కట్టేలే పెళ్ళికొడుకు  మేలతాళం మ్రోగగా వధువునకు  తాళిబొట్టు కట్టేలే పెళ్ళికొడుకు  ఈ పేద హృదయమే దీవించ పూలజల్లే కురియూ వర్ధిల్లు కలకాలం....  మనసుపడి మనసుపడి మన్మథుడు మనసుపడి నీ కోసం పుట్టాడే వరుడుగా వచ్చాడే నీ కోసం పుట్టాడే వరుడుగా వచ్చాడే మనసుపడి మనసుపడి మరుమల్లె మనసుపడి నీ కోసం పుట్టెనులే వధువుగా నిలిచెనులే నీ కోసం పుట్టెనులే వధువుగా నిలిచెనులే గోరింటతో ముగ్గులు పెట్టీ మణికట్టుకు గాజులు తొడిగి ఈ రోజా చేతికి రోజా పువ్వందించూ గోరింటతో ముగ్గులు పెట్టీ మణికట్టుకు గాజులు తొడిగి ఈ రోజా చేతికి రోజా పువ్వందించూ

Oh Mariya Song Lyrics in Telugu – Premikula Roju (1999)

'Oh Mariya' song from Premikula Roju (1999) movie is composed by A. R. Rahman and sung by Devan Ekambaram, Yugendran and Febi Mani.

SONG INFORMATION
Movie : Premikula Roju (1999)
Music : A. R. Rahman
చిత్రం: ప్రేమికుల రోజు (1999) సంగీతం: ఏ.ఆర్.రెహ్మాన్ సాహిత్యం: ఏ. ఎమ్. రత్నం, శివగణేష్ గానం: దేవన్ ఏకాంబరం, యుగేంద్రన్, ఫెబి ఓ మరియా ఓ మరియా ఓ మరియా ఓ మరియా  ఫ్రూట్ చెలియా నా దునియా ఈ మెయిల్ లవ్ లెటర్ నీ దయా  లా లల లా లల లా లల లా లల లా  ఓ మరియా ఓ మరియా ఓ మరియా ఓ మరియా  ఫ్రూట్ చెలియా నా దునియా  ఈ మెయిల్ లవ్ లెటర్ నీ దయా  సాగరానికీ... ఫిషింగ్ నెట్ ప్రేమించడానికీ... ఇంటర్నెట్ దేశం నుంచి దేశం వీచే ప్రేమా వల  లా లల లా లల లా లల లా లల లా  మౌనమనే ఒక తాళం చెవితో మనసును మూయొద్దు  ప్రేమను జీవిత ఖైదిని చేసీ జైలులో ఉంచొద్దు  హృదయాన్నే చలించీ పరిగెట్టిరా మనకుంది నెట్ కేఫ్ వేగంగానురా  కంప్యూటర్ తో ప్రేమించే కాలం ఇది  ప్రేమ విత్తులే గాలిలో చల్లి ప్రేమామయం చెయ్యాలి భూమి  ఓ మరియా ఓ మరియా............ ఓ మరియా ఓ మరియా ఓ మరియా ఓ మరియా ఫ్రూట్ చెలియా నా దునియా ఈ మెయిల్ లవ్ లెటర్ నీ దయా  సాగరానికీ... ఫిషింగ్ నెట్ ప్రేమించడానికీ... ఇంటర్నెట్ దేశం నుంచి దేశం వీచే ప్రేమా వల అందాలన్నీ పట్టిక వేసి చూపును ఇంటర్నెట్  మనసును మీటి మౌసును తడితే దొరుకును జూలియెట్  ఏ రెక్కలు లేకుండా ఎగిరెళ్ళుదాం  ఈ లోకాన్ని మైమరచి అట్లాడుదాం  ఏ రెక్కలు లేకుండా ఎగిరెళ్ళుదాం  ఈ లోకాన్ని మైమరచి అట్లాడుదాం ఓ మరియా ఓ మరియా ఓ మరియా ఓ మరియా ఫ్రూట్ చెలియా నా దునియా ఈ మెయిల్ లవ్ లెటర్ నీ దయా  సాగరానికీ... ఫిషింగ్ నెట్ ప్రేమించడానికీ... ఇంటర్నెట్ దేశం నుంచి దేశం వీచే ప్రేమా వల  ఓ మరియా ఓ మరియా ఓ మరియా ఓ మరియా  ఓ మరియా ఓ మరియా ఓ మరియా ఓ మరియా  మరియా మరియా మరియా మరియా మరియా మరియా మరియా మరియా మరియా మరియా మరియా మరియా మరియా మరియా మరియా మరియా

Roja Roja Song Lyrics in Telugu – Premikula Roju (1999)

'Roja Roja' song from Premikula Roju (1999) movie is composed by A. R. Rahman and sung by Unnikrishnan.

SONG INFORMATION
Movie : Premikula Roju (1999)
Music : A. R. Rahman
Singers : Unnikrishnan
చిత్రం: ప్రేమికుల రోజు (1999) సంగీతం: ఏ.ఆర్.రెహమాన్ సాహిత్యం: ఏ. ఎమ్. రత్నం, శివ గణేష్ గానం: ఉన్ని కృష్ణన్ రోజా... రోజా... రోజా రోజా... రోజా రోజా... రోజా రోజా... రోజా రోజా... రోజా రోజా... రోజా రోజా... రోజా రోజా... రోజా రోజా... నిన్ను చూసి నన్ను నేను మరిచిపోయి తిరిగి వచ్చా నిను గాలి సోకగా వదలనులే నెలవంక తాకగా వదలనులే ఆ బ్రహ్మ చూసినా ఓర్వనులే నే ఓర్వనులే నే ఓర్వనులే రోజా... రోజా... రోజా... రోజా... కన్నులలో... కొలువున్నావులే... రాతిరిలో... కనులకు కునుకే లేదులే... వలువగ నన్నూ చుట్టుకోగా నీ సన్నని నడుముకు కలుగును గిలిగిలి నా రోజా నీ పేరు నానోట నే చెప్పగా నా ఇంట రోజాలు పూచేనులే నీ జాడ ఒకరోజు లేకున్నచో నీ చెలియ ఏదంటూ అడిగేనులే నీ రాకే మరుక్షణం తెలుపును మేఘమే వానలో నువు తడవగా నా కొచ్చునే జ్వరం ఎండలో నువు నడవగా నాకు పట్టే స్వేదం తనువులే రెండు హృదయమే ఒకటి రోజా రోజా రోజా రోజా రోజా... రోజా రోజా... రోజా రోజా... రోజా రోజా... నిన్ను చూసి నన్ను నేను మరిచిపోయి తిరిగి వచ్చా నవ యువతీ... నడుమొక గ్రంధము చదివేనా పలుచని రాత్రలు మంచులో దూరాలేలా జవరాలా బిడియాన్ని ఒకపరి విడిచిన మరి తప్పేముంది నన్నే నువ్వు తాకొద్దని గగనాన్ని ఆపేనా ఆ సాగరం నన్నే ముట్టుకోవద్దని చేతులకు చెప్పేనా ఆ వేణువు నీ స్పర్శే చంద్రుని మచ్చలు మాపులే కనులలో జారెడు అందాల జలపాతమా నన్ను నువ్వు చేరగా ఎందుకాలోచన నీ తలపు తప్ప మరుధ్యాస లేదు నా రోజా రోజా రోజా రోజా రోజా... రోజా రోజా... రోజా రోజా... రోజా రోజా... నిన్ను చూసి నన్ను నేను మరిచిపోయి తిరిగి వచ్చా రోజా రోజా... రోజా రోజా... రోజా రోజా... రోజా రోజా...

Roja Roja (Sad Version) Song Lyrics in Telugu – Premikula Roju (1999)

'Roja Roja (Sad Version)' song from Premikula Roju (1999) movie is composed by A. R. Rahman and sung by Unnikrishnan.

SONG INFORMATION
Movie : Premikula Roju (1999)
Music : A. R. Rahman
Singers : Unnikrishnan
Song: 7 Roja Roja (Sad Version) Telugu Lyrics Paste Here

Palli Balakrishna Wednesday, August 16, 2017




చిత్రం: ప్రేమదేశం (1996)
సంగీతం: ఏ.ఆర్.రెహమాన్ 
నటీనటులు: వినీత్, అబ్బాస్, టబు 
దర్శకత్వం: కధీర్
నిర్మాత: జె. రామచంద్ర రావు
విడుదల తేది: 23.08.1996



Songs List:



ప్రేమా…. ప్రేమా…. పాట సాహిత్యం

 
చిత్రం: ప్రేమదేశం (1996)
సంగీతం: ఏ.ఆర్.రెహమాన్
సాహిత్యం: భువనచంద్ర
గానం: యస్.పి.బాలు

ప్రేమా…. ప్రేమా…. ప్రేమా ప్రేమా….. 
నను నేనే మరచిన నీతోడు విరహాన వేగుతు ఈనాడు 
వినిపించదా ప్రియా నా గోడు ప్రేమా… 
నా నీడ నన్ను విడిపొయిందే నీ శ్వాసలోన అది చేరిందే 
నేనున్న సంగతే మరిచిందే ప్రేమా ప్రేమా… 
చిరునవ్వుల చిరుగాలి చిరుగాలి 
రావా నా వాకిట్లో నీకై నే వేచానే 
నను నేనే మరచిన నీతోడు విరహాన వేగుతు ఈనాడు 
వినిపించదా ప్రియా నా గోడు ప్రేమా… 

ఆకాశదీపాన్నై నే వేచిఉన్నా నీ పిలుపుకోసం చిన్నారి 
నీ రూపే కళ్ళల్లో నే నిలుపుకున్నా కరుణించలేవా సుకుమారి 
నా గుండె లోతుల్లో దాగుంది నీవే 
నువు లేక లోకంలో జీవించలేనే 
నీ ఊహతోనే బ్రతికున్నా…. 
నను నేనే మరచిన నీతోడు విరహాన వేగుతు ఈనాడు 
వినిపించదా ప్రియా నా గోడు ప్రేమా… 
నా నీడ నన్ను విడిపొయిందే నీ శ్వాసలోన అది చేరిందే 
నేనున్న సంగతే మరిచిందే ప్రేమా ప్రేమా… 

నిముషాలు శూలాలై వెంటాడుతున్నా ఒడి చేర్చుకోవా వయ్యారి 
విరహాల ఉప్పెనలో నే చిక్కుకున్నా ఓదార్చిపోవా ఓసారి 
ప్రేమించలేకున్నా ప్రియమార ప్రేమా 
ప్రేమించినానంటూ బ్రతికించలేవా 
అది నాకు చాలే చెలీ….. 
నను నేనే మరచిన నీతోడు విరహాన వేగుతు ఈనాడు 
వినిపించదా ప్రియా నా గోడు ప్రేమా… 
నా నీడ నన్ను విడిపొయిందే నీ శ్వాసలోన అది చేరిందే 
నేనున్న సంగతే మరిచిందే ప్రేమా ప్రేమా… 
చిరునవ్వుల చిరుగాలి చిరుగాలి 
రావా నా వాకిట్లో నీకై నే వేచానే 
నను నేనే మరచిన నీతోడు విరహాన వేగుతు ఈనాడు 
వినిపించదా ప్రియా నా గోడు ప్రేమా… 



హెల్లో డాక్టర్ పాట సాహిత్యం

 
చిత్రం: ప్రేమదేశం (1996)
సంగీతం: ఏ.ఆర్.రెహమాన్ 
సాహిత్యం: భువనచంద్ర 
గానం: కె.కె., శ్రీనివాస్, అనుపమ, నోయెల్ జేమ్స్

హెల్లో డాక్టర్ హార్ట్ మిస్సాయే



కాలేజీ స్టైలే పాట సాహిత్యం

 
చిత్రం: ప్రేమదేశం (1996)
సంగీతం: ఏ.ఆర్.రెహమాన్ 
సాహిత్యం: భువనచంద్ర 
గానం: కె.కె., హరిహరన్

కాలేజీ స్టైలే



ముస్తఫ్ఫా ముస్తఫ్ఫా పాట సాహిత్యం

 
చిత్రం: ప్రేమదేశం (1996)
సంగీతం: ఏ.ఆర్.రెహమాన్
సాహిత్యం: భువనచంద్ర
గానం: ఏ.ఆర్.రెహమాన్

Ooh yeah friendship 
friendship is what we' re looking for 
ముస్తఫా ముస్తఫా don' t worry ముస్తఫా 
కాలం నీ నేస్తం ముస్తఫ్ఫా 
ముస్తఫ్ఫా ముస్తఫ్ఫా don' t worry mustaffa 
కాలం నీ నేస్తం ముస్తఫా 
day-by-day day-by-day 
కాలం ఒడిలో day-by-day 
పయనించే షిప్పే friendship రా 

జూన్ పోయి జూలై పుడితే seniorki juniorki 
college champus లోనే రాగింగ్ ఆరంభం 
student మనసో నందనవనం మల్లెలుంటాయ్ ముల్లులుంటాయ్ 
స్నేహానికి రాగింగ్ కూడా చేస్తుందోయ్ సాయం 
వాడిపోనిది స్నేహమొకటే వీడిపోనిది నీడ ఒక్కటే 
హద్దంటూ లేనే లేనిది friendship ఒక్కటే 
కష్టమొచ్చినా నష్టమొచ్చినా మారిపోనిది ఫ్రెండ్ ఒకడే 
కాలేజీ స్నేహం ఎపుడూ అంతం కానిదే 
ఓ....ఓ..ఓ... 

ఎక్కడెక్కడి చిట్టి గువ్వలు ఏడనుంచో గోరు వంకలు 
కాలేజీ champus లోనే నాట్యం చేసెనే 
కన్నెపిల్లల కొంటెనవ్వులు కుర్ర మనసుల కౌగిలింతలు 
కాలేజీ compound అంటే కోడైకనాలే 
కోర్సు ముగిసే రోజువరకు తుళ్ళిపడిన కుర్ర ఎదలో 
కన్నీరే ఉండదంట దేవుడే సాక్షి 
స్నేహితుల్ని వీడిపోయే రోజు మాత్రం కంటి నిండా 
కన్నీటి తోడేనంట farewell party 



వెన్నెలా వెన్నెలా పాట సాహిత్యం

 
చిత్రం: ప్రేమదేశం (1996)
సంగీతం: ఏ.ఆర్.రెహమాన్ 
సాహిత్యం: భువనచంద్ర 
గానం: మనో, ఉన్నికృష్ణన్, డామ్నిక్

వెన్నెలా వెన్నెలా మెల్లగా రావే..
పూవుల తేనెలే తేవే..
వెన్నెలా వెన్నెలా మెల్లగా రావే..
పూవుల తేనెలే తేవే..
కడలి ఒడిలో నదులు ఒదిగి.. నిదురపోయే వేళా..
కనుల పైన కలలే వాలి.. సోలిపోయే వేళా..
 
వెన్నెలా వెన్నెలా.. మెల్లగా రావే.. 
పూవుల తేనెలే తేవే..

ఆశ ఎన్నడు విడువదా..
అడగరాదని తెలియదా..
నా ప్రాణం..చెలియా నీవేలే..
విరగబూసిన వెన్నెలా..
వదిలి వేయకే నన్నిలా..
రారాదా..ఎద నీదే కాదా..
నిదురనిచ్చే జాబిలీ..
నిదురలేక.. నీవే వాడినావా..

వెన్నెలా వెన్నెలా.. మెల్లగా రావే.. 
పూవుల తేనెలే తేవే..

మంచు తెరలో అలిసిపోయి..
మధన సంధ్య తూగెనే..
పుడమి ఒడిలో కలలుకంటూ..
పాపా నీవూ నిదురపో..
మల్లె అందం మగువకెరుక..
మనసు బాధ తెలియదా..
గుండె నిండా ఊసులే..
నీ ఎదుటనుంటే మౌనమే..
జోలపాటా పాడినా..
నే నిదురలేక వాడినా..

వెన్నెలా వెన్నెలా.. మెల్లగా రావే.. 
పూవుల తేనెలే తేవే..
వెన్నెలా వెన్నెలా.. మెల్లగా రావే.. 
పూవుల తేనెలే తేవే..



ఓ వెన్నెలా పాట సాహిత్యం

 
చిత్రం: ప్రేమదేశం (1996)
సంగీతం: ఏ.ఆర్.రెహమాన్
సాహిత్యం: భువనచంద్ర
గానం: ఉన్ని కృష్ణన్

ఓ వెన్నెలా తెలిపేదెలా… ఓ నేస్తమా పిలిచేదెలా.. 
కళ్ళు కళ్ళు కలిసాయంట వలపే పువ్వే పూసిందంట 
నమ్మినవారే పువ్వుని కోస్తే నీ యదలో బాధ తీరేదెట్టా (2) 
ఓ వెన్నెలా తెలిపేదెలా… 

జడివాన నింగిని తడిచేయునా గంధాలు పువ్వుని విడిపోవునా 
నన్నడిగి ప్రేమ యద చేరెనా వలదన్న యదను విడిపోవునా 
మరిచాను అన్నా మరిచేదెలా మరిచాక నేను బ్రతికేదెలా 
ఓ వెన్నెలా తెలిపేదెలా… 

వలపించు హృదయం ఒకటే కదా ఎడం అయితే బ్రతుకు బరువే కదా 
నిలిపాను ప్రాణం నీకోసమే కలనైన కూడా నీ ధ్యానమే 
మదిలోని ప్రేమ చనిపోదులే ఏనాటికైనా నిను చేరులే 
ఓ వెన్నెలా తెలిపేదెలా… ఓ నేస్తమా పిలిచేదెలా.. 
కళ్ళు కళ్ళు కలిసాయంట వలపే పువ్వే పూసిందంట 
నమ్మినవారే పువ్వుని కోస్తే నీ యదలో బాధ తీరేదెట్టా 

Palli Balakrishna Saturday, July 22, 2017

Most Recent

Default