-->
Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Karthik Rathnam"



చిత్రం: చాంగురే బంగారు రాజ  (2023)
సంగీతం: SK.సౌరభ్ 
నటీనటులు: కార్తీక్ రత్నం, గోల్డీ నిస్సి 
దర్శకత్వం: సతీష్ వర్మ 
నిర్మాత: రవితేజా 
విడుదల తేది: 2023



Songs List:



ఛాంగురే బంగారు రాజా పాట సాహిత్యం

 
చిత్రం: చాంగురే బంగారు రాజ  (2023)
సంగీతం: SK.సౌరభ్ 
సాహిత్యం: M C చేతన్ 
గానం: మయాంక్ కప్రి

బంగారు రాజా
మూవింగ్ లైక్ ఎ సోల్జర్
స్టెప్పింగ్ అప్ ద గేమ్ లైక్
హి ఈజ్ ద బాప్ అండ్
యూ ఆర్ ద బేటా

ఛాంగు ఛాంగు
ఛాంగురే బంగారు రాజా
కోరస్: ఛాంగురే బంగారు రాజా
గీతకి ఈ పక్క ఆజా
చెంగు చెంగు చెంగుమంటు
పరుగు తియ్యరా

చూపులు బ్లెజింగ్ లైక్ ఫైయా
గుండెల్లో మండేటి బర్నింగ్ డిజైర్

ఛాంగు ఛాంగు
ఛాంగురే బంగారు రాజా
చెంగు చెంగు చెంగుమంటు
పరుగు తియ్యరా

ఛాంగురే బంగారు రాజా
గీతకి ఈ పక్క ఆజా
భయంతో కాలాన్ని గడిపింది చాలు
టు స్టార్ట్ యువర్ వేటా

చూపులు బ్లెజింగ్ లైక్ ఫైయా
గుండెల్లో మండేటి బర్నింగ్ డిజైర్
పుల్ అప్ యువర్ సాక్ అండ్
డోంట్ గివ్ అ డక్
కాస్ వీ గోయింగ్
హయ్యర్ హయ్యర్ హయ్యర్

ఛాంగురే బంగారు రాజా
ఛాంగురే బంగారు రాజా
యూ కెన్ చేంజ్ దిస్
లైక్ ఎ ఫైటర్
థిస్ కెన్ నెవర్ బి
యువర్ తలరాత

యు గాట్ ఆ మూవ్, గాట్ ఆ రిమూవ్
క్లియరింగ్ థింగ్స్ దట్ స్టేజ్డ్ ఆన్ యూ
యు గాట్ ఆ మూవ్, యు గాట్ ఆ గ్రూవ్
స్మాషింగ్ దెమ్ ఎనిమీస్ లైక్ కబూమ్

బంగారు రాజా
మూవింగ్ లైక్ ఎ సోల్జర్
స్టెప్పింగ్ అప్ ద గేమ్ లైక్
హి ఈజ్ ద బాప్ అండ్
యూ ఆర్ ద బేటా

ఛాంగు ఛాంగు
ఛాంగురే బంగారు రాజా
కోరస్:  ఛాంగురే బంగారు రాజా
గీతకి ఈ పక్క ఆజా
చెంగు చెంగు చెంగుమంటు
పరుగు తియ్యరా

చూపులు బ్లెజింగ్ లైక్ ఫైయా
గుండెల్లో మండేటి బర్నింగ్ డిజైర్

ఛాంగు ఛాంగు
ఛాంగురే బంగారు రాజా
చెంగు చెంగు చెంగుమంటు
పరుగు తియ్యరా




సామిరంగా పాట సాహిత్యం

 
చిత్రం: చాంగురే బంగారు రాజ  (2023)
సంగీతం: SK.సౌరభ్ 
సాహిత్యం: కృష్ణ చైతన్య 
గానం: అనురాగ్ కులకర్ణి, నిత్యశ్రీ వెంకటరమణన్ 

సామిరంగా ఎంత అందంగా
దోచెనే దొంగా
దాని పేరేమో మంగ
ఇంత కాలంగా కలిగెనే బెంగా
పోలీసుల్లో దొంగా
దాని పేరేమో మంగా

మాటలే మర ఫిరంగా
నడకలో ఇదేమో కొంగా
పిల్లుంది మహత్తరంగ
చూస్తెనే అంత కట్టింగా

మాటలే మర ఫిరంగా
నడకలో ఇదేమో కొంగా
పిల్లుంది మహత్తరంగ
చూస్తేనే అంత కట్టింగా

నమ్మనే వారాలు వర్జ్యాలనీ
నీ వెంటైతే పడతాననీ
దంచకే కారాల మిరియాలనీ
ఆ గారాల మారాలని

మాటేమో చేదుగుందే
చేతల్లో తీపి ఉందే
పిల్లేమో నచ్చుతుందే
నీతో ఇంకా చెప్పాలనుందే

బండేమో స్పీడుగుందే
బ్రేకేమో వెయ్యనందే
పిల్లేమో ముద్దుగుందే
వయసేమో నాటుగుందే

పడ్డాయే అందరి కళ్ళు
పిల్లే నవ్వితే ముత్యాలు
రాకాసి అందమంతా
రాసివ్వవే చాలు

సామిరంగా ఎంత అందంగా
దోచెనే దొంగా
దాని పేరేమో మంగా

ఊరిలో కొత్త వింత
వెలిగెనే చీకటంతా
నవ్వెనే రాతిరంతా
పగలుగా మారినంత

యెహే, తలుకేమో రంగు రాళ్లు
చెయ్యిస్తా ఉంగరాళ్ళు
పట్టాలే నీ వేలు
కట్టాలే మూడు ముల్లు

ఊరంతా డప్పే కొట్టి
వేస్తానే నే పందిళ్ళు
ఆపైనే ఉంటా నీతో
ఈ నిండు నూరేళ్ళు

సామిరంగా ఎంత అందంగా
దోచెనే దొంగా
దాని పేరేమో మంగా

మాటలే మర ఫిరంగా
నడకలో ఇదేమో కొంగా
పిల్లుంది మహత్తరంగ
చూస్తెనే అంత కట్టింగా

మాటలే మర ఫిరంగా
నడకలో ఇదేమో కొంగా
పిల్లుంది మహత్తరంగ
చూస్తేనే అంత కట్టింగా

నమ్మనే వారాలు వర్జ్యాలనీ
నీ వెంటైతే పడతాననీ
దంచకే కారాల మిరియాలనీ
ఆ గారాల మారాలని

సామిరంగా ఎంత అందంగా
దోచెనే దొంగా
దాని పేరేమో మంగా

Palli Balakrishna Friday, June 2, 2023




చిత్రం: అర్ధ శతాబ్దం (2021)
సంగీతం: నౌఫల్ రాజా A.I.S
నటీనటులు: కార్తిక్ రత్నం, నవీన్ చంద్ర, సూహాష్, సాయి కుమార్, కృష్ణ ప్రియ, ఆమని
దర్శకత్వం: రవీంద్ర పుల్లే
నిర్మాతలు: చిట్టి కిరణ్ రామోజు, తేలు రాధాకృష్ణ
విడుదల తేది: 11.06.2021 (AHA)



Songs List:



రాయే ఎన్నెలమ్మ పాట సాహిత్యం

 
చిత్రం: అర్ధ శతాబ్దం (2021)
సంగీతం: నౌఫల్ రాజా A.I.S
సాహిత్యం: రెహమాన్
గానం: శక్తి లోగనాధం

రాయే ఎన్నెలమ్మ 



ఏ కన్నులు చూడనీ చిత్రమే పాట సాహిత్యం

 
చిత్రం: అర్ధ శతాబ్దం (2021)
సంగీతం: నౌఫల్ రాజా A.I.S
సాహిత్యం: రెహమాన్
గానం: సిద్ శ్రీరామ్

పల్లవి:
ఏ కన్నులు చూడనీ చిత్రమే
చూస్తున్నది నేడు నా ప్రాణమే
ఏ కన్నులు చూడనీ చిత్రమే
చూస్తున్నది నేడు నా ప్రాణమే

ఒకటే క్షణమే చిగురించే ప్రేమనే స్వరం
ఎదలో వనమై ఎదిగేటి నువ్వనే వరం
అందుకే ఈ నేల నవ్వి పూలు పూసెలే
గాలులన్ని నిన్ను తాకి గంధమాయెలే
అందమైన ఊహలెన్నొ ఊసులాడెలే
అంతులేని సంబరాన ఊయలూపెలే

ఏ కన్నులు చూడనీ చిత్రమే
చూస్తున్నది నేడు నా ప్రాణమే

చరణం: 1
ఎంత దాచుకున్నా పొంగిపోతువున్నా
కొత్త ఆశలెన్నో చిన్ని గుండెలోనా
దారికాస్తువున్నా నిన్ను చూస్తువున్నా
నువ్వు చూడగానే దాగిపోతువున్నా
నినుతలచి ప్రతినిమిషం
పరవశమై పరుగులనే
తీసే నా మనసు ఓ వెల్లువలా
తన లోలోనా...

అందుకే ఈ నేల నవ్వి పూలు పూసెలే
గాలులన్ని నిన్ను తాకి గంధమాయెలే
అందమైన ఊహలెన్నొ ఊసులాడెలే
అంతులేని సంబరాన ఊయలూపెలే

ఏ కన్నులు చూడనీ చిత్రమే
చూస్తున్నది నేడు నా ప్రాణమే

చరణం: 2
రంగులద్దుకున్న సందెపొద్దులాగా
నువ్వునవ్వుతుంటే దివ్వెలెందుకంటా
రెప్పలేయకుండా రెండుకళ్ల నిండా
నిండుపున్నమల్లే నిన్ను నింపుకుంటా
ఎవరికిదీ తెలియదులే
మనసుకిదీ మధురములే
నాలో నే మురిసి ఓవేకువలా
వెలుగైవున్నా..!

అందుకే ఈ నేల నవ్వి పూలు పూసెలే
గాలులన్ని నిన్ను తాకి గంధమాయెలే
అందమైన ఊహలెన్నొ ఊసులాడెలే
అంతులేని సంబరాన ఊయలూపెలే

ఏ కన్నులు చూడనీ చిత్రమే
చూస్తున్నది నేడు నా ప్రాణమే



ఎర్రని సూరీడే పాట సాహిత్యం

 
చిత్రం: అర్ధ శతాబ్దం (2021)
సంగీతం: నౌఫల్ రాజా A.I.S
సాహిత్యం: లక్ష్మీ ప్రియాంక
గానం: మోహన భోగరాజు

అరె..! ఎర్రని సూరీడే
పొద్దంతా సిందేసి నిదరోయాడే
హే..! మా సక్కాని చంద్రుడే
రేయంతా ఆడంగా లేస్తున్నాడే

ఒంటి మీద జారుతున్న సెమట సుక్కలే
సుతారంగా మెరిసిపోయే నింగి సుక్కలై
డొక్కా లోకి జారుకుంటే గంజి మెతుకులే
రెక్కలొచ్చినట్టు పొంగిపోవా బతుకులే

ఎర్రని సూరీడే
పొద్దంతా సిందేసి నిదరోయాడే
మా సక్కాని చంద్రుడే
రేయంతా ఆడంగా లేస్తున్నాడే

ఒంటి మీద జారుతున్న సెమట సుక్కలే
సుతారంగా మెరిసిపోయే నింగి సుక్కలై
డొక్కా లోకి జారుకుంటే గంజి మెతుకులే
రెక్కలొచ్చినట్టు పొంగిపోవా బతుకులే



కాలం అడిగే పాట సాహిత్యం

 
చిత్రం: అర్ధ శతాబ్దం (2021)
సంగీతం: నౌఫల్ రాజా A.I.S
సాహిత్యం: రెహమాన్
గానం: అనురాగ్ కులకర్ణి 

కాలం అడిగే మనిషంటే ఎవరు




నీ ప్రేమనే పాట సాహిత్యం

 
చిత్రం: అర్ధ శతాబ్దం (2021)
సంగీతం: నౌఫల్ రాజా A.I.S
సాహిత్యం: రెహమాన్
గానం: ఆంటోని దాసన్

రప్పప్పప్పా రప్పప్ప రప్పప్పా రప్పప్పప్పా
రప్పప్పా రప్పప్ప రప్పప్పప్పా (2)

నీ ప్రేమనే తేలిపే ఆ పువ్వు ఎపుడు పూసెనో
ఈ లోకమే మరిచి కనులు ఎదురు చూసెనో
నిదుర రాదులే కుదురు లేదులే
వేరేది ఏదీ గురుతు రాదులే
పగలు రేయిలా సతమతమై ఇలా
ఎన్ని పడిగాపులు కాస్తున్నావో

రప్పప్పప్పా రప్పప్ప రప్పప్పా రప్పప్పప్పా
రప్పప్పా రప్పప్ప రప్పప్పప్పా (2)

ఈ మాయలో మునిగి మనసు ఎపుడు తేలెనో
ఈ దారిలో కదిలే అడుగు ఏ ధరి చేరేనో
ఈ పువ్వు ఎప్పుడొ పూచేది




మెరిసెలే మెరిసెలే పాట సాహిత్యం

 
చిత్రం: అర్ధ శతాబ్దం (2021)
సంగీతం: నవ్ ఫాల్ రాజా AIS
సాహిత్యం: రెహమాన్
గానం:  శంకర్ మహదేవన్

పల్లవి:
మాంగళ్యం తంతునానే
మవజీవన హేతునా
అరె మెరిసెలే మెరిసెలే
మిలమిలమిల మెరిసెలే
కనులలో వెలుగులే కలల సిరులుగా
జత కలిసెలే కలిసెలే
ఇరుమనసులు కలిసెలే
అడుగులే ఒకటిగా కలిసి నడవగా
ఆనింగి మెరిసింది పందిరిగా
ఈ నేల వెలసింది పీటలుగా
తొలి వలపే వధువై నిలిచే...
వరుడే వరమై రాగ

ఈ జగమే అతిథై మురిసే...
మనసే మనువై పోగా
ఇక శ్వాసలో శ్వాసగా
కలగలిసిన ఆశగా
ఉండిపోవాలిలా ఒకరికొకరుగా

ఒక కల లాగ కరిగెను దూరం
ఇక జత చేరి మురిసెను ప్రాణం
ఒక శిలలాగా నిలిచెను కాలం
ఒడిగుడిలోనే తరిగేను బాణం

ఇది కదా ఈ హృదయములో ఒదిగిన ప్రేమ బంధం
ఒక స్వరమై తడిమినది తనువును రాగ బంధం
గుండె నిండా సందడేమి తెచ్చి
ఉండిపోయినవే పండగల్లె వచ్చి
పున్నమల్లే వెండి వెన్నెలల్లే
నన్ను అల్లుకోవే రెండు కళ్ళతోటి
జరిగి జరిగి కరిగే తొలకరి పరువపు జడిగా
ఎదపై పలికే తడి తకతకతక తక తకధిమిత

ఇక శ్వాసలో శ్వాసగా
కలగలిసిన ఆశగా
ఉండిపోవాలిలా ఒకరికొకరుగా

గెలిచినవే నిను నా ప్రేమ
నిలిపినదెలోలోనా
విడువనులే ఇక ఏ జన్మ
జతపడుతూ రానా
ఒక నీడనై నడిపించనా
ఒక ప్రాణమై బ్రతికేయనా
ప్రణయములే ఎదురైనా
చెదరని దీపయణం
సరిగమలు చదవనివో కథ మాన ప్రేమ కావ్యం
నువ్వు నేను పాడుకున్న పాట
రంగురంగులున్న జ్ఞాపకాల తోట
నువ్వు నేను ఏకమైనా చోట
మబ్బులంటూ లేని చందమామ కోట
నువ్వు నా సగమై జగమై ఉదయపు తోలి కిరణముగా
వెలుగై తగిలే తోలి చిలిపిలి తళుకులు తరగలురా

ఇక శ్వాసలో శ్వాసగా
కలగలిసిన ఆశగా
ఉండిపోవాలిలా ఒకరికొకరుగా
ఆనింగి మెరిసింది పందిరిగా
ఈ నేల వెలసింది పీటలుగా
తొలి వలపే వధువై నిలిచే...
వరుడే వరమై రాగ
ఈ జగమే అతిథైమురిసే...
మనుసే మనువై పోగా

ఇక శ్వాసలో శ్వాసగా
కలగలిసిన ఆశగా
ఉండిపోవాలిలా ఒకరికొకరుగా

Palli Balakrishna Thursday, June 17, 2021

Most Recent

Default